
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO).. ఆటో సెటిల్మెంట్ పరిమితిని రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచాలని యోచిస్తోంది. ఇదే జరిగితే.. 7.5 కోట్ల కంటే ఎక్కువ ఈపీఎఫ్ఓ సభ్యులకు లబ్ది చేకూరుస్తుంది.
గత వారం జరిగిన సమావేశంలో కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి 'సుమితా దావ్రా' ఈ పరిమితిని పెంచే ప్రతిపాదనను ఆమోదించారు. అయితే ఈ సిఫార్సును ఇప్పుడు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) ఆమోదం కోసం సమర్పించనున్నారు. ఇవన్నీ పూర్తయిన తరువాత ఈపీఎఫ్ఓ సభ్యులు ఆటో సెటిల్మెంట్ ద్వారా రూ. 5 లక్షల వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు.
ఈపీఎఫ్ఓ ఆటో సెటిల్మెంట్ మోడ్‌ను ఏప్రిల్ 2020లో అందుబాటులోకి తీసుకొచ్చింది. అప్పటి నుంచి వైద్య ఖర్చుల కోసం, విద్య, వివాహం, గృహనిర్మాణం వంటి వాటి కోసం అడ్వాన్స్‌గా నగదు తీసుకునేందుకు అవకాశం లభించింది. అయితే మే 2024లో ఆటో అప్రూవ్డ్ క్లెయిమ్‌ల పరిమితిని రూ.50,000 నుంచి రూ.1 లక్షకు పెంచారు. ఆ తరువాత చాలామంది దీనిని ఉపయోగించుకున్నారు.
ఇదీ చదవండి: ఈ రూల్ అతిక్రమిస్తే.. డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్!: నితిన్ గడ్కరీ
మార్చి 6, 2025 నాటికి 2.16 కోట్ల ఆటో క్లెయిమ్‌లు ప్రాసెస్ చేయబడ్డాయి. గతంలో కంటే కూడా ఇప్పుడు కేవలం మూడు రోజుల్లోనే 95 శాతం ఆటో మోడ్ క్లెయిమ్‌లు పరిష్కారమయ్యాయి. తిరస్కరణ రేటు 50 శాతం నుంచి 30 శాతానికి తగ్గింది.