సొంతింటికే 25 శాతం సంపాదన: లేటెస్ట్ సర్వే | 25 Percent of Income From Own House Knight Frank Survey | Sakshi
Sakshi News home page

సొంతింటికే 25 శాతం సంపాదన: లేటెస్ట్ సర్వే

Published Sat, Apr 12 2025 4:49 PM | Last Updated on Sat, Apr 12 2025 4:51 PM

25 Percent of Income From Own House Knight Frank Survey

సాక్షి, సిటీబ్యూరో: మన దేశంలో అత్యంత ధనవంతులు తమ సంపదలో 22–25 శాతం మొత్తాన్ని తాము ఉండాలనుకుంటున్న ఇంటి కొనుగోలుకే వెచ్చిస్తున్నట్లు నైట్‌ఫ్రాంక్‌ ఇండియా తాజా సర్వే వెల్లడించింది. రూ.కోటి కంటే ఎక్కువ ఆదాయం కలిగిన 18–35 ఏళ్ల వయస్సు గల వారిలో 89 శాతం మంది సంపన్న భారతీయులు తమ ప్రాపర్టీని అద్దెకు ఇవ్వడంకంటే అందులో తాము ఉండటానికే మొగ్గు చూపిస్తున్నారు.

కోటి డాలర్ల కంటే ఎక్కువ విలువైన ఆస్తులు కలిగిన భారతీయ అధిక నికర విలువ కలిగిన వ్యక్తులు తమ సంపదలో 22–25 శాతాన్ని తాము నివసించాలనుకునే ప్రధాన ఇంటికి కేటాయిస్తున్నారని, వారి హోల్డింగ్స్‌లో 80–90 శాతం దేశంలోనేకేంద్రీకృతమై ఉన్నాయని నివేదిక వెల్లడించింది.

దేశంలో అధిక నికర విలువ కలిగిన వ్యక్తుల సంఖ్య 2024లో 6 శాతం మేర పెరిగి 80,686 నుంచి 85,698కు చేరుకుందని, బిలియనీర్ల సంఖ్య 191కు పెరిగిందని వెల్త్‌ రిపోర్ట్‌ వెల్లడించింది. 2028 నాటికి వారి సంఖ్య 93,753కు పెరుగుతుందని అంచనా. హై నెట్‌వర్త్‌ ఇండివిడ్యువల్స్‌ (హెచ్‌ఎన్‌ఐ) పెట్టుబడుల్లో ఎక్కువ భాగం ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నైలకే వస్తున్నాయి.

విదేశీ పెట్టుబడుల విషయానికొస్తే.. ఎక్కువ మంది హెచ్‌ఎన్‌ఐలు యూఏఈ, యూకే వంటి దేశాల్లో పెట్టుబడులు పెడుతున్నారని నైట్‌ఫ్రాంక్‌ ఇండియా సీఎండీ శిశిర్‌ బైజల్‌ తెలిపారు. సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు 47 శాతం మంది లగ్జరీ కార్లలో పెట్టుబడులకు, 28 శాతం మంది హైఎండ్‌ రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్ట్‌లలో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారని పేర్కొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement