శనివారం శ్రీ 5 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
– 8లోu
ఈ ఫొటోల్లో ఆటవస్తువులపై ముళ్లకంచె వేసి ఉన్న పార్కు అంబేడ్కర్‌నగర్‌లోనిది. పట్టణంలోని రెవెన్యూ డివిజనల్ కార్యాలయం సమీపంలో ఉన్న ఈ పార్కులో ఒక్క మొక్క కూడా ఉండదు. ఆట వస్తువులన్నీ తుప్పు బట్టి పోయి పనికి రాకుండా పోతున్నాయి. పార్కులో ఆహ్లాదం ఏమో కానీ.. ముళ్ల కంపలతో కళా విహీనంగా మారింది. సాయంకాలం వేళ పిల్లలతో కలిసి పార్కుకు వెళ్తామనుకునే పట్టణ ప్రజలకు కనీసం చెట్టుకింద కూడా కూర్చునే పరిస్థితి లేదు. పార్కులో ఉన్న ఆట వస్తువులు దుమ్ముతో నిండిపోయి...అధికారుల నిర్లక్ష్యాన్ని వెక్కిరిస్తున్నాయి. పార్కు అభివృద్ధికి గతంలో ప్రణాళిక చేసినా..కాగితాలకే పరిమితం చేశారు.
న్యూస్‌రీల్
శనివారం శ్రీ 5 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025


