
రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలిపారు.
సాక్షి, తాడేపల్లి: రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలిపారు. ‘‘లోక కంఠకుడైన మహిషాసురుడిని జగన్మాత సంహరించినందుకు చెడుపై మంచి, దుష్ట శక్తులపై దైవ శక్తుల విజయానికి ప్రతీకగా జరుపుకునే పండగే విజయదశమి. చెడు ఎంత దుర్మార్గమైనదైనా, ఎంత శక్తిమంతమైనదైనా అంతిమ విజయం మంచినే వరిస్తుంది’’ అని వైఎస్ జగన్ అన్నారు.
ఆ జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖ శాంతులతో, సిరి సంపదలతో తులతూగాలి. రాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటుంబానికి విజయాలు సిద్ధించాలి. ఆ కనకదుర్గమ్మవారి దీవెనలు, ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలి’’ అని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.
ఇదీ చదవండి: పగ ప్రతీకారాల ‘రెడ్ బుక్’ బదులుగా ప్రేమ, ఆప్యాయతల ‘గుడ్ బుక్’