కొత్త మెడికల్‌ కాలేజీల్లో సగం సీట్లు మెరిట్‌కే మంత్రి విడదల రజిని | Half seats in new medical colleges are allotted by Minister Vidada Rajini on merit | Sakshi
Sakshi News home page

కొత్త మెడికల్‌ కాలేజీల్లో సగం సీట్లు మెరిట్‌కే మంత్రి విడదల రజిని

Published Fri, Jul 21 2023 5:29 AM | Last Updated on Fri, Jul 21 2023 5:29 AM

Half seats in  new medical colleges are allotted by  Minister Vidada Rajini on merit - Sakshi

సాక్షి, విశాఖపట్నం: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం వైద్య విద్యపై ఈనాడు ద్వారా  దుష్ప్రచారం చేస్తున్నారని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని విమర్శించారు. ఆమె గురువారం మీడియాతో మాట్లాడుతూ గతంలో ఏ నాయకుడు కనీసం ఆలోచించని విధంగా సీఎం వైఎస్‌ జగన్‌ ఒకేసారి 17 మెడికల్‌ కళాశాలల ఏర్పాటుకు నడుం బిగించారని గుర్తు చేశారు.

ఐదు మెడికల్‌ కళాశాలల్లో ఈ ఏడాది అడ్మిషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం కానుందన్నారు. కొత్త ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల్లో 50 శాతం సీట్లు కన్వీనర్‌ కోటా కిందే ఉంటాయని, ఈ సీట్లు మెరిట్‌ విద్యార్థులకు ఉచితంగానే లభిస్తా­యన్నారు. అయినా ఈనాడు దుష్ప్రచారానికి ఒడిగట్టిందని దు­­య్య­­­­­బ­ట్టారు. నూతన వైద్య కళాశాలల్లో అంత­ర్జాతీయ స్థాయి ప్రమాణాలతో  విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభు­త్వం ఒక విధానాన్ని నిర్దేశించుకుందని, ఆ ప్రకా­రమే ఆయా కాలేజీలు పనిచేస్తాయన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement