పీఎం సోలార్ రూఫ్‌టాప్ స్కీమ్: 20 లక్షల ఉద్యోగాలు! | Over 1 3 Crore Families Applied For PM Surya Ghar Yojana Says Narendra Modi | Sakshi
Sakshi News home page

పీఎం సోలార్ రూఫ్‌టాప్ స్కీమ్: 20 లక్షల ఉద్యోగాలు!

Published Mon, Sep 16 2024 1:31 PM | Last Updated on Mon, Sep 16 2024 1:32 PM

Over 1 3 Crore Families Applied For PM Surya Ghar Yojana Says Narendra Modi

పీఎం సోలార్ రూఫ్‌టాప్ స్కీమ్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 1.3 కోట్లకు పైగా కుటుంబాలు ఈ పథకం కోసం నమోదు చేసుకున్నాయని ప్రధాన మంత్రి 'నరేంద్ర మోదీ' సోమవారం తెలిపారు. గుజరాత్‌లోని గాంధీనగర్ జిల్లాలో జరిగిన 4వ గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ (రీ-ఇన్వెస్ట్) 2024 ప్రారంభోత్సవ కార్యక్రమంలో మోదీ ఈ ప్రకటన చేశారు.

సోలార్ రూఫ్‌టాప్ పథకం ప్రారంభించినప్పటి నుంచి.. సుమారు 3.75 లక్షల ఇళ్లలో ఇన్‌స్టాలేషన్ పనులు పూర్తయ్యాయని మోదీ వెల్లడించారు. ఈ స్కీమ్ ద్వారా వినియోగదారులు తమ వినియోగానికి కావలసిన విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోవడమే కాకుండా.. అదనపు విద్యుత్‌ను గ్రిడ్‌కు విక్రయించడం ద్వారా ఏడాదికి రూ. 25000 ఆదాయం పొందుతున్నారు.

ఇదీ చదవండి: రూ. 75వేలు దాటేసిన బంగారం.. రూ. లక్షకు చేరువలో వెండి

ఒక చిన్న కుటుంబం నెలకు 250 యూనిట్ల విద్యుత్ ఉపయోగించుకున్న తరువాత.. కూడా కొంత ఆదాయాన్ని పొందటం అనేది చాలా గొప్ప విషయం. ఈ పథకం ద్వారా ఉపాధి కల్పన కూడా ఏర్పడుతుందని పేర్కొంటూ.. గ్రీన్ ఉద్యోగాలు వేగంగా పెరుగుతాయని అన్నారు. ఈ పథకం ద్వారా దాదాపు 20 లక్షల ఉద్యోగావకాశాలు లభిస్తాయని మోదీ వెల్లడించారు. పీఎం సోలార్ రూఫ్‌టాప్ పథకం ద్వారా భారతదేశంలోని పొరతి ఇల్లు విద్యుత్ ఉత్పత్తిదారుగా మారుతుందని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement