ప్రాణాలు కాపాడుతున్న మెడికల్‌ టెక్నీషియన్లు | - | Sakshi
Sakshi News home page

ప్రాణాలు కాపాడుతున్న మెడికల్‌ టెక్నీషియన్లు

Apr 3 2025 1:22 AM | Updated on Apr 3 2025 1:22 AM

ప్రాణ

ప్రాణాలు కాపాడుతున్న మెడికల్‌ టెక్నీషియన్లు

జనగామ రూరల్‌: ఆపదలో ప్రజల ప్రాణాల ను 108 అంబులెన్స్‌ మెడికల్‌ టెక్నీషియన్లు కాపాడుతున్నారని జిల్లా మేనేజర్‌ మంద శ్రీని వాస్‌ అన్నారు. జాతీయ 108 అంబులెన్స్‌ టెక్నీషియన్స్‌ దినోత్సవం సందర్భంగా బుధవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన కేక్‌ కట్‌ చేసి మాట్లాడారు. ఉద్యోగులు బిల్లా రాజు, శాగ రాంబాబు, మామిడి రాకేష్‌, కల్యాణి, మల్లేష్‌, రాజు, రవి, కృష్ణ, గోపి, రాజేష్‌, సాయి తదితరులు పాల్గొన్నారు.

ముగిసిన టెన్త్‌ పరీక్షలు

జనగామ రూరల్‌: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు బుధవారంతో ముగిశాయి. చివరి రోజు సాంఘికశాస్త్రం పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 6,238 మంది విద్యార్థులకు 6,234 మంది హాజరయ్యారని డీఈఓ రమేశ్‌ తెలిపారు.

జనగామలో యారన్‌ డిపో..

బచ్చన్నపేట : రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు అండగా నిలుస్తున్నది.. 33 కోట్ల రుణమాఫీ, జియో ట్యాగ్‌ మగ్గానికి రూ.24వేల ఇన్‌సెంటివ్‌, కార్మికులకు బీమా వసతి(90 ఏళ్లకు) కల్పించింది.. త్వరలోనే పోచంపెల్లి లేదా జనగామలో యారన్‌ డిపో ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మురళి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో సంఘం రాష్ట్ర నాయకులు గుర్రపు బాల్‌రాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అనంతరం చేనేత కార్మిక నాయకులు మురళిని సన్మానించారు. మచ్చ నరేందర్‌, మంగళంపెల్లి కృష్ణమూర్తి, కృష్ణమూర్తి, ఘణపురం నాగేష్‌, లక్ష్మణ్‌, వెంకటేష్‌, పాండు, విటోబా, హరికృష్ణ, శ్రీనివాస్‌, రమేష్‌, రాములు, శ్రీహరి, నర్సింహులు, సంతోష్‌ పాల్గొన్నారు.

జిల్లాకు పాపన్న పేరు పెట్టాలి

జనగామ రూరల్‌: జనగామ జిల్లాకు సర్దార్‌ సర్వాయి పాపన్న పేరు పెట్టాలని కేజీకేఎస్‌ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కుర్ర ఉప్పలయ్య, బాల్నే వెంకటమల్లయ్య డిమాండ్‌ చేశారు. బుధవారం పాపన్న వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రం చౌరస్తాలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంత రం వెంకటమల్లయ్య మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలో గీత కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న ఎక్స్‌గ్రేషియా డబ్బులు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రమాదానికి గురై చనిపోయిన వారి కుటుంబాలకు, శాశ్వత వికలాంగులకు రూ.10 లక్షలు, తాత్కాలిక వికలాంగులకు రూ.లక్ష చొప్పన ఎక్స్‌గ్రేషియా నెల రోజుల లోపు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో గోపా అధ్యక్షుడు కన్నా పరశురాములు, సభ్యులు మార్క ఉపేందర్‌, శంకరయ్య, బైరగోని వెంకటయ్య, సోషల్‌ మీడియా కన్వీనర్‌ మిట్ట భిక్షపతి, యాదగిరి పాల్గొన్నారు.

ఉద్యోగాలు అమ్ముకున్నారని వినూత్న నిరసన

జనగామ: జిల్లా జనరల్‌ ఆస్పత్రితో పాటు మెడికల్‌ కాలేజీలో కొంత మంది ఫేక్‌ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందారని నిరసిస్తూ పట్టణానికి చెందిన యువకు డు గండి నాగరాజు భూతం వేషంతో బుధవారం వినూత్నంగా నిరసన తెలిపాడు. హనుమకొండరోడ్డు నుంచి కాలినడకన ఆర్టీసీ చౌరస్తాకు వచ్చి అంబేడ్కర్‌ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చాడు. ల్యాబ్‌ అసిస్టెంట్‌, వివిధ పో స్టులను అమ్ముకుని అర్హులకు అన్యాయం చేశారని నినాదాలు చేశాడు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుండా అడ్డుపడుతున్నారని, ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు ఈ సందర్భంగా నాగరాజు తెలిపాడు.

ప్రాణాలు కాపాడుతున్న మెడికల్‌ టెక్నీషియన్లు1
1/2

ప్రాణాలు కాపాడుతున్న మెడికల్‌ టెక్నీషియన్లు

ప్రాణాలు కాపాడుతున్న మెడికల్‌ టెక్నీషియన్లు2
2/2

ప్రాణాలు కాపాడుతున్న మెడికల్‌ టెక్నీషియన్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement