● పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి
కొడకండ్ల/దేవరుప్పుల : ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అన్నారు. శుక్రవారం కొడకండ్ల మండలం నీలిబండతండా, దేవరుప్పుల మండలం మాధాపురం రెవెన్యూ పరిధి లాకావత్‌తండా(ఎం)లో ఇందిరమ్మ గృహాల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఆమె మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్‌ఎస్ ప్రభుత్వం అప్పులపాలు చేయడంతో ఆర్థిక భారం ఉన్నా సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తోందని చెప్పారు. బీఆర్‌ఎస్ పాలనలో ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదని, కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చాక నియోజకవర్గ వ్యాప్తంగా 3,500 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు. కార్యక్రమాల్లో లక్ష్మీనారాయణనాయక్, నల్ల శ్రీరాములు, సత్యనారాయణ, ఉప్పల సురేష్ బాబు, డి.అనిల్, యాకస్వామి, సురేష్ నాయక్, నాగరాజు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.