సంప్రదాయాల చిహ్నం
జనగామ : ఉగాది పండుగ మన సంస్కృతీ సంప్రదాయాలకు చిహ్నం. బంధుమిత్రులతో కలిసి ఈ పండుగ చేసుకోవడం ఆనందంగా ఉంటుంది. పండగ రోజు సంప్రదాయంగా చీర కట్టుకోవడం ఎంతో త్రిల్లింగ్‌గా ఉంటుంది. ప్రకృతిలో లభించే పదార్థాలతో చేసే ఉగా ది పచ్చడి అంటే నాకు ఎంతో ఇష్టం. షడ్రుచుల సమ్మేళనాన్ని ఆస్వాదించడమంటే ప్రకృతితో మనం మమేకం అయ్యామనే భావన కలుగుతుంది. మా అమ్మ కూడా అనేక రకాల మొక్కలు పెంచుతూ ప్రకృతిని కాపడుతుంది.
– పి.స్థుతి, విద్యార్థిని,
ఇంటర్ సెకండియర్, జనగామ


