వినియోగంలో ఉన్నవి : 50శాతం
జిల్లాలో 2వేల హెక్టార్ల పరిధిలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ఇక్కడ ఎలుగుబంట్లు(రఘునాథపల్లి), చుక్కల దుప్పులు, జింకలు(అశ్వరావుపల్లి, తాటికొండ) హైనాలు (నర్మెట) అధికంగా ఉన్నాయి. జాతీయ పక్షి అయిన నెమళ్లు మాత్రం దాదాపు అన్ని ప్రాంతాల్లో సంచరిస్తున్నాయి. కాగా తెలుపు, నలుపు రంగు పశువులు 2.50 లక్షలు ఉండగా, గొర్రెలు, మేకలు 11లక్షల వరకు ఉంటాయి. అటవీ శాఖ ఆధ్వర్యాన మూగ జీవాలు, పక్షుల దాహార్తి తీర్చేందుకు నీటి చెలిమలు, కుంటలు, అలాగే ఎనిమిది ప్రదేశాల్లో నీటితొట్లు ఏర్పాటు చేసి నెలకు మూడు నాలుగు సార్లు నీటిని నింపుతున్నా రు. జిల్లాలో 325 నీటి తొట్లు అవసరం ఉండగా పశుసంవర్థక శాఖ 95 ఏర్పాటు చేసింది. ఇందులో ఉపయోగంలో ఉన్నవి 50 కాగా.. 45 చోట్ల చిన్నచిన్న మరమ్మతులు చేయాల్సి ఉందని సిబ్బంది అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
వచ్చే రెండు నెలలు గడిచేదెలా..?
జిల్లాలో గడిచిన ఎండాకాలం అటవీ ప్రాంతాల్లో తాగడానికి నీరు లభించక మూగ జీవాలు, కొన్ని చోట్ల జంతువులు మృత్యువాత పడినట్లు వార్తలు వచ్చాయి. రియల్‌ఎస్టేట్ వెంచర్లు, ఇటుక బట్టీలు, రికార్డు స్థాయిలో పంటల సాగు పెరగడంతో జంతు జీవాలకు నీలువ నీడ లేకుండా పోతోంది. మరో వైపు గొంతు తడుపుకోలేని దయనీయ పరిస్థి తి నెలకొంది. మార్చి నెలలోనే ఎండల తీవ్రత పెరి గి గుక్కెడు నీరు దొరక్క మూగ జీవాలు డీ హైడ్రేష న్‌కు గురవుతున్నాయి. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే.. రాబోయే రెండు నెలల్లో ఉష్ణోగ్రతలు 45 నుంచి 48 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జంతు జీవాలు, పశు పక్షాదుల దాహార్తి తీర్చేందుకు శాశ్వత చర్యలు చేపట్టాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు.
దాహం..దాహం
ఓ వైపు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. మరోవైపు భూగర్భ జలాలు పడిపోతున్నాయి.. నీరు లేక నెర్రలు బారిన చెరువులు.. ఇసుక అక్రమ రవాణాతో ఎడారిని తలపించే వాగులు.. కనుచూపుమేరలో కానరాని చుక్కనీరు.. దాహంతో మూగజీవాలు, పశుపక్షాదులు అల్లాడి పోతున్నాయి. వేసవికి ముందే ప్రణాళికలు సిద్ధం చేయాల్సిన అధికారులు నివేదికలను కాగితాలకే పరిమితం చేస్తున్నారు. ఫలితంగా ప్రతి వేసవిలో జంతుజీవాలకు నీటిగోస తప్పడంలేదు.
– జనగామ
అల్లాడుతున్న మూగజీవాలు
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
పడిపోతున్న భూగర్భ జలాలు
నీటి లభ్యత చర్యలు అంతంతే..
నీటి సమస్య లేకుండా చర్యలు
జిల్లా పరిధి అటవీ ప్రాంతాల్లో సంచరిస్తున్న జంతువులు, మూగ జీవాలకు నీటికి ఇబ్బందిలేకుండా చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం నీటి చెలిమలు, కుంటలు, డ్యాంలు ఉన్న ప్రాంతాల్లో సమస్య మామూలుగా ఉంది. చెరువులు, చెక్ డ్యాంలు ఎండిపోయి నీటి జాడలేని అటవీ ప్రాంతాల్లో 8 చోట్ల నీటి తొట్లు ఏర్పాటు చేసి నెలకు మూడు సార్లు నీటిని నింపుతున్నాం.
– కొండల్‌రెడ్డి, ఎఫ్‌ఆర్‌ఓ, జనగామ