Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Waqf Amendment Act Supreme Court hearing LIVE updates1
వక్ఫ్‌ పిటిషన్లపై విచారణ.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

సాక్షి, న్యూఢిల్లీ: వక్ఫ్‌ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన 73 పిటిషన్లను(Waqf Petitions) సుప్రీంకోర్టులో ఇవాళ (ఏప్రిల్‌ 16న) విచారణ ముగిసింది. తదుపరి విచారణను రేపటి మధ్యాహ్నానికి వాయిదా వేసింది. వక్ప్ సవరణ చట్టంపై స్టేకు సుప్రీం నిరాకరించింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రతివాదులందరికీ సుప్రీం కోర్టు త్రిసభ్య ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. పిటిషనర్లు లేవనెత్తిన అంశాలకు జవాబు చెప్పాలని ఆదేశించింది. రేపు మధ్యాహ్నం 2 గంటలకు మళ్లీ విచారణ చేపట్టనుంది. కేంద్రం కేవియెట్‌ పిటిషన్‌ వేయడంతో ఇరువైపులా వాదనలను చీఫ్‌ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ సంజయ్‌కుమార్, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా వక్ఫ్‌పై సుప్రీం కోర్టు సీజేఐ సంజీవ్‌ ఖన్నా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘సుదీర్ఘకాలంగా ముస్లిం కార్యక్రమాలకు వాడుతున్న (వక్ఫ్ బై యూజర్) ఆస్తులను డినోటిఫై చేస్తే అనేక సమస్యలు తలెత్తుతాయి. వక్ఫ్ బై యూజర్ ఆస్తులను రిజిస్టర్ చేయడం కష్టం..అయితే ఇది దుర్వినియోగమైంది. అయితే నిజంగా ముస్లిం ధార్మిక కార్యక్రమాలకు ఉపయోగిస్తున్న ఆస్తులు కూడా ఉన్నాయి.హిందువుల ఆస్తులను హిందువులే నిర్వహిస్తున్నారు కదా. పార్లమెంటుకు చట్టాలు చేసే అధికారం లేదా? హిందువుల కోసం కూడా పార్లమెంట్ చట్టాలు చేస్తుంది కదా. ఢిల్లీ హైకోర్టు కూడా వక్ఫ్ భూమిలోనే ఉందని అంటున్నారు. చారిత్రక, పురావస్తు ఆస్తులను వక్ఫ్‌గా ప్రకటించడానికి వీలు లేదు’ అని పేర్కొన్నారు. .. వక్ప్ సవరణ చట్టం పిటీషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. వక్ఫ్ సవరణ చట్టం మత స్వేచ్ఛ హక్కుకు భంగం కలిగిస్తుంది. ఇది రాజ్యాంగ విరుద్ధమైన చట్టం. వక్ఫ్ అంటే ఇస్లాంకు అంకితమైందన్నారు. .. కేంద్రప్రభుత్వం తరఫు వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. జేపిసీ ద్వారా సంపూర్ణంగా అన్ని వర్గాలతో చర్చలు జరిపాము. వక్ఫ్ అనేది కేవలం చారిటీకి సంబంధించినది మాత్రమే. హిందూ ధార్మిక సంస్థలను కూడా ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి’ అని వాదించారు. ..ఈ సందర్భంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హిందువుల ఆస్తులను హిందువులే నిర్వహిస్తున్నారు కదా. పార్లమెంటుకు చట్టాలు చేసే అధికారం లేదా? హిందువుల కోసం కూడా పార్లమెంట్ చట్టాలు చేస్తుంది కదా. ఢిల్లీ హైకోర్టు కూడా వక్ఫ్ భూమిలోనే ఉందని అంటున్నారు. చారిత్రక, పురావస్తు ఆస్తులను వక్ఫ్‌గా ప్రకటించడానికి వీలు లేదు’ అని స్పష్టం చేసింది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు రేపటికి వాయిదా వేసింది. వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు ప్రతిపాదించిన మధ్యంతర ఉత్తర్వులుకేసు విచారణ నేపథ్యంలో కోర్టు వక్ఫ్‌గా ప్రకటించిన ఆస్తులను డినోటిఫై చేయకూడదు . వక్ఫ్ బై యూజర్ అయినా, వక్ఫ్ బై డీడ్ అయినా సరే వాటిని డినోటిఫై చేయవద్దు. వక్ఫ్ భూమా, ప్రభుత్వ భూమా అనే అంశంపై కలెక్టర్ విచారణ జరుపుతున్నప్పుడు దానికి వక్ఫ్ సవరణ చట్టంలోని నిబంధనలను అమలు చేయవద్దు వక్ఫ్ బోర్డు , సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్లో ఎక్స్ అఫీషియో సభ్యులు మినహా మిగిలిన వారంతా తప్పనిసరిగా ముస్లింలు మాత్రమే సభ్యులుగా ఉండాలి

DC win first Super Over of IPL 2025 to leave RR heartbroken2
IPL 2025: ఉత్కంఠ పోరు.. ఢిల్లీ క్యాపిట‌ల్స్ 'సూప‌ర్' విక్టరీ

ఐపీఎల్‌-2025లో వ‌రుస‌గా రెండో మ్యాచ్ అభిమానుల‌ను ఆఖ‌రి వ‌ర‌కు మునివేళ్ల‌పై నిల‌బెట్టింది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌, రాజ‌స్తాన్ రాయ‌ల్స్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ సూప‌ర్ ఓవ‌ర్‌లో ఫ‌లితం తేలింది. ఈ ఉత్కంఠ‌పోరులో ఢిల్లీ విజ‌యం సాధించింది. సూప‌ర్ ఓవ‌ర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజ‌స్తాన్ రాయ‌ల్స్ వికెట్ న‌ష్టానికి 11 ప‌రుగులు చేసింది.మిచిల్ స్టార్క్ బౌలింగ్ చేసిన‌ సూప‌ర్ ఓవ‌ర్‌లో హెట్‌మైర్‌(5), రియాన్ పరాగ్‌(4) రాణించారు. అనంత‌రం 12 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఢిల్లీ కేవ‌లం మూడు బంతుల్లోనే చేధించి విజ‌యాన్ని అందుకుంది. రాజ‌స్తాన్ త‌ర‌పున సూపర్ ఓవ‌ర్ వేసిన సందీప్ శ‌ర్మ బౌలింగ్‌లోకేఎల్‌ రాహుల్ 7 ప‌రుగులు చేయ‌గా.. స్ట‌బ్స్ సిక్స‌ర్ కొట్టి త‌న జ‌ట్టును విజ‌య‌తీరాల‌కు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 188 ప‌రుగులు చేసింది. ల్లీ బ్యాట‌ర్ల‌లో అభిషేక్ పోరెల్(49) టాప్ స్కోర‌ర్‌గా నిలవ‌గా.. రాహుల్(38), స్ట‌బ్స్‌(34), అక్ష‌ర్ ప‌టేల్‌(34) రాణించారు. అనంత‌రం ల‌క్ష్య చేధ‌న‌లో రాజ‌స్తాన్ కూడా 4 వికెట్లు కోల్పోయి స‌రిగ్గా 188 ప‌రుగులు చేసింది. ఆఖ‌రి ఓవ‌ర్‌లో రాజ‌స్తాన్ విజ‌యానికి 9 ప‌రుగులు అవ‌స‌ర‌మ‌వ్వ‌గా.. మిచిల్ స్టార్క్ అద్బుతంగా బౌలింగ్ చేసి కేవ‌లం 8 ప‌రుగులిచ్చాడు. దీంతో మ్యాచ్ టై అయింది. ఈ క్ర‌మంలో మ్యాచ్ ఫ‌లితాన్ని తేల్చడానికి అంపైర్‌లు సూప‌ర్ ఓవ‌ర్‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఈ సూప‌ర్ ఓవ‌ర్‌లో ఢిల్లీనే పై చేయి సాధించింది.

Bhumana Karunakar Reddy Accepts Tdp Palla Srinivasa Rao Challenge3
‘రేపు గోశాలలో కలుద్దాం’.. పల్లా సవాల్‌ను స్వీకరించిన భూమన

సాక్షి, తిరుపతి: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సవాల్‌ను వైఎస్సార్‌సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి స్వీకరించారు. రేపు(గురువారం) ఉదయం 10 గంటలకు ఎస్వీ గోశాల వద్దకు వస్తున్నా, అక్కడ కలుద్దాం’’ అంటూ భూమన ప్రతిసవాల్‌ విసిరారు. టీటీడీ ఈవోనే 43 ఆవులు చనిపోయాయి అని చాలా స్పష్టంగా చెప్పారు. రేపు రండి.. చనిపోయిన గోవులు లెక్కలు చెప్తాం. టీటీడీ గోశాల గురించి కనీస అవగాహన లేకుండా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతున్నారు’’ అని భూమన మండిపడ్డారు.కాగా, ఆధ్యాత్మిక రాజధానిగా గుర్తింపు పొందిన పవిత్ర పుణ్యక్షేత్రంలో గత 10 నెలలుగా అన్నీ అపచారాలే జరుగుతున్నాయి. శ్రీవారి క్షేత్రంలో మద్యం బాటి ళ్లు, బిర్యానీలు, మాంసం, మందుబాబుల వికృత చేష్టలు, పాదరక్షలతో ఆలయంలోకి ప్రవేశించే యత్నం, డ్రోన్‌ కెమెరాల హల్‌చల్, పాపవినాశం తీర్థంలో బోట్ల విహారం, టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న గోశాలలో గోవుల మరణ మృదంగం, ముంతాజ్‌ హోటల్‌ అనుమతులు తదితర సంఘటనలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. వీటిపై సాక్షాత్తు స్వామిజీలు మండిపడి, టీటీడీ, ప్రభుత్వ వ్యవహారశైలికి నిరసనగా ధర్నాలు చేసిన ఘటనలు సామాన్య భక్తులతో పాటు స్థానికులను కలవరపెట్టాయి.వీటిని కట్టడి చేయాల్సిన ప్రభుత్వం, టీటీడీ అధికారులు లోపాలను ఎత్తి చూపుతున్న సామాన్యులపైనా, భక్తులపై కక్ష్య సాధింపు చర్యలు దిగడం దారుణమని పలువురు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పవిత్రపుణ్యక్షేత్రంలో జరిగే అపచారాలపై దృష్టి పెట్టకుండా రాజకీయ కోణంలో చూస్తూ అధికారులు వ్యవహరించడం సమజసం కాదంటూ స్థానికులు, భక్తులు, ప్రజాసంఘాలు, మేధావులు హితవు పలుకుతున్నారు.

TDP high Command seriously warns MLA Ganta Srinivasa rao4
గంటాతో కూటమికి తలనొప్పులు.. పిలిచి మరీ క్లాస్ పీకిన అధిష్టానం

రాష్ట్రంలో తెలుగుదేశం..కాంగ్రెస్.. ఎవరు అధికారంలో ఉన్నా మంత్రిగా హోదా నిలబెట్టుకునే స్థాయి నాయకుడైన గంటా శ్రీనివాస్‌కు ఇప్పుడు వట్టి ఎమ్మెల్యేగా ఉండడం ఇబ్బందికరంగా మారింది. గతంలో మంత్రి హోదాలో కలెక్టర్లు.పెద్ద పెద్ద అధికారులతో హడావుడి చేసే గంటా ఇప్పుడు భీమిలి వరకే పరిమితం అవడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. అందుకే తన ఉనికిని చాటుకునేందుకు అప్పుడప్పుడూ అత్యుత్సాహం చూపిస్తున్నారు. అయితే ఈ ఓవర్ యాక్షన్ని ప్రభుత్వం..పెద్దలు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఆయన చర్యలు ప్రభుత్వానికి ఇబ్బందిగా మారడంతో చీవాట్లు పెడుతూ.. కాస్త హద్దుల్లో ఉండాలని స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారు.విజయవాడలో మంగళవారం జరిగిన ఓ ముఖ్య సమావేశానికి విశాఖ నుంచి బయల్దేరిన గంటా నేరుగా విజయవాడ వెళ్లాల్సి ఉండగా సదరు విమానం ఆయన్ను ముందుగా హైదరాబాద్ తీసుకెళ్లి..అక్కణ్ణుంచి విజయవాడ డ్రాప్ చేసింది.. ఎందుకూ అంటే విశాఖ నుంచి బెజవాడకు డైరెక్ట్ విమాన సర్వీస్ లేదు.. రద్దు చేశారని తెలిసింది. దీంతో ఉదయం వెళ్లాల్సిన గంటా మధ్యాహ్నానికి విజయవాడ చేరుకున్నారు.దీంతో ఆయన ‘ఆంధ్ర టూ ఆంధ్ర వయా తెలంగాణ’ అంటూ ట్వీట్ చేశారు. ఈ పోస్టు మీద టీడీపీ హైకమాండ్ సీరియస్ అయింది. ఏదైనా ఉంటే పార్టీ దృష్టికి తీసుకురావాలని లేనిపక్షంలో విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా మన వారే కదా ఆయనకు చెబితే సరిపోయేది కానీ ఇలా ట్విటర్లోకి ఎక్కి రచ్చ చేయాలా అని చీవాట్లు పెట్టింది. సీనియర్ ఎమ్మెల్యే అయినా ఇలా బాధ్యత లేకుండా ఉంటే ఎలా అని అడిగింది.ఇదిలా ఉండగా.. వతిలో 5 వేల ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మిస్తామని గంటా వియ్యంకుడు, పురపాలక మంత్రి నారాయణ ప్రకటన చేసిన తరుణంలోనే రాష్ట్రంలో అతిపెద్ద నగరమైన విశాఖపట్నం నుంచి విజయవాడకు విమానమే లేదంటూ గంటా శ్రీనివాసరావు ట్విట్టర్లో సెటైర్ వేశారు. అధికార పార్టీ నాయకుడివైన నువ్వు ప్రభుత్వం పరువు తీయడం ఏమిటని అధిష్టానం ప్రశ్నించింది.వాస్తవానికి గంటా శ్రీనివాస్ గతంలో కూడా ప్రభుత్వానికి ఋషికొండ భవనాల తలుపులు తెరిచి హడావుడి చేశారు. ఫోటోలు విడుదల చేశారు. ఆ సందర్భంలో కూడా ఆయనకు పార్టీ నుంచి అక్షింతలు పడ్డాయి. డిప్యూటీ సీఎం పవన్.. ప్రభుత్వంలో నంబర్ టూ అయిన లోకేష్..ఇంకా మంత్రులు ఉండగా కేవలం ఒక ఎమ్మెల్యే అయిన మీరు రుషికొండ భవనాలను చూడడానికి ఎందుకు వెళ్ళారు..మీకు అంత అత్యుత్సాహం ఎందుకు అని అప్పట్లోనే టిడిపి పెద్దలు ప్రశ్నించారు. ఇక ఇప్పుడు కూడా ఈ ట్వీట్ దెబ్బతో చీవాట్లు పడ్డాయి. మొత్తానికి గంటాకు ఈ టర్మ్ బాలేనట్లుంది.::సిమ్మాదిరప్పన్న

UP Minister Shocking Order Transfer The Doctor To Some Jungle5
మంత్రి గారి ‘ఇగో’ హర్టయ్యింది.. అడవికి డాక్టర్ ట్రాన్స్‌ఫర్?!

లక్నో: ఆయనో రాష్ట్ర మంత్రి. స్థానిక ప్రభుత్వాసుపత్రి ప్రారంభోత్సవానికి వచ్చారు. ఆ సమయంలో సదరు ఆస్పత్రిలో విధులు నిర్వహించే ఓ దివ్యాంగ వైద్యాదికారి తనకి సరిగ్గా రాచమర్యాదలు చేయలేదని ఆగ్రహంతో ఊగిపోయారు. ఇలాంటి వాళ్లని ఈ ఆస్పత్రిలో ఎందుకు బాధ్యతలు అప్పగించారో. నియోజకవర్గంలో కాకుండా అడవుల్లో పోస్టింగ్‌ ఇవ్వండి అంటూ హుకుం జారీ చేశారు. మంత్రి, డాక్టర్‌ మధ్య జరిగిన ఘటనపై దుమారం చెలరేగింది.ఉత్తరప్రదేశ్‌లో ఓ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వచ్చి తనకు స్వాగతం పలకలేదని ఆగ్రహించిన ఆ రాష్ట్ర సామాజిక సంక్షేమ శాఖ మంత్రి సంజీవ్ గోండ్.. శారీరక వైకల్యం ఉన్న వైద్యాధికారి డాక్టర్ రవి సింగ్‌ను తక్షణమే తన నియోజకవర్గం నుండి బదిలీ చేయాలని ఆదేశించారు.‘ఇతనిని అడవికి పంపించండి.. ఇలాంటి వారిని ఇక్కడ ఎందుకు ఉంచుతున్నారు?’ అంటూ వైద్యశాఖ ఉన్నతాధికారులకు ఫోన్‌ చేశారు. ప్రస్తుతం,ఈ ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటన సోనభద్ర జిల్లా ఒబ్రా నియోజకవర్గంలోని దిబుల్‌గంజ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో జరిగింది. మంత్రి అక్కడ సౌర విద్యుత్ ప్రాజెక్టును ప్రారంభించడానికి వచ్చారు. మంత్రి వచ్చే సమయంలో వైద్యాధికారి డాక్టర్ రవి సింగ్ ఓ రోగికి చికిత్స చేస్తున్నారు. మంత్రికి స్వాగతం పలికేందుకు వెళ్లలేకపోయారు. దీనిపై మంత్రి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఆయనను బదిలీ చేయాలని జిల్లా వైద్యాధికారికి ఫోన్‌లో ఆదేశించారు.ఆ వీడియోలో ‘ఇతనికి ప్రవర్తించటం రాదు. రోగుల పట్ల కూడా ఇదే విధంగా ఉంటారేమో. ఇతనిని అడవికి పంపించండి’ అంటూ ఫోన్‌ సంభాషించడం మనం గమనించవచ్చు. డాక్టర్ సింగ్ మాత్రం ‘నేను మీ వద్దకు వచ్చాను సార్. రోగికి చికిత్స చేసి వచ్చే సరికి ఆలస్యమైంది అని బదులిచ్చారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోయడంతో మంత్రి సంజీవ్‌ గోండ్‌ వెనక్కి తగ్గారు. తనపై వస్తున్న విమర్శలపై స్పందించారు. వైద్యుడు నన్ను ఆహ్వానించేందుకు రాలేదంటే బహుశా ఆయనకు నేను వస్తున్నాను అన్న విషయం తెలియకపోయి ఉండొచ్చు. అయితే,ఆసుపత్రిలో సదుపాయాలు బాగుండాలి. వైద్యం కోసం వచ్చే పేదలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదంటూ ఆదేశించారు. వారికి ఏదైనా కష్టం కలగిందంటే నేను ఉపేక్షించను అని వ్యాఖ్యానించారు. मंत्री जी की ये कैसी हेकड़ी! डॉक्टर ने नहीं किया 'स्वागत' तो भड़क गए राज्यमंत्री संजीव गोंड, CMO में फोन लगाकर की डॉक्टर की शिकायत, कहा- इनको जंगल में भेजिए #UttarPradesh | #ViralVideo | #Hospital pic.twitter.com/HJzftzlbxB— NDTV India (@ndtvindia) April 16, 2025

