పట్టుదలతో ఐశ్వర్యం
చదువుల విషయంలో పిల్లలు అత్యుత్తమ ఫలితాలు పొందేలా విజేతలుగా నిలిచేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. పిల్లలు తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా వారికి భారం తగ్గించేలా పార్ట్‌టైం జాబ్‌లు చేసి డబ్బు సంపాదించడం అలవర్చుకోవాలి. నగరంలో కాకతీయ మెడికల్ కాలేజీ దగ్గర కొందరు బీటెక్ విద్యార్థులు సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు మొబైల్ టిఫిన్ సెంటర్‌ను నడుపుతూ వారి తల్లిదండ్రులకు ఆసరాగా నిలుస్తున్నారు.. కొత్త కొలువులు సాధించేందుకు పట్టుదలతో కృషి చేయాలి. ఆ కుటుంబం ఆర్థికంగా ఉన్నతంగా నిలుస్తుంది. యువకులు ఈ దిశగా పండుగరోజు తొలిఅడుగు వేయాలని ఆశిద్దాం.


