హత్య కేసులో బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి క్లీన్‌చిట్‌ | Clean Chit Given To Byreddy Siddhartha Reddy In Assassination Case | Sakshi
Sakshi News home page

హత్య కేసులో బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి క్లీన్‌చిట్‌

Published Wed, Nov 13 2024 2:39 PM | Last Updated on Wed, Nov 13 2024 4:27 PM

Clean Chit Given To Byreddy Siddhartha Reddy In Assassination Case

సాయి ఈశ్వర్‌ హత్య కేసులో బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి ఊరట లభించింది. ఆయనకు ప్రజా ప్రతినిధుల కోర్టు క్లీన్‌చిట్‌ ఇచ్చింది.

సాక్షి, విజయవాడ: సాయి ఈశ్వర్‌ హత్య కేసులో బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి ఊరట లభించింది. ఆయనకు ప్రజా ప్రతినిధుల కోర్టు క్లీన్‌చిట్‌ ఇచ్చింది. కర్నూలు త్రిటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన హత్య కేసులో బైరెడ్డి సిద్ధార్థరెడ్డితో పాటు 9 మందిని ప్రజాప్రతినిధుల కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.

నందికొట్కూరు మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ తెలుగు సాయి ఈశ్వర్ 2014లో దారుణ హత్యకు గురికావడంతో కర్నూలు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో మొదటి నిందితుడు బాషా కాగా ఐదో నిందితుడిగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పేరును పోలీసులు చేర్చారు. బైరెడ్డి సిద్ధార్థతో పాటు ఆయన అనుచరులపైనా కేసులు నమోదు చేశారు. అయితే ఈ కేసులో వాదనలు విన్న విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టు తాజాగా తీర్పునిచ్చింది.

YSRCP నేత భైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి ఊరట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement