Top Stories
ప్రధాన వార్తలు

తమిళనాడు రాజకీయాల్లో కీలక మలుపు
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో కీలక మలుపు చోటు చేసుకుంది. బీజేపీతో అన్నాడీఎంకే పొత్తు ఖరారైంది. డీఎంకే-కాంగ్రెస్ కూటమికి వ్యతిరేకంగా బీజేపీ-అన్నాడీఎంకేలు కూటమిగా కలిసి పోటీచేయడానికి నిర్ణయించాయి. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా స్పష్టం చేశారు. ‘ఏడీఎంకే అంతర్గత వ్యవహారంలో మేం జోక్యం చేసుకోం. పొత్తు కోసం ఏడీఎంకే ఎలాంటి షరతులు విధించలేదు. వచ్చ ఎన్నికల్లో కూటమి ఘన విజయం ఖాయం’ అని ఆయన వ్యాఖ్యానించారు. 2026లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తరుణంలో ఈ రెండు పార్టీలు పొత్తు ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా మారింది. తమిళనాడులో ఎన్డీఏ ప్రభుత్వం ఖాయంఈ పొత్తులో భాగంగా తమిళనాడు కూటమి సీఎం అభ్యర్థిగా కె పళనిస్వామి అని అమిత్ షా ప్రకటించారు. అమిత్ షా మాట్లాడుతూ.. 1998 నుంచి ఏఐఏడీఎంకే అనేది ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ.. తమిళనాడు మాజీ సీఎం జయలలితలు ఇద్దరూ కలిసే గతంలో పని చేశారు. ఎన్డీఏ భాగ్వస్వామ్యం అనేది విజయానికి సంకేతం. మా పొత్తుతో మేం మరింత పటిష్టం కానున్నాం. కచ్చితంగా ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. తమిళనాడు రాజకీయాల్లో ఊహించని మెజార్టీతో ప్రభుత్వాన్ని చేపడతాం’ అని అమిత్ షా పేర్కొన్నారు.

సీఎస్కే వర్సెస్ కేకేఆర్ లైవ్ అప్డేట్స్..
Csk vs KKR Live Updates: ఐపీఎల్-2025లో చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. సీఎస్కే తొలి వికెట్ డౌన్..డెవాన్ కాన్వే రూపంలో సీఎస్కే తొలి వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన కాన్వే.. మోయిన్ అలీ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు.3 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 16/0టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సీఎస్కే మూడు ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 16 పరుగులు చేసింది. క్రీజులో డెవాన్ కాన్వే(12), రచిన్ రవీంద్ర(4) పరుగులతో ఉన్నారు.ఐపీఎల్-2025లో మరో రసవత్తర పోరుకు తేరలేచింది. చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేకేఆర్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కేకేఆర్ ఓ మార్పుతో బరిలోకి దిగింది. స్పెన్సార్ జాన్సన్ స్దానంలో మోయిన్ అలీ తుది జట్టులోకి వచ్చాడు. ఈ మ్యాచ్‌లో సీఎస్కే కెప్టెన్‌గా ఎంఎస్ ధోని వ్యవహరిస్తున్నాడు. రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా దూరం కావడంతో ధోని తిరిగి పగ్గాలు చేపట్టాడు. రుతురాజ్ స్ధానంలో రాహుల్ త్రిపాఠి తుది జట్టులోకి వచ్చాడు.తుది జట్లుసీఎస్కేతో మ్యాకోల్కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), సునీల్ నరైన్, అజింక్యా రహానే(కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, మొయిన్ అలీ, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తిచెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే, రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్, శివమ్ దూబే, ఎంఎస్ ధోనీ(కెప్టెన్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్చ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కేకేఆర్

‘అన్నీ చేయాలనే ఉంది తమ్ముళ్లూ.. కానీ గల్లా పెట్టె ఖాళీ’
ఏలూరు జిల్లా: గతేడాది ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు.. ఒక్కొక్కటిగా కాల గర్భంలో కలిపేసే యత్నాలే జరుగుతున్నాయి. అప్పుడు ఎన్నికల్లో ఏదో రకంగా గెలవాలని ఉద్దేశంతో మోసపూరిత హామీలు ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు అమలు చేయాల్సిన పరిస్థితి వచ్చేసరికి మాత్రం డొంక తిరుగుడు మాటలు చెబుతున్నారు. ప్రజలు తమకు ఏదో చేస్తారని ఓటేస్తే.. మరి చంద్రబాబేమో వింత వ్యాఖ్యలు చేస్తున్నారు. ‘‘అప్పులు పుట్టడం లేదు’’ అపి ప్రజలకు చెబుతున్నారు. అన్నీ చేయాలనే ఉంది తమ్ముళ్లూ.. కానీ గల్లా పెట్టె ఖాళీ అయిపోయింది’ అంటూ ప్రజలను మభ్యపెట్టే యత్నం చేస్తున్నారు. ఏలూరు జిల్లా నూజివీడు నియోజవర్గం అగిరపల్ల్లిలో చంద్రబాబు మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ అప్పు తేవాలన్నా.. ఇచ్చేవాడులేడు.. అప్పులు ఇవ్వాలంటే కొన్ని నిబంధనలు ఉంటాయి. పరపతి ఉంటే.. డబ్బులు తిరిగి ఇస్తారనే నమ్మకం ఉంటే అప్పులు ఇస్తారు.. ఇప్పుడు నా పరిస్థితి కూడా అదే’ అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు చంద్రబాబు.అసలు హామీలు ఇచ్చినప్పుడు తెలియదా.. అని ఒకవైపు జనం అనుకుంటుంటే, బాబు గారు మాత్రం తాను పథకాల్ని అమలు చేయలేనని పరోక్షంగా జనాలకు చెప్పేస్తున్నారు చంద్రబాబు.

బట్టతల పర్లేదు..! ఎయిర్‌పోర్ట్‌లో నటి సోనాలికి ఎదురైన ఆ ఘటన
కొన్నిపరిస్థితులు సమాజం ముందుకు రాలేని విధంగా చేస్తాయి. అవమానకరంగా ఉంటాయి. మన తప్పిదం కాకపోయినా..అభ్రతభావంతో ఉండాల్సి వస్తుంటుంది. కొన్ని అనారోగ్యాలు మనకు సోకాయి అని నోరువిప్పడానికే జంకేలా ఉంటాయి. ఒకవేళ్ల ఆ వ్యాధితో బాధపడుతున్నానంటే ..మనల్ని ఎలా చూస్తారన్న భయం, ఆందోళన వంటివి వెన్నాడుతూనే ఉంటాయి. పైగా వాటి కోసం తీసుకునే చికిత్సల కారణంగా మన రూపం మారుతుంది..ఐతే ఆ ఆకృతితో బయటకు రావాలన్నా..గట్స్ ఉండాలి. కానీ అలాంటి సమయంలోనే అసలైన అందం ప్రస్ఫుటంగా బయటకొస్తుందట. అదే అంటోంది బాలీవుడ్ నటి సోనాలి బింద్రే.బాలీవుడ్ నటి సోనాలి బింద్రే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో హిట్ సినిమాలతో ప్రేకక్షకుల, విమర్శకుల ప్రశంసలను అందుకున్న తార. టాలీవుడ్లో కూడా మంచి సక్సెస్‌ని అందుకుంది. అయితే ఆమె కేన్సర్‌తో పోరాడి గెలిచిన గ్రేట్ వారియర్ కూడా. ఆ క్రమంలో తనకు ఎదురైన అనుభవం గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. తనకు నాలుగో దశ మెటాస్టాటిక్ కేన్సర్ ఉన్నట్లు నిర్థారణ అయ్యాక..ట్రీట్మెంట్ కోసం విదేశాలకు వెళ్లి తిరిగి వస్తున్నప్పుడూ..ఎయిర్‌పోర్ట్‌లో విలేకరులను ఎదుర్కొనాల్సి ఉంది. అయితే కీమోథెరపీ కారణంగా జుట్టు ఉండదన్నవిషయం తెలిసిందే. అందువల్ల సోనాలి ముందుగానే ఆ టైంకి ధరించాల్సిన విగ్ తదితరాలను ఏర్పాటు చేసుకున్నారట. కానీ ట్రీట్మెంట్ కారణంగా వచ్చిన అలసట కారణంగా ఆ విగ్ ధరించే ఓపిక తనలో లేదట. వీల్‌ఛైర్‌లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారట. దీంతో ఎయిర్‌పోర్ట్‌లోని విలేకరుల ముందుకు బట్టతలతోనే వెళ్తా పర్లేదు అని చెప్పేశారట తన సన్నిహితులతో. అలానే వారి ముందుకు రాగానే అక్కడున్న ప్రతి జర్నలిస్ట్ చాలా అటెన్షన్‌తో తనకు సహకరించారట. సోనాలి అలానే వచ్చి.. వాళ్లు అడిగే ప్రశ్నలకు మాట్లాడుతుంటే..ఒక ఫోటోగ్రాఫర్ వచ్చి చాలా అద్భుతంగా ఉంది ఈ రూపం అని అన్నారట. అతనెవరో నాకు తెలియదుగానీ ఇప్పటికీ ఆ మాటలు మర్చిపోలేను అంటోంది సోనాలి. అప్పుడే నాకు తెలిసింది మనల్ని మనం అంగీకరిస్తే..ఆటోమేటిగ్గా సమాజం అంగీకరిస్తుంది. మనలోని బలానికి ప్రతీది తలవంచుతుంది అని ఆ సంఘటన నాకు అర్థమయ్యేలా చేసిందని భావోద్వేగంగా మాట్లాడారు. ఎందుకంటే వాళ్ల నుంచి అలాంటి స్పందన వస్తుందని కలలో కూడా ఊహించలేదు. "అందులోనూ ఆ పరిస్థితుల్లో జాలి వంటివి నచ్చవు..కేవలం ధైర్యంగా మాట్లాడే మాటలే ఇష్టమవుతాయి. అంతేగాదు అక్కడున్నవాళ్లంతా ఆ వ్యాధితో చేసిన పోరాటానికి, ఓర్పుకి సెల్యూట్ చేయడం మరింత ధైర్యాన్నిచ్చింది. అంటే ఎప్పుడూ మన లుక్స్ కాదు అందాన్ని నిర్దేశించేవి..నిశబ్దంగా మనలో అంతర్లీనంగా ఉండే బలమే అసలైన అందం అని తెలుసుకున్నా." అని అంటోంది సోనాలి. అంతేగాదు వ్యాధుల కొరకు తీసుకునే చికిత్సలు కారణంగా వచ్చే మచ్చలు, శారీరక మార్పులు సిగ్గుపడే విషయాలు కావు..నయం అయ్యి ఆ మహమ్మారి నుంచి బయటపడ్డ వారియర్స్ అని అర్థం అంటోంది. అలాంటి సమయంలో తీసుకునే విశ్రాంతిని నిరుత్సాహంతో నింపొద్దు..మనస్సులో శాంతిని నెలకొల్పి..మరింత బలంతో ముందుకొచ్చే సమయంగా భావించాలని చెబుతోంది సోనాలి. (చదవండి: యూట్యూబ్ సెన్సేషన్ ఈ 74 ఏళ్ల బామ్మ..! నెలకు రూ.5 లక్షలు పైనే..)

తెలంగాణ లోకాయుక్తగా జస్టిస్ రాజశేఖర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ లోకాయుక్తగా హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్ రెడ్డి, ఉప లోకాయుక్తగా బీఎస్ జగ్జీవన్‌కుమార్, రాష్ట్ర మానవ హక్కుల సంఘం (హెచ్ఆర్సీ) చైర్మన్‌గా మరో రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ నియమితులయ్యారు. హెచ్ఆర్సీ సభ్యులుగా శివాడి ప్రవీణ, బి.కిషోర్‌లను ప్రభుత్వం నియమించింది.దీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్, లోకాయుక్త, ఉపలోకాయుక్త పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నెల 5 తేదీన (శనివారం) సచివాలయంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైన సెలక్షన్ కమిటీ అభ్యర్థుల జాబితాను వడపోసి వీరి పేర్లను ఖరారు చేశారు.జస్టిస్ ఏ.రాజశేఖర్‌రెడ్డి ప్రొఫైల్ నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం సిర్సనగండ్ల గ్రామంలో ఓ వ్యవసాయ కుటుంబంలో 1960, మే 4న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు జయప్రద, రామానుజరెడ్డి. హైదరాబాద్‌లోని ఏవీ కాలేజీ నుంచి పట్టభద్రులైన ఆయన కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో బంగారు పతకం పొందారు. 1985, ఏప్రిల్‌లో ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్లో ఎన్రోల్ అయ్యారు. తొలుత మహమూద్ అలీ వద్ద ప్రాక్టీస్ చేశారు. నాలుగేళ్ల తర్వాత స్వతంత్రంగా ప్రాక్టీస్ మొదలెట్టారు.2004లో హైకోర్టు న్యాయవాదుల సంఘం (హెచ్‌సీఏఏ) ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2004లో కేంద్ర ప్రభుత్వానికి సీనియర్ స్టాండింగ్ కౌన్సెల్‌గా, 2005లో అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్‌గా నియమితులయ్యారు. సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్, సర్వీస్ టాక్స్‌కు సీనియర్ స్టాండింగ్ కౌన్సెల్‌గా కూడా పని చేశారు. 2013, ఏప్రిల్ 12న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులైన ఆయన.. 2014లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2022, ఏప్రిల్‌లో పదవీ విరమణ చేశారు.జస్టిస్ షమీమ్ అక్తర్ ప్రొఫైల్ 1961, జనవరి 1న నల్లగొండలో రహీమున్నీసా బేగం, జాన్ మహమ్మద్‌కు జన్మించారు. నల్లగొండ నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీకామ్ చదివారు. నాగ్‌పూర్‌లోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా నుంచి న్యాయపట్టా పొందారు. 1996లో హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని పీజీ కాలేజ్ ఆఫ్ లా నుంచి ఎల్ఎల్ఎం పూర్తి చేశారు. 2006లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందారు. 2002లో నల్లగొండ జిల్లా, సెషన్స్ జడ్జిగా నియమితులయ్యారు. తర్వాత పలు కోర్టుల్లో పనిచేసిన ఆయన ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ ట్రిబ్యునల్ ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా, ఆంధ్రప్రదేశ్ జ్యుడీషియల్ అకాడమీ అదనపు డైరెక్టర్‌గా విధులు నిర్వహించారు. హైకోర్టులో రిజిస్ట్రార్ (జ్యుడీషియల్)గా పనిచేశారు. 2017లో హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. 2022 డిసెంబర్లో పదవీ విరమణ చేశారు.

టీడీపీ తోడేళ్లు.. జనసేన గుంటనక్కలపై కేసులేవీ?: శ్యామల
సాక్షి, తాడేపల్లి: టీడీపీ తోడేళ్లు.. జనసేన గుంటనక్కలు సోషల్ మీడియాలో మహిళలపై దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారని.. ఈ నక్కలు, తోడేళ్లను పెంచి పోషిస్తోంది టీడీపీనే అంటూ వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి శ్యామల మండిపడ్డారు. శుక్రవారం ఆమె ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ఫ్యామిలీ సహా అందరిపైనా ఇష్టానుసారం ట్రోల్స్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. బరితెగించి పోస్టులు పెడతున్న వారిపై ఎందుకు కేసులు పెట్టటం లేదంటూ ఆమె ప్రశ్నించారు.‘‘ఒకడ్ని అరెస్టు చేసినట్టు చూపించి మహిళా ఉద్దారకుల్లాగ ప్రమోషన్ చేసుకుంటున్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ గుంటనక్కలు, తోడేళ్లను ఎందుకు అరెస్టు చేయలేదు?. వైఎస్ జగన్ ఫ్యామిలీ గురించి ఇష్టానుసారం మాట్లాడిన హోంమంత్రి అనితపై ఎందుకు కేసు పెట్టలేదు?. కేవలం కిరణ్ అనే వ్యక్తిని అరెస్టు చేయటం ఒక డ్రామా. టీడీపీ అంటేనే తెలుగు డ్రామా పార్టీ. అరెస్టయిన చేబ్రోలు కిరణ్ విచారణలో చంద్రబాబు, లోకేష్ పేర్లే చెప్పాడు. మరి చంద్రబాబు, లోకేష్‌లపై ఎందుకు కేసు పెట్టలేదు?’’ అంటూ శ్యామల ప్రశ్నలు గుప్పించారు.‘‘మహిళలపై అఘాయిత్యాలు జరుగుతుంటే చంద్రబాబు, పవన్ స్టేజీల మీద స్కిట్లు చేసుకుంటున్నారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు సైకో అని దుర్భాషలాడారు. ఇది కరెక్టా?. పిఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్ దారుణంగా కించపరిచేలా మాట్లాడారు. వారిని చూసే వారి కార్యకర్తలు కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు.ఐ-టీడీపీ పేరుతో విష వృక్షాన్ని పెంచి పోషిస్తున్నారు. వైఎస్సార్సీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదులను పోలీసులు కనీసం చదవడం లేదు. మహిళలు, ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరుగుతుంటే హోంమంత్రి ఏం చేస్తున్నారు?. ఎంతమంది బాధితులను ఆమె పరామర్శించారు?’’ అని శ్యామల నిలదీశారు.‘‘నా మీద కూడా దారుణంగా ట్రోల్స్ చేశారు. నా వ్యక్తిత్వహనానికి పాల్పడ్డారు. రాష్ట్రంలో పీ4 కాదు ఏ4 అమలవుతోంది. ఏ4 అంటే అరాచకాలు, అక్రమాలు, అఘాయిత్యాలు, అప్పులు’’ అంటూ శ్యామల వ్యాఖ్యానించారు.

అత్యాచార కేసులో పురోగతి ఎంతవరకూ వచ్చింది?: ప్రధాని ఆరా
వారణాసి: పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా తన పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసిలో శుక్రవారం పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ.. రాష్ట్రంలో సంచలన సృష్టించిన అత్యాచార ఘటనపై ఆరా తీశారు. కొన్ని రోజుల క్రితం వారణాసిలో 19 ఏళ్ల యువతి సామూహిక అత్యాచారానికి గురైన సంగతి తెలిసిందే. దీనిపై ప్రధానంగా ప్రధాని మోదీ ఆరా తీశారు.ఆ దారుణ ఘటనకు సంబంధించిన నిందితుల్ని అందరన్నీ అదుపులోకి తీసుకున్నారా లేదా అనే విషయాన్ని పోలీస్ కమిషనర్ ని ప్రధాని అడిగి తెలుసుకున్నారు. ప్రధాని వారణాసి పర్యటనలో భాగంగా ఆయనకు మర్యాద పూర్వకంగా కలవడానికి వెళ్లిన సిటీ పోలీస్ కమిషనర్, డివిజనల్ కమిషనర్, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ లను ప్రధాని మోదీ ప్రశ్నించారు. అత్యాచార ఘటన కేసులో పురోగతి ఎంతవరకూ వచ్చిందని మోదీ అడిగి తెలుసుకున్నారు.ఈ క్రమంలోనే నిందితులకు ఏమైతే శిక్షలు ఉంటాయో అవి అమలయ్యేలా చూడాలన్న మోదీ.. భవిష్యత్ లో ఈ తరహా ఘటనలు జరగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీనిపై సమాధానమిచ్చిన పోలీస్ కమిషనర్.. కేసులో పురోగతి ఉందని స్పష్టం చేశారు. పలువుర్ని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామన్నారు. కాగా, ఓ యువతిని కిడ్నాప్ చేసి, వారం రోజుల వ్యవధిలో 22 గ్యాంగ్ రేప్‌నకు పాల్పడినట్లు యువతి ఫిర్యాదు చేసింది.. వీరిలో ఆరుగురిని అరెస్ట్ చేశామని, మిగతా వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. నగరంలోని లాల్పూర్కు చెందిన 19 ఏళ్ల యువతి మార్చి 29వ తేదీన ఫ్రెండ్‌ను కలిసేందుకని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. అయితే కొన్నిరోజుల పాటు తిరిగి రాలేదు. దీనిపై ఏప్రిల్ 4వ తేదీన ఆమె కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.అదే రోజు, పోలీసులు పాండేపూర్ వద్ద డ్రగ్స్ మత్తులో ఉన్న ఆమెను కిడ్నాపర్ల చెర నుంచి విడిపించారు పోలీసులు. అనంతరం ఆమెసొంతింటికి చేరుకుని తనపై లైంగిక దాడి జరిగిన విషయాన్ని తండ్రికి తెలిపింది. ఈ నెల 6న తండ్రితో వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్థానిక హుక్కా సెంటర్, ఒక హోటల్, ఒక లాడ్జి, ఒక గెస్ట్ హౌస్‌లో తనపై మొత్తం 22 మంది అత్యాచారానికి ఒడిగట్టినట్లు అందులో ఆరోపించింది.కేసు నమోదు చేసిన పోలీసులు హుకూల్ గంజ్, లాల్పూర్ ఏరియాలకు చెందిన కొందరు నిందితులను అదే రోజు రాత్రి అదుపులోకి తీసుకున్నారు.

