
అవయవ దానంపై అవగాహన
స్ఫూర్తిదాయకంగా జీవన్‌దాన్
లక్డీకాపూల్: అవయవ దానంపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో తెలంగాణ జీవన్‌దాన్ స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఈ ఏడాది మూడు నెలల వ్యవధిలోనే 56 బ్రెయిన్ డెడ్ కేసుల్లో అవయవ దానాలను నమోదు చేసుకుని జీవన్‌దాన్ సరికొత్త స్ఫూర్తిని నింపిందని రాష్ట్ర జీవన్‌దాన్ ప్రోగ్రామ్ నోడల్ అధికారి డాక్టర్ శ్రీభూషణ్ రాజు తెలిపారు.
ఈ సంఖ్య శనివారం బ్రెయిన్ డెడ్‌కు గురైన 15 ఏళ్ల మహేష్ అవయవదానంతో 57కి చేరిందని, అతడి నుంచి రెండు కిడ్నీలు, కాలేయం, రెండు కళ్లను సేకరించామని అన్నారు. మహబుబ్‌నగర్ జిల్లా దుప్పల్లికి చెందిన నైరి మహేష్ బైక్‌ని అతివేగంగా నడిపి చెట్టుకు ఢీకొని బ్రెయిన్‌డెడ్ అయినట్టు తెలిపారు. అతడి తండ్రి గోవర్ధన్ సహృదయంతో తనయుడి అవయవాలను జీవన్‌దాన్‌కు దానం చేయడానికి ముందుకు వచ్చారని పేర్కొన్నారు. అవయవ దానం అనేది ఒక గొప్ప దాతృత్వ చర్య, ఇది అనేక మందికి ప్రాణాలను కాపాడటానికి, వారి జీవితాలను మెరుగుపరచడానికి సహాయపడుతుందని శ్రీభూషణ్‌రాజు స్పష్టం చేశారు.