
పంచాంగ రచనలో దిట్ట
డాక్టర్ సిద్ధాంతి అవసరాల ప్రసాద్‌శర్మ
దేవరుప్పుల : స్థానిక శ్రీ కన్యాకాపరమేశ్వరి ఆలయం పూజారిగా వ్యవహరిస్తూనే.. పదేళ్లుగా పంచాంగం రచిస్తున్నారు డాక్టర్ సిద్ధాంతి అవసరాల ప్రసాద్‌శర్మ. శ్రీ చండీ పరమేశ్వరీ పీఠాన్ని స్థాపించిన ఆయన.. భారత ప్రభుత్వ సమ్మత దృగ్గణీత పంచాంగం ఐదు వందల ప్రతులతో ప్రారంభించారు. ఈ పంచాంగం హైదరాబాద్ కేంద్రంగా ముహూర్తాలతో అమరావతి, విశాఖపట్నం, తిరుపతి ప్రాంతాలకు విస్తరించడం విశేషం. భారత దేశంలోనే కాకుండా అమెరికా కాలమానం ప్రకారం పంచాంగం రచించారు. ముహూర్త సమయ సవరణ, భవిష్యత్ వాణితో రూపొందించిన ఈ పంచాంగాన్ని ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా ఆవిష్కరించారు. ఇప్పటి వరకు ఏపీశర్మ 25వేల పంచాంగాలను ప్రజలకు పంపిణీ చేశారు.