
జీవనయానంలో ఎన్నో ఒడిదొడుకులు..
● జీవితపరమార్థం తెలిపే ఆరు రుచులు
● ఉగాదికి కొత్తదారిలో అడుగులేద్దాం..
● శ్రీవిశ్వావసు తెలుగు
సంవత్సరాదికి స్వాగతం
జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను సమానంగా స్వీకరించి సంతోషంగా ముందుకు సాగాలని తెలిజేసేదే ఉగాది పచ్చడి పరమార్థం. షడ్రుచులు అంటే తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు. అలాగే సంతోషం, విచారం, ఐశ్వర్యం, పేదరికం, విజయం, పరాజయం ఆరు రుచుల మిశ్రమమే జీవితం. ఈ ఏడాది షడ్రుచుల సమ్మేళనంతో అందరి జీవితాలు సాగిపోవాలని ఆకాంక్షిస్తూ శ్రీవిశ్వావసు తెలుగు సంవత్సరాదికి స్వాగతం పలుకుదాం..
– హన్మకొండ కల్చరల్