Misuse of WFH Delhi CEO uses AI to find staffer moonlighting6
వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌తో సైడ్‌ జాబ్‌.. ఏఐతో పట్టుకున్న సీఈవో

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ను దుర్వినియోగం చేస్తున్న ఓ ఉద్యోగిని ఆ సంస్థ సీఈవో ఏఐ సాయంతో పట్టుకున్నారు. ఆ ఉద్యోగి తమ కంపెనీలో పనిచేస్తూనే మరో కంపెనీలోనూ పనిచేస్తున్నట్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత విశ్లేషణను ఉపయోగించి కనుగొన్నట్లు ఢిల్లీకి చెందిన ఓ కంపెనీ సీఈవో వెల్లడించారు.లా సికో సంస్థ అధిపతి అయిన రామానుజ్‌ ముఖర్జీ గత రెండు నెలల్లో ఉద్యోగి తన పని లక్ష్యాలలో 70% మిస్ అయినట్లు గమనించారు. జవాబుదారీతనం కోసం టైమ్ ట్రాకింగ్ సాఫ్ట్‌వేర్‌ను ఇన్స్టాల్ చేసుకోవాలని అడిగినప్పుడు, ఆమె అకస్మాత్తుగా ఉద్యోగం మానేసిందని, తరువాత లింక్డ్ఇన్‌లో కంపెనీ పని సంస్కృతిని విమర్శిస్తూ పోస్ట్‌ పెట్టిందని ఆయన తెలిపారు.ఆ ఉద్యోగిని రోజూ పని చేయాల్సిన ఆశించిన గంటలలో 40% మాత్రమే పనిచేస్తోందని రోజుకు ఐదు గంటలు పనిని పక్కన పెట్టినట్లు ఏఐ విశ్లేషణలో తేలింది. అంతేకాకుండా తదుపరి దర్యాప్తులో ఆమె నకిలీ ఆఫర్ లెటర్లు, వేతన స్లిప్పులు, అనుభవ ధృవీకరణ పత్రాలు బయటపడ్డాయి.కొన్ని కంపెనీలు ఇప్పటికీ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానాన్ని కొనసాగిస్తున్నాయి. దీన్ని అలుసుగా తీసుకుని కొంత మంది ఉద్యోగులు దుర్వినియోగం చేస్తూ ఏక కాలంలో ఒకటి కంటే ఎక్కువకంపెనీల​కు పనిచేస్తున్నారు. ఈ సంఘటన రిమోట్ వర్క్ ఎథిక్స్ గురించి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగులకు కంపెనీలు కఠినమైన పర్యవేక్షణను అమలు చేయాల్సిన అవసరంపై సోషల్ మీడియాలో చర్చలను రేకెత్తించింది.

Tollywood Hero Raj Tarun and Lavanya Issue In Tollywood7
రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్యపై దాడి.. ఎవరు చేశారంటే?

టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్- లావణ్య ఎపిసోడ్ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. గతేడాది మొదలైన ఈ వివాదం ఇప్పటికీ కొనసాగుతోంది. గతంలోనే వీరిద్దరు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుని కేసులు కూడా పెట్టుకున్నారు. ఇటీవల కొద్ది రోజుల క్రితమే రాజ్‌ తరుణ్‌పై పెట్టిన కేసులు వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపింది. కానీ అంతలోనే రాజ్ తరుణ్- లావణ్య కేసులో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. లావణ్యపై రాజ్ తరుణ్ తల్లిదండ్రులు దాడి చేసినట్లు తెలుస్తోంది. కోకాపేటలోని లావణ్య నివాసానికి వెళ్లి రాజ్ తరుణ్ పేరేంట్స్‌ ఆమెపై కొందరితో దాడి చేయించినట్లు సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు లావణ్య పైన దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.కేసులు వెనక్కి తీసుకున్న లావణ్య..రాజ్ తరుణ్ మీద కేసులు వెనక్కి తీసుకుంటానని.. రాజ్, తాను విడిపోవడానికి మస్తాన్ సాయే కారణమని లావణ్య తెలిపారు. ‘నేను మస్తాన్ సాయి ఇంటికి పార్టీ కోసం వెళ్లాను. నాకు తెలియకుండానే నేను బట్టలు మారుస్తున్నపుడు వీడియో తీసుకున్నాడు. అవి పెట్టుకుని నన్ను బెదిరించాడు. నేను నా వీడియోలు డిలీట్ చేయటానికి ప్రయత్నించాను. ఆ టైం లో నన్ను చంపటానికి మస్తాన్ సాయి ప్రయత్నించాడు. మస్తాన్ సాయి డ్రగ్ పార్టీలు ఇచ్చి యువతులను వశపర్చుకుంటున్నాడు. మస్తాన్ సాయి ఆగడాలు పోలీసులు బయటపెట్టాలని లావణ్య కోరారు.

Delhi Govt Wont Ban CNG Autorickshaws: Transport Minister 8
సీఎన్‌జీ ఆటోలపై నిషేధం!.. ఢిల్లీ మంత్రి క్లారిటీ

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సీఎన్‌జీ ఆటోలపై నిషేధం అంటూ జరుగుతున్న ప్రచారంపై ఢిల్లీ రవాణా శాఖ మంత్రి పంకజ్‌ కుమార్‌ సింగ్ స్పష్టత నిచ్చారు. సీఎన్‌జీ ఆటోల స్థానంలో ఎలక్ట్రిక్‌ వాహనాలతో భర్తీ చేయనున్నారనే వార్తలను మంత్రి పంకజ్‌ కుమార్‌ సింగ్‌ కొట్టిపారేశారు. సీఎన్‌జీతో నడిచే ఆటోరిక్షాలపై నిషేధం విధిస్తామన్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తెలిపారు.ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలను అందించడమే లక్ష్యంగా ఢిల్లీ సర్కార్‌ పనిచేస్తోందని మంత్రి తెలిపారు. ఢిల్లీలో ఎలాంటి ఆటోలను తాము నిలిపివేయబోమని ఆయన ప్రకటించారు. ఢిల్లీలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోందని.. దీనిని దృష్టిలో ఉంచుకుని అక్కడి ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకోబోతుందంటూ వార్తలు వచ్చాయి.త్వరలోనే 'ఈవీ పాలసీ 2.0'ను తీసుకురావడానికి సన్నద్ధమవుతున్న నేపథ్యంలో సీఎన్‌జీ ఆటోలపై బ్యాన్‌ విధిస్తారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. దీంతో రవాణా శాఖ మంత్రి స్పందిస్తూ సీఎన్‌జీ ఆటోలపై నిషేధం విధించబోమంటూ క్లారిటీ ఇచ్చేశారు.

Gachibowli Police issue notice to IAS officer Smita Sabharwal9
Smita Sabharwal: చిక్కుల్లో ఐఏఎస్‌ స్మితా సబర్వాల్‌

హైదరాబాద్‌,సాక్షి: ఐఏఎస్‌ అధికారిణి స్మితా సబర్వాల్‌ చిక్కుల్లో పడ్డారు. కంచ గచ్చిబౌలి భూముల(Kancha Gachibowli land issue) అంశంలో ఐఏఎస్‌ అధికారిణి స్మితా సబర్వాల్‌కు (Smita Sabharwal) పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 12న స్మితా సబర్వాల్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు.మార్చి 31న 'హాయ్ హైదరాబాద్' అనే ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేసిన ఒక గిబ్లీ (Ghibli)చిత్రాన్ని స్మితా సబర్వాల్ రీట్వీట్ చేశారు. ఆ చిత్రంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (hyderabad central university)లోని 'మష్రూమ్ రాక్' ముందు భారీ సంఖ్యలో బుల్డోజర్లు, వాటి ముందు గిబ్లీ శైలిలో నెమలి, జింక ఉన్నాయి. అయితే వైరల్ చిత్రం నకిలీదని పోలీసులు గుర్తించారు. దీంతో ఈ పోస్ట్‌ను రీట్వీట్ చేసినందుకు స్మితా సబర్వాల్‌కు బీఎన్‌ఎస్‌ఎస్ యాక్ట్ సెక్షన్ 179 కింద నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ నోటీసులపై ఆమె ఏవిధంగా స్పందిస్తారనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది.FREE SPEECH - TELANGANA MODEL! In probably a first, police booked a case against an IAS for a RETWEET! Smitha Sabharwal, IAS, principal secretary of Youth Advancement, Tourism & Culture is the latest to be served notices by the Telangana police. The Crime: She retweeted an… pic.twitter.com/5g5rTALYex— Revathi (@revathitweets) April 16, 2025

Ysrcp Wins No Confidence Motion Against Adoni Municipal Chairperson10
ఆదోని మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌పై అవిశ్వాస తీర్మానం నెగ్గిన వైఎస్సార్‌సీపీ

సాక్షి, కర్నూలు జిల్లా: ఆదోని మున్సిపల్ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానాన్ని వైఎస్సార్‌సీపీ నెగించుకుంది. మున్సిపల్ చైర్‌పర్సన్‌ శాంత వంటెద్దు పోకడలకు వ్యతిరేకిస్తూ, వార్డుల అభివృద్ధిలో సహకరించడం లేదంటూ చైర్మన్‌పై వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం కోరారు.కలెక్టర్ ఆదేశాలతో సబ్ కలెక్టర్‌ భరద్వాజ్ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మున్సిపల్ చైర్‌పర్సన్‌ శాంతకు వ్యతిరేకంగా 35 కౌన్సిలర్లతో పాటు ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ కలుపుకుని 36 మంది ఓటు వేయడంతో అవిశ్వాస తీర్మానాన్ని వైఎస్సార్‌సీపీ నెగ్గించుకుంది. కాగా, ‘‘వార్డుల్లో అభివృద్ధి పనులు చేయిస్తామని ఆశ పెట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి పది నెలలు పూర్తయినా రూ.10 పని కూడా చేయలేదన్నారు. వార్డుల్లో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. బీజేపీలో చేరడం వల్ల చీవాట్లు తప్ప ఏమీ ఒరగలేదు.’’ అని 11, 12 వార్డుల కౌన్సిలర్‌ వాసీం అన్నారు. నిన్న ఆయన మాజీ ఎమ్మెల్యే వై.సాయిప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదన్‌ సమక్షంలో తిరిగి వైఎస్సార్‌సీపీలో చేరిన సంగతి తెలిసిందే.ఆయన నిన్న(మంగళవారం) మీడియాతో మాట్లాడుతూ ఇకపై ఊపిరి ఉన్నంత వరకు వైఎస్సార్‌సీపీలోనే కొనసాగుతానన్నారు. సాయిప్రసాద్‌రెడ్డి అడుగుజాడల్లోనే నడుస్తానన్నారు. వార్డులో పెద్దల మాటలను గౌరవించి, జరిగిన పొరపాటు తెలుసుకొని తిరిగి సాయన్న సమక్షంలో పార్టీలోకి వచ్చానన్నారు. 2029లో వైఎస్సార్‌సీపీ గెలుపే లక్ష్యంగా తన వంతు కృషి చేస్తానన్నారు. కూటమి నేతలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement