
భద్రకాళి అమ్మవారికి మల్లెలతో పుష్పార్చన
హన్మకొండ కల్చరల్: వరంగల్‌లోని భద్రకాళి ఆలయంలో వసంత నవరాత్రోత్సవాల్లో భాగంగా బుధవారం మల్లెపూలతో అమ్మవారికి పుష్పార్చన నిర్వహించారు. ఉదయం ఆలయ అర్చకులు అమ్మవారికి పూర్ణాభిషేకం, నిత్యాహ్నికం నిర్వహించా రు. అనంతరం వేద పండితులు, వేద పాఠశాల విద్యార్థులు మల్లెపూలకు సంప్రోక్షణ నిర్వహించి వాటితో అమ్మవారికి లక్షపుష్పార్చన చేశారు. పుష్పార్చనకు న్యాయవాది భాస్కరవజ్జుల పురుషోత్తం భవాని దంపతులు ఉభయదాతలుగా వ్యవహరించారు. ఆలయ ఈఓ శేషుభారతి, దేవాలయ సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు.