
సాక్షి, విజయవాడ: టీడీపీనేత పత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మాచవరం పోలీసుస్టేషన్‌లో శరత్‌పై కేసు నమోదు అయింది. ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారుల ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. నిధులు మళ్లించి పన్ను ఎగవేసారనే ఆరోపణలపై శరత్‌తో సహా మొత్తం ఏడుగురుపై పోలీలు కేసు నమోదుచేశారు. ఐపీసీ 420, 409, 467,471, 477(A),120 B రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్ల కింద శరత్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పుల్లారావు భార్య, బావమరిదితో పాటు మరో ఐదుగురుపై కేసు చేశారు.
అవెక్స్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్‌లో పన్ను ఎగవేసారని పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. శరత్ స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డ్ చేశారు. ఈనెల 26న ఏపీ ఎస్‌డీఆర్‌ఐ డిప్యూటీ డైరెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు చేయటంతో పోలీసులు ఈరోజు అదుపులోకి తీసుకున్నారు. అవెక్స్ కంపెనీలో 2019 డిసెంబరు నుంచి 2020 ఫిబ్రవరి వరకు అడిషనల్ డైరక్టరు హోదాలో శరత్ ఉన్నారు. సుమారు రూ. 16కోట్లు మేర పన్ను ఎగవేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
కాసేపట్లో న్యాయమూర్తి ఎదుట శరత్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయం వద్దకు పత్తిపాటి పుల్లారావు, టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఇతర నాయకులు చేరుకున్నారు. సీపీ కార్యాలయం ఎదుట టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు.