
విజయవాడ : సీఎం వైఎస్ జగన్ అభివృద్ధి, సంక్షేమానికి బాటలు వేస్తున్నారని, చంద్రబాబు నీతిమాలిన రాజకీయాలు మానుకోవాలని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. గుణదల ఒకటో డివిజన్‌లో ప్రజలలో నాడు.. ప్రజల కోసం నేడు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రజలు తిరస్కరించినా చంద్రబాబుకి బుద్ధి రాలేదని, పేద ప్రజలకు ఉచిత ఇల్లు ఇచ్చే విషయంలో చంద్రబాబు అడ్డుకున్నాడని మండిపడ్డారు. (విశ్వాసం ఉంది.. వేరే ఆలోచన లేదు)
విజయవాడలోని పేద ప్రజలకు 12,500 మందికి ఇల్లు ఇస్తామని లక్షల రూపాయలు వసూలు చేసిన చరిత్ర టిడిపిదని గుర్తుచేశారు. అచ్చం నాయుడు, బోండా ఉమ, గద్దె రామ్మోహన్ మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏం చేశారంటూ ప్రశ్నించారు. టిడ్కో ఇళ్ల కేటాయింపు విషయంలో టీడీపీ నేతలు కొత్త నాటకాలకు తెరలేపారని, టిడిపి నేతలు చేస్తున్న అరాచకాలు ప్రజలు గమనిస్తున్నారని, అసత్య ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు.
చెరుకుపల్లి మండలం రాజోలు, తూర్పు పాలెంలో ప్రజలలో నాడు.. ప్రజల కోసం నేడు కార్యక్రమంలో భాగంగా సంక్షేమ పథకాల అమలు, వివిధ సమస్యలపై ఎంపీ మోపిదేవి వెంకట రమణారావు ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. ప్రజలలో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమంలో భాగంగా పాదయాత్ర నిర్వహించిన ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, విడదల రజిని, మెరుగు నాగార్జున,ఆళ్ల రామకృష్ణా రెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, ఉండవల్లి శ్రీదేవి, ముస్తఫా, కిలారి వెంకట రోశయ్యలు వారివారి నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహించారు. ఆచార్య ఎన్జీరంగా 125వ జయంతి సందర్భంగా పొన్నూరులో ఎన్.జి.రంగా విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం పెద్ద పాలెం, కొండముదిల్లో గ్రామ సచివాలయలకు ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య శంకుస్థాపన చేశారు.