ప్రజలు సుఖంగా ఉండాలి
జనగామ: ఉగాదితో ప్రారంభమయ్యే తెలుగు సంవత్సరాదిలో జిల్లా ప్రజలు సుఖసంతోషా లతో ఉండాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ఆకాంక్షించారు. ఉగాది పండుగ నేపథ్యంలో ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశా రు. కుటుంబ సభ్యులతో పండుగను ఆనందో త్సాహాల మధ్య జరుపుకోవాలని కోరారు.
వ్యవసాయ మార్కెట్లకు వరుస సెలవులు
జనగామ/స్టేషన్‌ఘన్‌పూర్ : జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ వ్యవసాయ మార్కెట్లకు ఈనెల 30 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు. 30న ఉగాది పండుగ, 31న రంజా న్, మరుసటిరోజు ఒకటో తేదీన మార్కెట్లు బందుంటాయి. వరుస సెలవుల నేపథ్యంలో రైతులు వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించడానికి తీసుకురావొద్దని జనగామ మార్కెట్ చైర్మన్ బనుక శివారజ్ యాదవ్, స్టేషన్‌ఘన్‌పూర్ మార్కెట్ చైర్‌పర్సన్ జూలుకుంట్ల లావణ్యశిరీష్‌రెడ్డి వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. మార్కెట్లు రెండో తేదీ పునఃప్రారంభం అవుతా యని తెలిపారు.
వాస్తు నిపుణుడికి పురస్కారం
జనగామ: విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం అందించే పురస్కారాని కి జనగామకు చెందిన జ్యోతిష్య వాస్తు నిపుణుడు బెలిగినమఠం శివకుమార్ ఎంపికయ్యారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఆదివారం నిర్వహించే పురస్కారాల ప్రదానం కార్యక్రమానికి హాజరుకావాలని దేవాదాయ శాఖ కమిషనర్ నుంచి పిలుపు వచ్చింది. సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా నేడు పురస్కారం అందుకోనున్నారు.


