మార్చిలోనే..
నిర్మానుష్యంగా
ఫ్లై ఓవర్
● 39 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు
● దాహంతో అల్లాడుతున్న ప్రజలు
● మధ్యాహ్నం 12 దాటితే రహదారులు నిర్మానుష్యం
● ఏప్రిల్, మే నెలల్లో రికార్డు బ్రేక్ చేసే అవకాశం
జనగామ: ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతూ ఎండలు మండుతున్నాయి. వేడి గాలులతో ప్రజలు డీ హైడ్రేషన్‌కు గురవుతున్నారు. మధ్యాహ్నం 12 గంటలు దాటితే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. మార్చిలోనే ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని మండలాలతోపాటు పట్టణంలోని ప్రధాన కూడళ్లలో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నప్పటికీ.. పనుల నిమిత్తం జిల్లా కేంద్రానికి వచ్చే వేలాది మందికి ఇవి సరిపోవడం లేదు. దీంతో దాహంతో అల్లాడిపోతూ.. వాటర్ బాటిళ్లు కొనుగోలు చేస్తున్నారు. కొబ్బరి నీళ్లు, సోడా, మజ్జిక, జ్యూస్, ఇతర పానీ యాలు తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముంజలు, కొబ్బరి బొండాలకు గిరాకీ పెరిగింది. ప్రస్తుతం నమోదవుతున్న ఉష్ణోగ్రతలు పిల్లలు, వృద్ధులపై కొంత ప్రభావం చూపుతున్నా యి. బయటకు వచ్చే సమయంలో వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
చిరు
వ్యాపారులు, కూలీలకు కష్టాలు
రెక్కాడితే గాని పూటగడవని ఫుట్‌పాత్, చిరు వ్యాపారులు, కూలీలు, కార్మికులకు వేసవి కష్టాలు తప్పడం లేదు. రోజువారీ పనులకు వెళ్లేవారు ఇంటిపట్టున ఉంటే పూట గడవని పరిస్థితి నెలకొంది. దీంతో మండుటెండల్లోనూ పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు.
నిప్పుల కొలిమి
గురువారం ఉష్ణోగ్రతలు 39 డిగ్రీల సెల్సీఎ్‌స్ నమో దు కావడంతో జిల్లా నిప్పుల కొలిమిని తలపించింది. ఉదయం 9 గంటలకే ఉక్కపోత మొదలైంది. ఏప్రిల్ మొదటి వారం నుంచి మరో 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతా వరణ శాఖ హెచ్చరిస్తోంది. అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
పెరిగిన ఏసీ, కూలర్ల వినియోగం
ఎండల తీవ్రతతో మధ్య తరగతి కుటుంబాల నుంచి సంపన్నుల వరకు చల్లని వాతావరణం కోసం తపించిపోతున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఏసీ, కూలర్ల వినియోగం పెరిగింది. ఇప్పటి వరకు ఫ్యాన్, కూలర్లతో సరిపెట్టుకున్న చాలా కుటుంబాలు ఉక్కపోత భరింత లేక అప్పుచేసైనా ఏసీ కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. రిఫ్రిజిరేటర్లకు సైతం డిమాండ్ పెరుగుతోంది.
చాలా జాగ్రత్తగా ఉండాలి
వేడిగాలులు, ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వాతావరణంలో తేమశాతం పడిపోతున్నది. లవణాలు చెమటల రూపంలో బయటకు వెళ్తుండడంతో శరీరంలోని నీటి శాతం తగ్గుతోంది. ఈ సమయంలో బయటకు వెళ్లక పోవడమే ఉత్తమం. ఇంట్లో ఉన్నా వేడిగాలి వస్తుంది. కిటికీల వద్ద కాటన్ దుస్తులు లేదా గడ్డి ఏర్పాటు చేసుకు ని నీటిని చల్లాలి. ఇలా చేస్తే వృద్ధులు, పిల్లలకు వడదెబ్బ తగలకుండా నివారించవచ్చు. వడదెబ్బ తగిలితే నీరసం, కండరాలు, తలనొప్పి ఉంటుంది. ఈ సమయంలో మజ్జికలో ఉప్పు, చెక్కర కలుపుకుని తాగాలి. అలాగే ఓఆర్‌ఎస్, కొబ్బరినీళ్లు తీసుకోవచ్చు. పుచ్చ, నిమ్మరసం, సంత్రా రసం తీసుకో వాలి. మట్టికుండలోని తాగునీరు శ్రేయస్కరం. – డాక్టర్ అశోక్‌కుమార్, జనగామ
తేదీ కనిష్టం గరిష్టం
20 28 36
21 27 35
22 26 35
23 27 33
24 28 33
25 26 34
26 28 38
27 29 39
మంటలు
మంటలు
మంటలు
మంటలు
మంటలు
మంటలు