
వల్మిడి ఆలయానికి సింహాసనం బహూకరణ
పాలకుర్తి టౌన్: వల్మిడి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి సోమవారం గ్రామానికి చెంది న పెద్దోజు సత్తయ్యచారి జ్ఞాపకార్థం పెద్దోజు నాగరాజుచారి, వీరబ్రహ్మచారి, రమేష్‌చారి సింహాసనం బహూకరించినట్లు ఈఓ సల్వాది మోహన్‌బాబు తెలిపారు. ఆలయ అభివృద్ధికి దాతలు సహకరించాలని ఆయన కోరారు.
గుట్టపై పోటెత్తిన భక్తులు
దేవరుప్పుల : శ్రీ లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కడవెండి శివారు గుట్టపై వానకొండయ్య జాతరకు సోమవారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ పూజా రి సంపత్‌కుమారాచార్య ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. మండుటెండల కారణంగా భక్తుల సౌకర్యార్థం మరికొన్ని రోజులు జాతర కొనసాగిస్తున్నట్టు ఉత్సవ కమిటీ బాధ్యులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
భద్రకాళి అమ్మవారికి పుష్పార్చన
హన్మకొండ కల్చరల్: వసంత నవరాత్రుల్లో భాగంగా భద్రకాళి దేవాలయంలో సోమవా రం అమ్మవారికి పుష్పార్చన చేశారు. ఉదయం అర్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో అమ్మవారికి నిర్మాల్యసేవలు, నిత్యాహ్నికం అనంతరం వేదపండితులు, వేదపాఠశాల విద్యార్థులు లక్ష తెల్లని చామంతుల తో పుష్పార్చన నిర్వహించారు. దేవాదాయ ధర్మాదాయశాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ కె.దుర్గాప్రసాద్, డీఈఈ సీహెచ్ రమేశ్‌బాబు, ఏఈ వీరచందర్ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈఓ శేషుభారతి, దేవాల య సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు.

వల్మిడి ఆలయానికి సింహాసనం బహూకరణ

వల్మిడి ఆలయానికి సింహాసనం బహూకరణ