
ఎల్‌ఆర్‌ఎస్ రాయితీని సద్వినియోగం చేసుకోండి
● కలెక్టర్ రిజ్వాన్ బాషా
జనగామ రూరల్: ఎల్‌ఆర్‌ఎస్‌పై 25 శాతం రాయితీని దరఖాస్తుదారులు సద్వినియోగం చేసుకోవా లని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నా రు. శనివారం పట్టణలోని మున్సిప ల్ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు, ఆస్తి పన్ను వసూలుపై పురపాలక అధికారులతో సమీక్షించారు. గడువు సమీపిస్తున్న నేపథ్యంలో రాయితీని వినియోగించుకునేలా దరఖాస్తుదారులకు ఫోన్‌చేసి మరోసారి అవగాహన కల్పించాలన్నా రు. అలాగే పన్ను వసూళ్లలో పురోగతి సాధించాలని చెప్పారు. కమిషనర్ వెంకటేశ్వర్లు, మేనేజర్ తదితరులు పాల్గొన్నారు.
మహనీయుల జయంతిని ఘనంగా నిర్వహించాలి
● అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్
జనగామ రూరల్: మహనీయుల జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ రోహిత్‌సింగ్ అన్నారు. డాక్టర్ బాబూజగ్జీవన్ రా మ్, బీఆర్ అంబేడ్కర్ జయంతి నిర్వహణపై కలెక్టరేట్‌లో షెడ్యూల్డ్ కులాలు, తెగలు, ఉపకులాలు, వివిధ సంఘాల నాయకులతో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. అనంతరం ఉత్సవ కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా మేడ శ్రీనివాస్, అధ్యక్షుడిగా పారనంది వెంకట స్వామి, ఉపాధ్యక్షులుగా దూసరి ధనలక్ష్మి, కందుకూరి ప్రభాకర్, తిప్పారపు విజయ్, బానోతు ధర్మభిక్షం, ప్రధాన కార్యదర్శులుగా గద్దల సాయికుమార్, కన్నారపు శివశంకర్, గద్దల కిశోర్, కార్యదర్శులుగా బోట్ల శేఖర్, గజ్వెల్లి ప్రతాప్, పాలమాకుల జితేందర్, పత్రి నర్సయ్య, కోశాధికార్శులుగా సుద్దాల కుమారస్వామి, బత్తిని యాదయ్యను ఎన్నుకున్నారు.
ఓరుగల్లు సభతో పార్టీకి పూర్వవైభవం
● ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి
జనగామ : ఓరుగల్లులో నిర్వహించే బీఆర్‌ఎస్ రజతోత్సవ సభతో పార్టీకి పూర్వవైభవం సంతరించుకుంటుందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ కల్లబొల్లి హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలన వైఫల్యాలను ప్రజలు చవిచూస్తున్నారని అన్నారు. అంతకు ముందు లబ్ధిదారులకు సీఎంఆర్ చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు. గోదావరిలో నీరు ఉండి, బొమ్మకూరు నుంచి సరఫరా చేసే సామర్థ్యం ఉన్నప్పటికీ ఒక్క చెరువు కూడా నింపకుండా ఈ ప్రాంతాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎడారిగా మార్చిందని అన్నా రు. రుణమాఫీ, రైతుభరోసా ఎక్కడా అని ప్రశ్నించిన ఆయన.. 127 గ్రామాల్లో ఎక్కడైనా వంద శాతం రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే ముక్కు నేలకు రాసి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.

ఎల్‌ఆర్‌ఎస్ రాయితీని సద్వినియోగం చేసుకోండి