
సన్న బియ్యం పంపిణీ విప్లవాత్మక నిర్ణయం
● ఎమ్మెల్యే కడియం శ్రీహరి
జనగామ: రాష్ట్రంలో పేదలకు రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ సీఎం రేవంత్‌రెడ్డి తీసుకున్న విప్లవాత్మక నిర్ణయమని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం పరిధి పలు మండలాల రేషన్ దుకా ణాలకు సంబంధించి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఆయన బుధవారం కలెక్టరేట్‌లో ప్రారంభించి మాట్లాడారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో నాణ్యత లేని దొడ్డు బియ్యం ఇవ్వడంతో ప్రజలు వాటిని పెద్దగా ఉపయోగించుకోలేదని, బియ్యం తీసుకున్న వెంటనే పక్క దుకాణాల్లో అమ్ముకున్న పరిస్థితి ఉండడంతో ఉచిత బియ్యం ఇతర రాష్ట్రాలకు అక్రమంగా ఎగుమతి చేశారన్నారు. ఈ సమస్యకు పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పేదలకు సన్న బియ్యం అందిస్తోందని చెప్పారు. రేషన్ ద్వారా తీసుకున్న బియ్యాన్ని ప్రజలు ఉపయోగించుకుంటే అక్రమ రవాణాను పూర్తిగా అరికట్ట వచ్చాన్నారు. రాష్ట్రంలో మరో 10 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నట్లు వివరించారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్, జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ ఆర్డీఓలు గోపీరామ్, వెంకన్న, పౌరసరఫరాల శాఖ అధికారి ఇర్ఫాన్ పాల్గొన్నారు.
లింగాలఘణపురంలో..
లింగాలఘణపురం/రఘునాథపల్లి: లింగాలఘణపు రం మండలంలోని నాగారం, నెల్లుట్ల, లింగాలఘణ పురం, రఘునాథపల్లి మండల పరిధి అశ్వరావుపల్లి, జాఫర్‌గూడెం, కుర్చపల్లి గ్రామాల్లో సన్నబియ్యం పథకాన్ని ఎమ్మెల్యే కడియం శ్రీహరి బుధవారం ప్రారంభించారు. కార్యక్రమాల్లో సివిల్ సప్లయ్ డీసీఓ దశరథం, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాంబాబు, నిడిగొండ పీఏసీఎస్ చైర్మన్‌లు నర్సింహారెడ్డి, శ్రీశైలం, ఆర్‌డీఓ గోపీరాం, తహసీల్దార్ రవీందర్, మార్కెట్‌వైస్ చైర్మన్ శివకుమార్, జీడికల్ దేవస్థాన చైర్మన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.