
రాములోరి కల్యాణం వైభవంగా నిర్వహించాలి
పాలకుర్తి టౌన్: వల్మిడి శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో ఈనెల 6న శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణం వైభవగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఆలయంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. కల్యాణాన్ని తికలించేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని, ఆలయ పరిసరాల్లో శుభ్రత, తాగునీరు ఏర్పాటు చేయాలని చెప్పారు. ట్రాఫిక్ నియంత్రణ, భద్రతకు పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి అత్యవసర సేవలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. సమావేశంలో ఆర్డీఓ డీఎస్ వెంకన్న, డీపీఓ స్వరూప, ఈఓ మోహన్‌బాబు, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ రాములు, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ సంధ్యారాణి, సీఐ మహేందర్‌రెడ్డి, ఎస్సై పవన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి