
సన్నబియ్యం పంపిణీని వేగవంతం చేయాలి
జనగామ రూరల్: రేషన్ దుకాణాలకు సన్నబియ్యం రవాణా పంపిణీని వేగవంతం చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలెక్టర్లకు సూచించారు. శుక్రవారం హైదరాబాద్ సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో కలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి సన్న బియ్యం సరఫరాపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్‌తో కలిసి కలెక్టర్ రిజ్వాన్ బాషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సన్నబియ్యం రవాణాపై కలెక్టర్‌లు దృష్టి సారించాలన్నారు. జిల్లా స్థాయిలో కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పేదలతో కలిసి ప్రభుత్వం సరఫరా చేస్తున్న సన్న బియ్యంతో భోజనం చేయాలని మంత్రి సూచించారు. నూతన ఆహార భద్రత కార్డుల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని సీఎస్ శాంతికుమారి సూచించారు. అనంతరం కలెక్టర్ రిజ్వాన్ బాషా సంబంధిత అధికారులతో సమీక్షించి, దిశానిర్దేశం చేశారు. ఈ వీసీలో డీసీఎస్‌ఓ సరస్వతి, డీఎం సీఎస్ హతీరాం, తదితరులు పాల్గొన్నారు.
ఈవీఎం గోదాం పరిశీలన
భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు జిల్లా సమీకృత కార్యాలయాల భవన సముదాయంలోని ఈవీఎం గోదాంను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రిజ్వాన్ బాషా శుక్రవారం పరిశీలించారు. భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు.
పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి