
వనిత, వాసవీ క్లబ్ గ్రేటర్ జనగామ ఆధ్వర్యంలో..
వాసవీ, వనిత క్లబ్ గ్రేటర్ జనగామ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. క్లబ్ అధ్యక్షురాలు డాక్టర్ మాధవశెట్టి వరూధిని మాట్లాడుతూ నూతన సంవత్సరంలో శుభాలు చేకూరి, లాభాలు ఆర్జించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వాసవీ క్లబ్ గ్రేటర్ జనగామ అధ్యక్షుడు పదకంటి రవీందర్, కార్యదర్శి గట్టు రాధాకృష్ణ, కోశాధికారి కౌకోటి రామారావు, ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్, ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ గంగిశెట్టి ప్రమోద్ కుమార్, ప్రధాన కార్యదర్శి గన్ను నరసింహులు, కోశాధికారి బెజుగం భిక్షపతి, గంగిశెట్టి అనూజ, మాడిశెట్టి కళావతి, ములుగు నాగరాజు, ఉష, తదితరులు పాల్గొన్నారు.