
ఘటనలో 20 మందికి పైగా పాల్గొన్నారంటున్న ప్రత్యక్ష సాక్షులు
కేవలం ఇద్దరిపైనే ఎఫ్‌ఐఆర్ నమోదు
మిగిలిన నిందితులను తప్పించే యత్నం
టీడీపీ కార్యకర్తలా పని చేస్తున్న ఎస్‌ఐ సుధాకర్
నిందితులిద్దరికీ పోలీస్ స్టేషన్‌లో రాజబోగాలు
పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు
సాక్షి టాస్క్ ఫోర్స్: శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య దారుణ హత్య కేసులో పోలీసులు టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత కుటుంబం ఒత్తిళ్ల మేరకే వ్యవహరిస్తున్నారని జిల్లాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ ఘటనలో 20 మందికి పైగా పాల్గొన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతుండగా, కేవలం ఇద్దరిపైనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడమే ఇందుకు నిదర్శనం. హత్య ఘటనకు సంబంధించి రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత దగ్గరి బంధువులు ధర్మవరపు ఆదర్శ్ నాయుడు, మనోజ్ నాయుడుపై మాత్రమే పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
రామగిరి ఎస్‌ఐ సుధాకర్ యాదవ్ పూర్తిగా ఎమ్మెల్యే పరిటాల సునీత, ఆమె కుమారుడు పరిటాల శ్రీరామ్ కనుసన్నల్లో నడుస్తూ.. టీడీపీ కార్యకర్తలా వ్యవహరిస్తూ.. వైఎస్సార్‌సీపీ నేతలే టార్గెట్‌గా పని చేస్తున్నారనేందుకు ఈ సంఘటన తాజా ఉదాహరణ అని స్థానికంగా చర్చ జరుగుతోంది. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ఎస్‌ఐ.. ఏకపక్షంగా వ్యవహరిస్తూ రామగిరి మండలంలో భయాందోళనలు సృష్టిస్తున్నట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. గత వారం జరిగిన రామగిరి ఎంపీపీ ఎన్నిక సందర్భంగా ఎస్‌ఐ సుధాకర్ యాదవ్ తీరు తీవ్ర వివాదాస్పదమైంది.
అదే సమయంలో పాపిరెడ్డిపల్లికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు జయచంద్రారెడ్డి ఇంటిపై పరిటాల సునీత సమీప బంధువులు ఆదర్శనాయుడు, మనోజ్ నాయుడు తదితరులు వరుసగా రెండు రోజుల పాటు రాళ్ల దాడికి పాల్పడినా ఎస్‌ఐ ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. దీనికితోడు కురుబ లింగమయ్య హత్య కేసులో నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. 20 మంది ఆ ఘటనలో పాల్గొంటే కేవలం ఇద్దరిపై మాత్రమే కేసు పెట్టి.. రెండు రోజులుగా వారికి రాజ¿ోగాలు కల్పించి, మంగళవారం అరెస్ట్ చూపించారు.
ఇద్దరు నిందితుల అరెస్టు
కురుబ మజ్జిగ లింగమయ్య (లింగన్న) హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని ధర్మవరం డీఎస్పీ హేమంత్‌కుమార్, రామగిరి సీఐ శ్రీధర్ తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో మంగళవారం వారు మీడియాతో మాట్లాడారు. లింగమయ్య కుమారుడు మనోహర్ మార్చి 30న అత్తగారింటికి వెళుతుండగా.. గ్రామానికి చెందిన ఆదర్శ్, అతని అనుచరులు అభ్యంతరకరంగా హేళన చేయగా, తండ్రి లింగమయ్యకు ఫోన్ చేసి తెలిపాడన్నారు.
ఈ విషయంపై లింగమయ్య తన ఇంటి ముందు కూర్చుని.. అదే గ్రామానికి చెందిన ధర్మవరపు రమేష్ కుమారుడు ధర్మవరపు ఆదర్శ్, ధర్మవరపు మహేష్ కుమారుడు ధర్మవరపు మనోజ్ నాయుడులను ప్రశి్నంచారని చెప్పారు. ఇది జీర్ణించుకోలేని ఆదర్శ్ నాయుడు, మనోజ్‌నాయుడులు లింగమయ్యపై కట్టెలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారన్నారు.
అనంతరం లింగమయ్యను అనంతపురంలోని కిమ్స్ సవేరా ఆసుపత్రిలో చేరి్పంచగా, చికిత్స పొందుతూ మృతి చెందాడని తెలిపారు. ఈ ఘటనపై హతుడి భార్య ఫిర్యాదు చేసిందని చెప్పారు. దీంతో ఆదర్శ్ నాయుడు, మనోజ్‌నాయుడులను మంగళవారం రామగిరి శివారులోని 11కేవీ సబ్‌స్టేషన్ వద్ద అరెస్టు చేశామని తెలిపారు.