ఐశ్వర్యరాయ్‌ బాడీగార్డ్‌ వేతనం ఎంతో తెలుసా? సీఈవోలకు మించి | Meet Aishwarya Rai Bachchan Bodyguard Who Earns More Than Top MNC Executives | Sakshi
Sakshi News home page

ఐశ్వర్యరాయ్‌ బాడీగార్డ్‌ వేతనం ఎంతో తెలుసా? సీఈవోలకు మించి

Published Mon, Mar 31 2025 12:19 PM | Last Updated on Mon, Mar 31 2025 1:44 PM

Meet Aishwarya Rai Bachchan Bodyguard Who Earns More Than Top MNC Executives

సినీ తారల కీర్తి, సంపద గురించి  ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే ఉండదు. వృత్తిపరంగా వచ్చే ఆదాయంతో పాటు, ఎండార్స్‌మెంట్లు, ప్రకటనలు తదితర మార్గాల ద్వారా భారీ ఆదాయాన్నే సంపాదిస్తారు.   ఫ్యాన్‌ ఫాలోయింగ్‌, క్రేజ్‌కి తోడు  సహజంగానే అధిక భద్రత అవసరం  ఉంటుంది.  అందులోనూ సూపర్‌ స్టార్లకు మరింత రక్షణ అవసరం. వారి కుటుంబాలకు భద్రతాపరమైన ప్రత్యేకమైన ఏర్పాటు ఉంటుంది. ముఖ్యంగా స్టార్‌ హీరోలు, హీరోయిన్ల వ్యక్తిగత భద్రతకోసం తమతోపాటు పాటు వచ్చే వ్యక్తిగత అంగరక్షకులపై భారీగా  ఖర్చు పెడతారు. ఒక్కో సెలబ్రిటీ బాడీగార్డ్‌ (Bodyguard) సంపాదన కార్పొరేట్‌ కంపెఈ సీఈవోలకు మించి ఉంటుంది.  మరి బాలీవుడ్‌ అందాల తార  ఐశ్వర్య రాయ్ బచ్చన్ (Aishwarya Rai Bachchan) బాడీగార్డ్‌ జీతం ఎంతో తెలుసా?

బాలీవుడ్ ప్రపంచం గ్లామర్ , స్టార్‌డమ్‌తో నిండి ఉంటుంది.  అందాల ఐశ్వర్యం  ఐశ్వర్య ప్రపంచవ్యాప్తంగా భారీ అభిమానులను సంపాదించుకుంది. ఆమె బయటికి అడుగుపెట్టినప్పుడల్లా నిరంతరం  భారీ భద్రత అవసరం.  సినిమాలు, రెడ్ కార్పెట్ ప్రదర్శనల నుండి అంతర్జాతీయ ప్రయాణాల వరకు ఐశ్వర్య విశ్వసనీయ బాడీగార్డ్‌ శివరాజ్. ఆయన అందిస్తున్నసేవలకు నిదర్శనంగా  గత కొన్నేళ్లుగా  బచ్చన్ కుటుంబ భద్రతా బృందంలో కొనసాగుతున్నాడు. ఐశ్వర్యతో పాటు సినిమా సెట్‌లు, పబ్లిక్ ఈవెంట్‌లు , అంతర్జాతీయ పర్యటనలకు శివరాజ్‌ తోడు ఉండాల్సిందే. మరో విధంగా చెప్పాలంటే శివరాజ్ కేవలం ఒక ప్రొఫెషనల్ గార్డు మాత్రమే కాదు ఆమె కుటుంబానికి  అంతకుమించిన ఆత్మీయుడు కూడా. 

2015లో శివరాజ్ పెళ్లికి కూడా ఐశ్వర్య హాజరు కావడం విశేషం. ఐశ్వర్యతోపాటు ఆమె కుటుంబాన్ని రక్షించడంలో అంతటి అభిమానాన్ని సంపాదించుకున్నాడు. మరి అంతటి నమ్మకమైన అంగరక్షకుడు శివరాజ్‌ ఉంటే ఐశ్యర్య ఎక్కడ ఎలాంటి షోలకు, ప్రదర్శనకు వెళ్లినా నిశ్చింతగా ఉంటుందట.  అంతటి నమ్మకస్తుడైన బాడీగార్డ్‌ శివరాజ్‌కు  నెలకు దాదాపు 7 లక్షల  రూపాయల వేతనం లభిస్తుందట. అంటే అతని వార్షిక జీతం సుమారు రూ. 84 లక్షలు. అగ్రశ్రేణి బహుళజాతి కంపెనీలలో పనిచేస్తున్న పలువురు కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌ల జీత ప్యాకేజీల కంటే ఈ మొత్తం ఎక్కువ.  అంతేకాదు ఐశ్వర్య బృందంలోని మరో భద్రతా నిపుణుడు రాజేంద్ర ధోలే  వార్షిక ఆదాయం రూ.  కోటి వరకు ఉంటుందని  పలు నివేదికల ద్వారా తెలుస్తోంది.

సెలబ్రిటీ బాడీగార్డ్‌గా ఉండటం అంత సులభం కాదు. ఎంతో అప్రమత్తత, ఓర్పు ఉండాలి. క్లిష్టమైన సమయాల్లో అభిమానుల అభిమానానికి  భంగం కలగకుండా,  ఆమె రక్షణ బాధ్యతను  నిర్వర్తించడం కత్తిమీద సామే. ఈ రిస్క్‌లు , బాధ్యతల  నేపథ్యంలో సెలబ్రిటీల వ్యక్తిగత భద్రతా  సిబ్బందికి అంతటి ఆకర్షణీయమైన  జీతాలు లభించడంలో  ఆశ్చర్యం ఏముంటుంది.

1973, నవంబరు  ఒకటిన పుట్టిన ఐశ్వర్య రాయ్  1994లో విశ్వసుందరిగా ఎంపికైంది. మోడల్‌గా, యాడ్‌ ఫిల్సింలో నటిస్తూ, బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి  అనేక హిట్‌ మూవీలతో  స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. అనేక అవార్డులు సొంతం చేసుకుంది. 2007 ఏప్రిల్‌లో  బాలివుడ్‌ హీరో అభిషేక్ బచ్చన్‌ను  పెళ్లాడింది. వీరికి  2011, నవంబరులో కుమార్తె ఆరాధ్య పుట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement