
కొనేవారేరి..?
శుక్రవారం శ్రీ 4 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
– 8లోu
జనగామ: స్థానిక వ్యవసాయ మార్కెట్‌లో ధాన్యం కొనుగోళ్లలో సందిగ్ధత నెలకొంది. ఈ–నామ్ ద్వారా క్వింటా ధాన్యానికి కనీస ధర రూ.1,850 నిర్ణయించారు. గత ఏడాది నుంచి ఈ నిబంధన వర్తిస్తున్నది. ఇదే పద్ధతిలో ధాన్యం కొనుగోళ్లు జరుగుతుండగా.. ఈసారి పేచీ పడింది. విదేశాలకు బియ్యం ఎగుమతులు లేక క్వింటాకు రూ.3,700 నుంచి రూ.3,200 వరకు ధర పడిపోయింది. అంతే కాకుండా ఏపీ నుంచి రూ.2వేల లోపు ధరతో ధాన్యం దిగుమతి అవుతుండడంతో జనగామ మార్కెట్ కొనుగోళ్లపై తీవ్ర ప్రభావం పడింది.
జిల్లాలో యాసంగి వరి కోతలు మొదలైనా ఐకేపీ, పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో జనగామ వ్యవసాయ మార్కెట్‌కు ధాన్యం పోటెత్తుతోంది. రోజుకు 7వేల నుంచి 10వేల బస్తాల ధాన్యం వస్తోంది. మార్కెట్ పరిధిలో 52 మంది ట్రేడర్లు ఉండగా రోజూ ఏడుగురు ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. అకాల వర్షాల భయంతో రైతులు పచ్చిమీద పంట కోతలు చేపట్టి నేరుగా మార్కెట్‌కు తరలిస్తున్నారు. దీంతో తేమ 20 నుంచి 28 శాతం వరకు ఉంటోంది. దీనికితోడు విదేశాలకు ఎగుమతి చేసే బియ్యం ధరలు పడిపోయాయని, మినిమం ప్రైజ్‌తో కొనుగోలు చేస్తే నష్టమే ఎక్కువ వస్తుందని ట్రేడర్లు ముందుకు రావడం లేదు. ఇటు ట్రేడర్ల సమస్య, అటు సర్వర్ డౌన్ కారణంగా గురువారం మధ్యాహ్నం 2.30 గంటలు దాటినా కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. చైర్మన్ శివరాజ్‌యాదవ్, ప్రత్యేక శ్రేణి కార్యదర్శి నరేంద్ర చొరవతో ముగ్గురు ట్రేడర్లు మాత్రమే రంగంలోకి దిగారు. 43 మంది రైతుల వద్ద 1,766 క్వింటాళ్ల ధాన్యం కొనుగోళ్లు చేసి మిగతా సరుకును వదిలే శారు. రైతులు ప్రాదేయపడినా స్పందించ లేదు. ఈ–నామ్ ద్వారా క్వింటా ధాన్యానికి రూ.1,880, రూ.1,850, రూ.1,925 ధర పలికింది. కొంతమంది వ్యాపారులు రైతుల అంగీకారం మేరకు క్వింటాకు రూ.1,700 నుంచి రూ.1,750 ధరతో కొనుగోలు చేశారు.
ధాన్యంతో నిండిన మార్కెట్
మార్కెట్‌లోని రెండు కవర్ షెడ్లతో పాటు కల్లాలు ధాన్యంతో నిండిపోయాయి. సుమారు 30వేల బస్తాల వరకు ఉండవచ్చని అంచనా. తిరుమలగిరి, సూర్యాపేట మార్కెట్ల మాదిరిగా మినిమం ప్రైజ్ నిబంధన తొలగించి రైతుకు నష్టం లేకుండా ధర ఇచ్చేలా నిర్ణయం తీసుకోవాలనేది ట్రేడర్ల వాదన. అధికారులు, ట్రేడర్ల మధ్య నెలకొన్న ఈ వివాదంతో కొనుగోళ్లు మందగించి మార్కెట్‌లో ధాన్యం నిల్వలు పెరిగి పోతున్నాయి. రైతులు ఆరబోసుకోవడానికి స్థలం కూడా లేకుండా పోయింది.
మూడు రోజులు సెలవు : చైర్మన్
ధాన్యం నిల్వలు పేరుకుపోవడంతో స్థల ప్రభావం కారణంగా ఈనెల 4 నుంచి 6వ తేదీ వరకు మార్కెట్‌కు సెలవు ప్రకటించినట్లు చైర్మన్ బనుక శివరాజ్‌యాదవ్ తెలిపారు. 4న ధాన్యం కొనుగోళ్లు–తరలింపు, 5న జగ్జీవన్‌రామ్ జయంతి, 6న ఆదివారం సాధారణ సెలవు కారణంగా రైతులు మార్కెట్‌కు వ్యవసాయ ఉత్పత్తులు తేవద్దని, 7వ తేదీన కొనుగోళ్లు పునఃప్రారంభమవుతాయని పేర్కొన్నారు.
న్యూస్‌రీల్
మార్కెట్‌కు పోటెత్తిన ధాన్యం
మినిమం ప్రైజ్ నిబంధనతో నష్టమని
ముందుకు రాని ట్రేడర్లు
ఆలస్యంగా ప్రారంభమైన కొనుగోళ్లు
పొట్టి ధాన్యం కొంటలేరు
రెండెకరాల్లో వరి సాగు చేసిన. జనగామ పట్టణంలోని ఓ ఫర్టిలైజ ర్ షాపు యజమాని 553తోపాటు మరో రకానికి చెందిన నాలుగు విత్తన ప్యాకెట్లు ఇచ్చాడు. అందులో దొడ్డురకమని పొట్టి రకానికి చెందిన విత్తనాలు ఇచ్చాడు. ఆ ధాన్యం మార్కెట్‌కు తీసుకు వస్తే కొనేవారు లేరు. ఈసారి ప్రతికూల వాతావరణ పరిస్థితులతో 25 బస్తాల దిగుబడి తగ్గింది.
– వంగాల రవీందర్,
ఎర్రగొల్లపహాడ్(జనగామ)

కొనేవారేరి..?

కొనేవారేరి..?