జనగామ: ఆస్తి పన్ను వడ్డీపై 90 శాతం రాయితీతో చెల్లింపునకు నేడు (సోమవారం) చివరి అవకాశమని కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. ఆదివారం కలెక్టర్ మాట్లాడుతూ రంజాన్ పండుగ ఉన్నప్పటికీ మున్సిపల్‌కు ఎటువంటి సెలవు లేదన్నారు. అధికారులు, సిబ్బంది యథావిధిగా పని చేస్తారన్నారు. ఇంటి, నల్లా, ఇతర పన్నులు ప్రజలు సకాలంలో చెల్లించి పట్టణ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. మున్సిపల్ సిబ్బంది అందుబాటులో ఉంటూ, ఆస్తి, నల్ల పన్నులు వసూలు చేయాలని ఆదేశించారు. మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయడంతో పాటు ఆన్‌లైన్‌లో ఆస్తి, ఇంటి పన్నులు చెల్లించేందుకు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు.
బుగులు వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
చిల్పూరు: ఉగాది పండుగను పురస్కరించుకుని ఆదివారం జనగామ డీసీపీ రాజమహేందర్‌నాయక్ దంపతులు బుగులు వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం ఆలయానికి డీసీపీ దంపతులు చేరుకోగా ఆలయ ఈఓ లక్ష్మిప్రసన్న, చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్‌రావులు స్వాగతం పలికారు. అర్చకులు రవీందర్‌శర్మ, కృష్ణమాచార్యులు వేద మంత్రాల నడుమ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆశీర్వచనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ కుర్రెలం మోహన్, వీరన్న,ఽ ఎస్సై సిరిపురం నవీన్‌కుమార్, ధర్మకర్తలు గనగోని రమేశ్, బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.
పూర్వ విద్యార్థుల పాదయాత్ర
రఘునాథపల్లి: వారంతా ఖిలాషాపూర్ హై స్కూల్‌లో కష్టపడి చదువుకున్నారు. వారిలో చాలా మంది పేదలే.. నాడు కష్టపడి చదివి.. నేడు ఉన్నత స్థాయికి ఎదిగారు. తమ జీవితా లకు బాట వేసిన పాఠశాలకు ఏదైనా చేయాలని పూర్వ విద్యార్థులు వినూత్న ఆలోచన చేశా రు. పాఠశాలలో చదివే విద్యార్థులకు విద్య, ఉపాధి పొందడంలో నైపుణ్యం పెంపునకు తోడ్పాటునందించేందుకు ప్రతీ నెల రూ.20కి తగ్గకుండా కార్పస్ ఫండ్ జమ చేస్తున్నారు. కార్పస్ ఫండ్ కార్యక్రమాన్ని ఖిలాషాపూర్ వరకే పరిమితం కాకుండా రాష్ట్రం, జిల్లా, మండల, గ్రామ స్థాయి పాఠశాలల్లో విస్తరింపజేసేందుకు అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ఆది వారం ఖిలాషాపూర్ పాఠశాల నుంచి రఘునాథపల్లి ఎంఈఓ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. ఎస్సై దూదిమెట్ల నరేష్ పాదయాత్రకు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థి, సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, 5ఈ ఫౌండర్ కేశిపెద్ది నర్సింహారాజు మాట్లాడారు. ఇప్పటివరకు పూర్వ విద్యార్థులందరు రూ.5 లక్షల కార్పస్ ఫండ్ జమ చేసినట్లు తెలిపారు. పాదయాత్రలో పూర్వ విద్యార్థులు కర్ల కృష్ణవే ణి, మడుపోజు లక్ష్మినారాయణ, ఆలేటి యాదవరెడ్డి, సరాబు వీరన్న, కాయితాల రాజమౌళి, అంగిరేకుల సారయ్యచ మీసాల సుధాకర్, ఉడుత రంజిత్‌యాదవ్, ముప్పిడి శ్రీధర్, అల్లి బిల్లి కృష్ణ, సురిగల భిక్షపతి, రవికుమార్, చంద్రమౌళి, దేవరాజు, చంద్రశేఖర్, సురిగల భిక్షపతి, గుడి రాంరెడ్డి, చంద్రశేఖర్, అంజనేయులు, నాగరాజు, వెంకటేశ్వర్లు, సరస్వతి, అంజ య్య, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
ఆస్తి పన్ను చెల్లింపునకు నేడు చివరి రోజు