
‘రాజీవ్ యువ వికాసం’ యువతకు వరం
రఘునాథపల్లి: ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం యువతకు వరం లాంటిదని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నగరగాని ప్రీతమ్ అన్నారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో యువ వికాసం హెల్ప్ డెస్క్‌ను సందర్శించారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా నమోదైన దరఖాస్తుల వివరాలు ఎంపీడీఓను అడిగి తెలుసుకున్నారు. మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తుకు రూ.100 తీసుకుంటున్నారని కొందరు యువకులు చైర్మన్ దృష్టికి తీసుకరాగా, రూ.45 మాత్రమే తీసుకోవాలని.. అడిషనల్ కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి మీ సేవ కేంద్రాల్లో అభ్యర్థుల వద్ద అదనపు రుసుం వసూలు చేయకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతకుముందు మండలంలోని కోమళ్లలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పొందిన పాడి గెదెల యూనిట్‌ను సందర్శించి లబ్ధిదారులతో మాట్లాడారు. చైర్మన్ వెంట ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మాధవీలత, ఎంపీడీఓ గార్లపాటి శ్రీనివాసులు, ఎంపీఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.