
ఎకరాకు రూ.50వేల నష్టపరిహారం చెల్లించాలి
జనగామ రూరల్: జిల్లాలో ఎండిన పంటలపై అధికారులు సర్వే చేపట్టి ఎకరాకు రూ.50వేల నష్టపరిహారం చెల్లించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా చందు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం జిల్లా కమిటీ ఆధ్వర్యాన ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి ఏఓ ఆండాలుకు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు, కాల్వలు పూర్తి చేయడంతో పాటు దేవాదుల ప్రాజెక్టు నుంచి వరద కాల్వల ద్వారా చెరువులు, కుంటలు నింపి రైతుల పంటల ను కాపాడాలని డిమాండ్ చేశారు. నాయకులు మాచర్ల సారయ్య, మంగ బీరయ్య, ఉర్సుల కుమార్, బోడ రాములు తదితరులు పాల్గొన్నారు.