Switzerland: సొరంగాల స్వర్గం.. ప్రభుత్వ కృషి అమోఘం | Switzerland Is Known For Its Extensive Tunnel Network, Know About Gotthard Base And Road Tunnel, Lötschberg Base Tunnel | Sakshi
Sakshi News home page

Switzerland Tunnels Story: సొరంగాల స్వర్గం.. ప్రభుత్వ కృషి అమోఘం

Published Tue, Apr 1 2025 11:41 AM | Last Updated on Tue, Apr 1 2025 12:33 PM

Switzerland is known for its extensive tunnel network

మనం ఏదైనా రైలులో లేదా బస్సులో ప్రయాణించినప్పుడు ఆ దారిలో మనకు సొరంగాలు   ఎదురైనప్పుడు అద్భుతమైన అనుభూతికి లోనవుతుంటాం. అలాంటి సందర్భాల్లో మళ్లీమళ్లీ అలాంటి సొరంగాల గుండా వెళ్లాలని అనిపిస్తుంటుంది. ఇక చిన్నపిల్లలైతే సొరంగమార్గం(Tunnel) గుండా వెళ్లినప్పుడు ఒక్కసారిగా చీకటి ‍ప్రదేశంలోకి వెళ్లడం, తరువాత వెలుతురులోకి రావడాన్ని చూసినప్పుడు కేరింతలు కొడుతూ, భలేగా ఎంజాయ్‌ చేస్తుంటారు. మరి ఇలాంటి అనేక సొరంగ మార్గాలు కలిగిన దేశమేదో తెలుసా?

స్విట్జర్లాండ్(Switzerland) విస్తృతమైన సొరంగమార్గాలకు ప్రసిద్ది చెందింది. దేశంలోని వివిధ ప్రాంతాలను అనుసంధానించడంలో ఈ సొరంగాలు ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. ఇవి అటు రైలు మార్గంలోనూ ఇటు, రోడ్డు మార్గంలోనూ కనిపిస్తాయి. ఈ సొరంగ మార్గాల నిర్మాణానికి స్విట్జర్లాండ్‌ ప్రభుతం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. అటు రైలు, ఇటు రోడ్డు మార్గాల్లో విరివిగా సొరంగాలను నిర్మిస్తూ ప్రయాణాలను వేగవంతం చేస్తోంది. ఈ సొరంగమార్గాలు దేశ ప్రజలనే కాకుండా పర్యాటకులను కూడా అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఇటువంటి సొరంగమార్గాల్లో పలు విశేషాలు కలిగినవాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పొడవైన రైలు సొరంగం: గోథార్డ్ బేస్ టన్నెల్
ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే టన్నెల్.. గోథార్డ్ బేస్ టన్నెల్(Gotthard Base Tunnel). దీని నిర్మాణానికి 20 ఏళ్లు పట్టింది. భూమి ఉపరితలానికి ఎనిమిదివేల అడుగుల లోతున ఈ రైలు సొరంగాన్ని నిర్మించారు. నీట్ గోథార్డ్ బేస్ టన్నెల్ అని దీనిని పిలుస్తున్నారు. 57 కిలో మీటర్ల పొడవైన ఈ రైల్వే టన్నెల్ ప్రపంచంలోనే అతి పొడవైన రైలు సొరంగంగా గుర్తింపు పొందింది. జురిచ్ నుంచి మిలాన్ నగరాన్ని కలిపేందుకు ఈ రైలు మార్గం ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో రైలు గంటకు 240 కిలో మీటర్ల వేగంతో  నడుస్తుంది. ఈ రైల్వే టన్నెల్ నిర్మాణానికి స్విస్‌ ప్రభుత్వం రూ. 65 వేల కోట్లు ఖర్చు చేసింది.

పొడవైన రోడ్డు సొరంగం: గోథార్డ్ రోడ్డు టన్నెల్
స్విట్జర్లాండ్‌లోని గోథార్డ్ రోడ్డు టన్నెల్ దేశంలోని గోస్చెనెన్‌ దగ్గర మొదలైన దక్షిణాన టిసినోలోని ఐరోలో వరకు కొనసాగుతుంది. ఇది ఆల్ప్స్  ప్రధాన మార్గమైన సెయింట్ గోథార్డ్ పాస్(Saint Gotthard Pass) వద్ద 16.9 కిలోమీటర్లు (10.5 మైళ్ళు) పొడవున నిర్మితమయ్యింది. 1980 నాటికి ఇది ప్రపంచంలోనే అతి పొడవైన రోడ్డు సొరంగంగా ఇది పేరొందింది. బాసెల్ నుంచి చియాస్సో వరకు వెళుతుంది. దీనిలో రెండు లేన్‌లు ఉన్నాయి. దీనిలో ఒక మార్గాన్ని ద్విచక్రవాహనాల కోసం కేటాయించారు. ఈ సొరంగం  గరిష్టంగా 1,175 మీటర్లు (3,855 అడుగులు) ఎత్తు కలిగివుంది. ఉత్తర పోర్టల్ నుండి ఈ మార్గం 10.3 కిలోమీటర్లు (6.4 మైళ్ళు) పొడవు కలిగివుంది.

మరో రైల్ సొరంగం: లోట్స్చ్‌బర్గ్ బేస్ టన్నెల్
లోట్స్చ్‌బర్గ్ బేస్ టన్నెల్ (ఎల్‌బీటీ) లోట్స్చ్‌బర్గ్ లైన్‌లోని 34.57 కిమీ (21.48 మైళ్ళు) రైల్వే బేస్ టన్నెల్. ఇది స్విట్జర్లాండ్‌లోని బెర్నీస్ ఆల్ప్స్ గుండా పాత లోట్స్చ్‌బర్గ్ టన్నెల్ వరకూ సాగుతుంది . ఇది ఫ్రూటిజెన్ , బెర్న్, రారాన్ , వాలాయిస్ మధ్య నడుస్తుంది. ఆల్ప్స్ పర్వతాల గుండా ఈ లోట్ష్‌బర్గ్ బేస్ టన్నెల్‌ను నిర్మించారు. ఎల్‌బీటీ నిర్మాణం 1999లో ప్రారంభమై, 2007లో పూర్తయింది. మొదటి రైలు కార్యకలాపాలు 2007 డిసెంబర్‌లో ప్రారంభమయ్యాయి. అయితే 2020లో ఈ మార్గంలోకి నీరు, ఇసుక ప్రవేశించడంతో తాత్కాలికంగా ఈ సొరంగాన్ని మూసివేశారు. అనంతరం సొరంగం లోపల అవసరమైన మరమ్మతులు చేశారు.  2020 చివరిలో రవాణా కోసం ఈ సొరంగాన్ని తిరిగి సిద్ధం చేశారు. దీంతో అదే ఏడాది ఏప్రిల్‌ 27న ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి.

ఇది కూడా చదవండి: మరుభూమిగా మయన్మార్‌.. దారుణమైన పరిస్థితులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement