
కొత్త టీచర్లకు ‘స్పాట్’ డ్యూటీలు
జనగామ: ఇటీవల నూతనంగా బాధ్యతలు చేపట్టి న ఎస్జీటీ ఉపాధ్యాయులకు పదో తరగతి వార్షిక పరీక్షల జవాబు పత్రాల స్పాట్ వాల్యుయేషన్ విధులు కేటాయించారు. ఇందులో కొంతమందికి ఇంటర్ పరీక్షల డ్యూటీ ముగియగానే పదో తరగతి పరీక్షలకు ఇన్విజిలేషన్ వేశారు. ఇప్పుడు మళ్లీ పదో తరగతి పేపర్ వాల్యుయేషన్ పేరిట సంబంధం లేకుండా ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులకు స్పెష ల్ అసిస్టెంట్ డ్యూటీలు వేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం టీచర్ పోస్టులను భర్తీ చేస్తే.. ఎస్జీటీలను ఇన్విజిలేషన్, వాల్యువేషన్ కోసం పంపించడం ఏమిటని మేధావి వర్గం ప్రశ్నిస్తోంది. మారుమూల గ్రామాల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయగా.. తల్లిదండ్రులు స్కూళ్లపై నమ్మకంతో ఇప్పుడిప్పుడే తమ పిల్లలను పంపిస్తున్నారు. ఇన్విజిలేషన్, స్పాట్ వాల్యువేషన్ పేరిట కొత్త టీచర్లకు వరుస డ్యూటీలు వేస్తూ విద్యార్థులకు చదువులకు ఆటంకం కలిగిస్తుంటే ఆ నమ్మకం సడలే ప్రమాదం ఉంది. మరోవైపు జిల్లాలో 2025–26 విద్యా సంవత్సరానికి ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థుల కోసం క్యాంపేయిన్ చేస్తుండగా.. ప్రభుత్వం ఎస్జీటీలను అదనపు డ్యూటీల పేరిట పంపిస్తే.. స్కూళ్లు ఎలా నిండుతాయని అంటున్నా రు. పేపర్ వాల్యుయేషన్‌కు ఆయా సబ్జెక్టుల టీచర్లతో పాటు నాన్ టీచింగ్ ఉద్యోగులను తీసుకుంటే మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఒక్క బచ్చన్నపేట నుంచే 19 మందికి..
సంబంధం లేని విధుల కేటాయింపుపై విమర్శల వెల్లువ