కిరాణ కొట్టు కుర్రాడు.. ఒక్క రాత్రిలో కోటీశ్వరుడయ్యాడు!
అదృష్టం ఎప్పుడు, ఎవరి తలుపు తడుతుందో ఎవరూ చెప్పలేరు. తాజాగా జార్ఖండ్‌లోని పాలమూ డివిజన్‌కు చెందిన రవి కుమార్ జీవితం ఒక్కసారిగా ఊహించని మలుపు తిరిగింది. కిరాణ కొట్టు నడిపిస్తూ జీవనం సాగించే కుర్రాడు.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు! అది కూడా లాటరీతోనో, జూదంతోనో కాదు. డ్రీమ్ 11 అనే ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఆ అదృష్టం వరించింది. ఊహించని ఈ గెలుపుతో రవి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు.పాలమూ హెడ్‌క్వార్టర్స్‌కి 7 కిలోమీటర్ల దూరంలో.. చియాంకి రైల్వే స్టేషన్ సమీపంలోని తెలియాబండ్ ప్రాంతం ఉంది. మహేంద్ర మెహతా కొడుకు రవి కుమార్ మెహతా ఎప్పుడు చూసినా కిరాణా షాపులో ఫోన్ పట్టుకుని ఇంట్లోవాళ్లతో తిట్లు తింటూ కనిపిస్తుంటాడు. 2018 నుంచి డ్రీమ్11 ఆడుతున్న రవి మొన్నటిదాకా రూ.5 లక్షలు పొగొట్టాడు. ఈ విషయంపై ఇంట్లో రోజూ గొడవే. అయినప్పటికీ రవి తన ప్రయత్నం మాత్రం వీడలేదు. చివరగా.. ఆరోజు రానే వచ్చింది.ఏప్రిల్ 9వ తేదీ అతని జీవితంలో మరుపురానిరోజు. గుజరాత్ టైటానస్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌లో సాయి సుదర్శన్‌ను కెప్టెన్‌గా, రషీద్ ఖాన్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంచుకుని టీం ఏర్పాటు చేశాడు. ఆ నిర్ణయం వర్కవుట్ అయ్యింది. డ్రీమ్11తో ఒక్క రాత్రిలోనే రూ.3 కోట్లు సంపాదించాడతను. అంతే.. అతని కళ్లలో ఒక్కసారిగా నీళ్లు తిరిగాయి. భావోద్వేగంతో తల్లిని గట్టిగా హత్తుకున్నాడు. తప్పుడు పనులు డబ్బులు పొగొట్టావ్ అని తిట్టావ్ కదా అమ్మా.. ఇప్పుడు చూడు ఎంత సంపాదించానో అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రైజ్‌మనీలో 30 శాతం జీఎస్టీ కిందకు పోయింది.మిగిలిన డబ్బును తన తల్లి ఖాతాలోకి మళ్లించాడు. వచ్చిన డబ్బుతో సగంలో ఆగిపోయిన ఇంటిని కట్టుకోవడంతో పాటు కాస్త పొలం కొనుక్కోవాలని.. ఇలా ప్లానులు గీసుకుంటున్నాడు.లోకల్ 18కు ఇచ్చిన ఇంటరర్వ్యూలో మాట్లాడుతూ.. రూ.49 పెట్టుబడితో లక్ష వస్తే చాలానుకున్నాడట. విజయం కోసం ఓపికగా ఎదురు చూడాలని చెబుతున్నాడతను . ఇక వచ్చిన ప్రైజ్‌మనీతో తమ కుటుంబ ఆర్థిక స్థితిని మార్చుకోవాలని అనుకుంటున్నాడతను. 2018 నుంచి డ్రీమ్11 ఆడుతున్న రవి.. ఇప్పటిదాకా రెండు ఐడీలతో 621 టీంలను సృష్టించాడు. ఈ క్రమంలోనే కిరాణం షాపు ద్వారా వచ్చిన ఆదాయంలో రూ.5 లక్షలు పొగొట్టాడు. చివరకు.. పడిన చోటే నిలబడి ఆ కుటుంబంతో పాటు చుట్టుపక్కలవాళ్ల నుంచి గ్రేట్ అనిపించుకున్నాడు.Disclaimer: ఈ ఆర్టికల్ కేవలం జరిగిన ఘటన తెలియజేయడం కోసం మాత్రమే. బెట్టింగ్, ఫాంటసీ గేమింగ్‌లను ప్రోత్సహించడం మా ఉద్దేశం ఎంతమాత్రం కాదు

జీతాల పెంపు ఇప్పుడు కాదు..
దేశంలో అగ్ర ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఉద్యోగులకు నిరాశను కలిగించే చేదు వార్తను చెప్పింది. ఏప్రిల్‌లో ప్రారంభం కావాల్సిన వార్షిక వేతన పెంపును వాయిదా వేసింది. నాలుగో త్రైమాసిక ఫలితాలను విడుదల చేసిన అనంతరం మీడియా సమావేశంలో కంపెనీ ఈ విషయాన్ని ప్రకటించింది.వేతనాల పెంపును ఈ ఆర్థిక సంవత్సరం చివర్లో పరిశీలిస్తామని టీసీఎస్ తెలిపింది. నిర్ణయం తీసుకునే ముందు వ్యాపార వాతావరణం మరింత స్థిరంగా మారడానికి వేచి చూస్తున్నామని కంపెనీ అగ్ర నాయకత్వం వెల్లడించింది. వేతనాల పెంపు ఎప్పుడు చేయాలనేది రానున్న రోజుల్లో నిర్ణయిస్తామని ప్రస్తుత చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ (సీహెచ్ ఆర్వో) మిలింద్ లక్కడ్ తెలిపారు. అనిశ్చిత మార్కెట్ పరిస్థితులను ఎదుర్కొంటున్నందున కంపెనీ ఆచితూచి వ్యవహరిస్తున్న వైఖరిని ఆయన ప్రకటన ప్రతిబింబిస్తోంది.ఇప్పటికే చాలా మంది క్లయింట్లు తమ వ్యయాన్ని తగ్గించుకునే సంకేతాలను చూపుతున్నారని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కె.కృతివాసన్ తెలిపారు. ఇది ఇలాగే కొనసాగితే విచక్షణ వ్యయంలో జాప్యం జరుగుతుందన్నారు. టారిఫ్ సంబంధిత అనిశ్చితి కారణంగా కంపెనీలు తమ బడ్జెట్లను సమీక్షిస్తున్నందున అనేక ప్రాజెక్టులు ఆలస్యమవుతున్నాయని లేదా తగ్గిపోతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.వార్షిక వేతన పెంపును నిలిపివేసినప్పటికీ, టీసీఎస్ త్రైమాసిక వేరియబుల్ పేను కొనసాగిస్తుంది. నాలుగో త్రైమాసికంలో 70 శాతం మంది ఉద్యోగులకు పూర్తి అర్హత కలిగిన వేరియబుల్ వేతనం అందనుంది. మిగతా సిబ్బందికి వ్యాపార పనితీరు ఆధారంగా వేతనాలు చెల్లిస్తారు.బలంగానే నియామకాలువేతనాల పెంపు ఆలస్యమైనా ఫ్రెషర్ల నియామకాలను కొనసాగిస్తామని టీసీఎస్ తెలిపింది. గత ఏడాది నియామకాల సంఖ్యకు అనుగుణంగా ఈ ఏడాది కాలేజీల నుంచి 42,000 మంది ఇంజినీర్లను నియమించుకోవాలని కంపెనీ యోచిస్తోంది. మార్చి 31తో ముగిసిన నాలుగో త్రైమాసికంలో టీసీఎస్ 625 మంది ఉద్యోగులను చేర్చుకుంది. దీంతో కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 6,07,979కి చేరింది.మొత్తంగా గడిచిన ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్ నికరంగా 6,433 మంది ఉద్యోగులను చేర్చుకుంది. అంతకుముందు సంవత్సరంలోని 13,249 క్షీణత నుంచి కోలుకుంది. నాలుగో త్రైమాసికంలో అట్రిషన్ 13 శాతం నుంచి స్వల్పంగా పెరిగి 13.3 శాతానికి చేరింది. ఇచ్చిన హామీ మేరకు 2025 ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్ 42,000 మంది ఫ్రెషర్లను విజయవంతంగా ఆన్‌బోర్డ్ చేసిందని లక్కడ్ తెలిపారు.కాగా 2025 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో టీసీఎస్ రూ.12,224 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.12,434 కోట్లతో పోలిస్తే ఇది 1.7 శాతం తక్కువ. ఈ త్రైమాసికంలో ఆదాయం ఏడాది ప్రాతిపదికన 5.3 శాతం పెరిగి రూ.64,479 కోట్లకు చేరింది. త్రైమాసిక ప్రాతిపదికన ఆదాయం 0.79 శాతం పెరిగింది.

'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' రివ్యూ.. నవ్వులతో మెప్పించారా?
టైటిల్ : అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’నటీనటులు: ప్రదీప్ మాచిరాజు, దీపికా పిల్లి, వెన్నెల కిశోర్, బ్రహ్మానందం, సత్య, గెటప్ శ్రీను, మురళీధర్ గౌడ్,రోహిణి, ఝాన్సీ తదితరులునిర్మాణ సంస్థలు: మాంక్స్ అండ్ మంకీస్‌నిర్మాత: మాంక్స్ అండ్ మంకీస్ బ్యానర్‌ఎడిటింగ్: కొడాటి పవన్ కల్యాణ్‌దర్శకత్వం, స్క్రీన్‌ప్లే: నితిన్–భరత్‌కథ, డైలాగ్స్: సందీప్ బొల్లాసంగీతం: రధన్సినిమాటోగ్రఫీ: ఎమ్ఎన్ బాల్‌రెడ్డివిడుదల: ఏప్రిల్ 11, 2025‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాతో హీరోగా పరిచయమైన ప్రదీప్ మాచిరాజు నటించిన కొత్త చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’(Akkada Ammayi Ikkada Abbayi) నేడు ఏప్రిల్ 11న విడుదలైంది. ఇందులో దీపికా పిల్లి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. నితిన్–భరత్ దర్శకత్వంలో మాంక్స్ అండ్ మంకీస్ ఈ మూవీని నిర్మించింది. చిన్న సినిమాగా తెరకెక్కిన ఈ ప్రాజక్ట్ ద్వారా చాలామంది కొత్తవాళ్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. వెన్నెల కిశోర్, సత్య, గెటప్ శ్రీను, మురళీధర్ గౌడ్ ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు సంగీతం రధన్ అందించారు. ఈ సినిమాలో దర్శకులతో పాటు హీరోయిన్ని కూడా బుల్లితెర వారినే తీసుకోవడం విశేషం. హీరోగా తన రెండో ప్రయత్నంలో ప్రదీప్ మాచిరాజు ఎలాంటి విజయాన్ని అందుకున్నాడో తెలుసుకుందాం.కథేంటి..?కథ మొదలు కావడమే తమిళనాడులోని భైరిలంక గ్రామం నుంచి మొదలౌతుంది. కొన్ని దశాబ్దాలుగా రాజన్న (జీఎమ్ సుందర్) కుటుంబానికి చెందిన వారే గ్రామ సర్పంచ్‌గా ఉంటారు. అయితే, తన తరంలో అయినా వారసత్వ రాజకీయం అంతం కావాలని ఆయన పెళ్లి కూడా చేసుకోడు. అలా ప్రజల బాగు కోసం రాజన్న ఎంతవరకైనా త్యాగం, దానం చేసేందుకు వెనకడుగు వేయడు. అయితే, ఆ గ్రామంలో ప్రతి ఇంట్లో మగబిడ్డ మాత్రమే జన్మిస్తుండటంతో సర్పంచ్‌లో ఆందోళన మొదలౌతుంది. అలా 60 మంది తర్వాత రాజా (దీపికా పిల్లి) జన్మిస్తుంది. అప్పటి వరకు గ్రామంలో అలముకున్న అపశకునాలన్ని పోతాయి. రాజా పుట్టిన తర్వాత అక్కడ వర్షాలతో పాటు పంటలు బాగా పండుతాయి. ఆమె తమ గ్రామానికి అదృష్ట దేవత అని అందరూ భావిస్తారు. రాజా పెరిగి పెద్ద అయిన తర్వాత గ్రామం దాటనీయొద్దని, అదే గ్రామంలో ఉన్న 60 మందిలో ఒక్కరిని పెళ్లి చేసుకుని అక్కడే ఉండాలని సర్పంచ్ రాజన్న తీర్మానిస్తాడు. ఆమె ఎవరిని అయితే పెళ్లి చేసుకుంటుందో అతనే గ్రామ సర్పంచ్ అని, తనకు సంబంధించిన ఆస్తి అంతా ఆమె భర్తకే చెందుతుందని ప్రకటిస్తాడు. దీంతో ఆమెను పెళ్లి చేసుకోవాలని 60 మంది యువకులు పోటీ పడుతారు. ఇతర గ్రామాలకు చెందిన అబ్బాయిలను తమ ఊరిలో అడుగుపెట్టకుండా వారందరూ చూసుకుంటూ ఉంటారు. సరిగ్గా అలాంటి సమయంలోనే గ్రామంలో పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం చుడుతుంది. అందులో భాగంగా వారి గ్రామంలో మొదట బాత్రూమ్లు నిర్మించాలని సర్పంచ్ అనుకుంటాడు. అందుకోసం ఇంజనీర్ అయిన కృష్ణ (ప్రదీప్ మాచిరాజు) పట్నం నుంచి అక్కడకు వస్తాడు. మరో ప్రాంతానికి చెందిన వ్యక్తి ఆ గ్రామంలో అడుగుపెట్టడం ఆ 60మందికి నచ్చదు. రాజాను పెళ్లి చేసుకునేందుకు అతను ఎక్కడ పోటీకి వస్తాడో అని వారు అడ్డుపడుతారు. అలాంటి సమయంలో ఫైనల్‌గా అక్కడ పనులు ప్రారంభం అవుతాయి. ఒకరోజు రాజా (దీపికా పిల్లి), కృష్ణ (ప్రదీప్ మాచిరాజు) ఇద్దరూ అనుకోకుండా కలవడం ఆపై ప్రేమలో పడిపోవడం జరిగిపోతుంది. అయితే, రాజా, కృష్ణల పెళ్లికి ఉన్న అడ్డంకులు ఏంటి..? వారి ప్రేమ విషయం తెలుసుకున్న గ్రామ పెద్దలందరూ కృష్ణకు పెట్టిన పరీక్ష ఏంటి..? రాజాను పెళ్లి చేసుకోవాలనుకున్న ఆ 60 మంది కలిసి కృష్ణను ఏం చేశారు..? ఫైనల్‌గా వారిద్దరూ ఒక్కటి అవుతారా..? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..సినిమా మొత్తం నవ్వులతోనే కొనసాగుతుంది. మంచి వినోదాన్ని పంచి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలనే దర్శకులు నితిన్–భరత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారని చెప్పవచ్చు. కథ పరిచయాన్నే చాలా ఆసక్తిగా చెప్పారు కానీ, ఇంటర్వెల్ తర్వాత కాస్త తడబడ్డారు. ఒక్క అమ్మాయి కోసం 60మంది పెళ్లి చేసుకోవాలని పోటీ పడటం చాలా ఫన్నీగా దర్శకుడు చూపాడు. ఈ క్రమంలో ఆమెను దక్కించుకునేందుకు వారందరూ పడుతున్న పాట్లు మామూలుగా ఉండవు. ప్రశాంతంగా ఉన్న ఆ గ్రామంలోకి ఒకరోజు సడెన్‌గా కృష్ణ (ప్రదీప్ మాచిరాజు) రావడంతో వారిలో అందోళన మొదలౌతుంది. ఆ గ్రామంలోకి కృష్ణతో పాటు బిలాల్ (సత్య) కూడా కారు డ్రైవర్‌గా ఎంట్రీ ఇస్తాడు. 60మంది గ్యాంగ్‌లో పని (గెటప్ శ్రీను) ఉంటాడు. వారందరి చుట్టే కథ రన్ అవుతుంది. పల్లెటూరి అమ్మాయితో పట్నం నుంచి వచ్చిన అబ్బాయి ప్రేమలో పడటం, వారి ప్రేమ కథలో చిన్నచిన్న ట్విస్ట్‌లు, టర్న్‌లతో ఫీల్‌గుడ్ ఎంటర్టైనర్ అని చెప్పచ్చు. కథాపరంగా సినిమాలో కొత్తదనం లేకపోయినా గెటప్ శ్రీను, సత్యల మధ్య వచ్చే కామెడీ సీన్లు సినిమాకు ప్రధాన బలం అని చెప్పవచ్చు. వారు స్క్రీన్‌పై కనిపించే ప్రతిసీన్లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వుతారు. వారి పంచ్‌లు, ప్రాసలు గట్టిగానే పేలాయి.రాజా (దీపికా పిల్లి), కృష్ణ (ప్రదీప్ మాచిరాజు) ఇద్దరి జోడీ సరిగ్గా సెట్ అయింది. 60మంది కళ్లుకప్పి వారిద్దరూ సీక్రెట్‌గా పదేపదే కలుసుకునే సీన్లు బాగుంటాయి. వెన్నెల కిషోర్, బ్రహ్మానందం ఇద్దరూ కామియో రోల్స్‌లో ఎంట్రీ ఇస్తారు. ఉన్నది కొద్దిసేపు మాత్రమే అయినా బాగా ఫన్ ఉంటుంది. గ్రామీణ ప్రాంతం నుంచి ఆ గ్యాంగ్ మొత్తం సిటీకి చేరుకున్న తర్వాత సినిమా కాస్త నెమ్మదిస్తుంది. అక్కడి నుంచి పంచ్ డైలాగ్స్, కామెడీ అంతగా మెప్పించేలా ఉండవు. అలా ఫస్టాఫ్‌లో ఉన్న బలం సెకండాఫ్‌లో ఉండదు. సినిమాకు కాస్త ఇదే మైనస్ అని చెప్పవచ్చు. సినిమా క్లైమాక్స్ సీన్ మరీ కామెడీగా ఉంటుంది. ఇలా కూడా సినిమాను ముగించేయవచ్చా అనే సందేహం ప్రేక్షకులలో రావడం ఖాయం అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ సినిమాకు పాటలు చాలా వీక్.. అవి పదే పదే రావడం వల్ల ప్రేక్షకులలో విసుగును తెప్పిస్తాయి.ఎవరెలా చేశారంటే..గెటప్ శ్రీను, సత్య కామెడీ కోసం ఈ సినిమా తప్పకుండా చూడొచ్చు. మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ వారిద్దరే.. తమ పాత్రలతో నవ్విస్తూ దుమ్మురేపారని చెప్పవచు. ఆ తర్వాత హీరోయిన్ దీపిక తన పాత్రలో బాగా సెట్ అయిపోయింది. తను యాంకర్‌గా పలు వేదికలపై రాణించిన అనుభవం ఉండటంతో ఈజీగా తన పాత్రలో నటించేసింది. ప్రదీప్‌కు ఇదీ రెండో సినిమా కావడంతో సులువుగానే కనెక్ట్ అయిపోయాడు. అతని డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్ బాగున్నప్పటికీ అక్కడక్కడా కొంత తడబాటుకు లోనయ్యాడని చెప్పవచ్చు. ప్రదీప్ తల్లిదండ్రులుగా మురళీధర్ గౌడ్,రోహిణి తమ పరిదిమేరకు మెప్పించారు. పాన్ ఇండియా పెళ్లిళ్ల బ్రోకర్‌గా బ్రహ్మాజీ కనిపించింది కొంతసేపు మాత్రమే.. అయినా తన పాత్రకు ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. సంగీతం, కెమెరామెన్ పనితీరు బాగుంది. చిన్న బడ్జెట్ సినిమాలకి ఈ స్థాయి టెక్నికల్ క్వాలిటీస్ ఉండటం చాలా అరుదు. కథ బలం ఉన్నంతమేరకు నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్రదీప్, దీపిక, గెటప్ శ్రీను, సత్య అభిమానులకు ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. ఆపై కామెడీని ఇష్టపడే వారు హ్యాపీగా వెళ్లొచ్చు..
రోడ్డుపై టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి.. సామాన్యుడిలా నడుస్తూ..!
ప్రయాణంలో రైలు టికెట్ చిరిగిపోతే ఫైన్ కట్టాలా?
నా రెండో పెళ్లిపై అంత ఆసక్తి ఎందుకు?.. రేణు దేశాయ్ ఆగ్రహం
'పుష్ప 2'తో ఫేమ్.. ఇప్పుడు కొత్త కారు
సీఎస్కే వర్సెస్ కేకేఆర్ లైవ్ అప్డేట్స్..
భారీ అగ్ని ప్రమాదం.. బాల్కనీ నుంచి సేఫ్టీ నెట్లోకి..!
తెలంగాణ లోకాయుక్తగా జస్టిస్ రాజశేఖర్‌రెడ్డి
పాకిస్తాన్ జోరు.. వరుసగా రెండో విజయం
తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల
ఫ్యాన్స్ కోసమే తీసిన సినిమా.. Day 1 కలెక్షన్స్ ఎంత?
పృథ్వీ షాకు బంపరాఫర్.. ధోని టీమ్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ!?
మారిన తత్కాల్ టికెట్ బుకింగ్ రూల్స్: ఏప్రిల్ 15 నుంచే అమలు
2035 కల్లా భారత్‌కు సొంత అంతరిక్ష కేంద్రం
ఈ రాశి వారికి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.. అదనపు రాబడి
Love Marriage: 15 రోజులకే ప్రేమపెళ్లి పెటాకులు
ఇంత కాలం పని చేయకున్నా వైదొలగమనలేదు.. ఇప్పుడే ఎందుకంటున్నారని అడుగుతున్నారు సార్!
ఇన్‌స్టా లవర్‌తో వివాహిత పెళ్లి
అన్నీ ఒకేలా చేయలేం.. మీకు చెప్పడం ఈజీనే.. ఏడ్చేసిన శేఖర్ మాస్టర్
నీకు 21, నాకు 43.. ఓ ఆడిటర్ ప్రేమ వివాహం
RCB Vs DC: ఇదేం కెప్టెన్సీ?.. పాటిదార్‌పై కోహ్లి ఫైర్?!.. అతడు కెప్టెన్‌తో మాట్లాడాల్సింది!
నేడు ఓటీటీలోకి వచ్చేసిన హిట్ సినిమాలు.. ఎందులో స్ట్రీమింగ్
మరో కొత్త పథకం.. రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
వివాహమైనా కుమార్తె అర్హురాలే..
యూపీ మహిళ నిర్వాకం.. 10 రోజుల్లో కూతురు పెళ్లి.. కాబోయే అల్లుడితో అత్త జంప్!
క్యాలెండర్ మార్క్ చేస్కోండి.. దొంగప్ప వచ్చేస్తున్నాడు: మంచు మనోజ్ ట్వీట్
పృథ్వీ షాను చూడు.. మనకూ అదే గతి పట్టవచ్చు.. జాగ్రత్త!
RCB Vs DC: ఆర్సీబీ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే
భారత విద్యార్థులపై ట్రంప్ సంచలన నిర్ణయం.. కేంద్రం అలర్ట్
తెలుగు కథతో తీసిన హిందీ సినిమా.. Day 1 కలెక్షన్స్ ఎంత?
తిరుమలలో మహా పాపం.. పవనానంద స్వామి ఎక్కడ?: భూమన
వివాదంలో యాంకర్ రవి, సుడిగాలి సుధీర్.. మరి చిరంజీవిది తప్పు కాదా?
ఒక పోలీసు ఈ మాదిరిగా చేయాల్సిన అవసరం ఏముంది?: వైఎస్ జగన్
korameenu కొరమీను.. కేరాఫ్ కరీంనగర్
హైదరాబాద్‌లో భారీ వర్షం.. కూలిన చెట్లు, చెరువులుగా రోడ్లు
మందు బాబులకు షాక్.. ఎల్లుండి వైన్ షాపులు బంద్
తనకెంతో గుండె ధైర్యం ఉందట! ఆపరేషన్ చేయించుకునే వారికే గుండె ధైర్యం లేక పోతున్నారట సార్!
ఈ ఫోటోలోని టాలీవుడ్ స్టార్ హీరో భార్య ఎవరో తెలుసా.. గుర్తు పట్టగలరా?
CSK Vs KKR: ‘ద్రోహి వచ్చేశాడు చూడండి... జీవితం చాలా చిత్రమైనది’
హైకోర్టన్నా లెక్కలేదా? ఇది ధిక్కారమే
ప్రియుడితో వెళ్లిపోయి రీల్స్.. తండ్రి కోపాగ్నికి బలి
ఎవరైనా అతడికి కాస్త మర్యాద నేర్పండి: సెహ్వాగ్‌పై ఫ్యాన్స్ ఫైర్
బోణీ కొట్టిన బంగ్లాదేశ్.. కెప్టెన్ విధ్వంసకర శతకం
కిరాణ కొట్టు కుర్రాడు.. ఒక్క రాత్రిలో కోటీశ్వరుడయ్యాడు!
శివదర్శిని ఫ్యాన్స్ ఇక్కడ : ఒక్క డ్యాన్స్‌కు 10 కోట్లా, వీడియో వైరల్
చైనాకు చేయందించిన బంగ్లా.. షిప్మెంట్ రద్దుతో భారత్ ప్రతీకారం?
వాట్ ఏ వెడ్డింగ్ మెనూ..ఆరోగ్య స్పృహకి అసలైన అర్థం..!
మేం ఉద్యోగం చేయలేం
AP: రియల్.. ఢమాల్
సారీ చెప్పినా సరే!.. ముంబై ఇండియన్స్ స్టార్‌పై ఏడాది నిషేధం
'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' రివ్యూ.. నవ్వులతో మెప్పించారా?
ఐపీఎల్‌కు పోటీగా పాకిస్తాన్ సూపర్ లీగ్.. స్టార్ క్రికెటర్లు వీరే
JEE Mains: విద్యార్థుల్ని పరీక్షకు దూరం చేసిన డిప్యూటీ సీఎం పవన్
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 21 సినిమాలు
ప్లాట్‌ఫామ్స్ మూత.. రైళ్లు మళ్లింపు
IPL 2025: ముదురుతున్న 'ఈడెన్' పిచ్ వివాదం
ఇది తీవ్రమైన ఉల్లంఘనే.. కేంద్రానికి ‘సుప్రీం’ చీవాట్లు
తెలంగాణ పంటల విధానం మారాలి!
Jack Movie Review: ‘జాక్’ మూవీ హిట్టా? ఫట్టా?
నేనలాగే పెరిగాను.. నా కూతురు కూడా అలాగే ఎదగాలి: ఉపాసన
గిల్, సూర్య కాదు!.. టీమిండియా కెప్టెన్, రోహిత్ వారసుడిగా ఊహించని పేరు
విడాకులు.. అయినా తనను వదలను: ప్రభుదేవా మాజీ భార్య
ఓటీటీలో 'ఛావా' సినిమా.. సడెన్ సర్ప్రైజ్
గత ఏడాది కంటే కటాఫ్ తగ్గే చాన్స్
నేడు, రేపు వానలు
జగన్ అద్భుత నాయకుడు
అసలు ఈ సెక్షన్లు ఎలా వర్తిస్తాయి?.. సూళ్లూరుపేట పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
భద్రతలో డొల్లతనం బట్టబయలు
కూటమిపై తిరుగుబాటు మొదలైంది!
ధోనిని కెప్టెన్ చేసినంత మాత్రాన చెన్నై రాత మారిపోదు!
‘గుడ్లు’ తేలేసేలా.. అమెరికాలో డజను కోడిగుడ్లు రూ.536
‘రింగు’ పొడవునా సర్వీసు రోడ్లు!
అర్జున్ సన్నాఫ్ వైజయంతి సెన్సార్ రిపోర్ట్.. సినిమా అలా ఉందట!
సీనియర్ సిటిజన్లకు రూ. 990కే బీమా పాలసీ
అజిత్ కుమార్ యాక్షన్ థ్రిల్లర్.. 'గుడ్ బ్యాడ్ అగ్లీ' ఎలా ఉందంటే?
క్రెడిట్ కార్డ్ బిల్లుల భారం.. ఉందిగా ఉపాయం!
మనవడి కోసం ఏడుపదుల వయసులో వ్యాపారం..! తట్టుకోలేనన్ని కష్టాలు చివరికి..
టార్గెట్ చైనా ఎందుకంటే..!
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ఎంఎస్ ధోని..
పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు
భారతీయులకు అలా జరగాల్సిందే.. హెడ్లీతో రాణా
తండ్రి వైద్యం కోసం ఇళ్ల పనికి వెళ్తున్న కుమార్తె..
#Virat Kohli: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి..
పర్యటించడానికి సాధ్యం కాని దేశాలివే..!
రాణా అప్పగింతపై స్పందించిన అమెరికా
WTC Final: సౌతాఫ్రికాకు ఊహించని షాక్!
న్యూయార్క్‌లో హెలికాప్టర్ ప్రమాదం.. ప్రముఖ కంపెనీ సీఈవో ఫ్యామిలీ మృతి
వెంటనే వెళ్లిపోండి.. లేదంటే రోజుకు రూ. 86 వేలు కట్టండి
'జాట్' ట్విటర్ రివ్యూ.. గోపీచంద్ మలినేని హిట్ కొట్టాడా..?
'ఆ పిల్ల నీకు వదిన అవుద్దిరా'.. ఆసక్తిగా సంపూర్ణేశ్ బాబు సోదరా ట్రైలర్
అమ్మా.. కాసేపు పడుకుంటా! అని శాశ్వత నిద్రలోకి..
టారిఫ్‌ల ఎఫెక్ట్.. ఒక్కసారిగా పెరిగిన బంగారం
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. వ్యాపారాలు విస్తరిస్తారు
విశాఖలో బోర్డు తిప్పేసిన సాఫ్ట్వేర్ కంపెనీ
చైనాకు ట్రంప్ మరో షాక్.. డ్రాగన్‌పై మరోసారి టారిఫ్ విధింపు
కొబ్బరి కాయ చెప్పింది..పైపు లైన్ పగిలింది..
ద్రౌపది చేసిన వంటకమే పానీపూరి.. నేడు లక్షలకోట్ల బిజినెస్..
పెళ్లింట విషాదం.. పెళ్లైన 22 రోజులకే నవ వధువు..
విదేశీ విద్యార్థులను బయటకు పంపేయాలనే కక్షతో మనమే చాలా ఉల్లంఘనలు చేస్తున్నాం సార్
మావోల సంచలన లేఖ.. ములుగు ఎస్పీ రియాక్షన్
ఖరీదైన కార్లు.. విలాసవంతమైన భవనం: శుభ్‌మన్ గిల్ సంపద ఎంతో తెలుసా?
కమెడియన్ సత్య కాళ్లు మొక్కిన రామ్‌చరణ్.. వీడియో వైరల్
వారెవ్వా.. పోలీసు అఫీసర్... తమన్నాను మించి క్రేజ్
‘జాక్’ట్విటర్ రివ్యూ: ‘టిల్లుగాడి’ సినిమాకు ఊహించని టాక్!
ఏపీకి చల్లని కబురు.. వారం రోజుల పాటు వర్షాలు
వరంగల్ మెగా జాబ్ మేళాలో తొక్కిసలాట
సంపూను రోడ్డు మీదకు వదిలేశాడా? సాయి రాజేశ్ ఆన్సరిదే!
ఎండల్లో... కొబ్బరి నీళ్లతో గేమ్స్ వద్దు!
టీడీపీ, జనసేన మధ్య ఏం నడుస్తోంది?
ప్రపంచంలోనే అత్యంత భారీ నౌక.. భారత్‌లోకి..
ఈ యూట్యూబర్.. బిలియనీర్!
రోడ్డుపై టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి.. సామాన్యుడిలా నడుస్తూ..!
ప్రయాణంలో రైలు టికెట్ చిరిగిపోతే ఫైన్ కట్టాలా?
నా రెండో పెళ్లిపై అంత ఆసక్తి ఎందుకు?.. రేణు దేశాయ్ ఆగ్రహం
'పుష్ప 2'తో ఫేమ్.. ఇప్పుడు కొత్త కారు
సీఎస్కే వర్సెస్ కేకేఆర్ లైవ్ అప్డేట్స్..
భారీ అగ్ని ప్రమాదం.. బాల్కనీ నుంచి సేఫ్టీ నెట్లోకి..!
తెలంగాణ లోకాయుక్తగా జస్టిస్ రాజశేఖర్‌రెడ్డి
పాకిస్తాన్ జోరు.. వరుసగా రెండో విజయం
తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల
ఫ్యాన్స్ కోసమే తీసిన సినిమా.. Day 1 కలెక్షన్స్ ఎంత?
పృథ్వీ షాకు బంపరాఫర్.. ధోని టీమ్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ!?
మారిన తత్కాల్ టికెట్ బుకింగ్ రూల్స్: ఏప్రిల్ 15 నుంచే అమలు
2035 కల్లా భారత్‌కు సొంత అంతరిక్ష కేంద్రం
ఈ రాశి వారికి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.. అదనపు రాబడి
Love Marriage: 15 రోజులకే ప్రేమపెళ్లి పెటాకులు
ఇంత కాలం పని చేయకున్నా వైదొలగమనలేదు.. ఇప్పుడే ఎందుకంటున్నారని అడుగుతున్నారు సార్!
ఇన్‌స్టా లవర్‌తో వివాహిత పెళ్లి
అన్నీ ఒకేలా చేయలేం.. మీకు చెప్పడం ఈజీనే.. ఏడ్చేసిన శేఖర్ మాస్టర్
నీకు 21, నాకు 43.. ఓ ఆడిటర్ ప్రేమ వివాహం
RCB Vs DC: ఇదేం కెప్టెన్సీ?.. పాటిదార్‌పై కోహ్లి ఫైర్?!.. అతడు కెప్టెన్‌తో మాట్లాడాల్సింది!
నేడు ఓటీటీలోకి వచ్చేసిన హిట్ సినిమాలు.. ఎందులో స్ట్రీమింగ్
మరో కొత్త పథకం.. రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
వివాహమైనా కుమార్తె అర్హురాలే..
యూపీ మహిళ నిర్వాకం.. 10 రోజుల్లో కూతురు పెళ్లి.. కాబోయే అల్లుడితో అత్త జంప్!
క్యాలెండర్ మార్క్ చేస్కోండి.. దొంగప్ప వచ్చేస్తున్నాడు: మంచు మనోజ్ ట్వీట్
పృథ్వీ షాను చూడు.. మనకూ అదే గతి పట్టవచ్చు.. జాగ్రత్త!
RCB Vs DC: ఆర్సీబీ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే
భారత విద్యార్థులపై ట్రంప్ సంచలన నిర్ణయం.. కేంద్రం అలర్ట్
తెలుగు కథతో తీసిన హిందీ సినిమా.. Day 1 కలెక్షన్స్ ఎంత?
తిరుమలలో మహా పాపం.. పవనానంద స్వామి ఎక్కడ?: భూమన
వివాదంలో యాంకర్ రవి, సుడిగాలి సుధీర్.. మరి చిరంజీవిది తప్పు కాదా?
ఒక పోలీసు ఈ మాదిరిగా చేయాల్సిన అవసరం ఏముంది?: వైఎస్ జగన్
korameenu కొరమీను.. కేరాఫ్ కరీంనగర్
హైదరాబాద్‌లో భారీ వర్షం.. కూలిన చెట్లు, చెరువులుగా రోడ్లు
మందు బాబులకు షాక్.. ఎల్లుండి వైన్ షాపులు బంద్
తనకెంతో గుండె ధైర్యం ఉందట! ఆపరేషన్ చేయించుకునే వారికే గుండె ధైర్యం లేక పోతున్నారట సార్!
ఈ ఫోటోలోని టాలీవుడ్ స్టార్ హీరో భార్య ఎవరో తెలుసా.. గుర్తు పట్టగలరా?
CSK Vs KKR: ‘ద్రోహి వచ్చేశాడు చూడండి... జీవితం చాలా చిత్రమైనది’
హైకోర్టన్నా లెక్కలేదా? ఇది ధిక్కారమే
ప్రియుడితో వెళ్లిపోయి రీల్స్.. తండ్రి కోపాగ్నికి బలి
ఎవరైనా అతడికి కాస్త మర్యాద నేర్పండి: సెహ్వాగ్‌పై ఫ్యాన్స్ ఫైర్
బోణీ కొట్టిన బంగ్లాదేశ్.. కెప్టెన్ విధ్వంసకర శతకం
కిరాణ కొట్టు కుర్రాడు.. ఒక్క రాత్రిలో కోటీశ్వరుడయ్యాడు!
శివదర్శిని ఫ్యాన్స్ ఇక్కడ : ఒక్క డ్యాన్స్‌కు 10 కోట్లా, వీడియో వైరల్
చైనాకు చేయందించిన బంగ్లా.. షిప్మెంట్ రద్దుతో భారత్ ప్రతీకారం?
వాట్ ఏ వెడ్డింగ్ మెనూ..ఆరోగ్య స్పృహకి అసలైన అర్థం..!
మేం ఉద్యోగం చేయలేం
AP: రియల్.. ఢమాల్
సారీ చెప్పినా సరే!.. ముంబై ఇండియన్స్ స్టార్‌పై ఏడాది నిషేధం
'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' రివ్యూ.. నవ్వులతో మెప్పించారా?
ఐపీఎల్‌కు పోటీగా పాకిస్తాన్ సూపర్ లీగ్.. స్టార్ క్రికెటర్లు వీరే
JEE Mains: విద్యార్థుల్ని పరీక్షకు దూరం చేసిన డిప్యూటీ సీఎం పవన్
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 21 సినిమాలు
ప్లాట్‌ఫామ్స్ మూత.. రైళ్లు మళ్లింపు
IPL 2025: ముదురుతున్న 'ఈడెన్' పిచ్ వివాదం
ఇది తీవ్రమైన ఉల్లంఘనే.. కేంద్రానికి ‘సుప్రీం’ చీవాట్లు
తెలంగాణ పంటల విధానం మారాలి!
Jack Movie Review: ‘జాక్’ మూవీ హిట్టా? ఫట్టా?
నేనలాగే పెరిగాను.. నా కూతురు కూడా అలాగే ఎదగాలి: ఉపాసన
గిల్, సూర్య కాదు!.. టీమిండియా కెప్టెన్, రోహిత్ వారసుడిగా ఊహించని పేరు
విడాకులు.. అయినా తనను వదలను: ప్రభుదేవా మాజీ భార్య
ఓటీటీలో 'ఛావా' సినిమా.. సడెన్ సర్ప్రైజ్
గత ఏడాది కంటే కటాఫ్ తగ్గే చాన్స్
నేడు, రేపు వానలు
జగన్ అద్భుత నాయకుడు
అసలు ఈ సెక్షన్లు ఎలా వర్తిస్తాయి?.. సూళ్లూరుపేట పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
భద్రతలో డొల్లతనం బట్టబయలు
కూటమిపై తిరుగుబాటు మొదలైంది!
ధోనిని కెప్టెన్ చేసినంత మాత్రాన చెన్నై రాత మారిపోదు!
‘గుడ్లు’ తేలేసేలా.. అమెరికాలో డజను కోడిగుడ్లు రూ.536
‘రింగు’ పొడవునా సర్వీసు రోడ్లు!
అర్జున్ సన్నాఫ్ వైజయంతి సెన్సార్ రిపోర్ట్.. సినిమా అలా ఉందట!
సీనియర్ సిటిజన్లకు రూ. 990కే బీమా పాలసీ
అజిత్ కుమార్ యాక్షన్ థ్రిల్లర్.. 'గుడ్ బ్యాడ్ అగ్లీ' ఎలా ఉందంటే?
క్రెడిట్ కార్డ్ బిల్లుల భారం.. ఉందిగా ఉపాయం!
మనవడి కోసం ఏడుపదుల వయసులో వ్యాపారం..! తట్టుకోలేనన్ని కష్టాలు చివరికి..
టార్గెట్ చైనా ఎందుకంటే..!
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ఎంఎస్ ధోని..
పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు
భారతీయులకు అలా జరగాల్సిందే.. హెడ్లీతో రాణా
తండ్రి వైద్యం కోసం ఇళ్ల పనికి వెళ్తున్న కుమార్తె..
#Virat Kohli: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి..
పర్యటించడానికి సాధ్యం కాని దేశాలివే..!
రాణా అప్పగింతపై స్పందించిన అమెరికా
WTC Final: సౌతాఫ్రికాకు ఊహించని షాక్!
న్యూయార్క్‌లో హెలికాప్టర్ ప్రమాదం.. ప్రముఖ కంపెనీ సీఈవో ఫ్యామిలీ మృతి
వెంటనే వెళ్లిపోండి.. లేదంటే రోజుకు రూ. 86 వేలు కట్టండి
'జాట్' ట్విటర్ రివ్యూ.. గోపీచంద్ మలినేని హిట్ కొట్టాడా..?
'ఆ పిల్ల నీకు వదిన అవుద్దిరా'.. ఆసక్తిగా సంపూర్ణేశ్ బాబు సోదరా ట్రైలర్
అమ్మా.. కాసేపు పడుకుంటా! అని శాశ్వత నిద్రలోకి..
టారిఫ్‌ల ఎఫెక్ట్.. ఒక్కసారిగా పెరిగిన బంగారం
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. వ్యాపారాలు విస్తరిస్తారు
విశాఖలో బోర్డు తిప్పేసిన సాఫ్ట్వేర్ కంపెనీ
చైనాకు ట్రంప్ మరో షాక్.. డ్రాగన్‌పై మరోసారి టారిఫ్ విధింపు
కొబ్బరి కాయ చెప్పింది..పైపు లైన్ పగిలింది..
ద్రౌపది చేసిన వంటకమే పానీపూరి.. నేడు లక్షలకోట్ల బిజినెస్..
పెళ్లింట విషాదం.. పెళ్లైన 22 రోజులకే నవ వధువు..
విదేశీ విద్యార్థులను బయటకు పంపేయాలనే కక్షతో మనమే చాలా ఉల్లంఘనలు చేస్తున్నాం సార్
మావోల సంచలన లేఖ.. ములుగు ఎస్పీ రియాక్షన్
ఖరీదైన కార్లు.. విలాసవంతమైన భవనం: శుభ్‌మన్ గిల్ సంపద ఎంతో తెలుసా?
కమెడియన్ సత్య కాళ్లు మొక్కిన రామ్‌చరణ్.. వీడియో వైరల్
వారెవ్వా.. పోలీసు అఫీసర్... తమన్నాను మించి క్రేజ్
‘జాక్’ట్విటర్ రివ్యూ: ‘టిల్లుగాడి’ సినిమాకు ఊహించని టాక్!
ఏపీకి చల్లని కబురు.. వారం రోజుల పాటు వర్షాలు
వరంగల్ మెగా జాబ్ మేళాలో తొక్కిసలాట
సంపూను రోడ్డు మీదకు వదిలేశాడా? సాయి రాజేశ్ ఆన్సరిదే!
ఎండల్లో... కొబ్బరి నీళ్లతో గేమ్స్ వద్దు!
టీడీపీ, జనసేన మధ్య ఏం నడుస్తోంది?
ప్రపంచంలోనే అత్యంత భారీ నౌక.. భారత్‌లోకి..
ఈ యూట్యూబర్.. బిలియనీర్!
సినిమా

రెండోసారి విడాకులు.. నాతో ఎవరూ పనిచేయట్లేదు: నటి ఆవేదన
బాలీవుడ్ నటి చాహత్ ఖన్నా.. రెండుసార్లు పెళ్లి చేసుకోగా రెండుసార్లూ విడాకులే తీసుకుంది. 2006లో భరత్ నర్సింగనిని పెళ్లాడగా నాలుగు నెలలకే విడాకులిచ్చింది. అనంతరం 2013లో ఫర్హాన్ మీర్జాను పెళ్లాడగా 2018లో అతడి దగ్గరా విడాకులు తీసుకుంది. అయితే ఈ విడాకులు తన కెరీర్‌కు అడ్డంకిగా మారాయంటోందీ బ్యూటీ.విడాకులు.. కష్టమేచాహత్ ఖన్నా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రెండోసారి విడాకులు తీసుకున్నప్పుడు ఎంతో కష్టంగా అనిపించింది. ఒక కూతురు నాతో, మరొకరు ఫర్హాన్‌తో ఉంటున్నారు. పిల్లల్ని బాగా చూసుకోవడం మా బాధ్యత. వారి కోసం అప్పుడప్పుడు మేము మాట్లాడుకుంటూ ఉంటాం. ఏదేమైనా విడాకులనేవి మనసును పట్టి పిండేస్తాయి. అదంత ఈజీ కాదు. ఎవరికీ ముఖం చూపించుకోలేము. ఎందుకంటే వాళ్లు ఏదో ఒకటి మాట్లాడి మనల్ని మరింత బాధపెడతారు. అందుకో బయటకు వెళ్లాలంటే కూడా పెద్దగా ఇష్టపడను. భరణం తీసుకోలేఇద్దరు భర్తల దగ్గర ఒక్క రూపాయి కూడా భరణం తీసుకోలేదు. కానీ జనాలు మాత్రం విడాకులు తీసుకుని భరణంగా భారీగా ఆస్తి, బంగారం లాగి ఉంటుంది అంటూ రకరకాలుగా మాట్లాడుతుంటారు. కేవలం భరణంతోనే బతికేస్తున్నానని కూడా అంటుంటారు. అందులో ఆవగింజంత కూడా నిజం లేదు. ఈ విడాకుల వల్ల నాపై నెగెటివిటీ పెరిగింది. చాలామంది నాతో కలిసి పని చేయడానికి కూడా ఇష్టపడలం లేదు. నాతో ఎవరూ పనిచేయరు!మీడియాలో నా వ్యక్తిగత జీవితం గురించి కథలు కథలుగా చెప్పుకుంటుంటే ఎవరు మాత్రం నాతో కలిసి నటించేందుకు ఇష్టపడతారు. పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్‌లు నన్ను పట్టించుకోవు. మీడియాలో నా పేరు మార్మోగిపోతోంది కాబట్టి.. సైడ్ చేస్తున్నాం అని కొందరు నా ముఖం మీదే చెప్పారు అని వాపోయింది. చాహత్.. ద ఫిలిం, థాంక్యూ, ప్రస్థానం, యాత్రిస్ సినిమాలు చేసింది. బుల్లితెరపై కాజల్, ఖుబూల్ హై వంటి సీరియల్స్‌లో నటించింది.చదవండి: గుండు గీయించుకున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుసా?

తేడాకొట్టిన 'జాక్'.. తొలిరోజు కలెక్షన్ ఇంత తక్కువా?
'టిల్లు' సినిమాలతో ఆకట్టుకున్న సిద్ధు.. తాజాగా థియేటర్లలోకి 'జాక్'గా వచ్చాడు. ట్రైలర్ రిలీజైన దగ్గర నుంచి దీనిపై పెద్దగా అంచనాలేం లేవు. అయినా సరే ఏదైనా మ్యాజిక్ జరుగుతుందేమోనని అనుకున్నారు. కానీ అలాంటిదేం లేదు. తొలిరోజు మిక్స్ డ్ రివ్యూస్ రాగా.. రెండో రోజుకి నెగిటివ్ టాక్ వచ్చేసింది. (ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 21 సినిమాలు) హైప్ లేకపోవడంతో తొలిరోజే పెద్దగా ఎవరూ థియేటర్లలోకి రాలేదు. సిద్ధు, 'బేబీ' వైష్ణవి చైతన్య ఉన్న ఉపయోగం లేకుండా పోయింది. కంటెంట్ మరీ తీసికట్టుగా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే మొదటిరోజు చాలా తక్కువ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది.సిద్ధు గత సినిమా 'టిల్లు స్క్వేర్'కి రూ.23 కోట్ల వరకు తొలిరోజు వసూళ్లు రాగా.. 'జాక్' చిత్రానికి మాత్రం రూ.కోటిన్నర నుంచి రూ.2 కోట్ల కలెక్షన్స్ మాత్రమే వచ్చాయని అంటున్నారు. టాక్ ఇలానే ఉంటే గనక వీకెండ్ తర్వాత బాక్సాఫీస్ దగ్గర మూవీ నిలబడటం కష్టమే!(ఇదీ చదవండి: ఎట్టకేలకు క్షమాపణలు చెప్పిన యాంకర్ రవి)

ఈవెంట్లో మాజీ భాయ్ ఫ్రెండ్.. అస్సలు పట్టించుకోని బాలీవుడ్ హీరోయిన్!
బాలీవుడ్ నటి సుస్మితా సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న భామ.. ప్రస్తుతం వెబ్ సిరీస్‌లతో అభిమానులను అలరిస్తోంది. సూపర్ హిట్ సిరీస్ ఆర్యలో నటించింది. అంతేకాకుండా తాళి అనే వెబ్ సిరీస్‌లోనూ మెరిసింది. అయితే ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా కనిపించని సుస్మితా సేన్.. తాజాగా ఓ ఈవెంట్‌కు హాజరైంది. ముంబయిలో జరిగిన ఈ ఈవెంట్లో తన మాజీ భాయ్ ఫ్రెండ్ రోహ్మాన్ షాల్‌తో కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.కాగా.. సుస్మితా సేన్ నటుడు రోహ్మన్ షాల్‌తో డేటింగ్ చేసింది. దాదాపు మూడేళ్ల తర్వాత 2021లో అతనితో బంధానికి గుడ్‌బై చెప్పేసింది. తాజాగా వీరిద్దరు మరోసారి ఓకే ఈవెంట్లో మెరవడంతో బాలీవుడ్లో చర్చ మొదలైంది. ఈ జంట మళ్లీ కలవబోతున్నారా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ఈవెంట్లో రోహ్మాన్ షాల్‌ను సుస్మితాతో ఫోజు ఇవ్వాలని అక్కడున్న వారు అడగడంతో సరదాగా వెనక నిలబడి కెమెరాకు పోజులిచ్చాడు. అయితే సుస్మితా మాత్రం అతన్ని పట్టించుకోకుండా తన స్నేహితులతో మాట్లాడుతూ కనిపించింది.కాగా.. అంతకుముందు ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీతో రిలేషన్లో ఉన్నారని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 2022లో లలిత్ మోడీ సుష్మితా సేన్‌ను తన "బెటర్ హాఫ్"గా పరిచయం చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. ఆ తర్వాత సుస్మితా సేన్ మాట్లాడుతూ అదంతా గతమని కొట్టిపారేసింది. కాగా.. సుష్మితా సేన్.. 2000వ సంవత్సరంలో రెనీ అనే అమ్మాయిని దత్తత తీసుకుంది. 2010లో అలీసాను దత్త తీసుకుని పెంచుకుంటోంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani)

పిరికిపందల్లారా.. ఒళ్లంతా విషం నింపుకుని ఎలా బతుకుతున్నార్రా?: త్రిష
సెలబ్రిటీలను ట్రోల్ (Trolling) చేయడం ఈ మధ్య చాలామందికి ఆటవిడుపుగా మారింది. వారేం చేసినా, చేయకపోయినా.. ప్రతి చిన్నదానికి విమర్శిస్తూనే ఉన్నారు. తాజాగా ఈ ట్రోలింగ్ బ్యాచ్ హీరోయిన్ త్రిష మీద పడ్డారట! ఈమె కథానాయికగా నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాలో ఆమె పాత్ర చూసి కొందరు యావరేజ్‌గా ఉందని పెదవి విరిచారు.అర్థం కావట్లే..అక్కడితో ఆగకుండా తనపై విద్వేషపూరిత కామెంట్లు చేశారు. అవన్నీ చూసి భరించలేకపోయింది త్రిష (Trisha Krishnan). ఇన్స్టాగ్రామ్ వేదికగా ట్రోలర్స్‌కు గడ్డి పెట్టే ప్రయత్నం చేసింది. కొందరు మనుషులకు ఒళ్లంతా విషమే! మీకు నిద్రెలా పడుతుంది? ఇంత హాయిగా ఎలా బతుకుతున్నారో నాకర్థం కావడం లేదు. ఎంతసేపూ సోషల్ మీడియాకు వచ్చి అర్థంపర్థం లేని పనులు చేస్తూ అడ్డదిడ్డంగా పోస్టులు పెట్టమే మీ పనా? అవతలివారిని విమర్శిస్తేగానీ మీకు రోజు గడవదా? మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా భయమేస్తోంది. మీ చుట్టూ ఉన్నవాళ్లు ఎలా బతుకుతున్నారో? ఏంటో? పిరికిపందల్లారా.. ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలని కోరుకుంటున్నాను అని ఇన్స్టాగ్రామ్ స్టోరీ వేదికగా అసహనం వ్యక్తం చేసింది.సినిమా..గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా విషయానికి వస్తే.. అజిత్ హీరోగా నటించిన ఈ సినిమాలో అర్జున్ దాస్, ప్రసన్న, కార్తికేయ దేవ్, ప్రభు, ప్రియ ప్రకాశ్ వారియర్, సునీల్, రాహుల్ దేవ్, రెడిన్ కింగ్స్లీ కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మించింది. జీవీ ప్రకాశ్ సంగీతం అందించాడు. అజిత్‌తో ఇది త్రిషకు ఆరో సినిమా కావడం విశేషం. గతంలో వీరి కాంబినేషన్లో జి, కిరీడం, మంకత, ఎన్నై అరిందల్, విదాముయర్చి సినిమాలు వచ్చాయి.చదవండి: గుండు గీయించుకున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుసా?
న్యూస్ పాడ్‌కాస్ట్

చర్యకు ప్రతి చర్య తప్పదు.. అధికార దురహంకారంతో ప్రవర్తిస్తే ప్రజలు, దేవుడు కచ్చితంగా మొట్టికాయ వేస్తారు... ఏపీ సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి హెచ్చరిక

చైనా మినహా మిగతా దేశాలపై ప్రతీకార సుంకాల అమలు 90 రోజుల పాటు వాయిదా... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన... చైనా ఉత్పత్తులపై 125 శాతం సుంకాలు విధిస్తున్నట్లు స్పష్టీకరణ

మీ కుటుంబానికి అండగా ఉంటాం... పాపిరెడ్డిపల్లిలో లింగమయ్య కుటుంబాన్ని ఓదార్చిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌లో ఆగిన ‘ఆరోగ్యశ్రీ’!. సమ్మెలో నెట్వర్క్ ఆస్పత్రులు

ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్... 3 వేల 500 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించని ప్రభుత్వం... సమ్మె బాటలో ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులు

ఏపీలో ఊరూ వాడా ఏరులై పారుతున్న వైనం. కూటమి నేతల సిండికేట్ కబంధ హస్తాల్లో మద్యం షాపులు.

