
మార్కెట్‌కు పోటెత్తిన ధాన్యం
జనగామ: యాసంగి వరి కోతలు మొదలు కావడంతో జనగామ వ్యవసాయ మార్కెట్‌కు ధాన్యం పోటెత్తుతోంది. బుధవారం ఒక్కరోజే 3,155 క్వింటాళ్ల ధాన్యం(4,854 బస్తాలు) వచ్చింది. మార్కెట్ చైర్మ న్ బనుక శివరాజ్ యాదవ్ పర్యవేక్షణలో ప్రత్యేక శ్రేణి కార్యదర్శి నరేంద్ర ఆధ్వర్యాన ధాన్యం, ఇతర సరుకుల కొనుగోళ్లను పర్యవేక్షించారు. ధాన్యం ధర పడిపోకుండా ట్రేడర్లతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేపట్టారు. ఇదిలా ఉండగా ‘గురువారం(నేడు) ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ఎంట్రీ ఉంటుంది.. ఆ తర్వాత వచ్చిన సరుకులను కొనుగోళ్లు పూర్తయిన తర్వాత మధ్యాహ్నం లోనికి అనుమతిస్తారు.. రైతులు ధాన్యాన్ని సకాలంలో మార్కెట్‌కు తీసుకురావాలి’ అని చైర్మన్ కోరారు. విన్నర్ లిస్ట్ వచ్చిన తర్వాత కాంటాలు పూర్తి చేసి బస్తాలను త్వరితగతిన లిఫ్టు చేయాలని చెప్పారు.
నేడు ఎంట్రీ ఉదయం 6 నుంచి 10 వరకు..