
భారతదేశంలో సుదూర ప్రాంతాలకు వెళ్లాలనుకునే వారిలో చాలామంది రైలు ప్రయాణాన్నే ఎంచుకుంటారు. తమ ప్రయాణాలకు అనుగుణంగా దాదాపు అందరూ ముందుగానే టికెట్స్ రిజర్వేషన్ చేసుకుంటారు. కొన్నిసార్లు అవి కన్ఫర్మ్ అవ్వొచ్చు, కొన్ని సార్లు వెయిటింగ్ లిస్టులో ఉండొచ్చు. ప్రయాణికుల సౌకర్యార్థం.. ఇండియన్ రైల్వే వెయిటింగ్ లిస్ట్ టికెట్‌ల విషయంలో కొన్ని నియమాలను ప్రవేశపెట్టింది. వీటిని అతిక్రమిస్తే.. జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది.
ఇండియన్ రైల్వే కొత్త నియమాల ప్రకారం.. రిజర్వేషన్ చేసుకుని టికెట్ కన్ఫర్మ్ కానీ ప్రయాణికులు, రిజర్వ్డ్ కంపార్ట్‌మెంట్లలో ఎక్కకూడదు. ఈ రూల్ ఆన్‌లైన్లో బుక్ చేసుకున్న టికెట్లకు మాత్రమే కాకుండా.. కౌంటర్లో కొనుగోలు చేసిన టికెట్‌లకు వర్తిస్తుంది. ఈ నియమం మార్చి 1 నుంచి అమలులోకి వచ్చింది.
ఇదీ చదవండి: రూ.1740 తగ్గిన బంగారం ధర: నేటి ధరలు చూశారా?
వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్స్ లేదా కన్ఫర్మ్ కానీ టికెట్ కలిగిన ప్రయాణికుడు స్లీపర్ కోచ్ ఎక్కితే రూ. 250 జరిమానా, ఏసీ కోచ్ ఎక్కితే రూ. 400 జరిమానా (బోర్డింగ్ స్టేషన్ నుంచి తరువాత స్టేషన్‌కు) చెల్లించాల్సి ఉంటుంది. రిజర్వ్డ్ కంపార్ట్‌మెంట్లలో రద్దీని తగ్గించడానికి ఇండియన్ రైల్వే కొత్త నిబంధనలను తీసుకొచ్చింది.
రైల్వే స్టేషన్ కౌంటర్ నుంచి కొనుగోలు చేసిన వెయిటింగ్ లిస్ట్ టికెట్‌తో జనరల్ కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణించవచ్చు. ఇండియన్ రైల్వే ఇప్పుడు టికెట్ బుకింగ్స్ కోసం 'ఏఐ'ను ఉపయోగిస్తోంది. దీని సాయంతోనే ప్రయాణికులకు టికెట్స్ కూడా కేటాయిస్తోంది.