
అర్హులు దరఖాస్తు చేసుకునేలా చర్యలు చేపట్టాలి
జనగామ రూరల్: రాజీవ్ యువ వికాసం పథకానికి వీలైనంత ఎక్కువ మంది అర్హులు దరఖాస్తు చేసుకునేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఉపముఖ్య మంత్రి మల్లు భట్టివిక్రమార్క అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో కలిసి హైదరాబాద్ నుంచి కలెక్ట ర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని దాదాపు ఐదు లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతర వెనుకబడిన తరగతుల నిరుద్యోగ యువత ఆర్థికంగా ఎదిగేందుకే ఈ పథకం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. రుణ మాఫీ విధానంపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. దరఖాస్తు చేసుకున్న తర్వాత పత్రాలను పరిధిని బట్టి మున్సి పాలిటీ, ఎంపీడీఓ కార్యాలయాల్లో అందజేయాలని సూచించారు. వీసీలో జిల్లా నుంచి కలెక్టర్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్, బీసీ, ఎస్సీ, ట్రైబల్ వెల్ఫేర్ సంక్షేమ అధికారులు రవీందర్, విక్రమ్, ప్రేమ కళ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మాధవిలత తదితరులు పాల్గొన్నారు.
వీసీలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క