Jangaon District News
-
జీడికల్ హుండీ ఆదాయం రూ.1.42లక్షలు
లింగాలఘణపురం: మండలంలోని జీడికల్ వీరాచల రామచంద్రస్వామి హుండీ ఆదాయం రూ.1,42,859లు వచ్చినట్లు ఈఓ వంశీ తెలిపారు. మంగళవారం దేవాదాయ ఇన్స్పెక్టర్ వెంకటలక్ష్మి పర్యవేక్షణలో హుండీ లెక్కించారు. దేవస్థాన చైర్మన్ మూర్తి, డైరెక్టర్లు వెంకన్న, శ్రీశైలం, శ్రీధర్‌రెడ్డి, జనగామ ఉప్పలమ్మ గుడి ఈఓ రాములు, సిబ్బంది భరత్, మల్లేశం, శంకర్ తదితరులు ఉన్నారు. రైతులకు నష్టపరిహారం చెల్లించాలి జనగామ రూరల్: వడగండ్లతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలి సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి అన్నారు. మంగళవారం సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ రిజ్వాన్ బాషాకు వినతి పత్రం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లాలో యాసంగిలో రైతులు పెట్టుబడులు పెట్టి పంటలు వేయగా భూగర్భ జలాలు తగ్గి జిల్లాలో 40శాతం పంటలు ఎండిపోగా మిగతా పంట రైతుల చేతికి వచ్చే సమయంలో అకాల వర్షంతో రైతులకు తీవ్రంగా నష్టపరిచిందన్నారు. నష్టపోయిన రైతుకు ఎకరానికి రూ. 50 వేల నష్టపరిహారం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి చందు, గంగాపురం మహేందర్, తోటి దేవదానం, గురజాల లక్ష్మీనరసింహారెడ్డి, కల్యాణం లింగం, పల్లెర్ల లలిత, మబ్బు ఉప్పలయ్య పాల్గొన్నారు జిల్లా జడ్జిగా ప్రతిమ జనగామ రూరల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు జిల్లాల ప్రధాన న్యాయమూర్తులను బదిలీ చేశారు. ఈ మేరకు హైకోర్టు రిజిస్టార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్లో అడిషనల్ జిల్లా సెషన్స్ జడ్జిగా విధులు ని ర్వహిస్తున్న బి.ప్రతిమ జిల్లా జడ్జిగా రానున్నా రు.ఈనెల 23న బాధ్యతలు స్వీకరించనున్నారు. ఖైదీల హక్కులపై అవగాహన జనగామ రూరల్: ఖైదీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులపై అవగాహన ఉండాలని సీనియర్ సివిల్ జడ్జి సి.విక్రమ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సబ్ జైలును సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం అందరికీ సమాన హక్కుల కల్పించిందని, వాటిని ఉపయోగించు కోవాలన్నారు. తెలిసి చేసినా.. తెలియక చేసిన తప్పు..తప్పేనని, వ్యక్తిగత నియంత్రణ తప్పనిసరిగా ఉండాలన్నారు. ఖైదీలకు న్యాయవాది ఉన్నాడా లేడా అని అడిగి తెలుసుకున్నారు. బెయిలు వచ్చి షూరిటీ పెట్టుకోలేనివారు, దీర్ఘకాలికంగా వ్యాధులతో బాధపడుతున్న వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ కృష్ణకాంత్ తదితరులు పాల్గొన్నారు. ‘ఉపాధి’ పనుల పరిశీలన స్టేషన్‌ఘన్‌పూర్: మండలంలోని అక్కపెల్లిగూడెంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపట్టిన పనులను సెస్ (సెంట్రల్ ఎకనామిక్ స్టాటిస్టికల్ స్టడీస్) రాష్ట్ర డైరెక్టర్ ప్రొఫెసర్ రేవతి మంగళవారం పరిశీలించారు. గ్రా మ పంచాయతీ కార్యదర్శి అవినాష్‌తో కలిసి సా గుకు యోగ్యంకాని పదిహేను ఎకరాల భూమిని ఉపాధి పనులతో సాగులోకి తీసుకువచ్చిన పనులను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఈజీఎస్ పనులను వినియోగించుకుంటున్నారని, సాగులో లేని భూమిని సాగులోకి తీసుకురావడం, వ్యవసాయ భూముల వద్దకు రోడ్లు వేయడం, పొలంగట్లపై కొబ్బరి, టేకు, నిమ్మ చెట్లు పెంచడం బాగుందన్నారు. -
వచ్చేస్తున్నాయ్..
జనగామ రూరల్: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో పనులు చేపడుతుంది. ఇప్పటి వరకు 80 శాతం పనులు పూర్తయ్యాయి. అయితే ప్రభుత్వ బడుల్లో చదువుకునే విద్యార్థులకు గతేడాది పాఠ్యపుస్తకాల ముద్రణ ఆలస్యంగా ప్రారంభం అయింది. దీంతో సకాలంలో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. గత అనుభవాలు దృష్టిలో ఉంచుకోని వచ్చే విద్యా సంవత్సరం పాఠశాలల పునఃప్రారంభం రోజే విద్యార్థులకు సమస్యలు రాకుండా పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫామ్స్ అందించడానికి తగు చర్యలు తీసుకుంటుంది. ఇందుకు అవసరమైన పుస్తకాలు జిల్లాకు విడతల వారీగా అందిస్తున్నారు. జిల్లాలో 2,78,310 పుస్తకాలు అవసరం జిల్లాకు అవసరమైన పాఠ్యపుస్తకాలు ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నాయి. 1 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులందరికీ ఉచితంగా పుస్తకాలు అందజేయనున్నారు. మొత్తం 2,78,310 లక్షల పుస్తకాలు అవసరం ఉండగా ప్రస్తుతం మొదటి విడతగా 15,680 పుస్తకాలు జిల్లాకు చేరుకున్నాయి. 1 నుంచి 3వ తరగతి పుస్తకాలు కొంత తక్కువగా వచ్చాయి. 4 నుంచి 10వ తరగతి పుస్తకాలు వస్తున్నాయి. వీటి ని భద్ర పరిచేందుకు జిల్లా కేంద్రంలోని గోదాములు ఏర్పాటు చేసి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇండెంట్ పూర్తి కాగానే వాటిని ఆయా మండలాలకు పంపిణీ చేయనున్నారు. అక్కడ నుంచి పాఠశాలలకు సరఫరాల చేసి జూన్‌లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయనున్నారు. క్యూఆర్ కోడ్‌తో ముద్రణ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధన కొనసాగుతుంది. విద్యార్థుఽలకు అన్ని విషయాలు అర్థం అయ్యే విధంగా ఇబ్బందులు పడకుండా ఉండాలని పాఠ్యపుస్తకాల్లో ఇంగ్లిష్, తెలుగు భాషల్లోనూ పుస్తకాలను ముద్రిస్తున్నారు. అలాగే పుస్తకాలపై క్యూఆర్ కోడ్‌తో ముద్రిస్తున్నారు. దీంతో పుస్తకాలు పక్కదారి పట్టకుండా ఉండే అవకాశం ఉంది. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా జిల్లా, మండలం, పాఠశాల పేరుతో ఆన్లైన్లో రానుంది. దీంతో ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు పక్కదారి పట్టే అవకాశం ఉండదు. పునఃప్రారంభం రోజే పంపిణీ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వి ద్యార్థులందరికీ జూన్‌లో పాఠశాలలు పునఃప్రారంభం రోజే పా ఠ్యపుస్తకాలు పంపిణీకి చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే జిల్లాకు 16 వేలకు వరకు పుస్తకాలు వచ్చాయి. వాటిని గోదాముల్లో భద్రపరిచాం. మిగతావి వచ్చిన తర్వాత అన్ని మండలాలకు అందజేస్తాం. అలాగే విద్యార్థులకు నోట్ పుస్తకాలు, ఏకరూప దుస్తులు అందిస్తాం. సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటాం. – రమేశ్, డీఈఓజిల్లాకు చేరుకున్న పాఠ్యపుస్తకాల వివరాలు పాఠశాలల పునఃప్రారంభం రోజే అందించేలా సన్నద్ధం జిల్లాకు 2,78,310 లక్షల పాఠ్యపుస్తకాలు అవసరం మొదటి విడత చేరుకున్నవి 15,6801వ తరగతి తెలుగు: 1,617 6వ తరగతి ఎస్ఎస్ తెలుగు మీడియం: 2,400 9వ తరగతి ఫిజికల్ సైన్స్: 937 4వ తరగతి ఎన్విరాన్మెంట్ సైన్స్: 50 8వ తరగతి ఇంగ్లిష్: 4,750 9వ తరగతి తెలుగు: 4,800 8వ తరగతి బయోసైన్స్ (తెలుగుమీడియం): 1,112జిల్లాలో పాఠశాలల వివరాలు జిల్లాలో 12 మండలాల్లో ప్రభుత్వ స్థానిక సంస్థల పాఠశాలలు 504 ఉన్నాయి. ఇందులో 341 ప్రాథమిక పాఠశాలలు, 64 ప్రాథమికోన్నత పాఠశాలలు, 103 ఉన్నత పాఠశాలలు ఉండగా మొత్తం 35 వేలకుపైగా విద్యార్థులు ఉన్నారు. -
క్రీడాప్రాంగణాల్లో పిచ్చిమొక్కలు
జనగామ రూరల్: గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు గత ప్రభుత్వం పట్టణాలతోపాటు ప్రతీ పంచాయతీ పరిధిలో క్రీడాప్రాంగణాలు ఏర్పాటు చేసింది. ప్రభుత్వ భూములు ఉన్న చోట మైదానాలు సిద్ధం వేశారు. కానీ నిర్వహణ లేకపోవడంతో పిచ్చిమొక్కలతో నిండిపోయాయి. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన క్రీడామైదానాలను పట్టించుకునే వారే కరువయ్యారు. జిల్లా వ్యాప్తంగా 281 గ్రామ పంచాయతీలు, 201 ఆమ్లెట్ విలేజ్‌లు ఉండగా మొత్తం 483 గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు గుర్తించి 450 వరకు నిర్మాణాలు పూర్తి చేశారు. ఏడాదిన్నర నుంచి గ్రామాల్లో సర్పంచ్‌లు లేకపోవడంతో పంచాయతీ కార్యదర్యులు ప్రత్యేక అధికారులు పట్టించుకోక ఆదరణ కరువైందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నిధుల దుర్వినియోగం క్రీడాప్రాంగణాల ఏర్పాటుకు గత ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చుచేసింది. ప్రతీ పంచాయతీలో సుమారు రూ. 50వేల నుంచి రూ. 2 లక్షల వరకు ఖర్చు చేసింది. పట్టణాల్లో కొంత అదనంగా నిధులు వెచ్చించింది. జిల్లా వ్యాప్తంగా ఆయా గ్రామ పంచాయతీల్లో అనువుగా ఉన్న చోట క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసింది. ఒక్కొక్క క్రీడా ప్రాంగణానికి రూ.2 లక్షల వరకు వెచ్చించినా.. క్రీడా సామగ్రి అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు అటువైపు చూడటం లేదు. ప్రస్తుతం వేసవి సెలవుల దృష్ట్యా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రాంగణాలు బాగు చేయాలని కోరుతున్నారు. నిబంధనలు ఇలా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద క్రీడా ప్రాంగణాల ఏర్పాటు చేపట్టారు. ఆయా గ్రామాల్లో క్రీడా స్థలానికి ఎకరం విస్తీర్ణంలో నిర్మాణం చేపట్టి ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ కోర్టులు, లాంగ్ జంప్, హై జంప్ పీట్లు ఏర్పాటు చేయాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. ఎంపిక చేసిన స్థలం చుట్టూ ఫెన్షింగ్ మాదిరిగా గానుగ, గుల్మోహార్, నిమ్మ, చింత, వేదురు, తంగేడు చెట్లు నాటాలని సూచించారు. గ్రామాలకు దూరంగా.. ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రతీ గ్రామ పంచాయతీలో ఎకరం స్థలంలో అన్ని రకాల వసతులతో ప్రాంగణం ఏర్పాటు చేయాల్సి ఉండగా కొన్ని గ్రామాల్లో స్థలం లభించకపోవడంతో అందుబాటులో ఉన్న స్థలంలో నిర్మించారు. కొన్ని గ్రామాల్లో ఊరికి దూరంగా ఉండడంతో వాటిని చూసే నాఽథుడు కరువయ్యారు. లక్షలు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన ప్రాంగణాలు పనికి రాకుండా పోతున్నాయి. ప్రాంగణాలు ఎలా ఉన్నాయో జిల్లా అధికారులు పర్యవేక్షించిన దాఖలాలు లేవు. ఇప్పటికై న ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి క్రీడాప్రాంగణాలను వినియోగంలోకి తీసుకురావాలని క్రీడాకారులు కోరుతున్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు.. గ్రామీన క్రీడాకారులపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. క్రీడలపై ఆసక్తి ఉన్నప్పటికీ క్రీడాస్థలాలు లేక ఇబ్బంది పడుతున్నారు. పట్టణాలు, గ్రామాల్లో ఉన్న క్రీడా ప్రాంగణాలు అలంకార ప్రాయంగా మారాయి. వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలి. – ఎడ్ల శ్రీనివాస్, మరిగడి గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలి..గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసేలా ప్రభుత్వం కృషి చేయాలి. గతంలో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలు వినియోగంలోకి తీసుకురావాలి. యువతను ప్రోత్సహించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించేలా కృషి చేయాలి. – సురేందర్, కబడ్డీ జాతీయ క్రీడాకారుడు రూపురేఖలు కోల్పోతున్న ఆటస్థలాలు జిల్లా వ్యాప్తంగా 483 గ్రామాల్లో ఇదే పరిస్థితి పట్టించుకోని సంబంధిత అధికారులు -
వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి
జనగామ రూరల్: హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగూరు రాములు అన్నారు. మంగళవారం యూనియన్ జిల్లా విస్తృత స్థాయి సమావేశం రాపర్తి రాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హమాలీ కార్మికులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి సామాజిక భద్రత, సంక్షేమ పథకాలు అందడం లేదన్నారు. కార్మిక వ్యతిరేక చట్టాల రద్దుకు మే 20వ తేదీన జాతీయ సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయని, హమాలీ కార్మికుల పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి యాటల సోమన్న, సుంచు విజేందర్, అన్నేబోయిన రాజు, తాండ్ర ఆనందం, సుంకు రాజు, గజ్వేల్ రమేశ్, బి.భాస్కర్, పోతం మధు, మంగ నరసింహ, రాజు తదితరులు పాల్గొన్నారు. ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాములు -
అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన
పాలకుర్తి టౌన్: జాతీయ అగ్నిమాపక భద్రతా వారోత్సవాల సందర్భంగా మంగళవారం మండల కేంద్రంలోని క్లాత్‌స్టోర్స్, షాపింగ్ కాంప్లెక్స్‌లో ఫస్ట్ ఎయిడ్ ఫైర్ ఫైటింగ్ సిస్టంపై పాలకుర్తి అగ్నిమాపక కేంద్ర అఽధికారి సీహెచ్ శ్రీరాములు ఆధ్వర్యంలో షాపింగ్ కాంఫ్లెక్స్ సిబ్బందికి అగ్ని ప్రమాద నివారణ భఽద్రత చర్యలు వివరించారు. అగ్ని ప్రమాదాలు నివారణపై అవగాహన కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక కేంద్రం సిబ్బంది రామయ్య, నాగరాజు, అశోక్, ప్రశాంత్, ప్రదీప్‌కుమార్, మహేందర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోళ్లు సమర్థవంతంగా నిర్వహించాలి
జనగామ రూరల్: ధాన్యం కొనుగోళ్లు సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రతీరోజు కేంద్రాలను పర్యవేక్షించాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ రోహిత్ సింగ్ ఆదేశించారు. మంగళవారం జనగామ మండలం పెంబర్తి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ఓపీఎంఎస్లో వివరాలను నమోదు చేయాలన్నారు. అకాల వర్షాలతో ధాన్యం తడవకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. పౌరసరఫరాల శాఖ అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి, పరిశీలించాలన్నారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల అధికారి సరస్వతి, సహకార శాఖ అధికారి రాజేందర్ రెడ్డి, డీఎం మేనేజర్ హథిరాం తదితరులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్ -
నేటి నుంచి ఉప్పల మల్లన్న జాతర
దేవరుప్పుల: నేటి నుంచి 19వ తేదీ వరకు మండల కేంద్రంలో ఉప్పల మల్లన్న జాతర జరగనుందని ఆలయ పూజారి పెద్దాపురం వెంకటేశ్వరశర్మ మంగళవారం తెలిపారు. ఈ నెల 16 నుంచి 19వ తేదీ వరకు జరిగే జాతరలో రోజువారీగా అభిషేకాలు, పద్మశాలీలచే శావ ఊరేగింపు, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకము, శివపార్వతుల కల్యాణం, బండ్లు తిరుగుట, వాసవీ మాత ఆలయంలో అర్చనలు, దోపోత్సవము, అగ్నిగుండాలు, ఏకాంతసేవలు, వసంతోత్సవం, రుత్విక్ సన్మానంతో ముగయనుందన్నారు. పూర్వం మండల కేంద్రానికి ఓ ఉప్పు వ్యాపారి బస్తాలను వాగులో నుంచి ఎడ్లబండిపై తీసుకువస్తుండగా మార్గమధ్యలో ఆ బండి దిగబడింది. దీంతో బస్తాలు కిందికి దింపే క్రమంలో శివలింగం (దేవర) ఉప్పులో దొరికింది. దీంతో ఆ గ్రామానికి వేదబ్రహ్మణులు దేవరుప్పుల (దేవర +ఉప్పుల)గా నామకరణం చేసి ఊరుకు పడమర శివాలయాన్ని స్థాపించారని ఇక్కడి పూర్వికులు చెబుతుంటారు. ఆనాటి నుంచి ఏటా శ్రీ భ్రమరాంభ మల్లికార్జునస్వామి కల్యాణోత్సవాలను మూడు రోజులపాటు నిర్వహిస్తారు. ఈ సారి ప్రతిష్టాత్మతకంగా జరిగే జాతరలో శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వార్షిక కల్యాణ సహిత నూతన పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠ, గణపతి, నంది విగ్రహాల పునఃప్రతిష్ఠాపనకు సిద్ధం చేస్తున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు. -
‘భూ భారతి’పై అవగాహన సదస్సులు నిర్వహించాలి
జనగామ రూరల్: భూ భారతి చట్టంపై అవగాహన సదస్సులను నిర్వహించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్‌తో కలిసి తహసీల్దార్లు, ఎంఏఓలు, ఏఈఓలు, డిప్యూటీ తహసీల్దార్లు, డీపీఎంలు, ఏపీఎంలతో భూ భారతి – కొత్త ఆర్ఓఆర్ చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజల భూ సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా భూ భారతి నూతన ఆర్ఓఆర్ చట్టాన్ని ప్రారంభించిందన్నారు. ఈ చట్టం కింద హక్కుల రికార్డును రూపొందించడం, భూమిపై హక్కులు సంక్రమించినప్పుడు ఆ రికార్డులో మార్పులు చేయడం ప్రధాన ఉద్దేశ్యమన్నారు. రికార్డులో తప్పుల సవరణకు అవకాశం, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చేసేందుకు ముందుగా భూముల సర్వే, మ్యాప్ తయారీ, గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణ, భూ సమస్యల పరిష్కారానికి రెండంచెల అప్పీల్ వ్యవస్థ, మొదలగునవి భూ భారతిలో కీలక అంశాలన్నారు. అలాగే జిల్లాలో ఇప్పటివరకు 162 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామన్నారు. నిర్వాహకులు ప్రతీరోజు కేంద్రాలను పర్యవేక్షించాలన్నారు. వర్షాలతో ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సమావేశంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు సుహాసిని, హనుమాన్ నా యక్, ఆర్డీఓలు గోపీరాం, వెంకన్న, డీఏఓ రా మారావు నాయక్, డీసీఎస్ఓ సరస్వతి, డీఆర్డీఏ వసంత, డీఎం సీఎస్ హతీరాం, డీసీఓ రాజేందర్ రెడ్డి, ఏసీఎస్ఓ ఇర్ఫాన్ అహ్మద్ ఖాన్ పాల్గొన్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా -
నేటినుంచి సామాజిక, ఆర్థిక సర్వే
జనగామ: జనగామ పురపాలిక డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్‌కు అనుబంధంగా అమృత్–2.0 పథకంలో భాగంగా నేటి(బుధవారం)నుంచి పట్టణంలో సామాజిక, ఆర్థిక సర్వే నిర్వహించనున్నారు. పట్టణంలోని 30 వార్డుల పరిధిలో సుమారు 16,400 వ్యాపార, వాణిజ్య సంస్థలు (నిర్మాణాలు) ఉన్నాయి. ఇందులో 10 శాతం అసెట్స్ పరిధిలో కుటుంబాల సర్వే చేపట్టే విధంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పురపాలిక సిబ్బంది ఆధ్వర్యంలో ప్రతీ వార్డులో 10 శాతం కుటుంబాలను సెలెక్టు చేసుకుని ఇంటింటి సర్వే చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. టౌన్ ప్లానింగ్ నిబంధనలను అనుసరిస్తూ, మాస్టర్ ప్లాన్‌లోని జనరల్ టౌన్ ప్లానింగ్ స్కీం తయారీలో భాగంగా భూ వినియోగ విభజన, రహదారులు, మురికి కాల్వలు, పారిశుద్ధ్య, తాగునీటి సరఫరా, పచ్చదనంకు సంబంధించి కార్యాచరణ రూపొదించాలని అందులో పేర్కొన్నారు. సర్వేలో పట్టణ పేరు, వార్డు నంబర్, ఇంటి యజమాని పేరు, వయసు, ఏరియా పేరు, ల్యాండ్ మార్కు, విద్యార్హతలు, వృత్తి, తదితర వివరాలు నమోదు చేసుకుంటారు. నేటి నుంచి సర్వే ప్రారంభమవుతుందని, పట్టణ ప్రజలు సహకరించాలని కమిషనర్ వెంకటేశ్వర్లు తెలిపారు. -
ప్రభుత్వానికి నివేదిక అందిస్తాం..
● వ్యవసాయ, హార్టికల్చర్ అధికారులు జనగామ: అకాల వర్షంతో నష్టపోయిన పంటల వివరాలను ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని వ్యవసాయ, హార్టికల్చర్ అధికారులు తెలిపారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశాల మేరకు సోమవారం జనగామ మండలం పెంబర్తి, సిద్దెంకి, చిల్పూర్, పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల, లింగాలఘణపురం, తరిగొప్పుల మండలాల పరిధిలో వడగళ్ల వర్షంతో నష్టపోయిన మామిడి తోటలు, వరి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయాధికారి రామారావు, హార్టీకల్చర్ అధికారి శ్రీధర్ మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి సమర్పించినట్లు తెలిపారు. రైతుల వారీగా పూర్తి సమగ్ర నివేదికను తయారు చేసి సమర్పించాలని వ్యవసాయ విస్తరణ అధికారులను ఆదేశించారు. వారి వెంట ఏడీఏ వసంత, ఏఓ వెంకటేశ్వర్లు, వ్యవసాయ విస్తరణ అధికారి ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు. అగ్నిప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలిపాలకుర్తి టౌన్: అగ్నిప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని అగ్నిమాపక కేంద్రం అధికారి శ్రీరాములు అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని లక్ష్మినర్సింహస్వామి ఆలయంలో వారోత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 14 నుంచి 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజలు ఎండాకాలంలో సంభవించే అ గ్నిప్రమాదాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక కేంద్రం సిబ్బంది రామయ్య, నాగరాజు, అశోక్, ప్రశాంత్, ప్రదీప్‌కుమార్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. -
విగ్రహావిష్కరణలో ఉద్రిక్తత
దేవరుప్పుల: మండల కేంద్రంలోని జనగామ–సూర్యాపేట రహదారి దేవరుప్పుల చౌరస్తాలో అంబేడ్కర్ విగ్రహావిష్కరణలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సోమవారం స్థానిక దళితుల కమిటీ ఆధ్వర్యంలో ఎర్రబెల్లి దయాకర్‌రావు, పలువురి దాతల సహకారంతో విగ్రహం, గద్దె నిర్మాణం పూర్తయింది. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ఆవిష్కరణ నిలిచిపోయింది. ఇటీవల విగ్రహ నిర్మాణ కమిటీ సభ్యులు విగ్రహావిష్కరణకు బీఆర్ఎస్ అనుబంధ నాయకులకు మా త్రమే ఆహ్వానం పలకడంతో వివాదం తెరమీదకు వచ్చింది. ఈ విషయమై తహసీల్దార్, పోలీసులు నిర్వాహకులతో చర్చించారు. వివాదాస్పదం కాకుండా వ్యవహరించాలని సూచించారు. కేవలం విగ్రహ నిర్మాణ కమిటీ ప్రతినిధులు మా త్రమే విగ్రహాన్ని ఆవిష్కరించాలని సూచించారు. దీంతో నిర్వాహక ప్రతినిధులు జోగు సోమనర్స య్య, చింత యాదగిరి, భాషిపాక అబ్బయ్య, యాదగిరి, సుదర్శన్, ఎల్లేష్ తదితరులు కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ క్రమంలో ఎర్రబెల్లి దయాకర్‌రావు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నాయకులు ఎర్రబెల్లిని విగ్రహం వద్దకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుంటే పోలీసులు అడ్డుకున్నారు. అంతా సద్దుమనిగాకా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అయితే అంబేడ్కర్ విగ్రహావిష్కరణలో అధికార పార్టీ రాద్ధాంతంతో కక్ష్యసాధింపు చర్యలకు పాల్పడితే ఊరుకునేది లేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి హెచ్చరించారు. కమిటీ పిలుపుమేరకు దాతగా వచ్చానని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పల్ల సుందర్రామిరెడ్డి, దయాకర్, రవి, రామ్‌సింగ్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
రూ.50వేల నష్టపరిహారం చెల్లించాలి
జనగామ రూరల్: అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులకు ప్రతీ ఎకరాలకు రూ.50వేల నష్టపరిహారం చెల్లించాలని రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య చందునాయక్ డిమాండ్ చేశారు. సోమవారం పట్టణంలో జరిగిన రైతు సంఘం జిల్లా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు పంటల బీమా పథకాన్ని తీసుకువస్తామని హామీ ఇచ్చి నేటికీ అమలు చేయలేదన్నారు. తక్షణమే ఫసల్ బీమాను రైతులకు అనుకూలంగా మార్చి చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. పంట నష్ట పరిహారం రూ.10వేలు ప్రకటించడం అన్యాయమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రాపర్తి సోమయ్య, ఉపాధ్యక్షుడు మాచర్ల సారయ్య, మంగ బీరయ్య, జిల్లా సహాయ కార్యదర్శి రమావత్ మీట్యా నాయక్, రవీందర్ రెడ్డి, రాజవ్వ, నక్క యాకయ్య, లింగబోయిన కుమారస్వామి, ఉర్సుల కుమార్, రైతులు పాల్గొన్నారు. -
నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
జనగామ రూరల్: వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు సోమవారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుకు ఫోన్ ద్వారా విజ్ఞప్తి చేశారు. అనంతరం సిద్దంకి, ఎల్లంల, పెంబర్తి గ్రామాల్లో పర్యటించి నష్టపోయిన పంటలను వ్యవసాయశాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఎకరాకు రూ.10వేల చొప్పున నష్టపరిహారం అందించాలన్నారు. అలాగే మామిడి రైతులకు నష్టపరిహారం అందించాలన్నారు. కార్యక్రమంలో ఏడీఏ బీనా, నాయకులు ఉన్నారు. రైతులను ఆదుకుంటాం: డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని, నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వ పరమైన సహాయం అందించేలా కృషి చేస్తానని డీసీసీ అధ్యక్షుడు కొ మ్మూరి ప్రతాప్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని పెంబర్తి, ఎల్లంల, సిద్ధంకి గ్రామాల్లో దె బ్బతిన్న పంటలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ రైతుల రెక్కల కష్టం నీటిపాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. జరిగిన నష్టంపై నివేదిక సి ద్ధం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటామని రైతులకు ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, రాజమౌళి, నిమ్మతి మహేందర్‌రెడ్డి, సుంకరి శ్రీనివాస్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, రాజిరెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి -
నివేదిక వచ్చాక ప్రహరీ నిర్మాణం
కాకతీయ యూనివర్సిటీ భూములకు సంబంధించి గత కొన్నినెలల క్రితం విజిలెన్స్ అధికారుల సమక్షంలో రెవెన్యూ సర్వేయర్లతో సర్వే జరిగింది. అన్నిచోట్ల హద్దులను నిర్ణయించి మార్కింగ్ చేశారు. యూనివర్సిటీ భూమిపై నివేదిక రావాల్సి ఉంది. వారంరోజుల్లో వస్తుందని భావిస్తున్నాం. నివేదిక వచ్చాక గతంలో నిర్ణయించినట్లు కాకుండా ఇటీవల వేసిన రివైజ్డ్ ఎస్టిమేషన్ రూ.20కోట్లతో చుట్టూరా హద్దుల ప్రకారం గోడ నిర్మిస్తాం. గతంలో ఇచ్చిన కాంట్రాక్టును సైతం క్యాన్సెల్ చేయించాల్సింది. మళ్లీ మరో సంస్థకు అప్పగించాలనే ఆలోచన చేస్తున్నాం.●– ఎన్.వాసుదేవరెడ్డి, కేయూ అభివృద్ధి అధికారి -
బడుగుల ఆశాజ్యోతి అంబేడ్కర్
జనగామ రూరల్: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని, ఆయన ఆశయాలను కొనసాగించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. సోమవారం అంబేడ్కర్ 134వ జయంతిని పురస్కరించుకుని జిల్లా షెడ్యూల్ కులముల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, డీసీపీ రాజమహేంద్రనాయక్‌తో కలిసి అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. డాక్టర్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో అసాధారణ ప్రతిభాశాలి అంబేడ్కర్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాణ, షెడ్యూల్ కులముల మార్గదర్శకుడు అంబేడ్కర్ ఆలోచనలు, ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ సమాజంలో ప్రజలందరూ స్వేచ్ఛగా జీవించేందుకు రాజ్యాంగం దోహదపడిందన్నారు. విద్యనే అభివృద్ధికి పునాది అన్నారు. కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ అంబేడ్కర్ అనగారిణ వర్గాల అభ్యున్నతికి పాటు పడి మహానీయుడన్నారు. కార్యక్రమంలో ఏసీపీ నితిన్ చేతన్, ఆర్డీఓ గోపిరామ్, జిల్లా షెడ్యూల్ కులముల అభివృద్ధి అధికారి డాక్టర్ విక్రమ్ కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మాధవి లత, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు పారనంది వెంకటస్వామి, కందుకూరి ప్రభాకర్, విజయ్, ధనలక్ష్మి, ధర్మభిక్షం, శివ శంకర్, శేఖర్, ప్రజా ప్రతినిధులు, నాయకులు, పోలీస్ అధికారులు, కళాకారులు పాల్గొన్నారు. జిల్లాలో ఘనంగా జయంతి వేడుకలు పాల్గొన్న కలెక్టర్ రిజ్వాన్ బాషా, ఎమ్మెల్యే పల్లా, డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి -
సీఎం సమావేశంలో కలెక్టర్ రిజ్వాన్‌బాషా
జనగామ: హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో సోమవారం కలెక్టర్లతో సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా పాల్గొన్నారు. ఈ సమావేశంలో భూ భారతి, ఇందిరమ్మ ఇళ్లు, వేసవిలో తాగునీటి ప్రణాళికలపై సీఎ రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. రాజ్యాంగ పరిరక్షణకు పాటుపడాలి స్టేషన్‌ఘన్‌పూర్: బీజేపీ పాలనలో భారత రాజ్యాంగంపై దాడి జరుగుతుందని, రాజ్యాంగాన్ని మార్చే కుట్రలు చేస్తున్నారని, రాజ్యాంగ పరిరక్షణకు ప్రతిఒక్కరూ పాటుపడాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఘన్పూర్ డివిజన్ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం అంబేడ్కర్ జయంతి, ‘జై బాపు, జైభీమ్, జైసంవిధాన్’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కార్యక్రమ జిల్లా కోఆర్డినేటర్ లకావత్ ధన్వంతి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. స్థానిక కొత్త గాంధీ చౌరస్తా నుంచి స్టేషన్‌ఘన్‌పూర్ బస్టాండ్ వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళుళులర్పించారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం నిరంకుశ పాలన సాగిస్తూ అరాచకాలు చేస్తుందని, దళితులు, క్రిస్టియన్లు, ముస్లింలు, మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయన్నారు. మాజీ జెడ్పీచైర్‌పర్సన్ లకావత్ ధన్వంతి, ఏఎంసీ చైర్పర్సన్ జూలుకుంట్ల లావణ్యశిరీష్‌రెడ్డి, నాయకులు బెలిదె వెంకన్న, సీహెచ్.నరేందర్‌రెడ్డి, శిరీష్‌రెడ్డి, జగదీష్ చందర్‌రెడ్డి, పొట్లపల్లి శ్రీధర్‌రావు, సింగపురం వెంకటయ్య, బూర్ల శంకర్, పోశాల కృష్ణమూర్తి, వెంకటేశ్వర్లు కార్యకర్తలు పాల్గొన్నారు.ప్రభుత్వ ఉపాధ్యాయడి వినూత్న ప్రచారం పాలకుర్తి టౌన్: మాదకద్రవ్యాలతో కలిగే అనర్థాలపై సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం గోరెంట్ల జెడ్పీఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త రాచకొండ ప్రభాకర్ వినూత్న ప్రచారం చేస్తూ ప్రజలను ఆలోచింపజేస్తున్నారు. సోమవారం పాలకుర్తి మండలకేంద్రంలోని వారాంతపు సంతలో మైకులో మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాలు–అనర్థాలపై ప్రచారం నిర్వహించారు. కరపత్రాలు, పోస్టర్ల ద్వారా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతను సన్మార్గంలో నడిపించేందుకు తన వంతుగా ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. దూమపానం, మద్యపానంతో పోలిస్తే డ్రగ్స్ వందల రెట్లు ప్రమాదకరమైనవన్నారు. డ్రగ్స్‌కు అలవాటు పడిన వారిని మానిపించడం కష్టమన్నారు. బానిసలుగా మారిన వ్యక్తులు నేరాలకు పాల్పడుతారన్నారు. ప్రజలు చైతన్యవంతులై డ్రగ్స్, గంజాయికి యువతను దూరంగా ఉంచాలని కోరారు. హిందువులు ఐక్యతతో ఉండాలిజనగామ: హిందువు ఐక్యత, చైతన్యంతోనే మ రెన్నో కార్యక్రమాలు చేపడుతూ మన శక్తిని చా టి చెప్పాలని విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి మోహన కృష్ణ భార్గవ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రం శ్రీరాంనగర్ కాలనీ సీతా రామచంద్రస్వామి దేవస్థానంలో వీహెచ్‌పీ నగర కార్యకర్తలతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో హనుమాన్ శోభాయాత్రకు వందలాది మంది హిందువులు తరలి వచ్చి విజయవంతం చేశారని, ఈ విజయానికి కృషి చేసిన కార్యకర్తలు, హిందూ సంస్థలు, యాజమాన్యాలు, వ్యాపారవేత్తలు, భజన మండళ్లు, దేవాలయాల నిర్వాహకులు, నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు పాశం శ్రీశైలం, సహా కార్యదర్శి చిలువేరు హర్షవర్ధన్, ఉల్లెంగుల రాజు, నగర ప్రముఖ్ అంబటి బాలరాజు, సభ్యులు కుందారపు బైరునాథ్, మాసరాజు, కుర్రెముల రాంప్రసాద్, ఉమాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మాకూ కావాలి ‘స్లాట్ బుకింగ్’
కాజీపేట అర్బన్ : రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖలో పైలెట్ ప్రాజెక్ట్‌గా చేపట్టిన స్లాట్ బుకింగ్ పద్ధతి తమకు కుడా కావాలని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలతో పాటు ఆయా పరిధి భూక్రయవిక్రయదారులు కోరుకుంటున్నారు. భూ దస్తావేజుల రిజిస్ట్రేషన్ నిమిత్తం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అడుగుపెడితే ఏ సమయానికి రిజిస్ట్రేషన్ పూర్తవుతుందో.. సబ్ రిజిస్ట్రార్ ఎప్పుడు పిలుస్తాడో తెలియక ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాస్తున్నారు. ఈ క్రమంలో పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ ప్రక్రియతో 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తవడంతోపాటు మరో 15 నిమిషాల్లో దస్తావేజులు చేతికందుతున్నాయి. దీంతో స్లాట్ బుకింగ్ విధానం అమలుకు అన్ని కార్యాలయాల నుంచి డిమాండ్ పెరుగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధి వరంగల్ఫోర్ట్, వరంగల్ రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈనెల 10న ప్రారంభించిన స్లాట్ బుకింగ్ పైలెట్ ప్రాజెక్ట్ విజయవంతమైంది. కోరుకున్న సమయానికి.. కోరుకున్న రోజు రిజిస్ట్రేషన్ పూర్తి కావడంతో భూక్రయవిక్రయదారులతో పాటు రుణాల కోసం బ్యాంకులకు వెళ్లే వారు సమయానికి దస్తావేజులు చేతికి రావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్ ఆర్వో, భీమదేవరపల్లి, స్టేషన్‌ఘన్‌పూర్, జనగామ, పరకాల, కొడకండ్ల, మహబూబాబాద్, ములుగు, నర్సపేట, వర్ధన్నపేట, భూపాలపల్లి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు స్లాట్ బుకింగ్ ప్రక్రియ కోసం ఎదురుచూస్తున్నాయి. తగ్గనున్న పనిభారం నాన్ స్లాట్ రిజిస్ట్రేషన్లు నిర్వహిస్తున్న తరుణంలో సబ్ రిజిస్ట్రార్లు త్వరగా పనులు ముగించుకుని ఇంటికి వెళ్లే ఆస్కారం లేక ఒక్కోరోజు రాత్రి 8 గంటల వరకు సైతం కార్యాలయాల్లో ఉండాల్సి వస్తోంది. స్లాట్ బుకింగ్ ప్రక్రియలో భాగంగా ఉదయం 10.30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పని సమయాలతో సబ్ రిజిస్ట్రార్లకు పనిభారం తగ్గడంతో పాటు భూక్రయవిక్రయదారులకు సమయం కలిసి వస్తుంది. రోజుకు 53 స్లాట్ బుకింగ్స్.. ప్రతి రోజు ఉదయం 10.30 నుంచి 1.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 24 చొప్పున స్లాట్ బుకింగ్స్ కల్పించారు. అలాగే వృద్ధులు, దివ్యాంగులు, పేషంట్ల కోసం ప్రత్యేకంగా సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు 5 స్లాట్ బుకింగ్స్ ఆన్లైన్లో బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించారు. ఈ విధానంతో రిజిస్టేషన్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రస్తుతం రోజువారీ జరిగే రిజిస్ట్రేషన్లు ఇలా... భీమదేవరపల్లి : 20 నుంచి 30 స్టేషన్‌ఘన్‌పూర్ : 25 నుంచి 30 జనగామ : 40 నుంచి 55 కొడకండ్ల : 7 నుంచి 15 మహబూబాబాద్ : 45 నుంచి 60 ములుగు : 10 నుంచి 20 వరంగల్ ఆర్వో : 70 నుంచి 110 వరంగల్ రూరల్ : 25 నుంచి 35 వరంగల్ఫోర్ట్ : 25 నుంచి 40 వర్ధన్నపేట : 6 నుంచి 15 నర్సంపేట : 20 నుంచి 35 పరకాల : 15 నుంచి 25 భూపాలపల్లి : 20 నుంచి 30 15 నిమిషాల్లో ప్రక్రియ పూర్తి ఎదురుచూస్తున్న 11 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు తగ్గనున్న పనిభారం, సమయం ఆదా స్లాట్ బుకింగ్‌తో మెరుగైన సేవలు.. భూక్రయవిక్రయదారులు తాము ఎంచుకున్న రోజు, సమయానికి దస్తావేజుల రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు స్లాట్ బుకింగ్ విధానం ఎంతో ఉపయోగపడుతుంది. మెరుగైన, త్వరితగతిన సేవలు అందుతాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వేచి ఉండాల్సిన అవసరం లేదు. స్లాట్ బుక్ చేసుకుని సరైన సమయానికి వస్తే చాలు. వృద్ధులు, అనారోగ్యంగా ఉన్నవారికి సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు ప్రత్యేక సమయం కేటాయించడంతో ఇబ్బందులు తలెత్తవు. – ఆనంద్, సబ్ రిజిస్ట్రార్, వరంగల్ఆర్వో -
వడగండ్లు.. కడగండ్లు
అకాల వర్షంతో అపారనష్టం ● నేలరాలిన వరి ధాన్యం, మామిడికాయలు ● పెంబర్తి, ఎల్లంల, సిద్దెంకిలో తీవ్రనష్టం ● జనగామ మార్కెట్, ఐకేపీ కేంద్రాల్లో తడిసిన ధాన్యం ● నీటిని తొలగించేందుకు రైతుల అరిగోస ● ఆదుకోవాలని అన్నదాతల వేడుకోలుజనగామ రూరల్: జిల్లాలోని పలు మండలాల్లో కురిసిన వడగండ్ల వాన రైతులకు కడగండ్లను మిగిల్చింది. ఆదివారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి జనగామ మండలం పెంబర్తి ఎల్లంల, సిద్దెంకి గ్రామాల్లో వందలాది ఎకరాల్లో మామిడికాయలు, వరి పంట నేలరాలాయి. ఇళ్లపై వడగళ్లు కరియడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఇంటి ఎదుట రాశులుగా పేరుకుపోయిన వడగళ్లను చూసి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. చిల్పూరు, జఫర్‌గఢ్, లింగాలఘణపురం, కొడకండ్ల, దేవరుప్పుల, పాలకుర్తి తదితర మండలాల్లో కురిసిన అకాల వర్షానికి కోతకు సిద్ధంగా ఉన్న వరిపంట నేలరాలగ అమ్ముకునేందుకు ఐకేపీ సెంటర్‌కు తీసుకువచ్చిన ధాన్యం తడిసి ముద్దయింది. పెంబర్తిలో చల్ల దామోదర్‌రెడ్డికి చెందిన మామడి తోట పూర్తిగా దెబ్బతిన్నది. రాలిన మామిడికాయలను చూసి రైతు విలపించారు. ప్రభుత్వం వెంటనే సంబందిత అధికారులతో సర్వే చేయించి పంటనష్ట పరిహారం అందించాలని వేడుకుంటున్నారు. కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం అకాలవర్షంతో జనగామ వ్యవసాయ మార్కెట్ కాటన్ యార్డులో ఏర్పాటు చేసిన ఐకేపీ సెంటర్లో వేలాది బస్తాలు తడిసిపోయాయి. గానుగుపహాడ్, మరిగడి, ఎర్రగుల్లపహాడు, పెద్ద పహాడ్, వడ్లకొండ, నాగారం తదితర గ్రామాల నుంచి ఐకేపీ సెంటర్‌కు నాలుగు రోజుల క్రితం సుమారు 20వేల పైగా బస్తాల ధాన్యం తీసుకువచ్చారు. ధాన్యంలో అత్యధిక శాతం ఉండడంతో కొనుగోలు ఆలస్యంగా జరుగుతున్నాయి. ఆదివారం కురిసిన భారీ వర్షంతో వేలాది బస్తాల ధాన్యం తడిసిపోయింది. సుమారు 20 బస్తాల వరకు వరద నీటిలో కొట్టుకుపోయాయి. వరిగింజలను కాపాడుకునేందుకు రైతులు పడరాన్ని పాట్లు పడ్డారు. ఆ మూడు గ్రామాల్లోనే ఎక్కువ.. జనగామ మండలం సిద్దెంకి, ఎల్లంల, పెంబర్తి గ్రామాల్లో ఊహించని నష్టం జరిగింది. సుమారు 12 నుంచి 15 వందల ఎకరాల్లో వరి పంటకు నష్టం జరగగా, 50 నుంచి 150 ఎకరాల వరకు మామిడి కాయలు రాలిపోయినట్లు రైతులు చెబుతున్నారు. ఇంతటి నష్టం తామెన్నడూ చూడలేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
తడిసిన ధాన్యం పరిశీలన
జనగామ రూరల్: వ్యవసాయ మార్కెట్ పత్తియార్డులో చిటకోడూర్ ఐకేపీ సెంటర్లో అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్, సీఐ దామోదర్‌రెడ్డి ఆదివారం పరిశీలించారు. బాధిత రైతులతో మాట్లాడి తడిసిన ధాన్యానికి తగిన పరిష్కార మార్గం చూపేలా కృషి చేస్తామని రైతులకు తెలిపారు. అదనపు కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలిపారు. రైతులకు అండగా ఉంటామన్నారు. దరఖాస్తుల గడువుపెంచాలి స్టేషన్‌ఘన్‌పూర్: రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాఽధి కల్పనకు నూతనంగా ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు గడువును మరో వారం రోజులు పెంచాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ మహమ్మద్ యూనుస్ అన్నారు. ఘన్పూర్ డివిజన్ కేంద్రంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు కులం ధృవీకరణ పత్రం కోసం నిరుద్యోగ యువత రోజుల తరబడి తహసీల్దార్ కార్యాలయాలు, మీ సేవా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారన్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి వారం పదిరోజులు గడిచినా సర్టిఫికెట్లు రావడం లేదని, ఈ విషయమై అధికారులను అడిగితే సర్వర్ సమస్య ఉందని చెబుతున్నారన్నారు. ఈ విషయమై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు గడువు పొడిగించాలని, అభ్యర్థులకు త్వరగా కులం, ఆదాయం సర్టిఫికెట్లు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సరస్వతి పుష్కరాల పనుల పరిశీలన కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో మే 15నుంచి 26వరకు జరుగనున్న సరస్వతినది పుష్కరాల పనులను రాష్ట్ర దేవాదాయశాఖ ధార్మక సలహాదారు గోవిందహరి పరిశీలించారు. ఆదివారం ఆయన ముందుగా శ్రీకాళేశ్వర ముక్తీశ్వరుడిని దర్శించుకున్నారు. ఆయనను ఈఓ మహేష్ శాలువాతో సన్మానించగా, అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం వీఐపీ (సరస్వతి) ఘాటు వద్ద నిర్మిస్తున్న పుష్కరఘాటు, సరస్వతి మాత విగ్రహం ఏర్పాటు పనులను ఆయన పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఆయన వెంట సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఉపప్రధాన అర్చకుడు ఫణీంద్రశర్మ ఉన్నారు. ప్రశాంతంగా ఎన్డీఏ పరీక్ష కేయూ క్యాంపస్: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజిలో ఆదివారం ఎన్డీఏ(నేషనల్ డిఫెన్స్ అకాడమీ) పరీక్షను నిర్వహించారు. ఈపరీక్ష కేంద్రాన్ని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య సందర్శించారు. పరీక్షలు నిర్వహిస్తున్న తీరును పరిశీలించారు. పరీక్షల్ని పకడ్బందీగా నిర్వహించాలని సంబంఽధిత అధికారులకు సూచింంచారు. పరీక్షల నిర్వహణపై ఏర్పాట్ల గురించి కూడా అడిగి తెలుసుకున్నారు. ఆర్ట్స్అండ్ సైన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ఆచార్య ఎస్.జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు కల్పించాలి హన్మకొండ చౌరస్తా: త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు కల్పించాలని భారత దివ్యాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేశ్ డిమాండ్ చేశారు. ఇటీవల ఎన్నికై న హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా మానుక సతీశ్, యువజన విభాగం అధ్యక్షుడిగా నడిపల్లి శ్రీధర్, జనగామ జిల్లా అధ్యక్షుడు ఏషబోయిన రమేశ్చేత ఆదివారం ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా రాజేశ్ మాట్లాడుతూ రాష్ట్రంలో వికలాంగుల సమస్యలను తక్షణమే పరిష్కరించే వరకు ఆందోళనలు కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎండీ షరీఫ్, జిల్లా సభ్యుడు నరేవ్, అనిల్, మమత తదితరులు పాల్గొన్నారు. -
పాలకుర్తి సమ్మక్క, సారక్కలు ఎలా ఉన్నారు..
పాలకుర్తి టౌన్: పాలకుర్తి సమ్మక్క, సారక్కలు ఎలా ఉన్నారు...చెల్లి యశస్వినిరెడ్డి బాగున్నవా... అక్క ఝాన్సీరెడ్డి బాగున్నవా.. ఆడబిడ్డలపై సీఎం రేవంత్‌రెడ్డి ఆత్మీయ పలకరింపు. ఆదివారం హైదరాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా సీఎం రేవంత్‌రెడ్డిని ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జ్ ఝాన్సీరెడ్డి కలిశారు. పాలకుర్తి నియోజవర్గ అభివృద్ధి, ప్రాజెక్టులు, తొర్రూరు మున్సిపాలిటీ అభివృద్ధిపై సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు ఎమ్మెల్యే తెలిపారు. తొర్రూరు పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.50 కోట్ల నిధులు కేటాయించాలని సీఎం కోరారు. దీంతో సీఎం రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పందించి నియోజవర్గ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తుందని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. సీఎంను కలిసిన వారిలో వరంగల్ మాజీ జెడ్పీ చైర్పర్సన్ లకావత్ ధన్వంతి, డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ తదితరులు ఉన్నారు. యశస్వినిరెడ్డి, ఝాన్సీరెడ్డిని ఆత్మీయంగా పలకరించిన సీఎం -
ఉపాధ్యాయుల ఉద్యమ దిక్సూచి యూటీఎఫ్
● రాష్ట్ర కార్యదర్శి రంజిత్‌కుమార్ స్టేషన్‌ఘన్‌పూర్: రాష్ట్రంలో ఉపాధ్యాయుల ఉద్యమ దిక్సూచి టీఎస్‌యూటీఎఫ్ అని రాష్ట్ర కార్యదర్శి కా నుగంటి రంజిత్‌కుమార్ అన్నారు. యూటీఎఫ్ ఆవి ర్భావ దినోత్సవం సందర్భంగా ఘన్పూర్ డివిజన్ కేంద్రంలో ఆదివారం యూటీఎఫ్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా రంజిత్‌కుమార్ హాజరై మాట్లాడారు. ప్రభుత్వ విద్యారంగ సంక్షేమం కోసం, ఉపాధ్యాయుల హక్కుల కోసం కట్టుబడి అనేక ఉద్యమాలు చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బకాయి ఉన్న ఐదు విడతల కరువు భత్యాన్ని వెంటనే చెల్లించాలని, వేతన సవరణ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని డి మాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు మంగు జయప్రకాష్, చిక్కుడు శ్రీనివాస్, కోరుకొప్పుల రాజు, కుసుమ రమేష్, తాడూరి సుధాకర్, బానోతు వసంత్‌నాయక్, అడికె సతీష్‌కుమార్, పిట్టల మహేందర్ పాల్గొన్నారు. -
ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేయాలి
● టీటీఐఎఫ్ ప్రధాన కార్యదర్శి మంజుల పాలకుర్తి టౌన్: సచివాలయం ఎదుట వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేయాలని తెలంగాణ తల్లి ఐలమ్మ ఫౌండేషన్ (టీటీఐఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్యాల మంజుల కోరారు. ఆదివారం మండలకేంద్రంలోని తెలంగాణ తల్లి ఐలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఐలమ్మ వారసులతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంజుల మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని, చాకలి ఐలమ్మ పేరిట మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. ఐలమ్మ వారసులు కడు దయనీయ స్థితిలో ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నారని, వారి సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయాలన్నారు. జిల్లాకు ఐలమ్మ పేరు పెట్టాలని, పాలకుర్తిలో ఐలమ్మ స్మారక పార్కు నిమిత్తం ఐదు ఎకరాల భూమిని కేటాయించాలని కోరారు. త్వరలోనే ఐలమ్మ వారసుడు చిట్యాల జంపయ్య నేతృత్వంలో పాలకుర్తి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఐలమ్మ కుటుంబ సభ్యులు చిట్యాల యాకయ్య, రమేశ్, సంపత్, రాజశేఖర్, పంతగి రాజు, చిట్యాల మంజుల, లింగమ్మ, గట్టమ్మ, వెంకటమ్మ, భారతమ్మ, సంధ్యారాణి, అండాలు తదితరులు పాల్గొన్నారు. -
అంబేడ్కర్‌ను కించపరిస్తే సహించేది లేదు..
● డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి జనగామ రూరల్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను కించపరిస్తే సహించేది లేదని డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి అన్నారు. ఆదివారం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలో భాగంగా జనగామ మండలం శామీర్‌పేట, పసరమడ్ల గ్రామాల్లో సన్నాహక సమావేశం, పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా శామీర్‌పేటలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంపై చేస్తున్న కుట్రలను తిప్పు కొట్టాలన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని ఇందుకు ప్రజలు చైతన్యం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, మండల అధ్యక్షుడు లింగాల నర్సిరెడ్డి, గంగం నర్సింహరెడ్డి, సర్వల నర్సింగరావు, గణిపాక మహేందర్, జిల్లా మహిళా అధ్యక్షురాలు బడికే ఇందిరా తదితరులు పాల్గొన్నారు. పోస్టల్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి దేవరుప్పుల: హనుమకొండ డివిజన్ పరిధి పోస్టల్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారించాలని భారతీ య పోస్టల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ డివిజన్ నా యకుడు ఓడపల్లి అశోక్‌గౌడ్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం సూపరింటెండెంట్ హన్మంతుకు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శాఖపరంగా విధులకు మించి అదనపు పనిభారం, నిర్దేశిత లక్ష్యాలను చేయాలనే డిమాండ్‌తో మానసికంగా ఉద్యోగులు ఇబ్బందులకు గురౌతున్నారన్నా రు. మారుతున్న కాలానికి అనుగుణంగా పోస్టల్ కార్యాలయాల్లో ఆధునిక పరికరాలు లేకపోవడంతో నిర్వహణ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు శంకర్‌నాయక్, సత్యనారాయణ, మురళికృష్ణ, శ్రీనివాస్, మనోజ్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు. -
మళ్లీ సమ్మెబాట!
వనజీవికి నివాళి ఆదివారం శ్రీ 13 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025జనగామ రూరల్: గ్రామాల అభివృద్ధేతోనే దేశ ప్రగతి.. పల్లెలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు.. మురికి కాల్వలు, వార్డులు శుభ్రం చేయడం.. చెత్త తరలింపు.. నీటి సరఫరా.. కరెంటు సమస్యల పరిష్కారం.. ఇలా పొద్దంతా అన్ని రకాల పనులతో చాకిరీ చేస్తున్న గ్రామ సేవకులకు ఇచ్చేది అరకొర వేతనమే. అదికూడా సమయానికి అందక కుటుంబాలు గడవక పడరాని పాట్లు పడుతున్నారు. డిమాండ్ల సాధనకు గతంలో సమ్మె చేయగా.. కంటి తుడుపుగా కొన్ని హామీలు ఇచ్చిన పాలకులు చేతులు దులుపుకున్నారు. అయి తే గత ఐదు నెలల నుంచి వేతనాలు రావడంలేదు. దీంతో మళ్లీ సమ్మె బాట పట్టేందుకు పంచాయతీ కార్మికులు సన్నద్ధం అవుతున్నారు. ఇప్పటికే యూనియన్ నాయకులు అధికారులకు సమ్మె నోటీసులు అందజేశారు. 1,210 మంది జీపీ కార్మికులు జిల్లాలో 281 గ్రామ పంచాయితీలు ఉండగా 1,210 మంది జీపీ కార్మికులు మల్టీపర్పస్ విధులు నిర్వహిస్తున్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వర్కర్ల సంఖ్య లేదు. 25 శాతం తక్కువగా ఉన్నా రు. అదనపు పనిభారం పడుతోంది. గ్రామ పంచా యతీల్లో మల్టిపర్పస్ విధానం కారణంగా అన్ని రకాల పనులు చేయించడంతో కార్మికులకు కష్టాలు తప్పడంలేదు. ప్రదాకర పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తున్న వీరికి అరొకరగా చెల్లించే రూ.9,500 వేతనం నెలల తరబడి అందక కుటుంబాలు గడవక అప్పులు చేస్తూ కాలం గడుపుతున్నారు. మల్టీపర్పస్ విధానం కార్మికుల ప్రాణాల మీదికి వస్తోంది. రెండు రోజుల క్రితం రఘునాథపల్లి మండలం మేకలగట్టుకు చెందిన కారోబార్ వేల్పుల నాగరాజు విద్యుత్ సమస్య పరిష్కారం కోసం స్తంభం ఎక్కవగా విద్యుత్ షాక్ గురయ్యాడు. జీపీ కార్మికుల డిమాండ్లు ఇవీ.. ● పర్మనెంట్ చేసి రేగ్యులర్గా వేతనం చెల్లించాలి. ● జీఓ 60 ప్రకారం స్వీపర్లకు రూ.15,600, బిల్ కలెక్టర్, కారోబార్లకు రూ.19,500 చెల్లించాలి. ● జీఓ 51ని సవరించి మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలి. ● ప్రతి కార్మికుడికి ప్రమాద బీమా రూ.10 లక్షలు, దహన సంస్కారాలకు రూ.20 వేలు ఇవ్వాలి. ● రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.5 లక్షలు చెల్లించాలి. ● అనారోగ్యంతో మరణిస్తే కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. ● ఏడాదికి కార్మికులకు మూడు జతల యూ ని ఫామ్, చెప్పులు, సబ్బులు, నూనెల కొనుగో లుకు నగదు రూపంలో అలవెన్స్ చెల్లించాలి. ● ప్రతి కార్మికుడికి ఈఎస్ఐ, పీఎఫ్ సదుపాయం కల్పించి ఎనిమిది గంటల పని విధానం అమలు చేయాలి. ● కార్మికుల అక్రమ తొలగింపులు ఆపి ఉద్యోగ భద్రత కల్పించాలి.న్యూస్రీల్గ్రామసేవకులపై పట్టింపేది..? ఐదు నెలలుగా అందని వేతనాలు కుటుంబాలు గడవక ఇబ్బందులు కనీసవేతనం, ఉద్యోగ భద్రత కరువు తిరిగి సమ్మెబాట పట్టనున్న కార్మికులు..! అధికారులకు సమ్మె నోటీసులు అందజేసిన కార్మిక నాయకులు -
బీజేపీ పాలనలో రాజ్యాంగంపై దాడి
స్టేషన్‌ఘన్‌పూర్: బీజేపీ పాలనలో భారత రాజ్యాంగంపై దాడి జరుగుతున్నది.. రాజ్యాంగాన్ని మార్చే కుట్రలను తిప్పికొట్టాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’ కార్యక్రమంపై శనివారం స్థానికంగా ఎమ్మె ల్యే కడియం శ్రీహరి అధ్యక్షతన నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆమె మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం నిరంకుశ పాలన సాగిస్తోందని, అమిత్‌షా రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను అవమానించేలా పార్లమెంట్లో మాట్లాడారని అన్నారు. ప్రజలను చైతన్యం చేస్తూ ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త రాజ్యాంగ పరిరక్షణకు బాధ్యతగా పాటుపడాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడు తూ.. రాజ్యాంగాన్ని కాపాడుకుంటే మనల్ని కాపాడుతుందని అన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ శ్రేణులు ప్రజలతో కలిసి జాతీయ జెండా, అంబేడ్కర్, గాంధీజీ ఫొటోలతో గ్రామాల్లో ర్యాలీలు, పాదయాత్రలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం జిల్లా కోఆర్డినేటర్ లకావత్ ధన్వంతి, ఏఎంసీ చైర్పర్సన్ లావణ్యశిరీష్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ నరేందర్‌రెడ్డి, నాయకులు బెలిదె వెంకన్న, మారుడోజు రాంబాబు, శిరీష్‌రెడ్డి, లింగాజీ, జగదీష్‌చందర్‌రెడ్డి, పొట్లపల్లి శ్రీధర్‌రావు, కట్టా మనోజ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య -
అవసరమైతే బ్లాక్ లిస్టులోకి..
– వివరాలు 8లోuకూలి కూడా గిట్టడం లేదు.. నెలంతా పని చేస్తే రోజువారీ కూలి కూడా గిట్టడం లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామంలో మురికి కాల్వ లు, వార్డులు శుభ్రం చేయడం.. చెత్త తరలింపు.. నీటి సరఫరా తదితర పనులు చేస్తున్నాం. వచ్చే అరకొర జీతంతో ఇల్లు గడవక ఇబ్బందులు పడుతున్నాం. వ్యవసాయ పనులకు పోదామంటే సమయం దొరకదు. పొద్దంతా ఇదే చాకిరి. అప్పు తెచ్చుకుని పూట గడుపుతున్నాం. – బొల్లం లక్ష్మి, జీపీ కార్మికురాలు, వడ్లకొండ కడియం రాజీనామా చేసే వరకు వదలం ● భూ చెర పడుతున్న ఆంధ్రా అల్లుడు, బినామీలు ● జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డిభూమి ఆక్రమించినట్లు నిరూపిస్తే రాజీనామా ● పట్టా భూములను రైతులకు చెందాలనడం కబ్జా చేసినట్టా? ● ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిహన్మకొండ: అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచా యతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణనీటి సరఫ రా, మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క అధికారులను ఆదేశించారు. హనుమకొండ కలెక్టరేట్లోని కాన్ఫరెన్న్స్హాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా పంచాయతీరాజ్ శాఖ, మిషన్ భగీరథ శాఖ లపై శనివారం ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సీతక్క మాట్లాడుతూ పనులు దక్కించుకోవడంలో చూపుతున్న శ్రద్ధ సకాలంలో పూర్తిచేయడంపై కాంట్రాక్టర్లు శ్రద్ధ చూపడం లేదన్నారు. ఇప్పటికీ మొదలుపెట్టని పనులకు తిరిగి టెండర్లు పిలవాలని సూచించారు. ఏళ్లుగా పనులు మొదలు పెట్టని, పూర్తిచేయని కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్టులో పెట్టాలన్నారు. కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. వర్షాకాలం ప్రారంభమయ్యేలోగా పనులు పూర్తి పూర్తిచేయించే బాధ్యత ఎస్ఈలదే అని, కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించి వారికి సూచనలు చేయాలన్నారు. టెండర్లకు సిద్ధంగా ఉన్న రోడ్లకు వారంలోగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి సకాలంలో పనులు పూర్తి చేయించాలని చెప్పారు. నిధుల కొరత లేదని, పీఎంజీఎస్‌వై నిఽధులతోపాటు రాష్ట్ర ప్రభుత్వం రూ.400 కోట్లు ఇచ్చిందని వివరించారు. అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయాలని, గ్రామాల్లో తాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవడం లేదు.. అభివృద్ధి పనులు జరుగుతున్న తీరుపై ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టినవి ఇప్పటికీ పూర్తి చేయలేదని, తన పదవి కాలంలోపైనా పూర్తి చేస్తారా అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అధికారుల ను ప్రశ్నించారు. తమ నియోజకవర్గాల్లో రోడ్ల పనులు అసంపూర్తిగా ఉన్నాయని ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కడియం శ్రీహరి, రాంచంద్రునాయక్.. మంత్రి, ఈఎన్సీ కనకరత్నం దృష్టికి తీసుకెళ్లారు. పనులు పూర్తి చేయించడంలో అధికారులు వ్యవహరిస్తున్న వైఖరిపై ఒకింత అసహనం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఎంపీ, ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం.. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మహబూ బాబాద్ ఎంపీ బలరాంనాయక్ మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేయాలని, తాను ప్రతిపాదనలు పంపిన రోడ్లను మంజూరు చేయాలని ఎమ్మె ల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో మీరు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఒక్కరే ఉన్నారని, అప్పుడు మీకు ప్రభుత్వం ఎంతగానో సహకరించిందని, ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఒక్కడినే ఉన్నానని, నిష్పక్షపాతంగా నియోజకవర్గ అభివృద్ధికి సహకరించి నిధులు మంజూరు చేయాలని మంత్రి సీతక్క కు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో ఎంపీ బలరాంనాయక్ కలుగజేసుకుని బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేస్తే తాము చెల్లిస్తున్నామన్నారు. దీంతో పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఇక్కడ రాజకీయాలు చేయడం మంచిది కాదని, రాజకీయాలు బయట చూసుకుందామన్నారు. సమావేశంలో ఎంపీలు కడియం కావ్య, పోరిక బలరాంనాయక్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మేయర్ గుండు సుధారాణి, ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ కృపాకర్‌రెడ్డి, కలెక్టర్ ప్రావీణ్య, అదనపు కలెక్టర్లు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. బాల్యవివాహాల నిర్మూలనకు చర్యలు తీసుకోవాలిబాల్య వివాహాల నిర్మూలనకు అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళ శిశు సంక్షేమశాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. శనివారం హనుమకొండ కలెక్టరేట్లో మహిళా, శిశు, దివ్యాంగులు, వయో వృద్ధుల సంక్షేమశాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, కమిషనర్ కాంతి వెస్లీతో కలిసి ఉమ్మడి జిల్లాలోని జిల్లా సంక్షేమ శాఖ అధికారులు, సీడీపీఓలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ ములుగు జిల్లాలోని మారుమూల గ్రామమైన రాయినిగూడెంలో పోషణ్ పక్వాడా కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు ఇష్టంగా తినే ఆహారంపై దృష్టి పెట్టాలన్నారు. బాల్య వివాహాలు జరగకుండా చూడడ మే అందరి లక్ష్యం కావాలన్నారు. ‘అమ్మమాట – అంగన్వాడీ బాట’ కార్యక్రమాన్ని వచ్చే ఏడాది కూడా నిర్వహిస్తామని చెప్పారు. పనుల్లో నిర్లక్ష్యం వహించే కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క పంచాయతీరాజ్ శాఖ, మిషన్ భగీరథపై హనుమకొండ కలెక్టరేట్లో సమీక్ష అభివృద్ధి పనుల తీరుపై ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేల అసంతృప్తి ఏళ్లుగా పెండింగ్‌లోనే ఉంటున్నాయని అధికారులపై అసహనం -
మార్కెట్‌కు రెండు రోజులు సెలవు
జనగామ రూరల్: జనగామ వ్యవసాయ మార్కెట్‌కు రెండు రోజులు సెలవు ప్రకటిస్తూ మార్కెట్ చైర్మన్ బనుక శివరాజ్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. 13వ తేదీ ఆదివారం, 14న అంబేడ్కర్ జయంతి సందర్భంగా మార్కెట్ బందు ఉంటుందని, రైతులు గమనించి వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించడానికి తీసుకురావొద్దని సూచించారు. మంగళవారం మార్కెట్ తిరిగి పునఃప్రారంభం అవుతుందన్నారు. షూటింగ్‌బాల్ అసోసియేషన్ జిల్లా కమిటీ ఎన్నిక స్టేషన్‌ఘన్‌పూర్: జనగామ జిల్లా షూటింగ్‌బాల్ అసోసియేషన్ నూతన కమిటీని శనివారం స్థానికంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐలయ్య ఆధ్వర్యాన ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఇనుగా ల యుగేందర్‌రెడ్డి, ఉపాధ్యక్షులుగా ఎన్.సాంబన్న, దేవ్‌సింగ్, రాజిరెడ్డి, చుక్కమ్మ, ప్రధాన కార్యదర్శిగా అన్నెపు కుమార్, సహాయ కార్యదర్శులుగా రాజు, సాంబరాజు, చందర్, అశోక్, ఉదయ్‌కిరణ్, కోశాధికారిగా చింతకింది సుధాకర్, కార్యవర్గ సభ్యులుగా నరేష్, అరవింద్, దిలీప్, రమేష్, మధుసూదన్, చందర్, రాజు, మధు, రమేష్, మహేష్ ఎన్నికయ్యారు. రాజరాజేశ్వరీదేవికి తామర పూలతో అర్చన హన్మకొండ కల్చ రల్: వరంగల్ ఎంజీఎం ఎదురుగా ఉన్న రాజరాజేశ్వరీదేవి ఆలయంలో నిర్వహిస్తున్న శ్రీలలితా యాగంలో భాగంగా శనివారం అమ్మవారికి లక్ష తామరపూలతో అర్చన చేశారు. ఆలయ అర్చకుడు ఎల్లంభట్ల లక్ష్మణశర్మ ఆధ్వర్యంలో ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి ఉదయం తామరపూలతో అర్చన నిర్వహించారు. సాయంత్రం పౌర్ణమి తిథిని పురస్కరించుకుని అమ్మవారికి లక్ష బిల్వార్చన చేపట్టారు. అధిక సంఖ్య లో మహిళలు పాల్గొని దీపారాధన చేశారు. దశవిధహారతుల అనంతరం అన్నప్రసాదాల వితరణ చేశారు. ఆలయ చైర్మన్ వద్దిరాజు వెంకటేశ్వరరావు పర్యవేక్షించారు. ‘మిస్ వరల్డ్ పోటీలు రద్దు చేయాలి’ హన్మకొండ: రాష్ట్రంలో నిర్వహించనున్న మిస్ వరల్డ్ పోటీలను రద్దు చేయాలని ప్రొఫెసర్ కాత్యాయని అన్నారు. హనుమకొండలో మిస్ వరల్డ్ పోటీలపై అందాల పోటీల వ్యతిరేక కమిటీ ఆధ్యర్యంలో శనివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఇందులో ప్రొఫెసర్ కాత్యాయని మాట్లాడుతూ.. అందాన్ని ఆనంది స్తాం.. కానీ అందం పెట్టుబడి కావడమే సమస్యగా పరిణమించిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకప్పుడు కార్పొరేట్ సంస్థలు ఇలాంటివి నిర్వహించేవని, ఇప్పుడు ఏకంగా ప్రభుత్వమే నిర్వహించడంలో ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నా యో అర్థమవుతుందని విమర్శించారు. ప్రభుత్వాలు ప్రజలను ప్రజాసమస్యలను పట్టించుకో కుండా పెట్టుబడిదారులకు ఉపయోగపడే కార్య క్రమాన్ని రూ.200 కోట్ల ఖర్చుతో నిర్వహిస్తే రూ.1,500 కోట్ల లాభాలు వస్తాయని మాట్లాడ డం విడ్డూరంగా ఉందని విమర్శించారు. మహిళా ప్రతినిధి కళ మాట్లాడుతూ.. కేసీఆర్ పదేళ్లు దోచుకొని ఓటమికి గురయ్యారన్నారు. ఆయన అన్యాయాలు భరించలేకే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆరు గారెంటీలతో గద్దెనెక్కిస్తే.. గ్యారెంటీలను గాలికి వదిలి లాభాలే లక్ష్యంగా పాలన చేస్తున్నారని తూర్పారబట్టారు. సమావేశంలో రత్నమాల, రమాదేవి, వెంగల్రెడ్డి, అంజనీ, విలాసిని, జ్యోతికరమణి పాల్గొన్నారు. నకిలీ వైద్యుడిపై కేసు ఎంజీఎం: వరంగల్ కాశిబుగ్గలోని సుహానా ఫస్ట్ ఎయిడ్ సెంటర్లో వైద్యం చేస్తున్న నకిలీ వైద్యుడు జి.సదానందంపై కేసు నమోదు చేసిన ట్లు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులు శనివారం తెలిపారు. అశాసీ్త్రయ పద్ధతిలో హై డోస్ యాంటీ బయాటిక్స్, స్టెరాయిడ్స్ ఇంజ క్షన్లు ఇవ్వడంతో పాటు ఫార్మసీ లైసెన్స్ లేకుండా పెద్ద మొత్తంలో మందులు నిల్వ ఉంచినట్లు సభ్యులు గుర్తించారు. ఇంతేజార్ గంజ్ పోలీస్‌స్టేషన్‌లో రిజిస్టర్డ్ డాక్టర్ డి.లాలయ్యకుమార్, చైర్మన్ డాక్టర్ మహేశ్‌కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్ఎంసీ చట్టం సెక్షన్ 34, 54, టీఎస్‌ఎంపీఆర్ చట్టం సెక్షన్ 22 ప్రకారం.. ఈకేసు నమోదు చేశారు. చట్ట ప్రకారం నకిలీ వైద్యుడికి జైలు శిక్ష రూ.5 లక్షలు జరిమానా విధించే అవకాశం ఉందని కౌన్సిల్ సభ్యులు నరేశ్ పేర్కొన్నారు. -
సైక్లింగ్ రోడ్ పోటీలకు కేయూ జట్టు
కేయూ క్యాంపస్: బికనీర్‌లోని మహారా గంగాసింగ్ యూనివర్సిటీలో ఈనెల 10 నుంచి నిర్వహించే ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ సైక్లింగ్ రోడ్(పురుషుల) పోటీలకు కేయూ జట్టును ఎంపిక చేసినట్లు కేయూ స్పోర్ట్స్‌బోర్డు సెక్రటరీ ఆచార్య వై.వెంకయ్య శుక్రవారం తెలిపారు. జట్టులో ఎన్.రాకేష్(శ్రీఅరుణోదయం డిగ్రీ కాలేజీ హనుమకొండ), ఎండీ.రియాజ్(మాస్టర్జీ డిగ్రీ కాలేటీ హనుమకొండ), జె.సంజీవ్, జి.లోకేష్(వరంగల్ కిట్స్), ఎన్.మహేందర్‌యాదవ్(యూసీపీఈ కేయూ), కె.బాలమురుగన్ (ఎల్బీ కాలేజీ వరంగల్) ఉన్నారు. వీరికి హనుమకొండలోని జాగృతి డిగ్రీ కాలేజీ ఫిజికల్ డైరెక్టర్ ఎ.రాజేష్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారని వెంకయ్య పేర్కొన్నారు. సెలవు రోజుల్లో ప్రత్యేక టూర్ ప్యాకేజీ హన్మకొండ: పర్యాటక ప్రాంతాల సందర్శనకు సెలవు రోజుల్లో ప్రత్యేక టూర్ ప్యాకేజీని తీసుకొచ్చినట్లు తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ డిప్యూటీ మేనేజర్(మార్కెటింగ్) టి.శ్రీనివాస్ రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రెండో శనివారం, ఆదివారం, అంబేడ్కర్ జయంతి రోజు సోమవారం వరంగల్, రామప్ప, లక్నవరం ప్రాంతాల పర్యటనకు ప్రత్యేక టూర్ ప్యాకేజీ అమలు చేస్తున్నట్లు వివరించారు. ఉదయం 8 నుంచి రాత్రి 7.30 వరకు పర్యాటక ప్రాంతాల సందర్శన ఉంటుందని పేర్కొన్నారు. ఏసీ బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. చార్జీలు పెద్దలకు రూ.980, పిల్లలకు రూ.790గా నిర్ణయించినట్లు వివరించారు. భోజన చార్జీలు రూ.150, బోటింగ్ చార్జీలు రూ.50 అదనం అని తెలిపారు. పర్యాటకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. అందుబాటులోకి టీజీ ఎన్పీడీసీఎల్ యాప్ హన్మకొండ: ఐఫోన్ వినియోగదారులకు టీజీ ఎన్పీడీసీఎల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఎన్పీడీసీఎల్ హనుమకొండ సర్కిల్ ఎస్ఈ పి.మధుసూదన్ రావు, వరంగల్ సర్కిల్ ఎస్ఈ కె.గౌతం రెడ్డి తెలిపారు. మరిన్ని సాంకేతిక అంశాలు జోడించి టీజీ ఎన్పీడీసీఎల్ యాప్‌ను ఆధునీకరించినట్లు వారు వేర్వేరు ప్రకటనలో వెల్లడించారు. ఐఫోన్ యాప్ స్టోర్ నుంచి టీజీ ఎన్పీడీసీఎల్ యాప్‌ను డౌన్లోడు చేసుకోవచ్చన్నారు. ఈ యాప్‌లో 20 ఫీచర్లు ఉన్నాయని వివరించారు. రిపోర్ట్ ఆన్ ఇన్సిడెంట్, కనూ్స్య్మర్ గ్రీవెన్సెస్, న్యూ కంప్లైంట్, కంప్లైంట్ స్టేటస్, రీఓపెన్, సెల్ఫ్ రీడింగ్, పే బిల్స్, బిల్ హిస్టరీ, ఆన్ లైన్ పేమెంట్ హిస్టరీ, కొత్త సర్వీస్ స్థితి, లింక్ ఆధార్ – మొబైల్, డొమెస్టిక్ బిల్ క్యాలిక్కులెటర్, కొత్త కనెక్షన్ ఎ లా తీసుకోవాలి, పేరు– లోడ్ మార్పు, పవర్ క ంజమ్సన్ గైడ్‌లైన్స్, టారిఫ్ డీటెయిల్స్, ఎనర్జీ సేవింగ్ టిప్స్, సేఫ్టీ టిప్స్, ఫీడ్ బ్యాక్, మై అ కౌంట్, వినియోగదారుల బిల్లు సమాచారం, వినియోగదారుల పరిధిలోని అధికారి వివరా లు, కాంటాక్ట్ ఆజ్.. అనే ఫీచర్లు ఈ యాప్‌లో అందుబాటులో ఉన్నాయని వివరించారు. వ్యక్తిపై కేసు నమోదు బయ్యారం: వితంతు మహిళపై లైంగికదాడికి యత్నించిన వ్యక్తిపై శుక్రవారం బయ్యారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని పీహెచ్సీ సమీపంలో నివసించే కె.కార్తీక్ గురువారం రాత్రి ఒంటరిగా ఉన్న మహిళ ఇంట్లోకి వెళ్లాడు. ఈ క్రమంలో లైంగికదాడికి యత్నించటంతో మహిళ కేకలు వేయగా కార్తీక్ పరారయ్యాడు. ఈ మేరకు బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. మహిళ ఆత్మహత్య బచ్చన్నపేట: మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని కట్కూర్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎనుగుల లక్ష్మి(59)కి ఇటీవల అనారోగ్య సమస్యలతోపాటు మానసికంగా కూడా సరిగా ఉండడంలేదు. ఈక్రమంలో శుక్రవారం కుటుంబ సభ్యులు వ్యవసాయ పనులకు వెళ్లారు. పనులు ముగించుకుని వచ్చేలోగా లక్ష్మి ఉరివేసుకుని కన్పించింది. మృతురాలికి భర్త ఎల్లయ్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలాన్ని ఎస్సై ఎస్కే హమీద్ పరిశీలించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
సన్న బియ్యం పథకం దేశానికే ఆదర్శం
కొత్తగూడ: సన్న బియ్యం పంపిణీ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని పంచాయతీరాజ్, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పరిధి గుంజేడులో సన్న బియ్యం పథకాన్ని శుక్రవారం ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడుతూ.. నిరుపేదల కడుపు నింపాలనే లక్ష్యంతో సీఎం రేవంత్‌రెడ్డి సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం సరఫరా చేసిన బియ్యంతో వండిన ఆహారాన్ని చిన్నారులతో కలసి భుజించారు. ఐసీడీఎస్ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన స్టాల్‌ను సందర్శించారు. చిన్న పాపకు ప్రభుత్వం సరఫరా చేసిన పౌష్టికాహర ఉగ్గును స్వయంగా తినిపించారు. గర్భిణులకు పౌష్టికాహర కిట్లు అందజేశారు. అనంతరం కలెక్టర్ అద్వైత్ కుమార్‌సింగ్, డీఎఫ్ఓ విశాల్‌తో కలిసి ముసలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల గూర్చి అధికారులతో చర్చించారు. గుంజేడు ముసలమ్మ జాతరను ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని మంత్రి సీతక్క హమీ ఇచ్చారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ..కొత్తగూడ, గంగారం మండలాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. 30 పడకల ఆస్పత్రి భవణ నిర్మాణం స్థల కేటాయింపులో జాప్యంపై సమీక్షించిన మంత్రి.. సమస్యలుంటే పరిష్కరించి ఆస్పత్రి నిర్మాణం జరిగేలా చూడాలని కలెక్టర్, డీఎఫ్ఓలకు సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ కృష్ణవేణి, డీడబ్ల్యూఓ ధనమ్మ, డీఆర్డీఓ మధుసూదన్‌రాజు, డీఎస్ఓ ప్రేమ్‌కుమార్, సీడీపీఓ షబానా అజ్మీ, తహసీల్దార్ రమాదేవి తదితరులు పాల్గొన్నారు. పంచాయతీరాజ్, సీ్త్రశిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గుంజేడులో సన్న బియ్యం పథకం ప్రారంభం -
అణగారిన వర్గాల అభ్యున్నతికి పూలే కృషి
హన్మకొండ: అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన గొప్ప సంఘసంస్కర్త జ్యోతిబా పూలే అని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. శుక్రవారం హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో జ్యోతిబా పూలే జయంతిని నిర్వహించారు. ఈసందర్భంగా పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీఎండీ మాట్లాడుతూ.. కులం పేరుతో తరతరాలుగా అణిచివేతకు గురైన ప్రజలకు ధైర్యం కల్పించిన వ్యక్తి పూలే అని కొనియాడారు. సీ్త్రలు అభివృద్ధి చెందితే సమాజం అభివృద్ధి చెందుతుందని, సీ్త్ర విద్య కోసం పోరాడిన గొప్పసంస్కర్త జ్యోతిబా పూలే అన్నారు. 1873 సెప్టెంబర్ 24న సత్యశోధన సమాజాన్ని స్థాపించారని, పూలే కేవలం కులవ్యవస్థ రూపు మాపడమే కాకుండా సామ్రాజ్యవాద వ్యతిరేక, కార్మికవర్గ, రైతాంగ పక్షంగా పోరాడారని వివరించారు. పూలే జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమన్నారు. కార్యక్రమంలో ఇంచార్జ్ డైరెక్టర్లు బి.అశోక్ కుమార్, టి.సదర్ లాల్, వి.తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్, సీఈలు కె.తిరుమల్‌రావు, రాజుచౌహాన్, రవీంద్రనాథ్, బికంసింగ్, వెంకటరమణ, జాయింట్ సెక్రటరి కె.రమేష్, జీఎంలు అన్నపూర్ణ, వేణుబాబు, వాసుదేవ్, నాగ ప్రసాద్, శ్రీనివాస్, మల్లికార్జున్, దేవేందర్, కృష్ణ మోహన్, గిరిధర్, సత్యనారాయణ, కంపెనీ సెక్రటరీ కె.వెంకటేశం పాల్గొన్నారు. గొప్పసామాజిక సంఘ సంస్కర్త కేయూ క్యాంపస్: మహాత్మాజ్యోతిబా పూలే గొప్ప సామాజిక సంఘసంస్కర్త అని కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రతాప్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పూలే జయంతిని యూనివర్సిటీలోని సెనెట్ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్య ద్వారానే అసమానతలు తొలగిపోతాయని విద్యా ప్రాధాన్యతను పూలే ఆనాడే చాటిచెప్పారన్నారు. పూలేను స్ఫూర్తి, ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కాన్సిటిట్యూషన్ రెలవెన్స్ సోషియో ఎకనామిక్ పొలిటికల్ అండ్ ఎడ్యూకేషనల్ ఇంప్లికేషన్ ఆన్ బీసీస్ ఇన్ తెలంగాణ అనే అంశంపై ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ సీహెచ్ శ్రీనివాస్ కీలకోపన్యాసం చేశారు. తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యుడు సిరికొండ సంజీవరావు, కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం, బీసీ సెల్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు మాట్లాడారు. పాలకమండలి సభ్యులు ఆచార్య సురేష్‌లాల్, డాక్టర్ అనితారెడ్డి, మల్లం నవీన్, సుకుమారి, చిర్ర రాజు, పుల్లూరు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. తొలుత కేయూ దూరవిద్యా కేంద్రంలోని పూలే దంపతుల విగ్రహాలకు వీసీ, రిజిస్ట్రార్ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బోధన, బోధనేతర సిబ్బంది, పలువురు పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి -
శనివారం శ్రీ 12 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
– 10లోuవైభవంగా పారువేటపాలకుర్తి టౌన్: తెలంగాణ రెండో భద్రాద్రిగా వెలుగొందుతున్న వల్మిడీ సీతారామచంద్రస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా 10వ రోజున స్వామి వారికి బండ్లు తిరుగుట, పారువేట నిర్వహించారు. అలాగే శుక్రవారం రాత్రి నిర్వహించిన శ్రీపుష్పయాగం, దోపోత్సవం, ద్రజారోహణం కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామివార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. జీఓ 129ని సవరణ చేయాలి జనగామ రూరల్: జీఓ 129ని సవరించాలని తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి పెద్దాపురం రమేశ్ అన్నారు. శుక్రవారం పెండెల శ్రీనివాస్ అధ్యక్షతన జిల్లా స్థాయి సమావేశం యూని యన్ కార్యాలయంతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీఓనంబర్ 129 ద్వారా గ్రామ రెవెన్యూ అధికారులు చాలా నష్ట పోతున్నామని, సుమారు 20 నుంచి 25 సంవత్సరాల నుంచి సర్వీస్ చేసిన వారికి అవకాశం కల్పించకపోవడం బాధాకరమన్నారు. అనంతరం కలెక్టర్ రిజ్వన్ బాషాకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నామల పరుశరాములు, రవీందర్, యాదగిరి, సుదీర్ రెడ్డి నరేష్, శ్రీకాంత్, కొండ య్య, క్రాంతి, షకీల్, సాంబయ్య, గంగరాజు, రామచంద్రం, తదితరులు పాల్గొన్నారు. గోపా యువజన విభాగం జిల్లా అధ్యక్షుడిగా సతీష్గౌడ్స్టేషన్ఘన్పూర్: గోపా యువజన విభాగం జిల్లా అధ్యక్షుడిగా మండలంలోని ఇప్పగూడెం గ్రామానికి చెందిన మందపురం సతీష్‌గౌడ్‌ను నియమించినట్లు గోపా (గౌడ అఫీషియల్స్ అండ్ ప్రొఫెసనల్స్ అసోసియేషన్) యువజన రాష్ట్ర అధ్యక్షుడు కోరుకొప్పుల నాగేష్‌గౌడ్ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సతీష్చేసిన సేవలను గుర్తించి యువజన అధ్యక్షుడిగా నియమించామన్నారు. అనంతరం సతీష్‌గౌడ్ మాట్లాడుతూ సంఘ నిర్ణయాలకు కట్టుబడి పనిచేస్తూ జిల్లా వ్యాప్తంగా గౌడజాతి గొంతుకగా నిలుస్తానన్నారు. తనను ఎంపిక చేసిన రాష్ట్ర అధ్యక్షుడితోపాటు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. వ్యవసాయ కార్పొరేటీకరణ ను వెనక్కి తీసుకోవాలిజనగామ రూరల్: మోదీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను, కార్పొరేటీకరణను వెనక్కి తీసుకోవాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా చందు నాయక్, రాష్ట్ర కమిటీ సభ్యుడు మోకు కనకరెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రజాసంఘాల కార్యాలయం వద్ద అఖిల భారత కిసాన్ సభ 89వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం జెండా ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ కేంద్రం నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవడంలో విఫలమైందని, మళ్లీ పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో బూడిద గోపి, సుమ, యాకన్న, శ్రీకాంత్, మంగ బీరయ్య, కర్రే సత్తయ్య, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.జనగామ: ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ప్లాస్టిక్ మహమ్మారిని కూకటి వేళ్లతో పికిలి పారేసేందుకు పురపాలిక అధికారులు నడుంబిగించారు. 75 మైక్రాన్ల కన్నా తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ వినియోగం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకు సంబంధించి కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ గతంలోనే 571(బి) జీఓ విడుదల చేసిన సంగతి తెలిసిందే. నిబంధనలను అతిక్రమించిన వ్యాపారులకు జరిమానా వేయాలని అందులో పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌తో పాటు 75 మైక్రాన్ల కన్నా తక్కువ మందం కలిగిన కవర్ల అమ్మకాలు చేయకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. పెనుముప్పుగా ప్లాస్టిక్ ప్లాస్టిక్ కవర్ల వినియోగం పర్యావరణానికి పెనుముప్పుగా మారిపోతుంది. ప్రమాదకరమైన ప్లాస్టిక్‌పై గతం నుంచే నిషేధం అమలులో ఉన్నప్పటికీ, ఎవరూ పట్టించుకోలేదు. ప్లాస్టిక్ వినియోగంపై గతంలో ఎన్విరాన్మెంటల్, శానిటేషన్ అధికారులు రెగ్యులర్‌గా తనిఖీలు చేపట్టినప్పటికీ, కొంతకాలం పాటు వదిలేశారు. దీంతో ప్లాస్టిక్ అమ్మకాలు తిరిగి మొదలయ్యాయి. అలాగే జిల్లాలోని జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి నియోజకవర్గాల పరిధిలో ప్లాస్టిక్ అమ్మకాలపై ఎలాంటి నిషేధం లేదు. జిల్లా కేంద్రంతో పాటు మండలాల పరిధిలో రోజు వారీగా 10 క్వింటాళ్ల వరకు ప్లాస్టిక్ కవర్ల అమ్మకాలు జరుగుతాయి. ఇందులో 45 శాతం ప్లాస్టిక్ అమ్మకాలు పట్టణంలో జరుగుతుండగా మండలాల పరిధిలో 55 శాతం మేర ఉంటాయని అంచనా. పట్టణంలోని ప్లాస్టిక్ నిషేధం అమలులో ఉన్నప్పటికీ, మండలాలు, గ్రామాల్లో మాత్రం యథావిధిగా క్రయవిక్రయాలు జరుగుతూనే ఉన్నాయి. పురపాలిక, గ్రామపంచాయతీల పరిధిలో రోజు వారీగా సేకరించే చెత్తలో 25 శాతానికి పైగా వాడి పారేసిన ప్లాస్టిక్ ఉండడం ఎంత ప్రమాదమో తెలియజేస్తోంది. క్యారీ బ్యాగుల్లో ఉండే పిగ్మెంట్లు, ప్లాస్టిక్ సైజర్లు, యాంటి ఆక్సిడెంట్ల వల్ల నాడీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు. చెత్తతో కలిపి వేసిన క్యారీ బ్యాగులను తింటున్న మూగ జీవాలకు ప్రమాదం లేకపోలేదు. పట్టింపులేకనే.. ప్లాస్టిక్‌తో ముప్పును సీరియస్‌గా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం 2011లో ప్రత్యేక జీఓను జారీ చేసింది. 20 మైక్రాన్ల మందం కంటే తక్కువ ఉన్న పాలిథిన్ కవర్లు అమ్మొద్దని ముందుగా ఆదేశాలు జారీ చేసినప్పటికీ, ఆ తర్వాత 75కు పెంచింది. నిబంధనలు అతిక్రమించి తయారీ చేసినా, హోల్‌సేల్, రిటేయిల్ అమ్మకాలు జరిపినా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హెచ్చరికలను జారీ చేసింది. ప్లాస్టిక్ వాడకంపై గ్రామస్థాయి నుంచి ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు తయారీ సంస్థలను పూర్తిగా మూసి వేసినప్పుడే వందశాతం నిర్మూలించవచ్చని పర్యావరణ ప్రేమికులు అభిప్రాయ పడుతున్నారు. మొదలైన తనిఖీలు పట్టణంలో గత రెండు, మూడు నెలలుగా ప్లాస్టిక్ వినియోగంపై తనిఖీలు చేపడుతున్నారు. కవర్లను అమ్మే వ్యాపారులకు రూ.5 వందల నుంచి అంతకుపైగా జరిమానా వేస్తూ ముందస్తుగా హెచ్చరిస్తున్నారు. ఇప్పటి వరకు 200 దుకాణాలకు పైగా జరిమానాలు విధించారు. 75 మైక్రాన్ల కన్నా తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ కవర్లతో పాటు బ్యాగులు, వాడి పారేసే గ్లాసులు, ప్రమాదకరమైన ప్లాస్టిక్ కవర్లను ఎట్టి పరిస్థితుల్లో అమ్మరాదని సూచనలు చేస్తున్నారు. పట్టణంలో రోజువారీగా 11 టన్నుల చెత్త సేకరణ జరుగుతుంది. ఇందులో ఒకటిన్నర టన్నుల ప్లాస్టిక్ వస్తుంది. టీస్టాల్స్, హోటల్స్, ఫంక్షన్ హాల్స్, భోజనం హోటల్స్, తదితర దుకాణాల వద్ద ప్లాస్టిక్, పేపర్ టీ గ్లాస్లు, వాటర్ బాటిల్స్, తాగు నీటి గ్లాసులు ఇలా ఇష్టారీతిలో బయట వేయడంతో అవి డ్రెయినేజీల్లోకి కొట్టుకు పోతున్నాయి. పట్టణంలోని ప్రధాన కూడళ్లలోని డ్రెయినేజీల్లో మురికి నీటికంటే ఎక్కువగా ప్లాస్టిక్ వ్యర్థపదార్థాలే కనిపిస్తాయి. విస్తృత తనిఖీలు చేపడుతున్నాం.. పట్టణంలో ప్లాస్టిక్ కవర్లను ఎవరూ వినియోగించొద్దు. దుకాణా యజమానులు సహకరించాలి. ప్లాస్టిక్‌కు బదులుగా జూట్ బ్యాగులు ఉపయోగించి, పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ పాటుపడాలి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌తో పెను ప్రమాదం పొంచి ఉంది. ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి, విస్త్రృత తనిఖీలు చేపడుతున్నాం. నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు చేస్తే జరిమానా విధిస్తాం. – వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ ఇన్చార్జ్ వీసీలతో ముందుకు సాగని పనులు●● మూడు జిల్లాలకు విస్తరించిన పరిధి ● పెండింగ్‌లో రూ.వందల కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు ● ఇప్పటికే స్మార్ట్‌సిటీ, ఇండస్ట్రియల్, ఐటీ కారిడార్‌గా పేరు ● భవిష్యత్‌లో ఎయిర్పోర్ట్, మాస్టర్‌ప్లాన్–2041 అమలు ● పూర్తి కాలపు ఐఏఎస్ ఉంటేనే ప్రగతిపథంలో ‘కుడా’ న్యూస్రీల్పట్టణంలో అడుగడుగునా నిఘా ప్రత్యేక బృందాల ఆధ్వర్యంలో తనిఖీలు 75 మైక్రాన్ల కంటే తక్కువ ఉండొద్దు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు -
రైతుల పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం
● ఎమ్మెల్యే కడియం శ్రీహరి జఫర్‌గఢ్: రైతుల పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వమని, దేశంలో సన్నధాన్యానికి బోనస్ ఇస్తున్న ఏకై క రాష్ట్రం తెలంగాణ అని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో మసీదు బండపై ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కడియం శ్రీహరి శుక్రవారం ప్రారంభించారు. అనంతరం స్థానిక రెవెన్యూ కార్యాలయం ఎదుట కల్యాణలక్ష్మి, సీఎం సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అనంతరం 68 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, 94 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ తీగల కర్ణాకర్‌రావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య శిరీష్‌రెడ్డి, నూకల ఐలయ్య, తహసీల్ధార్ శంకరయ్య, ఇల్లందుల బా బు, భూక్య సురేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆదర్శప్రాయుడు మహాత్మాజ్యోతిబా పూలే
జనగామ రూరల్: ఆదర్శప్రాయుడు మహాత్మా జ్యోతిబా పూలే, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అ న్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో వెనుకబడిన తరగతుల శాఖ ఆధ్వర్యంలో పూలే 199వ జయంతిని ఘ నంగా నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ పాల్గొని జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సామాజిక ఉద్యమకారుడిగా, కుల వివక్షతకు వ్యతిరేకంగా అన్ని వర్గాల సమానత్వానికి పాటుపడిన మహనీయుడన్నారు. సమానత్వం లేని కాలంలో సత్య శోధక్ సమాజ్ను ఏర్పాటు చేసి సమానత్వానికి ఎంతగానో కృషి చేశారన్నారు. అంతకుముందు సమాచార పౌరసంబంధాల శాఖ ఆ ధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళా కారుల బృందాలచే పూలే గొప్పతనాన్ని పాటల ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారి రవీందర్, డీఎస్సీ డీఓ విక్రమ్, జిల్లా అధికారులు, వివిధ సంఘాల నాయకులు వెంకట మల్లయ్య, వేముల బాలరాజ్, నారోజు రామేశ్వర చారి, జామ మల్లేష్, బాల్డే మల్లేశం, శివరాత్రి దు ర్గయ్య, శివరాత్రి కుమార్, కడారి రమేష్, జూకంటి శ్రీశైలం, మామిడల రాజు, మంగ రామకృష్ణ, కన్నా పరశురాములు తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ రిజ్వాన్ బాషా -
కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్జనగామ రూరల్: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ పిలుపునిచ్చారు. గావ్ చలో బస్తీ చలో కార్యక్రమంలో భాగంగా పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి నెహ్రూ పార్కు, గణేష్ టెంపుల్ వద్ద స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలు, మున్సిపాలిటీల్లో పాదయాత్రల ద్వారా పార్టీ కార్యకర్తలు ప్రజల వద్దకు వెళ్లి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలను వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు బుడుగుల రమేశ్, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు దేవరాయ ఎల్లయ్య, నాయకులు లక్ష్మినర్సయ్య, జగదీష్, అశోక్, మైపాల్, ఈర్ల నవీన్ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి
జనగామ రూరల్:అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేయాలని వరంగల్ ఎంపీ కడియం కావ్య, భువనగిరి ఎంపీ, దిశ కమిటీ కోకన్వీనర్ చామల కిరణ్‌కుమార్‌రెడ్డిలు అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో దిశ (జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ) చైర్మన్ కడియం కావ్య అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ముందుగా మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎంపీ, దిశ కమిటీ చైర్మన్ కడియం కావ్య మాట్లాడుతూ రెండేళ్లుగా ఒక్కసారి కూడా దిశ సమావేశం నిర్వహించలేదని ఇకపై నిరంతరం దిశ సమావేశం ఉంటుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కేన్సర్ స్క్రీనింగ్ టెస్ట్‌లు ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా అధికారులు మరింతగా కృషి చేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయిస్తున్న నిధులను సక్రమంగా వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిధులను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలన్నారు. అనంతరం కలెక్టర్ రిజ్వాన్ బాషా మాట్లాడుతూ జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి ఉపాధి హామీ పథకం కింద 31.7 లక్షల పని దినాలను కూలీలకు కల్పించడం జరిగిందని, అలాగే రాష్ట్రంలో 4వ స్థానంలో ఉన్నామన్నారు. ప్రధాన మంత్రి కృషి సంచాయీ యోజన పథకం కింద భూగర్భ జలాలను పెంపొందించే విధంగా వాటర్ షెడ్ పనులను చేపట్టామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కింద పట్టణంలో 760 ఇళ్లకు, గ్రామీణంలో 3,633 ఇళ్లు మంజూరయ్యాయన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్, డీసీపీ రాజ మహేంద్ర నాయక్, డీఆర్డీఏ వసంత, ఆర్డీఓ గోపీరాం, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుహాసిని, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వరంగల్, భువనగిరి ఎంపీలు కడియం కావ్య, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి కలెక్టరేట్లో దిశ సమావేశం -
వేరుశనగ సాగుపై రైతులకు శిక్షణ
మామునూరు: ఖిలా వరంగల్ మండలం మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో అధిపతి కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆహార భద్రత మిషన్ నేతృత్వంలో శుక్రవారం వేరుశనగ సాగుపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా కేవీకే సీనియర్ శాస్త్రవేత్త, కోఆర్డినేటర్ డాక్టర్ రాజన్న హాజరై వేరుశనగ సాగుపై శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించి, మాట్లాడారు. రైతులకు టీసీజీఎస్–1694(విశిష్ట) వేరుశనగ సాగు వివరాలను రైతులకు వివరించారు. అనంతరం రైతులకు టీ సీజీఎస్ 1694 రకం వేరు శనగ విత్తనాలు అందజేశారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్ సౌమ్య, రాజు, రైతు కోఆర్డినేటర్ రాజిరెడ్డి, హర్షరెడ్డి, సాయిచంద్, రైతులు పాల్గొన్నారు -
‘కుడా’కు కావాలి ఓ ఐఏఎస్!
