సన్నబియ్యం పంపిణీ అంతంతే..
జనగామ: ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీ ప్రారంభంలో సందిగ్ధత నెలకొంది. ఎమ్మెల్యే, ఎంపీ సమయం కోసం రెండు నియోజకవర్గాల్లో సన్నరకం బియ్యం ప్రారంభం నేటికి (బుధవారం) వాయిదా వేయగా... పాలకుర్తి నియోజకవర్గంలో మూడు చోట్ల ప్రారంభించారు. జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలోని పలు రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ చేపట్టినప్పటికీ.. ఉన్నతాధికారుల ఆదేశాలతో గంటలోపే మూసి వేశారు. బియ్యం కోసం రేషన్ దుకాణాలకు వచ్చిన కొంతమంది లబ్ధిదారులు ఉసూరుమంటూ వెళ్లిపోయారు. స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డి సమయం మేరకు సన్న బియ్యం పంపిణీ నేటికి వాయిదా వేసినట్లు సమాచారం.
335 దుకాణాలు...మూడే చోట్ల
జిల్లాలో 335 రేషన్ దుకాణాలు ఉన్నాయి. ఏప్రిల్ 1వ తేదీ నుంచి సన్నబియ్యం ప్రారంభించాలని ఆదేశాలు రావడంతో రేషన్ డీలర్లు సన్నద్ధమయ్యారు. రేషన్ దుకాణాల ఎదుట సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి చిత్రపటాలతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. పాలకుర్తి నియోజకవర్గంలోని దేవరుప్పుల మండలంలోని నీర్మాల, పాలకుర్తి మండలంలోని శాతపురం, కొడకండ్ల మండలంలోని ఏడునూతలతో ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి చేతుల మీదుగా సన్నబియ్యం పంపిణీ చేశారు. ఏళ్ల తరబడి దొడ్డు బియ్యం తీసుకుంటూ.. మొదటిసారిగా రేషన్ దుకాణం ద్వారా సన్నరకం బియ్యం తీసుకున్న లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేయగా.. వాయిదా పడిన గ్రామాల్లో నిరుత్సాహ పడ్డారు. అయితే ఆయా మండలాల్లో బియ్యం పంపిణీ ప్రారంభించిన కొంత సేపటికే సరఫరా నిలిపేశారు.
ఎమ్మెల్యే, ఎంపీ సమయం కోసం నేటికి వాయిదా
ఉసూరుమంటూ వెనుదిరిగిన లబ్ధిదారులు
పాలకుర్తిలో ప్రారంభించిన ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి
సన్నబియ్యం పేదలకు వరం
ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి
పాలకుర్తి: సన్నబియ్యం పంపిణీ పేదలకు వరం అని ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. మంగళవారం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సన్నబియ్యం పథకాన్ని ఎమ్మెల్యే శాతపురం గ్రామంలో ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలు సన్నబియ్యంను సద్వినియోగం చేసుకోవాలని, పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు ఉన్న తమకు తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గిరగాని కుమారస్వామి, అధికారులు, రేషన్ డీలర్లు ఉన్నారు.
ప్రజాప్రతినిధులు రాలేదని..
రేషన్ దుకాణంలో సన్నబియ్యం ఇస్తారని ఉదయమే అక్కడకు వెళ్లాను. గంట సేపు వేచి చూసిన. ప్రజా ప్రతినిధులు రాలేదని ప్రారంభం ఆపేశారు. అధికారులు వచ్చి నేడు (బుధవారం) రండి అంటూ పంపించేశారు.
– కాళ్ల భిక్షపతి, మల్కపేట, నర్మెట
సంతోషంగా ఉంది..
కాంగ్రెస్ ప్రభుత్వం ఆహార భద్రత పథకంలో భాగంగా సన్నబియ్యం అందిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించి అమలు చేయడం చాలా సంతోషం. దీంతో పేదలకు ఆర్థిక ఇబ్బందులు తప్పనున్నాయి. సన్నబియాన్ని సద్వినియోగం చేసుకుంటాం.
– బీరెల్లి కవిత, శాతాపురం, పాలకుర్తి
సన్నబియ్యం పంపిణీ అంతంతే..
సన్నబియ్యం పంపిణీ అంతంతే..
సన్నబియ్యం పంపిణీ అంతంతే..