వక్ఫ్ సవరణ బిల్లుపై ముస్లింలను దగా చేసిన ఏపీ సీఎం చంద్రబాబు... మూడు సవరణలు ప్రతిపాదించామంటూ తెలుగుదేశం పార్టీ గొప్పలు... అవి పసలేని సవరణలేనని మైనార్టీల ఆగ్రహం

తక్షణమే పనులు నిలిపివేయండి కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు

వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం... అనుకూలంగా 288, వ్యతిరేకంగా 232 ఓట్లు... నేడు రాజ్యసభ ముందుకు బిల్లు

నేడు లోక్‌సభ ముందుకు వక్ఫ్ సవరణ బిల్లు... చర్చతోపాటు ఓటింగ్ జరిగే అవకాశం
క్రీడలు

టీ20 అంటేనే పరుగుల వరద.. కానీ: పిచ్ క్యూరేటర్పై డీకే అసంతృప్తి
ఐపీఎల్-2025 (IPL 2025)లో ఫ్రాంఛైజీలు వర్సెస్ క్యూరేటర్లు అన్నట్లుగా వివాదాలు పుట్టుకొస్తున్నాయి. తొలుత కోల్‌కతా నైట్ రైడర్స్ఈడెన్ (KKR) గార్డెన్స్ పిచ్ క్యూరేటర్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేయగా.. ఇప్పుడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) వంతు వచ్చింది. టీ20 క్రికెట్ అంటేనే పరుగుల వరదచిన్నస్వామి స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓటమి తర్వాత ఆర్సీబీ బ్యాటింగ్ కోచ్ దినేశ్ కార్తిక్.. క్యూరేటర్ తీరును విమర్శించాడు. ‘‘టీ20 క్రికెట్ అంటేనే పరుగుల వరద. లీగ్ ప్రచారకర్తలు, అభిమానులకు ఇదే ముఖ్యం. అభిమానులంతా బ్యాటర్లు బౌండరీలు బాదుతుంటే చూడాలని కోరుకుంటారు. ఇక్కడ తొలి రెండు మ్యాచ్‌ల కోసం మేము బ్యాటింగ్‌కు ఎక్కువగా అనుకూలించే పిచ్‌లు రూపొందించమని విజ్ఞప్తి చేశాం. కానీ.. చిన్నస్వామి స్టేడియంలో బ్యాటింగ్ చేయడమే కష్టంగా మారిపోయింది. ఈ పిచ్ బ్యాటర్లకు అంతగా అనుకూలించడం లేదు. ఈ వికెట్‌పై పరుగులు రాబట్టడం సవాలుతో కూడుకున్న పని. మేము ఇక్కడ ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ ఇదే పరిస్థితి.స్ట్రైక్ రొటేట్ చేయడం కూడా కష్టమైపోయింది. ఇక ఇలాంటి చోట భారీ షాట్ ఆడాలంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అయితే, టీ20 క్రికెట్లో షాట్లు బాదితేనే ఆడేవాళ్లకు, చూసేవాళ్లకు మజా. తప్పక చర్చిస్తాంపిచ్ తప్పకుండా మేము క్యూరేటర్‌తో చర్చిస్తాం. ఆయనపై మాకు నమ్మకం ఉంది. మాకోసం అత్యుత్తమ పిచ్ తయారు చేస్తారని ఆశిస్తున్నాం’’ అని దినేశ్ కార్తిక్ పేర్కొన్నాడు.పాటిదార్ నాయకత్వంలో రచ్చ గెలుస్తూ.. ఇంట ఇలాకాగా ఐపీఎల్-2025లో ఆర్సీబీకి కొత్త కెప్టెన్ వచ్చాడు. రజత్ పాటిదార్ నాయకత్వంలో ఆర్సీబీ ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు పూర్తి చేసుకుని మూడు గెలిచింది. అయితే, ఈ మూడూ ఇతర వేదికలపై గెలిచినవే. సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ బెంగళూరు జట్టుకు చేదు అనుభవమే మిగిలింది.తొలుత గుజరాత్ టైటాన్స్ చేతిలో.. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో సొంతగడ్డపై పాటిదార్ సేన ఓటమిపాలైంది. గురువారం నాటి మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ... నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది.రహానే డైరెక్ట్గానేఇక ఢిల్లీ 17.5 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి.. లక్ష్యాన్ని ఛేదించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, కర్ణాటక బ్యాటర్ కేఎల్ రాహుల్ (53 బంతుల్లో 93 నాటౌట్) ఒంటి చేత్తో ఢిల్లీ జట్టును గెలిపించాడు. ఈ నేపథ్యంలో తీవ్ర నిరాశకు గురైన ఆర్సీబీ మేనేజ్మెంట్ ఈ మేరకు పిచ్ క్యూరేటర్‌ను తప్పుబట్టడం గమనార్హం.ఇక కేకేఆర్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. హోం గ్రౌండ్లో కాస్త అడ్వాంటేజీ ఉంటుందనుకుంటే.. అక్కడే డిఫెండింగ్ చాంపియన్‌కు వరుస పరాజయాలు ఎదురవుతున్నాయి. స్పిన్‌కు కాస్త అనుకూలించే పిచ్ తయారు చేయమని అడిగితే..క్యూరేటర్ తమ మాట వినడం లేదంటూ కోల్‌కతా కెప్టెన్ అజింక్య రహానే అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం.చదవండి: RCB Vs DC: ఇదేం కెప్టెన్సీ?.. పాటిదార్‌పై కోహ్లి ఫైర్?!.. డీకేతో చర్చ.. అతడు కెప్టెన్‌తో మాట్లాడాల్సింది! Unbeaten. Unstoppable. Unmatched 🫡History for #DC as they win the first 4⃣ games on the trot for the maiden time ever in #TATAIPL history 💙Scorecard ▶ https://t.co/h5Vb7spAOE#TATAIPL | #RCBvDC | @DelhiCapitals pic.twitter.com/wj9VIrgzVK— IndianPremierLeague (@IPL) April 10, 2025

సారీ చెప్పినా సరే!.. ముంబై ఇండియన్స్ స్టార్‌పై ఏడాది నిషేధం
సౌతాఫ్రికా ఆల్‌రౌండర్, ముంబై ఇండియన్స్ ఆటగాడు కార్బిన్ బాష్ (Corbin Bosch)పై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) నిషేధం విధించింది. పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)లో పాల్గొనకుండా ఏడాది పాటు బ్యాన్ చేసింది. ఇందుకు సంబంధించి పీసీబీ అధికారిక ప్రకటన విడుదల చేసింది.కాగా పీఎస్ఎల్-2025 (IPL 2025) సీజన్‌కు గానూ పెషావర్ జల్మీ ఫ్రాంఛైజీ బాష్‌ను జట్టులోకి తీసుకుంది. దీంతో జట్టుతో అతడు కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు. నిజానికి ఈ ప్రొటిస్ పేసర్ ముందు నుంచి ఐపీఎల్ వైపే మొగ్గు చూపాడు. కానీ మెగా వేలం-2025లో అతడిని ఎవరూ కొనలేదు.అలా అదృష్టం వరించింది..అయితే, సహచర ఆటగాడు లిజాడ్ విలియమ్స్ గాయం కారణంగా ఐపీఎల్-2025కి దూరం కావడంతో.. బాష్‌ను అదృష్టం వరించింది. ముంబై ఇండియన్స్ జట్టు విలియమ్స్ స్థానంలో బాష్‌ను ఎంపిక చేసింది. అయితే, ఐపీఎల్ జరుగుతున్న సమయంలోనే పీఎస్ఎల్ కూడా నిర్వహించాలనే పీసీబీ నిర్ణయం వల్ల బాష్ వంటి విదేశీ ఆటగాళ్లకు ఇబ్బందులు ఎదురయ్యాయి.ఐపీఎల్ లేదంటే పీఎస్ఎల్.. ఈ రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే ఆడేందుకు వీలు పడుతుంది.. కాబట్టి సహజంగానే డబ్బుకు డబ్బు.. పేరుకు పేరు వచ్చే ఐపీఎల్‌కే ఓటు వేసిన బాష్.. పీఎస్ఎల్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. ఈ నేపథ్యంలో అతడికి పీసీబీ నోటీసులు జారీ చేసింది.సారీ.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాఇందుకు బదులుగా.. ‘‘విజయవంతమైన, వివిధ దేశాల టీ20 లీగ్‌లలో భాగమైన ముంబై ఇండియన్స్ వంటి మేటి ఫ్రాంఛైజీ ఆఫర్‌ను కాదంటే.. నాకు భవిష్యత్తులో మళ్లీ ఈ అవకాశం రాకపోవచ్చు. అందుకే పెషావర్ జల్మీ నుంచి వైదొలిగాను’’ అని బాష్ వివరణ ఇచ్చాడు. అయితే, పీసీబీ మాత్రం అతడిపై ఏడాది పాటు వేటు వేస్తూ నిర్ణయం తసీఉకుంది.‘‘ఈ ఆల్‌రౌండర్‌పై ఏడాది కాలం నిషేధం విధిస్తున్నాం. వచ్చే ఏడాది పాకిస్తాన్ సూపర్ లీగ్ సెలక్షన్‌కు అతడు అర్హత పొందలేడు’’ అని పీసీబీ తమ ప్రకటనలో పేర్కొంది. కాగా లీగల్ నోటీసులు అందుకున్న సమయంలోనే బాష్.. ‘‘నా నిర్ణయం పట్ల నాకూ పశ్చాత్తాపంగానే ఉంది. అందుకే పాకిస్తాన్ ప్రజలకు, పెషావర్ జల్మీ అభిమానులకు క్షమాపణలు చెబుతున్నా.నా చర్యల వల్ల మీ మనసు బాధపడి ఉంటుందని తెలుసు. అయితే, నా భవిష్యత్తు గురించి కూడా ఆలోచించుకోవాలి. త్వరలోనే పీఎస్ఎల్లో పునరాగమనం చేసేందుకు ఎదురుచూస్తున్నా’’ అని బహిరంగంగానే క్షమాపణలు చెప్పాడు. కానీ పీసీబీ మాత్రం ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం.కాగా ఏప్రిల్ 11 నుంచి పీఎస్ఎల్ ప్రారంభం కానుంది. కాగా ఐపీఎల్లో 30 ఏళ్ల బాష్ ఇంతవరకు అరంగేట్రం చేయలేదు. లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్ సందర్భంగా మాత్రం సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా వచ్చి రిషభ్ పంత్ క్యాచ్ అందుకున్నాడు. అయితే, సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో అతడు ముంబైకి ఆడుతుండటం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2025లో ముంబై ఇప్పటికి ఐదు మ్యాచ్‌లు ఆడి కేవలం ఒకటే గెలిచింది.చదవండి: CSK Vs KKR: ‘ద్రోహి వచ్చేశాడు చూడండి... జీవితం చాలా చిత్రమైనది’

CSK Vs KKR: ‘ద్రోహి వచ్చేశాడు చూడండి... జీవితం చాలా చిత్రమైనది’
ఐపీఎల్-2025 (IPL 2025)లో వరుస పరాజయాలతో చతికిల పడ్డ చెన్నై సూపర్ కింగ్స్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) మరోసారి నాయకుడిగా వ్యవహరించనున్నాడు.కోల్‌కతా నైట్ రైడర్స్‌తో శుక్రవారం జరిగే మ్యాచ్ సందర్భంగా ధోని సీఎస్కే తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకోనున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పటికే సొంత మైదానం చెపాక్‌లో సీఎస్కే ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో తలమునకలయ్యారు. ఇక ధోని సైతం నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తూ తీవ్రంగా శ్రమించాడు.ఆ సమయంలో కేకేఆర్ మెంటార్ డ్వేన్ బ్రావో మైదానంలోకి వచ్చి సీఎస్కే ఆటగాళ్లను పలకరించాడు. ఈ క్రమంలో రవీంద్ర జడేజా అతడికి ఎదురువెళ్లి ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నాడు. ద్రోహి వచ్చేశాడు చూడండిఇంతలో నెట్స్‌లో ఉన్న ధోని మాత్రం.. బ్రావోను చూసి.. ‘‘ఇదిగో.. ద్రోహి వచ్చేశాడు చూడండి’’ అంటూ తనదైన శైలిలో స్వాగతం పలికాడు. ఇందుకు.. ‘‘జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు.. చాలా చిత్రమైనది’’ అని బ్రావో బదులిచ్చాడు. నవ్వుతూ వెళ్లి ధోని హగ్ చేసుకున్నాడు. ఆ వైబ్‌ను మిస్సవుతున్నాంఇందుకు సంబంధించిన వీడియోను సీఎస్కే సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘‘ఎంఎస్- డీజే.. ఆ వైబ్‌ను మిస్సవుతున్నాం’’ అంటూ క్యాప్షన్ జతచేసింది. ఇక ఈ వీడియోను చూసి సీఎస్కే అభిమానులు సైతం భావోద్వేగానికి గురవుతున్నారు. బ్రావో చెన్నై ఫ్రాంఛైజీని వీడి వెళ్తాడని అస్సలు ఊహించలేదంటూ కామెంట్లు చేస్తున్నారు.సీఎస్కేతో సుదీర్ఘ బంధంకాగా వెస్టిండీస్‌కు చెందిన డ్వేన్ బ్రావో 2011- 2015 వరకు చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఆ తర్వాత మళ్లీ 2018- 2022 మధ్య కాలంలో ఈ కరేబియన్ ఆల్‌రౌండర్ సీఎస్కేకు ఆడాడు. 2011, 2018, 2021, 2022లో ట్రోఫీ గెలిచిన చెన్నై జట్టులో అతడు సభ్యుడిగా ఉన్నాడు.అంతేకాదు.. ఆటగాడిగా రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత బ్రావో 2023లో బౌలింగ్ కోచ్‌గా చెన్నై జట్టుకు సేవలు అందించాడు. ఈ నేపథ్యంలో చెన్నై ముఖచిత్రం, కర్త, కర్మ, క్రియ అయిన ధోనితో బ్రావోకు విడదీయలేని అనుబంధం ఏర్పడింది. అయితే, 2025 సీజన్ ఆరంభానికి ముందు పరిస్థితులు మారిపోయాయి.గౌతం గంభీర్ స్థానంలోసీఎస్కేను వీడిన తర్వాత బ్రావో.. కేకేఆర్ ఫ్రాంఛైజీతో జట్టుకట్టాడు. గౌతం గంభీర్ స్థానంలో డిఫెండింగ్ చాంపియన్ మెంటార్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఇక సీఎస్కే- కేకేఆర్ మధ్య శుక్రవారం మ్యాచ్ నేపథ్యంలో చెన్నై ఆటగాళ్లను కలవగా ధోని ఇలా సరదాగా స్పందించడం విశేషం.కాగా 41 ఏళ్ల పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ బ్రావో ఐపీఎల్లో 161 మ్యాచ్‌లు ఆడి 183 వికెట్లు తీశాడు. అదే విధంగా.. 1560 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు అర్ధ శతకాలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2025లో కేకేఆర్ అజింక్య రహానే కెప్టెన్సీలో ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడి కేవలం రెండే గెలిచింది. మరోవైపు.. సీఎస్కే ఆడిన ఐదింట.. గత నాలుగు మ్యాచ్‌లలోనూ ఓటమిపాలైంది.చదవండి: RCB Vs DC: ఇదేం కెప్టెన్సీ?.. పాటిదార్‌పై కోహ్లి ఫైర్?!.. డీకేతో చర్చ.. అతడు కెప్టెన్‌తో మాట్లాడాల్సింది!MS🫂DJ : MISS THIS VIBE! 💛✨#WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/IlSd876zes— Chennai Super Kings (@ChennaiIPL) April 11, 2025

ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు.. మా ఓటమికి ప్రధాన కారణం అదే: పాటిదార్
రచ్చ గెలుస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) ఇంట మాత్రం మరోసారి పరాభవం ఎదుర్కొంది. సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఆరు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. తద్వారా ఈ సీజన్లో హోం గ్రౌండ్లో రెండో ఓటమిని నమోదు చేసింది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ (Rajat Patidar) విచారం వ్యక్తం చేశాడు.ఓవర్ కాన్ఫిడెన్స్ కాదుఢిల్లీ చేతిలో ఓటమి అనంతరం స్పందిస్తూ.. ‘‘వికెట్ ఎప్పటికప్పుడు మారిపోయినట్లుగా అనిపించింది. నిజానికి ఇది బ్యాటింగ్ చేసేందుకు అనుకూలమైన పిచ్. కానీ మేమే సరిగ్గా బ్యాటింగ్ చేయలేకపోయాం.మా జట్టులోని ప్రతి బ్యాటర్ కసితోనే ఆడతారు. వాళ్లది ఆత్మవిశ్వాసమే తప్ప.. ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. అయితే, ఈరోజు 80/1 స్కోరు నుంచి 90/4కు పడిపోవటమన్నది ఎంత మాత్రం ఆమోదయోగ్యనీయం కాదు.మా బ్యాటింగ్ లైనప్ పటిష్టమైనది. కానీ మేము ఈరోజు పరిస్థితులను సరిగ్గా అంచనా వేయలేకపోయాం. అయితే, ఆఖర్లో టిమ్ డేవిడ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడటం మాకు కాస్త ఊరట కలిగించే అంశం.మా ఓటమికి కారణం అదేఇక ఢిల్లీ ఇన్నింగ్స్ పవర్ ప్లేలో మా బౌలర్లు ఆడిన విధానం అద్భుతం. మాకు అది ఎంతో ప్రత్యేకమైనది. సొంత మైదానంలో కాకుండా వేరే మైదానాల్లోనే గెలుస్తామన్న అభిప్రాయాలతో మాకు పనిలేదు.వేదిక ఏదైనా విజయమే లక్ష్యంగా మేము బరిలోకి దిగుతాం’’ అని రజత్ పాటిదార్ చెప్పుకొచ్చాడు. తమ ఓటమికి ప్రధాన కారణం బ్యాటర్ల వైఫల్యమేనని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2025లో భాగంగా ఆర్సీబీ గురువారం ఢిల్లీతో తలపడింది.బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ.. ఆర్సీబీని తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (17 బంతుల్లో 37), విరాట్ కోహ్లి (14 బంతుల్లో 22) రాణించగా.. వన్‌డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ (1) విఫలమయ్యాడు.రజత్ పాటిదార్ (23 బంతుల్లో 25) ఫర్వాలేదనిపించగా.. లియామ్ లివింగ్‌స్టోన్ (4), జితేశ శర్మ (3) నిరాశపరిచారు. ఆఖర్లో కృనాల్ పాండ్యా (18 బంతుల్లో 18) నిలదొక్కుకునే ప్రయత్నం చేసి విఫలం కాగా.. టిమ్ డేవిడ్ (20 బంతుల్లో 37 నాటౌట్) వేగంగా ఆడి స్కోరు 163 పరుగుల మార్కుకు తీసుకువచ్చాడు.పవర్ ప్లేలో మూడు వికెట్లు.. కానీఇక లక్ష్య ఛేదనలో ఆరంభంలోనే ఢిల్లీకి వరుస షాకులు తగిలాయి. ఓపెనర్లలో ఫాఫ్ డుప్లెసిస్ (2)ను యశ్ దయాళ్, జేక్ ఫ్రేజర్ మెగర్క్(7)ను భువనేశ్వర్ కుమార్ వచ్చీ రాగానే పెవిలియన్‌కు పంపారు. వన్‌డౌన్ బ్యాటర్ అభిషేక్ పోరెల్ (7)ను కూడా భువీ వెనక్కి పంపి మంచి బ్రేక్ ఇచ్చాడు.రాహుల్ రఫ్పాడించాడుఅయితే, కేఎల్ రాహుల్ విజృంభణతో అంతా తలకిందులైంది. నెమ్మదిగా మొదలుపెట్టిన ఈ లోకల్ బ్యాటర్.. మధ్య ఓవర్లలో దూకుడు పెంచాడు. మొత్తంగా 53 బంతుల్లో ఏడు ఫోర్లు, ఆరు సిక్స్‌ల సాయంతో 93 పరుగులతో అజేయంగా నిలిచి ఢిల్లీని గెలుపుతీరాలకు చేర్చాడు. అతడికి తోడుగా ట్రిస్టన్ స్టబ్స్ (23 బంతుల్లో 38 నాటౌట్) రాణించాడు. ఈ క్రమంలో 17.5 ఓవర్లలో 169 పరుగులు సాధించిన ఢిల్లీ.. ఆర్సీబీపై ఆరు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. అక్షర్ సేనకు ఈ సీజన్లో వరుసగా ఇది నాలుగో విజయం కాగా.. ఆర్సీబీ ఐదు మ్యాచ్‌లలో మూడు గెలవగలిగింది.ఐపీఎల్-2025: బెంగళూరు వర్సెస్ ఢిల్లీ👉టాస్: ఢిల్లీ.. మొదట బౌలింగ్👉ఆర్సీబీ స్కోరు: 163/7 (20)👉ఢిల్లీ స్కోరు: 169/4 (17.5)👉ఫలితం: బెంగళూరుపై ఆరు వికెట్ల తేడాతో ఢిల్లీ గెలుపు.చదవండి: RCB Vs DC: ఇదేం కెప్టెన్సీ?.. పాటిదార్‌పై కోహ్లి ఫైర్?!.. డీకేతో చర్చ.. అతడు కెప్టెన్‌తో మాట్లాడాల్సింది! POV: It's his home ground 😎🏡#TATAIPL | #RCBvDC | @klrahul | @DelhiCapitals pic.twitter.com/kV7utADWjU— IndianPremierLeague (@IPL) April 10, 2025
బిజినెస్

భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు శుక్రవారం భారీ లాభాలతో ముగిశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా మినహా చాలా దేశాలపై వాణిజ్య సుంకాలకు 90 రోజుల విరామం ప్రకటించిన తరువాత మిశ్రమ ఆసియా ధోరణుల మధ్య భారత ఈక్విటీ మార్కెట్లు భారీ ర్యాలీని చూశాయి.బీఎస్ఈ సెన్సెక్స్ 1310.11 పాయింట్లు (1.77 శాతం) లాభపడి 75,157.26 వద్ద స్థిరపడగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 429.40 పాయింట్లు లేదా 1.92 శాతం పెరిగి 22,828.55 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 షేర్లలో 47 షేర్లు లాభాల్లో ముగియగా, హిందాల్కో 6.52 శాతం, టాటా స్టీల్ 4.84 శాతం, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 4.81 శాతం, కోల్ ఇండియా 4.51 శాతం, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ 4.43 శాతం లాభాలతో టాప్ గెయినర్లుగా ఉన్నాయి.విస్తృత మార్కెట్లలో బీఎస్ఈ మిడ్ క్యాప్ 1.84 శాతం, స్మాల్ క్యాప్ 3.04 శాతం పెరిగాయి. రంగాలవారీగా చూస్తే అన్ని రంగాల సూచీలు లాభాల్లో స్థిరపడ్డాయి. అత్యధికంగా నిఫ్టీ మెటల్, ఎనర్జీ, ఫార్మా, ఆటో, బ్యాంక్ 4.09 శాతం వరకు లాభపడ్డాయి. అమెరికా వస్తువులపై సుంకాలను శనివారం నుంచి 125 శాతానికి పెంచుతున్నట్లు చైనా ప్రకటించిన నేపథ్యంలో వాణిజ్య యుద్ధ ఉద్రిక్తతలు పెరగడంతో జపాన్ కు చెందిన నిక్కీ 225, దక్షిణ కొరియాకు చెందిన కోస్పీ, సింగపూర్ కు చెందిన స్ట్రెయిట్స్ టైమ్స్ సహా ఆసియా మార్కెట్ల సూచీలు నష్టాలలో ముగిశాయి. అంతకు ముందు చైనా దిగుమతులపై సుంకాన్ని 145 శాతానికి పెంచుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు.

టెస్లా కొత్త సైబర్‌ట్రక్ విడుదల.. ధర ఎంతంటే..
ప్రముఖ అమెరికా ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా యూఎస్‌లో కొత్త సైబర్‌ట్రక్ వెర్షన్‌ను విడుదల చేసింది. దీని ప్రారంభ ధరను 69,990 అమెరికన్ డాలర్లుగా(రూ.59 లక్షలు) నిర్ణయించింది. ఇది ప్రస్తుతం అందుబాటులో ఉన్న మూడు సైబర్‌ట్రక్ మోడళ్లలో చౌకైనదిగా కంపెనీ పేర్కొంది. కొత్త సైబర్‌ట్రక్ వేరియంట్‌కు సంబంధించిన రేంజ్, టోవింగ్ సామర్థ్యం, యాక్సిలరేషన్ వంటి స్పెసిఫికేషన్లపై కచ్చితమైన వివరాలు వెల్లడించలేదు.అమెరికాలో 69,990 డాలర్ల ధరతో ఎంట్రీ లెవల్ సైబర్‌ట్రక్ యూఎస్ మార్కెట్లో ఆదరణ పొందుతున్న ఫోర్డ్ ఎఫ్-150 లైటనింగ్, రివియన్ ఆర్ 1 టీ వంటి ఇతర ఎలక్ట్రిక్ మోడళ్లతో పోటీ పడుతుందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. స్టెయిన్లెస్ స్టీల్ ఎక్సోస్కెలెటన్, ఆర్మర్డ్ గ్లాస్, అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సామర్థ్యాలు సైబర్‌ట్రక్‌లో ఉన్నాయని కంపెనీ తెలిపింది.ఇదీ చదవండి: 'ఎవరూ తప్పించుకోలేరు.. నేనే రెండుసార్లు ఫైన్ కట్టాను'ఈవీ విభాగంలో టెస్లా ఆధిపత్యాన్ని కొనసాగించడానికి కంపెనీ కొంత కాలంగా ఒత్తిడిని ఎదుర్కొంటోంది. దీనికి తోడు ఆర్థిక అనిశ్చితి, ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ హెచ్చుతగ్గులుండడం వాహన తయారీదారులు ధరలకు సంబంధించి పునరాలోచనలో పడేలా చేశాయి. ఈ నేపథ్యంలో టెస్లా తీసుకున్న నిర్ణయం వినియోగదారులు మరింత సరసమైన ధరలకు కార్లను కొనుగోలు చేసేలా ప్రోత్సహిస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

'ఎవరూ తప్పించుకోలేరు.. నేనే రెండుసార్లు ఫైన్ కట్టాను'
భారతదేశంలో ట్రాఫిక్ రూల్స్ కఠినంగా మారుతున్నాయి. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన ఎవరికైనా జరిమానా తప్పదు, అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. నేను కూడా ముంబైలో రెండు సార్లు ఫైన్ కట్టానని రైజింగ్ భారత్ సమ్మిట్ 2025 కార్యక్రమంలో వెల్లడించారు.ఇప్పుడు హైవేలమీద అత్యాధునిక కెమెరాలు, సెన్సార్లు ఉన్నాయి. ఎవరూ తప్పించుకోలేదు. మిమ్మల్ని ఎవరూ రక్షించలేరు. కెమెరా ఫోటో తీస్తుంది. జరిమానా తప్పకుండా కట్టాల్సిందే. కఠినమైన ట్రాఫిక్ చలాన్లపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. జరిమానాలు ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో ప్రవేశపెట్టలేదు. చట్టానికి కట్టుబడి ఉండటానికి తీసుకొచ్చాము. జరిమానాలు పెరిగాయని ప్రజలు అంటున్నారు.. అలాంటప్పుడు నిబంధనలను ఉల్లంఘించకుండా ఉండే సరిపోతుందని గడ్కరీ అన్నారు.ప్రభుత్వం 2019లో మోటారు వాహన చట్టాన్ని సవరించింది. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించడం, రవాణా నియమాల ఉల్లంఘనలు పెరగడం వల్ల.. రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కాబట్టి ట్రాఫిక్ ఉల్లంఘనలు తగ్గించడానికి ప్రధాన మార్గం అధిక జరిమానాలు విధించడమే. 2019లో రోడ్డు ప్రమాదం వల్ల మరణించినవారి సంఖ్య సుమారు 1.59 లక్షలు, ఈ సంఖ్య 2022 నాటికి 1.68 లక్షలకు చేరింది. కాబట్టి నియమాలంయు మరింత కఠినతరం చేయకపోతే.. మరణాల సంఖ్య నానాటికి గణనీయంగా పెరిగిపోతుందని గడ్కరీ అన్నారు.గత సంవత్సరం.. ట్రాఫిక్ ఉల్లంఘనలను పర్యవేక్షించడానికి, జరిమానాలు విధించడానికి కృత్రిమ మేధస్సుతో పాటు.. ఇతర సాంకేతిక టెక్నాలజీని ఉపయోగించాలని గడ్కరీ పేర్కొన్నారు. ఇవన్నీ ఎప్పటికప్పుడు రూల్స్ అతిక్రమించినవారిని గుర్తించడంలో సహాయపడతాయి. తద్వారా దేశంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.#RisingBharatSummit2025 | Topics which are good for the society should be propagated, irrelevant topics must be completely neglected: Union Minister @nitin_gadkari@KishoreAjwani | #Nagpur #AurangzebControversy #Maharashtra pic.twitter.com/bAVslfIOJl— News18 (@CNNnews18) April 8, 2025

అదృష్టమంటే ఇదే.. ఒకేసారి రెండు లాటరీలు.. ఊహించనంత డబ్బు!
ఎవరికైనా జీవితంలో ఒకసారి లాటరీ తగిలితేనే వాళ్ళు చాలా అదృష్టవంతులు అని చెబుతారు. అలాంటిది ఒకేసారి రెండు లాటరీలు తగిలితే.. వాళ్ళను ఏమనాలి. ఇలాంటి ఘటన ఎక్కడైనా జరుగుతుందా అని మీరు అనుకోవచ్చు. కానీ అమెరికాలోని నార్త్ కరోలినాలో ఇలాంటి సంఘటన వెలుగులోకి వచ్చింది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.నార్త్ కరోలినాలోని ఒక వ్యక్తి అప్పటికే గెలుపొందిన లాటరీ బహుమతి రూ. 40 లక్షలు క్లెయిమ్ చేసుకోవడానికి.. గ్రీన్స్బోరో రీజినల్ ఆఫీస్ & క్లెయిమ్ సెంటర్‌కు వచ్చాడు. ఆ సమయంలో తన కుమార్తె.. అతని పుట్టినరోజును గుర్తుగా ఒక కెనో టికెట్ కొనుగోలు చేసింది. లాటరీలో ఆ టికెట్టుకు సుమారు రూ. 86 లక్షలు వచ్చాయి. ఇలా ఒకేరోజు రెండు లాటరీలు తగిలాయి. ఊహకందని డబ్బు చేతికి రావడంతో ఆ వ్యక్తి, అతని కుటుంబం సంతోషంలో మునిగిపోయింది.ఒక అమెరికన్ వ్యక్తి లాటరీలో భారీ మొత్తంలో డబ్బు గెలుచుకోవడం ఇదే మొదటిసారి కాదు. ఫిబ్రవరిలో కూడా నార్త్ కరోలినాలోని స్టాన్లీకి చెందిన విజేత రాబర్ట్ హోబన్ అనే వ్యక్తి లాటరీ టికెట్ ద్వారా రూ. 95 లక్షల కంటే ఎక్కువ గెలుచుకున్నాడు. ఇతడు లాటరీ టికెట్ కొనుగోలు చేసిన తరువాత, ఆ రాత్రి లాటరీ గెలుచుకున్నట్లు కలగన్నాడు. ఆ కల ఉదయానికి నిజమైంది. కలలో చూసిన మొత్తానికి అతడు గెలుచుకున్నాడు.గమనిక: లాటరీ టికెట్స్ పేరుతో చాలా మోసాలు జరుగుతున్నాయి. కాబట్టి లాటరీ టికెట్స్ కొనుగోలు చేయాలంటే.. తప్పకుండా నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది. పాఠకులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. లేకుంటే మోసపోయే అవకాశం ఉంది.
ఫ్యామిలీ

వేగాన్ వర్సెస్ నాన్‌వెజ్ డైట్: ఈ ట్విన్స్ ప్రయోగంలో ఏ డైట్ మంచిదంటే..?
ఇటీవల కాలంలో ఆరోగ్య స్పృహ ఎక్కువైంది. సోషల్‌మీడియా పుణ్యామా..? అని రకరకాల డైట్లు కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్నాయి. ఏది మంచిది అని డిసైడ్ చేసుకోలేని కన్ఫూజన్లో పడేసేలా ఊదరగొడుతున్నాయి. అయితే ఆ సమస్యకు చెక్‌పెట్టేలా ఈ ఇద్దరు కవలలు ఓ ప్రయోగానికి పూనుకున్నారు. అచ్చుగుద్దినట్లు ఒకేలా ఉండే ఈ కవల సోదరులు వేగాన్ వర్సెస్ నాన్‌వెజ్ డైట్లో ఏది బెటర్ అనే దాని గురించి తమ శరీరాలపై తామే ప్రయోగాలు చేసుకున్నారు. అంతేగాదు ఇద్దరూ ఏ డైట్ ఆరోగ్యకరమైనదో వైద్యపరంగా నిర్థారించి మరీ చెప్పారు.యూకేలోని డెవాన్లోని ఓ గ్రామానికి చెందిన రాస్, హ్యూగో టర్నోర్ అనే కవలలు ఇద్దరూ చూడటానికి ఒకేలా ఉంటారు. ఈ ఇద్దరు ఆహారం, ఫిట్నెస్కి సంబంధించి పలు ప్రయోగాలు చేస్తుంటారు. ఆ క్రమంలోనే ఈసారి మొక్కల ఆధారిత వర్సెస్ జంతువుల ఆధారిత డైట్లలో ఏది ఆరోగ్యానికి మంచి ఫలితాలనిస్తుంది దాని గురించి తమపైనే ప్రయోగాలు చేసుకుని మరీ నిర్థారించి చెప్పారు. అందుకోసం ఆరు నెలలపాటు ఈ 36 ఏళ్ల కవలలు దాదాపు ఒకేలాంటి జీవనశైలిని అనుసరించారు. అయితే తీసుకునే ఆహారంలోనే వ్యత్యాసం ఉంటుంది. హ్యూగో సముద్రపు ఆల్గే , మొక్కల ఆధారిత ఒమేగా 3 నూనెలు, మొక్కల ఆధారిత సప్లిమెంట్లు తదితరాలు తీసుకున్నాడు. రాస్ సాంప్రదాయ జంతు ఆధారిత విటమిన్లు తీసుకున్నాడు. అయితే ఆరు నెలల తదనంతరం ఇరువురిలో అద్భుతమైన మార్పులు, ఫలితాలు కనిపించాయి. ఇక్కడ హ్యూగో రక్తం పోషకాలతో కనిపించింది. కీలకమైన విటమిన్లు డీ3, కొవ్వు ఆమ్లాలు సమస్థాయిలో ఉన్నాయి. ఇక రాస్ తీసుకున్న నాన్ వెజ్ ప్రోటీన్లకు మించి హ్యగో శరీరంలో మెరుగైన స్థాయిలో విటమిన్లు ఉన్నాయి. వారిద్దరూ కూడా ఈ డైట్లలో ఇంత తేడా ఉంటుందని అనుకోలేదట. రక్తపరీక్షల్లో హ్యూగో ఫలితాలు మెరుగ్గా ఉన్నట్లు తేలింది. ముఖ్యంగా ఒమేగా-3, విటమిన్ D3 పుష్కలంగా ఉన్నాయి హ్యూగో బాడీలో. కేవలం రక్తపరీక్షలే గాక, కొవ్వులు, ఆమ్లలాల స్థాయిలతో సహా ప్రతీది ట్రాక్ చేశారు. అయితే ఈ డైట్లలో మొక్కల ఆధారిత వెర్షన్ మెరుగైన ఫలితాలనిచ్చింది. రాస్ తిన్న సాల్మన్ చేపల కంటే సముద్రపు పాచి సప్లిమెంట్లోనే విటమిన్ డీస్థాయిలు, మంచిరోగ నిరోధక శక్తిని హ్యూగోకి అందించాయి. అంతేగాదు శాకాహారం శరీరంలో కొవ్వుని తగ్గించి మెరుగైన శక్తి స్థాయిలను ప్రోత్సహించదని తేలింది. ఇలాంటి ప్రయోగాలు ఆ కవలలకు తొలిసారి కాదు. గతంలో అధిక కార్బ్ వర్సెస్ అధిక కొవ్వు ఆహారాలలో ఏది మంచిదో తెలుసుకోవాలని ప్రయోగాలు చేశారు కూడా. దానిలో రాస్ పాస్తా, బియ్యం వంటి కార్బొహైడ్రేట్లు తీసుకోగా, హ్యూగో గుడ్లు, వెన్న వంటి వాటిని తీసుకున్నారు. అయితే రాస్ కొలస్ట్రాల్‌ని కోల్పోగా, హ్యూగో మిశ్రమ ఫలితాలు అందుకున్నారు. పైగా అందులో ప్రమాదకరమైన చెడెకొలెస్ట్రాల్ స్థాయిలు కూడా ఉన్నాయి. చివరగా ఈ కవల ఫిట్నెస్ ప్రయోగాల వల్ల మొక్కల ఆధారిత సప్లిమెంట్స్ ప్రయోజనాలు హైలెట్ చేయడమే గాక సాంప్రదాయ పోషకాహారం గురించి చాలకాలం నుంచి ఉన్న అపోహలు కూడా తుడిచిపెట్టుకుపోయాయి. అంతేగాదు మన ఆరోగ్యంలో ఆహారం ఎంత కీలకపాత్ర పోషిస్తుందని అనేది తేటతెల్లమైంది కూడా. View this post on Instagram A post shared by 𝗧𝗛𝗘 𝗧𝗨𝗥𝗡𝗘𝗥 𝗧𝗪𝗜𝗡𝗦 (@theturnertwiins) (చదవండి: పీరియడ్స్ వచ్చి వెయ్యి రోజులు.. అయినా తగ్గలేదు.. వైద్యులకే అంతుచిక్కని మిస్టరీ..!)

వెయ్యి రోజులకు పైగా పీరియడ్స్..వైద్యులకే అంతుచిక్కని మిస్టరీ..!
సాధారణంగా మహిళలకు రుతుక్రమం నెలలో ప్రతి 27 నుంచి 35 రోజుల్లో వస్తుంది. ఇలా వస్తే ఆరోగ్యంగా ఉన్నట్లుగా పరిణిస్తారు వైద్యులు. కొందరికి హార్మోన్ల ప్రాబ్లం వల్ల రెండు నెలలకొకసారి లేదా ఇర్ రెగ్యులర్ పీరియడ్స్ సమస్యతో బాధపడతారు. ఇది ప్రస్తుత జీవన విధానం, శారీరక శ్రమ లేని ఉద్యోగాలు, కాలుష్యం తదితరాల కారణంగా చాలామంది టీనేజర్లు, మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇది. ఐతే ఈ మహిళకు మాత్రం మూడేళ్లకు పైగా నిరంతరం రక్తస్రావం(లాంగ్ పీరియడ్ సైకిల్) కొనసాగుతోంది . దాని కారణంగా ఆమె దారుణమైన శారీరక మానసిక సమస్యలతో నరకం అనుభవిస్తోంది. అసలు జీవితంలో ఒక్కసారైనా ఆ ఎరుపురంగుని చూడని రోజు ఉంటుందా..? అని కన్నీరుమున్నీరుగా విలపిస్తోందామె.అమెరికాకు చెందిన టిక్‌టాక్ యూజర్ పాపీ వెయ్యి రోజులకు పైగా కొనసాగిన అసాధారణ సుదీర్ఘ రుతుక్రమం బాధను షేర్ చేసుకున్నారు. తాను వైద్యులను సంప్రదించినప్పటికీ..అది ఓ మిస్టరీలానే మిగిలపోయిందని వాపోయింది. ప్రతి మహిళలకు సాధారణంగా ప్రతి 21 నుంచి 35 రోజులకు ఒకసారి రుతక్రమం వస్తుంది. రెండు నుంచి ఏడు రోజుల వరకే రక్తస్రావం అవుతుంది. కొందరికి జీవనశైలి, ఒత్తిడి, తగిన వ్యాయమాం లేకపోవడం వల్ల ఇర్రెగ్యులర్గా వచ్చిన మహా అయితే ఓ 15 నుంచి 20 రోజుల అవుతుందేమో. అది కూడా కొందరికే. ఇది సాధరణమైన సమస్యే. అయితే వారి ఆరోగ్య సమస్యల ఆధారంగా వైద్యుడిని సంప్రదించాల్సిన అవసరం ఏర్పడుతుంది అంతే. కానీ పాపీకు మాత్రం వెయ్యి రోజులకు పైగా ఆ రక్తస్రావం(పీరియడ్) కొనసాగుతోందట. అంటే దగ్గర దగ్గర మూడు సంవత్సరాల రెండు వారాలు కొనసాగుతుందట రక్తస్రావం. వైద్యుల సైతం ఆమె పరిస్థితి చూసి ఖంగుతిన్నారట. ఆమె పలు వైద్య పరీక్షలు చేసి ఎందుకు ఇలా జరుగుతుందో కనుగొనే యత్నం చేశారు. అండాశయంపై తిత్తులు ఉన్నట్టు గుర్తించారు గానీ, దానివల్ల ఇంతలా రక్తస్రావం జరగదనే చెబుతున్నారు వైద్యులు. మరేంటి కారణం అనేది అంతుపట్టడం లేదు వైద్యులకు. దీనికారణంగా పాపీ ఐరన్ విటమిన్‌ని అధిక స్థాయిలో కోల్పోయి తిమ్మిర్లు, కండరాలు, ఎముకల సమస్యలతో విలవిలలాడుతున్నట్లు తెలిపారు. అయితే ఆమెకు పీసీఓసీ ఉందని నిర్థారణ అయ్యినప్పటికీ..ఇంతలా రక్తస్రావం జరగడానికి ప్రధాన కారణం ఏంటన్నది నిర్థారించలేకపోయారు. చివరికి హిస్టెరోస్కోపీ నిర్వహించారు, గర్భ నిరోధక ఐయూడీని కూడా చొప్పించారు. ఇవేమీ ఆ సమస్యకు ఉపశమనం కలిగించలేదు. ఇలా ఎన్నో వైద్యపరీక్షలు, వివిధ చికిత్సలు, మందులు తీసుకున్నప్పటికీ తీవ్ర రక్తస్రావం సమస్యను అరికట్టలేదు. అల్ట్రాసౌండ్, ఎంఆర్ఐ వంటి స్కానింగ్‌లలో సైతం కారణం ఏంటన్నది చూపించలేకపోయాయి. చివరికి తన టిక్‌టాక్ ఫాలోవర్స్ సాయంతో తన సమస్యకు గల కారణాన్ని తెలుసుకుని నివ్వెరపోయింది.ఇంతకీ ఎందువల్ల అంటే..ఆమెకు బైకార్న్యుయేట్ గర్భాశయం అనే అరుదైన పరిస్థితి ఉందని తెలుసుకుంది. దీన్ని గుండె ఆకారపు గర్భాశయం అని కూడా పిలుస్తారు. ఇక్కడ గర్భాశయం ఒకటి కాకుండా రెండు గదులుగా వేరుచేయబడి ఉంటుంది. ఈ పరిస్థితి.. నూటికి ఒకరో, ఇదరినో ప్రభావితం చేసే అరుదైన సమస్య అట. ఈ పరిస్థితితో ఉన్న చాలా మంది మహిళలకు ఇలానే రక్తస్రావం జరగుతుందా అంటే..ఒక్కొక్కరిలో ఒక్కోలా లక్షణాలు ఉంటాయని ఫాలోవర్ వివరించడంతో ఒక్కసారిగా ఊపిరిపీల్చుకుంది. ఇన్నాళ్లకీ తన సమస్యకు ప్రధాన కారణం ఏంటన్నది తెలుసుకోగలిగానని సంబరపడింది. ఇన్నాళ్లు దాదాపు 950 రోజులు పీరియడ్స్ ప్యాడ్లలకే డబ్బులు వెచ్చించి విసుగొచ్చేసింది. ఇక ఆ సమస్య ఎందువల్లో తెలుసుకోగలిగాను కాబట్టి..పరిష్కారం దిశగా అగుడులు వేస్తానంటోంది పాపీ. ప్రస్తుతం ఆమె వైద్యులను సంప్రదించి.. తన గుండె ఆకారపు గర్భాశయాన్ని సరిచేసే శక్తచికిత్స గురించి తెలుసుకునే పనిలో ఉంది. అంతేగాదు ఇది గనుక విజయవంతమైతే..ఎరుపు రంగు చూడని స్వర్గం లాంటి రోజులను పొందగలుగుతానంటోందామె. (చదవండి: ఉమెనోపాజ్ అర్థం చేసుకుందాం)

ఆంధ్ర అయోధ్య ఒంటిమిట్ట రామాలయం..
ఆంధ్రా అయోధ్యగా... అపర భద్రాద్రిగా గుర్తింపు పొందిన వైఎస్సార్ కడప జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలోని గర్భగుడిలో మనకు ఏకశిలపైన సీతారామలక్ష్మణ విగ్రహాలు కనిపిస్తాయి తప్ప హనుమంతుడి విగ్రహం ఉండదు. ఈ ఆలయ నిర్మాణ సమయానికి రాముడికి హనుమంతుడు పరిచయం కాలేదనీ.. అందుకే ఇక్కడ హనుమంతుడి విగ్రహం లేదనే కథ ప్రచారంలో ఉంది. అయితే ఆలయానికి అభిముఖంగా సంజీవరాయస్వామి పేరుతో ఒంటిమిట్ట క్షేత్రపాలకుడుగా ఆంజనేయస్వామి ఆలయం నిర్మితమైంది. ఈ ఆలయంలో స్వామివారు సీతారామలక్ష్మణులకు ఎదురుగా నిలబడి అంజలి ఘటిస్తున్నట్లుగా ఎత్తైన విగ్రహంతో నిలచి, భక్తులను కాపాడుతూ ఉంటారు. స్థలపురాణం...ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి వివిధ కథలు ప్రచారంలో ఉన్నాయి. పద్నాలుగేళ్ల వనవాస సమయంలో రాముడు సీతా లక్ష్మణ సమేతుడై ఈ అరణ్యంలోనూ కొంతకాలం గడిపాడట. ఆ సమయంలో మృకండు, శృంగి అనే మహర్షుల ఆశ్రమం ఇక్కడే ఉండేదట. వాళ్లు చేసే యజ్ఞయాగాలకు రాక్షసులు ఆటంకం కలిగించడంతో రాముడు వాళ్లను హతమార్చి యాగరక్షణ చేశాడట. అందుకు ప్రతిగా ఈ మహర్షులు ఏకశిలపైన సీతారామ లక్ష్మణుల విగ్రహాలను చెక్కించారనీ... అయితే ఆ తరువాత రాముడి భక్తుడైన జాంబవంతుడు ఆలయం నిర్మించి ఆ విగ్రహాలను అందులో ప్రతిష్ఠించాడనీ అంటారు. ఈ ఆలయానికి సంబంధించి మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. ఈ ప్రాంతంలో ఒంటడు, మిట్టడు అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారట. బోయవాళ్లైన వీళ్లు ఈ అటవీ ప్రాంతాన్ని సంరక్షించేవారు. ఓసారి ఈ ప్రాంతానికి ఉదయగిరిని పాలించే కంపరాజు వచ్చాడు, ఈ అన్నదమ్ములు రాజుకు అన్నిరకాల సేవలు చేయడమే కాక చుట్టూ ఉన్న ప్రాంతాలనూ చూపించారు. ఆ రాజు ఆనందించి ఏదయినా కోరుకోమని అడగగా, ఇక్కడ రామాలయం కట్టించమని కోరారట. రాజు ఈ ప్రదేశాన్ని పరిశీలించి గుడి కట్టేందుకు అవసరమైన నిధుల్ని అందించి ఆ బాధ్యతను వీళ్లకే అప్పగించి వెళ్లి΄ోయాడు. వీళ్లిద్దరూ ఎంతో భక్తిశ్రద్ధలతో కొన్నేళ్లు కష్టపడి ఈ ఆలయాన్ని నిర్మించారట. వాళ్లిద్దరూ కట్టించడం వల్లే ఈ ఆలయానికి ఒంటిమిట్ట రామాలయం అనే పేరు వచ్చిందని అంటారు. ఆ తరువాత ఉదయగిరి రాజు సోదరుడైన బుక్కరాయలు తన దగ్గరున్న నాలుగు సీతారామలక్ష్మణ ఏకశిల విగ్రహాల్లో ఒకదాన్ని ఈ ఆలయంలో ప్రతిష్ఠించాడని చెబుతారు. ఈ ఆలయంలోని రామతీర్థాన్ని రాముడే సీతకోసం ఏర్పాటు చేశాడని అంటారు. మొదట ఆ తీర్థాన్ని రామబుగ్గ అనేవారనీ.. క్రమంగా అదే రామతీర్థం అయ్యిందనీ చెబుతారు. ఎందరో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసినా... ఆంధ్రావాల్మీకిగా గుర్తింపు పొందిన వావిలికొలను సుబ్బారావు అనే రామభక్తుడు ఈ రామాలయాన్ని పునరుద్ధరించినట్లు చరిత్ర చెబుతోంది. స్వామికి విలువైన ఆభరణాలను సమకూర్చేందుకు ఆ భక్తుడు టెంకాయ చిప్పను పట్టుకుని భిక్షాటన చేసి సుమారు పది లక్షల రూపాయలు సేకరించాడట.విశేష పూజలు...మూడు గోపుర ద్వారాలున్న ఈ ఆలయ ముఖద్వారం ఎత్తు సుమారు 160 అడుగులుంటుంది. శేషాచల పర్వత పంక్తిలో ఆదిశేషుని తలభాగంగా తిరుమల క్షేత్రం మధ్యభాగంగా దేవుని గడప (కడప), ఒంటిమిట్ట, అహోబిలం తోకభాగంగా శ్రీశైల క్షేత్రాలను అభివర్ణిస్తారు. దేవుని కడప క్షేత్రాన్ని సందర్శించి తిరుమలకు వెళ్లే భక్తులు ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామాలయాన్ని దర్శించి వెళ్లడం అనాదిగా జరుగుతోంది. ఎత్తైన గోపురాలు, విశాలమైన ఆలయ ప్రాంగణం, సుందరమైన మండపాలు, విజయనగర సామ్రాజ్య వైభవాన్ని తెలిపే రమణీయ శిల్పసంపద ఈ ఆలయాన్ని దర్శించిన భక్తులకు, పర్యాటకులకు కనువిందు చేస్తుంది.ఈ ఆలయాన్ని అద్భుత ధామంగా తీర్చిదిద్డడంలో చోళరాజులు, విజయనగర పాలకులు ఇతోధికమైన కృషి చేశారు. దేవాలయ ముఖమండపంలో రామాయణ, భారత, భాగవతాలలోని వివిధ ఘట్టాలను కనులకు కట్టే శిల్పాలున్నాయి. సీతాదేవికి అంగుళీయకాన్ని చూపిస్తున్న హనుమంతుడు, లంకకు వారధిని నిర్మించే వానరులు, శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని పైకెత్తే దృశ్యం, వటపత్రశాయి, శ్రీ కృష్ణుని కాళీయ మర్ధనం, నర్తకీమణుల బొమ్మలు ఉన్నాయి. అలాగే ముఖద్వారంపై దేవతలు, రాక్షసులు క్షీరసాగర మథనం చేసే దృశ్యం, ఒక బొమ్మలో ఏనుగు– ఆవు కనిపించేలా చెక్కిన సుందర శిల్పాలు కనువిందు చేస్తాయి. ఆలయ ద్వారపాలకులుగా అంజలి ముద్రతో శోభిల్లే జయవిజయుల శిల్పాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఆధ్యాత్మిక కేంద్రంఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలను నిర్వహించడంతోపాటూ శ్రీరామనవమి సమయంలో తొమ్మిది రోజులపాటు ప్రత్యేక ఉత్సవాలను చేస్తారు. చతుర్దశి నాడు కల్యాణం, పౌర్ణమిరోజు రథోత్సవం నిర్వహిస్తారు. బమ్మెర పోతనామాత్యుడు ఒంటిమిట్ట కేంద్రంగా భాగవత రచన చేసి, ఆ కావ్యాన్ని ఒంటిమిట్ట కోదండ రామునికే అంకితం ఇచ్చారట. అందుకే ఒంటిమిట్ట ఆలయంలో పోతన విగ్రహం కూడా ఉంది. – డి.వి.ఆర్. (చదవండి: మజ్జిగౌరి అమ్మవారి చైత్రోత్సవాలు..! ఏకంగా 108 మంది రాణులు..)

ఆ యూనిఫాం నచ్చి చెఫ్‌గా మారా.. ఏకంగా 72 పోటీల్లో 94 పతకాలు!
పాఠశాలలో విద్యాభ్యాసం పొందుతున్న సమయంలో ఓ చెఫ్ వీడియోకు, అతని డ్రెస్ కోడ్‌కు ఆకర్షితురాలైన ఆ విద్యార్థిని చెఫ్‌గా మారాలని సంకల్పించుకుంది. అంతటితో ఆగకుండా ఆ దిశగా అడుగులు వేస్తూ మాస్టర్ చెఫ్‌గా పలువురి మన్ననలు పొందుతోంది. అనేక వంటల పోటీల్లో పతకాలను సొంతం చేసుకుంటూ తనదైన ముద్ర వేసుకుని బేకరీ విభాగంలో రాణిస్తోంది. ఆమే మేడ్చల్‌కు చెందిన మహిళా చెఫ్ (Woman Chef) దివ్యసారిక. తాను చెఫ్‌గా మారి స్థిరపడడం సరికాదని భావించి పాకశాస్త్ర ప్రావీణ్యంతో అద్యాపకురాలిగా తనలాంటి ఎంతో మందిని చెఫ్స్గా మలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా (Guntur District) ప్రత్తిపాడు మండలం కొత్త మల్లయ్యపాలేనికి చెందిన దివ్యసారిక (Divya Sarika) ఇంటర్ వరకూ అక్కడే చదువుకుంది. గుంటూరులోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న రోజుల్లో ఓ కార్యక్రమంలో భాగంగా పాఠశాల యాజమాన్యం పలు రంగాల్లో ప్రావీణ్యం పొందిన వారి వీడియోలను ప్రదర్శించింది. అందులో భాగంగా ఆ్రస్టేలియాకు చెందిన ఫేమస్ చెఫ్ థామస్ వీడియో, అతని యూనీఫాంకు ఆకర్షితురాలైంది దివ్యసారిక. అప్పుడే చెఫ్‌గా మారాలని నిర్ణయించుకుంది. మొదట ఇంట్లో వంటలు చేయడం ప్రారంభించింది. ఇంటర్ తర్వాత హోటల్ మేనేజ్మెంట్ చేయాలనే ఆలోచనను తండ్రి శివారెడ్డి, కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. తనకు ఇష్టమైన రంగంలో వెళ్తానంటూ పట్టుబట్టి హైదరాబాద్‌లో హాస్టల్లో ఉంటూ మూడేళ్ల పాటు బ్యాచిలర్ ఆఫ్ కలినరీ ఆర్ట్స్ కోర్సు పూర్తిచేసింది. చివరి సంవత్సరంలో హోటల్ హెచ్ఐసీసీలో అప్రెంటీస్‌లో చేరి అనంతరం అక్కడే చెఫ్‌గా చేరింది. తదనంతరం నోవోటెల్లో రెండున్నరేళ్ల పాటు చెఫ్‌గా చేసింది. 72 పోటీల్లో.. 94 పతకాలు.. బేకరీ విభాగంలో చెఫ్‌గా రాణిస్తున్న దివ్యసారిక ఇప్పటి వరకూ అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో 72 పోటీల్లో పాల్గొంది. మొదట విద్యార్థి దశలో 2013లో ఆంధ్రా కలినరీ చెఫ్ పోటీల్లో పాల్గొనేందుకు రూ.42 వేలు ఖర్చు చేసి పొటీలో పాల్గొంది. నిర్భయ గర్ల్‌చైల్డ్, మథర్ థీమ్‌తో చెఫ్‌గా తనదైన ముద్రతో మొదటి గొల్డ్మెడల్ సాధించింది. దీంతో పతకం రుచి చూసిన చెఫ్ దివ్య అంతర్జాతీయ స్థాయిలో మలేషియా, మారీషియస్, మాల్దీవులు వంటి దేశాలతో పాటు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంది. ఇటీవల ఢిల్లీలో జరిగిన పోటీల్లో పాల్గొని 4 గొల్డ్ మెడల్స్, 2 బ్రాంజ్ మెడల్స్ సాధించింది. 32 గోల్డ్ మెడల్స్, 21 సిల్వర్, 41 బ్రాంజ్ మెడల్స్‌తో పాటు నగదు పురస్కారాలు, అవార్డులు, ప్రశంసా పత్రాలు సొంతం చేసుకున్నట్లు దివ్యసారిక తెలిపింది. లక్షల జీతం వదిలి.. మహిళా చెఫ్‌గా రాణిస్తున్న దివ్య ప్రముఖ హోటళ్లలో, విదేశాల్లో చెఫ్‌గా విధులు నిర్వహిస్తే రూ.లక్షల్లో వేతనం పొందే అవకాశం ఉన్నా.. తాను నేర్చుకున్నది నలుగురికీ బోధించాలనే ఉద్దేశంతో హోటల్ మేనేజ్మెంట్ కళాశాలలో అధ్యాపకురాలిగా విధులు నిర్వహిస్తుంది. గతంలో తెలంగాణ టూరిజంలో ఉద్యోగం వచ్చినా వెళ్లలేదు. ఇప్పటి వరకూ 300 మంది విద్యార్థులను చెఫ్‌లుగా తీర్చిదిద్దానని, వారిలో కొందరు విదేశాల్లో చెఫ్స్గా స్థిరపడ్డారని తెలిపారు. రుచికరమైన ఆహారం అందించేందుకు.. చెఫ్స్గా మహిళలు రాణించాలనేదే నా కోరిక.. నా ప్రేరణతో మరికొందరు ఈ రంగంలో స్థిరపడాలి. ప్రజలకు నాణ్యామైన రుచికరమైన ఆహారం అందించేందుకు నా వంతు కృషి చేస్తున్నాను. నా ద్వారా ఈ రంగంలో స్థిరపడిన వారు చిరకాలం నన్ను గుర్తుంచుకుంటారు.. అదే నాకు ఆనందాన్నిస్తుంది.(చదవండి: ప్రపంచంలో అత్యంత ఖరీదైన నీటి ధర రూ. 65 లక్షలా..!)
ఫొటోలు


నల్లగండ్లలో సందడి చేసిన నితీష్, స్టోయినిష్ (ఫోటోలు)


రామ్ చరణ్ ఆరెంజ్ మూవీ.. చెర్రీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్‌ను ఇప్పుడు చూస్తే..! (ఫొటోలు)


వైట్ గౌన్ లో అందాలు ఆరబోస్తున్న నేహా శెట్టి (ఫోటోలు)


సంపూర్ణేష్ బాబు ‘సోదరా’ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)


‘కృష్ణ లీల’ మోషన్‌పోస్టర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)


ఒంటిమిట్ట సీతారాముల కల్యాణానికి సర్వం సిద్ధం (ఫొటోలు)


రిచెస్ట్ ప్లేయర్‌గా పీవీ సింధు.. ఏడాది సంపాదన ఇన్ని కోట్లా?( ఫోటోలు)


స్నేహితురాలితో సాయిపల్లవి హ్యాపీ మూమెంట్స్ (ఫోటోలు)


అంబానీ ఇల్లు ‘అంటిలియా’.. అబ్బురపరిచే లోపలి ఫొటోలు


అందంతో అభిమానుల మనసు కొల్లగొట్టేస్తున్న దివ్యభారతి (ఫోటోలు)
అంతర్జాతీయం

అమెరికాపై ప్రతీకార సుంకాలు 90 రోజులు వాయిదా
బ్రస్సెల్స్: అమెరికా ఉత్పత్తులపై ప్రతీకార సుంకాల అమలును 90 రోజులపాటు నిలిపివేస్తున్నట్లు యూరోపియన్ యూనియన్(ఈయూ) ఎగ్జిక్యూటివ్ కమిషన్ గురువారం వెల్లడించింది. తమ ఉత్పత్తులపై విధించిన టారిఫ్‌లను 90 రోజులు నిలిపివేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తాము సైతం ఆయన బాటలో నడవనున్నట్లు ప్రకటించింది. టారిఫ్‌ల విషయంలో అమెరికాతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్ గురువారం ఒక ప్రకటనలో స్పష్టంచేశారు. 23.25 బిలియన్ డాలర్ల విలువైన అమెరికా ఉత్పత్తులపై సుంకాలు విధిస్తూ ఇప్పటికే తీసుకున్న నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని చెప్పారు. అమెరికాలో చర్చలకు ఒక అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉద్ఘాటించారు. చర్చలు సంతృప్తికరంగా సాగకపోతే అమెరికాపై ప్రతీకార సుంకాలు కచ్చితంగా అమల్లోకి వస్తాయని స్పష్టంచేశారు. ఈయూ నుంచి దిగుమతి అయ్యే స్టీల్, అల్యూమినియంపై ట్రంప్ తొలుత 25 శాతం టారిఫ్ విధించిన సంగతి తెలిసిందే. దీన్ని 90 రోజులపాటు ఆయన నిలిపివేశారు.

మా తలుపులు తెరిచే ఉన్నాయి
బీజింగ్/వాషింగ్టన్: టారిఫ్‌ల విషయంలో అమెరికాతో చర్చలకు తమ తలుపులు తెరిచే ఉన్నాయని చైనా వాణిజ్య శాఖ ప్రతినిధి హీ యోంగ్కియాన్ గురువారం చెప్పారు. తాము ఘర్షణ కోరుకోవడం లేదని అన్నారు. చైనా వైఖరి స్పష్టంగా, స్థిరంగా ఉందన్నారు. ఎవరూ కవ్వింపు చర్యలకు పాల్పడొద్దని సూచించారు. అమెరికాతో చర్చలు పరస్పర గౌరవం, సమానత్వం ప్రాతిపదికన జరగాలని ఆకాంక్షించారు. కానీ, ఒత్తిళ్లకు, బెదిరింపులకు గురిచేయడం, బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడడం వంటి చర్యలకు దిగితే సహించబోమని హెచ్చరించారు. చైనాతో డీల్ చేసే విధానం అది కాదని అన్నారు. ఒకవేళ వాణిజ్య యుద్ధాన్ని అమెరికా మరింత ముందుకు తీసుకెళ్తే తాము చివరి వరకూ పోరాడుతామని తేల్చిచెప్పారు. జిన్‌పింగ్ తెలివైన నాయకుడు: ట్రంప్ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ చాలా తెలివైన నాయకుడని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసించారు. ఎప్పుడేం చేయాలో జిన్‌పింగ్‌కు బాగా తెలుసని అన్నారు. టారిఫ్‌ల విషయంలో చైనా పాలకులు అమెరికాతో ఒప్పందం కుదుర్చుకుంటారని భావిస్తున్నట్లు తెలిపారు. దీనిపై చర్చించడానికి జిన్‌పింగ్ నుంచి త్వరలోనే తనకు ఫోన్‌కాల్ వస్తుందని భావిస్తున్నానని చెప్పారు. చైనాలో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని ట్రంప్ స్పష్టంచేశారు. చైనాపై 145 శాతం బాదుడు చైనా ఉత్పత్తులపై 125 శాతం సుంకాలు విధిస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించగా, మరో 20 శాతం సుంకాలను కూడా దీనికి జతచేసినట్లు శ్వేతసౌధం తాజాగా స్పష్టంచేసింది. చైనా నుంచి ఫెంటనిల్ అక్రమ రవాణాకు సంబంధించి గతంలో విధించిన 20 శాతం సుంకాలకు ఈ 125 శాతం సుంకాలు అదనమని తెలియజేసింది. చైనాపై మొత్తం సుంకాలు 145 శాతానికి చేరుకున్నట్లు నిర్ధారించింది. మరోవైపు అమెరికా ఉత్పత్తులపై చైనాలో సుంకాలు 84 శాతానికి చేరిన సంగతి తెలిసిందే.ఇండియాపై 26 శాతం అదనపు టారిఫ్ జూలై 9 దాకా రద్దు ఇండియాపై విధించిన 26 శాతం అదనపు టారిఫ్‌ను 90 రోజులపాటు రద్దు చేస్తున్నట్లు వైట్‌హౌస్ ప్రకటించింది. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేసింది. ఈ ఏడాది జూలై 9 దాకా ఈ అదనపు సుంకాలు అమల్లో ఉండవని పేర్కొంది.

టార్గెట్ చైనా ఎందుకంటే..!
కాళ్లబేరానికి వచ్చిన కారణంగా డజన్ల కొద్దీ ప్రపంచదేశాలపై ఆంక్షల కత్తిని దింపకుండా 90 రోజులు ఆగుతానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం ప్రకటించారు. వాస్తవానికి బుధవారం నుంచే అన్ని దేశాలపై పెరిగిన టారిఫ్‌లు అమల్లోకి రావాల్సి ఉండగా ఆఖరి నిమిషంలో ట్రంప్ తన నిర్ణయాన్ని అనూహ్యంగా వాయిదా వేశారు. అయితే ఇందులో అనూహ్యమేమీ లేదని, ట్రంప్ అసలు లక్ష్యం ఈ దేశాలు కాదని, చైనాయే అసలు లక్ష్యమని కొందరు అంతర్జాతీయ వాణిజ్యరంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. వాళ్లు చెప్పినట్లు నిజంగానే ట్రంప్ కేవలం చైనా ఉత్పత్తులు, ఎగుమతి మార్కెట్‌పై కత్తిగట్టారా? అనే చర్చ ఇప్పుడు వాణిజ్యవర్గాల్లో మొదలైంది. దీనికి కొన్నేళ్ల క్రితమే బీజాలు పడ్డాయని తెలుస్తోంది. తొలి దఫా పగ్గాలు చేపట్టినప్పుడేదాదాపు 13 ఏళ్ల క్రితంనాటి సంగతి. చైనా వాణిజ్య రాజధాని షాంఘైలో హఠాత్తుగా అంతర్జాతీయ వాణిజ్య సంబంధాల బలోపేతంపై విస్తృతస్థాయి సమావేశాలు జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వస్తూత్పత్తుల వినిమయ అవకాశం ఉన్న దేశాలతో చైనా వాణిజ్య సంబంధాలను బలపర్చుకుంది. అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు, కంపెనీలు, దేశాల ప్రభుత్వాలతో చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వం చర్చలు జరిపింది. చవగ్గా సరుకుల సరఫరాపై ఒప్పందాలు కుదిరాయి. విదేశీ సంస్థల ప్రతినిధులు, చైనా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఉన్నతాధికారులు, ప్రముఖ ఆర్థికవేత్తల మధ్య సఖ్యత కుదిరింది. దీంతో చైనా నుంచి అన్ని రకాల ఉత్పత్తుల ఎగుమతి అనూహ్యంగా ఊపందుకుంది. చైనాకు నిరాయుధ సైన్యంగా పేరొందిన కార్మికుల కష్టంతో పురుడుపోసుకున్న లక్షల కోట్ల రూపాయల వస్తువులు ప్రపంచదేశాలకు ఎగుమతి అయ్యాయి. ఆ పరంపర అప్రతిహతంగా కొనసాగి అమెరికాను తోసిరాజని చైనా ప్రపంచ ఎగుమతి కేంద్రంగా మారింది. మారిన ఈ పరిణామాలను ట్రంప్ అస్సలు జీర్ణించుకోలేకపోయారు. తక్కువ ధరకే వస్తువులు లభిస్తుండటంతో ప్రపంచదేశాల కీలక వ్యాపారసంస్థలన్నీ చైనాకే క్యూకట్టాయి. అక్కడ ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పాయి. రోల్స్ రాయిస్, జనరల్ మోటార్స్, ఫోక్స్‌వ్యాగన్ సంస్థల ఉత్పత్తులూ చైనాలో తయారవడం మొదలైంది. దీంతో దశాబ్దాల చరిత్ర కల్గిన అమెరికాలోని కొన్ని కంపెనీల నుంచి ఉత్పత్తి తగ్గింది. దీంతో అమెరికా పరిశ్రమల్లో కార్మికుల జీవితాల్లో వెలుగులు తగ్గిపోయాయి. అమెరికాకు పరిశ్రమల నుంచి రెవెన్యూ పడిపోయింది. అమెరికా పారిశ్రామికరంగానికి పూర్వవైభవం తెస్తానని తొలిసారి ఎన్నికల్లో పోటీచేసినప్పుడే ట్రంప్ ఓటర్లకు మాటిచ్చారు. గెలిచి అధికారం చేపట్టారు. కానీ ఆ నాలుగేళ్లలో అనుకున్న వ్యూహాలను అమలుచేయలేకపోయారు. దీనికి ఇతరత్రా కారణాలున్నాయి. ఇప్పుడు రెండోదఫా అధికారంలోకి రాగానే పాత ప్రణాళికలకు పదునుపెట్టి ప్రయోగిస్తున్నారు. దాని ఫలితమే ఈ టారిఫ్‌ల పరంపర. ఎగుమతులు పెరిగాక చైనాలో ఏం జరిగింది? ఎగుమతులతో చైనా ఆర్థికాభివృద్ది సాధించాక అక్కడ పౌరులు పాలనలో సంస్కరణలు కోరుకున్నారు. కానీ ఏక పార్టీ, నియంతృత్వపాలనలో ఆ కల నెరవేరలేదు. కొనుగోలు శక్తి పెరిగాక వినిమయ సమాజంగా అభివృద్ధి చెందాలని జనం భావించినా అదీ నెరవేరలేదు. ప్రభుత్వం కేవలం ఎగుమతులపైనా దృష్టిసారించింది. 2015లో బహిర్గతమైన ‘‘మేడిన్ చైనా 2025’ బ్లూప్రింట్ సైతం ఇదే విషయాన్ని ఉద్ఘాటించింది. గుండుసూది నుంచి గగనతల రక్షణ వ్యవస్థలదాకా, విద్యుత్వాహనాలు మొదలు అధునాతన యుద్ధవిహంగాల దాకా ప్రతిరంగంలో అగ్రగామిగా వెలుగొందడమే లక్ష్యంగా ముందుకుసాగి ఆ పనిలో సఫలీకృతమైంది. ఇదే సమయంలో అమెరికాలో ట్రంప్ రాజకీయ రంగప్రవేశంచేసి చైనా ఎగుమతి మార్కెట్ ఎదుగుదలకు అడ్డుకట్టవేయాలని కంకణం కట్టుకున్నారు. ఎన్నికల హామీల్లోనే అదే చెప్పారు. చైనా ఇప్పటికే ప్రపంచంలోని మొత్తం విద్యుత్ వాహనాల తయారీలో 60 శాతం వాటాను ఒడిసిపట్టింది. ఈ 60 శాతంలోకూడా అధిక బ్రాండ్లు స్వదేశానివే కావడం విశేషం. ఇక బ్యాటరీల్లోనూ 80 శాతం అక్కడే తయారవుతున్నాయి. వీటిని దెబ్బకొట్టేందుకే ట్రంప్ టారిఫ్‌ల కొరడాను ఝుళిపిస్తున్నారు. చైనా పరిశ్రమలను దెబ్బకొడితే అమెరికా పరిశ్రమలకు పునరుజ్జీవం సాధ్యమని ట్రంప్ బలంగా నమ్ముతున్నారు. ట్రంప్ నిర్ణయం యావత్ ప్రపంచ వాణిజ్యవ్యవస్థనే కుదుపునకు గురయ్యేలా చేస్తోంది. ఇప్పుడేం జరగొచ్చు? అతి టారిఫ్‌ల భారాన్ని అమెరికా తమపై మోపిన నేపథ్యంలో చైనా ముంగిట ఇప్పుడు రెండు మార్గాలున్నాయి. సంప్రదింపుల ప్రక్రియ ద్వారా టారిఫ్‌లను చైనా తగ్గించుకోవచ్చు. ఇందుకోసం చైనా తన ఎగుమతి ఆధారిత ఆర్థికవ్యవస్థ విధానాలను అమెరికాకు అనుగుణంగా మార్చుకోవాల్సి ఉంటుంది. అయితే చైనా గత చరిత్రను చూస్తే ఇది జరగకపోవచ్చని అర్థమవుతుంది. అగ్రగామి ప్రపంచ ఆర్థిక శక్తిగా మారేందుకు ఎన్నాళ్లనుంచో చైనా కలలుకంటోంది. అందుకోసమే ప్రభుత్వ వ్యతిరేకతను ఉక్కుపాదంతో అణిచివేస్తూ దాదాపు ప్రజలందర్నీ ఓ మోస్తరు వృత్తినిపుణులుగా మార్చేసింది. ఆట»ొమ్మలు మొదలు ఫోన్లదాకా అన్ని వస్తువులు కుటీరపరిశ్రమల్లా ఇళ్లలోనే తయారవుతాయి. చైనాలో ఏం జరుగుతోందనే వివరాలు బయటకు పొక్కకుండా మీడియాపైనా కఠిన ఆంక్షలు కొనసాగుతున్నాయి. సొంత టెక్నాలజీనే నమ్ముకున్న ప్రభుత్వం దేశీయ సంస్థలు మినహా చైనా గడ్డపై ఎవరినీ ఎదగనీయదు. ఈ నేపథ్యంలో అమెరికా టెక్నాలజీ కంపెనీలకు చైనా గడ్డపై ఎదిగేందుకు ఒప్పుకోకపోవచ్చు. టారిఫ్‌ల భయాలతో విదేశీ కంపెనీలు చైనాలో పెట్టుబడులను తగ్గించుకుని అమెరికాలో పెట్టుబడులను పెంచుకుంటాయని ట్రంప్ భావిస్తున్నారు. చైనాకు ఆర్డర్లు ఇవ్వడం మానేసి అమెరికన్ కంపెనీలు మళ్లీ దేశీయంగా కర్మాగారాలను తెరుస్తాయని ట్రంప్ ఆశిస్తున్నారు. అదే నిజమైతే మళ్లీ అమెరికాలో కొత్త పారిశ్రామిక విప్లవం రావొచ్చు. – సాక్షి, నేషనల్ డెస్క్

చైనాకు ట్రంప్ మరో షాక్.. డ్రాగన్‌పై మరోసారి టారిఫ్ విధింపు
వాషింగ్టన్: అమెరికా,చైనా దేశాల మధ్య టారిఫ్‌ల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా చైనాపై డొనాల్డ్ ట్రంప్ మరోసారి సుంకం విధించారు. దీంతో చైనా వస్తువులపై అమెరికా విధించిన టారిఫ్ మొత్తం 145 శాతానికి చేరుకుందని వైట్‌హౌస్ అధికారి అమెరికన్ మీడియా సంస్థ సీఎన్బీసీకి ధృవీకరించారు. అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం ముదురుతోంది. డ్రాగన్ దిగుమతులపై ఉన్న 20 శాతం సుంకాలకు అదనంగా 34 శాతం విధిస్తున్నట్లు ఇటీవల ట్రంప్ ప్రకటించారు. దీనిపై చైనా దీటుగా స్పందిస్తూ అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 34 శాతం అదనపు సుంకం విధించింది. ఇదే విషయంలో ట్రంప్ డ్రాగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనాకు డెడ్‌లైన్ పెట్టి.. నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేదంటే 104 శాతం టారిఫ్‌లు విధిస్తానని హెచ్చరించారు. తామేం తక్కువ కాదన్నట్లుగా అమెరికా ఉత్పత్తులపై 84 శాతం సుంకం విధించింది. JUST IN: 🇺🇸🇨🇳 White House says total US tariffs on China are now 145% pic.twitter.com/67oyICPVNb— Mastering Crypto 🇺🇲 (@MasteringCrypt) April 10, 2025పట్టు వీడి దిగి రావాల్సింది పోయి అర్థం లేని దూకుడుగా వ్యవహరిస్తుందంటూ చైనాపై మరో 50 శాతం కలిపి మొత్తంగా 125 శాతం టారిఫ్‌ను విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ తరుణంలో తాజాగా మరో 20 శాతం టారిఫ్ పెంచారు. దీంతో చైనా దిగుమతులపై అమెరికా విధించిన సుంకం 145శాతానికి చేరినట్లైంది. ఇదే విషయాన్ని వైట్ హౌస్ వర్గాలు అధికారికంగా ప్రకటించారు.
జాతీయం

నేడు వారణాసికి ప్రధాని మోదీ
వారణాసి/భోపాల్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లలో పర్యటించనున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని సొంత నియోజకకవర్గం వారణాసిలో రూ3,880 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో 130 తాగునీటి పథకాలు, 100 అంగన్వాడీ కేంద్రాలు, 356 గ్రంథాలయాలు, ఒక పాలిటెక్నిక్ కాలేజీ, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉన్నాయని వారణాసి డివిజనల్ కమిషనర్ కౌశల్ రాజ్ శర్మ వివరించారు. మెహెందీగంజ్లో జరిగే బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తారన్నారు. వారణాసిలో సుమారు రెండున్నర గంటలు ప్రధాని గడుపుతారు.

ఆర్టీఐను బలహీనపరుస్తోన్న ప్రైవసీ చట్టం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రైవసీని పరిరక్షిస్తున్నామన్న సాకుతో ప్రజలకు ఖచ్చితంగా అందుబాటులో ఉండాల్సిన సమాచారాన్ని సైతం కేంద్ర ప్రభుత్వం పౌరులకు అందకుండా తొక్కిపెడుతోందని విపక్షాల ‘ఇండియా’కూటమి నేతలు ఆరోపించారు. ప్రజలకు తెలియాల్సిన సమాచారాన్ని దాచేందుకు ఉద్దేశించిన డిజిటల్ ప్రైవసీ డేటా ప్రొటెక్షన్(డీపీడీపీ) చట్టంలోని 44(3)సెక్షన్‌ను తక్షణం తొలగించాలని పలువురు ‘ఇండియా’కూటమి నేతలు గురువారం డిమాండ్‌చేశారు. ఈ మేరకు ఢిల్లీలో కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్, డీఎంకే నాయకుడు ఎంఎం అబ్దుల్లా, శివసేన(యూబీటీ) నాయకురాలు ప్రియాంక చతుర్వేది, సీపీఎం నేత జాన్ బ్రిటాస్, సమాజ్‌వాదీ పార్టీ నేత జావెద్ అలీ ఖాన్, రాష్ట్రీయ జనతాదళ్ నేత నవల్ కిశోర్‌లు సంయుక్త పత్రికా సమావేశంలో మాట్లాడారు. ‘‘సమాచార హక్కుచట్టం(ఆర్టీఐ) ద్వారా పౌరులకు అందించాల్సిన సమాచారాన్ని ప్రైవసీ తెరలమాటున ప్రభుత్వం దాచేస్తోంది. ముఖ్యంగా 44(3) సెక్షన్ ఈ దుర్ణితికి దన్నుగా నిలుస్తోంది. అందుకే ఈ సెక్షన్‌ను తొలగించాలి. ఈ డిమాండ్‌తో దాదాపు 120కిపైగా విపక్ష ఎంపీలు సంతకాలు చేసిన మెమోరండంను త్వరలోనే కేంద్ర ఇన్ఫర్మేషన్, టెక్నాలజీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు అందజేస్తాం. డిజిటల్ డేటా ప్రొటెక్షన్ చట్టంలోని సవరణలను విపక్షాలు క్షుణ్ణంగా అధ్యయనంచేశాయి. పౌర హక్కులకు, పత్రికా స్వేచ్ఛకు భంగం కల్గించేలా డీపీడీపీ చట్టంలో సవరణలుచేశారు. పార్లమెంట్, శాసనసభలకు అందుబాటులో ఉంచాల్సిన ప్రతి సమాచారం ప్రతిఒక్కరికీ అందుబాటులో ఉండాలని ఆర్టీఐ చట్టంలోని సెక్షన్8(1) చెబుతోంది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అయితే వ్యక్తిగత సమాచారం కూడా ఇవ్వాల్సి ఉంటుందని సెక్షన్ 8(1) ఉద్ఘాటిస్తోంది. అందులో కీలకమైన 8(1)(జే) సెక్షన్‌ను సవరించారు. దీంతో ప్రజాప్రయోజనాలులేని, ఇతర మినహాయింపులులేని వ్యక్తిగత సమాచారాన్ని కోరితే దానిని బహిర్గతం చేయకుండా నిలువరించే అధికారం కేంద్రానికి దఖలుపడిందని విపక్ష పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు.

బాల్య వివాహాల కట్టడిపై కేంద్రం దృష్టి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో బాల్య వివాహాలను అరికట్టడానికి, బాల్య వివాహాలతో సంబంధం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి కేంద్రం సంబంధిత చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తోంది. అందులో భాగంగా 2024 నవంబర్ 27న ‘బాల్ వివాహ ముక్త్ భారత్’ ప్రచారాన్ని ప్రారంభించింది. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా అవగాహన పెంపొందించడం, ఈ ఘటనలు ఎక్కడ జరిగినా నిరోధించేలా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సహకారం అందించడం వంటి చర్యలను కేంద్రం చేపట్టింది. బాల్య వివాహాల నిషేధ పర్యవేక్షణ అధికారులను నియమించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఇచ్చింది. మరోవైపు కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి వ్యవహారాల మంత్రిత్వ శాఖలో ‘మిషన్ శక్తి’ పథకం కింద బేటీ బచావో బేటీ పఢావో పథకాన్ని అమలు చేస్తోంది. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ కూడా బాల్య వివాహాలను అరికట్టే విషయంలో ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా 1098 అనే నెంబర్‌తో చైల్డ్ హెల్ప్‌లైన్‌ను ప్రవేశపెట్టింది. మరోవైపు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వద్ద అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, 2020 నుంచి 2022 వరకు మూడేళ్లలో దేశంలో 2,837 బాల్య వివాహాలు జరిగాయి. ఇందులో అత్యధికంగా 2021లో 1,050 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రాల పరంగా చూస్తే ఈ మూడేళ్లలో అత్యధికంగా కర్ణాటకలో 672 , తమిళనాడులో 401, పశ్చిమబెంగాల్లో 324 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో 170, ఆంధ్రప్రదేశ్‌లో 77 బాల్య వివాహాలు జరిగాయి.

బిహార్‌లో వర్షాలు, పిడుగుల బీభత్సం
పట్నా: బిహార్‌లో బుధ, గురువారాల్లో భారీ వర్షాలు, పిడుగుపాటు ఘటనలు 38 మందిని బలి తీసుకున్నాయి. బుధవారం 13 మంది చనిపోగా, గురువారం మరో 25 మంది మృత్యువాతపడ్డారు. వీరిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. పిడుగులు పడటంతోపాటు చెట్లు, ఇళ్లు, కరెంటు స్తంభాలు కూలిన ఘటనల్లో అత్యధికంగా నలందలో 18 మంది చనిపోయారు. సివాన్‌లో ఇద్దరు, దర్భంగా, బెగుసరాయ్, కటిహార్, భాగల్పూర్, జెహానాబాద్‌లలో ఒక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రులైన మరో 11 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బుధవారం పిడుగులు పడిన ఘటనల్లో నాలుగు జిల్లాల్లో కలిపి 13 మంది చనిపోయారని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. మృతుల కుటుంబాలకు సీఎం నితీశ్‌కుమార్ సానుభూతి తెలిపారు. రూ.4 లక్షల చొప్పున వీరి కుటుంబాలకు సాయం అందజేస్తామని ప్రకటించారు. బిహార్‌లో 38 జిల్లాలకుగాను 24 జిల్లాలకు యెల్లో అలర్ట్, 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ వాతావరణ శాఖ ప్రకటించింది. శుక్ర, శనివారాల్లో భారీ వర్షాలు కూడా కురిసే అవకాశముందని తెలిపింది.
ఎన్ఆర్ఐ

తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో ఉగాది కవి సమ్మేళనం
డాలస్, టెక్సస్, అమెరికా: తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట ప్రతి నెల ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా శ్రీ విశ్వావసు నామ ఉగాది పర్వదిన సందర్భంగా - “రైతన్నా! మానవజాతి మనుగడకు మూలాధారం నీవేనన్నా” అనే అంశంపై జరిపిన 78 వ అంతర్జాల అంతర్జాతీయ ఉగాది కవిసమ్మేళనం 30 మందికి పైగా పాల్గొన్న కవుల స్వీయ కవితా పఠనంతో ఎంతో ఉత్సాహభరితంగా జరిగింది.ముఖ్యఅతిథిగా పాల్గొన్న ‘పద్మశ్రీ పురస్కార గ్రహీత’ యడ్లపల్లి వెంకటేశ్వరరావు బ్రిటష్ కాలంనాటి ఆధునిక సేంద్రీయపద్దతుల వరకు వ్యవసాయపద్దతులలో వచ్చిన మార్పులను సోదాహరణంగా వివరించారు. రైతులకు వ్యవసాయసంబంధ విజ్ఞానాన్ని అందించేందుకు ‘రైతునేస్తం’ మాస పత్రిక, పశుఆరోగ్యం, సంరక్షణ కోసం ‘పశునేస్తం’ మాసపత్రిక, సేంద్రీయ పద్ధతులకోసం ‘ప్రకృతి నేస్తం’ మాసపత్రికలను, ‘రైతునేస్తం యూట్యూబ్’ చానెల్ ద్వారా సమగ్ర సమాచారం అందిస్తూ నిరంతరం రైతుసేవలో నిమగ్నమై ఉన్నామని తెలియజేశారు. రైతుకు ప్రాధ్యాన్యం ఇస్తూ తానా ప్రపంచసాహిత్యవేదిక ఇంత పెద్ద ఎత్తున కవిసమ్మేళనం నిర్వహించడం ముదాహవమని, ఈ కవి సమ్మేళనంలో పాల్గొన్న కవులందరూ వ్రాసిన కవితలను పుస్తకరూపంలో తీసుకురావడం ఆనందంగా ఉందంటూ అందరి హర్షధ్వానాలమధ్య ఆ పుస్తకాన్ని ఆవిష్కరించారు. తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు పాల్గొన్న ముఖ్యఅతిథి, కవి సమ్మేళనంలో పాల్గొన్న కవు లందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, రైతు కుటుంబ నేపధ్యంనుండి వచ్చిన తనకు వ్యవసాయంలోఉన్న అన్ని కష్టాలు తెలుసునని, ప్రభుత్వాలు రైతులకు అన్ని విధాలా సహాయపడాలని, ‘రైతు క్షేమమే సమాజ క్షేమం’ అన్నారు.తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ - వివిధ రకాల పంటల ఉత్పత్తులలో, ఎగుమతులలో భారతదేశం ముందువరుసలోఉన్నా రైతు మాత్రం తరతరాలగా వెనుకబడిపోతూనే ఉన్నాడన్నారు. మహాకవి పోతన, కవిసార్వభౌమ శ్రీనాధుడులాంటి ప్రాచీన కవులు స్వయంగా వ్యసాయం చేసిన కవి కర్షకులని, గుర్రం జాషువా, ఇనగంటి పున్నయ్య చౌదరి, దువ్వూరి రామిరెడ్డి, తుమ్మల సీతారామమూర్తి లాంటి ఆధునిక కవులు రైతులపై వ్రాసిన కవితలను చదివి వారికి ఘన నివాళులర్పించారు. అలాగే రైతు నేపధ్యంలో వచ్చిన ‘పేద రైతు’, ‘కత్తిపట్టిన రైతు’, ‘రైతు కుటుంబం’, ‘రైతు బిడ్డ’, ‘పాడి పంటలు’, ‘రోజులు మారాయి’, ‘తోడి కోడళ్ళు’ లాంటి సినిమాలు, వాటిల్లోని పాటలు, అవి ఆనాటి సమాజంపై చూపిన ప్రభావం ఎంతైనా ఉందని, ఈ రోజుల్లో అలాంటి సినిమాలు కరువయ్యాయి అన్నారు. మన విద్యావిధానంలో సమూలమైన మార్పులు రావాలని, పసిప్రాయంనుండే పిల్లలకు అవగాహన కల్పించడానికి రైతు జీవన విధానాన్ని పాఠ్యాంశాలలో చేర్చాలని, చట్టాలుచేసే నాయకులు కనీసం నెలకు నాల్గురోజులు విధిగా రైతులను పంటపొలాల్లో కలసి వారి కష్టనష్టాలు తెలుసుకుంటే, పరిస్థితులు చాలావరకు చక్కబడతాయని అభిప్రాయపడ్డారు.ఈ కవి సమ్మేళనంలో వివిధ ప్రాంతాలనుండి పాల్గొన్న 30 మందికి పైగా కవులు రైతు జీవితాన్ని బహు కోణాలలో కవితల రూపంలో అద్భుతంగా ఆవిష్కరించారు.పాల్గొన్న కవులు: దుగ్గినపల్లి ఎజ్రాశాస్త్రి, ప్రకాశం జిల్లా; మంత్రి కృష్ణమోహన్, మార్కాపురం; పాయల మురళీకృష్ణ, విజయనగరం జిల్లా; నన్నపనేని రవి, ప్రకాశం జిల్లా; డా. తలారి డాకన్న, వికారాబాద్ జిల్లా; చొక్కర తాతారావు, విశాఖపట్నం; రామ్ డొక్కా, ఆస్టిన్, అమెరికా; దొండపాటి నాగజ్యోతి శేఖర్, కోనసీమ జిల్లా; ర్యాలి ప్రసాద్, కాకినాడ; సాలిపల్లి మంగామణి (శ్రీమణి), విశాఖపట్నం; సిరికి స్వామినాయుడు, మన్యం జిల్లా; తన్నీరు శశికళ, నెల్లూరు; చేబ్రోలు శశిబాల, హైదరాబాద్; లలిత రామ్, ఆరెగాన్, అమెరికా; బాలసుధాకర్ మౌళి, విజయనగరం; గంటేడ గౌరునాయుడు, విజయనగరం జిల్లా; కోసూరి రవికుమార్, పల్నాడు జిల్లా; మార్ని జానకిరామ చౌదరి, కాకినాడ; కె.ఎ. మునిసురేష్ పిళ్లె, శ్రీకాళహస్తి; డా. బీరం సుందరరావు, చీరాల; డా. వేంకట నక్త రాజు, డాలస్, అమెరికా; బండ్ల మాధవరావు, విజయవాడ; డా. కొండపల్లి నీహారిణి, హైదరాబాద్; నారదభట్ల అరుణ, హైదరాబాద్; పి. అమరజ్యోతి, అనకాపల్లి; యార్లగడ్డ రాఘవేంద్రరావు, హైదరాబాద్; చిటిప్రోలు సుబ్బారావు, హైదరాబాద్; డా. శ్రీరమ్య రావు, న్యూజెర్సీ, అమెరికా, డా. శ్రీదేవి శ్రీకాంత్, బోట్స్వానా, దక్షిణాఫ్రికా; డా. భాస్కర్ కొంపెల్ల, పెన్సిల్వేనియా, అమెరికా; ఆది మోపిదేవి, కాలిఫోర్నియా, అమెరికా; డా. కె. గీత, కాలిఫోర్నియా, అమెరికా; శ్రీ శ్రీధర్ రెడ్డి బిల్లా, కాలిఫోర్నియా, అమెరికా నుండి పాల్గొన్నారు.తానా ప్రపంచసాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ రైతు శ్రమైక జీవన విధానం, తీరు తెన్నులపై తరచూ చర్చ జరపవలసిన అవసరం ఎంతైనా ఉందని, మన అందరికీ ఆహరం పంచే రైతన్న జీవితం విషాదగాధగా మిగలడం ఎవ్వరికీ శ్రేయస్కరంగాదన్నారు. పూర్తి కార్యక్రమాన్ని ఈ క్రింది లంకె ద్వార వీక్షించవచ్చును.https://youtube.com/live/qVbhijoUiX8అలాగే రైతు నేస్తం ఫౌండేషన్ సహకారంతో తానా ప్రపంచసాహిత్యవేదిక వెలువరించిన రైతు కవితల పుస్తకాన్ని కూడా ఇక్కడ పొందు పరుస్తున్నాము.

డా.గుడారు జగదీష్‌కు “విశ్వ వైద్య దివ్యాంగ బంధు” అవార్డు
మారిషస్ తెలుగు మహా సభ ఆధ్వర్యంలో శ్రీ విశ్వావసు నామ తెలుగు ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. ఫీనిక్స్‌లోని ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ ఇండియన్ కల్చర్‌లో తెలుగు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని, శ్రీ విశ్వావసు నామ తెలుగు ఉగాదిని మారిషస్‌లోని తెలుగు వారు ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. ప్రముఖ సామాజిక-సాంస్కృతిక సంస్థ మారిషస్ తెలుగు మహా సభ నిర్వహించిన ఈ కార్యక్రమం, తెలుగు ప్రజల వారసత్వం మరియు సంప్రదాయాలను పరిరక్షించడానికి మరియు ప్రోత్సహించడానికి ఒక వేదికగా నిలచింది. కార్యక్రమం సాంప్రదాయ తెలుగు నూతన సంవత్సర ఆచారాలతో ప్రారంభమైంది, వీటిలో భాగంగా మా తెలుగు తల్లి, దీప ప్రజ్వలనం మరియు గణపతి వందనంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో భాగంగా ప్రపంచ ప్రఖ్యాత వైద్య నిపుణుడు డాక్టర్ గుడారు జగదీష్ వైద్య రంగంలో చేసిన అసాధారణ కృషికి, ముఖ్యంగా వికలాంగుల శ్రేయస్సు కోసం వారి యొక్క అచంచలమైన అంకితభావానికి గుర్తింపుగా మారిషస్ ప్రధాన మంత్రి సత్కరించారు.నాలుగు దశాబ్దాలుగా వికలాంగుల పునరావాసం మరియు సమాజ సేవకు అంకితమైన డాక్టర్ జగదీష్ దేశ విదేశాలలో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆయన అవిశ్రాంత సేవ ఎంతో మంది అభాగ్యుల జీవితాలను ప్రభావితం చేసింది. ఈ సేవలను గుర్తించిన మారిషస్ ప్రధాన మంత్రి డాక్టర్ నవీన్‌చంద్ర రామ్ గూలమ్ డాక్టర్ గుడారు జగదీష్ ను “విశ్వ వైద్య దివ్యాంగ బంధు” అవార్డుతో సత్కరించారు. డాక్టర్ జగదీష్ అసాధారణ మానవతా స్ఫూర్తిని మరియు అంకితభావాన్ని మారిషస్ ప్రధాని ప్రశంసించారు. డాక్టర్ జగదీష్ మాట్లాడుతూ తనను ఈ గౌరవ పురస్కారానికి ఎంపిక చేసినందుకు మారిషస్ తెలుగు మహా సభ సభ్యులకు, మారిషస్ ప్రధాన మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సంధర్భంగా మారిషస్ ప్రధాన మంత్రి డాక్టర్ నవీన్‌చంద్ర రామ్ గూలమ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లోని ఒక సాధారణ వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన డాక్టర్ జగదీష్ కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీ మరియు మంగళూరులోని మణిపాల్ విశ్వవిద్యాలయం వంటి ప్రఖ్యాత వైద్య సంస్థలలో వైద్య విద్యను అభ్యసించి ఆర్థోపెడిక్స్ విభాగంలో నైపుణ్యం పొంది, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధ సంస్థల నుండి అత్యాధునిక పద్ధతులలో అధునాతన శిక్షణ సైతం తీసుకున్నారని తెలిపారు. అమెరికా, జర్మనీ, ఇంగ్లాండు, ఇటలీ, ఫ్రాన్స్, నైజీరియా, కెన్యా, ఒమన్, స్విట్జర్లాండ్ మరియు మారిషస్‌లలో కూడా ఉచిత క్యాంపులు నిర్వహించి తన సేవలను విస్తరించి, అనేక జాతీయ మరియు అంతర్జాతీయ జర్నల్స్‌లో తన పరిశోధనలు ప్రచురించారని తెలిపారు. రాబోయే రోజుల్లో మారిషస్‌కు కూడా డాక్టర్ జగదీష్ తన సేవలను అందించాలని ప్రధాని కోరారు.ప్రధానమంత్రి తన ప్రసంగంలో, తెలుగు సంస్కృతిని కాపాడటానికి, ప్రోత్సహించడానికి మరియు సమాజంపై సానుకూల ప్రభావాన్ని చూపే వ్యక్తులను గుర్తించడంలో మారిషస్ తెలుగు మహాసభ యొక్క నిబద్ధతను ప్రశంసించారు. డాక్టర్ జగదీష్ అంకితభావం మరియు సమాజం పట్ల సేవానిరతిని ఆయన ప్రశంసించారు. ఆయన సేవ అందరికీ ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు."ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ గుర్తింపు నాకే కాదు, సమాజానికి సేవ చేయడానికి తమ జీవితాలను అంకితం చేసే ప్రతి వైద్యునికి ఈ గౌరవం దక్కుతుంది. ప్రతి ఒక్కరికీ అవసరమైన ఆరోగ్య సంరక్షణ అందుబాటులో ఉండేలా నా సేవలను కొనసాగించడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను" అని డాక్టర్ జగదీష్ అన్నారు.మారిషస్ తెలుగు మహా సభ ప్రతినిధులు మాట్లాడుతూ టి.టి.డి. బర్డ్ ట్రస్ట్ హాస్పిటల్ డైరెక్టర్‌గా & గ్రీన్మెడ్ హాస్పిటల్ ఆర్థోపెడిక్ అధిపతి . డాక్టర్ జగదీష్ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దేశవ్యాప్తంగా ఉచిత పోలియో సర్జికల్ మరియు స్క్రీనింగ్ శిబిరాలకు నాయకత్వం వహించారని, నలభై మూడు సంవత్సరాల తన సేవలో భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలలో వికలాంగుల జీవితాలను మెరుగుపరచడానికి అనేక క్యాంపులను నిర్వహించి, 1,83,000 కు పైగా శస్త్ర చికిత్సలు చేయడం ద్వారా ఎంతో మందిని అంగ వైకల్యం పై విజయం సాధించేలా చేశారని తెలిపారు. ఈ విజయం ప్రపంచవ్యాప్తంగా అసమానమైనదని గుర్తు చేశారు.రాబోయే సంవత్సరాన్ని శ్రీ విశ్వావసు నామ సంవత్సరము అంటారు. దీని అర్థం ఇది విశ్వానికి సంబంధించినది. అదేవిధంగా, ప్రపంచ వ్యాప్తంగా పర్యటించి తన సేవలను అందించిన డాక్టర్ గుడారు జగదీష్ కూడా మొత్తం విశ్వానికి సంబంధించిన వైద్యుడు కాబట్టి విశ్వావసు పేరిట “విశ్వ వైద్య దివ్యాంగ బంధు” అవార్డుతో ఆయనను సత్కరిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలుగు వారి యొక్క కళాత్మక వారసత్వాన్ని ప్రతిబింబించే శాస్త్రీయ నృత్యాలు, జానపద పాటలు మరియు సాంప్రదాయ సంగీతంతో సాంస్కృతిక ప్రదర్శనలు జరిగాయి. ఈ అవార్డు ప్రదానోత్సవంలో మారిషస్ ప్రధాన మంత్రి డాక్టర్ నవీన్‌చంద్ర రామ్ గూలమ్ తో పాటు ఉప ప్రధాన మంత్రి శ్రీ పాల్ రేమండ్ బెరెంజర్, ప్రజాసేవలు మరియు పరిపాలనా సంస్కరణల మంత్రి శ్రీ లుచ్మన్ రాజ్ పెంటియా, విద్య, కళలు మరియు సాంస్కృతిక శాఖా మంత్రి శ్రీ మహేంద్ర గోండీయా, మారిషస్‌లో భారత హైకమిషనర్ అనురాగ్ శ్రీవాస్తవ, ఇందిరా గాంధీ భారత సంస్కృతి డైరెక్టర్ డాక్టర్ కాదంబినీ ఆచార్య, మారిషస్ తెలుగు మహా సభ అధ్యక్ష, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

సింగపూర్‌లో విశ్వావసు నామ ఉగాది వేడుకలు, పంచాంగ శ్రవణం
తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు ఇక్కడి పోటోన్గ్ పాసిర్ లోని శ్రీ శివ దుర్గ ఆలయంలో మార్చి 30న ఘనంగా జరిగాయి. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో అందరికి మంచి జరగాలని ఉగాది పర్వదినాన సొసైటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. వేడుకల్లో బాగంగా శ్రీ పేరి కృష్ణ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. గంటల పంచాంగాన్ని ప్రముఖ పంచాంగ కర్తలు పండిత బుట్టే వీరభద్ర దైవజ్ఞ (శ్ర శ్రీశైల దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి)సిద్ధం చేయడం జరిగింది. ఈ వేడుకల్లో 300పైగా ప్రవాస తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాసులు పాల్గొన్నారు. వేడుకల్లో పాల్గొన్న వారందరికి సాంప్రదాయ ఉగాది పచ్చడి తదితర ప్రసాదాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా ప్రాంతీయ కార్యదర్శులు సంతోష్ వర్మ మాదారపు, భాస్కర్ నడికట్ల, శశిధర్ ఎర్రమ రెడ్డి, ఉపాధ్యక్షులు నల్ల భాస్కర్, దుర్గాప్రసాద్ , సంతోష్ కుమార్ జూలూరి , ప్రశాంత్ బసిక, ఉపాధ్యక్షురాలు సునీత రెడ్డి మిర్యాల, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము,కార్యవర్గ సభ్యులు పెరుకు శివ రామ్ ప్రసాద్ పాల్గొన్నారు. తెలంగాణ కల్చరల్ సొసైటీ వారు చేస్తున్న కార్యక్రమాలను భక్తులు కొనియాడారు.ఉగాది వేడుకల నిర్వహణ, దాతలకు, స్పాన్సర్లతోపాటు, సంబరాల్లో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి TCSS ధన్యవాదాలు తెలిపింది. ఈ వేడుకలలో పాల్గొన్న వై.ఎస్.వి.ఎస్.ఆర్.కృష్ణ (పాస్స్పోర్ట్ అటాచ్, ఇండియన్ హై కమిషన్, సింగపూర్) గారికి అధ్యక్షులు గడప రమేష్ బాబు, కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు. అలాగే మై హోమ్ బిల్డర్స్, సంపంగి రియాలిటీ & ఇన్ఫ్రాస్ట్రక్చర్, ASBL కన్స్ట్రక్షన్ కంపెనీ, గారాంటో అకాడమీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, వజ్రా రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ, ఏపీజే అభిరామి, ఏపీజే జువెల్లర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎవోల్వ్, సౌజన్య డెకార్స్‌కు సొసైటీ కృతజ్ఞతలు తెలిపింది.మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

అట్టహాసంగా ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ మహాసభలు
ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA) మొదటి జాతీయ మహాసభలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియ (Philadelphia) ఎక్స్ పో సెంటర్లో మార్చి 28న మొదటి రోజు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, వివిధ రంగాల ప్రముఖులతో మొదటిరోజు వేడుక ఎన్నారైలను ఆకట్టుకుంది. కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు ఘనమైన స్వాగతసత్కారాన్ని నిర్వాహకులు అందించారు.కన్వెన్షన్ కన్వీనర్ సత్య విజ్జు, రవి చిక్కాల స్వాగతోపన్యాసం చేశారు. ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (andhra pradesh american association) ఫౌండర్ హరి మోటుపల్లి AAA ముఖ్య నాయకులను వేదిక మీదకు ఆహ్వానించి, అభినందించారు. అనంతరం ఫౌండర్ హరి మోటుపల్లి AAA ఏర్పాటు, తదితర విషయాలపై క్లుప్తంగా వివరించారు. AAA అధ్యక్షులు బాలాజీ వీర్నాల సభికులను ఉద్దేశించి ప్రసంగించారు. ఊహించిన దానికన్నా కన్వెన్షన్ విజయవంతం కావడం పట్ల ప్రెసిడెంట్ ఎలక్ట్ హరిబాబు తూబాటి హర్షం వ్యక్తం చేశారు. సహకరించిన వారందరికీ ధన్యవాదాలు చెప్పారు. దాతలు, వాలంటీర్లను ప్రత్యేకంగా అభినందించారు.కన్వెన్షన్‌ను పురస్కరించుకుని AAA నిర్వహించిన పోటీల్లో విజేతలకు హీరో, హీరోయిన్లు బహమతులు ప్రదానం చేశారు. హీరోలు సందీప్ కిషన్, ఆది, సుశాంత్, తరుణ్, విరాజ్.. హీరోయిన్స్ దక్ష, రుహాని శర్మ, అంకిత, కుషిత, ఆనంది ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రముఖ దర్శకులు సందీప్ వంగా, శ్రీనువైట్ల, వీరభద్రం, వెంకీ అట్లూరి మొదటిరోజు వేడుకల్లో మెరిశారు. డైరక్టర్ సందీప్ వంగాను స్టేజిమీదకు పిలిచినప్పుడు హాలంతా చప్పట్లతో దద్దరిల్లిపోయింది. టాలీవుడ్ (Tollywood) హీరోయిన్ రుహాని శర్మ, సినీ దర్శకులు వెంకీ అట్లూరి మ్యూజిక్ అవార్డ్స్ విజేతలను ప్రకటించారు. తరుణ్ నటించిన సినిమాల పాటలతో చేసిన ట్రిబ్యూట్ డాన్స్ ఆకట్టుకుంది. తానా, నాట్స్ వంటి ఇతర సంస్థల నాయకులను కూడా వేదికపైకి ఆహ్వానించి సన్మానించారు. మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన నిరవల్ బ్యాండ్ మ్యూజికల్ నైట్ అందరినీ అలరించింది. మహిళలు, పిల్లలు నిరవల్ బ్యాండ్ సింగర్స్ పాటలకు డాన్సులు చేసి ఆనందించారు. ఆంధ్ర వంటకాలతో వడ్డించిన బాంక్వెట్ డిన్నర్ అందరికీ ఎంతో నచ్చింది. బాంక్వెట్ డిన్నర్ నైట్‌కి సుప్రీమ్, ఎలైట్, ప్రీమియం అంటూ 3 రకాల సీటింగ్ ఏర్పాట్లు చేసి అందరి ప్రశంసలను నిర్వాహకులు అందుకున్నారు. సెలెబ్రిటీలు, స్టార్స్ అందరికీ అందుబాటులో ఉండేలా ఈ సీటింగ్ ఏర్పాట్లు చేయడం బాగుంది. ఆటపాటలతో ఆనందోత్సాహాలతో మొదటి రోజు కార్యక్రమం ముగిసింది.చదవండి: గల్ఫ్ భరోసా డాక్యుమెంటరీని విడుదల చేసిన సీఎం రేవంత్‌రెడ్డి
క్రైమ్

భర్త వివాహేతర సంబంధం.. భార్య ఆత్మహత్య..!
యశవంతపుర(కర్ణాటక): వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందినఘటన బెంగళూరుని హెబ్బాళ కనకనగరలో సోమవారం సాయంత్రం జరిగింది. బషీర్ ఉల్లా, బాహర్ అస్మా(29) దంపతులకు రెండేళ్ల క్రితం వివాహమైంది. అయితే భర్త మరో మహిళతో సన్నిహితంగా మెలుగుతున్నట్లు అస్మా అనుమానించింది. ఇదే విషయంపై తీవ్ర మనో వేదనకు గురైనట్లు సమాచారం. ఈ క్రమంలో ఏం జరిగిందో ఏమో అస్మా ఉరివేసుకున్న స్థితిలో విగతజీవిగా మారింది. విషయం తెలుసుకున్న మృతురాలి బంధువులు వచ్చి పరిశీలించారు. అస్మాను చంపి ఉరివేసినట్లు ఆరోపించారు. ఈమేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి బషీర్ ఉల్లాను అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేపట్టారు.

స్పా సెంటర్ పేరుతో అసాంఘిక కార్యకలాపాలు
సాక్షి,బళ్లారి: ఇనుప ఖనిజ నిల్వలకు ప్రసిద్ధి పొందిన బళ్లారి జిల్లా అసాంఘీక కార్యకలాపాలకు కూడా అడ్డాగా మారింది. మట్కా, పేకాట, జూదాలు యథేచ్ఛగా కొనసాగుతుండటంతో పాటు స్పా మసాజ్ పేరుతో వేశ్యావాటిక తరహాలో అక్కడ అసాంఘీక కార్యకలాపాలు జరుపుతున్నారని పోలీసు తనిఖీల్లో బయట పడుతున్నాయి.గతంలో స్పా మసాజ్‌లు చేయించుకునేందుకు బ్యాంకాక్ వెళ్లేవారికి లేదా బెంగళూరు వెళ్లే వారికి ఆ కష్టనష్టాలు లేకుండా బళ్లారిలో అన్ని సౌకర్యాలు కల్పిస్తూ లాడ్జి యజమానులు డబ్బుల కోసం వేశ్యావాటిక తరహాలోనే స్పా మసాజ్ సెంటర్లు నిర్వహిస్తున్నారు. నగరంలో పేరుగాంచిన ప్రముఖ లాడ్జిల్లో స్పా మసాజ్ సెంటర్లు ఉన్నట్లు బహిరంగంగానే ఫ్లెక్సీలు పెట్టి మరీ స్పా మసాజ్ వ్యాపారాలు చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా బళ్లారిలో స్పా మసాజ్ సెంటర్ల పేరుతో లాడ్జిల్లో అసాంఘీక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.ఇతర రాష్ట్రాల అమ్మాయిలతో మసాజ్ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన అమ్మాయిలతో మసాజ్ చేయిస్తూ వారిని లైంగిక క్రియలకు కూడా ప్రోత్సహిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈనేపథ్యంలో ఇటీవల నగరంలో పేరుగాంచిన బాలా రెసిడెన్సీ హోటల్లో స్పా మసాజ్ సెంటర్లో అసాంఘీక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసు దాడుల్లో వెలుగు చూడటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బాలా రెసిడెన్సీ హోటల్లో మసాజ్ పేరుతో వేశ్యావాటిక తరహాలో అమ్మాయిలతో లైంగిక క్రియలను ప్రోత్సహిస్తూ పెద్ద ఎత్తున వ్యాపారం చేయిస్తుండటంతో పోలీసులు తనిఖీ చేసి ఐదు మందిని అరెస్ట్ చేయడంతో పాటు ముగ్గురు అమ్మాయిలను రక్షించిన సంగతి విదితమే. పోలీసులు ఈ చర్యతో నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారు. అయితే నగరంలో ఒక్క బాలా రెసిడెన్సీ హోటల్, లాడ్జిలోనే కాకుండా అదే తరహాలో స్పా మసాజ్ పేరుతో ప్రముఖ లాడ్జిల్లో అసాంఘీక కార్యకలాపాలను ప్రోత్సహిస్తూ యువతను పెడదోవ పట్టిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.ఒక గది.. రూ.2 లక్షల బాడుగలాడ్జిల్లో ఒక గదిని ప్రత్యేకంగా స్పా మసాజ్ కోసం కేటాయిస్తూ నెలకు ఒక గదిని రూ.2 లక్షలకు పైగా బాడుగకు ఇస్తూ లాడ్జి యజమానులు సొమ్ము చేసుకుంటున్నారు. బాడుగకు తీసుకున్న వ్యక్తులు స్పా మసాజ్ పేరుతో లాడ్జిల్లోని గదుల్లో అమ్మాయిలతో పురుషులకు మసాజ్ చేయించి, వారు కోరితే సెక్స్‌కు ఓకే చేస్తున్నారన్నది బహిరంగ రహస్యం. ఇంతవరకు పోలీసులకు పెద్ద ఎత్తున మామూళ్లు ఇస్తూ యథేచ్ఛగా బ్యాంకాక్ తరహాలో ఇక్కడ అందమైన అమ్మాయిలతో స్పా మసాజ్ అనంతరం అసాంఘీక కార్యకలాపాలు నిర్వహిస్తున్నా పోలీసులు ఇప్పటివరకు దాడులు చేసిన దాఖలాలు లేవు. అయితే ఎస్పీ శోభారాణి నేతృత్వంలో బాలా లాడ్జిపై దాడి చేసి పలువురిని అరెస్ట్ చేయడం శుభపరిణామమే అయినా ఇలాంటివి నగరంలో పేరుగాంచిన లాడ్జిల్లో స్పా మసాజ్ సెంటర్లు ఉన్నాయని, వాటిపై కూడా దాడులు నిర్వహించి స్పా మసాజ్‌లకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు. నగరంలో స్పా మసాజ్ సెంటర్లను మూసివేయించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నగర వాసులు పేర్కొంటున్నారు.

నీకు 21, నాకు 43.. ఓ ఆడిటర్ ప్రేమ వివాహం
తమిళనాడు: కెంగవల్లి సమీపంలో తల్లి దండ్రులపై దాడి చేసి యువతిని ఎత్తుకెళ్లిన ఆడిటర్ పెళ్లి కోలంలో పోలీసులను ఆశ్రయించాడు. సేలం జిల్లా కెంగవల్లి సమీపంలోని క్రిష్ణపురం పంచాయతీకి చెందిన మణికంఠన్(43). ఆడిటర్‌గా ఉంటూ సేలం అంగమ్మాళ్ కాలనీలో కార్యాలయం నిర్వహిస్తున్నాడు. అతనికి పెళ్లయ్యాక భార్యతో మనస్పర్థలు రావడంతో పదేళ్ల క్రితం విడాకులు తీసుకున్నాడు. మణికంఠన్ ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్న కొడుకు, 5వ తరగతి చదువుతున్న కుమార్తెతో నివసిస్తున్నాడు.ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన రాజేంద్రన్ కుమార్తె విద్యాశ్రీ(21) ప్లస్ 2 పూర్తి చేసి ఇంట్లో ఉంటు వచ్చిన స్థితిలో, గత కొన్ని నెలలుగా ఆడిటర్ మణికంఠన్ ఆఫీసులో పనికి వెళ్లింది. ఇద్దరికీ పరిచయం ఏర్పడడంతో విద్యాశ్రీతో వివాహం జరిపించాలని మణికంఠన్ ఆమె తల్లిదండ్రులను కోరాడు. అయితే అతని తల్లిదండ్రులు వ్యతిరేకించారు. కాగా, మణికంఠన్ తన ఐదుగురు స్నేహితులతో కలిసి మంగళవారం రాత్రి 8.30 గంటల సమయంలో విద్యాశ్రీ ఇంట్లోకి చొరబడ్డాడు. ఆమె తల్లిదండ్రులు రాజేంద్రన్, వనిత పై దాడి చేసి విద్యాశ్రీ ని కారులో కిడ్నాప్ చేశారు. గాయపడిన రాజేంద్రన్ వనితను స్థానికులు రక్షించి కెంగవల్లి ప్రభుత్వ అస్పత్రికి తరలించారు. స్థానిక పోలీసులు దర్యాప్తులో 43 ఏళ్ల ఆడిటర్ మణికంఠన్, 21 ఏళ్ల యువతిని ప్రేమ పెళ్లి చేసుకున్నట్లు తేలింది. ఇద్దరూ మేజర్లు కావడంతో వారిని వదిలి వేసినట్లు తెలిసింది.

కూతురిని చంపి.. తల్లి ఉరేసుకుని..
పెద్దపల్లి రూరల్: ఉన్నత చదువులు చదివింది.. కన్నబిడ్డకు విద్యాబుద్ధులు ప్రాప్తించేలా చూడాలంటూ రెండ్రోజుల క్రితమే బాసరలోని సరస్వతీదేవి అమ్మవారి ఎదుట అక్షరాభ్యాసం చేయించింది.. ఇంతలో ఏమైందో ఏమో.. క్షణికావేశంలో కన్న కూతురినే కడతేర్చింది.. ఆపై తానూ ఉరివేసుకుంది. పెద్దపల్లి టీచర్స్ కాలనీలో బుధవారం రాత్రి వెలుగుచూసిన ఈ ఘటనపై మృతురాలి కుటుంబసభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. పెద్దపల్లి ఎల్ఐసీ కార్యాలయంలో పనిచేస్తున్న లోక వేణుగోపాల్‌రెడ్డికి సాహితి (29)తో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమార్తె రితన్య (2) ఉంది. టీచర్స్ కాలనీలో అద్దె ఇంట్లో ఉంటున్నారు. బుధవారం భర్త ఇంట్లో లేని సమయంలో.. సాహితి కూతురు రితన్యకు ఉరివేసి చంపి, తర్వాత తానూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సాహితికి రాత్రి తల్లిదండ్రులు ఫోన్‌చేసినా ఎత్తలేదు. దీంతో అనుమానించి ఇరుగు పొరుగు వారితో మాట్లాడి సమాచారం తెలుసుకోవడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. ఎంటెక్ చదివిన సాహితి ఎక్కువగా ఆలోచిస్తుండేదని, సన్నగా ఉన్నాననే వేదనతో ఉండేదని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఆ బాధ తాలూకు క్షణికావేశంలోనే సాహితి.. కూతురిని చంపి, ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని భావిస్తున్నట్లు సీఐ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. అక్షరాభ్యాసం చేయించి.. రెండు రోజుల క్రితమే బాసరలో చిన్నారి రితన్యతో తల్లిదండ్రులు అక్షరాలు దిద్దించారు. వచ్చే విద్యాసంవత్సరంలో కరీంనగర్‌లోని ఓ పాఠశాలలో నర్సరీలో చేర్పించాలని నిర్ణయించుకున్నారు. ఇంతలోనే ఈ ఘోరం చోటుచేసుకుంది. సాహితి ఆత్మహత్యకు ముందు రాసిన లేఖలో.. భర్త వేణుగోపాల్‌రెడ్డి మంచివాడేనని స్పష్టం చేసింది. తన చావుకు ఎవరూ బాధపడొద్దని, తాను లేకుండా బిడ్డ ఎలా ఉంటుందోననే వేదనతోనే.. వెంట తీసుకెళ్తున్నానని లేఖలో పేర్కొంది.
వీడియోలు


పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లు... లావు శ్రీకృష్ణదేవరాయులపై పేర్ని నాని ఫైర్


టీడీపీ సోషల్ మీడియా అరాచకం పీక్స్ కు వెళ్లింది


మరి ఆ రోజు అనితపై ఎందుకు కేసు పెట్టలేదు: Syamala


ఏపీకి వారం రోజుల పాటు వర్ష సూచన


ఆపరేషన్ 2026 ఎలక్షన్స్ ... అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తు


Dharmapuri Arvind: ఇచ్చిన ఒక్క హామీ కాంగ్రెస్ పూర్తి చేయలేదు


వైఎస్ జగన్ పై వంగలపూడి అనిత వ్యాఖ్యలకు దిమ్మతిరిగేలా పేర్ని నాని కౌంటర్


Perni Nani: చంద్రబాబు సంస్కారం ఏంటో రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు


రాపిడ్ ఫైర్: ప్రదీప్ మాచిరాజు And దీపికా పిల్లి


వివాహితపై జైలర్ వేధింపుల కేసు వివరాలు వెల్లడించిన విశాఖ సీపీ