
నేటినుంచి సన్న బియ్యం
జనగామ: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. నేడు(మంగళవారం) సూర్యాపేటలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. అనంతరం జిల్లాలో కలెక్టర్ రిజ్వాన్ బాషా పర్యవేక్షణలో బియ్యం పంపిణీ మొదలవుతుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే జిల్లాకు 50 శాతానికి పైగా సన్న బియ్యం రేషన్ దుకా ణాలకు చేరాయి. జిల్లాలోని 12 మండలాల పరిధిలో 335 రేషన్ దుకాణాలు ఉన్నాయి. మొత్తం రేషన్ కార్డులు 1,61,472 ఉండగా.. అందులో అంత్యోదయ 10,754, అన్నపూర్ణ 90, తెల్లరేషన్ కార్డులు 1,50,628 ఉన్నాయి. ఆయా కార్డుల్లో 4,87,864 మంది కుటుంబ సభ్యులు ఉన్నారు. ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున నెల కోటా కింద 3,104.764 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం కేటాయించారు.
రేషన్ షాపుల్లో పంపిణీకి సిద్ధం
జిల్లాలో 335 దుకాణాలు
మొత్తం కార్డులు 1,61,472
లబ్ధిదారులు 4,87,864 మంది

నేటినుంచి సన్న బియ్యం