సాక్షిప్రతినిధి, వరంగల్: గ్రేటర్ వరంగల్.. హైదరాబాద్ తర్వాత తెలంగాణలో రెండో నగరం. రాష్ట్ర రాజధానికి సమానంగా అభివృద్ధి చేస్తామని సీఎం, మంత్రులు పదే పదే చెబుతున్నారు. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(కుడా) ద్వారా మహా నగరాన్ని అభివృద్ధి చేసే అవకాశం ఉందని కూడా ప్రకటించారు. అయితే.. అభివృద్ధి, సంక్షేమ పథకాలు పరుగులు పెట్టాలంటే ‘కుడా’కు ప్రత్యేకంగా ఓ ఐఏఎస్ అధికారిని నియమిస్తేనే సాధ్యమన్న చర్చ జరుగుతోంది. 1982 నుంచి సుమారు 25 మందికిపైగా అధికారులు ‘కుడా’ వైస్ చైర్మన్లుగా పని చేశారు. కొందరు వైస్ చైర్మన్‌తో పాటు వరంగల్ మున్సిపల్ కమిషనర్‌గా కూడా వ్యవహరించారు. అయితే 2009, 2011లో ప్రత్యేకంగా ‘కుడా’ వైస్ చైర్మన్లను నియమించిన ప్రభుత్వం.. ఆతర్వాత పూర్తి కాలపు వీసీలను నియమించలేదు. 2009 నవంబర్ 12న జక్కుల శంకరయ్యను ‘కుడా’ వీసీగా నియమించగా, ఆ తర్వాత 2013–14లో యాదగిరిరెడ్డి కొంతకాలం పని చేశారు. అనంతరం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) కమిషనర్లే.. ‘కుడా’ వైస్ చైర్మన్లుగా వ్యవహరిస్తున్నారు. కమిషనర్లే ఇన్చార్జ్ వీసీలు 2013–14 తర్వాత సుమారు పదకొండేళ్ల నుంచి ‘కుడా’కు పూర్తి కాలపు వైస్ చైర్మన్లను ప్రభుత్వాలు నియమించలేదు. యాదగిరిరెడ్డి తర్వాత ఐఏఎస్ అధికారులు పౌసమి బసు, ప్రశాంత్ జీవన్ పాటిల్, సర్ఫరాజ్ అహ్మద్ వరుసగా జీడబ్ల్యూఎంసీ కమిషనర్లుగా, ‘కుడా’ వైస్ చైర్మన్లుగా పని చేశారు. ఆతర్వాత ఎస్.దయానంద్ తర్వాత శృతిఓజా, వీపీ గౌతమ్, పమేలా సత్పతి, ప్రావీణ్య, రిజ్వాన్‌బాషా మొదలు ప్రస్తుతం ఉన్న అశ్విని తానాజీ వాకడే వరకు ఐఏఎస్‌లే మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్లుగా, ఇన్చార్జ్ వీసీలుగా ఉన్నారు. 2016లో జిల్లాల పునర్విభజన తర్వాత ఒక్క అసెంబ్లీ నియోజకవర్గం ఉన్న జిల్లాకు కూడా కలెక్టర్‌గా ఐఏఎస్ అధికారులను నియమిస్తున్నారు. వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాలకు విస్తరించిన ‘కుడా’కు పూర్తికాలపు వైస్‌చైర్మన్ ఐఏఎస్ అధికారిని నియమించాలని నగర ప్రజలు కోరుతున్నారు. ప్రత్యేక ఐఏఎస్ ఉంటే మేలు మూడు జిల్లాలకు విస్తరించిన ‘కుడా’ పరిధిలో కోట్లాది రూపాయల విలువ చేసే అభివృద్ధి పనులపై ప్రభుత్వం హామీలు ఇచ్చింది. సుమారు రూ.10 వేల కోట్ల పనులకు సమర్పించిన సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్)లు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. ● జీఎంఆర్ నిరభ్యంతర పత్రంతో ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. 750 ఎకరాల స్థలం అందుబాటులో ఉండగా.. మరో 450 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం సేకరించాల్సి ఉంది. కాకతీయ మెగా జౌళి పార్కు కోసం రాష్ట్ర ప్రభుత్వం 1,200 ఎకరాల భూసేకరణ చేసి, టీజీఐఐసీ ద్వారా మౌలిక వసతులు కల్పించింది. ఇప్పటికే కొన్ని పరిశ్రమలు పని మొదలు పెట్టినా.. కేంద్రం నుంచి పీఎం మిత్ర కింద రూ.200 కోట్లు రాబట్టేందుకు ’ఎస్పీవీ’ (ప్రత్యేక ప్రయోజన వాహకం) ఏర్పాటు చేయడంతో పాటు రూ.500 కోట్ల మంజూరుపై చర్చ జరుగుతోంది. ● ఓరుగల్లుకు కీలకమైన స్మార్ట్‌సిటీ పథకం ద్వారా రూ.941.53 కోట్లతో 47 పనులకు నిధులు మంజూరు చేశారు. 28 పనులు పూర్తవగా.. 19 కొనసాగుతున్నాయి. స్మార్ట్‌రోడ్లు అసంపూర్తిగా ఉండడం, భద్రకాళి, వడ్డేపల్లి, ఉర్సు చెరువు బండ్ సుందరీకరణ పనులు.. నిధులు, పర్యవేక్షణ లేక జాప్యమవుతున్నాయి. ● గ్రేటర్ వరంగల్‌కు ఓ మంచి డంపింగ్ యార్డు లేదు. రోజూ 480 టన్నుల చెత్త పోగవుతున్నా.. డంపింగ్ చేసేందుకు రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్లతో ప్రతిపాదించారు. ● మహా నగరం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు కోసం ప్రభుత్వంలో రూ.669.59 కోట్ల అంచనా వ్యయంతో పనులకు శంకుస్థాపన చేశారు. భూసేకరణ కోసం రూ.157.95 కోట్లు కేటాయించగా.. రహదారి నిర్మాణం కోసం రూ.551.64 కోట్లు మంజూరయ్యాయి. త్వరలోనే సరిపడా నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది. ● వరంగల్ నగర అభివృద్ధి కీలకమైన 2041 మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించిన ‘కుడా’ పూర్తి స్థాయిలో అమలు కాకపోవడానికి పూర్తి కాలపు ఐఏఎస్ అధికారి వీసీగా లేకపోవడమేనన్న చర్చ కూడా జరుగుతోంది. ఐఏఎస్‌ను వీసీగా నియమించాలి కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వరంగల్(కుడా)కు బల్దియా కమిషనర్‌ను వీసీగా నియమించడం ఆనవాయితీగా వస్తున్నది. ఇన్చార్జ్ వీసీ పూర్తి స్థాయిలో దృష్టి సారించకపోవడంతో అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతున్నది. ఇకనైనా ప్రభుత్వం స్పందించి ‘కుడా’కు ఐఏఎస్ స్థా యి అధికారిని వీసీగా నియామకం చేయాలి. – అచ్చ వినోద్‌కుమార్, సామాజిక న్యాయవేదిక జిల్లా కార్యదర్శి రెగ్యులర్ వీసీని నియమించాలి అభివృద్ధిలో హైదరాబాద్‌తో పోటీపడుతున్న వరంగల్ మహా నగరం మరింత ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చెందాలంటే కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థకు సీనియర్ ఐఏఎస్ అధికారిని రెగ్యులర్ వైస్‌చైర్మన్‌గా నియమించాలి. ఇప్పటి వరకు ఇన్చార్జ్ వీసీలుగా మున్సిపల్ కమిషనర్, కలెక్టర్లను ప్రభుత్వం నియమిస్తూ వస్తున్నది. తద్వారా ‘కుడా’ అభివృద్ధికి ప్రణాళికలను పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోతున్నారు. సీనియర్ ఐఏఎస్‌ను వైస్‌చైర్మన్‌గా నియమిస్తే మాస్టర్‌ప్లాన్‌ను పటిష్టంగా అమలు చేసే అవకాశం ఉంటుంది. – నిమ్మల శ్రీనివాస్, సామాజికవేత్త, హనుమకొండ -
జిల్లా సమాఖ్యకు పెట్రోల్‌బంక్!
● 10 గుంటల భూమికి ప్రపోజల్ ● సెర్ప్ నుంచి నిధులు జనగామ: జనగామ జిల్లా కేంద్రంలో మరో పెట్రోల్‌బంకు రాబోతుంది. జిల్లా సమాఖ్యకు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి స్థల పరిశీలన పూర్తి కాగా, ప్రపోజల్స్ సర్కారుకు పంపించారు. రాష్ట్రంలో నారాయణపేట్‌లో సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్‌బంక్ రన్నింగ్ అవుతుండగా.. రెండవ బంకు జనగామకు రానుంది. పట్టణంలోని సిద్దిరోడ్డు వైపు స్థలంకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా... సర్కారు ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారు. రూ.కోటి నిధులతో చేపట్టే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన నిధులను సెర్ఫ్ ఉంచి ఇవ్వనున్నారు. ప్రభుత్వం నుంచి భూ కేటాయింపులు పూర్తయిన వెంటనే పెట్రోలు బంకు నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. -
మంటగలిసిన మానవత్వం
వడదెబ్బకు గురైన కన్నతల్లికి అంత్యక్రియలు చేయని కొడుకు..చిట్యాల: కన్న తల్లికి అంత్యక్రియలు నిర్వహించకుండా ఇంటికి తాళం వేసి పారిపోయాడు ఆ కొడు కు.. కుల పెద్దలు దహన సంస్కారాలు నిర్వహించగా.. పెద్ద కూతురు నిప్పు పెట్టిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం నైన్పాక గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గోనెల మల్లయ్య–రాధమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు స్వరూప, వసంత, కుమారుడు ఓదెలు ఉన్నారు. ముగ్గురికి వివాహం అయింది. కాగా పదే ళ్ల క్రితమే మల్లయ్య అనారోగ్యంతో మృతి చెందా డు. ఈ క్రమంలో కొడుకు ఒదెలు తల్లి రాధమ్మతో నిత్యం గొడవ పెట్టుకుని ఆమెను బయటకు గెంటేశాడు. దీంతో ఆ మాతృమూర్తి గ్రామంలోనే ఓ అద్దె ఇంట్లో ఉంటూ కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నది. గురువారం ఉదయం గ్రామస్తులతో కలిసి ఉపాధి హామీ పనికి వెళ్లిన రాధమ్మ అక్కడే అస్వస్థతకు గురైంది. విషయం తెలిసినా ఉపాధి హామీ పని చేస్తున్న కుమారుడు ఓదెలు పట్టించుకోకుండా ఇంటికి వెళ్లిపోయాడు. గ్రామస్తులు చిన్న కుమార్తెకు సమాచారం ఇవ్వగా అక్కడికి చేరుకుని తల్లిని తీసుకుని భూపాలపల్లి ఆస్పత్రికి వెళ్లారు. ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యులు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి పంపించారు. ఈక్రమంలో శుక్రవారం తెల్లవారుజామున రాధమ్మ మృతి చెందడంతో చిన్న కూతురు ఇంటికి తీసుకువెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న కుమారుడు ఓదెలు అతని భార్య, కుమార్తెను గ్రామంలో వదిలేసి అతని కుమారుడితో కలిసి వెళ్లిపోయాడు. గ్రామస్తులు అతడి ఆచూకి వెతికినా లభించకపోవడంతో స్థానిక ఎస్సై శ్రావణ్‌కుమార్‌కు సమాచారం ఇచ్చారు. ఆయన అక్కడికి చేరుకుని మృతిరాలి కుమార్తెలతో మాట్లాడి అంత్యక్రియలకు ఒప్పించారు. అంత్యక్రియలను కులస్తుల సహకారంతో నిర్వహించగా.. పెద్ద కూతురు స్వరూప తల్లికి తలకొరివి పెట్టింది. దహన సంస్కారాలు చేసిన కులస్తులు తలకొరివి పెట్టిన పెద్ద కూతురు -
ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి
దామెర: ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతిచెందిన ఘటన హనుకొండ జిల్లా దామెర మండలంలోని తక్కళ్లపహాడ్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్సై అశోక్ తెలిపిక కథనం ప్రకారం.. నగరంలోని 3వ డివిజన్ ఆరెపల్లికి చెందిన సుంకరి వీరేందర్ వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. కాగా శుక్రవారం పనినిమిత్తం తన అత్తగారి ఊరైన ఆగ్రంపహాడ్కు వెళ్లి ద్విచక్రవాహనంపై తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో దామెర మండలంలోని తక్కళ్లపహాడ్ పాఠశాల సమీపానికి రాగానే జాన్‌డీర్ ట్రాక్టర్ ఢీ కొట్టింది. దీంతో వాహనంపై ఉన్న వీరేందర్ ఎగిరిపడ్డాడు. అనంతరం ట్రాక్టర్ అతనిపై నుంచి వెళ్లింది. దీంతో తీవ్రగాయాలతో వీరేందర్ అక్కడికక్కడే మృతిచెందాడు. సంఘటనా స్థలాన్ని ట్రైయినీ ఎస్పీ మనన్ భట్, ఎస్సై అశోక్ పరిశీలించి, వివరాలు సేకరించారు. వీరేందర్ భార్య సుంకరి అరుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై తెలిపారు. -
ఆర్థిక ప్రగతికి సంఘాలు కృషి చేయాలి
జనగామ రూరల్: సహాకార సంఘాలు ప్రజల ఆర్థిక ప్రగతికి కృషి చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా సహకార అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సహకార సంఘాల కార్యకలాపాల పనితీరును అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్‌తో కలిసి సంబంధిత శాఖల అధికారులతో గురువారం సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సహకార సంఘాల పరిధిలోని వివిధ వృత్తి కుటుంబాలను బలోపేతం చేసేందుకు గ్రామస్థాయిలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, రైతుసేవా సహకార సంఘాలు, పాల ఉత్పత్తుల సహకార సంఘాలు, మత్స్యసహకార సంఘాలు, కల్లుగీత కార్మిక సంఘాల ద్వారా విస్తృత సేవలు అందించాలన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మరింత సేవలందించడానికి మరిన్ని సహకార సంఘాల ఏర్పాటు చేయాలన్నారు. రైతు ఉత్పత్తి కేంద్రాలను ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పరిధిలో ఏర్పాటు చేయవలసిన ఆవశ్యకతను అధికారులతో సమీక్షిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ వివరించారు. మత్స్యసహకార సంఘాలు, పాల ఉత్పత్తుల సహకార సంఘాలు తమ వ్యాపార పరిధిని పెంచుకొని సంబంధిత వృత్తి గ్రామీణ ప్రజలకు మరింత సేవలందించాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో జెడ్పీ డిప్యూటీ సీఈఓ సరిత, జిల్లా సహకార శాఖ అధికారి రాజేందర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి రామారావు నాయక్, జిల్లా మత్స్యశాఖ అధికారి రాణా ప్రతాప్, పశుసంవర్ధన శాఖ అధికారి రాధా కిషన్, నాబార్డ్ ఏజీఎం చంద్రశేఖర్, విజయడైరీ అధికారి సత్యనారాయణ, డీసీసీబీ అధికారి అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పనుల్లో వేగం పెంచాలి స్టేషన్‌ఘన్‌పూర్: గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచేలా అధికారులు చూడాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్‌బాషా అన్నారు. మండలంలోని తానేదార్‌పల్లిలో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను అధికారులతో కలిసి గురువారం ఆయన పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడారు. భూమిపూజ ఎప్పుడు చేశారు, మొరం, ఇసుక ఎక్కడ నుంచి తీసుకొస్తున్నారని ఆరా తీశారు. కాగా, అక్కడే ఉన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు వెంకన్న మాట్లాడుతూ.. ఇసుకతో సమస్య ఉందని, గోదావరి ఇసుక కొనాలంటే ప్రజలు ఇ బ్బంది పడుతున్నారని, లోకల్ ఇసుకకు అనుమతి ఇవ్వాలని లబ్ధిదారుల పక్షాన కోరారు. దీంతో కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ తహసీల్దార్‌కు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల ద్వారా పేదల సొంతింటి కలను సాకారం చేస్తుందన్నారు. పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికై న గ్రామాల్లో నిర్మాణాలు త్వరగా పూర్తిచేసేలా అధికారులు బాధ్యతగా పనిచేస్తూ లబ్ధిదారులను చైతన్యం చేయాలన్నారు. కార్యక్రమంలో గృహ నిర్మాణ పీడీ మాతృనాయక్, ఎంపీడీఓ విజయశ్రీ, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీఓ నర్సింగరావు, పంచాయతీ కార్యదర్శి వెంకటరమణ, నాయకులు మంతెన ఇంద్రారెడ్డి, పద్మారెడ్డి, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ -
ఐక్యంగా ఉండి రాజకీయంగా ఎదగాలి
లింగాలఘణపురం: కురుమలు ఐక్యంగా ఉండి రాజకీయంగా ఎదగాలని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మండలంలోని నెల్లుట్లలో కురుమ సంఘం ఆధ్వర్యంలో బీరప్పగుడి నిర్మాణానికి గురువారం ఎమ్మెల్యే కడియం శ్రీహరి భూమిపూజ చేశారు. అనంతరం ఆలేరు ఎమ్మెల్యే, విప్ బీర్ల ఐలయ్య ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గతంలో కురుమ సామాజిక వర్గానికి చెందిన తల్లిదండ్రులు తమ పిల్లలను గొర్రెల మేపడం, వ్యవసాయ పనులకు పంపించారని, దీంతో ఎదగలేకపోయారని అన్నారు. నేడు కురుమలు డాక్లర్లు, ఐఏఎస్, ఐపీఎస్‌లు అవుతున్నారని, అదేవిధంగా రాజకీయంగా ఎదగాల్సిన అవసరం ఉందని, తాను ఎమ్మెల్యేగా గెలువడానికి కురుమ కులస్తులు ఎంతో కృషి చేశారని అన్నారు. ఆలయ నిర్మాణానికి సహకారం చేస్తానని చెప్పారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ కురుమలు నమ్మకానికి, నీతికి, నిజాయితీకి మారుపేరుగా నిలిచారని అన్నారు. నియోజకవర్గంలో కురుమలకు తగిన స్థానం కల్పిస్తానని చెప్పారు. అదేవిధంగా బీరప్పగుడి సమీపంలోనే రూ.20 లక్షలతో కురుమ భవనం నిర్మించేందుకు నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమాల్లో కురుమ సంఘం జనగామ జిల్లా అధ్యక్షుడు కంచె రాములు, కొమురవెల్లి దేవస్థాన మాజీ చైర్మన్ సంపత్, మాజీ జెడ్పీటీసీ గుడి వంశీధర్‌రెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ శివకుమార్, లింగాల దీపక్‌రెడ్డి, కురుమ సంఘం మండల అధ్యక్షుడు చంద్రమౌళి, అంజనేయులు, సంపత్, మల్లేశం, ఐలయ్య, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు. కురుమలకు సహకారం అందిస్తాం నెల్లుట్లలో బీరప్పగుడి నిర్మాణానికి భూమిపూజ పాల్గొన్న విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యే కడియం -
జీపీ కార్మికుడికి ప్రభుత్వమే వైద్యం అందించాలి
సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజు రఘునాథపల్లి: విద్యుదాఘాతానికి గురై తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మండలంలోని మేకలగట్టు పంచాయతీ కార్మికుడు వేల్పుల నాగరాజుకు ప్రభుత్వమే పూర్తి వైద్య ఖర్చులు భరించి మెరుగైన వైద్యం అందించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాపర్తి రాజు డిమాండ్ చేశారు. ఈ నెల 5వ తేదీన గ్రామంలో వీధిలైట్లు వేస్తూ నాగరాజు విద్యుదాఘాతానికి గురై తీవ్ర గాయాలతో హనుమకొండ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా అధికారులు పట్టించుకోక పోవడాన్ని నిరసిస్తూ మండలంలోని పంచాయతీ కార్మికులు గురువారం ఎంపీడీఓ కార్యాలయం ముందు భైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్బంగా రాజు మాట్లాడుతూ మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు చేసి పంచాయతీ కార్మికులకు ఉద్యోగ భద్రత, ప్రమాద బీమా, ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. అప్పులు చేసి వైద్యం చేయించుకుంటున్న నాగరాజుకు ప్రభుత్వం వైద్య సేవలు అందించకుంటే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీనివాసులుకు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. కార్యక్రమంలో ఉమ్మగోని రాజేష్‌గౌడ్, మహేందర్, రాపోలు రాజ్‌కుమార్, సత్యనారాయణ, కొయ్యడ బిక్షపతి, నల్ల రాజన్న, ఎండీ అజ్మత్, ప్రభాకర్, నీలం మధు, యాదలక్ష్మి, రేణుక పాల్గొన్నారు. -
రైతుల పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం
స్టేషన్‌ఘన్‌పూర్: సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతిగా పనిచేస్తుందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మండలంలోని తానేదార్పల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషాతో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ డీఎస్ వెంకన్న అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. తానేదార్పల్లి గ్రామస్తులు చాలా అదృష్టవంతులని, జనవరిలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాలను ఈ గ్రామంలోనే ప్రారంభించినట్లు తెలిపారు. ఆయా సంక్షేమ పథకాల విషయంలో అధికారులు అప్రమత్తంగా, బాధ్యతగా పనిచేయాలన్నారు. రైతులు పండించిన ప్రతీ గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతుభరోసాతో పాటు సన్నాలకు క్వింటాకు రూ.500 బోనస్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రోహిత్‌సింగ్, డీఆర్డీఏ వసంత, డీఏఓ రామారావునాయక్, ఏఎంసీ చైర్పర్సన్ లావణ్యశిరీష్‌రెడ్డి, డీఎం సీఎస్ హతీరాం, గృహనిర్మాణ పీడీ మాతృనాయక్, ఎంపీడీఓ విజయశ్రీ, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఏపీఎం కుమారస్వామి, నాయకులు వెంకన్న, ఇంద్రారెడ్డి, పద్మారెడ్డి, కుమారస్వామి పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. మండలంలోని విశ్వనాధపురంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏఎంసీ చైర్పర్సన్ లావణ్యశిరీష్‌రెడ్డి గురువారం ప్రారంభించారు. అవినీతి రహిత పాలనే లక్ష్యం అవినీతి రహిత పాలనే లక్ష్యమని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఘన్పూర్ డివిజన్ కేంద్రంలోని రైతువేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని గురువారం చేపట్టారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కడియం శ్రీహరితోపాటు కలెక్టర్ షేక్ రిజ్వాన్‌బాషా, అదనపు కలెక్టర్ రోహిత్‌సింగ్ హాజరయ్యారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా చూడాలని అధికారులకు చెప్పారు. కార్యక్రమంలో ఆర్డీఓ డీఎస్ వెంకన్న, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
వణికిస్తున్న వరుణుడు
శుక్రవారం శ్రీ 11 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025– 8లోuజనగామ: రైతన్నలకు వరుణుడు వణుకుపుట్టిస్తున్నాడు. యాసంగి సీజన్లో కరువు నష్టాన్ని మిగిల్చితే.. ఉన్న కాసింత పంటను అమ్ముకుందామంటే ప్రకృతి కన్నెర్ర చేస్తూ ఆగం చేస్తోంది. గాలి దుమారం, అకాల వర్షం భయంతో పచ్చిమీదనే రైతులు పంటను కోస్తున్నారు. తీరా.. పంటను అమ్ముకునేందుకు మార్కెట్‌కు వెళితే.. వర్షం భయం వెంటాడుతోంది. గడిచిన మూడు రోజులుగా గాలి దుమారం, చిరుజల్లులతో అన్నదాతలు అతలాకుతలం అవుతున్నారు. వాతావరణ మార్పులు.. ఎండాకాలంలో వాతావరణం గతితప్పిందా అన్నట్లుగా.. పరిస్థితులు మారుతున్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు 38 డిగ్రీల ఉష్ణోగ్రతలతో భగ్గున మండిపోతుండగా, సాయంకాలం వాతావరణం చల్లబడిపోతుంది. దీంతో కోతకోసి మార్కెట్‌కు తీసుకొచ్చిన ధాన్యం ఎండిన తర్వాత, మళ్లీ తడుస్తుంది. దీంతో క్వింటా ధాన్యం రూ.200 నుంచి రూ.400 తక్కువకు విక్రయించే పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. తగ్గిన దిగుబడి.. జిల్లాలో యాసంగి సీజన్లో 1.80లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. వర్షాభావ పరిస్థితులు, ఎండిన చెరువులతో భూగర్భ జలాలు అడుగంటి 30 శాతం మేర పంటలు ఎండిపోయాయి. దీంతో దిగుబడి తగ్గిపోయింది. ప్రస్తుతం చాలాచోట్ల మరో పదిరోజుల తర్వాత కోతలు మొదలు పెట్టాల్సి ఉంది. కానీ అకాల వర్షం భయంతో పచ్చి కోతలు చేపట్టడంతో సరాసరి మిగులుబాటు అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. జనగామ మార్కెట్లో తడిసిన ధాన్యం జిల్లాలో గురువారం కురిసిన వర్షంతో కల్లాలు, మార్కెట్లో ఉన్న ధాన్యం తడిసింది. జనగామ మార్కెట్‌తోపాటు కాటన్ యార్డులో ఏర్పాటు చేసిన ఐకేపీ సెంటర్లో అమ్మకానికి సిద్ధంగా ఉన్న ధాన్యం రాసులు తడిసి పోగా, కొంతమేర ధాన్యం కొట్టుకుపోయింది. వరదలో కొట్టుకుపోతున్న ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు ఇబ్బందులుపడ్డారు. గాలిదుమారం ప్రారంభం కాగానే, ధాన్యం రాసులపై టారాల్పిన్ కవర్లు కప్పి ఉంచినా, స్వల్ప నష్టం జరిగింది. పొద్దంతా ఎండిన ధాన్యం తడిసిపోవడంతో తేమ శాతం పెరిగిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. బండపై ధాన్యాన్ని ఆరబోశా.. మూడెకరాల భూమిని కౌలుకు తీసుకొని వరి సాగు చేశా. సుమారు రూ.75వేలకు పైగా పెట్టుబడి పెట్టిన. సాగునీరు అందక 25 శాతంమేర నష్టపోగా, ఉన్న పంటకు నీటిని అద్దెకు తీసుకుని కాపాడాను. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో పచ్చిమీదనే పంట కోసిన. ధాన్యాన్ని బండపై ఆరబోశాను. మబ్బులు చూస్తుంటే గుబులు పుడుతుంది. – సముద్రాల యాకయ్య, రైతు, జఫర్గఢ్న్యూస్రీల్ ఉదయం ఎండలు.. సాయంత్రం గాలులు ముమ్మరంగా కోతలు.. కల్లాల్లో ధాన్యం జిల్లాలో తగ్గిన దిగుబడి.. మార్కెట్లో తడిసిన ధాన్యం -
సీతారామచంద్రస్వామికి చక్రస్నానం
పాలకుర్తి టౌన్: మండలంలోని వల్మిడి శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో బ్రహ్మత్సవాల్లో భాగంగా 9వ రోజు గురువారం స్వామి వారికి ప్రాతరారాధన, పూర్ణహుతి, రాములవారి గుండంలో స్వామివారి చక్రస్నానం నిర్వహించారు. చక్రవర్తి తీర్థప్రసాద గోష్ఠ అర్చకులు వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. నేడు డయల్ యువర్ డీఎం జనగామ రూరల్: ఆర్టీసీ జనగామ డిపోలో నేడు (శుక్రవారం) డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ స్వాతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. డిపో పరిధిలోని బచ్చన్నపేట, దేవరుప్పుల, లింగాలఘన్పూర్, నర్మెట్ట, తరిగొప్పుల, రఘునాధపల్లి, మద్దూర్, పాలకుర్తి మండలాల పరిధిలోని గ్రామాల ప్రజలు ఫోన్ చేయాలని తెలిపారు. ఆర్టీసీ బస్సు సర్వీస్ సేవలకు సంబంధించి సమస్యలతోపాటుగా సూచనలు సలహాలను తెలిపేందుకు డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 10.00 గంటల నుంచి 11.00 గంటల వరకు 99592 26050 ఫోన్ నంబర్‌కు డయల్ చేయాలని కోరారు. గడువు పొడిగింపు జనగామ రూరల్: అగ్ని వీర్ ఆన్లైన్ కామన్ ఎంట్రెన్స్ పరీక్ష దరఖాస్తు గడువు పొడిగించినట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి సాహితి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. భారత సైన్యంలో అన్ని కేటగిరీలలో జూనియర్ కమిషన్ ఆఫీసర్లు, ఇతర హోదాల నియామకం కోసం ఈ పరీక్షకు దరఖాస్తు గడువు మార్చి 12వ తేదీ నుంచి ఏప్రిల్ 25వ తేదీ వరకు పెంచినట్లు తెలిపారు . పార్టీని మరింత బలోపేతం చేయాలి బీజేపీ జిల్లా అధ్యక్షుడు చౌడ రమేష్ జనగామ రూరల్: గ్రామస్థాయిలో బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు కార్యకర్తలు అంకితభావంతో పని చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు చౌడ రమేష్ కోరారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు బోమ్మగంటి అనిల్‌గౌడ్ నేతృత్వంలో బస్తీ చలో.. గావ్ చలో అభియాన్ కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని జూబ్లీ గార్డెన్స్‌లో పార్టీ కార్యకర్తలతో ప్రత్యేక సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా ఆయన మాట్లాడుతూ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో పర్యటించి కార్యకర్తలను చైతన్యపర్చాలన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో దేశం అభివృద్ధి సాధిస్తుందన్నారు. బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన కోరారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు లక్ష్మీనర్సయ్య, దేవర ఎల్లయ్య, కార్తీక్తేజ, బింగి రమేష్, అశోక్, చంద్రయ్య, జగదీష్, హరిప్రసాద్ పాల్గొన్నారు. ఆహ్వానం దేవరుప్పుల : తెలుగు భాషకు పట్టాభిషేకం పేరుతో మే 8వ తేదీన హైదరాబాద్‌లోని త్యాగరాయ గానసభలో తలపెట్టిన అంతర్జాతీయ కవి సమ్మేళనంలో కవితా గానం చేసేందుకు మండల కేంద్రానికి చెందిన సామాజిక కవి, రచయిత అంకాల సోమయ్యకు భాషా చైతన్యసమితి అధ్యక్షులు బడేసాబ్ గురువారం ఆహ్వానం పంపించారు. సోమయ్య ఎంపికపై జనగామ రచయితల సంఘం అధ్యక్షుడు అయిలా సోమనరసింహాచారి, కవులు హర్షం వ్యక్తం చేశారు. కలెక్టరేట్లో నేడు పూలే జయంతి జనగామ రూరల్: జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నేడు కలెక్టరేట్లో మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలను నిర్వహించనున్నట్లు బీసీ సంక్షేమ అధికారి రవీందర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ హాజరవుతారని పేర్కొన్నారు. ఉదయం 10గంటలకు నిర్వహించే ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. -
దొడ్డువడ్లకూ బోనస్ ఇవ్వాలి
నర్మెట/బచ్చన్నపేట/తరిగొప్పుల/జనగామ రూరల్: దొడ్డు ధాన్యానికి సైతం తెలంగాణ ప్రభుత్వం బోనస్ అందించాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. నర్మెట మండలంలోని హన్మంతా పురం, బొమ్మకూర్, మల్కపేట, మచ్చుపహాడ్, అ మ్మాపురం, వెల్దండలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభంకాగా మల్కపేట, మచ్చుపహాడ్ ఎమ్మెల్యే పాల్గొన్నారు. బచ్చన్నపేట మండలంలోని కేసిరెడ్డిపల్లి, కొడవటూర్, తరిగొప్పుల మండలంలోని అబ్దుల్‌నాగారం, అక్కరాజుపల్లి, పోతారం, జనగామ మండలం పెంబర్తి, పెద్దపహడ్, అడవికేశావాపూర్, ఎర్రగోల్లపహడ్ వెంకిర్యాల గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని తెలిపారు. దేవాదుల మూ డో ఫేజ్‌లో రూ.1,600 కోట్లతో 1,800 క్యూసెక్కుల నీటి పంపిణీకి కేసీఆర్ ప్రభుత్వం 2014లోనే పనులు ప్రారంభించిందన్నారు. ఎమ్మెల్యే రాక ఆలస్యం కావడంతో హన్మంతాపూర్, బొమ్మకూర్‌లో చేర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ స్వేత, డీసీసీ ఉపాధ్యక్షుడు గంగం నర్సింహారెడ్డితో కలసి కేంద్రాలను ప్రారంభించడంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య తీవ్రవాగ్వాదం చోటుచేసుకుంది. సీఐ అబ్బయ్య, ఎస్సై నగేశ్ ఇరువర్గాలకు నచ్చజెప్పడంతో కార్యక్రమాలు సజావుగా సాగాయి. ఆయా కార్యక్రమాల్లో చేర్యాల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ శ్వేత, నర్మెట తహసీల్దార్ రామానుజాచార్యులు, ఎంపీడీఓ అరవింద్ చౌదరి, ఏఓ మనోహిత్ విక్రమ్‌రావు, ఏపీఎం రవి, సీసీలు యాదగిరి, కవిత, కు మార్, నాయకులు నర్సింగారావు, రాజిరెడ్డి, తేజావత్ గోవర్ధన్, శ్రీనివాస్, గౌస్, లక్ష్మీనారాయణ, లక్ష్మి, అంజయ్య, బచ్చన్నపేటలో పీఏసీఎస్ చైర్మన్ పూర్ణచందర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బాల్‌రెడ్డి, సీఈఓ బాలస్వామి, రూపాచైతన్య, అనిల్‌రాజ్, తరిగొప్పు ల తహసీల్దార్ మహిపాల్‌రెడ్డి, ఏపీఎం విజయ, పింగిళి జగన్మోహన్రెడ్డి, అర్జుల సంపత్‌రెడ్డి, చిలువే రు లింగం, శ్రీనివాస్ రెడ్డి, రాజేశ్వర్‌గౌడ్, సంజీవ, సుదర్శన్‌గౌడ్, రామరాజు, మహేందర్, సంపత్, బీమయ్య, రవీందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ బను క శివరాజ్, నిమ్మతి మహేందర్‌రెడ్డి, చిర్ర శ్రీనివాస్ రెడ్డి, మేకల కళింగరాజు, ప్రమోద్‌రెడ్డి, ప్రేమలతరెడ్డి, శ్రీనివాస్, నర్సిరెడ్డి, లక్ష్మీనారాయణనాయక్, రాజమౌళి, రాంమ్మోహన్, భాస్కర్‌రెడ్డి, నాయకు లు, రైతులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి -
వైభవంగా విగ్రహ ప్రతిష్ఠాపన పూజలు
జనగామ: జిల్లా హెడ్ పోస్టాఫీసు ఏరియా సంతోషిమాత, ఆంజనేయస్వామి ఆలయ మహారా జ గోపుర, ధ్వజస్తంభ, పరివార సమేత, విగ్రహ స్థిర ప్రతిష్ఠాపన మహోత్సవ వేడుకలు గురువారం అంగరంగ వైభవోపేతంగా ప్రారంభమాయ్యాయి. ఆలయ ప్రధాన పూజారి శ్రీనివాసశర్మ ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ వేద పురాణం మహేశ్వరశర్మ పర్యవేక్షణలో ఈ నెల10 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించనున్న పూజా కార్యక్రమాలను మొదలు పెట్టారు. మొదటి రోజు వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ విగ్రహాలకు పూజలు చేశారు. 11వ తేదీన గోపూజ, గురువందనం, పుణ్యాహవచనం, అరణి మధనం, యా గశాల ప్రవేశం, గణేష హోమం, స్థాపిత దేవతా పూజలు, జలాధివాసం తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. 12న స్థాపిత దే వతాపూజలు, విగ్రహాలకు స్నపనం, ధాన్యాధి వాసం, ప్రదోషకాల పూజలు, రాజోపచారాలు, 13న హవనములు, శయాధివాస, ఫలనుష్పాధివాస, హిరణ్యాధివాసములు, 14న ప్రతిష్ఠాంగ హోమాలు, గర్త న్యాసం, పిండికాస్థాపన, మూర్తి స్థాపన, స్వాతి నక్షత్ర మిథున లగ్న ముహూర్తంలో విగ్రహాల ప్రాణప్రతిష్ఠ, బలిహరణం, మహాపూర్ణాహుతితో వేడుకలు ముగుస్తాయి. -
చివరి ఆయకట్టు వరకు నీరందించాలి
● ఎమ్మెల్యే కడియం శ్రీహరి జనగామ రూరల్: దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు పరిధిలోని చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేలా తగిన చర్యలు తీసుకోవాలని స్టేషన్‌ఘన్‌పూర్ ఎ మ్మెల్యే కడియం శ్రీహరి అధికారులను ఆదేశించా రు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశహాల్లో కలెక్టర్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్, నీటి పారుదల శాఖ అధికారులతో దేవాదుల ఎత్తిపోతల పథకం కింద భూసేకరణ ప్రక్రియ, పెండింగ్ పనుల పురోగతి, సాగు నీటి సరఫరాపై సమీక్షించారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారానే ఘన్పూర్ నియోజకవర్గంలోని ఏడు మండలాలకు సాగుకు నీరు అందుతోందని యుద్ధప్రాతిపదికన దేవాదుల ప్రాజెక్టు పెండింగ్ పనులను పూర్తి చేయాలన్నారు. మల్లన్నగండి లిఫ్ట్ 1, 2 పనులను జులై లోగా పూర్తిచేసి, సాగు నీరు అందించాలన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు సమన్వయంతో పెండింగ్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్డీసీలు సుహాసిని, హనుమాన్ నాయక్, ఆర్డీఓలు గోపీరాం, వెంకన్న, మార్కెట్ కమిటీ చైర్మ న్ లావణ్య, మారుజోడు రాంబాబు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అశోక్, నీటి పారుదల శాఖ ఎస్ ఈలు, ఈఈలు, డీఈలు పాల్గొన్నారు. -
గురువారం శ్రీ 10 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
– 8లోuజిల్లాలోని మూడు నియోజకవర్గాల పరిధిలో పంచాయతీ కార్యదర్శుల బదిలీలకు రంగం సిద్ధమైంది. ఈ సారి మండలాలు, గ్రామాల పరిధిలో కాకుండా, నియోజకవర్గ మార్పులు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. గతంలో 73 మంది బదిలీ కాగా ఈసారి ఒకే గ్రామంలో రెండేళ్ల పాటు పని చేసిన సెక్రటరీలను బదిలీ చేయనున్నారు. దీంతో 170 నుంచి 180 మంది వరకు ఈ జాబితాలో ఉండే అవకాశం ఉంది. గ్రామాల అభివృద్ధిలో ముఖ్య భూమిక పోషిస్తున్న కార్యదర్శులు సొంతంగా ఖర్చు చేసుకుంటున్న బిల్లులను ఇచ్చిన తర్వాత బదిలీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు బుధవారం పంచాయతీ కార్యదర్శుల ఫోరం జిల్లా అధ్యక్షుడు వెంకటచారి, కార్యదర్శి బొట్ల శంకర్, అసోసియేట్ అధ్యక్షుడు దేవి ప్రసాద్, కోశాధికారి యుగేందర్, వైస్ ప్రెసిడెంట్ అనిల్ రాజు, ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రవీణ్, కార్యవర్గ సభ్యులు మహేందర్, గాదెపాక క్రాంతి, శ్రీనివాస్, భాగ్యలక్ష్మితో కలిసి టీఎన్జీఓ కార్యదర్శి పెండెల శ్రీనివాస్‌తో కలిసి పంచాయతీ కార్యదర్శులు కలెక్టర్ రిజ్వాన్ బాషాను కలిసి వినతి చేశారు. ఆకస్మిక బదిలీలను వెంటనే నిలిపేయాలని విన్నవించారు. గ్రామాల్లో అన్నీ తామై పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులు● ఇప్పటికే ఒక్కో గ్రామంలో రూ.లక్ష నుంచి రూ.5లక్షల వరకు ఖర్చు ● సుమారు రూ.5 కోట్ల బకాయి ● ట్రాన్స్ఫర్ చేస్తే డబ్బులెలా అంటూ ఆందోళన ● టీఎన్జీఓతో కలిసి కలెక్టర్‌కు వినతి ● జిల్లాలో 281మంది సెక్రటరీలు జనగామ: ప్రభుత్వ ఆదేశాలు లేవు.. బదిలీ కాలం కాదు.. ఒక్కసారిగా ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లు పిడుగులాంటి వార్త. ఊరు కాదు.. మండలం అసలే కాదు... నియోజకవర్గం మార్పుతో ఉద్యోగులకు టెన్షన్ పట్టుకుంది. మళ్లీ బదిలీలు చేస్తే బకాయిలు ఎలా వస్తాయని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం నుంచి పైసా రాకున్నా.. పైపులైన్ లీకేజీ నుంచి వీధిదీపాల నిర్వహణ వరకు కార్యదర్శులు ముఖ్యభూమిక పోషిస్తున్నారు. జీపీలో ఖర్చు చేస్తున్న ప్రతీ పైసా కార్యదర్శుల జేబులో నుంచి ఖర్చు చేస్తున్నదే. ఒక్కో సెక్రటరీ రూ.1లక్ష నుంచి రూ.5 లక్షల వరకు ఖర్చు చేయగా.. సుమారు రూ.5 కోట్ల మేర ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నిధులు లేవని కార్యదర్శులు చేతులెత్తేస్తే... జీపీ పాలన ఒక్కసారిగా కుప్పకూలిపోడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. జిల్లాలో 281 మంది కార్యదర్శులు జిల్లాలో జీపీ కార్యదర్శుల బదిలీ ప్రక్రియ ఆందోళన కలిగిస్తోంది. చాగల్, శివునిపల్లి స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపల్ పరిధిలోకి వెళ్లడంతో 280 జీపీలకు కుదించబడింది. 12 మండలాల పరిధిలో 281 పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. పాలక మండళ్ల పదవీ కాలం ముగిసి పోవడంతో 2024 ఫిబ్రవరి 1 నుంచి బాధ్యత అంతా కార్యదర్శులపై పడింది. ప్రభుత్వం నుంచి పైసా రాకపోవడంతో జీపీల్లో పని చేస్తున్న కార్యదర్శులపై భారం పడింది. ట్రాక్టర్ మెయింటెనెన్స్, శానిటేషన్ నిర్వహణ, వీధి దీపాలు, మోటార్ల రిపేరు, ఊర్లలో కనీస మౌలిక వసతి సౌకర్యాలకు సంబంధించి ప్రతీ పైసా సెక్రటరీలు అప్పులు తెచ్చి ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఇప్పటి వరకు ఒక్కో కార్యదర్శి రూ.లక్ష నుంచి రూ.5లక్షలు ఖర్చు చేశారు. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడంతో దివాలా తీసే పరిస్థితికి వచ్చారు. ఈ క్రమంలో గతేడాది 73 మంది సెక్రటరీలను బదిలీ చేయగా... జీపీల కోసం ఖర్చు చేసిన నిధులపై ఆందోళన వ్యక్తం చేశారు. అయినప్పటికీ బదిలీ సాధారణం కావడంతో కొత్తగా వచ్చిన కార్యదర్శులకు పాత బిల్లుల బాధ్యత అప్పగించి మరో ఊరికి వెళ్లారు. కొత్త సెక్రటరీల పరిస్థితి షరా మామూలుగానే మారడంతో పాత డబ్బులు ఇచ్చుడేమో కానీ... కొత్తగా ఖర్చు చేసే వాటికి అప్పులు చేస్తున్నారు. న్యూస్రీల్మరోసారి బదిలీ పిడుగుబిల్లులు రాక ఆర్థిక ఇబ్బందులు పంచాయతీ కార్యదర్శుల ఆకస్మిక బదిలీలు నిలిపేయాలి. గతేడాది ఫిబ్రవరి నుంచి పాలకవర్గం లేకున్నా.. కార్యదర్శులు ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువచ్చే విధంగా పరిపాలన నడిపిస్తున్నారు. గ్రామాల్లో ప్రజలకు కనీస మౌలిక వసతి సౌకర్యాల కోసం సెక్రటరీలో సొంత డబ్బులు ఖర్చు చేస్తున్నారు. ఆ బిల్లులు రాక ఆర్థిక పరమైన ఇబ్బందులను ఎదుర్కొంటూ ముందుకు వెళుతున్నారు. ఇప్పుడు ఆకస్మికంగా బదిలీ చేస్తుండడంతో పెండింగ్‌లో ఉన్న బిల్లుల పరిస్థితిపై అయోమయానికి గురవుతున్నారు. బదిలీ చేస్తే పాత బిల్లులు వచ్చే పరిస్థితి ఉండదు. – పెండెల శ్రీనివాస్, టీఎన్జీఓ జిల్లా కార్యదర్శి -
‘టెన్త్’ మూల్యాంకనంలో నిర్లక్ష్యం..
విద్యారణ్యపురి: హనుమకొండలోని కాజీపేట ఫాతిమా హైస్కూల్లో ‘టెన్త్’ మూల్యాంకనం కొనసాగుతోంది. ఇద్దరు స్కూల్ అసిస్టెంట్లు అసిస్టెంట్ ఎగ్జామినర్లు( ఏఈ)గా మూల్యాంకనంలో భాగంగా మార్కులు పోస్టింగ్ చేయడంలో పొరపాట్లు చేస్తున్నారు. స్క్రూటినీలో ఆయా పొరపాట్లు గుర్తించి సక్రమంగా మూల్యాంకనం చేయాలని చీఫ్ ఎగ్జామినర్, సిబ్బంది సూచించినా అలాగే నిర్లక్ష్యం చే స్తుండడంతో వారిని విధుల నుంచి టెన్త్ స్పాట్ క్యాంపు ఆఫీసర్, డీఈఓ వాసంతి రిలీవ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మ్యాథ్స్కూల్ అసిస్టెంట్‌కు మూల్యాంకనం విధులు అప్పగించగా మంగళవారం నిర్లక్ష్యం వహించా రు. విద్యార్థుల జవాబుపత్రాల్లో మార్కుల పోస్టింగ్‌లో పొరపాట్లు చేస్తున్నట్లు స్క్రూటినీలో గుర్తించా రు. సక్రమంగా చేయాలని సూచించినా బుధవారం కూడా అదేమాదిరి చేయడంతో అతడు చేసిన జవా బుపత్రాలను క్యాంప్ ఆఫీసర్‌కు వాసంతికి చూపించారు. దీంతో అతడిని రిలీవ్ చేశారు. అలాగే, జేఎస్ భూపాలపల్లిజిల్లాలో బయోసైన్స్ ఎస్ఏ కూడా సో మవారం ఏఈగా మూల్యాంకనం విధుల్లో చేరారు. సరిగా చేయకపోవడంతో గుర్తించి సంబంధిత సీఈ, ఇతర సిబ్బంది చెప్పినా మార్కుల పోస్టింగ్‌లలో పొరపాట్లుచేస్తుండగా రెండురోజులు అలాగే తప్పులు చేస్తుండడంతో పరిశీలించి మంగళవారం రిలీవ్ చేశారు. ఆయా ఇద్దరు స్కూల్అసిస్టెంట్లపై చర్యలు తీసుకోవాలని డీఈఓ వాసంతి గురువారం జయశంకర్ భూపాలపల్లి డీఈఓకు లిఖితపూర్వక సమాచారం పంపనున్నారు. వీలైతే సస్పెండ్ చేయాలనేది ఆదేశించనున్నారనేది చర్చ జరగుతుంది.చెప్పకుండా విధుల నుంచి వెళ్లిన టీచర్ మహబూబాబాద్ జిల్లాలో ఇంగ్లిష్ స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తూ మంగళవారం ఫాతిమా హైస్కూల్ స్పాట్ క్యాంపు వద్దకు వచ్చారు. తనకు విధులు అప్పగిస్తే అసిస్టెంట్ ఎగ్జామినర్‌గా మూల్యాంకనం చేస్తానని చెప్పగా అక్కడ సంబంధిత అధికారులు అతడికి విదులు అప్పగించారు. పది జవాబుపత్రాలు మూల్యాంకనం చేశాక మంగళవారం మధ్యాహ్నం ఎవరికి చెప్పకుండా క్యాంపు నుంచి వెళ్లిపోయాడు. దీంతో సంబంధిత సిబ్బంది అతడికి ఫోన్‌చేస్తే స్విచాఫ్ వచ్చింది. బుధవారం కూడా క్యాంప్‌నకు రాలేదు. ఫోన్లో సంప్రదించే యత్నం చేసినా అందుబాటులోకి రావడం లేదు. ఈ విషయం డీఈఓ వాసంతికి తెలియజేయగా మహబూబాబాద్ డీఈఓకు కూడా సంబంధిత టీచర్‌పై సమాచారం ఇచ్చారు. అలాగే, అతడిపై చర్యలు తీసుకోవాలని గురువారం లిఖితపూర్వకంగా మహబూబాబాద్ డీఈఓకు పంపనున్నారు. అతడిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇద్దరు స్కూల్ అసిస్టెంట్ల రిలీవ్ చెప్పకుండా క్యాంప్ నుంచి వెళ్లిన మరో టీచర్ చర్యలు తీసుకోవాలని డీఈఓలకు సమాచారం -
ఎల్సీ యాప్‌తో విద్యుత్ ప్రమాదాలకు చెక్
● ఎన్పీడీసీఎల్ ఎస్ఈ వేణుమాధవ్ జనగామ: విద్యుత్ శాఖ ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు ఎల్సీ యాప్‌ను (లైన్ క్లియర్) ప్రవేశపెట్టడం జరిగిందని ఎన్పీడీసీఎల్ ఎస్ఈ టి.వేణుమాధవ్ తెలిపారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో వి ద్యుత్ ప్రమాదాల నివారణకు అమలు చేస్తున్న కా ర్యక్రమాలపై ఆ శాఖ అధికారులు, సిబ్బందికి అవగాహన కల్పించారు. విద్యుత్ ప్రమాదాలపై రూ పొందించిన యాప్ అమలు తీరు తెన్నులను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరిస్తూ, వారి సందేహాలను నివృత్తి చేశారు. అనంతరం ఎస్ఈ మా ట్లాడుతూ జిల్లాలో 78, 33/11కేవీ సబ్స్టేషన్లు ఉన్న ట్లు స్పష్టం చేశారు. ఎల్సీ యాప్ ద్వారా ప్రతి ఒక్కరూ పూర్తిగా అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎల్సీ తీసుకునే సమయంలో యాప్ నిబంధనలు పాటిస్తూ, ఫొటోలను అప్లోడ్ చేయాలన్నారు. ని బంధనలు పాటిస్తూ పని చేస్తే ప్రమాదాలను తగ్గించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ డీఈలు రాంబాబు, లక్ష్మీనారాయణరెడ్డి, విజయ్ కుమార్, ఎంఆర్టీ టెక్నికల్ డీఈ గణేష్, ఏడీఈలు, ఏఈలు, లైన్మన్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
సన్నబియ్యం పంపిణీ విప్లవాత్మకం
స్టేషన్‌ఘన్‌పూర్: దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి పేదలకు రేషన్‌షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ పథకం చేపట్టడం విప్లవాత్మకమైన నిర్ణయమని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఎస్సీకాలనీలో రేషన్‌బియ్యం లబ్ధిదారురాలు తాటికొండ యాదమ్మ ఇంటిలో వండిన భోజనాన్ని ఎమ్మెల్యేతో పాటు కలెక్టర్ రిజ్వాన్‌బాషా, అదనపు కలెక్టర్ రోహిత్‌సింగ్ తదితరులు సహఫంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీమంతులు తినే సన్నబియ్యాన్ని పేదలకు అందిస్తున్న ఘనత సీఎం రేవంత్‌రెడ్డిదే అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సన్నబియ్యం పంపిణీ పథకం పేదల ఆత్మగౌరవ పథకమన్నారు. సన్నరకం వరిధాన్యం ఎక్కువగా సాగుచేసేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, ఈ దిశగానే సన్నరకం పండించిన వారికి క్వింటాకు రూ.500 బోనస్ చెల్లిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్పర్సన్ జూలుకుంట్ల లావణ్యశిరీష్‌రెడ్డి, ఆర్డీఓ డీఎస్ వెంకన్న, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఆర్ఐ శ్రీకాంత్, నాయకులు సీహెచ్.నరేందర్‌రెడ్డి, సింగపురం వెంకటయ్య, చింత ఎల్లయ్య, చింత జాకబ్, తాటికొండ యాదగిరి, సన్నీ తదితరులు పాల్గొన్నారు. పోషణ పక్షోత్సవాలను విజయవంతం చేయాలి ప్రతి అంగన్వాడీ కేంద్రంలో పోషణ్ అభియాన్ కింద చేపట్టే పోషణ పక్షం 2025 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో మహిళలు, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్‌తో కలిసి ఐసీడీఎస్ సూపర్వైజర్లు, సీడీపీఓలకు పోషణ్ అభియాన్–పోషణ పక్షం కార్యకమంపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు ఈ నెల 22 వరకు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల పౌష్టికాహారంపై అవగాహన కల్పించాలన్నారు. అనంతరం వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ఫ్లోరెన్స్, డీఏఓ రామారావు నాయక్, డీఎస్సీడీఓ విక్రమ్, డీఎంహెచ్ఓ మల్లిఖార్జున్ రావు, డీఈఓ రమేష్, డిప్యూటీ డీఎంహెచ్ఓ శ్రీదేవి, ప్రోగ్రామింగ్ అధికారి రవీందర్, పోషణ్ అభియాన్ జిల్లా కో–ఆర్డినేటర్ రాజశేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్టేషన్‌ఘన్‌పూర్‌లో లబ్ధిదారుడి ఇంటిలో భోజనం చేసిన ఎమ్మెల్యే, కలెక్టర్ -
అక్రమ కేసులతో సబ్ జైళ్లు సరిపోతాయా!
● ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి జనగామ: రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులపై అక్ర మ కేసులు బనాయిస్తూ పోతుంటే సబ్ జైళ్లు పరిపోతాయా? అని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని విమర్శిస్తూ సోషల్ మీడియాలో వచ్చిన పోస్టును ఫా ర్వర్డ్ చేశారని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు తిప్పారపు విజయ్ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించగా, బుధవారం జనగామ సబ్ జైలులో ఎమ్మెల్యే ములా ఖత్ ద్వారా ఆయనను పరామర్శించారు. అనంత రం ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకుల అక్రమ అరెస్ట్‌లను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఒక ఎమ్మెల్యేగా తనను కడియం శ్రీహరి బొచ్చు కుక్క అని తిడితే తప్పు లేదు కానీ, అది తప్పు అని వచ్చిన పోస్టును ఫార్వర్డ్ చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడిపై అక్రమ కేసులు పెట్టి వేధించడం ఇదెక్కడి న్యాయమన్నారు. కడియం శ్రీహరిని దళిత జాతి క్షమించదన్నారు. ఎమ్మెల్యే వెంట పట్టణ అధ్యక్షుడు తాళ్ల సురేష్‌రెడ్డి, మసిఉర్ రెహమాన్, ఎండీ సమ్మద్, ముస్త్యాల దయాకర్, బాల్దె సిద్దిలింగం, యాదగిరిగౌడ్ తదితరులు ఉన్నారు. -
సకాలంలో వైద్యపరీక్షలు చేయించుకోవాలి
● సీనియర్ సివిల్ జడ్జి సి.విక్రమ్ జనగామ రూరల్: వృద్ధులు సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి సి.విక్రమ్ అన్నారు. ఈ మేరకు బుధవారం ప్రపంచ ఆరోగ్య దినం పురస్కరించుకుని ఓబుల్ కేశవాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ సర్వీసెస్ అథారిటీ సంయుక్తంగా కోమటిరెడ్డి సుశీలమ్మ వృద్ధాశ్రమంలో వైద్య, కంటి పరీక్షల శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై వైద్యశిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. వృద్ధులు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. డీఎంహెచ్ఓ మల్లికార్జున్‌రావు మాట్లాడుతూ వృద్ధాప్యంలో కంటిచూపు మందగిస్తుందని, అవసరమైన శస్త్రచికిత్సలు చేసుకుని అద్దాలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రవీందర్, ఆశ్రమ ఇన్చార్జ్ డి.లక్ష్మ ణ్, ఫ్లోరెన్స్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం
జనగామ: జనగామ మున్సిపాలిటీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ (ఏసీ) పింకేష్ కుమార్ అన్నారు. శానిటేషన్ నిర్వహణ, కరువైన ఆహ్లాదం, చెత్తతో నిండి పోయిన రోడ్లు, అస్తవ్యస్తంగా వీధి దీపాల నిర్వహణ తదితర పట్టణ సమస్యలపై సాక్షిలో ప్రచురితమవుతున్న వరుస కథనాలకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ పింకేష్ కుమార్ స్పందించారు. బుధవారం కమిషనర్ వెంకటేశ్వర్లు, ఏఈ మహిపాల్‌తో కలిసి పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో చేపట్టబోయే పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. జనాభా పెరుగుదల, రోజురోజుకు పెరుగుతున్న అవసరాలకు కనుగుణంగా పట్టణాన్ని నలుదిక్కులా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక చేస్తున్నట్లు చెప్పారు. జంక్షన్ల అభివృద్ధి, విశాలవంతమైన రహదారుల విస్తరణకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. బతుకమ్మకుంట రహదారి సెంటర్‌తో పాటు ట్రాఫిక్ కంట్రోల్ రూం, బస్టాండ్ నుంచి హనుమకొండ వెళ్లే రోడ్డు, నెహ్రుపార్క్, రోడ్లు భవనాలు శాఖ అతిథి గృహం, 60 ఫీట్ల రోడ్డును పరిశీలన చేశారు. సదరు ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళిక తయారు చేసి, ప్రతిపాదనలు పంపించాలని కమిషనర్‌ను ఆదేశించారు. శానిటేషన్‌పై ప్రత్యేక దృష్టి వార్డుల్లో పర్యటించిన ఏసీ పింకేష్ కుమార్ -
నిధులు
బుధవారం శ్రీ 9 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025‘పీఎంశ్రీ’ పాఠశాలలకు– 8లోuజనగామ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాశాఖకు నిధుల వరద కురిపించాయి. పీఎంశ్రీ, భవిత సెంటర్లు, బాలికలకు శానిటరీ నాప్కిన్స్, యూనిఫాం స్టిచింగ్, క్రీడా సామగ్రి కొనుగోలుకు రూ.37.93 లక్షల మేర నిధులు విడుదల చేసింది. నిధుల ఖర్చుకు సంబంధించి ఉత్తర్వుల కాపీలో పేర్కొనగా.. నిబంధనలను అనుసరించి మెటీరియల్ కొనుగోలు చేయనున్నారు. పీఎంశ్రీలో 15 పాఠశాలలు.. జిల్లాలో పీఎంశ్రీ(స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా) పథకంలో 15 పాఠశాలలను ఎంపిక చేశారు. ఇందులో 5 మోడల్, ఒక సోషల్ వెల్ఫేర్ (జఫర్‌గఢ్), యూఆర్ఎస్, 8 ఉన్నత పాఠశాలలు (జెడ్పీఎస్ఎస్) ఉన్నాయి. ఇందులో విద్యను అభ్యసిస్తు న్న 2,650 మంది బాలికలకు శానిటరీ నాప్కిన్స్ కొ నుగోలుకు రూ.7.95 లక్షల బడ్జెట్ విడుదల చేసింది. ఒక్కో విద్యార్థినికి రూ.300 చొప్పున కేటాయించగా, 50 శానిటరీ నాప్కిన్స్ ఇవ్వాల్సి ఉండగా.. పలు పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్పోర్ట్స్ మెటీరియల్ కొనుగోలుకు ఒక్కో పా ఠశాలకు రూ.50వేల చొప్పున రూ.7.50 లక్షలు వి డుదల చేసింది. విద్యార్థుల అవసరాలను బట్టి ని బంధనల మేరకు క్రీడా సామగ్రి కొనుగోలు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. ప్రభుత్వం 100 నుంచి 150 రకాల ఆప్షన్ చూపించింది. యూనిఫాం కూలి డబ్బులు.. జిల్లాలో విద్యార్థులకు రెండు జతల యూనిఫాం స్టిచింగ్కు సంబంధించి 2024–25 వార్షిక సంవత్సరంలో పెండింగ్‌లో ఉన్న కూలి వేతనం డబ్బులను సర్కారు విడుదల చేసింది. 32,965 మంది విద్యార్థులకు రెండు జతల యూనిఫాం ఉచితంగా ఇవ్వగా, స్టిచింగ్ చార్జీల కింద ఒక్కో యూనిఫాంకు స్వయం సహాయక సంఘాలకు రూ.75గా నిర్ణయించింది. ఈ లెక్కన రూ.49.44 లక్షల స్టిచింగ్ చార్జీలకు గాను రూ.32.96లక్షలు గతంలో ఇవ్వగా, ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న రూ.16.48 లక్షలు విడుదల చేసింది. 2025–26 నూతన విద్యా సంవత్సరంలో 29,158 మంది విద్యార్థులకు రెండు జతల యూనిఫాం కోసం ప్రభుత్వం క్లాత్ పంపించింది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, మెప్మా పర్యవేక్షణలో యూనిఫాంలను స్టిచింగ్ చేయిస్తున్నారు. జూన్ 10వ తేదీ వరకు యూనిఫాం అందించాలని విద్యాశాఖ అధికారుల ఆదేశాలు జారీ చేశారు. న్యూస్రీల్ఒక్కో భవిత కేంద్రానికి రూ.2లక్షలుజిల్లాలో 12 మండలాల పరిధిలో భవిత సెంటర్లు (ప్రత్యేక అవసరాల పిల్లల కేంద్రం) ఉన్నాయి. ఇందులో మూడు కేంద్రాలకు పక్కా భవనాలు ఉండగా, 9 సెంటర్లను ఆయా పాఠశాలలకు అనుబంధంగా కొనసాగిస్తున్నారు. సమగ్ర శిక్షణ ప్రాజెక్టు కింద పక్కా భవనాలు ఉన్న జనగామ, పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్ భవిత సెంటర్లకు ఒక్కోదానికి రూ.2లక్షల చొప్పున మొత్తం రూ.6 లక్షలు విడుదల చేశారు. ప్రత్యేక అవసరాల పిల్లల కోసం ప్రభుత్వం సూచించిన మేరకు యూ టేబుల్, కుర్చీలు, స్పోర్ట్స్ కిట్లు, మానవ శరీర భాగాలు, నిత్యందన జీవితంలో ఉపయోగించే యాప్స్, కూరగాయలు, నంబరింగ్ తదితర పరికరాలను కొనుగోలు చేసి, పిల్లలకు వాటిపై అవగాహన కల్పించాల్సి ఉంటుంది. జిల్లాలో 15 స్కూళ్లలో 2,650 మంది విద్యార్థులు శానిటరీ నాప్కిన్స్, స్పోర్ట్స్ సామగ్రికి బడ్జెట్ గత సంవత్సరం యూనిఫాం స్టిచింగ్ కూలి విడుదల భవిత సెంటర్లకు రూ.6 లక్షలుఒక్కో జతకు రూ.75జిల్లాలో 2024–25 సంవత్సరంలో విద్యార్థులకు రెండు జతల యూనిఫాం ఇవ్వగా, మహిళా సంఘాలకు స్టిచింగ్ చార్జీల కింద ఒక్కో జతకు రూ.75 చొప్పున ఇచ్చారు. ఇందులో రూ.49.44 లక్షలు రావాల్సి ఉండగా, పెండింగ్‌లో ఉన్న రూ.16.48లక్షల నిధులను విడుదల చేసింది. – పెనుగొండ రమేశ్, ఏఏపీ ఇన్చార్జ్, జనగామసద్వినియోగం చేసుకోవాలి.. పీఎంశ్రీ పథకంలో ఎంపికై న 15 పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న 2,650 మంది బాలికలకు శానిటరీ నాప్కిన్స్ కొనుగోలుకు రూ.7.95 లక్షలు, ఒక్కో పాఠశాలకు స్పోర్ట్స్ మెటీరియల్ కొనుగోలుకు రూ.7.50 లక్షల నిధులను విడుదల చేసింది. జిల్లాలోని మూడు భవిత సెంటర్లకు ప్రత్యేక అవసరాల పిల్లల బోధన తరగతులకు అవసరమైన వాటిని కొనుగోలుకు రూ.6 లక్షల బడ్జెట్ వచ్చింది. ఆయా పాఠశాలలు నిధులను సద్వినియోగం చేసుకోవాలి – భువనగిరి నర్సింహారావు, సీఎంఓ, జనగామ -
‘ఎల్ఆర్ఎస్’ ప్రక్రియను వేగవంతం చేయాలి
జనగామ రూరల్: ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. మంగళవారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశా రు. ఈ సందర్భంగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారు ల ప్లాట్ల క్రమబద్ధీకరణ ఆన్లైన్ విధానాన్ని పర్యవేక్షించి సంబంధిత వివరాలను అడిగి తెలుసుకొని, సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం కింద వచ్చిన దరఖాస్తుదారుల భూముల పరిశీలనను వేగంగా చేపట్టా లని, అభ్యంతరాలు లేని వాటికి త్వరగా ప్రొసిడింగ్స్ జారీ చేయాలన్నారు. ఈ నెలాఖరు వరకు రాయితీ గడువును పెంచినందున దరఖాస్తుదారులు ఎల్ఆర్ఎస్ కింద పూర్తిస్థాయి రుసుం చెల్లించి, భూముల క్రమబద్ధీకరణ చేసుకోవాలన్నారు. అలాగే రాజీవ్ యువ వికాసం పథకం కింద దరఖాస్తు చేసుకునే లబ్ధిదారులకు రేషన్ కార్డు ఉంటే ఆదాయ ధ్రువీకరణ పత్రం అవసరం లేదని కలెక్టర్ వెల్లడించారు. ఆసక్తి గల వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని, అందుకు సంబంధించిన ధ్రువపత్రాలను మున్సిపల్, ఎంపీడీఓ కార్యాలయాల్లో అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, డీఎస్సీడీఓ విక్రమ్, బీసీ సంక్షేమ అధికారి రవీందర్, టీపీఎస్ ప్రశాంతి, అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా -
విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలి
● విద్యుత్ వినియోగదారుల ఫోరం చైర్మన్ వేణుగోపాలాచారి లింగాలఘణపురం: విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదులపై వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని టీజీఎన్పీడీసీఎల్ విద్యుత్ వినియోగదారుల ఫోరం చైర్మన్ వేణుగోపాలాచారి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని సబ్‌స్టేషన్‌లో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. విద్యుత్ సమస్యలను సిబ్బంది ఏ మేరకు పరిష్కరించారని తెలుసుకున్నారు. 34 ఫిర్యాదులు రాగా అందులో 18 వరకు వెంటనే పరిష్కరించారు. జనగామ డీఈ లక్ష్మినారాయణ రెడ్డి, ఏడీఈ అనిల్‌కుమార్, ఏఈలు శంకరయ్య, నర్సింహ్ములు, నర్సింహ్మరెడ్డి, సీజీఆర్ఎఫ్ ఏఈ శశిధర్, సిబ్బంది పాల్గొన్నారు. -
విజిలెన్స్ విచారణ జరిపించాలి
జనగామ రూరల్: జనగామ వ్యవసాయ మార్కెట్లో జరుగుతున్న అవినీతిపై విజిలెన్స్ విచారణ జరిపించాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి భూక్యా చందునాయక్ డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ సూపరింటెండెంట్‌కు వినతిపత్రం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ సీసీఐ, పల్లికాయ కొనుగోలులో జరిగిన అవినీతిపై విచారణ జరపాలన్నారు. సీఎంఆర్ బియ్యం ప్రభుత్వానికి ఇవ్వకుండా ఉన్న రైస్ మిల్లులను బ్లాక్ లిస్టులో పెట్టాలని డిమాండ్ చేశారు. మార్కెట్లో ధాన్యం కనీసం మద్దతు ధర రూ.1,850కు కొనుగోలు చేయాలని జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి, కనీస సౌకర్యాలు, గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూడాలని కోరారు. తక్షణమే గత రెండు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన ఆడిట్ నిర్వహించి విజిలెన్స్ విచారణ జ రిపి అవినీతి అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి అజ్మీరా సురేష్ నాయక్, తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మంగ బీరయ్య, జిల్లా కమిటీ సభ్యులు బో డ రాములు, తదితరులు పాల్గొన్నారు. -
బతుకమ్మకుంటలో పారిశుద్ధ్య పనులు
జనగామ: జనగామ బతుకమ్మకుంటలో పారిశుద్ధ్య పనులు ఎట్టకేలకు మొదలయ్యాయి. ‘ఆహ్లాదం కరువు’ శీర్షికన గత నెల 28న సాక్షిలో ప్రచరితమైన కథనానికి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, అధికారులు స్పందించారు. సాక్షిలో వచ్చిన కథనం క్లిప్పింగ్‌తో బతుకమ్మకుంట వాకర్స్ అసోసియేషన్, అమ్మ ఫౌండేషన్ ప్రతినిధులు కలెక్టర్‌కు మెమోరాండం అందించగా, పలువురు కుంట ప్రాంతంలో నిరసన తెలిపారు. ఈ మేరకు మంగళవారం బీఆర్ఎస్ నాయకులు మసిఉర్ రెహమాన్, అనితతో కలిసి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి బతుకమ్మకుంటకు వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లకు ఫోన్ చేయగా.. శానిటేషన్ కార్మికులతో కలిసి ఆయన అక్కడకు చేరుకున్నారు. వాకర్స్, కుటుంబ సమేతంగా వచ్చే పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు. స్పెషల్ ఆఫీసర్ పులి శేఖర్ ఆధ్వర్యంలో కార్మికులు బతుకమ్మకుంటలోని పిచ్చిమొక్కలు, పేరుకుపోయిన చెత్తా, చెదారం, మైదానం శుభ్రం చేశారు. వాకర్స్ నడిచే ట్రాక్‌కు రెండు వైపులా ఏపుగా పెరిగిన మొక్కలను తొలగిస్తున్నారు. అలాగే కుంటలోని వాటర్ నుంచి దుర్వాసన వెదజల్లుతుండగా.. అందులోని నాచు, చెత్తను మాత్రమే తీయించనున్నట్లు అధికారులు చెప్పారు. శానిటేషన్ పనులు ప్రారంభం కావడానికి కృషి చేసిన సాక్షికి వాకర్స్, పట్టణ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. కుంట అభివృద్ధికి రూ.1.50 కోట్లు జనగామ ఐకాన్ బతుకమ్మకుంట అభివృద్ధికి రూ.1.50 కోట్లు నిధులను ఖర్చు చేయనున్నారు. 2015 ఎల్ఆర్ఎస్ నిధులతో పాటు పురపాలికకు సంబంధించి 18 బ్యాంకు ఖాతాలను క్లోజ్ చేయగా వచ్చిన డబ్బులతో కుంట అభివృద్ధికి వెచ్చించనున్నారు. కుంటలోని నీటి చుట్టూ రేలింగ్, కలర్ లైటింగ్, వాకింగ్ ట్రాక్ నిర్మాణం, తదితర అభివృద్ధి పనులు చేయనున్నారు. ఇందుకు సంబంధించి స్పెషల్ ఆఫీసర్ ఆదేశాల మేరకు నిధులను సమీకరించుకోగా, త్వరలోనే పనుల కోసం టెండర్లను పిలువనున్నట్లు ఏఈ మహిపాల్ మంగళవారం తెలిపారు. పర్యవేక్షించిన ఎమ్మెల్యే పల్లా -
యాసంగి ధాన్యం సేకరణ షురూ
జనగామ రూరల్: యాసంగి సీజన్లో ధాన్యం సేకరణకు జిల్లా యంత్రాంగం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రేడ్–ఏ రకం (సన్నాలు) ధాన్యం క్వింటాకు రూ.2,320, సాధారణ రకం (దొడ్డు) ధాన్యం క్వింటాకు రూ.2,300గా కనీస మద్దతు ధర ప్రకటించాయి. ప్రభుత్వం ప్రకటించిన ధరతో రైతుల నుంచి ధాన్యం సేకరణకు జిల్లా యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయగా మంగళవారం నుంచి కొనుగోళ్లు ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా 300 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించి అకాల వర్షాల నుంచి ఽతడవకుండా టార్ఫలిన్లు అందుబాటులో ఉంచారు. సన్నాలకు రూ.500 బోనస్ సన్నరకం ధాన్యం క్వింటాకు రూ.500 బోనస్ చొప్పున ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. యాసంగిలో 3,75,453 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేయగా అందులో సన్నరకం 1,05,891, దొడ్డు రకం 2,69,562 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేశారు. కొనుగోలు కేంద్రాల్లో వేర్వేరుగా ధాన్యం సేకరించనున్నారు. టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద సమస్యల పరిష్కారానికి, ధాన్యం కొనుగోళ్లు, అమ్మకాల్లో రైతులకు సమస్యలు తలెత్తితే ఫిర్యాదు చేసేందుకు జిల్లా యంత్రాంగం టోల్ ఫ్రీ నంబర్ 9963407064 ఏర్పాటు చేసింది.మిల్లర్లు నిబంధనలు పాటించాలి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మిల్లర్లు ప్రభుత్వ నిబంధనలను పాటించాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. మంగళవారం జనగామ మండలం శామీర్‌పేట, వడ్లకొండ గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మా ర్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు 17 శాతం తేమతో ధా న్యాన్ని తీసుకువస్తే గిట్టుబాటు ధర వస్తుందన్నారు. నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తిస్తే వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలన్నా రు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మేకల కళింగ రాజు, ప్రేమలత రెడ్డి, ప్రమోద్‌రెడ్డి, ఎడ్ల శ్రీనివాస్, నాయకులు పాల్గొన్నారు. జిల్లాలో 300 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నంబర్ 9963407064 కొనుగోలుకు ఏర్పాట్లు పూర్తి జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పర్యవేక్షించాలి. జిల్లాలో 300 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా ఇందులో ఐకేపీ 164, పీఏసీఎస్ 134, డీసీఎంఎస్ 2 ఉన్నాయి. రైతుల సమస్య పరిష్కారానికి టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులో ఉంది. రైతులు సద్వినియోగం చేసుకోవాలి. – రోహిత్ సింగ్, అదనపు కలెక్టర్ -
చిల్పూరు ఆలయంలో భక్తుల తాకిడి
చిల్పూరు: బుగులు వేంకటేశ్వరస్వామి సన్నిధిలో మంగళవారం అష్టదళ పాద పద్మారాధన పూజ వైభవంగా నిర్వహించారు. ఆలయ ఈఓ భాగం లక్ష్మిప్రసన్న, చైర్మన్ శ్రీధర్‌రావుల ఆధ్వర్యంలో భక్తుల సమక్షంలో 108 బంగారు పుష్పాలు, వెండి పాదపద్మంను అర్చకులు రవీందర్‌శర్మ, రంగాచార్యులు, కృష్ణమాచార్యుల వేద మంత్రాల నడుమ స్వామివారి ముందు ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ కుర్రెంల మోహన్, వీరన్న, మళ్లికార్జున్, లక్ష్మి, వసంత, గాదె శేఖర్, స్వరూప, మహేష్, హరిశంకర్ తదితరులు పాల్గొన్నారు. 12న వీర హనుమాన్ విజయయాత్ర జనగామ రూరల్: ఈనెల 12న నిర్వహించనున్న వీర హనుమాన్ విజయయాత్రను జయప్రదం చేయాలని వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు మంచాల రవీందర్ అన్నారు. మంగళవారం పట్టణంలో కరపత్రాలు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ చౌరస్తా నుంచి బస్టాండ్ వరకు వైభవంగా జరుగనున్న యాత్రకు ప్రజలు, భక్తులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. జిల్లా ప్రధాన కార్యదర్శి మోహన్‌కృష్ణ భార్గవ, ఉపాధ్యక్షులు బచ్చు బాలనారాయణ, కార్యదర్శులు చిలువేరు హర్షవర్ధన్, మాసరాజు, సభ్యులు కుమారస్వామి, లక్ష్మణ్ శివరామ్, రాజు, సత్యం తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు అవార్డులు జనగామ: ప్రగతి చక్రం త్రైమాసిక పురస్కారా ల్లో భాగంతో మంగళవారం వరంగల్‌లో జరి గిన వేడుకల్లో జనగామ డిపోకు చెందిన నలు గురు ఉద్యోగులకు రీజియన్ అవార్డ్స్ అందుకున్నట్లు డిపో మేనేజర్ స్వాతి మంగళవారం తెలి పారు. ఇంధన పొదుపులో డ్రైవర్లు టి.ఎస్. నారాయణ, ఎండీ అయూబ్ ఖాన్, అత్యధిక ఇన్సెంటివ్ సాధించిన కేటగిరీలో కండక్టర్ బాబురావు, శ్రామిక్ ఎం.శ్రీనివాస్ నలుగురు ఉద్యోగులు రీజనల్ మేనేజర్ డి.విజయ భాను చేతుల మీదుగా ప్రశంస పత్రాలు, నగదు అవార్డ్స్ అందుకున్నట్లు డీఎం తెలిపారు. 108 పైలట్లకు ఉత్తమ అవార్డు జనగామ రూరల్: జిల్లాలో 108 వాహనంలో పనిచేసే కె.రాజన్న, జి.అనిల్ పైలట్లు మంగళవారం ఉత్తమ స్టార్ అవార్డు అందుకున్నారు. అంబులెన్స్‌లో క్షతగాత్రులను సకాలంలో ఆస్పత్రికి చేరుస్తూ, వాహనానికి సకాలంలో మరమ్మతులు, షెడ్యుల్ సర్వీస్, డీసెల్ టాపప్, ఎయిర్ చెకింగ్ చేయిస్తూ, వాహనానికి మంచి మైలేజి తెచ్చినందుకు జిల్లా ప్రోగ్రాం మేనేజర్ నసీరుద్దీన్, జిల్లా మేనేజర్ ఎం.శ్రీనివాస్ చేతుల మీదుగా స్టార్ అవార్డును అందించారు. గ్యాస్ ధరలు తగ్గించాలి జనగామ రూరల్: పెంచిన గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు రాపర్తి రాజు అన్నారు. మంగళవారం ధరల పెంపుకు నిరసనగా పట్టణ కేంద్రంలోని నెహ్రూ పార్క్ వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్యాస్ సిలిండర్‌పై రూ.50 పెంచడం దారుణమన్నారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్, బూడిది గోపి, భూక్య చందు నాయక్, కళ్యాణం లింగం, లలిత, శ్రావణ్, బీరయ్య, శ్రీకాంత్, వెంకటేశ్, సాంబరాజు తదితరులు పాల్గొన్నారు. -
పిల్లల మానసిక ఎదుగుదలకు చర్యలు
స్టేషన్‌ఘన్‌పూర్: పిల్లల మానసిక ఎదుగుదలకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ సుధీర్ అన్నారు. రాష్ట్రీయ బాలస్వస్థ్య కార్యక్రమంలో భాగంగా కమిషనరేట్ ఫ్యామిలీ వెల్ఫేర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆదేశాల మేరకు స్థానిక జెడ్పీఎస్ఎస్లోని అంగన్వాడీ కేంద్రం–2లో మంగళవారం శిశువుల మానసిక ఎదుగుదల లోపాలను గుర్తించుట, దృష్టి లోపాలను గుర్తించుటకు ఆర్బీఎస్కే స్టేషన్‌ఘన్‌పూర్ టీం బృందంచే 121 మంది పిల్లలకు నిర్ధేశిత మార్గదర్శకాలకు అనుగుణంగా పరీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన డిప్యూటీ డీఎంహెచ్ఓ మాట్లాడారు. పిల్లల మానసిక ఎదుగుదల, దృష్టి లోపాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. పిల్లల ఎదుగుదలకు పౌష్టికాహారం అందించాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ పద్మజ, డా క్టర్ అజయ్‌కుమార్, శ్రీనాథ్, ఆఫ్రీన్, మౌనిక, ఏ ఎన్ఎం రాణి, సూపర్వైజర్ సంధ్యారాణి, అంగన్వాడీ టీచర్ రాణి తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ సుధీర్ -
హామీల అమలులో విఫలం
జఫర్‌గఢ్: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పార్టీ ఆవిర్భావ వేడుకల్లో ఆయన పాల్గొని జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రమేశ్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చేసిన ఏ వాగ్ధానం కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తుందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో దేశం అన్ని విధాల అభివృద్ధి చెందుతోందన్నారు. మండల అధ్యక్షుడు కోరుకొప్పుల గణేష్‌గౌడ్, అంజిరెడ్డి, మదన్మోహన్, తౌటి సురేష్‌గౌడ్, గడ్డం రాజు, మారపల్లి రవి, మేకల పవన్, సంగా గోపాల్, తదితరులు పాల్గొన్నారు. అవకాశవాద రాజకీయాలు చేస్తున్న ఎమ్మెల్యే కడియం స్టేషన్‌ఘన్‌పూర్: స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఏ ఎండకు ఆ గొడుగు పడుతూ అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ అన్నారు. ఘన్పూర్ డివిజన్‌కేంద్రంలో బీజేపీ మండలస్థాయి క్రియాశీల సభ్యుల సదస్సును మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు సట్ల వెంకటరమణగౌడ్, పార్లమెంట్ కోకన్వీనర్ ఇనుగాల యుగేందర్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రమేశ్ -
నూతన విద్యావిధానాన్ని రద్దు చేయాలి
జనగామ రూరల్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్య విధానాన్ని రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.మూర్తి డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక విజయ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఎస్ఎఫ్ఐ 4వ జిల్లా మహాసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విశ్వ విద్యాలయాల్లో సంస్కరణల పేరుతో యూజీసీ రూపొందించిన ముసాయిదా అమల్లోకి వస్తే విశ్వవిద్యాలయాలు కేంద్ర ప్రభుత్వం గుప్పిట్లోకి వెల్లుతాయని, రాష్ట్రాల హక్కులను హరించడానికే కేంద్రం ఈ ముసాయిదాను తీసుకువచ్చిందన్నారు. విద్యారంగ సమస్యలు పరిష్కారం చూపకపోతే ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో కిరణ్, ధర్మభిక్షం, సందీప్, సుమా తదితరులు పాల్గొన్నారు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.మూర్తి -
సబ్‌స్టేషన్ సమీపంలో మంటలు
● గాలి దుమారానికి ట్రిప్ అయిన విద్యుత్ ● నిప్పురవ్వలతో అంటుకున్న ఎండుగడ్డి రఘునాథపల్లి: కంచనపల్లి విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపంలో సోమవారం రాత్రి మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా వచ్చిన గాలి దుమారంతో సబ్‌స్టేషన్‌లో విద్యుత్ ట్రిప్ అయింది. ఈ క్రమంలో ఓ ట్రాన్స్ఫార్మర్ నుంచి నిప్పు రవ్వలు కిందపడగా నేలపై ఉన్న ఎండు గడ్డికి అంటుకున్నాయి. ఆ మంటలు సబ్‌స్టేషన్ చుట్టూరా ఉన్న ఎండు గడ్డికి విస్తరించి చుట్టుముట్టాయి. అప్రమత్తమైన సిబ్బంది గ్రామానికి విద్యుత్ సరఫరా నిలిపి వేశారు. స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి, పోలీసులకు సమాచా రం ఇవ్వగా సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చారు. ఫైరింజన్ వచ్చే సరికి మంటలు పూర్తిగా చల్లారడంతో వెనుదిరిగారు. ఈ విషయమై విద్యుత్ ఏఈ రాహుల్‌ను వివరణ కోరగా సబ్‌స్టేషన్ చుట్టు పక్కలనే మంటలు వ్యాపించా యి.. సబ్‌స్టేషన్‌లో ఎలాంటి నష్టం జరగలేదు.. మంటలు తగ్గాక గ్రామంలో విద్యుత్ పునరుద్ధరించినట్లు ఆయన పేర్కొన్నారు. -
ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలి
జనగామ రూరల్: రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించి అడ్తిదారులు, ఖరీదుదారులు కొనుగోలు చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి భూక్యా చందునాయక్ అన్నారు. వ్యవసాయ మార్కెట్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి నరేంద్రకు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మార్కెట్లో పూర్తిస్థాయి డిజిటల్ ఈ–నామ్ అమలు కావడం లేదని, బిడ్డింగ్‌లో ధరలు వేయకుండా ఆఫ్‌లైన్ పద్ధతిలో తక్కువ ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేసే పరిస్థితి వారం రోజుల నుంచి కొనసాగుతున్నదని చెప్పారు. ఈ–నామ్లో సమయానికి అనుగుణంగా ఖరీదారులు వచ్చేలా చర్యలు చేపట్టడంతోపాటు కనీస మద్దతు ధర రూ.1,850తో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే మార్కెట్లో మొక్కజొన్నల కొనుగోలు కేంద్రం ప్రారంభించి రైతులకు ఉచితంగా భోజన వసతి కల్పించాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు ఉపేందర్, మంగ బీరయ్య, బోడ రాములు, ఉర్సుల కుమార్, తాండ్ర ఆనందం తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి చందునాయక్ -
రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం
● పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పాలకుర్తి/దేవరుప్పుల: కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కు అండగా నిలిచి వారి కష్టాలను తీర్చుతున్నదని ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. సోమవారం పాలకుర్తి మండల పరిధి ముత్తారం, లక్ష్మీనారాయణపు రం, దేవరుప్పుల మండల కేంద్రంలోని కొత్తకాల నీ, నీర్మాల గ్రామాల్లో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. రైతులకు ఏకకాలంలో రుణమాపీ, ఉచిత కరెంటు అందించడంతోపాటు పంటలకు గిట్టుబాటు ధర కల్పించడానికి సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో వరి దిగుబడి పెరిగిందని, దళారులకు తక్కువ ధరకు విక్రయించి మోసపోకుండా ప్రభుత్వం ప్రోత్సాహకంగా ఇస్తున్న రూ.500 బోనస్‌ను సద్వినియోగం చేసుకో వాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ వసంత, ఐలమ్మ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మంజుల భాస్కర్, టీపీసీసీ సభ్యుడు డాక్టర్ ఎల్.లక్ష్మీనారాయణనాయక్, ఎంపీడీఓ రాములు, తహసీల్దార్ శ్రీనివాస్, ఐకేపీ ఏపీఎం పిట్టల నరేందర్, పార్టీ నాయకుడు నల్ల శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆహ్లాదకర వాతావరణం కల్పించాలి
బతుకమ్మకుంట దుర్గంధంతో కంపుకొడుతోంది. అందులోని నీటిని తొలగించి ఆహ్లాదకర వాతావరణం కల్పించాలి. ఆట వస్తువులు, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి కుటుంబ సమేతంగా పిల్లలతో గడిపే విధంగా తీర్చిదిద్దాలని పట్టణానికి చెందిన పిట్టల సురేష్, గాదెపాక రాంచందర్, వెంకటస్వామి, తుంగ కౌశిక్ అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ● మండలాల్లో అసలు స్పందనే లేదు ● వచ్చిన అర్జీలు ఫార్వర్డ్ చేయడంతో సరి.. ● పరిష్కారం మాత్రం పెండింగ్‌లోనే.. -
గ్యాస్ భారం రూ.75లక్షలు
● సబ్సిడీ, ఉజ్వల సిలిండర్లపై రూ.50 పెంపు జనగామ: కేంద్రం సబ్సిడీ, ఉజ్వల గ్యాస్ సిలిండర్ల ధరలు పెంచింది. పెట్రో, డీజిల్ ధరలను సైతం పెంచగా.. ఆ భారమంతా ఆయిల్ కంపెనీ లే భరిస్తాయని ప్రకటించడం కొంత ఊరట అని చెప్పవచ్చు. సబ్సిడీ సిలిండర్ ప్రస్తుత ధర రూ.857 ఉంది. ఇందులో ఉజ్వల సిలిండర్‌కు రూ.300, సబ్సిడీ బండపై కేంద్రం రూ.40, రాష్ట్ర ప్రభుత్వం రూ.319 వినియోగదారుడి ఖాతాలో జమ చేస్తోంది. జిల్లాలో 12 గ్యాస్ కంపెనీలు ఉండగా, 1.50లక్షల సబ్సిడీ సిలిండర్లు ఉన్నాయి. ఇందులో 10వేల వరకు ఉజ్వల కనెక్షన్లు ఉన్నాయి. సబ్సిడీ సిలిండర్‌పై రూ.50 పెంపుతో జిల్లా గ్యాస్ వినియోగదారులపై నెలనెలా అదనంగా రూ.75 లక్షల మేర భారం పడనుంది. -
ఎల్ఐసీ జనగామకు ప్రత్యేక గుర్తింపు
● రాష్ట్రంలో నంబర్ 1 ● జోనల్ 2వ స్థానం ● జాతీయ స్థాయి 15వ ర్యాంకుజనగామ: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) జనగామ శాఖ వ్యాపార పరంగా జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చడంతో పాటు రాష్ట్రంలో నంబర్ వన్ ర్యాంకు సాధించింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఏడు అంశాలపై వ్యాపార పోటీ జరిగింది. 9,300 పాలసీలు, రూ.85కోట్ల టార్గెట్‌తో స్థానిక మేనేజర్ జి.హరిలా ల్ నేతృత్వంలో ఏజెంట్లు, డెవలప్ మెంట్ ఆఫీసర్లు పడిన కష్టానికి ఫలితం దక్కింది. జిల్లా కేంద్రంలో 1986 సంవత్సరం ఎల్ఐసీ జనగామ శాఖ నెలక్పొగా అంచెలంచెలుగా ఎదుగుతూ 14 మంది డెవలప్మెంట్ ఆఫీసర్ల పర్యవేక్షణలో 1,075 మంది ఏజెంట్లకు చేరుకుంది. సమష్టి కృషితో జోనల్ స్థాయి(ఏపీ, తెలంగాణ, కర్ణాటక) 2వ స్థానం, జాతీయ స్థాయిలో 15వ స్థానం, తెలంగాణ రాష్ట్రంలో ఓవరాల్‌గా నంబర్ వన్ స్థానంలో నిలిచి చరిత్రలో కొత్త అధ్యాయానికి నాందీ పలికింది. విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని పనిచేయాలి● ఎల్ఐసీ సీనియర్ డివిజనల్ మేనేజర్ సుబ్రహ్మణ్యన్ ఎల్ఐసీ జనగామ శాఖ సాధించిన విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని డీఓలు, ఏజెంట్లు పనిచేయాలని సంస్థ సీనియర్ విజనల్ మేనేజర్ ఎం.సుబ్రహ్మణ్యన్ పిలుపునిచ్చారు. ఎల్ఐసీ జనగామ విభాగం 2024–25 ఆర్థిక సంవత్సరం సాధించిన విజయాల సందర్భంగా మేనేజర్ హరిలాల్ అధ్యక్షతన సోమవారం పెద్ద ఎత్తున సంబురాలు జరుపుకున్నారు. వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన సుబ్రహ్మణ్యన్ మాట్లాడుతూ.. ఎల్ఐసీ జనగామ శాఖ కొత్త చరిత్ర సృష్టించిందని, ప్రతికూల వాతావరణ పరిస్థితులను తుట్టకుని ఇంతటి ఘనత సాధించడం అభినందనీయమన్నారు. అనంతరం సుబ్రమణ్యన్ చేతుల మీదుగా హరిలా ల్ అవార్డు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ మేనేజర్ ప్రసాద్ బస్వరాయ్, సేల్స్ మేనేజర్ పి.రవి శంకర్, స్టేషన్‌ఘన్‌పూర్ బ్రాంచ్ మేనేజర్ జె.మోతీలాల్, అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ జి.దునీలాల్ తదితరులు పాల్గొన్నారు. -
జనగామ
మంగళవారం శ్రీ 8 శ్రీ ఏప్రిల్ శ్రీ 20257పక్క ఫొటోలో తన నానమ్మ(కమలమ్మ) వద్ద ఉన్న బాలుడి పేరు బండి అఖిల్(09). ఇతడికి పుట్టుకతోనే మానసిక పరిస్థితి బాగోలేదు. బయటకు వెళ్లాలంటే ఎవరైనా తోడుండాల్సిందే. బచ్చన్నపేట మండల అలీంపూర్కు చెందిన కమలమ్మ కుమారుడు బండి అజయ్‌కి ఇద్దరు కుమారులు. అతను కూలీ పనులకు వెళ్లి పిల్లలను పోషించుకుంటున్నాడు. తల్లి కమలమ్మ వారి బాగోగులు చూసుకుంటోంది. దివ్యాంగుడైన అఖిల్‌కు సదరం క్యాంపులో 2024 ఫిబ్రవరిలో వందశాతం వైకల్యంతో సర్టిఫికెట్ ఇచ్చారు. ఏడాది దాటిపోయినా ఇప్పటి వరకు పింఛన్ మంజూరు కాలేదు. ‘మనవడిని తీసుకుని గ్రీవెన్స్‌కు, అధికారుల వద్దకు తిరుగుతున్నా ప్రయోజనం లేకుండా పోయింది’ అని కమలమ్మ వాపోయింది. పింఛన్ వచ్చేలా చూడాలని అర్జీ పెట్టుకుంది. న్యూస్‌రీల్ -
నమ్మకం సడలుతోంది..!
కలెక్టరేట్ గ్రీవెన్స్‌కు తగ్గుతున్న వినతులురూ.5 భోజనం ప్రారంభించాలి జనగామ వ్యవసాయ మార్కెట్లో రైతులకు మేలు చేసే విధంగా రూ.5 భోజనం ప్రారంభించాలి. విశ్రాంతి గదిని మరింత విశాలంగా మార్చాలి. మార్కెట్‌కు సరుకులను తీసుకువచ్చే క్రమంలో మంచి ధర వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. ధర పడిపోకుండా జాగ్రత్త వహించాలి. – కన్నారపు పరుశరాములు అసైన్డ్ భూమి నుంచి కాల్వ తీయాలి మా అమ్మ శెట్టి సుజాత పేరున 343ఏ, 354ఏ సర్వే నంబర్లలో 7 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. దేవాదుల కాల్వ నిర్మాణానికి అధికారులు తమ మూడెకరాల భూమి నుంచి సర్వే చేశారు. పక్కనే ఉన్న అసైన్డ్ భూమి నుంచి కాల్వ తీయాలని వేడుకుంటున్నా పట్టించుకోవడం లేదు. మాకు వేరే ఆధారం లేదు. భూమిని కాపాడాలి. – శిరంశెట్టి మహేందర్, మల్లంపల్లి(పాలకుర్తి)ఒకరి స్థలం.. మరొకరికి రిజిస్ట్రేషన్ గ్రామంలో తన పేరిట 157 గజాల ఇంటి స్థలం ఉంది. గత ఏడాది డిసెంబర్ 18 వరకు ఇంటి పన్ను చెల్లించాను. ఇదే సమయంలో తమకు తెలియకుండా స్థలాన్ని గ్రామ అధికారి మరొకరి పేరు మీద అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసి ఇంటి స్థలాన్ని తమకు కాకుండా చేశారు. న్యాయం చేయాలని అర్జీ పెట్టుకోగా.. విచారణ చేపట్టాలని అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు. – గుండని సుజాత, లింగంపల్లి(బచ్చన్నపేట) -
ప్రజలకు కాపలా కుక్కలా పనిచేస్తా..
జనగామ: ‘నియోజకవర్గ ప్రజలకు కాపలా కుక్కలా పనిచేస్తా.. కడియం శ్రీహరిలా నేను గుంట నక్కను కాదు’ అంటూ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్టేషన్ఘపూర్కు మున్సి పాలిటీ, డిగ్రీ కాలేజీ, లిఫ్ట్ ఇరిగేషన్, 100 పడకల ఆస్పత్రి, నవాబ్‌పేటకు లైనింగ్‌ను కడియం శ్రీహరి నాడు ఆపేసి అబద్ధపు ప్రచారాలు చేస్తున్నాడని అన్నారు. అభివృద్ధిని ఆపే చరిత్ర వాళ్లదైతే.. పనులు చేసే చరిత్ర తమదని పేర్కొన్నారు. కడియం తనను బొచ్చు కుక్క అంటూ మాట్లాడారు.. అవును నేను కుక్కనే.. నా ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే వారిని కాపాడేందుకు కాపలా కుక్కగా ఉంటానే తప్ప.. ఆయనలా గుంట నక్క వేశాలు మాత్రం వేయనని అన్నారు. ముసలితనానికి వచ్చి న కడియం.. అటవీ భూముల మీద కన్నేశాడని, వాటిని కాపాడేందుకు నేను రేసు కుక్కలా పరుగెత్తుతానని హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ నిర్వహించే వరంగల్ సభను అడ్డుకునే శక్తి ఎవ్వరికీ లేదని స్పష్టం చేశారు. 2001లో ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కూడా బహిరంగ సభలకు అనేక అడ్డంకులు తలపెట్టినా ఎక్కడా ఆగలేదన్నారు. ప్రతీ కార్యకర్త కథానాయకుడిగా మారి ప్రజా వ్యతి రేఖ పాలన సాగిస్తున్న కాంగ్రెస్‌ను ఇంటికి పంపించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మాజీ ఎంపీపీలు మేక కలింగరాజు, భైరగోని యాదగిరి గౌడ్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, ఎడ్ల శ్రీనివాస్, జయ ప్రకాశ్‌రెడ్డి, కాస భాస్కర్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. కడియం లాగా గుంట నక్కను కాదు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి -
అండర్ పాస్ బ్రిడ్జి నిర్మించాలి
● సీపీఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా జనగామ రూరల్: బాణాపురం ఇంది రమ్మ కాలనీ వద్ద బైపాస్ రోడ్‌పై అండర్ పాస్ బ్రిడ్జి నిర్మించాలి.. ఈ విషయమై 11వ తేదీలోపు స్పష్టమైన ప్రకటన చేయకుంటే నేషనల్ హైవేను దిగ్బంధిస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు రాపర్తి రాజు హెచ్చరించారు. సోమవారం పట్టణ కార్యదర్శి జోగు ప్రకాశ్ అధ్యక్షతన దీక్షా శిబిరం నుంచి కార్యకర్తలు, ప్రజలు పాదయాత్రగా కలెక్టరేట్‌కు చేరుకుని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేషనల్ హైవే అథారిటీ అధికారుల అనాలోచిత నిర్ణయం ఫలితంగా ప్రజలకు ప్రమాదం పొంచిఉందన్నారు. అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని 72 రోజుల నుంచి రిలే దీక్షలు చేస్తూ.. ప్రజాప్రతినిధులు, ఎమ్మె ల్యే, ఎంపీలకు తెలిపినా పట్టించుకోవడంలేని అన్నా రు. అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణం చేపడితే పదివేల మంది ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు బొట్ల శేఖర్, బూడిద గోపి, సుంచు విజేందర్, బోడ నరేందర్, భూక్య చందు, చిట్యాల సోమన్న, ఎండీ.అజారుద్దీన్, బిట్ల గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
పేదల అభివృద్ధే లక్ష్యం
జనగామ రూరల్: పేదల అభివృద్ధే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్‌యాదవ్ అన్నారు. ఆదివారం జనగామ మండలం శామీర్‌పేట గోపరాజుపల్లి గ్రామాల్లో ప్రజా పాలనలో భాగంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో సన్న బియ్యం పంపిణీ చేపట్టిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికే దక్కుతుందన్నారు. సన్న బియ్యంను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు లింగాల నర్సిరెడ్డి, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు గణిపాక మహేందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మెరుగు బాలరాజు, జిల్లా నాయకుడు బడికే కృష్ణస్వామి, సేవాదళ్ నాయకులు సాదం మధుసూదన్, దాసరి శేఖర్, తోటపల్లి రాజిరెడ్డి, కడకంచి కొమురయ్య, ఏఎంసీ డైరెక్టర్ నామాల శ్రీనివాస్, నర్సింగరావు, వెంకట్రామ్ రెడ్డి, వెంకట్, కనకరాజు, రంజిత్, నేతాజీ, నవీన్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ శివరాజ్ -
కల్యాణం..రమణీయం
నవాబుపేట, వల్మిడిలో పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యేలు కడియం, యశస్వినిరెడ్డి భక్తజనసంద్రంగా మారిన ‘జనగామ’ వేదపండితుల సమక్షంలో కోదండ రాముడి వివాహంజనగామ: వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ సీతారాముల కల్యాణం ఆదివారం జిల్లా వ్యాప్తంగా కనుల పండువగా జరిగింది. భక్తుల జయ జయ ధ్వానాల మధ్య సీతారాముడి వివాహ వేడుకలు అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు. పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్, జనగామ నియోజకవర్గాలతో పాటు పట్టణంలోని పాతబీటు బజార్లో 72వ ఏట శ్రీ రాముడి పట్టాభిషేకం, కల్యాణ వేడుకలను వైభవంగా నిర్వహించారు. మహిళలు సీత మ్మ తల్లికి ఒడి బియ్యం పోసి, పట్టు వస్త్రాలను స మర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీరాంనగర్ కాలనీ, మూలబావి శ్రీ హనుమత్ రామనాథ సహిత శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఆలయ ప్రధాన అర్చకుడు, ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త డాక్టర్ మోహనకృష్ణ భార్గవ ఆధ్వర్యంలో రామనవమి వేడుకలు నిర్వహించారు. సాయంకాలం ఉత్సవ మూర్తులతో ఊరేగింపు నిర్వహించారు. జీడికల్ వీరాచల రామచంద్రస్వామి ఆలయంలో శ్రీరామ నవమి సందర్భంగా సీతారాముల కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. నవాబుపేటలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి, పాలకుర్తి మండలం వల్మిడి పుణ్యక్షేత్రంలో ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించి కల్యాణం వీక్షించారు. – మరిన్ని ఫొటోలు 9లోu -
తాటి ముంజలొచ్చాయ్..
● పోషక విలువలు కలిగిన ప్రకృతి ప్రసాదంజనగామ: అత్యధిక పోషక విలువలు కలిగిన తాటి ముంజల సీజన్ వచ్చేసింది. అలసట నుంచి ఉపశమనం కలిగించి ఆరోగ్యాన్నిచ్చే ముంజ లంటే ప్రతిఒక్కరికీ ఇష్టమే. జిల్లాతోపాటు యాదాద్రి భువనగిరిలోని అనేక ప్రాంతాల నుంచి జనగామ పట్టణానికి తీసుకువచ్చి అండర్ రైల్వేబ్రిడ్జి, నెహ్రూపార్కు ఏరియాల్లో విక్రయిస్తున్నారు. పెరిగిన వేసవి ఎండల తీవ్రతనుంచి ఉపశమనం పొందడానికి ప్రజలు ముంజలను కొనుగోలు చేస్తుండడంతో డిమాండ్ పెరిగింది. డజనుకు రూ.60 చొప్పున అమ్ముతున్నారు. ప్రకృతి ప్రసాదించిన ఈ ముంజలు గతంలో ఊళ్లలో ఉచితంగా లభించేవి. ఇప్పుడు ధరలు పెరిగిపోవడంతో సామాన్య, మధ్యతరగతి వర్గాలకు కాస్త భారంగా మారింది. పోషకాలు అధికం తాటి ముంజల్లో అనేక పోషకాలున్నాయి. ఉష్ణతాపాన్ని తట్టుకునే శక్తి ఉంటుంది. డీ హైడ్రేషన్‌కు గురికాకుండా శరీరానికి అవసరమైన నీటి శాతాన్ని అందించడంతో పాటు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా కాపాడతాయి. క్యాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, ఐరన్, సల్ఫర్, కాపర్ పుష్కలంగా ఉంటాయి. రక్తహీనతను తగ్గించడం.. మలబద్ధకాన్ని దూరం చేస్తాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. -
అండర్‌పాస్ నిర్మాణం చేపట్టాలి
జనగామ రూరల్: పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ వద్ద నిర్మాణం జరుగుతున్న బైపాస్ రోడ్లో అండర్‌పాస్ బ్రిడ్జి నిర్మించి ప్రజలకు మేలు చేయాలని సీపీఎం పట్టణ కార్యదర్శి జోగు ప్రకాశ్ అన్నారు. బ్రిడ్జి నిర్మాణానికి సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో బాణాపురం దీక్ష శిబిరం నుంచి పాదయాత్ర కలెక్టరేట్ వరకు పాదయాత్ర, కలెక్టర్ కార్యాలయం ఎదుట మహాఽ దర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 69వ రోజులుగా రిలే నిరాహార దీక్షలు చే స్తున్నా.. అధికారులు, ప్రభుత్వం స్పందించకపోవడం సరికాదన్నారు. కాగా ఆదివారం దీక్షలను ఐద్వా పట్టణ నాయకురాలు బూడిద వా ణి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి చీర రజిత, తాళ్లపల్లి అనిత, ఆకుల మంజుల, తదితరులు పాల్గొన్నారు రణదివే స్ఫూర్తితో ఉద్యమించాలిజనగామ రూరల్: కామ్రెడ్ బీటీఆర్ రణదివే స్ఫూర్తితో కార్మికులు ఉద్యమించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సుంచు విజేందర్ అన్నారు. ఆదివారం జిల్లా కార్యాలయంలో రణదివే 35వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా కోశాధికారి అన్నబోయిన రాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రామిక మహిళల సమస్యల పరిష్కారానికి అనేక ఉద్యమాలు, పోరాటాలు చేశారన్నారు. ఆయన పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమన్నారు. ఈ కార్యక్రమంలో బూడిద ప్రశాంత్, గంగారబోయిన మల్లేష్ రాజ్, ఉపేందర్ శివరాత్రి రాజు, చీర శ్రీను, కనక చారి, శంకర్, మల్లేష్, మమత, పద్మ తదితరులు పాల్గొన్నారు. లీకేజీలను గుర్తించిన ఇంజనీర్లు టన్నెల్లోకి దిగిన మెగా సిబ్బంది ధర్మసాగర్: హనుమకొండ జిల్లా ధర్మసాగర్‌లోని రిజర్వాయర్ సమీపాన ఇటీవల జరిగిన టన్నెల్ లీకేజీలను ఎట్టకేలకు ఇంజనీర్లు గుర్తించారు. దేవాదుల పథకంలో భాగంగా 3వ ప్యాకేజీ కింద దేవన్నపేట పంపుహౌస్ నుంచి రిజర్వాయర్ సమీపం వరకు పైపులైన్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి సుమారు 200 మీటర్లు రిజర్వాయర్ వరకు టన్నెల్ నిర్మించారు. ఈ క్రమంలో గత నెల 27న రిజర్వాయర్‌లోకి నీటిని పంపింగ్ చేయగా వారం రోజుల క్రితం టన్నెల్ లీకేజీ అయింది. దీనితో పంపులు ఆపివేసి టన్నెల్ నుంచి నిటిని డీ వాటరింగ్ చేశారు. ఈ క్రమంలో ఆదివారం పైపు నుంచి టన్నెల్లోకి దిగిన మెగా ఇంజనీర్లు, సిబ్బంది లీకేజీలను కనుక్కుని మరమ్మతులు ఎలా చేయాలో పరిశీలించారు. -
‘ఉపాధి’ కూలీలకు చేయూత
జనగామ రూరల్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు చేస్తున్న కూలీలకు కనీస వేతనం పెంచుతూ కేంద్రం తీపి కబురు అందించింది. 2024–25 ఆర్థిక సంవత్సరం ఉపాధి కూలీలకు వేతనం రూ.300 చెల్లించగా.. ప్రస్తుతం రూ.7 పెంచడంతో జిల్లాలోని 2.31 లక్షల మంది కూలీలకు లబ్ధి చేకూరనుంది. ఉపాధి హామీ పథకం ప్రారంభంలో 2005 అక్టోబర్ 2న కనీస వేతనం రూ.87.50 ఉంది. 2006 నుంచి చట్టంగా మారి దేశవ్యాప్తంగా అమలైంది. ప్రస్తుతం పెరుగుతున్న నిత్యావసరాల ధరలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కనీస వేతనం పెంచింది. ఉపాధిలో చేపట్టే పనులు జాబ్‌కార్డు కలిగిన ప్రతిఒక్కరికీ ఉపాధి హామీ పథకంలో పని కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా జల వనరుల సంరక్షణ, నర్సరీల నిర్వహణ, మొక్కలు నాటడం, సంరక్షణ, పంట పొలాలకు మట్టి కట్టలు, పొలాలకు వెళ్లేందుకు మట్టిరోడ్లతోపాటు వివిధ అభివృద్ధి పనులు కల్పిస్తున్నారు. చేపట్టిన పనుల కొలతల ఆధారంగా కూలీలకు వేతనం చెల్లిస్తారు. కొత్త పనులు ప్రారంభం ఉపాధి హామీ కూలీలకు పెంచిన వేతనం ఈ నెల మొదటి వారం నుంచి అమలు కానుంది. అలాగే 2025–26 ఆర్థిక సంవత్సరం నూతన పనులు ప్రారంభం కానున్నాయి. మండుతున్న ఎండల దృష్ట్యా ఉదయం సమయంలోనే పనులు పూర్తి చేసుకునేలా సంబంధిత అధికారులు కూలీలకు అవగాహన కల్పిస్తున్నారు. పని ప్రదేశాల్లో కూలీలు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. పెరుగుతున్న కూలీల సంఖ్య ఉపాధి హామీ పనులకు వచ్చే కూలీల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. జిల్లాలో నిత్యం 18వేలకు పైగా కూలీలు పనులకు హాజరవుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో వ్యవసాయ పనులు పూర్తి కావస్తున్నాయి. మే ప్రారంభం నాటికి రోజువారీ కూలీలు 70 వేలకు పెరిగే అవకాశం ఉంది. వేసవిలో ఇతర ఏ పనులు ఉండకపోవడం.. అలాగే భూమి లేని నిరుపేదలకు ఉపాధి హామీ జాబ్ కార్డు ఉండి ఏడాదికి కనీసం 20 రోజుల పనిచేసి ఉన్నవారికి రూ.12 వేల చొప్పున ప్రభుత్వం అందజేస్తుండటంతో ఈసారి కూలీలు పెరగనున్నారు. ప్రతి కూలీకి 100 రోజులు పని కల్పించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో ఉపాధి కూలీల వివరాలు రోజువారీ వేతనం రూ.300 నుంచి రూ.307కు పెంపు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఈనెల నుంచి అమలు జిల్లాలో 2.31 లక్షల కూలీలకు లబ్ధిజాబ్కార్డులు : 1,18,000 కూలీలు : 2,31,000 ఆక్టివ్ జాబ్‌కార్డులు : 77,000 ఆక్టివ్ కూలీలు : 1,26,000 రోజువారీ సగటు కూలి : రూ.222.67 కూలి రేటు పెంచడం శుభపరిణామం కేంద్ర ప్రభుత్వం ఉపాధి కూలీలకు రోజువారీ గతంలో చెల్లించిన రూ.300 వేతనానికి అదనంగా రూ.7 పెంచింది. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరల దృష్ట్యా కూలి రేటు పెంచడం శుభపరినామం. వ్యవసాయ పనులు పూర్తయితే ఉపాధి పనుల్లో వేగం పెరిగే అవకాశం ఉంది. మే మొదటి వారంలో కూలీలు అధిక సంఖ్యలో పనులకు రానున్నారు. – వసంత, డీఆర్డీఓ -
బీజేపీతోనే సుస్థిర పాలన
జనగామ రూరల్: దేశంలో బీజేపీ పాలనతో సుస్థిర అభివృద్ధి సాధ్యమని, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ అన్నారు. ఆదివారం బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ పథకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రెండు పార్లమెంటు స్థానాలు ఉన్నటువంటి దేశంలో ప్రస్తుతం అతిపెద్ద పార్టీగా అవతరించిందన్నారు. ప్రపంచంలో 14 కోట్ల మంది సభ్యత్వం కలిగిన ప్రపంచంలోనే ఏకై క రాజకీయ పార్టీకి బీజేపీ అన్నారు. మోదీపాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. దేశంలో 370 ఆర్టికల్ రద్దు అయోధ్యలో రామ్ మందిర నిర్మాణాన్ని నిర్మించిన ఘనత నరేంద్ర మోదీకి దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు దశమంతరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కేవీఎల్ఎన్ రెడ్డి, లేగ రామ్మోహన్ రెడ్డి, ఉడుగుల రమేశ్, జిల్లా ప్రధాన కార్యదర్శి శివరాజ్ యాదవ్, పజ్జురి లక్ష్మీ నరసయ్య, కీర్తి నర్సయ్య, డాక్టర్ బిక్షపతి, కొంతం శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ -
భూముల అన్యాక్రాంతంపై ఫ్లెక్సీలు
స్టేషన్‌ఘన్‌పూర్: తాటికొండలో సీతారామచంద్రస్వామి దేవస్థానానికి చెందిన మాన్యం భూముల అన్యాక్రాంతంపై శ్రీరామనవమి రోజున దేవస్థానం, గ్రామంలోని ప్రధాన కూడళ్ల వద్ద పలు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. గ్రామానికి చెందిన రియల్ ఎస్టే ట్ వ్యాపారి నారబోయిన శ్రీనివాస్కల్యాణ్ పేరిట శ్రీరాముడిని పేదవాడిగా ఏమి లేనివాడిగా చేసిందెవరు.. నాయకుల లోపమా, అధికారుల లోపమా, రాముడి ఆస్తి ఎక్కడ అంటూ ప్రశ్నిస్తూ పలు ప్రదేశాల్లో ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. గ్రామంలో శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం పేరిట ఏ సర్వేనంబర్లలో ఎన్ని ఎకరాల భూమి ఉంది.. తదితర వివరాలతో ఫ్లెక్సీని ఏర్పాటు చేయడంతో సదరు ఫ్లెక్సీలను చూసిన గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. ఈ విషయమై శ్రీనివాస్కల్యాణ్ను సంప్రదించగా తాటికొండ సీతారామచంద్రస్వామి దేవస్థానం భూమి 86.35 ఎకరాలు ఉంటుందని, అందులో దాదాపు ఏడు ఎకరాలు అర్చకుడికి ఇవ్వగా 79 ఎకకరాలు ఉండాలన్నారు. ఇందులో దాదాపు 50 ఎకరాలకు పైగా అన్యాక్రాంతం అయిందని, ఇటీవల వ్యక్తిగత పనులపై తహసీల్దార్ కార్యాలయంలో ధరణిలో చూడగా మొత్తం 79 ఎకరాలు దేవుని మాన్యం భూములుగానే చూపిస్తుందన్నారు. దేవుని పేరిట 79 ఎకరాల భూమి ఉండగా శ్రీరాముడిని పేదవాడిగా చేసి ఎందుకు చందాలు వేసి ప్రతీ ఏటా కల్యాణం నిర్వహించాల్సిన అవసరం ఏముందన్నారు. తాను వ్యక్తిగతంగా ఎవరినీ విమర్శించడం లేదని, ఈ విషయమై ప్రతిఒక్కరూ ఆలోచించాలని ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. -
సర్కారు స్కూళ్లను కాపాడుకోవాలి
జనగామ రూరల్: సర్కారు స్కూళ్లను కాపాడుకో వాలని పబ్లిక్ అఫైర్స్ ఎడ్యుకేషన్ ఓఎస్డీ అడపు శ్రీధర్ అన్నారు. యశ్వంతపూర్ ప్రభుత్వ ప్రాథమి క, ఉన్నత పాఠశాల ప్రారంభమై 60 ఏళ్లు నిండిన సందర్భంగా వార్షికోత్సవాన్ని ప్రధానోపాధ్యాయు డు దివాకర్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ.. తాను ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ప్రభుత్వ పాఠశాలనే కారణమని అన్నారు. లక్ష్యం కోసం నిబద్ధతతో శ్రమించాను కాబట్టే నేడు సీఎం పేషీలో ఓఎస్డీగా ప్రభుత్వంలో కీలకమైన స్థాయిలో ఉన్నాన ని చెప్పారు. పాఠశాల అభివృద్ధికి తోడ్పాటు అంది స్తానని తెలిపారు. ఏంఈఓ బి.శ్రీనివాస్ మాట్లాడు తూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడాని కి ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు సిద్ధంగా ఉన్నారని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల న్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సంపత్ కుమార్, రాజీవ్ రెడ్డి, లయన్ ఎడమ సంజీవరెడ్డి, బి.సుధాకర్, గండి ప్రవీణ్, మాజీ సర్పంచ్ గండి లావణ్య, బొట్ల జ్యోతి తదితరులు పాల్గొన్నారు. పబ్లిక్ అఫైర్స్ ఎడ్యుకేషన్ ఓఎస్డీ శ్రీధర్ -
రామయ్య పెళ్లికి రారండోయ్
నేడు సీతారాముల కల్యాణంజిల్లా కేంద్రం, జీడికల్, వల్మిడి తదితర ఆలయాల్లో ఏర్పాట్లు పూర్తి జనగామ/పాలకుర్తి టౌన్: జగదభిరాముడి కల్యాణా నికి సర్వం సిద్ధమైంది. ఆదివారం(నేడు) నిర్వహించే సీతారాముల పరిణయ వేడుకను పురస్కరించుకుని జిల్లాలోని ఆలయాలను ముస్తాబు చేశారు. పట్టణంలోని పాతబీటు బజారు పందిరి వద్ద 72వసారి స్వామి వారి కల్యాణ మహోత్సవం నిర్వహిస్తుండగా.. లింగాలఘణపురం మండలం జీడికల్ శ్రీసీతారామచంద్రస్వామి, పాలకుర్తి మండలం వల్మిడి ఆలయంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఆలయాల్లో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. శ్రీరామ నవమిని పురస్కరించుకుని ఆలయాలు, మండపాల వద్ద నిత్యపూజలు, అన్నదా న కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రాములోరి కల్యాణానికి తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం ఆలయా ల వద్ద చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు. మజ్జిక, తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీసులు బందోబస్తు చేపట్టనున్నారు. ఇదిలా ఉండగా స్వామివారి కల్యాణ వేడుకలకు ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కడియం శ్రీహరి, యశస్వినిరెడ్డి, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. వల్మిడి ఆలయంలో కల్యాణోత్సవానికి వచ్చే భక్తుల వాహనా ల పార్కింగ్ ఏర్పాట్లను జనగామ వెస్ట్‌జోన్ డీసీపీ రాజమహేంద్రనాయక్ శనివారం పరిశీలించారు. -
బతుకమ్మకుంటను అభివృద్ధి చేయండి
● వాకర్స్ వినూత్న నిరసన జనగామ : పట్టణంలోని బతుకమ్మ కుంటను అభివృద్ధి చేయాలని కోరుతూ వాకర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పిట్టల సురేష్ ఆధ్వర్యంలో వాకర్స్ శనివారం ప్లకార్డులతో వినూత్న నిరసన తెలిపారు. కుంట అపరిశుభ్రతపై ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన కథనాలకు వాకర్స్ అసోసియేషన్ స్పందించి ఆందోళన చేట్టారు. కుంటలోని నీరు చెత్తాచెదారంతో నిండి దుర్వాసన వెదజల్లుతోందని పాముల సంచారం, కోతుల స్వైర విహారం, అసాంఘిక కార్యకలాపాలతో బతుకమ్మ కుంట అధ్వానంగా తయారైందన్నారు. కుంటను అభివృద్ధి చేయని పక్షంలో నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని కోరారు. ప్రస్తుతం కుంట వద్ద నిమి షం సమయం కూడా కూర్చుండే పరిస్థితి లేదన్నారు. వీధిలైట్లు సరిగా వెలగక పోవడంతో భయాందోళనగా ఉందని చెప్పారు. పిల్లలకు ఆట పరికరాలు, వాకింగ్ ట్రాక్, పార్కు, పచ్చదనం ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తుంగ కౌశిక్, వెంపటి అజయ్, దినేష్, ఈశ్వర్, సాయి, అర్జున్ వినయ్, అభినవ్, శ్రీకాంత్, సిద్దు తదితరులు పాల్గొన్నారు -
సరస్వతీ పుష్కరాల్లో ‘జ్ఞానతీర్థం’ శోభ
● పుష్కరఘాట్‌కు కాకి, హంస, మకరం చిత్రాలతో కూడిన రాయి రెయిలింగ్ కాళేశ్వరం: జయశంకర్భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో మే 15 నుంచి 26 వరకు నిర్వహించే సరస్వతి పుష్కరాల్లో జ్ఞానతీర్థం (ఆహ్వాన విగ్రహం) ఏర్పాటు చేయనున్నారు. పుష్కరాల అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.25కోట్ల నిధులు మంజూరు చేసి విడుదల చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర దేవాదా యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ పలుమార్లు చేసిన సమీక్షలు, క్షేత్రస్థాయి పర్యటనలతో పనులు ఊపందుకున్నాయి. రాష్ట్ర ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రత్యేక దృష్టి సారించడంతో పనుల్లో వేగం పెరిగింది. సరస్వతీ పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం రూ.20 లక్షలతో ‘జ్ఞానతీర్థం’ ఎఫ్ఆర్పీ ఫైబర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. తాళపత్ర గ్రంథాలతో రెండు చేతుల్లో దీపం వెలిగి ప్రకాశించేలా ఫైబర్ విగ్రహం నిర్మాణం చేయనున్నా రు. దీని నమూనా చిత్రాలను ఆర్కిటెక్ట్‌లు, ఇంజనీర్లు తయారు చేశారు. ఈ విగ్రహం ఉద్దేశం ఏమిటంటే.. పూర్వం కాకి నదిలో స్నానం చేసి హంసలాగా మారి జ్ఞానం పొందింది. అలా ఇక్కడి నదిలో స్నా నం చేసిన భక్తులు జ్ఞానాన్ని పొందుతారని సారంశంగా, భక్తులను ఆహ్వానించేలా ఉండే విధంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయవర్గాలు తెలిపాయి. అదేవిధంగా జ్ఞానతీర్థం (వీఐపీ) ఘాట్ రెయిలింగ్‌ను కాకి, హంస, మకరం చిత్రాలను రాతిపై చెక్కి అమర్చనున్నారు. -
విద్యుత్ ప్రమాదాలకు చెక్
జనగామ: విద్యుత్ వినియోగదారులకు మరింత నాణ్యమైన సేవలు అందించడంతో పాటు తరుచూ సంభవిస్తున్న ప్రమాదాలను నివారించేందుకు ఎన్పీడీసీఎల్ ఆన్లైన్ ఎల్సీ(లైన్ క్లియ ర్) యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు యాప్ సేవలపై సంస్థ ఎస్ఈ వేణుమాధవ్ శనివారం సర్కిల్ కార్యాలయం నుంచి సంబంధిత ఏఈలు, అధికారులు, ఉద్యోగులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. విద్యుత్ నిలిపి వేసే సమయంలో ఎల్సీ తీసుకుని మరమ్మతు పనులు చేపట్టే క్రమంలో జరుగుతున్న మానవ తప్పిదా లను నిరోధించడానికి ఈ యాప్ ఉపయోగపడుతుందన్నారు. ఏఈ అనుమతి లేకుండా ఎల్సీ తీసుకునే పరిస్థితి ఉండదని, లైన్మెన్ యాప్ ఓపెన్ చేసి ఎల్సీ కోసం ఏఈకి రిక్వెస్ట్ పెట్టుకుంటే.. ఇవ్వొచ్చా, ఇవ్వొద్దా అనే విషయం ఆయన ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ఏఈ ఎల్సీకి అనుమతిచ్చిన వెంటనే లైన్మెన్కు యాప్ ద్వారా మెసేజ్ చేరగా.. ఏ ఫీడర్‌కు ఇవ్వాలనే విషయం సబ్‌స్టేషన్ ఆపరేటర్‌కు సైతం వెళ్తుందన్నారు. విద్యుత్ లైన్ మరమ్మతు పూర్తయిన వెంటనే ఆ పనికి సంబంధిచి ఫొటోను యాప్‌లో అప్లోడ్ చేసి ఎల్సీ రిటర్న్ చేస్తే ఆ సమాచారం ఏఈకి వెళ్తుందన్నారు. ఇదిలా ఉండగా.. ఆపరేటర్ ఎల్సీ ఇచ్చే సమయంలో జరిగే పొరపాట్లను సరిచేసుకునేలా యాప్ ఎపటికప్పుడు తెలియజేస్తుందని చెప్పారు. ఎక్కడైనా డబుల్ ఫీడింగ్, దీనికి వేరే ఫీడర్‌తో అనుసంధానం కలిగి ఉందా.. లేదా.. ఇతర వాటితో క్లియరెన్స్ ఎలా ఉంది.. అనే విషయమై యాప్ హెచ్చరిక చేస్తుందని వివరించారు. ఆపరేటర్ జాగ్రత్తలు, నియమ నిబంధనలకు సంబంధించి ఫొటోలు తీసి యాప్‌లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందని వివరించారు. అందుబాటులోకి ఆన్లైన్ ‘ఎల్సీ’ యాప్ ఏఈ అనుమతి మేరకే లైన్ క్లియరెన్స్ ఎన్పీడీసీఎల్ ఎస్ఈ వేణుమాధవ్ -
సిటీ పోలీస్ యాక్టు
● కమిషనరేట్ పరిధిలో నేటినుంచి నెల రోజులపాటు అమలు ● పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ వెల్లడివరంగల్ క్రైం: శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేటి నుంచి(ఆదివారం) మే 5 వరకు సిటీ పోలీస్ యాక్టు అమలులో ఉంటుంద ని సీపీ సన్‌ప్రీత్‌సింగ్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కమిషనరేట్ పరిధి లో పోలీస్ అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి మైకులు, డీజేలు వినియోగించరాదని హెచ్చరించారు. సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపుల ను నిషేధించినట్లు పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా మద్యం సేవించినా కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. శబ్ద కాలుష్య నియంత్రణలో భాగంగా డీజే సౌండులను నిషేధించామని, ఆస్పత్రులు, విద్యాలయాలకు 100 మీటర్ల దూరం వరకు వినియోగించరాన్నారు. మైకులు విని యోగించాల్సి వస్తే స్థానిక ఏసీపీల అనుమతి తప్పనిసరని వివరించారు. మైకులకు ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు అనుమతి తీసుకుని వినియోగించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. సిటీ పోలీస్ యాక్టు ఉత్తర్వుల ను కమిషనరేట్ పరిధిలో ఎవరు అతిక్రమించినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
గొప్ప మానవతావాది జగ్జీవన్ రామ్
● అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్ జనగామ రూరల్: గొప్ప మానవతావాది బాబూ జగ్జీవన్ రామ్.. ఆయన ఆశయాలను భవిష్యత్ తరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాల ని అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్ అన్నారు. డాక్టర్ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా శనివారం పట్టణంలోని ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్ వద్ద జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యాన నిర్వహించిన వేడుకల్లో డీసీపీ రాజమహేంద్రనాయక్, ఏసీపీ నితిన్ చేతన్, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు వెంకటస్వామి తదితరులు జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి కేక్ కట్ చేశారు. అనంతరం సభలో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. జగ్జీవన్‌రామ్ రూపకల్పన చేసిన మహోన్నత వ్యవ స్థ కారణంగానే నేడు అట్టడుగున ఉన్న బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు అమలవుతున్నాయని చెప్పారు. ఆయన ఆశయాలను పుణికి పుచ్చుకొని ముందడుగు వేయాలన్నారు. డీసీపీ రాజమహేంద్రనాయక్ మాట్లాడుతూ.. ప్రజల్లో సామాజిక పరమై న చైతన్యం తీసుకురావల్సిన అవసరముందని, విద్యార్థులను భాగస్వామ్యులను చేయాలన్నారు. జగ్జీవన్‌రామ్ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని పేర్కొన్నారు. అనంతరం మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. కార్యక్రమంలో ఆర్డీఓ గోపిరామ్, జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి డాక్టర్ విక్రమ్, ఎస్పీ కార్పొరేషన్ ఈడీ మాధవీలత, బీసీ సంక్షేమాధికారి రవీందర్, కార్మిక శాఖ అధికారి కుమారస్వామి, మున్సిపల్ కమిషన ర్ వెంకటేశ్వర్లు, కల్నల్ భిక్షపతి, డాక్టర్లు సుధాకర్, రాజమౌళి, ప్రీతి దయాళ్, ఉత్సవ కమిటీ సభ్యులు రాములు, రామంచందర్, మల్లిగారి రాజు, మధు, బోట్ల నర్సింగరావు, తిప్పారపు విజయ్, ప్రభాకర్, ధనలక్ష్మి, ధర్మభిక్షం, బోట్ల శేఖర్, కిషోర్, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. -
యువతకు ఉపాధి భరోసా
‘రాజీవ్ యువ వికాసం’ పథకంతో నిరుద్యోగులకు సబ్సిడీ రుణాలు జనగామ రూరల్: నిరుద్యోగ యువత స్వయం ఉపాధిలో రాణించి ఆర్థికంగా ఎదగడానికి రాష్ట్ర ప్రభుత్వం యువ వికాసం పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సబ్సిడీపై రుణాలు అందించాలని నిర్ణయించింది. ఇందుకు దరఖాస్తు గడువు ఈనెల 5వ తేదీ వరకు విధించినా.. సర్వర్ సమస్య, దరఖాస్తుదారులకు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీకి సమయం పట్టడం.. ఏ యూనిట్‌కు ఎంత మొత్తం ఇస్తారో నిర్ణయం కాకపోవడంతో దరఖాస్తు చేసుకునేందుకు వెనుకాడారు. దీంతో ప్రభుత్వం గడువును ఈనెల 14వ తేదీ వరకు పొడిగించింది. ఇప్పటి వరకు మొత్తం 12 వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు తెలిపారు. గడువు పొడిగించడంతోపాటు విధి విధానాలు విడుదలైనందున దరఖాస్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కమిటీల పరిశీలన ఇలా.. ‘రాజీవ్ యువ వికాసం’ పథకానికి ఆన్‌లైన్‌తోపాటు మండల, మున్సిపల్ ప్రజాపాలన సేవా కేంద్రాల్లో మాన్యువల్‌గా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆయా ప్రాంతాల్లో వచ్చిన దరఖాస్తులను మున్సిప ల్, మండల కమిటీలు పరిశీలించి అర్హులను ఎంపిక చేసి జిల్లా కమిటీకి పంపుతాయి. జిల్లా కమిటీలు ఆ జాబితాను పరిశీలించి రుణం మంజూరు చేయాల్సి ఉంటుంది. తర్వాత లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందిస్తారు. వచ్చిన దరఖాస్తులు బీసీ : 6,077 ఎస్సీ : 3,456 ఎస్టీ : 1,790 ఇతరులు : 1,121 మొత్తం : 12,444 ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులు 12వేలు ఈనెల 14 వరకు గడువు పొడిగింపు -
ఆహ్లాదం ఎక్కడ?
చెత్తకు నిలయంగా అంబేడ్కర్‌నగర్ పార్కు● బతుకమ్మకుంటలో కంపుకొడుతున్న నీరు ● కుటుంబ సమేతంగా కాలక్షేపం చేయాలంటే పచ్చదనం కరువు ● పేరుకే జిల్లా కేంద్రం.. పార్కులకు దక్కని ప్రాధాన్యంనెహ్రూ ‘పార్కు’ ఎక్కడ...? జనగామ పట్టణానికి నెహ్రూపార్క్ ఐకాన్. స్వాతంత్య్రం రాకముందు నుంచే ఈ పేరు వాడకంలో ఉంది. ఒకప్పుడు పచ్చదనంనిండి... ఆహ్లాదకర వాతావరణంలో కనిపించే నెహ్రూపార్కు... నేడు చెత్తకుప్పలతో నిండి... చుట్టూ ఫ్లెక్సీలు... ఫుట్‌పాత్ అమ్మకాలతో డంప్ యార్డుగా మారింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే కొత్త వ్యక్తులు నెహ్రూపార్కు వద్ద నిల్చొని.. పచ్చదనం.. పార్కు కనిపించక పరేషాన్ అవుతారు. పార్కును అభివృద్ధి చేస్తామని కౌన్సిల్ సమావేశం జరిగినప్పుడల్లా ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప... ఆచరణలో చేసి చూపించలేక పోయారు. జనగామ: వేసవి వచ్చేసింది.. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత, కళాశాలల వార్షిక పరీక్షలు ఒక్కొక్కటిగా ముగిసి పోతున్నాయి... మరో ఇరవై రోజులు గడిస్తే సెలవులు రానున్నాయి... పిల్లలతో కలిసి కుటుంబ సమేతంగా కాసేపు కాలక్షేపం చేద్దామనుకుంటే జిల్లా కేంద్రంలో ఆహ్లాదం కరువైంది. పేరుకు జిల్లా హెడ్ క్వార్టర్... కనీసం పచ్చదనం కనిపించకుండా పోయింది. అంబేడ్కర్‌నగర్‌లో ఉన్న ఒకే ఒక్క పార్కు పిచ్చిమొక్కలు, చెత్తకుప్పలకు నిలయంగా మారి కళావిహీనంగా కనిపిస్తోంది. బతుక్మమకుంట ఉన్నా.. నాలుగేళ్లుగా అందులో ఉన్న నీటిని రీఫ్రెష్ చేయకపోవడంతో కంపు కొడుతున్నాయి. అక్కడకు వెళ్తే ఆహ్లాదం ఏమో కానీ..అనారోగ్యం పాలయ్యే ప్రమాదం పొంచి ఉంది. 30 వార్డులు, 85 వేల జనాభా కలిగి ఉండి.. రాష్ట్ర రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న జనగామ పురపాలిక (జిల్లా కేంద్రం)లో కనీసం పది పార్కుల వరకు ఉండాలి. కానీ పార్కుల ఏర్పాటుపై వివక్షత.. అధికారుల నిర్లక్ష్యంతో ఉన్న ఒకే ఒక్క పార్కు సైతం కనుమరుగు చేస్తూ... పట్టణ ప్రజలు కుటుంబ సమేతంగా బయటకు వెళ్లలేని పరిస్థితికి తీసుకువచ్చారు. -
గంజాయి కేసుల్లో నేరస్తులను అరెస్టు చేయాలి
● వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ వరంగల్ క్రైం: గంజాయి కేసుల్లో రవాణాకు పాల్పడే వ్యక్తులతోపాటు వారికి సరుకు అందజేసే.. స్వీకరించే వ్యక్తులను అరెస్టు చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ అన్నారు. కమిషనరేట్‌లో శుక్రవారం నిర్వహించిన ఫిబ్రవరి నెలకు సంబంధించిన నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతీ పోలీస్‌స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్లను పిలిపించడమే కాకుండా అధికారులు వారిని వ్యక్తిగతంగా కలుసుకుని పరిసరాల్లో ఉండే వారి నుంచి రౌడీషీటర్ల ప్రస్తుత స్థితిగతులపై అరా తీయాలన్నారు. ఆస్తి నేరాలకు సంబంధించి జైలు నుంచి విడుదలయ్యే నిందితుల సమాచారాన్ని సేకరించాలని చెప్పారు. ఈ నేరాలు అధికంగా జరిగే ప్రాంతాలను గుర్తించి ముమ్మర పెట్రోలింగ్ చేపట్టాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను ట్రై సిటీ పరిధిలో ట్రాఫిక్ పోలీసులతో పాటు పోలీస్‌స్టేషన్ అధికారులు కూడా నిర్వహించాలని తెలిపారు. స్టేషన్ వచ్చే ఫిర్యాదులపై అధికారులు తప్పనిసరిగా కేసులను నమోదు చేయాలని, ప్రధానంగా ప్రజావాణి నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని ఆదేశించారు. సమావేశంలో డీసీపీలు షేక్ సలీమా, రాజమహేంద్రనాయక్, అంకిత్‌కుమార్, ఏఎస్పీలు చైతన్య, మనాన్‌భట్, అదనపు డీసీపీలు రవి, సురేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
బఫర్ గోదాంలో రేషన్ బియ్యం తనిఖీ
జనగామ: తెలంగాణ ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ నేపధ్యంలో హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ ఎన్ఫోర్స్మెంట్ ఓఎస్డీ ప్రభాకర్, మేనేజర్ లక్ష్మారెడ్డి శుక్రవారం జిల్లా కేంద్రంలోని బియ్యం నిల్వ చేసే బఫర్ గోదాంను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సివిల్ సప్లయీస్ డీఎం హతిరామ్, లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, సివిల్ సప్లయీస్ నాయబ్ తహసీల్దార్ శ్రీనివాస్‌తో కలిసి గోదాంతో పాటు పట్టణంలోని 11, 13 నంబర్ రేషన్ దుకాణాలను తనిఖీ చేశారు. అధికారులు, క్వాలిటీ, క్వాంటిటీ పరిశీ లన చేసిన తర్వాత ఎంఎల్ఎస్ పాయింట్‌కు పంపిస్తారు. అక్కడ నుంచి రేషన్ దుకాణాలకు లిఫ్టు చేస్తారు. ఈ నేపధ్యంలో రేషన్ దకాణాలకు పంపించే 50 కిలోల బి య్యం బ్యాగులో తూకం తేడా వస్తుందని సాక్షి మెయిన్ పేజీలో ఈ నెల 4న ప్రచురితమైన కథనంతో అధికారులు స్పందించారు. గోదాం, రేషన్ దుకాణాల్లో బస్తాలను తూకం వేసి హెచ్చుతగ్గులను పరిశీలించారు. ఎక్కడ కూడా ఎలాంటి తేడాలు లేవని నిర్ధారణ చేసుకున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. -
శనివారం శ్రీ 5 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
– 8లోuఈ ఫొటోల్లో ఆటవస్తువులపై ముళ్లకంచె వేసి ఉన్న పార్కు అంబేడ్కర్నగర్లోనిది. పట్టణంలోని రెవెన్యూ డివిజనల్ కార్యాలయం సమీపంలో ఉన్న ఈ పార్కులో ఒక్క మొక్క కూడా ఉండదు. ఆట వస్తువులన్నీ తుప్పు బట్టి పోయి పనికి రాకుండా పోతున్నాయి. పార్కులో ఆహ్లాదం ఏమో కానీ.. ముళ్ల కంపలతో కళా విహీనంగా మారింది. సాయంకాలం వేళ పిల్లలతో కలిసి పార్కుకు వెళ్తామనుకునే పట్టణ ప్రజలకు కనీసం చెట్టుకింద కూడా కూర్చునే పరిస్థితి లేదు. పార్కులో ఉన్న ఆట వస్తువులు దుమ్ముతో నిండిపోయి...అధికారుల నిర్లక్ష్యాన్ని వెక్కిరిస్తున్నాయి. పార్కు అభివృద్ధికి గతంలో ప్రణాళిక చేసినా..కాగితాలకే పరిమితం చేశారు. న్యూస్‌రీల్ -
ఎల్ఆర్ఎస్ను పారదర్శకంగా నిర్వహించాలి
● అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ జనగామ రూరల్: ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించి ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణపై సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ లే అవుట్ క్రమబద్ధీకరణకు సంబంధించిన ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, అప్రోచ్ రోడ్, ప్లాట్ల మధ్య రోడ్లు సరిగా ఉండేలా పరిశీలించాలన్నారు. అధికారులు సమన్వయంతో క్షేత్రస్థాయిలో పర్యటించి ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, అధికారులు పాల్గొన్నారు. -
ధాన్యం కొంటున్నారు...
జనగామ: జనగామ వ్యవసాయ మార్కెట్లో ఎట్టకేలకు ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ట్రేడర్లు, రైతు సంఘాల ప్రతినిధులతో చర్చల అనంతరం శుక్రవారం సాయంకాలం 3.45 గంటలకు ధాన్యం సేకరణ మొదలు పెట్టారు. ‘కొనేవారేరి?’ శీర్షికన ఈ నెల 4న సాక్షిలో ప్రచురితమైన కథనానికి కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆరా తీశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ విభాగం అదనపు కలెక్టర్ రోహిత్‌సింగ్ సూచనలతో ఆర్డీఓ గోపీరాం, తహసీల్దార్ హుస్సేన్ మార్కెట్‌కు వచ్చారు. మార్కెట్ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, ప్రత్యేక శ్రేణి కార్యదర్శి నరేంద్ర, రైతు సంఘాల ప్రతినిధులు, ట్రేడర్లు అడ్తిదారులతో మూడు గంటల పాటు చర్చలు జరిపారు. సమస్య ఎక్కడంటే.. మార్కెట్లో ధాన్యం కొనుగోలు చేసే సమయంలో రైతులకు నష్టం జరగకుండా గతేడాది క్వింటా ధాన్యం రూ.1,850 తగ్గకుండా మినిమం ధర నిర్ణయించారు. ఆ ధర తగ్గకుండా సరుకు నాణ్యత ఆధారంగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం విదేశాలకు బియ్యం ఎగుమతికి డిమాండ్ లేకపోవడం, క్వింటాకు రూ.500 తగ్గడంతో మినిమం ధర గిట్టుబాటు కాదని ట్రేడర్లు కొనుగోళ్లకు విముఖత చూపించారు. దీంతో రెండు రోజులుగా మార్కెట్లో వేలాది ధాన్యం బస్తాలు పేరుకు పోయాయి. ఈ విషయమై సాక్షిలో వచ్చిన కథనం మేరకు అధికారులు సమస్యను కొలిక్కి తీసుకు వచ్చేందుకు రంగంలోకి దిగారు. ట్రేడర్లు, రైతు సంఘాల ప్రతినిధులతో ధర విషయమై మాట్లాడారు. మినిమం ధరను రూ.1,750కి తగ్గించాలని కోరగా... రూ.1,790 వరకు సాధ్యం అవుతుందని అధికారులు చెప్పగా.. వ్యాపారులు ఒప్పుకోలేదు. దీంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. అప్పటికే మధ్యాహ్నం 2 గంటలు దాటి పోవడంతో రెండు రోజులుగా నిరీక్షిస్తున్న రైతులు నిరసన తెలిపేందుకు మార్కెట్ వైపు దూసుకు వచ్చారు. అధికారుల తీరును తప్పుబడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చైర్మన్ శివరాజ్ రైతులకు నచ్చ చెప్పగా, గొడవ చేయకుండా ఓపిక పట్టారు. పరిస్థితిని పసిగట్టిన అధికారులు క్వింటా ధాన్యం రూ.1,750 కొనుగోలు చేసేలా అంగీకారం తెలుపడం.. వెంటనే ట్రేడర్లు సరుకు కొనుగోలు చేసేందుకు కవర్‌షెడ్, కళ్లంలోకి వెళ్లడంతో రైతులు శాంతించారు. సుమారు 100 మంది రైతుల వద్ద సుమారు 3వేల క్వింటాళ్ల వరకు కొనుగోలు చేయగా, మరో 7 వేల క్వింటాళ్ల వరకు కొనుగోలుకు సిద్ధంగా ఉన్నాయి. త్వరగా లిఫ్టింగ్ మరో రెండు రోజుల పాటు వర్షసూచన ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించిన నేపధ్యంలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని త్వరగా లిఫ్టింగ్ చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రైతుల నుంచి అంగీకార పత్రం.. జనగామ వ్యవసాయ మార్కెట్‌కు సెలవు రోజుల్లో వచ్చే సరుకులకు రైతుల నుంచి అంగీకార పత్రాన్ని తీసుకుంటున్నారు. మార్కెట్లో ధాన్యం నిల్వలు పేరుకుపోవడంతో ఈ నెల 4, 5, 6వ తేదీల్లో మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. అయినప్పటికీ శుక్రవారం మార్కెట్‌కు పెద్ద ఎత్తున ధాన్యం తీసుకువచ్చారు. మార్కెట్‌కు సెలవు ప్రకటించిన సమయంలో తీసుకు వచ్చిన సరుకు అకాల వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలు, అగ్ని ప్రమాదము, దొంగతనాలు, మరే ఇతర కారణాల చేత ధాన్యానికి నష్టం జరిగే మార్కెట్ కార్యాలయం, అధికారులకు ఎలాంటి బాధ్యత ఉండదని రైతులతో అంగీకార పత్రాన్ని రాయించుకుంటున్నారు. మార్కెటింగ్ అధికారి నరేంద్ర మాట్లాడుతూ సెలవు సమయంలో సరుకులను మార్కెట్‌కు తీసుకు రావద్దని సూచించారు. ఏఎంసీలో ఆలస్యంగా కొనుగోళ్లు ప్రారంభం ట్రేడర్లతో మూడుగంటల పాటు చర్చలు -
అక్రమ అరెస్ట్‌లు సరికాదు
జనగామ: బీఆర్ఎస్ నేతలపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడిన బూతు పురాణా లకు నిరసనగా షోడాషపల్లిలో శాంతియుత పద్ధతిలో నిరసన తెలిపిన తమ పార్టీ నాయకులు, గ్రామస్తులను అధికార పార్టీ నేతలు పో లీసులను పంపించి అరెస్ట్ చేయించారని ఎమ్మె ల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో ఖండించారు. కడియం శ్రీహరి గులాబీ జెండా నీడలో కేసీఆర్ నాయకత్వంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రి, ఎంపీ హోదా అనుభవించిన సంగతి మరువొద్దన్నారు. కడియం అహంకారం, అల్పబుద్దితో స్టేషన్‌ఘన్‌పూర్ నాయకులు, కార్యకర్తలను బెదిరిస్తున్నారన్నారు. ఘన్పూర్ ప్రజలు ఉప ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారని, ఓట్ల పండగ రాగనే పాతాళంలోకి తొక్కేయడం ఖాయమన్నారు. ప్రజాస్వా మ్య దేశంలో నిరసన తెలిపే హక్కు ప్రతీ పౌరుడికి ఉంటుందని, చట్ట విరుద్ధంగా తనతో పాటు బీఆర్ఎస్ నాయకులను తిట్టిన కడియం శ్రీహరిపై వెంటనే కేసు నమోదు చేయాలని పోలీస్‌లను కోరారు. నకిలీ చందా పుస్తకాలతో అక్రమ వసూళ్లుపాలకుర్తి టౌన్: మండలంలోని వల్మిడి శ్రీసీతా రామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈనెల 6న నిర్వహించే శ్రీరామనవమి క ల్యాణానికి ఉత్సవ కమిటీ పేరుతో ఓ వ్యక్తి నకి లీ పుస్తకాలు తయారు చేసి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు గ్రామస్తులు గుర్తించి రాష్ట్ర దేవాదాయశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో శుక్రవారం రాత్రి దేవాదాయ ధర్మదాయ శాఖ హైదరాబాద్ జోన్ డిప్యూటీ కమిషనర్ కృష్ణప్రసాద్ పాలకుర్తికి చేరుకొని విచారణ జరిపారు. ఈఓ మోహన్‌బాబు ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నట్లు ఎస్సై పవన్‌కుమార్ తెలిపారు. ‘అభివృద్ధిని చూసి మాట్లాడు’ జనగామ: జిల్లా అభివృద్ధితో పాటు స్టేషన్ ఘన్పూర్ అభివృద్ధికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి కృషి చేస్తున్నారని, రాజకీయాల్లో అనుభవజ్ఞుడు కడియం శ్రీహరిని విమర్శిస్తే ఊరుకునేది లేదని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి అన్నారు. శుక్రవారం డీసీసీ కార్యాయలంలో జిల్లా గ్రంథాలయ చైర్మ న్ మారజోడు రాంబాబు, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు లింగాల జగదీశ్వర్‌రెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లో వందల కోట్లతో అభివృద్ధి జరుగుతుంటే... ఓర్వలేని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి కడియంపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో పల్లా చేసిన అభివృద్ధి చూ పించాలన్నారు. ఈ కార్యక్రమంలో రఘునాథపల్లి మండల కాంగ్రెస్ నాయకులు, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. వైభవంగా ఆరుద్రోత్సవంపాలకుర్తి టౌన్: సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఆరుద్ర నక్షత్రం పురస్కరించుకొని ఆరుద్రోత్సవం కార్యక్రమాన్ని అర్చకుల వేద మంత్రోచ్ఛరణల మధ్య శుక్రవారం రాత్రి వైభవంగా నిర్వహించారు. పంచ హారతులతో గర్భాలయంలో దీపోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ సల్వాది మోహన్‌బాబు, అర్చకులు డీవీఆర్‌శర్మ, దేవగిరి అనిల్‌కుమార్, ఆలయ సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకటయ్య, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. స్పాట్ వాల్యుయేషన్ నుంచి మినహాయించండిజనగామ: ఎస్జీటీ టీచర్లకు పదో తరగతి వార్షిక పరీక్షల జవాబు పత్రాల స్పాట్ వాల్యువేషన్ విధులు వేయడంపై వినతులు వెల్లువెత్తుతున్నాయి. కొత్త టీచర్లకు ‘స్పాట్’ డ్యూటీ శీర్షికన ఈ నెల 4న సాక్షిలో ప్రచురితం కాగా, జిల్లా వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఒక్కరు లేక ఇద్దరు పని చేసే ప్రాథమిక పాఠశాలల నుంచి స్పాట్ వాల్యువేషన్కు టీచర్లను వేయడంపై వి ద్యార్థుల తల్లిదండ్రులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పదో తరగతి జవాబు పత్రాల వా ల్యువేషన్ డ్యూటీలతో ఉపాధ్యాయులు బడికి రాకుండా పోయే పరిస్థితి ఉండడంతో తల్లిదండ్రులు ఆందోళన బాట పట్టే అవకాశం లేకపోలేదని విద్యావేత్తలు భావిస్తున్నారు. శుక్రవారం పలువురు కొత్త టీచర్లు మండలాల పరిధిలో ఎంఈఓలతో పాటు డీఈఓలకు వినతులు అందించారు. జిల్లాలో స్పాట్ వాల్యువేషన్ డ్యూటీలకు సంబంధించి అధికారుల నిర్ణయంపై విమర్శలు వ్యక్తమవుతుండగా, భవిష్యత్ నిర్ణయం ఎలా ఉంటుందనే దానిపై చర్చ జరుగుతుంది. -
సన్నబియ్యం పంపిణీని వేగవంతం చేయాలి
జనగామ రూరల్: రేషన్ దుకాణాలకు సన్నబియ్యం రవాణా పంపిణీని వేగవంతం చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలెక్టర్లకు సూచించారు. శుక్రవారం హైదరాబాద్ సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో కలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి సన్న బియ్యం సరఫరాపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్‌తో కలిసి కలెక్టర్ రిజ్వాన్ బాషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సన్నబియ్యం రవాణాపై కలెక్టర్లు దృష్టి సారించాలన్నారు. జిల్లా స్థాయిలో కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పేదలతో కలిసి ప్రభుత్వం సరఫరా చేస్తున్న సన్న బియ్యంతో భోజనం చేయాలని మంత్రి సూచించారు. నూతన ఆహార భద్రత కార్డుల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని సీఎస్ శాంతికుమారి సూచించారు. అనంతరం కలెక్టర్ రిజ్వాన్ బాషా సంబంధిత అధికారులతో సమీక్షించి, దిశానిర్దేశం చేశారు. ఈ వీసీలో డీసీఎస్ఓ సరస్వతి, డీఎం సీఎస్ హతీరాం, తదితరులు పాల్గొన్నారు. ఈవీఎం గోదాం పరిశీలన భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు జిల్లా సమీకృత కార్యాలయాల భవన సముదాయంలోని ఈవీఎం గోదాంను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రిజ్వాన్ బాషా శుక్రవారం పరిశీలించారు. భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి -
‘రాజీవ్ యువ వికాసం’ యువతకు వరం
రఘునాథపల్లి: ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం యువతకు వరం లాంటిదని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నగరగాని ప్రీతమ్ అన్నారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో యువ వికాసం హెల్ప్ డెస్క్‌ను సందర్శించారు. ఆన్లైన్, ఆఫ్‌లైన్ ద్వారా నమోదైన దరఖాస్తుల వివరాలు ఎంపీడీఓను అడిగి తెలుసుకున్నారు. మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తుకు రూ.100 తీసుకుంటున్నారని కొందరు యువకులు చైర్మన్ దృష్టికి తీసుకరాగా, రూ.45 మాత్రమే తీసుకోవాలని.. అడిషనల్ కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడి మీ సేవ కేంద్రాల్లో అభ్యర్థుల వద్ద అదనపు రుసుం వసూలు చేయకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతకుముందు మండలంలోని కోమళ్లలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పొందిన పాడి గెదెల యూనిట్‌ను సందర్శించి లబ్ధిదారులతో మాట్లాడారు. చైర్మన్ వెంట ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మాధవీలత, ఎంపీడీఓ గార్లపాటి శ్రీనివాసులు, ఎంపీఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
రాములోరి కల్యాణం వైభవంగా నిర్వహించాలి
పాలకుర్తి టౌన్: వల్మిడి శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో ఈనెల 6న శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణం వైభవగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఆలయంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. కల్యాణాన్ని తికలించేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని, ఆలయ పరిసరాల్లో శుభ్రత, తాగునీరు ఏర్పాటు చేయాలని చెప్పారు. ట్రాఫిక్ నియంత్రణ, భద్రతకు పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి అత్యవసర సేవలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. సమావేశంలో ఆర్డీఓ డీఎస్ వెంకన్న, డీపీఓ స్వరూప, ఈఓ మోహన్‌బాబు, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ రాములు, ఆర్డబ్ల్యూఎస్ డీఈ సంధ్యారాణి, సీఐ మహేందర్‌రెడ్డి, ఎస్సై పవన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి -
కొత్త టీచర్లకు ‘స్పాట్’ డ్యూటీలు
జనగామ: ఇటీవల నూతనంగా బాధ్యతలు చేపట్టి న ఎస్జీటీ ఉపాధ్యాయులకు పదో తరగతి వార్షిక పరీక్షల జవాబు పత్రాల స్పాట్ వాల్యుయేషన్ విధులు కేటాయించారు. ఇందులో కొంతమందికి ఇంటర్ పరీక్షల డ్యూటీ ముగియగానే పదో తరగతి పరీక్షలకు ఇన్విజిలేషన్ వేశారు. ఇప్పుడు మళ్లీ పదో తరగతి పేపర్ వాల్యుయేషన్ పేరిట సంబంధం లేకుండా ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులకు స్పెష ల్ అసిస్టెంట్ డ్యూటీలు వేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం టీచర్ పోస్టులను భర్తీ చేస్తే.. ఎస్జీటీలను ఇన్విజిలేషన్, వాల్యువేషన్ కోసం పంపించడం ఏమిటని మేధావి వర్గం ప్రశ్నిస్తోంది. మారుమూల గ్రామాల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయగా.. తల్లిదండ్రులు స్కూళ్లపై నమ్మకంతో ఇప్పుడిప్పుడే తమ పిల్లలను పంపిస్తున్నారు. ఇన్విజిలేషన్, స్పాట్ వాల్యువేషన్ పేరిట కొత్త టీచర్లకు వరుస డ్యూటీలు వేస్తూ విద్యార్థులకు చదువులకు ఆటంకం కలిగిస్తుంటే ఆ నమ్మకం సడలే ప్రమాదం ఉంది. మరోవైపు జిల్లాలో 2025–26 విద్యా సంవత్సరానికి ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థుల కోసం క్యాంపేయిన్ చేస్తుండగా.. ప్రభుత్వం ఎస్జీటీలను అదనపు డ్యూటీల పేరిట పంపిస్తే.. స్కూళ్లు ఎలా నిండుతాయని అంటున్నా రు. పేపర్ వాల్యుయేషన్‌కు ఆయా సబ్జెక్టుల టీచర్లతో పాటు నాన్ టీచింగ్ ఉద్యోగులను తీసుకుంటే మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క బచ్చన్నపేట నుంచే 19 మందికి.. సంబంధం లేని విధుల కేటాయింపుపై విమర్శల వెల్లువ -
యూడీఐడీ నమోదులో తప్పులు ఉండొద్దు
జనగామ: యూనిక్ డిసెబిలిటీ ఐడీ(యూడీఐడీ) కార్డుల జారీ ప్రక్రియలో తప్పులు లేకుండా వివరాలను నమోదు చేయాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. యూడీఐడీ కార్డులు, సదరం(21డీ) క్యాంపులపై గురువారం కలెక్టరేట్లో జిల్లా గ్రామీణాభివృద్ధి, సెర్ప్, జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్‌తో కలిసి ఎంపీడీఓ ఎంపీఈఓ, ఏపీఎం, సీసీ, మీ–సేవా సెంటర్ ఆపరేటర్, దివ్యాంగుల అసోసియేషన్ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. www.r-wavaambancar.gov.in వెబ్సైట్ ద్వారా యూ డీఐడీ కార్డుల జారీకి కొత్త దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పోర్టల్ ద్వారా పీడబ్ల్యూడీ లాగిన్ మాడ్యూల్లో దివ్యాంగులకు సంబంధించి న వివరాల్లో మార్పులు, చేర్పులు చేసుకోవచ్చని, జాగ్రత్తగా నమోదు చేయాలని ఆదేశించారు. అనర్హులకు డిసెబిలిటీ కార్డులు జారీ చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతకు ముందు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహ న కల్పించారు. ధాన్యం సెంటర్లు, ఇందిరమ్మ ఇళ్లపై.. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం ఎంపిక చేసిన గ్రామాల్లో నిర్మాణాలకు మార్కింగ్, గ్రౌండింగ్ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలన్నారు. ప్రజాపాలన గ్రామ సభల్లో వచ్చిన దరఖాస్తులకు సంబంధించి చేపట్టిన సర్వే వివరాలను యాప్‌లో నమోదు చేసి పెండింగ్ లేకుండా చూడాలని చెప్పారు. గ్రీవెన్స్ దరఖాస్తుల పరిష్కారంలో వేగం పెంచాల ని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక తరలింపులో అక్రమాలకు చోటివ్వొద్దని, ప్రతీ ట్రాక్టర్‌కు జీపీఎస్ సిస్టం అమర్చాలని పేర్కొన్నారు. ఇసుక తరలింపు వివరాలు జీపీ రికార్డుల్లో నమోదు చేయాలని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లకు ఐకేపీ ద్వారా ఏర్పాటు చేసే 157 కేంద్రాల్లో ప్యాడీ క్లీనర్లు, గన్నీ బ్యాగులు, ఎలక్ట్రానిక్ కాంటాలు తదితర మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. పెండింగ్‌లో ఉన్న వృద్ధాప్య, వితంతు, శాశ్వత వలస పింఛ న్లు, స్వయం సహాయక సంఘాల మహిళలకు బీమా దరఖాస్తులను ఈనెల 10 లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అందించే రెండు జతల యూనిఫామ్ కొలతల ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని, నాణ్య తా ప్రమాణాలు పాటించి స్టిచ్చింగ్ చేసేలా అధికా రులు పర్యవేక్షించాలని అన్నారు. ఉపాధి హామీ నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవాలని, ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ ప్రక్రియ మరింత వేగం చేయాలన్నారు. వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తొద్దని, నర్సరీల్లో మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమీక్షలో డీఆర్డీఓ వసంత, డీడబ్ల్యూఓ ఫ్లోరెన్స్, గృహ నిర్మాణ శాఖ పీడీ మాతృనాయక్ తదితరులు పాల్గొన్నారు. ఇసుక తరలింపు ట్రాక్టర్లకు జీపీఎస్ ఏర్పాటు చేయాలి సమీక్షలో కలెక్టర్ రిజ్వాన్ బాషా -
అభివృద్ధి పనులంటూ అబద్ధపు ప్రచారం
రఘునాథపల్లి: రూ.800 కోట్లతో అభివృద్ధి పనులంటూ అబద్ధపు ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి.. ఎనిమిది పైసలు కూడా తీసుకురాలేదని జనగామ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు. ఈనెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభ నేపథ్యంలో గురువారం పార్టీ జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అధ్యక్షతన జరిగిన స్టేషస్ఘన్పూర్ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ 5 లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు పెద్ద ఎత్తున నిధలు కేటాయించారని, స్టేషన్‌ఘన్‌పూర్ అభివృద్ధితోపాటు ఇక్కడి భూములకు సాగు నీరు అందిందని చెప్పారు. బీఆర్ఎస్ కార్యకర్తలు చెమటోడ్చి గెలిపిస్తే.. మోసం చేసి పార్టీ మారిన కడియం శ్రీహరికి గుణపాఠం చెప్పే సమయం దగ్గర్లోనే ఉందన్నారు. రజతోత్సవ సభకు ఘన్పూర్ నుంచి 30 వేల మందికి తగ్గకుండా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. సమావేశంలో నాయకులు బాల్నె సిద్ధ్దిలింగం, గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, సేవెల్లి సంపత్, ఆకుల కుమార్, ముసిపట్ల విజయ్, వై.కుమార్‌గౌడ్, ఎడవెల్లి కృష్ణారెడ్డి, మనోజ్‌రెడ్డి, మారపాక రవి, రాజన్‌బాబు, శెట్టి మాధవరావు, ఊడ్గుల భాగ్య, దొనికల రమాదేవి, బొంగు ఐలయ్య, లొక్కుంట్ల సృజన్ తదితరులు పాల్గొన్నారు. ‘కడియం’పై జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి పైర్ -
దొడ్డి కొమురయ్య జీవితం స్ఫూర్తిదాయకం
కలెక్టర్ రిజ్వాన్ బాషా జనగామ రూరల్: దొడ్డి కొమురయ్య జీవితం స్ఫూర్తిదాయకమని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య జయంతిని పురస్కరించుకొని గురువారం జిల్లా కేంద్రం హైదరాబాద్రోడ్డున ఉన్న ఆయన విగ్రహానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంత రం మాట్లాడుతూ.. నిజాం నిరంకుశ పాలనకు ఎదురొడ్డిన తొలి అమరవీరుడు దొడ్డి కొముర య్య అని కొనియాడారు. భూమి కోసం.. భుక్తి కోసం.. వెట్టిచాకిరీ విముక్తి కోసం.. దొరల పాలనను ఎదిరించి పోరాటాలకు మార్గదర్శి అయ్యాడని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి రవీందర్, బీసీ యువజన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ చిర్ర వీరాస్వామి, కురుమ కుల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. బార్ అసోసియేషన్ బాధ్యతల స్వీకరణ జనగామ రూరల్: జనగామ బార్ అసోసియేష న్ నూతన కార్యవర్గం సభ్యులు గురువారం బాధ్యతలు స్వీకరించారు. అధ్యక్షుడు దండెబోయిన హరిప్రసాద్‌యాదవ్, ప్రధాన కార్యదర్శి పాలకుర్తి రామకృష్ణ, ఉపాధ్యక్షుడు ఇరిగి అశోక్, మహిళా కార్యదర్శి సునీతరాణి, కోశాధి కారి ఆలే బాలరాజు, లైబ్రరీ సెక్రటరీ అన్మరు ల్లా, కల్చరల్–స్పోర్ట్స్ సెక్రటరీ రెడ్డబోయిన రాజు, కార్యవర్గ సభ్యులు చరణ్, శ్రీమాన్, జోత్స్న, రవికుమార్, దాసుతో ఎన్నికల అధికా రి శ్రీరామ్ శ్రీనివాస్ ప్రమాణస్వీకారం చేయించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ఎన్నికల అధికారులు దొమ్మాట సురేష్, జి.రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. దళారులకు విక్రయించి మోసపోవద్దు జనగామ : రైతులు ధాన్యాన్ని దళారులకు తక్కువ ధరకు విక్రయించి మోసపోవద్దని జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్‌యాదవ్ అన్నారు. గురువారం మార్కెట్ యార్డులో ఐకేపీ సెంటర్‌ను ప్రారంభించి మాట్లాడారు. ధాన్యాన్ని తూర్పార బట్టి, తేమ శాతం తగ్గిన తర్వాత కొనుగోలు కేంద్రంలో విక్రయించి మద్దతు ధర పొందాలని సూ చించారు. ఐకేపీ కేంద్రంలో రైతులకు అవసరమైన వసతులు కల్పించామని చెప్పారు. కార్యక్రమంలో ప్రత్యేక శ్రేణి కార్యదర్శి నరేందర్, ఏపీఎం కవిత, వైస్ చైర్మన్ కొల్లూరి నర్సింహులు, డైరెక్టర్లు తోటకూరి రమేశ్, బాష్మియా, శ్రీనివా స్, బన్సీనాయక్, నర్సింగరావు, బండ కుమార్, సూపర్వైజర్ శ్రీనివాస్, సీసీ శ్రీనివాస్, వీఓ అధ్యక్షురాలు దేవేంద్ర పాల్గొన్నారు. కాజీపేట జంక్షన్లో ఎలక్ట్రిక్ చార్జింగ్ పాయింట్ కాజీపేట రూరల్: కాజీపేట జంక్షన్లో ఎలక్ట్రిక్ చార్జింగ్ పాయింట్ స్టేషన్‌ను త్వరలో ఏర్పాటు చేస్తున్నట్లు గురువారం రైల్వే అధికారులు తెలిపారు. నగరంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనదారులు, ఆటోలు, కార్ ఓనర్లు, డ్రైవర్లు ఇక్కడ తమ వాహనాలకు చార్జింగ్ చేసుకోవచ్చని సూచించారు. రైల్వే అధికారుల అనుమతితో ఇండో ఫాస్ట్ ఎనర్జీ కంపెనీ వారు ఈ స్వాప్ పాయింట్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన యంత్రాలను కాజీపేట రైల్వేస్టేషన్ ఎదుట ఉన్న రైల్వే జనరల్ ఇన్స్టిట్యూట్ ప్రహరీ వద్ద భద్రపర్చి నట్లు తెలిపారు. త్వరలో కాజీపేట జంక్షన్లో అధికారికంగా ప్రారంభించి వాహనదారులకు ఈచార్జింగ్ పాయింట్‌ను వినియోగంలోకి తీసుకురానున్నట్లు అధికారులు వివరించారు. -
కొనేవారేరి..?
శుక్రవారం శ్రీ 4 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025– 8లోuజనగామ: స్థానిక వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కొనుగోళ్లలో సందిగ్ధత నెలకొంది. ఈ–నామ్ ద్వారా క్వింటా ధాన్యానికి కనీస ధర రూ.1,850 నిర్ణయించారు. గత ఏడాది నుంచి ఈ నిబంధన వర్తిస్తున్నది. ఇదే పద్ధతిలో ధాన్యం కొనుగోళ్లు జరుగుతుండగా.. ఈసారి పేచీ పడింది. విదేశాలకు బియ్యం ఎగుమతులు లేక క్వింటాకు రూ.3,700 నుంచి రూ.3,200 వరకు ధర పడిపోయింది. అంతే కాకుండా ఏపీ నుంచి రూ.2వేల లోపు ధరతో ధాన్యం దిగుమతి అవుతుండడంతో జనగామ మార్కెట్ కొనుగోళ్లపై తీవ్ర ప్రభావం పడింది. జిల్లాలో యాసంగి వరి కోతలు మొదలైనా ఐకేపీ, పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో జనగామ వ్యవసాయ మార్కెట్‌కు ధాన్యం పోటెత్తుతోంది. రోజుకు 7వేల నుంచి 10వేల బస్తాల ధాన్యం వస్తోంది. మార్కెట్ పరిధిలో 52 మంది ట్రేడర్లు ఉండగా రోజూ ఏడుగురు ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. అకాల వర్షాల భయంతో రైతులు పచ్చిమీద పంట కోతలు చేపట్టి నేరుగా మార్కెట్‌కు తరలిస్తున్నారు. దీంతో తేమ 20 నుంచి 28 శాతం వరకు ఉంటోంది. దీనికితోడు విదేశాలకు ఎగుమతి చేసే బియ్యం ధరలు పడిపోయాయని, మినిమం ప్రైజ్‌తో కొనుగోలు చేస్తే నష్టమే ఎక్కువ వస్తుందని ట్రేడర్లు ముందుకు రావడం లేదు. ఇటు ట్రేడర్ల సమస్య, అటు సర్వర్ డౌన్ కారణంగా గురువారం మధ్యాహ్నం 2.30 గంటలు దాటినా కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. చైర్మన్ శివరాజ్‌యాదవ్, ప్రత్యేక శ్రేణి కార్యదర్శి నరేంద్ర చొరవతో ముగ్గురు ట్రేడర్లు మాత్రమే రంగంలోకి దిగారు. 43 మంది రైతుల వద్ద 1,766 క్వింటాళ్ల ధాన్యం కొనుగోళ్లు చేసి మిగతా సరుకును వదిలే శారు. రైతులు ప్రాదేయపడినా స్పందించ లేదు. ఈ–నామ్ ద్వారా క్వింటా ధాన్యానికి రూ.1,880, రూ.1,850, రూ.1,925 ధర పలికింది. కొంతమంది వ్యాపారులు రైతుల అంగీకారం మేరకు క్వింటాకు రూ.1,700 నుంచి రూ.1,750 ధరతో కొనుగోలు చేశారు. ధాన్యంతో నిండిన మార్కెట్ మార్కెట్లోని రెండు కవర్ షెడ్లతో పాటు కల్లాలు ధాన్యంతో నిండిపోయాయి. సుమారు 30వేల బస్తాల వరకు ఉండవచ్చని అంచనా. తిరుమలగిరి, సూర్యాపేట మార్కెట్ల మాదిరిగా మినిమం ప్రైజ్ నిబంధన తొలగించి రైతుకు నష్టం లేకుండా ధర ఇచ్చేలా నిర్ణయం తీసుకోవాలనేది ట్రేడర్ల వాదన. అధికారులు, ట్రేడర్ల మధ్య నెలకొన్న ఈ వివాదంతో కొనుగోళ్లు మందగించి మార్కెట్లో ధాన్యం నిల్వలు పెరిగి పోతున్నాయి. రైతులు ఆరబోసుకోవడానికి స్థలం కూడా లేకుండా పోయింది. మూడు రోజులు సెలవు : చైర్మన్ ధాన్యం నిల్వలు పేరుకుపోవడంతో స్థల ప్రభావం కారణంగా ఈనెల 4 నుంచి 6వ తేదీ వరకు మార్కెట్‌కు సెలవు ప్రకటించినట్లు చైర్మన్ బనుక శివరాజ్‌యాదవ్ తెలిపారు. 4న ధాన్యం కొనుగోళ్లు–తరలింపు, 5న జగ్జీవన్‌రామ్ జయంతి, 6న ఆదివారం సాధారణ సెలవు కారణంగా రైతులు మార్కెట్‌కు వ్యవసాయ ఉత్పత్తులు తేవద్దని, 7వ తేదీన కొనుగోళ్లు పునఃప్రారంభమవుతాయని పేర్కొన్నారు. న్యూస్రీల్మార్కెట్కు పోటెత్తిన ధాన్యం మినిమం ప్రైజ్ నిబంధనతో నష్టమని ముందుకు రాని ట్రేడర్లు ఆలస్యంగా ప్రారంభమైన కొనుగోళ్లుపొట్టి ధాన్యం కొంటలేరు రెండెకరాల్లో వరి సాగు చేసిన. జనగామ పట్టణంలోని ఓ ఫర్టిలైజ ర్ షాపు యజమాని 553తోపాటు మరో రకానికి చెందిన నాలుగు విత్తన ప్యాకెట్లు ఇచ్చాడు. అందులో దొడ్డురకమని పొట్టి రకానికి చెందిన విత్తనాలు ఇచ్చాడు. ఆ ధాన్యం మార్కెట్‌కు తీసుకు వస్తే కొనేవారు లేరు. ఈసారి ప్రతికూల వాతావరణ పరిస్థితులతో 25 బస్తాల దిగుబడి తగ్గింది. – వంగాల రవీందర్, ఎర్రగొల్లపహాడ్(జనగామ) -
సన్నబియ్యం.. నేతలు రాక ఆలస్యం
సాక్షిప్రతినిధి, వరంగల్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్నబియ్యం పథకానికి ప్రొటోకాల్ సమస్య తప్పలేదు. వాస్తవానికి ఉగాది కానుకగా ప్రకటించిన ఈ పథకాన్ని ఈనెల 1న అన్ని గ్రామాల్లో ప్రారంభించాల్సి ఉంది. వివిధ కారణాలు, ప్రభు త్వ పరమైన కార్యక్రమాల వల్ల ప్రజాప్రతినిధులు కొన్నిచోట్ల హాజరు కాలేదు. దీంతో కార్పొరేటర్లు, కాంగ్రెస్ నేతలు, అధికారులు కూడా ప్రారంభించే సాహసం చేయలేదు. ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులు అధికారికంగా ప్రారంభించాకే పంపిణీ చేయాలనుకుంటున్నట్లు అధికారులు పరోక్ష సంకేతాలు కూడా ఇచ్చారు. దీంతో వరంగల్ తూర్పు, స్టేషన్‌ఘన్‌పూర్, జనగామ, ములుగు, భూపాలపల్లి నియోజకవర్గాల్లో ఒకటి, రెండు రోజుల ఆలస్యంగా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం మొదలు కాగా.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లబ్ధిదారులు రేషన్ దుకాణాల ఎదుట బారులుదీరి తీసుకెళ్తున్నారు. ఉమ్మడి వరంగల్ పరిధి ఆరు జిల్లాల్లో 2,315 రేషన్ షాపుల ద్వారా ప్రతినెలా 20,958 మెట్రిక్ టన్నుల బియ్యం పేద ప్రజలకు అందజేస్తున్నారు. ప్రభుత్వం ఈ ఉగాది నుంచి రేషన్‌కార్డులపై సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించడం పట్ల లబ్దిదారు ల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. రేషన్‌షాపుల ఎదుట సందడే సందడి.. గ్రేటర్ వరంగల్‌లోని 66 డివిజన్లతోపాటు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సన్నబియ్యం కోసం లబ్ధ్దిదారులు ఉదయం నుంచే రేషన్‌షాపులకు చేరుకుంటున్నారు. మంగళవారం నుంచి గురువారం రేషన్‌దుకాణాల్లో అధికారికంగా పంపిణీ ప్రారంభం కాగా.. ఉదయం 8 గంట ల నుంచే రేషన్‌షాపుల వద్ద భారీ సంఖ్యలో లబ్ధిదారులు క్యూలలో నిల్చుంటున్నారు. దీంతో రేషన్ షాపుల వద్ద ఈ తరహాలో సందడి చూసి చాలా రోజులైందన్న ఆశ్చర్యాన్ని డీలర్లు వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 15వ తేదీ వరకు లేదా సన్నబియ్యం స్టాక్ ఉన్నంత వరకు ఉదయం, సాయంత్రం వేళల్లో లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని డీలర్లు చెప్తున్నారు. మంచి స్పందన ఉంది.. సన్నబియ్యం పథకం అమలుపై ప్రజల్లో మంచి స్పందన ఉంది. పనులకు పోయేటోళ్లు రేషన్ దుకాణం తెరవక ముందే వచ్చి క్యూలో ఉండి తీసుకెళ్తున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్లు డీలర్లకు గౌరవ వేతనం, క్వింటాల్‌కు రూ.300 చొప్పున కమీషన్ హామీ అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరుతున్నాం. – ఏలూరి యాకన్న, రేషన్‌డీలర్, శాతాపురం రెండు రోజులపాటు కొనసాగిన ప్రారంభవేడుకలు లబ్ధిదారుల బారులు.. రేషన్ దుకాణాల వద్ద సందడి ఉమ్మడి వరంగల్‌లో 32.61లక్షల మంది కార్డుదారులు 2,315 దుకాణాల ద్వారా బియ్యం పంపిణీ.. కలెక్టర్లు, ఉన్నతాకారుల పర్యవేక్షణ -
అకాల వర్షం.. ఆగమాగం
● మార్కెట్లో స్వల్పంగా తడిసిన ధాన్యం జిల్లాలో గురువారం కురిసిన అకాల వర్షం అన్నదాతను ఆగమాగం చేసింది. జనగామ మార్కెట్లో ధాన్యం నిల్వలు పెద్ద ఎత్తున పేరుకుపోయాయి. ఈ క్రమంలో సాయంత్రం 4 గంటల సమయంలో ఆకాశం మేఘావృతమైంది. అప్రమత్తమైన రైతులు డోజర్లు, జేసీబీలతో పాటు రెక్కల కష్టాన్ని నమ్ముకుని ధాన్యంతోపాటు కాటన్ యార్డులోని మక్కలను ఒక్కచోటకు చేర్చి టార్పాలిన్ కవర్లు కప్పారు. మార్కెట్ నిండా ధాన్యం ఉండడంతో అక్కడక్కడా వర్షానికి తడిసింది. భారీ వర్షం కురిసినా నష్టం జరగకుండా ఉండేలా చైర్మన్‌తో పాటు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. – జనగామ -
ఎకరాకు రూ.50వేల నష్టపరిహారం చెల్లించాలి
జనగామ రూరల్: జిల్లాలో ఎండిన పంటలపై అధికారులు సర్వే చేపట్టి ఎకరాకు రూ.50వేల నష్టపరిహారం చెల్లించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా చందు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం జిల్లా కమిటీ ఆధ్వర్యాన ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి ఏఓ ఆండాలుకు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు, కాల్వలు పూర్తి చేయడంతో పాటు దేవాదుల ప్రాజెక్టు నుంచి వరద కాల్వల ద్వారా చెరువులు, కుంటలు నింపి రైతుల పంటల ను కాపాడాలని డిమాండ్ చేశారు. నాయకులు మాచర్ల సారయ్య, మంగ బీరయ్య, ఉర్సుల కుమార్, బోడ రాములు తదితరులు పాల్గొన్నారు. -
టార్గెట్.. 2.50 లక్షల మంది
సాక్షిప్రతినిధి, వరంగల్/ఎల్కతుర్తి : వరంగల్ వేదికగా ఈ నెల 27న బీఆర్ఎస్ మరోసారి ప్రతిష్టాత్మక కార్యక్రమం నిర్వహించేందుకు బుధవారం అంకురార్పణ జరిగింది. పార్టీ ఆవిర్భావ రజతోత్సవ వేడుకల మహాసభ హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు పార్టీ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, సభా పర్యవేక్షకులు, మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతారావు, మాజీ ఎమ్మెల్యేలు వొడితల సతీష్ కుమార్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, నరేందర్, ఉమ్మడి జిల్లా పార్టీ ఇన్చార్జ్ గ్యాదరి బాలమల్లు తదితరులు భూమి పూజ చేశారు. అంతకుముందు మంగళవారం ఎర్రవెల్లిలో ఉమ్మడి వరంగల్‌కు చెందిన ముఖ్యనేతలతో సమావేశమైన అధినేత కేసీఆర్.. సభావేదిక, జనసమీకరణ, ఇతర ఏర్పాట్లకు సంబంధించి దిశానిర్దేశం చేశారు. 10లక్షల మందికిపైగా బహిరంగసభ నిర్వహించాలని, దీనికి కోసం ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఇందులో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లానుంచి 2.50లక్షలమంది జనాన్ని సమీకరించాలని టార్గెట్ పెట్టారు. జనసమీకరణకు ఇన్‌చార్జ్‌లు.. కేసీఆర్ ఆదేశాలతో 2.50లక్షలమంది జనసమీకరణకు బీఆర్ఎస్ పార్టీ నేతలు కసరత్తు ప్రారంభించారు. ఈ మేరకు అధినేత.. సభా ఏర్పాట్లు, జన సమీకరణకు సంబంధించి ముఖ్యనేతలకు నియోజకవర్గాల వారీగా బాధ్యతలు అప్పగించారు. పాలకుర్తి, వర్ధన్నపేటలకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇన్చార్జ్గా వ్యవహరించనుండగా.. వరంగల్ పశ్చిమను మాజీ చీఫ్‌విప్ వినయభాస్కర్కు అప్పగించారు. వరంగల్ తూర్పును నన్నపునేని నరేందర్, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డిలకు, భూపాలపల్లిని గండ్ర వెంకటరమణారెడ్డికి, నర్సంపేట, ములుగు నియోజకవర్గాలకు పెద్ది సుదర్శన్ రెడ్డిలను ఇన్‌చార్జ్‌లుగా నియమించారు. అదేవిధంగా జనగామ, స్టేషన్ ఘన్పూర్ బాధ్యతలను ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి చూడనుండగా, పరకాలను చల్లా ధర్మారెడ్డి, మహబూబాబాద్‌ను సత్యవతి రాథోడ్, శంకర్‌నాయక్‌లు, డోర్నకల్‌ను రెడ్యానాయక్, మాలోత్ కవితలకు అప్పగించారు. సభ ఏర్పాట్లు, జనసమీకరణ తదితర బాధ్యతలు నిర్వహించే హైదరాబాద్‌కు చెందిన పార్టీ రాష్ట్ర, జాతీయస్థాయి నాయకులు వరంగల్ నగరంలోనే మకాం వేయనున్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఉమ్మడి జిల్లానుంచి జనసమీసకరణ జన సమీకరణకు ఇన్చార్జులుగా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇప్పటికే కేసీఆర్‌తో భేటీ అయిన ముఖ్య నేతలునేటినుంచి మరింత వేగంగా పనులు.. సభకు మరో 24 రోజులే గడువు ఉండటంతో గురువారంనుంచి సభ కోసం చేపట్టే పనులు మరింత వేగం పుంజుకోనున్నాయి. ఇప్పటివరకు బహిరంగసభకు సిద్ధం చేసిన 1,213 ఎకరాల స్థలంలో.. 154 ఎకరాల్లో మహాసభ ప్రాంగణం ఉంటుందని, పార్కింగ్ కోసం 1,059 ఎకరాలను కేటాయించినట్లు వెల్లడించిన బీఆర్ఎస్ నేతలు, మరో మూడు, నాలుగు వందల ఎకరాలు కూడా సమీకరించనున్నట్లు వివరించారు. -
భద్రకాళి అమ్మవారికి మల్లెలతో పుష్పార్చన
హన్మకొండ కల్చరల్: వరంగల్‌లోని భద్రకాళి ఆలయంలో వసంత నవరాత్రోత్సవాల్లో భాగంగా బుధవారం మల్లెపూలతో అమ్మవారికి పుష్పార్చన నిర్వహించారు. ఉదయం ఆలయ అర్చకులు అమ్మవారికి పూర్ణాభిషేకం, నిత్యాహ్నికం నిర్వహించా రు. అనంతరం వేద పండితులు, వేద పాఠశాల విద్యార్థులు మల్లెపూలకు సంప్రోక్షణ నిర్వహించి వాటితో అమ్మవారికి లక్షపుష్పార్చన చేశారు. పుష్పార్చనకు న్యాయవాది భాస్కరవజ్జుల పురుషోత్తం భవాని దంపతులు ఉభయదాతలుగా వ్యవహరించారు. ఆలయ ఈఓ శేషుభారతి, దేవాలయ సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
ఎల్ఆర్ఎస్ @ రూ.6.8కోట్లు
జనగామ: లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం(ఎల్ఆర్ఎస్) రాయితీని పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 30వ తేదీ వరకు 25 శాతం రాయితీతో ప్లాట్లను క్రమబద్ధీకరించుకునేందుకు మరో అవకాశం కల్పించింది. జిల్లాలోని జనగా మ, స్టేషన్‌ఘన్‌పూర్ పురపాలికలతో పాటు 12 గ్రామపంచా యతీల పరిధిలో 69,710 మంది 2020లో ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటి వరకు 11,144 మంది ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించగా, ఇంకా 54,403 మంది చెల్లించాల్సి ఉంది. ఇందులో 681 మందికి ప్రొసీడింగ్ కాపీలు అందించగా.. ఇప్పటి వరకు పురపాలిక, గ్రామ పంచాయతీల నుంచి రూ.6,80,80,000 ఫీజుల రూపంలో వచ్చాయి. గత నెల 31వ తేదీ వరకు 25 శాతం రాయితీతో ఎల్ఆర్ఎస్కు అవకాశం ఇవ్వగా.. రెండు రోజుల క్రితమే గడువు ముగిసింది. దరఖాస్తులు పెద్ద ఎత్తున పెండింగ్‌లో ఉన్నాయి. ఎల్ఆర్ఎస్ వంత శాతం లక్ష్యంగా ప్రభుత్వం రాయితీ గడువును పొడిగించడంతో పురపాలిక, పంచాయతీ అధికారులు రంగంలోకి దిగారు. ఇదిలా ఉండగా 2025–26 ఆర్థిక సంవత్సరంలో పురపాలికల పరిధిలో అసలు ఆస్తి పన్నుపై 5 శాతం రాయితీ కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. జీపీ పరిధిలో.. జనగామ ఘన్పూర్ మున్సిపాలిటీ మున్సిపాలిటీ ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు 47,151 18,358 4,201 ఫీజు చెల్లించిన వారు 9,002 1,909 233 ప్రొసీడింగ్స్ పొందినవారు 348 333 000 వచ్చిన ఆదాయం(రూ.) 1,31,80,000 4.97 కోట్లు 58 లక్షలుఫీజు చెల్లించిన వారు 11,144 మంది.. వచ్చిన దరఖాస్తులు 69,710 25 శాతం రాయితీ గడువు పెంపు ఈనెల 30 వరకు అవకాశం -
సన్న బియ్యం పంపిణీ విప్లవాత్మక నిర్ణయం
● ఎమ్మెల్యే కడియం శ్రీహరి జనగామ: రాష్ట్రంలో పేదలకు రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ సీఎం రేవంత్‌రెడ్డి తీసుకున్న విప్లవాత్మక నిర్ణయమని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం పరిధి పలు మండలాల రేషన్ దుకా ణాలకు సంబంధించి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఆయన బుధవారం కలెక్టరేట్లో ప్రారంభించి మాట్లాడారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో నాణ్యత లేని దొడ్డు బియ్యం ఇవ్వడంతో ప్రజలు వాటిని పెద్దగా ఉపయోగించుకోలేదని, బియ్యం తీసుకున్న వెంటనే పక్క దుకాణాల్లో అమ్ముకున్న పరిస్థితి ఉండడంతో ఉచిత బియ్యం ఇతర రాష్ట్రాలకు అక్రమంగా ఎగుమతి చేశారన్నారు. ఈ సమస్యకు పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పేదలకు సన్న బియ్యం అందిస్తోందని చెప్పారు. రేషన్ ద్వారా తీసుకున్న బియ్యాన్ని ప్రజలు ఉపయోగించుకుంటే అక్రమ రవాణాను పూర్తిగా అరికట్ట వచ్చాన్నారు. రాష్ట్రంలో మరో 10 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నట్లు వివరించారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్, జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ ఆర్డీఓలు గోపీరామ్, వెంకన్న, పౌరసరఫరాల శాఖ అధికారి ఇర్ఫాన్ పాల్గొన్నారు. లింగాలఘణపురంలో.. లింగాలఘణపురం/రఘునాథపల్లి: లింగాలఘణపు రం మండలంలోని నాగారం, నెల్లుట్ల, లింగాలఘణ పురం, రఘునాథపల్లి మండల పరిధి అశ్వరావుపల్లి, జాఫర్‌గూడెం, కుర్చపల్లి గ్రామాల్లో సన్నబియ్యం పథకాన్ని ఎమ్మెల్యే కడియం శ్రీహరి బుధవారం ప్రారంభించారు. కార్యక్రమాల్లో సివిల్ సప్లయ్ డీసీఓ దశరథం, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాంబాబు, నిడిగొండ పీఏసీఎస్ చైర్మన్లు నర్సింహారెడ్డి, శ్రీశైలం, ఆర్డీఓ గోపీరాం, తహసీల్దార్ రవీందర్, మార్కెట్వైస్ చైర్మన్ శివకుమార్, జీడికల్ దేవస్థాన చైర్మన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. -
మార్కెట్‌కు పోటెత్తిన ధాన్యం
జనగామ: యాసంగి వరి కోతలు మొదలు కావడంతో జనగామ వ్యవసాయ మార్కెట్‌కు ధాన్యం పోటెత్తుతోంది. బుధవారం ఒక్కరోజే 3,155 క్వింటాళ్ల ధాన్యం(4,854 బస్తాలు) వచ్చింది. మార్కెట్ చైర్మ న్ బనుక శివరాజ్ యాదవ్ పర్యవేక్షణలో ప్రత్యేక శ్రేణి కార్యదర్శి నరేంద్ర ఆధ్వర్యాన ధాన్యం, ఇతర సరుకుల కొనుగోళ్లను పర్యవేక్షించారు. ధాన్యం ధర పడిపోకుండా ట్రేడర్లతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేపట్టారు. ఇదిలా ఉండగా ‘గురువారం(నేడు) ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ఎంట్రీ ఉంటుంది.. ఆ తర్వాత వచ్చిన సరుకులను కొనుగోళ్లు పూర్తయిన తర్వాత మధ్యాహ్నం లోనికి అనుమతిస్తారు.. రైతులు ధాన్యాన్ని సకాలంలో మార్కెట్‌కు తీసుకురావాలి’ అని చైర్మన్ కోరారు. విన్నర్ లిస్ట్ వచ్చిన తర్వాత కాంటాలు పూర్తి చేసి బస్తాలను త్వరితగతిన లిఫ్టు చేయాలని చెప్పారు. నేడు ఎంట్రీ ఉదయం 6 నుంచి 10 వరకు.. -
ప్రాణాలు కాపాడుతున్న మెడికల్ టెక్నీషియన్లు
జనగామ రూరల్: ఆపదలో ప్రజల ప్రాణాల ను 108 అంబులెన్స్ మెడికల్ టెక్నీషియన్లు కాపాడుతున్నారని జిల్లా మేనేజర్ మంద శ్రీని వాస్ అన్నారు. జాతీయ 108 అంబులెన్స్ టెక్నీషియన్స్ దినోత్సవం సందర్భంగా బుధవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన కేక్ కట్ చేసి మాట్లాడారు. ఉద్యోగులు బిల్లా రాజు, శాగ రాంబాబు, మామిడి రాకేష్, కల్యాణి, మల్లేష్, రాజు, రవి, కృష్ణ, గోపి, రాజేష్, సాయి తదితరులు పాల్గొన్నారు. ముగిసిన టెన్త్ పరీక్షలుజనగామ రూరల్: పదో తరగతి పబ్లిక్ పరీక్షలు బుధవారంతో ముగిశాయి. చివరి రోజు సాంఘికశాస్త్రం పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 6,238 మంది విద్యార్థులకు 6,234 మంది హాజరయ్యారని డీఈఓ రమేశ్ తెలిపారు. జనగామలో యారన్ డిపో..●బచ్చన్నపేట : రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు అండగా నిలుస్తున్నది.. 33 కోట్ల రుణమాఫీ, జియో ట్యాగ్ మగ్గానికి రూ.24వేల ఇన్సెంటివ్, కార్మికులకు బీమా వసతి(90 ఏళ్లకు) కల్పించింది.. త్వరలోనే పోచంపెల్లి లేదా జనగామలో యారన్ డిపో ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మురళి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో సంఘం రాష్ట్ర నాయకులు గుర్రపు బాల్‌రాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అనంతరం చేనేత కార్మిక నాయకులు మురళిని సన్మానించారు. మచ్చ నరేందర్, మంగళంపెల్లి కృష్ణమూర్తి, కృష్ణమూర్తి, ఘణపురం నాగేష్, లక్ష్మణ్, వెంకటేష్, పాండు, విటోబా, హరికృష్ణ, శ్రీనివాస్, రమేష్, రాములు, శ్రీహరి, నర్సింహులు, సంతోష్ పాల్గొన్నారు. జిల్లాకు పాపన్న పేరు పెట్టాలి జనగామ రూరల్: జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టాలని కేజీకేఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కుర్ర ఉప్పలయ్య, బాల్నే వెంకటమల్లయ్య డిమాండ్ చేశారు. బుధవారం పాపన్న వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రం చౌరస్తాలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంత రం వెంకటమల్లయ్య మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలో గీత కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న ఎక్స్‌గ్రేషియా డబ్బులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రమాదానికి గురై చనిపోయిన వారి కుటుంబాలకు, శాశ్వత వికలాంగులకు రూ.10 లక్షలు, తాత్కాలిక వికలాంగులకు రూ.లక్ష చొప్పన ఎక్స్‌గ్రేషియా నెల రోజుల లోపు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో గోపా అధ్యక్షుడు కన్నా పరశురాములు, సభ్యులు మార్క ఉపేందర్, శంకరయ్య, బైరగోని వెంకటయ్య, సోషల్ మీడియా కన్వీనర్ మిట్ట భిక్షపతి, యాదగిరి పాల్గొన్నారు. ఉద్యోగాలు అమ్ముకున్నారని వినూత్న నిరసనజనగామ: జిల్లా జనరల్ ఆస్పత్రితో పాటు మెడికల్ కాలేజీలో కొంత మంది ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందారని నిరసిస్తూ పట్టణానికి చెందిన యువకు డు గండి నాగరాజు భూతం వేషంతో బుధవారం వినూత్నంగా నిరసన తెలిపాడు. హనుమకొండరోడ్డు నుంచి కాలినడకన ఆర్టీసీ చౌరస్తాకు వచ్చి అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చాడు. ల్యాబ్ అసిస్టెంట్, వివిధ పో స్టులను అమ్ముకుని అర్హులకు అన్యాయం చేశారని నినాదాలు చేశాడు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుండా అడ్డుపడుతున్నారని, ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు ఈ సందర్భంగా నాగరాజు తెలిపాడు. -
రైతుల మధ్య సాగునీటి గొడవ
● ఏఈ, సీఐ చొరవతో ప్రశాంతంస్టేషన్ఘన్పూర్: సాగునీటి విషయంలో స్టేషన్‌ఘన్‌పూర్ మండలం సముద్రాల, పాలకుర్తి మండలం ఈరవెన్ను, అయ్యంగారిపల్లి గ్రామాల రైతుల మధ్య బుధవారం గొడవ జరిగింది. స్టేషన్‌ఘన్‌పూ ర్ రిజర్వాయర్ మెయిన్ కాల్వ నుంచి ఇప్పగూడెం సమీప ఎల్–2 కెనాల్ ద్వారా దిగువన ఉన్న సముద్రాల గ్రామానికి సాగునీరు వస్తోంది. నీరు రావడానికి గతంలో రైతులు కెనాల్లో రాళ్లు వేశారు. అదే కెనాల్ నుంచి పాలకుర్తి మండలం ఈరవెన్ను, అయ్యంగారిపల్లి గ్రామాలకు నీటిపారుదల శాఖ అధికారులు విడతల వారీగా సాగునీరు ఇస్తున్నారు. అయితే తమకు సరిపడా సాగునీరు రావడం లేదంటూ ఈరవెన్ను, అయ్యంగారిపల్లి రైతులు ఎల్–2 కెనాల్‌లోని రాళ్లను తొలగించేందుకు జేసీబీతో వచ్చారు. విషయం తెలుసుకున్న సముద్రాల రైతులు చేరుకుని కెనాల్లో రాళ్లను ముట్టుకుంటే సహించేది లేదని గొడవకు దిగారు. స్టేషన్‌ఘన్‌పూర్ సీఐ జి.వేణు అక్కడికి వచ్చి రైతులతో మాట్లాడి ఇరిగేష న్ ఏఈ యాసర్కు సమాచారం ఇవ్వగా అక్కడికి చేరుకున్నారు. కెనాల్లో ఉన్న రాళ్లు తీయొద్దని, విడతల వారీగా అన్ని గ్రామాలకు సాగునీరు అందిస్తామని నచ్చచెప్పడంతో రైతులు వెళ్లిపోయారు. -
ఈఎంటీల సేవలు అభినందనీయం
ఈఎంటీలు తమ ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా విధి నిర్వహనలో అంకితభావంతో పని చేస్తున్నారు. కాల్ వచ్చిన వెంటనే హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రుల ప్రాణాలు కాపాడేందుకు ఓ స్నేహితుడు, బంధువుగా తోడుంటూ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. వారి సేవలు అభినందనీయం. – ఎస్కె నసీరొద్దీన్, 108 సర్వీసెస్ ప్రోగ్రాం మేనేజర్ సకాలంలో ఆస్పత్రికి తరలిస్తున్నాం.. 17 సంవత్సరాలుగా 108 అంబులెన్స్‌లో సేవలు అందిస్తున్నా. రోడ్డు ప్రమాద బాధితులు, గర్భిణులు, ఆత్మహత్యాయత్నాలు, గుండెనొప్పి ఇలా ఎందరో బాధితులను సకాలంలో ఆస్పత్రికి తరలిస్తాం. అనంతరం వారు కోలుకున్న తర్వాత బాధితుల ఆశీర్వచనాలు మాకు కొండంత బలం. – మామిడి రాకేష్, ఈఎంటీ, జనగామ అదృష్టంగా భావిస్తున్నా.. సంజీవనిగా పేరొందిన 108 అంబులెన్స్‌లో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నా. ఆపదలో ఉన్న వారిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించి, వారు ఆరోగ్యంగా కోలుకున్న తర్వాత వచ్చే సంతృప్తి ఎందులో దొరకదు. – వనజ, ఈఎంటీ ● -
సన్నబియ్యం పంపిణీ అంతంతే..
జనగామ: ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీ ప్రారంభంలో సందిగ్ధత నెలకొంది. ఎమ్మెల్యే, ఎంపీ సమయం కోసం రెండు నియోజకవర్గాల్లో సన్నరకం బియ్యం ప్రారంభం నేటికి (బుధవారం) వాయిదా వేయగా... పాలకుర్తి నియోజకవర్గంలో మూడు చోట్ల ప్రారంభించారు. జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలోని పలు రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ చేపట్టినప్పటికీ.. ఉన్నతాధికారుల ఆదేశాలతో గంటలోపే మూసి వేశారు. బియ్యం కోసం రేషన్ దుకాణాలకు వచ్చిన కొంతమంది లబ్ధిదారులు ఉసూరుమంటూ వెళ్లిపోయారు. స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డి సమయం మేరకు సన్న బియ్యం పంపిణీ నేటికి వాయిదా వేసినట్లు సమాచారం. 335 దుకాణాలు...మూడే చోట్ల జిల్లాలో 335 రేషన్ దుకాణాలు ఉన్నాయి. ఏప్రిల్ 1వ తేదీ నుంచి సన్నబియ్యం ప్రారంభించాలని ఆదేశాలు రావడంతో రేషన్ డీలర్లు సన్నద్ధమయ్యారు. రేషన్ దుకాణాల ఎదుట సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి చిత్రపటాలతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. పాలకుర్తి నియోజకవర్గంలోని దేవరుప్పుల మండలంలోని నీర్మాల, పాలకుర్తి మండలంలోని శాతపురం, కొడకండ్ల మండలంలోని ఏడునూతలతో ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి చేతుల మీదుగా సన్నబియ్యం పంపిణీ చేశారు. ఏళ్ల తరబడి దొడ్డు బియ్యం తీసుకుంటూ.. మొదటిసారిగా రేషన్ దుకాణం ద్వారా సన్నరకం బియ్యం తీసుకున్న లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేయగా.. వాయిదా పడిన గ్రామాల్లో నిరుత్సాహ పడ్డారు. అయితే ఆయా మండలాల్లో బియ్యం పంపిణీ ప్రారంభించిన కొంత సేపటికే సరఫరా నిలిపేశారు. ఎమ్మెల్యే, ఎంపీ సమయం కోసం నేటికి వాయిదా ఉసూరుమంటూ వెనుదిరిగిన లబ్ధిదారులు పాలకుర్తిలో ప్రారంభించిన ఎమ్మెల్యే యశస్వినీరెడ్డిసన్నబియ్యం పేదలకు వరం ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి పాలకుర్తి: సన్నబియ్యం పంపిణీ పేదలకు వరం అని ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. మంగళవారం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సన్నబియ్యం పథకాన్ని ఎమ్మెల్యే శాతపురం గ్రామంలో ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలు సన్నబియ్యంను సద్వినియోగం చేసుకోవాలని, పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు ఉన్న తమకు తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గిరగాని కుమారస్వామి, అధికారులు, రేషన్ డీలర్లు ఉన్నారు.ప్రజాప్రతినిధులు రాలేదని.. రేషన్ దుకాణంలో సన్నబియ్యం ఇస్తారని ఉదయమే అక్కడకు వెళ్లాను. గంట సేపు వేచి చూసిన. ప్రజా ప్రతినిధులు రాలేదని ప్రారంభం ఆపేశారు. అధికారులు వచ్చి నేడు (బుధవారం) రండి అంటూ పంపించేశారు. – కాళ్ల భిక్షపతి, మల్కపేట, నర్మెటసంతోషంగా ఉంది.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆహార భద్రత పథకంలో భాగంగా సన్నబియ్యం అందిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించి అమలు చేయడం చాలా సంతోషం. దీంతో పేదలకు ఆర్థిక ఇబ్బందులు తప్పనున్నాయి. సన్నబియాన్ని సద్వినియోగం చేసుకుంటాం. – బీరెల్లి కవిత, శాతాపురం, పాలకుర్తి -
మూడు రాష్ట్రాల్లో తూటాలై పేలిన అక్షరాలు
బుధవారం శ్రీ 2 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025– 8లోu● చట్టంపై పట్టుకోసం న్యాయ విద్య.. ● విప్లవ ప్రజాపోరాటాల చరిత్ర అక్షరీకరణ ● పలు విప్లవ పత్రికలకు సంపాదకత్వం దేవరుప్పుల: ప్రజా చైతన్యానికి ఊపిరిలూదిన జనగామ జిల్లా కడవెండిలో పుట్టిన గుమ్ముడవెల్లి రేణుక అదే పోరాట పంథాను ఎంచుకుని అడవిబాట పట్టింది. చిన్నతనంలోనే వివాహం, తదితర ఘటనలు ఆమెను తీవ్రంగా కలిచివేశాయి. ఈనేపథ్యంలో చట్టంపై అవగాహన కోసం న్యాయ విద్యను అభ్యసించింది. ఆమె సోదరుడు ప్రసాద్ అలియాస్ ఉసెండి దండకారణ్యంలో పనిచేసేవాడు. ఈక్రమంలో పోలీసుల అత్యంత నిర్బంధాలను చవిచూసిన తండ్రి సోమయ్య.. కూతురు రేణుకకు యుక్త వయసు రాగానే ఉన్నత చదువులకు అవకాశం ఇవ్వకుండా ఓ వ్యక్తితో వివాహం చేశారు. దీంతో వారి దాంపత్య జీవితంలో పురుషాధిక్యత వంటి అంశాలతో కలహాలు వచ్చాయి. అనివార్యంగా విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. యుక్తవయస్సు రాగానే తన ఆలోచనలకు విరుద్ధంగా పితృస్వామ్య వ్యవస్థలో నిర్ణయాలు, అజమాయిషీపై ఆమె తీవ్రంగా ఆ లోచించింది. ఈనేపథ్యంలోనే ఓయూలో దూరవిద్యలో డిగ్రీ చేసి చట్టంపై పట్టు కోసం తిరుపతి పద్మావతి విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్బీ చదివింది. ఎల్ఎల్బీ చదువుతున్న క్రమంలోనే.. రేణుక లా చదువుతున్న సమయంలో అప్పటికే ఉద్యమంలో ఉన్న పద్మక్క, సూర్యం పరిచ య మయ్యారు. దీంతో ఆమె ఆలోచనాత్మక ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు ప్రజాసంఘాల్లో భాగస్వామ్యమవుతూ దండకారణ్యం బాట పట్టింది. వరుస ఎన్కౌంటర్లు, నిర్బంధ పరిస్థితుల్లో మావోయిస్టు పార్టీ నిర్ణయంతో ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లో ప్రజాక్షేత్రంలో చోటుచేసుకున్న అనేక కీలక ఘటనలు, ఘ ట్టాలపై విశ్లేషణాత్మక అధ్యయనాలు చేసి పార్టీకి మా ర్గదర్శకాలు చేసింది. అజ్ఞాత జీవితాన్ని ఎదుర్కొంటూనే విప్లవ ప్రజాపోరాటాల చరిత్రను అక్షరీకరించింది. నక్సల్స్ తరఫున ప్రభాత్, మహిళా మార్గం, అవామి జంగ్, పీపుల్స్ మార్చ్, పోటియారో ఫోల్లో, సంఘర్షణ్, భూమ్కల్ సందేశ్, పితురీ వంటి విప్లవ పత్రికలకు సంపాదకత్వం వహించింది. తొలుత భాషాధార(బీడీ) ప్రాంతంలో పని చేసే క్రమంలో బీడీ దమయంతి పేరుతో రచనలు చేసింది.కడవెండి పడమటి తోట.. నక్సల్స్ ఉద్యమానికి బాట కడవెండికి చేరిన రేణుక మృతదేహం– వివరాలు 8లోu -
క్రిటికల్ డెలివరీ చేసినం..
అంబులెన్స్‌లో గర్భిణులను తీసుకు వెళ్లే సమయంలో ప్రసూతి కాన్పు చేయడం దేవుడు మాకిచ్చిన అవకాశంగా భావిస్తున్నాం. క్రిటికల్ సమయంలో నార్మల్ డెలివరీతో తల్లీబిడ్డలు క్షేమంగా ఉండడంతో కుటుంబంలో చూసే సంతోషం ఆకలిని సైతం గుర్తుకు లేకుండా చేస్తుంది. – అజయ్ కుమార్, ఈఎంటీ, పాలకుర్తిజిల్లాలో అంబులెన్స్‌లో తరలించిన మూడు నెలల కేసులుజనవరి ఫిబ్రవరి మార్చి1,3801,250 1201361251,120 11096గర్భిణులుఇతర ప్రమాదాలు రోడ్డు ప్రమాదాలు -
నేటినుంచి సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు
పాలకుర్తి టౌన్: మండలంలోని వల్మిడి శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో నేటి (బుధవారం)నుంచి 12వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ సల్వాది మోహన్‌బాబు తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ నేడు శ్రీసీతారామ చంద్రస్వామి ఆలయం నుంచి గుట్టమీదకు ప్రవేశం, 3న సాయమారాధన, ప్రబంధ సేవాకాలం, 4న సేవాకాలం గరుడసేవా నమ్మాళ్వారుల పమర పథోత్సవం, 5న పుణ్యహవాచనం, అంకురార్పన, బేరి పూజా దేవతాహ్వానము, 6న శ్రీసీతారామ చంద్రస్వామి కల్యాణం, 7న సాయమారాధన హోమం, 8న సుదర్శన నారసింహ హోమం, 9న నిత్య హోమం, బలిహరణ గోష్టి, 10న చక్రస్నానం, 11న బండ్లు తిరుగుట పారువేట, 12న సీతారామస్వామి వారు ఆలయ ప్రవేశం , ఏకాంత సేవలు ఉంటాయని ఈఓ తెలిపారు. -
క్షేత్రస్థాయి పరిస్థితులపై విశ్లేషణాత్మకంగా..
1994లో తాను ఎదుర్కొన్న సంఘర్షణను బట్టి ‘మహిళలపై హింస–మండుటెండు గాయాలు’ రచన చేసింది. పత్రికల్లో బీడీ దమయంతి పేరిట సల్వాజుడుం విధ్వంసం తీరుపై ‘పచ్చని బతుకుల్లో కురుస్తున్న నిప్పులు’, ఆదివాసీ భూపోరాటాల విజయపథంలో ‘విముక్తి బాటలో నారాయణఖేడ్’, భూఆక్రమణలు చేపడుతూ వడ్డీ వ్యాపారుల ఆగడాలు, ఆదివాసీ, దళితుల మధ్య పాలకుల చిచ్చు అంశాలపై మీడియా రూపంలో క్షేత్ర స్థాయిలో విశ్లేషణాత్మక అధ్యయనాలు చేసి మావోయిస్టు అగ్రనేత రామకృష్ణతో పర్యటన చేసింది. సింగన్ మడుగు ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరిట అడవిలో ఆరు ఊర్లను తగులబెట్టిన నేపథ్యంపై ఆమె చేసిన రచనలు తుపాకీ తూటాల కంటే రెట్టింపులో పేలి ప్రజాచైతన్యానికి ఊపిరిలూదినట్లు చెబుతుంటారు. యుక్త వయసులో ఓ ఇంటి ఆవిడగా సంఘర్షణ పడి సమ సమాజ స్థాపన కోసం అడవిబాట పట్టిన ఉద్యమ కెరటం రేణుక ప్రస్థానం దంతెవాడ ఎన్‌కౌంటర్‌తో ముగిసినా మెట్లమీద మిడ్కో(మిణుగురు పువ్వు) పేరిట ఆమె రచనలు, సాహిత్యం ఎప్పటికీ గుర్తుండిపోతుందని సాహిత్యాభిమానులు అంటున్నారు. -
ఆస్తి పన్ను వసూలు 62.09 శాతం
జనగామ: జనగామ పురపాలిక అధికారుల శ్రమకు ఫలితం కనిపించలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి.. కలెక్టర్ రిజ్వాన్ బాషా నిత్యం సమీక్షలు, పురమాయింపులతో కొంత మేర మొండి బకాయిలను రాబట్టినా... ఆశించిన మేర లక్ష్యం చేరుకోలేక పోయారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్ పర్యవేక్షణలో కమిషనర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో రెవెన్యూ డిపార్డుమెంట్తో పాటు బిల్ కలెక్టర్లు, ఇతర సిబ్బంది, ఉద్యోగులు నెల రోజుల పాటు ఉదయం మొదలుకుని రాత్రి 11 గంటల వరకు ఆస్తి పన్ను కోసం ఇంటింటికీ తిరిగారు. మొండి బకాయిదారులకు రెడ్ నోటీసులను జారీ చేయడంతో పాటు వినూత్న పద్ధతిలో పన్నులను రాబట్టేందుకు అధికారులే ఇళ్ల ముందు ధర్నాకు దిగారు. కూటి కోసం కోటి తిప్పలు అన్నట్టుగా అధికారులు విశ్వ ప్రయత్నం చేసినా... టార్గెట్ రీచ్ కాలేకపోయారు. పట్టణంలో 15,456(గృహాలు, కమర్షియల్) అసెస్మెంట్లు ఉన్నాయి. ఆస్తి పన్ను డిమాండ్ రూ.5.77 కోట్లు ఉండగా, ఇందులో రూ.3.57కోట్లు కలెక్షన్ చేయగా... రూ.2.20 కోట్ల మేర బకాయి(62.09శాతం)బకాయి ఉంది. కాగా గత నెల 31వ తేదీ ఒక్కరోజే రూ.8లక్షలు కలెక్షన్ చేయాలని కేంద్ర ప్రభుత్వం టార్గెట్ ఉండగా, రూ.11 లక్షల మేర వసూలు చేశారు. దీంతో కేంద్రం నుంచి వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా పురపాలికకు రూ.10 కోట్ల మేర నిధులు రానున్నాయి. సోమవారం అర్ధరాత్రి వరకు కొనసాగిన వసూలు రూ.3.57 కోట్ల వసూళ్లు.. రూ.2.20 కోట్ల బకాయి -
● రజతోత్సవ మహాసభపై సమీక్ష
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించతలపెట్టిన పార్టీ రజతోత్సవ మహాసభ ఏర్పాట్లపై మంగళవారం పార్టీ అధినేత కేసీఆర్‌తో ఎర్రవెల్లిలోని తన నివాసంలో ఉమ్మడి జిల్లా నేతలు సమావేశమయ్యారు. సమావేశంలో మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, తక్కళ్లపల్లి రవీందర్రావు, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, తాటికొండ రాజయ్య, సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, దాస్యం వినయ్‌భాస్కర్, చల్లా ధర్మారెడ్డి, రెడ్యానాయక్, శంకర్ నాయక్, గండ్ర వెంకట రమణారెడ్డి, నన్నపునేని నరేందర్, నాయకులు లక్ష్మణ్‌రావు, గండ్ర జ్యోతి, నాగజ్యోతి పాల్గొన్నారు. -
జానపద కళలు ముందు తరాలకు అందించాలి
● పద్మశ్రీ అవార్డు గ్రహీత గడ్డం సమ్మయ్య లింగాలఘణపురం: తెలంగాణ జానపద కళలు ముందు తరాలకు అందించాలనే లక్ష్యంతో కళాకారులకు రెండు రోజుల పాటు శిక్షణ ఇవ్వడం జరిగిందని పద్మశ్రీ అవార్డు గ్రహీత గడ్డం సమ్మయ్య అన్నారు. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో హెల్పింగ్ హాండ్స్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో మండలంలోని చీటూరులో జరుగుతున్న కళా ప్రదర్శన శిక్షణ కార్యక్రమం మంగళవారం రాత్రి ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత గడ్డం సమ్మయ్య ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ జానపద కళారూపాలైన చిందు యక్షగానం, ఒగ్గుడోళ్లు,చిరుతల రామాయణం వంటి కళారూపాలను భావితరాలకు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉస్తాద్ ఒగ్గు రవి, అందె భాస్కర్, ప్రముఖ వైద్యులు భిక్షపతి, సుగుణాకర్‌రాజు, గజవెల్లి ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. -
వేల ఏళ్ల నాటి జంతువు ఎముక లభ్యం
జనగామ: జిల్లా కేంద్రం సమీప పొట్టిగుట్ట దిగువన క్రీస్తు పూర్వం 3వేల ఏళ్ల నాటి జంతువు దవడ ఎముకను చరిత్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకర్‌రెడ్డి సోమవారం గుర్తించారు. ఈ మేరకు వివరాలు వెల్ల డించారు. పొట్టిగుట్ట సమీపంలో ప్రస్తుతం పంట సాగు చేసే క్రమంలో దున్నకాలు చేస్తుండగా రెండు ఫీట్ల లోతున మట్టిగడ్డ కింద జంతువు దవడ ఎముక లభించిందని, ఎముకకు నాలుగు పళ్లు, చివరలో చిన్న రంధ్రం ఉన్నట్లు గుర్తించామన్నారు. దాని పొడవును బట్టి మేకకు చెందినదిగా ప్రాథమికంగా అంచనా వేశామని తెలిపారు. ఆవాస ప్రాంతంలో లభించిన నలుపు, ఎరుపు రంగు కలిగిన మృణ్మయ మట్టి పాత్రలో దొరిగిన ఈ ఎముక శిలాయుగంలో మానవులు ఆహారంగా తీసుకున్న జంతువుదిగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికీ ఎముక తెల్లగా ఉన్నా.. ఏళ్లు గడిచేకొద్దీ రంగు మారుతూ కొంత తేలికగా ఉంటుందని పరిశోధనల ద్వారా తెలుస్తోందని చెప్పారు. పురావస్తు శాస్త్రంలో జంతు అవశేషాలను గుర్తించే అధ్యయనం ప్రత్యేకంగా ఉంటుందని, బ్రిటన్, లండన్ వంటి దేశాల్లో మాత్రమే వీటిని బోధించే విశ్వవిద్యాలయాలు ఉన్నట్లు వివరించారు. ఈ ఎముక ఏ జంతువు ది? ఎన్ని సంవత్సరాల క్రితం నాటిదో తెలియాలంటే కార్బన్ డేటింగ్ పరీక్ష అవసరమని అన్నారు. ఇది ఖర్చుతో కూడు కున్నదని, ఎముక ఏ జంతువుదో తెలుసుకోవాలంటే విదేశాలకు పంపాల్సి ఉంటుందని చెప్పారు. పురావస్తు శాఖ కోరితే వారికి అందజేయనున్నట్లు పేర్కొన్నారు. పొట్టిగుట్ట వద్ద గుర్తించిన డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్‌రెడ్డి -
నేటినుంచి సన్న బియ్యం
జనగామ: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. నేడు(మంగళవారం) సూర్యాపేటలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. అనంతరం జిల్లాలో కలెక్టర్ రిజ్వాన్ బాషా పర్యవేక్షణలో బియ్యం పంపిణీ మొదలవుతుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే జిల్లాకు 50 శాతానికి పైగా సన్న బియ్యం రేషన్ దుకా ణాలకు చేరాయి. జిల్లాలోని 12 మండలాల పరిధిలో 335 రేషన్ దుకాణాలు ఉన్నాయి. మొత్తం రేషన్ కార్డులు 1,61,472 ఉండగా.. అందులో అంత్యోదయ 10,754, అన్నపూర్ణ 90, తెల్లరేషన్ కార్డులు 1,50,628 ఉన్నాయి. ఆయా కార్డుల్లో 4,87,864 మంది కుటుంబ సభ్యులు ఉన్నారు. ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున నెల కోటా కింద 3,104.764 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం కేటాయించారు. రేషన్ షాపుల్లో పంపిణీకి సిద్ధం జిల్లాలో 335 దుకాణాలు మొత్తం కార్డులు 1,61,472 లబ్ధిదారులు 4,87,864 మంది -
అర్హులు దరఖాస్తు చేసుకునేలా చర్యలు చేపట్టాలి
జనగామ రూరల్: రాజీవ్ యువ వికాసం పథకానికి వీలైనంత ఎక్కువ మంది అర్హులు దరఖాస్తు చేసుకునేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఉపముఖ్య మంత్రి మల్లు భట్టివిక్రమార్క అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో కలిసి హైదరాబాద్ నుంచి కలెక్ట ర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని దాదాపు ఐదు లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతర వెనుకబడిన తరగతుల నిరుద్యోగ యువత ఆర్థికంగా ఎదిగేందుకే ఈ పథకం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. రుణ మాఫీ విధానంపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. దరఖాస్తు చేసుకున్న తర్వాత పత్రాలను పరిధిని బట్టి మున్సి పాలిటీ, ఎంపీడీఓ కార్యాలయాల్లో అందజేయాలని సూచించారు. వీసీలో జిల్లా నుంచి కలెక్టర్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్, బీసీ, ఎస్సీ, ట్రైబల్ వెల్ఫేర్ సంక్షేమ అధికారులు రవీందర్, విక్రమ్, ప్రేమ కళ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మాధవిలత తదితరులు పాల్గొన్నారు. వీసీలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క -
వల్మిడి ఆలయానికి సింహాసనం బహూకరణ
పాలకుర్తి టౌన్: వల్మిడి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి సోమవారం గ్రామానికి చెంది న పెద్దోజు సత్తయ్యచారి జ్ఞాపకార్థం పెద్దోజు నాగరాజుచారి, వీరబ్రహ్మచారి, రమేష్‌చారి సింహాసనం బహూకరించినట్లు ఈఓ సల్వాది మోహన్‌బాబు తెలిపారు. ఆలయ అభివృద్ధికి దాతలు సహకరించాలని ఆయన కోరారు. గుట్టపై పోటెత్తిన భక్తులుదేవరుప్పుల : శ్రీ లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కడవెండి శివారు గుట్టపై వానకొండయ్య జాతరకు సోమవారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ పూజా రి సంపత్కుమారాచార్య ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. మండుటెండల కారణంగా భక్తుల సౌకర్యార్థం మరికొన్ని రోజులు జాతర కొనసాగిస్తున్నట్టు ఉత్సవ కమిటీ బాధ్యులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. భద్రకాళి అమ్మవారికి పుష్పార్చనహన్మకొండ కల్చరల్: వసంత నవరాత్రుల్లో భాగంగా భద్రకాళి దేవాలయంలో సోమవా రం అమ్మవారికి పుష్పార్చన చేశారు. ఉదయం అర్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో అమ్మవారికి నిర్మాల్యసేవలు, నిత్యాహ్నికం అనంతరం వేదపండితులు, వేదపాఠశాల విద్యార్థులు లక్ష తెల్లని చామంతుల తో పుష్పార్చన నిర్వహించారు. దేవాదాయ ధర్మాదాయశాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ కె.దుర్గాప్రసాద్, డీఈఈ సీహెచ్ రమేశ్‌బాబు, ఏఈ వీరచందర్ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈఓ శేషుభారతి, దేవాల య సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
శ్రీరామనవమి ఉత్సవాలు ప్రారంభం
జనగామ: పట్టణంలోని పాతబీటు బజారు ఆవరణలో శ్రీరామనవమి నవరాత్రోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీగణేష్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వేదపండితులు మేళ్ల చెరువు అప్పయ్య శాసీ్త్ర మంత్రోచ్ఛారణల మధ్య జరిగిన వేడుకలకు డీసీపీ రాజ మహేంద్రనాయక్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తెల్లవారు జాము 5గంటలకు పండితులు శాస్త్రోక్తంగా ఉత్సవమూర్తులను మండపానికి తీసుకువచ్చా రు. గణపతి పూజ, అఖండదీపారాధన, ధ్వజా రోహణ తదితర పూజాకార్యక్రమాలను నిర్వహించారు. పాతబీటు బజారులో నిర్వహించే నవరాత్రోత్సవాలు ఏడు దశాబ్ధాలు పూర్తి చేసుకుని 72వ సంవత్సరంలోకి అడుగిడింది. ఈ వేడుకలను తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం డీసీపీ మాట్లాడుతూ సాంప్రదాయాలు, సంస్కృతులు, భక్తికి జనగామ నిలయంగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ గంగిశెట్టి ప్రమోద్ కుమార్, మాజీ అధ్యక్షుడు మహంకాళి హరిశ్చంద్రగుప్త, తాజా, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ పోకల జమున, గోపయ్య, శ్రీకాంత్, వేణు, ద్వారక బజాజ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నేడు(సోమవారం) శ్రీ విష్ణు సహస్ర పారాయణం, 1న సామూహిక పారాయణం, 6న శ్రీరామనవమి నిర్వహించనున్నట్లు కమిటీ ప్రతినిధులు పేర్కొన్నారు. -
వానకొండయ్య జాతరకు పోటెత్తిన భక్తులు
దేవరుప్పుల: లక్ష్మీనర్సింహ్మస్వామి గోవిందా..గోవిందా నామస్మరణంతో వానకొండయ్య జాతరకు ఉగాది పురస్కరించుకొని భక్తులు పోటెత్తారు. మండలంలోని కడవెండి శివారులో హోళీ పండుగతో ప్రారంభమై ఉగాది వరకు జాతర జరగడం ఆనవాయితీగా వస్తోంది. ఆదివారం పూజారీ సంపత్కుమారచార్యుల పర్యవేక్షణలో ప్రత్యేక పూజలు చేయగా జనగామ, సూర్యాపేట, యాదాద్రిభువనగిరి జిల్లాలకు చెందిన భక్తులు పెద్దఎత్తున సంప్రదాయ పద్ధతిలో ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతోపాటు తమ వాహనాలను అలంకరించుకొని చేరుకున్నారు. జాతర ఉత్సవ కమిటీతోపాటు పోలీసు యంత్రాంగం అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టారు. -
వనిత, వాసవీ క్లబ్ గ్రేటర్ జనగామ ఆధ్వర్యంలో..
వాసవీ, వనిత క్లబ్ గ్రేటర్ జనగామ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. క్లబ్ అధ్యక్షురాలు డాక్టర్ మాధవశెట్టి వరూధిని మాట్లాడుతూ నూతన సంవత్సరంలో శుభాలు చేకూరి, లాభాలు ఆర్జించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వాసవీ క్లబ్ గ్రేటర్ జనగామ అధ్యక్షుడు పదకంటి రవీందర్, కార్యదర్శి గట్టు రాధాకృష్ణ, కోశాధికారి కౌకోటి రామారావు, ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్, ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ గంగిశెట్టి ప్రమోద్ కుమార్, ప్రధాన కార్యదర్శి గన్ను నరసింహులు, కోశాధికారి బెజుగం భిక్షపతి, గంగిశెట్టి అనూజ, మాడిశెట్టి కళావతి, ములుగు నాగరాజు, ఉష, తదితరులు పాల్గొన్నారు. -
ఆస్తి పన్ను చెల్లింపునకు నేడు చివరి రోజు
జనగామ: ఆస్తి పన్ను వడ్డీపై 90 శాతం రాయితీతో చెల్లింపునకు నేడు (సోమవారం) చివరి అవకాశమని కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. ఆదివారం కలెక్టర్ మాట్లాడుతూ రంజాన్ పండుగ ఉన్నప్పటికీ మున్సిపల్‌కు ఎటువంటి సెలవు లేదన్నారు. అధికారులు, సిబ్బంది యథావిధిగా పని చేస్తారన్నారు. ఇంటి, నల్లా, ఇతర పన్నులు ప్రజలు సకాలంలో చెల్లించి పట్టణ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. మున్సిపల్ సిబ్బంది అందుబాటులో ఉంటూ, ఆస్తి, నల్ల పన్నులు వసూలు చేయాలని ఆదేశించారు. మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయడంతో పాటు ఆన్లైన్లో ఆస్తి, ఇంటి పన్నులు చెల్లించేందుకు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. బుగులు వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలుచిల్పూరు: ఉగాది పండుగను పురస్కరించుకుని ఆదివారం జనగామ డీసీపీ రాజమహేందర్‌నాయక్ దంపతులు బుగులు వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం ఆలయానికి డీసీపీ దంపతులు చేరుకోగా ఆలయ ఈఓ లక్ష్మిప్రసన్న, చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్‌రావులు స్వాగతం పలికారు. అర్చకులు రవీందర్‌శర్మ, కృష్ణమాచార్యులు వేద మంత్రాల నడుమ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆశీర్వచనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ కుర్రెలం మోహన్, వీరన్న,ఽ ఎస్సై సిరిపురం నవీన్‌కుమార్, ధర్మకర్తలు గనగోని రమేశ్, బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. పూర్వ విద్యార్థుల పాదయాత్ర రఘునాథపల్లి: వారంతా ఖిలాషాపూర్ హై స్కూల్లో కష్టపడి చదువుకున్నారు. వారిలో చాలా మంది పేదలే.. నాడు కష్టపడి చదివి.. నేడు ఉన్నత స్థాయికి ఎదిగారు. తమ జీవితా లకు బాట వేసిన పాఠశాలకు ఏదైనా చేయాలని పూర్వ విద్యార్థులు వినూత్న ఆలోచన చేశా రు. పాఠశాలలో చదివే విద్యార్థులకు విద్య, ఉపాధి పొందడంలో నైపుణ్యం పెంపునకు తోడ్పాటునందించేందుకు ప్రతీ నెల రూ.20కి తగ్గకుండా కార్పస్ ఫండ్ జమ చేస్తున్నారు. కార్పస్ ఫండ్ కార్యక్రమాన్ని ఖిలాషాపూర్ వరకే పరిమితం కాకుండా రాష్ట్రం, జిల్లా, మండల, గ్రామ స్థాయి పాఠశాలల్లో విస్తరింపజేసేందుకు అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ఆది వారం ఖిలాషాపూర్ పాఠశాల నుంచి రఘునాథపల్లి ఎంఈఓ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. ఎస్సై దూదిమెట్ల నరేష్ పాదయాత్రకు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థి, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, 5ఈ ఫౌండర్ కేశిపెద్ది నర్సింహారాజు మాట్లాడారు. ఇప్పటివరకు పూర్వ విద్యార్థులందరు రూ.5 లక్షల కార్పస్ ఫండ్ జమ చేసినట్లు తెలిపారు. పాదయాత్రలో పూర్వ విద్యార్థులు కర్ల కృష్ణవే ణి, మడుపోజు లక్ష్మినారాయణ, ఆలేటి యాదవరెడ్డి, సరాబు వీరన్న, కాయితాల రాజమౌళి, అంగిరేకుల సారయ్యచ మీసాల సుధాకర్, ఉడుత రంజిత్‌యాదవ్, ముప్పిడి శ్రీధర్, అల్లి బిల్లి కృష్ణ, సురిగల భిక్షపతి, రవికుమార్, చంద్రమౌళి, దేవరాజు, చంద్రశేఖర్, సురిగల భిక్షపతి, గుడి రాంరెడ్డి, చంద్రశేఖర్, అంజనేయులు, నాగరాజు, వెంకటేశ్వర్లు, సరస్వతి, అంజ య్య, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. -
ఎల్ఆర్ఎస్ రాయితీని సద్వినియోగం చేసుకోండి
● కలెక్టర్ రిజ్వాన్ బాషా జనగామ రూరల్: ఎల్ఆర్ఎస్పై 25 శాతం రాయితీని దరఖాస్తుదారులు సద్వినియోగం చేసుకోవా లని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నా రు. శనివారం పట్టణలోని మున్సిప ల్ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు, ఆస్తి పన్ను వసూలుపై పురపాలక అధికారులతో సమీక్షించారు. గడువు సమీపిస్తున్న నేపథ్యంలో రాయితీని వినియోగించుకునేలా దరఖాస్తుదారులకు ఫోన్‌చేసి మరోసారి అవగాహన కల్పించాలన్నా రు. అలాగే పన్ను వసూళ్లలో పురోగతి సాధించాలని చెప్పారు. కమిషనర్ వెంకటేశ్వర్లు, మేనేజర్ తదితరులు పాల్గొన్నారు. మహనీయుల జయంతిని ఘనంగా నిర్వహించాలి● అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్ జనగామ రూరల్: మహనీయుల జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ రోహిత్‌సింగ్ అన్నారు. డాక్టర్ బాబూజగ్జీవన్ రా మ్, బీఆర్ అంబేడ్కర్ జయంతి నిర్వహణపై కలెక్టరేట్లో షెడ్యూల్డ్ కులాలు, తెగలు, ఉపకులాలు, వివిధ సంఘాల నాయకులతో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. అనంతరం ఉత్సవ కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా మేడ శ్రీనివాస్, అధ్యక్షుడిగా పారనంది వెంకట స్వామి, ఉపాధ్యక్షులుగా దూసరి ధనలక్ష్మి, కందుకూరి ప్రభాకర్, తిప్పారపు విజయ్, బానోతు ధర్మభిక్షం, ప్రధాన కార్యదర్శులుగా గద్దల సాయికుమార్, కన్నారపు శివశంకర్, గద్దల కిశోర్, కార్యదర్శులుగా బోట్ల శేఖర్, గజ్వెల్లి ప్రతాప్, పాలమాకుల జితేందర్, పత్రి నర్సయ్య, కోశాధికార్శులుగా సుద్దాల కుమారస్వామి, బత్తిని యాదయ్యను ఎన్నుకున్నారు. ఓరుగల్లు సభతో పార్టీకి పూర్వవైభవం● ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి జనగామ : ఓరుగల్లులో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభతో పార్టీకి పూర్వవైభవం సంతరించుకుంటుందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ కల్లబొల్లి హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలన వైఫల్యాలను ప్రజలు చవిచూస్తున్నారని అన్నారు. అంతకు ముందు లబ్ధిదారులకు సీఎంఆర్ చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు. గోదావరిలో నీరు ఉండి, బొమ్మకూరు నుంచి సరఫరా చేసే సామర్థ్యం ఉన్నప్పటికీ ఒక్క చెరువు కూడా నింపకుండా ఈ ప్రాంతాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎడారిగా మార్చిందని అన్నా రు. రుణమాఫీ, రైతుభరోసా ఎక్కడా అని ప్రశ్నించిన ఆయన.. 127 గ్రామాల్లో ఎక్కడైనా వంద శాతం రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే ముక్కు నేలకు రాసి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. -
పట్టుదలతో ఐశ్వర్యం
చదువుల విషయంలో పిల్లలు అత్యుత్తమ ఫలితాలు పొందేలా విజేతలుగా నిలిచేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. పిల్లలు తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా వారికి భారం తగ్గించేలా పార్ట్‌టైం జాబ్‌లు చేసి డబ్బు సంపాదించడం అలవర్చుకోవాలి. నగరంలో కాకతీయ మెడికల్ కాలేజీ దగ్గర కొందరు బీటెక్ విద్యార్థులు సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు మొబైల్ టిఫిన్ సెంటర్‌ను నడుపుతూ వారి తల్లిదండ్రులకు ఆసరాగా నిలుస్తున్నారు.. కొత్త కొలువులు సాధించేందుకు పట్టుదలతో కృషి చేయాలి. ఆ కుటుంబం ఆర్థికంగా ఉన్నతంగా నిలుస్తుంది. యువకులు ఈ దిశగా పండుగరోజు తొలిఅడుగు వేయాలని ఆశిద్దాం. -
పంటలు ఎండుతున్నా పట్టదా..?
● వెల్దండ రిజర్వాయర్ వద్ద రైతుల నిరసన నర్మెట: ‘పంటలు ఎండుతున్నా పట్టించుకోరా.. రూ.లక్షలు పెట్టుబడి పెట్టి సాగు చేస్తే.. చెరువులు, కుంటల్లో చుక్కనీరు లేదు.. బోర్లు వట్టిపోయాయి.. నాలుగు రోజుల నుంచి రిజర్వాయర్‌లోకి వస్తున్న నీటిని ఎగువకు పంపిస్తున్నారు.. తూములు తీస్తే కేసులు పెడతారా.. ఇదెక్కడి న్యాయం’ అంటూ వెల్దండ గ్రామ రైతులు శనివారం నిరసనకు దిగారు. జేసీబీతో తూమును తెరవడానికి రైతులు ప్రయత్నించగా.. అధికారుల నుంచి ఫోన్ రావడంతో చేసేదిలేక నిరసనకు దిగారు. రెండురోజుల్లో కాల్వల ద్వారా నీరు విడుదల చేయకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని, జిల్లా కేంద్రంలోని ఇరిగేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఆందోళన కార్యక్రమంలో రైతులు కల్యాణం మల్లేషం, నాగపురి చంద్రయ్య, రావుల సోమిరెడ్డి, కాసర్ల శ్రీరాములు, చిర్ర మల్లారెడ్డి, నాగపురి సత్తయ్య, ఆగమల్ల ప్రేమ్‌కుమార్, అంజిరెడ్డి, పంతంగి రామయ్య, కుమార్, సత్యనారాయణ, సిద్దులు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజలు సుఖంగా ఉండాలి
జనగామ: ఉగాదితో ప్రారంభమయ్యే తెలుగు సంవత్సరాదిలో జిల్లా ప్రజలు సుఖసంతోషా లతో ఉండాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ఆకాంక్షించారు. ఉగాది పండుగ నేపథ్యంలో ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశా రు. కుటుంబ సభ్యులతో పండుగను ఆనందో త్సాహాల మధ్య జరుపుకోవాలని కోరారు. వ్యవసాయ మార్కెట్లకు వరుస సెలవులుజనగామ/స్టేషన్‌ఘన్‌పూర్ : జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ వ్యవసాయ మార్కెట్లకు ఈనెల 30 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు. 30న ఉగాది పండుగ, 31న రంజా న్, మరుసటిరోజు ఒకటో తేదీన మార్కెట్లు బందుంటాయి. వరుస సెలవుల నేపథ్యంలో రైతులు వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించడానికి తీసుకురావొద్దని జనగామ మార్కెట్ చైర్మన్ బనుక శివారజ్ యాదవ్, స్టేషన్‌ఘన్‌పూర్ మార్కెట్ చైర్పర్సన్ జూలుకుంట్ల లావణ్యశిరీష్‌రెడ్డి వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. మార్కెట్లు రెండో తేదీ పునఃప్రారంభం అవుతా యని తెలిపారు. వాస్తు నిపుణుడికి పురస్కారంజనగామ: విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం అందించే పురస్కారాని కి జనగామకు చెందిన జ్యోతిష్య వాస్తు నిపుణుడు బెలిగినమఠం శివకుమార్ ఎంపికయ్యారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఆదివారం నిర్వహించే పురస్కారాల ప్రదానం కార్యక్రమానికి హాజరుకావాలని దేవాదాయ శాఖ కమిషనర్ నుంచి పిలుపు వచ్చింది. సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా నేడు పురస్కారం అందుకోనున్నారు. -
శని సంచారం నుంచి విముక్తి
జనగామ: నూతన తెలుగు సంవత్సరాది విశ్వావసు నామసంవత్సర ఉగాది పండుగ నుంచి జిల్లాకు శని సంచారం నుంచి విముక్తి లభిస్తుందని, చక్కని అభివృద్ధి సాధిస్తుందని ప్రముఖ వేద పండితుడు మేళ్లచెరువు అప్పయ్యశాస్త్రి పేర్కొన్నారు. జిల్లా కేంద్రానికి చెందిన ఆయన ఆరు దశాబ్దాలుగా పంచాంగ పఠనం చేస్తూ భక్తుల ఆదరాభిమానాలు చూరగొంటున్నారు. ఉగాది పండుగ(నేడు) పురస్కరించుకుని ఈ ఏడాది జిల్లా యోగం ఎలా ఉండబోతున్నదనే విషయాలను వెల్లడించారు. అవి ఆయన మాటల్లోనే.. ఆదాయం, ఖర్చు ఇలా.. విశ్వావసు నామ సంవత్సరంలో జిల్లాలో సంపద సృష్టి రాబోతున్నది. ఏడున్నరేళ్ల శని సంచారం నుంచి విముక్తి కలిగి అభివృద్ధి దిశగా అడుగులు వేయబో తోంది. ఆదాయం–8 , ఖర్చు–14, రాజ్యపూజ్యం–5, అవమానం–5. ప్రజలు, రాజకీయ నాయకుల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఆహార, ఆరోగ్య పరంగా బాగుంటుంది. పరిపాలన బాగుంటుంది. మేఘాలు ఆలస్యంగా వచ్చినా.. సమృద్ధిగా వర్షాలు కురుస్తాయి. ఎర్రని నేలల్లో పెసర్లు, వేరుశనగలు, నువ్వులు, పచ్చజొన్నలు, బొబ్బెర్లు బాగా పండుతాయి. లెక్కల విషయంలో(ఏ శాఖ అయినా, ఇతర సంస్థలైనా) చాలా తప్పులు జరుగుతాయి. దొంగ లెక్కలు ఎక్కువగా చూపించే అవకాశం ఉంది. పరిపాలన చేసే వారు ఆచితూచి ముందుకు వెళ్లాలి. జనగామ రాశి ప్రకారం సున్నాలు ఉండవు. అప్పులు చేయాల్సిన అవసరం ఉండదు. అన్నింట్లో విజయం సాధించే అవకాశం ఉంది. జిల్లాకు అభివృద్ధి యోగం ఎర్రని నేలల్లో పంటల దిగుబడి ఆదాయం–8, ఖర్చు–14, రాజ్యపూజ్యం–4 మేళ్లచెరువు అప్పయ్యశాస్త్రి వెల్లడి -
సంప్రదాయాల చిహ్నం
జనగామ : ఉగాది పండుగ మన సంస్కృతీ సంప్రదాయాలకు చిహ్నం. బంధుమిత్రులతో కలిసి ఈ పండుగ చేసుకోవడం ఆనందంగా ఉంటుంది. పండగ రోజు సంప్రదాయంగా చీర కట్టుకోవడం ఎంతో త్రిల్లింగ్‌గా ఉంటుంది. ప్రకృతిలో లభించే పదార్థాలతో చేసే ఉగా ది పచ్చడి అంటే నాకు ఎంతో ఇష్టం. షడ్రుచుల సమ్మేళనాన్ని ఆస్వాదించడమంటే ప్రకృతితో మనం మమేకం అయ్యామనే భావన కలుగుతుంది. మా అమ్మ కూడా అనేక రకాల మొక్కలు పెంచుతూ ప్రకృతిని కాపడుతుంది. – పి.స్థుతి, విద్యార్థిని, ఇంటర్ సెకండియర్, జనగామ -
నేర్చుకుంటేనే విజయం...
విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయసాధించాలంటే ఎంతో సాధన అవసరం. అందుకు దినపత్రికలు, కొంతమేర సెల్‌ఫోన్ ఉపయోగపడుతాయి. ఇటీవల ఉమ్మడి జిల్లానుంచి అనేకమంది గ్రూప్–1, 2లో ఉద్యోగాలు సాధించారు. గ్రూప్–1లో శాయంపేట మండలం తహరాపూర్‌కు చెందిన తేజస్వినీరెడ్డి రాష్ట్రస్థాయి మొదటి ర్యాంకు సాధించింది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం ముల్కలపల్లికి చెందిన మేకల ఉపేందర్ రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించాడు. ‘ఏకాగ్రతతో చదువుతూ విజయం సాధించాలి.’అని సదరు ర్యాంకర్లు చెబుతున్న మాట. వ్యాపారాల్లోనూ సమయాన్ని వృథా చేయకుండా సరైన ఆలోచనలు చేస్తూ కొనసాగించాలి అప్పుడే లాభాలు గడిస్తూ విజయాన్ని సాధించవచ్చు. -
జీవనయానంలో ఎన్నో ఒడిదొడుకులు..
● జీవితపరమార్థం తెలిపే ఆరు రుచులు ● ఉగాదికి కొత్తదారిలో అడుగులేద్దాం.. ● శ్రీవిశ్వావసు తెలుగు సంవత్సరాదికి స్వాగతం జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను సమానంగా స్వీకరించి సంతోషంగా ముందుకు సాగాలని తెలిజేసేదే ఉగాది పచ్చడి పరమార్థం. షడ్రుచులు అంటే తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు. అలాగే సంతోషం, విచారం, ఐశ్వర్యం, పేదరికం, విజయం, పరాజయం ఆరు రుచుల మిశ్రమమే జీవితం. ఈ ఏడాది షడ్రుచుల సమ్మేళనంతో అందరి జీవితాలు సాగిపోవాలని ఆకాంక్షిస్తూ శ్రీవిశ్వావసు తెలుగు సంవత్సరాదికి స్వాగతం పలుకుదాం.. – హన్మకొండ కల్చరల్ -
పంచాంగ రచనలో దిట్ట
డాక్టర్ సిద్ధాంతి అవసరాల ప్రసాద్‌శర్మ దేవరుప్పుల : స్థానిక శ్రీ కన్యాకాపరమేశ్వరి ఆలయం పూజారిగా వ్యవహరిస్తూనే.. పదేళ్లుగా పంచాంగం రచిస్తున్నారు డాక్టర్ సిద్ధాంతి అవసరాల ప్రసాద్‌శర్మ. శ్రీ చండీ పరమేశ్వరీ పీఠాన్ని స్థాపించిన ఆయన.. భారత ప్రభుత్వ సమ్మత దృగ్గణీత పంచాంగం ఐదు వందల ప్రతులతో ప్రారంభించారు. ఈ పంచాంగం హైదరాబాద్ కేంద్రంగా ముహూర్తాలతో అమరావతి, విశాఖపట్నం, తిరుపతి ప్రాంతాలకు విస్తరించడం విశేషం. భారత దేశంలోనే కాకుండా అమెరికా కాలమానం ప్రకారం పంచాంగం రచించారు. ముహూర్త సమయ సవరణ, భవిష్యత్ వాణితో రూపొందించిన ఈ పంచాంగాన్ని ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా ఆవిష్కరించారు. ఇప్పటి వరకు ఏపీశర్మ 25వేల పంచాంగాలను ప్రజలకు పంపిణీ చేశారు. -
అటవీ ప్రాంతం : 2వేల హెక్టార్లు పశువులు : 2.50 లక్షలు గొర్రెలు, మేకలు : 11 లక్షలు నీటి తొట్లు అవసరం : 325 ఏర్పాటు చేసింది : 95
వినియోగంలో ఉన్నవి : 50శాతంజిల్లాలో 2వేల హెక్టార్ల పరిధిలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ఇక్కడ ఎలుగుబంట్లు(రఘునాథపల్లి), చుక్కల దుప్పులు, జింకలు(అశ్వరావుపల్లి, తాటికొండ) హైనాలు (నర్మెట) అధికంగా ఉన్నాయి. జాతీయ పక్షి అయిన నెమళ్లు మాత్రం దాదాపు అన్ని ప్రాంతాల్లో సంచరిస్తున్నాయి. కాగా తెలుపు, నలుపు రంగు పశువులు 2.50 లక్షలు ఉండగా, గొర్రెలు, మేకలు 11లక్షల వరకు ఉంటాయి. అటవీ శాఖ ఆధ్వర్యాన మూగ జీవాలు, పక్షుల దాహార్తి తీర్చేందుకు నీటి చెలిమలు, కుంటలు, అలాగే ఎనిమిది ప్రదేశాల్లో నీటితొట్లు ఏర్పాటు చేసి నెలకు మూడు నాలుగు సార్లు నీటిని నింపుతున్నా రు. జిల్లాలో 325 నీటి తొట్లు అవసరం ఉండగా పశుసంవర్థక శాఖ 95 ఏర్పాటు చేసింది. ఇందులో ఉపయోగంలో ఉన్నవి 50 కాగా.. 45 చోట్ల చిన్నచిన్న మరమ్మతులు చేయాల్సి ఉందని సిబ్బంది అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వచ్చే రెండు నెలలు గడిచేదెలా..? జిల్లాలో గడిచిన ఎండాకాలం అటవీ ప్రాంతాల్లో తాగడానికి నీరు లభించక మూగ జీవాలు, కొన్ని చోట్ల జంతువులు మృత్యువాత పడినట్లు వార్తలు వచ్చాయి. రియల్ఎస్టేట్ వెంచర్లు, ఇటుక బట్టీలు, రికార్డు స్థాయిలో పంటల సాగు పెరగడంతో జంతు జీవాలకు నీలువ నీడ లేకుండా పోతోంది. మరో వైపు గొంతు తడుపుకోలేని దయనీయ పరిస్థి తి నెలకొంది. మార్చి నెలలోనే ఎండల తీవ్రత పెరి గి గుక్కెడు నీరు దొరక్క మూగ జీవాలు డీ హైడ్రేష న్కు గురవుతున్నాయి. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే.. రాబోయే రెండు నెలల్లో ఉష్ణోగ్రతలు 45 నుంచి 48 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జంతు జీవాలు, పశు పక్షాదుల దాహార్తి తీర్చేందుకు శాశ్వత చర్యలు చేపట్టాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు. దాహం..దాహంఓ వైపు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. మరోవైపు భూగర్భ జలాలు పడిపోతున్నాయి.. నీరు లేక నెర్రలు బారిన చెరువులు.. ఇసుక అక్రమ రవాణాతో ఎడారిని తలపించే వాగులు.. కనుచూపుమేరలో కానరాని చుక్కనీరు.. దాహంతో మూగజీవాలు, పశుపక్షాదులు అల్లాడి పోతున్నాయి. వేసవికి ముందే ప్రణాళికలు సిద్ధం చేయాల్సిన అధికారులు నివేదికలను కాగితాలకే పరిమితం చేస్తున్నారు. ఫలితంగా ప్రతి వేసవిలో జంతుజీవాలకు నీటిగోస తప్పడంలేదు. – జనగామఅల్లాడుతున్న మూగజీవాలు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు పడిపోతున్న భూగర్భ జలాలు నీటి లభ్యత చర్యలు అంతంతే..నీటి సమస్య లేకుండా చర్యలు జిల్లా పరిధి అటవీ ప్రాంతాల్లో సంచరిస్తున్న జంతువులు, మూగ జీవాలకు నీటికి ఇబ్బందిలేకుండా చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం నీటి చెలిమలు, కుంటలు, డ్యాంలు ఉన్న ప్రాంతాల్లో సమస్య మామూలుగా ఉంది. చెరువులు, చెక్ డ్యాంలు ఎండిపోయి నీటి జాడలేని అటవీ ప్రాంతాల్లో 8 చోట్ల నీటి తొట్లు ఏర్పాటు చేసి నెలకు మూడు సార్లు నీటిని నింపుతున్నాం. – కొండల్‌రెడ్డి, ఎఫ్ఆర్ఓ, జనగామ -
విలువ రూ.2లక్షలు.. ఫీజు రూ.1.11కోట్లు
జనగామ: ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లింపుల్లో ఆన్లైన్ తప్పిదాల పరంపర కొనసాగుతూనే ఉంది. వేలల్లో చెల్లించాల్సిన ఫీజును కోట్లలో చూపిస్తుండంతో దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. పట్టణంలో శ్రీనివాస్‌కు చెందిన 200 గజాల స్థలానికి రూ.14కోట్ల మేర ఎల్ఆర్ఎస్ ఫీజు చూపించిన షాక్ మరువక ముందే... మరొకటి పునరావృతమైంది. జనగామకు చెందిన తుప్పతి నర్సింహ కొనుగోలు చేసిన 132.86 చదరపు గజాల స్థలాన్ని (రూ.2లక్షలు) రెగ్యులరైజ్ చేసుకునేందుకు ఎల్ఆర్ఎస్ అప్లయ్ చేశాడు. ప్రభుత్వం ప్రకటించిన 25 శాతం రాయితీతో ఫీజు చెల్లించేందుకు వెబ్ పోర్టల్ ఓపెన్ చేయగా రూ.1,11,92,567 చూపించడంతో శ్రీనివాస్ ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యాడు. ఈ విషయమై స్థానిక మాజీ కౌన్సిలర్ జూకంటి లక్ష్మీశ్రీశైలం దృష్టికి తీసుకు వెళ్లగా.. ఆమె మున్సిప ల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే తప్పిదా న్ని సరిచేిసి ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎల్ఆర్ఎస్ తప్పిదంతో ఆందోళన -
బతుకమ్మకుంట నీటిని మార్చండి
సీఎస్, కలెక్టర్‌కు ఎక్స్‌లో పోస్టు జనగామ: పట్టణ పరిధి బతుకమ్మకుంటలో కంపుకొడుతున్న నీటిని మార్చాలని కోరుతూ జిల్లా కేంద్రానికి చెంది న సిద్ధం శివకుమార్ శుక్రవారం సీఎస్ శాంతికుమారి, కలెక్టర్ రిజ్వాన్ బాషాకు ఎక్స్ ద్వారా ట్వీట్ చేశారు. ‘ఆహ్లాదం కరువు’ శీర్షికన ఈనెల 28న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనా న్ని అన్ని వర్గాల ప్రజలు చదవి.. సమస్యలను గాలికి వదిలేసిన అధికారుల తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. బతుకమ్మకుంట నీటి సమస్యకు పరిష్కారం చూపించాలని డిమాండ్ చేస్తున్నారు.ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి● రాష్ట్ర అధ్యక్షుడు గోధుమల కుమారస్వామి పాలకుర్తి టౌన్: తెలంగాణ ఉద్యమకారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఉద్యమకారుల అకాంక్షల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గోధుమల కుమారస్వామి డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక శ్రీసోమేశ్వర ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన సంఘం సన్నాహక కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. 1,800 మంది ఆత్మబలిదానంతో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని, పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యమ ద్రోహులను పార్టీలో చేర్చుకొని అధికార లాంఛనాలతో అందలమెక్కించి ఉద్యమకారులను విస్మరించిదని విమర్శించారు. ఏప్రిల్ 20న పాలకుర్తిలో ఉద్యమకారుల సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో సంఘం జిల్లా ఇన్చార్జ్ పోలాస సోమయ్య, మూల ప్రభాకర్, సింగ మహేందర్‌రావు, పులిగిళ్ల యాకయ్య, కత్తుల సుధాకర్, నారగోని ఎల్లయ్య, ఎడవల్లి దండయ్య, అరూరి సోమయ్య, గుగ్గిళ ఎల్లయ్య, నక్క లింగ య్య, యాదవరెడ్డి, రాములునాయక్, కొండోజు వేణు తదితరులు పాల్గొన్నారు. -
హామీలన్నీ నెరవేరుస్తాం..
● పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి కొడకండ్ల/దేవరుప్పుల : ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అన్నారు. శుక్రవారం కొడకండ్ల మండలం నీలిబండతండా, దేవరుప్పుల మండలం మాధాపురం రెవెన్యూ పరిధి లాకావత్తండా(ఎం)లో ఇందిరమ్మ గృహాల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఆమె మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులపాలు చేయడంతో ఆర్థిక భారం ఉన్నా సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తోందని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదని, కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చాక నియోజకవర్గ వ్యాప్తంగా 3,500 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు. కార్యక్రమాల్లో లక్ష్మీనారాయణనాయక్, నల్ల శ్రీరాములు, సత్యనారాయణ, ఉప్పల సురేష్ బాబు, డి.అనిల్, యాకస్వామి, సురేష్ నాయక్, నాగరాజు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. -
చివరి తేదీ : 29–03–2025
9వసంతాలకు అనాది. శుభాలకు పునాది. తెలుగు సంవత్సరాది.. ఉగాది. కోయిలమ్మ కమ్మని స్వరాల నడుమ, షడ్రుచుల మేళవింపులో కోటి ఆశలకు రెక్కలు తొడుగుతూ వచ్చే వేడుక ఇది. తెలుగుదనం ఉట్టిపడేలా.. సంప్రదాయానికి జీవం పోసేలా సాగే పర్వదినమిది. కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే వేళ కవుల భావాలకు ‘సాక్షి’ అక్షరరూపం ఇస్తోంది. మరింకెందుకాలస్యం.. కలాలు కదిలించండి.. ఉగాదిపై కవితలు రాయండి. జనగామశనివారం శ్రీ 29 శ్రీ మార్చి శ్రీ 2025 -
ఉన్నఫలంగా 185 మంది లోకో రన్నింగ్ కార్మికుల సంఖ్య తగ్గింపు
లోకోపైలెట్ల పోస్టులను తగ్గిస్తూ.. కాజీపేట క్రూ డిపో కేంద్రంగా 2020లో 623మంది లోకోపైలెట్లతో నడిచింది. 2023 నవంబర్ నాటికి ఆ సంఖ్య 501కి తగ్గింది. 2025 మార్చి నాటికి 470 పోస్టులకు పడిపోయింది. ఈ విధంగా రోజురోజుకూ కాజీపేట క్రూ డిపో స్థాయిని తగ్గిస్తున్నట్లు లోకోపైలెట్లు ఆందోళన చెందుతున్నారు. 2020 మేలో కేటాయించిన పోస్టుల సంఖ్య 790 కాగా బుధవారం నాడు అధికారులు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం 542 పోస్టులకు పడిపోయిందని, గత 5 ఏళ్లలో 248 పోస్టులు తొలగించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉత్తర్వులు జారీచేసిన దక్షిణ మధ్య రైల్వే●● స్థానిక రైల్వే క్రూ లాబీ నిర్వీర్యమయ్యే ప్రమాదం ● గతంలోనే క్రూ లింక్‌ల తరలింపు.. ● ఆందోళనలో కాజీపేట రన్నింగ్ స్టాఫ్ ● ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు పట్టించుకోవాలని విజ్ఞప్తికాజీపేట రూరల్: ఉత్తర, దక్షిణ దేశప్రాంతాలకు గేట్ వేగా ఉంటున్న కాజీపేట జంక్షన్‌ను రైల్వే డివిజన్ కేంద్రంగా కాకుండా కొందరు ప్రయత్నిస్తున్నారా.. అంటే తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. ఇందులో భాగంగానే ముందస్తు ఆలోచనతో గతంలో క్రూ లింక్‌లను విజయవాడకు తరలించడం.. తాజాగా లోకోపైలెట్లు, అసిస్టెంట్ లోకోపైలెట్ల సంఖ్యను తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం వల్ల కాజీపేట డివిజన్ కలను క్రమక్రమంగా నిర్వీర్యం చేస్తున్నారన్న విషయం స్పష్టమవుతోంది. ఇక్కడి ప్రజల చిరకాల కోరిక అయిన రైల్వేడివిజన్ అయితే ఉన్నతాధికారులు విజయవాడ, సికింద్రాబాద్ విడిచి స్థానికంగానే ఉండాల్సి వస్తుందన్న ఆలోచనతో ముందస్తుగా అడ్డురాయి వేసినట్లు స్థానిక లోకోపైలెట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్ని అర్హతలు ఉన్నా.. అడ్డంకులు నిజాం రైల్వే కాలంలో ఏర్పాటైన కాజీపేట జంక్షన్ దినాదినాభివృద్ధి చెంది ఒక డివిజన్‌కు కావాల్సిన అన్ని అర్హతలు సంపాదించకుంది. ఉద్యోగాల సంఖ్య పెరగడంతో పాటు స్థానికులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయనే ఆశతో ఉన్నారు. ఈ క్రమంలోనే రైల్వే వ్యాగన్, కోచ్‌ఫ్యాక్టరీలు రావడంతో ప్రజల ఆశలు పెరిగాయి. తదనంతరం కాజీపేట రైల్వే డివిజన్‌కు అడుగులు పడుతు న్న నేపథ్యంలో కొందరు రైల్వే అధికారులు కాకుండా కుట్రకు పాల్పడుతున్నారని లోకోపైలెట్లు, రైల్వే నాయకులు అంటున్నారు. గూడ్స్ లోకోపైలెట్ల సంఖ్య సైతం తగ్గింపు.. కాజీపేట క్రూ డిపో కేంద్రంగా గూడ్స్ లోకోపైలెట్ల పోస్టులను కూడా తగ్గిస్తున్నారని లోకోపైలెట్లు అంటున్నారు. గూడ్స్ లోకోపైలెట్ల నుంచి సీనియార్టీ ప్రకారం పదోన్నతి కల్పిస్తూ ప్యాసింజర్ లోకో పైలెట్, మెయిల్ ఎక్స్‌ప్రెస్ లోకో పైలెట్ ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది. కానీ, విజయవాడలో ఉన్న సికింద్రాబాద్ డివిజన్‌కు చెందిన క్రూ డిపోలో ఖాళీలను పెంచి భర్తీ చేశారని తెలిపారు. ఈ విధంగా చేయడం వల్ల కాజీపేటకు చెందిన సంబంధిత కోచింగ్ ఖాళీల్లో గూడ్స్ లోకోపైలెట్లు 30మంది పనిచేస్తున్నారని తెలిపారు. అధికారులు రిక్వెస్ట్ బదిలీలను పరిగణనలోకి తీసుకోకపోవడంతో కాజీపేట రైల్వే క్రూ డిపో స్థాయి రోజురోజుకూ తగ్గుతున్నదని లోకోపైలెట్లు ఆందోళన చెందుతున్నారు. విశాఖ రైల్వేజోన్ కోసమేనా? విశాఖపట్టణం కేంద్రంగా నూతన రైల్వే జోన్ ఏర్పాటు అవుతున్న నేపథ్యంలో ఈ జోన్‌ను అభివృద్ధి చేసేందుకు కొందరు అధికారులు ఇదంతా చేస్తున్నారని లోకోపైలెట్లు అంటున్నారు. విజయవాడ డివిజన్ విశాఖ రైల్వే జోన్ పరిధిలోకి వస్తుందని, కాజీపేటలో లోకోపైలెట్ల సంఖ్యను తగ్గించి వారిని విజయవాడలో సికింద్రాబాద్‌కు చెందిన లోకోపైలెట్లుగా పనిచేస్తున్న డిపోలలో కలుపుతున్నట్లు పేర్కొంటున్నారు. ఇప్పటికై నా ఉమ్మడి జిల్లా ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, రైల్వే ట్రేడ్ యూనియన్ల నాయకులు రైల్వే జీఎం, రైల్వే బోర్డుపై ఒత్తిడి తీసుకువచ్చి కాజీపేట క్రూ డిపోను నిర్వీర్యం కాకుండా, కాజీపేట డివిజన్ ఏర్పాటు కోసం ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని లోకోపైలెట్లు కోరుతున్నారు. -
వేంకటేశ్వరుడికి ప్రత్యేక అలంకరణ
చిల్పూరు: భూనీల సమేత శ్రీ బుగులు వేంకటేశ్వరస్వామిని శుక్రవారం పుష్ప, తులసీ దళాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ప్రధాన అర్చకులు రవీందర్‌శర్మ, అర్చకులు రంగాచార్యులు, కృష్ణమాచార్యుల ఆధ్వర్యాన శ్రీవారికి పంచామృత చందన హరిద్ర కుంకుమాది విలేపనములు, బహువిధ ఫల రసాదులతో అభిషేకం నిర్వహించారు. ఏర్పాట్లను ఈఓ లక్ష్మీప్రసన్న, చైర్మన్ శ్రీధర్‌రావు పర్యవేక్షించారు. టెన్త్ పరీక్షలకు ఐదుగురు విద్యార్థుల గైర్హాజరుజనగామ రూరల్: జిల్లాలో శుక్రవారం నిర్వహించిన పదో తరగతి భౌతిక రసాయన శాస్త్రం పరీక్షకు ఐదుగురు విద్యార్థులు గైర్హాజరయ్యా రు. మొత్తం 6,238 మంది విద్యార్థులకు 6,233 పరీక్ష రాసినట్లు డీఈఓ రమేశ్ తెలిపా రు. రఘునాథపల్లిలోని నిడిగొండ పాఠశాల సెంటర్‌ను రాష్ట్ర పరీక్షల అధికారి టి.రవికుమార్‌తో కలిసి డీఈఓ సందర్శించారు. దూరవిద్య పరీక్షల్లో 8 మంది డీబార్కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ కోర్సుల మొదటి సెమిస్టర్ పరీక్షలు 11 కేంద్రాల్లో కొనసాగుతున్నాయి. శుక్రవారం నిర్వహించిన డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్షల్లో జనగామ జిల్లా కేంద్రంలోని ఏబీవీ డిగ్రీ కాలేజీ పరీక్ష కేంద్రంలో కాపీయింగ్ చేస్తూ 8 మంది పట్టుబడ్డారు. వారిని డీబార్ చేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ పద్మజ తెలిపారు. రిజిస్ట్రేషన్ శాఖలో బదిలీలు కాజీపేట అర్బన్: రిజిస్ట్రేషన్ శాఖలోని ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధి వరంగల్ ఆర్వో, జనగా మ, భూపాలపల్లి, పరకాలలో విధులు నిర్వహిస్తున్న పలువురు జూనియర్ అసిస్టెంట్లు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను బదిలీ చేస్తూ జిల్లా రిజిస్ట్రార్ ఫణీందర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ ఆర్వోలో విధులు నిర్వహిస్తున్న జూనియర్ అసిస్టెంట్‌ను జనగామకు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని పరకాలకు, పరకాలలో విధులు నిర్వహిస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని వరంగల్ ఆర్వోకు, భూపాలపల్లిలో విధులు నిర్వహిస్తున్న జూనియర్ అసిస్టెంట్‌ను వరంగల్ ఆర్వోకు, జనగామలో విధులు నిర్వహిస్తున్న జూనియర్ అసిస్టెంట్‌ను భూపాలపల్లికి బదిలీ చేశారు. -
మంటలు
మార్చిలోనే..నిర్మానుష్యంగా ఫ్లై ఓవర్● 39 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు ● దాహంతో అల్లాడుతున్న ప్రజలు ● మధ్యాహ్నం 12 దాటితే రహదారులు నిర్మానుష్యం ● ఏప్రిల్, మే నెలల్లో రికార్డు బ్రేక్ చేసే అవకాశంజనగామ: ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతూ ఎండలు మండుతున్నాయి. వేడి గాలులతో ప్రజలు డీ హైడ్రేషన్‌కు గురవుతున్నారు. మధ్యాహ్నం 12 గంటలు దాటితే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. మార్చిలోనే ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని మండలాలతోపాటు పట్టణంలోని ప్రధాన కూడళ్లలో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నప్పటికీ.. పనుల నిమిత్తం జిల్లా కేంద్రానికి వచ్చే వేలాది మందికి ఇవి సరిపోవడం లేదు. దీంతో దాహంతో అల్లాడిపోతూ.. వాటర్ బాటిళ్లు కొనుగోలు చేస్తున్నారు. కొబ్బరి నీళ్లు, సోడా, మజ్జిక, జ్యూస్, ఇతర పానీ యాలు తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముంజలు, కొబ్బరి బొండాలకు గిరాకీ పెరిగింది. ప్రస్తుతం నమోదవుతున్న ఉష్ణోగ్రతలు పిల్లలు, వృద్ధులపై కొంత ప్రభావం చూపుతున్నా యి. బయటకు వచ్చే సమయంలో వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చిరు వ్యాపారులు, కూలీలకు కష్టాలు రెక్కాడితే గాని పూటగడవని ఫుట్‌పాత్, చిరు వ్యాపారులు, కూలీలు, కార్మికులకు వేసవి కష్టాలు తప్పడం లేదు. రోజువారీ పనులకు వెళ్లేవారు ఇంటిపట్టున ఉంటే పూట గడవని పరిస్థితి నెలకొంది. దీంతో మండుటెండల్లోనూ పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. నిప్పుల కొలిమి గురువారం ఉష్ణోగ్రతలు 39 డిగ్రీల సెల్సీఎ్స్ నమో దు కావడంతో జిల్లా నిప్పుల కొలిమిని తలపించింది. ఉదయం 9 గంటలకే ఉక్కపోత మొదలైంది. ఏప్రిల్ మొదటి వారం నుంచి మరో 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతా వరణ శాఖ హెచ్చరిస్తోంది. అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పెరిగిన ఏసీ, కూలర్ల వినియోగం ఎండల తీవ్రతతో మధ్య తరగతి కుటుంబాల నుంచి సంపన్నుల వరకు చల్లని వాతావరణం కోసం తపించిపోతున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఏసీ, కూలర్ల వినియోగం పెరిగింది. ఇప్పటి వరకు ఫ్యాన్, కూలర్లతో సరిపెట్టుకున్న చాలా కుటుంబాలు ఉక్కపోత భరింత లేక అప్పుచేసైనా ఏసీ కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. రిఫ్రిజిరేటర్లకు సైతం డిమాండ్ పెరుగుతోంది. చాలా జాగ్రత్తగా ఉండాలి వేడిగాలులు, ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వాతావరణంలో తేమశాతం పడిపోతున్నది. లవణాలు చెమటల రూపంలో బయటకు వెళ్తుండడంతో శరీరంలోని నీటి శాతం తగ్గుతోంది. ఈ సమయంలో బయటకు వెళ్లక పోవడమే ఉత్తమం. ఇంట్లో ఉన్నా వేడిగాలి వస్తుంది. కిటికీల వద్ద కాటన్ దుస్తులు లేదా గడ్డి ఏర్పాటు చేసుకు ని నీటిని చల్లాలి. ఇలా చేస్తే వృద్ధులు, పిల్లలకు వడదెబ్బ తగలకుండా నివారించవచ్చు. వడదెబ్బ తగిలితే నీరసం, కండరాలు, తలనొప్పి ఉంటుంది. ఈ సమయంలో మజ్జికలో ఉప్పు, చెక్కర కలుపుకుని తాగాలి. అలాగే ఓఆర్ఎస్, కొబ్బరినీళ్లు తీసుకోవచ్చు. పుచ్చ, నిమ్మరసం, సంత్రా రసం తీసుకో వాలి. మట్టికుండలోని తాగునీరు శ్రేయస్కరం. – డాక్టర్ అశోక్‌కుమార్, జనగామతేదీ కనిష్టం గరిష్టం 20 28 36 21 27 35 22 26 35 23 27 33 24 28 33 25 26 34 26 28 38 27 29 39