
ప్రపంచవ్యాప్తంగా పర్యాటకరంగం దూసుకునిపోతున్న వేళ.. ఇప్పటికీ కొన్ని దేశాలు పర్యాటక ఆంక్షలు వీడటం లేదు. వాటిలో ఉత్తరకొరియా, సౌదీ అరేబియా, భూటాన్, తుర్క్‌మెనిస్థాన్ ముందువరుసలో ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన దేశం ఉత్తరకొరియా. ఇక్కడ పర్యటించడానికి చాలా కఠినమైన నిబంధనలున్నాయి.
కేవలం కొన్ని ప్రత్యేక పర్యటనలకు మాత్రమే అనుమతిస్తారు. సౌదీ అరేబియాలో విదేశీ పర్యాటకం చాలా పరిమితంగా ఉండేది. ఆ దేశం 2019లో పర్యాటక వీసాలు జారీ చేయడం ప్రారంభించినా, ఇప్పటికీ, కొన్ని ప్రాంతాలకు విదేశీ పర్యాటకులు వెళ్లడానికి అనుమతించడంలేదు.
తుర్క్‌మెనిస్థాన్‌లో పర్యటించడానికి వీసా పొందడం చాలా కష్టం. ఇక భూటాన్ తమ దేశ పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ఇతర దేశాల పర్యాటకుల సంఖ్యను పరిమితం చేస్తోంది.
(చదవండి: పరీక్ష భయాన్ని ఓడించే టెక్నిక్స్)