అక్రమ అరెస్ట్‌లు సరికాదు | - | Sakshi

అక్రమ అరెస్ట్‌లు సరికాదు

Apr 5 2025 1:29 AM | Updated on Apr 5 2025 1:29 AM

అక్రమ

అక్రమ అరెస్ట్‌లు సరికాదు

జనగామ: బీఆర్‌ఎస్‌ నేతలపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడిన బూతు పురాణా లకు నిరసనగా షోడాషపల్లిలో శాంతియుత పద్ధతిలో నిరసన తెలిపిన తమ పార్టీ నాయకులు, గ్రామస్తులను అధికార పార్టీ నేతలు పో లీసులను పంపించి అరెస్ట్‌ చేయించారని ఎమ్మె ల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో ఖండించారు. కడియం శ్రీహరి గులాబీ జెండా నీడలో కేసీఆర్‌ నాయకత్వంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రి, ఎంపీ హోదా అనుభవించిన సంగతి మరువొద్దన్నారు. కడియం అహంకారం, అల్పబుద్దితో స్టేషన్‌ఘన్‌పూర్‌ నాయకులు, కార్యకర్తలను బెదిరిస్తున్నారన్నారు. ఘన్‌పూర్‌ ప్రజలు ఉప ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారని, ఓట్ల పండగ రాగనే పాతాళంలోకి తొక్కేయడం ఖాయమన్నారు. ప్రజాస్వా మ్య దేశంలో నిరసన తెలిపే హక్కు ప్రతీ పౌరుడికి ఉంటుందని, చట్ట విరుద్ధంగా తనతో పాటు బీఆర్‌ఎస్‌ నాయకులను తిట్టిన కడియం శ్రీహరిపై వెంటనే కేసు నమోదు చేయాలని పోలీస్‌లను కోరారు.

నకిలీ చందా పుస్తకాలతో అక్రమ వసూళ్లు

పాలకుర్తి టౌన్‌: మండలంలోని వల్మిడి శ్రీసీతా రామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈనెల 6న నిర్వహించే శ్రీరామనవమి క ల్యాణానికి ఉత్సవ కమిటీ పేరుతో ఓ వ్యక్తి నకి లీ పుస్తకాలు తయారు చేసి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు గ్రామస్తులు గుర్తించి రాష్ట్ర దేవాదాయశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో శుక్రవారం రాత్రి దేవాదాయ ధర్మదాయ శాఖ హైదరాబాద్‌ జోన్‌ డిప్యూటీ కమిషనర్‌ కృష్ణప్రసాద్‌ పాలకుర్తికి చేరుకొని విచారణ జరిపారు. ఈఓ మోహన్‌బాబు ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నట్లు ఎస్సై పవన్‌కుమార్‌ తెలిపారు.

‘అభివృద్ధిని చూసి మాట్లాడు’

జనగామ: జిల్లా అభివృద్ధితో పాటు స్టేషన్‌ ఘన్‌పూర్‌ అభివృద్ధికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి కృషి చేస్తున్నారని, రాజకీయాల్లో అనుభవజ్ఞుడు కడియం శ్రీహరిని విమర్శిస్తే ఊరుకునేది లేదని జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి అన్నారు. శుక్రవారం డీసీసీ కార్యాయలంలో జిల్లా గ్రంథాలయ చైర్మ న్‌ మారజోడు రాంబాబు, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు లింగాల జగదీశ్వర్‌రెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లో వందల కోట్లతో అభివృద్ధి జరుగుతుంటే... ఓర్వలేని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి కడియంపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో పల్లా చేసిన అభివృద్ధి చూ పించాలన్నారు. ఈ కార్యక్రమంలో రఘునాథపల్లి మండల కాంగ్రెస్‌ నాయకులు, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.

వైభవంగా ఆరుద్రోత్సవం

పాలకుర్తి టౌన్‌: సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఆరుద్ర నక్షత్రం పురస్కరించుకొని ఆరుద్రోత్సవం కార్యక్రమాన్ని అర్చకుల వేద మంత్రోచ్ఛరణల మధ్య శుక్రవారం రాత్రి వైభవంగా నిర్వహించారు. పంచ హారతులతో గర్భాలయంలో దీపోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ సల్వాది మోహన్‌బాబు, అర్చకులు డీవీఆర్‌శర్మ, దేవగిరి అనిల్‌కుమార్‌, ఆలయ సూపరింటెండెంట్‌ కొత్తపల్లి వెంకటయ్య, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

స్పాట్‌ వాల్యుయేషన్‌ నుంచి మినహాయించండి

జనగామ: ఎస్జీటీ టీచర్లకు పదో తరగతి వార్షిక పరీక్షల జవాబు పత్రాల స్పాట్‌ వాల్యువేషన్‌ విధులు వేయడంపై వినతులు వెల్లువెత్తుతున్నాయి. కొత్త టీచర్లకు ‘స్పాట్‌’ డ్యూటీ శీర్షికన ఈ నెల 4న సాక్షిలో ప్రచురితం కాగా, జిల్లా వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఒక్కరు లేక ఇద్దరు పని చేసే ప్రాథమిక పాఠశాలల నుంచి స్పాట్‌ వాల్యువేషన్‌కు టీచర్లను వేయడంపై వి ద్యార్థుల తల్లిదండ్రులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పదో తరగతి జవాబు పత్రాల వా ల్యువేషన్‌ డ్యూటీలతో ఉపాధ్యాయులు బడికి రాకుండా పోయే పరిస్థితి ఉండడంతో తల్లిదండ్రులు ఆందోళన బాట పట్టే అవకాశం లేకపోలేదని విద్యావేత్తలు భావిస్తున్నారు. శుక్రవారం పలువురు కొత్త టీచర్లు మండలాల పరిధిలో ఎంఈఓలతో పాటు డీఈఓలకు వినతులు అందించారు. జిల్లాలో స్పాట్‌ వాల్యువేషన్‌ డ్యూటీలకు సంబంధించి అధికారుల నిర్ణయంపై విమర్శలు వ్యక్తమవుతుండగా, భవిష్యత్‌ నిర్ణయం ఎలా ఉంటుందనే దానిపై చర్చ జరుగుతుంది.

అక్రమ అరెస్ట్‌లు సరికాదు1
1/1

అక్రమ అరెస్ట్‌లు సరికాదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement