
సాక్షి, విజయవాడ: విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఆయన కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. ఆయన తల్లి బాలాత్రిపుర సుందరమ్మ కన్నుమూసిన సంగతి తెలిసిందే. అనారోగ్యంతో బాధపడుతూ ఆమె మృతి చెందారు.
విజయవాడ ఎంజీ రోడ్‌లోని మల్లాది విష్ణు నివాసానికి చేరుకున్న సీఎం.. బాలా త్రిపుర సుందరమ్మ భౌతిక కాయానికి నివాళులర్పించారు. పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు సంఘీభావం తెలిపారు.
(చదవండి: తుని రైలు దగ్ధం కేసును కొట్టివేసిన విజయవాడ రైల్వే కోర్టు)