
సాక్షి, అమరావతి: మహిళా గ్రాండ్ మాస్టర్ నూతక్కి ప్రియాంక విజయం రాష్ట్రానికి గర్వకారణమని శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, ఎండీ ప్రభాకరరెడ్డి కొనియాడారు. ఇటీవల ప్రతిష్టాత్మక ఆసియా కాంటినెంటల్ చెస్ చాంపియన్ షిప్‌లో 6.5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని సాధించడంపై అభినందించారు.
గురువారం విజయవాడలోని శాప్ కార్యాలయంలో ప్రియాంకను ఘనంగా సత్కరించారు. ప్రియాంక మాట్లాడుతూ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు, విదేశీ కోచ్‌ల ద్వారా శిక్షణ తీసుకునేందుకు ఆర్థిక సహాయం అందించాలని కోరగా శాప్ చైర్మన్, ఎండీలు సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు.