సీఎస్, కలెక్టర్‌కు ఎక్స్‌లో పోస్టు
జనగామ: పట్టణ పరిధి బతుకమ్మకుంటలో కంపుకొడుతున్న నీటిని మార్చాలని కోరుతూ జిల్లా కేంద్రానికి చెంది న సిద్ధం శివకుమార్ శుక్రవారం సీఎస్ శాంతికుమారి, కలెక్టర్ రిజ్వాన్ బాషాకు ఎక్స్ ద్వారా ట్వీట్ చేశారు. ‘ఆహ్లాదం కరువు’ శీర్షికన ఈనెల 28న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనా న్ని అన్ని వర్గాల ప్రజలు చదవి.. సమస్యలను గాలికి వదిలేసిన అధికారుల తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. బతుకమ్మకుంట నీటి సమస్యకు పరిష్కారం చూపించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి
● రాష్ట్ర అధ్యక్షుడు గోధుమల కుమారస్వామి
పాలకుర్తి టౌన్: తెలంగాణ ఉద్యమకారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఉద్యమకారుల అకాంక్షల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గోధుమల కుమారస్వామి డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక శ్రీసోమేశ్వర ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాటు చేసిన సంఘం సన్నాహక కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. 1,800 మంది ఆత్మబలిదానంతో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని, పదేళ్ల కాలంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉద్యమ ద్రోహులను పార్టీలో చేర్చుకొని అధికార లాంఛనాలతో అందలమెక్కించి ఉద్యమకారులను విస్మరించిదని విమర్శించారు. ఏప్రిల్ 20న పాలకుర్తిలో ఉద్యమకారుల సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో సంఘం జిల్లా ఇన్‌చార్జ్ పోలాస సోమయ్య, మూల ప్రభాకర్, సింగ మహేందర్‌రావు, పులిగిళ్ల యాకయ్య, కత్తుల సుధాకర్, నారగోని ఎల్లయ్య, ఎడవల్లి దండయ్య, అరూరి సోమయ్య, గుగ్గిళ ఎల్లయ్య, నక్క లింగ య్య, యాదవరెడ్డి, రాములునాయక్, కొండోజు వేణు తదితరులు పాల్గొన్నారు.
బతుకమ్మకుంట నీటిని మార్చండి