
అభివృద్ధి పనులంటూ అబద్ధపు ప్రచారం
రఘునాథపల్లి: రూ.800 కోట్లతో అభివృద్ధి పనులంటూ అబద్ధపు ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి.. ఎనిమిది పైసలు కూడా తీసుకురాలేదని జనగామ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు. ఈనెల 27న నిర్వహించే బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ నేపథ్యంలో గురువారం పార్టీ జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అధ్యక్షతన జరిగిన స్టేషస్‌ఘన్‌పూర్ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ 5 లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు పెద్ద ఎత్తున నిధలు కేటాయించారని, స్టేషన్‌ఘన్‌పూర్ అభివృద్ధితోపాటు ఇక్కడి భూములకు సాగు నీరు అందిందని చెప్పారు. బీఆర్‌ఎస్ కార్యకర్తలు చెమటోడ్చి గెలిపిస్తే.. మోసం చేసి పార్టీ మారిన కడియం శ్రీహరికి గుణపాఠం చెప్పే సమయం దగ్గర్లోనే ఉందన్నారు. రజతోత్సవ సభకు ఘన్‌పూర్ నుంచి 30 వేల మందికి తగ్గకుండా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. సమావేశంలో నాయకులు బాల్నె సిద్ధ్దిలింగం, గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, సేవెల్లి సంపత్, ఆకుల కుమార్, ముసిపట్ల విజయ్, వై.కుమార్‌గౌడ్, ఎడవెల్లి కృష్ణారెడ్డి, మనోజ్‌రెడ్డి, మారపాక రవి, రాజన్‌బాబు, శెట్టి మాధవరావు, ఊడ్గుల భాగ్య, దొనికల రమాదేవి, బొంగు ఐలయ్య, లొక్కుంట్ల సృజన్ తదితరులు పాల్గొన్నారు.
‘కడియం’పై జనగామ ఎమ్మెల్యే
పల్లా రాజేశ్వర్‌రెడ్డి పైర్