
వానకొండయ్య జాతరకు పోటెత్తిన భక్తులు
దేవరుప్పుల: లక్ష్మీనర్సింహ్మస్వామి గోవిందా..గోవిందా నామస్మరణంతో వానకొండయ్య జాతరకు ఉగాది పురస్కరించుకొని భక్తులు పోటెత్తారు. మండలంలోని కడవెండి శివారులో హోళీ పండుగతో ప్రారంభమై ఉగాది వరకు జాతర జరగడం ఆనవాయితీగా వస్తోంది. ఆదివారం పూజారీ సంపత్‌కుమారచార్యుల పర్యవేక్షణలో ప్రత్యేక పూజలు చేయగా జనగామ, సూర్యాపేట, యాదాద్రిభువనగిరి జిల్లాలకు చెందిన భక్తులు పెద్దఎత్తున సంప్రదాయ పద్ధతిలో ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతోపాటు తమ వాహనాలను అలంకరించుకొని చేరుకున్నారు. జాతర ఉత్సవ కమిటీతోపాటు పోలీసు యంత్రాంగం అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టారు.