Top Stories
ప్రధాన వార్తలు

కాసేపట్లో ఏపీ ఇంటర్ ఫలితాలు, ఒక్క క్లిక్‌తో క్షణాల్లో చెక్ చేసుకోండిలా..
విజయవాడ, సాక్షి: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరం పబ్లిక్ పరీక్షల ఫలితాలు మరికాసేపట్లో విడుదల కానున్నాయి. సరిగ్గా ఉదయం 11గం. సమయంలో రిజల్ట్స్‌ను వెల్లడించనున్నట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి ప్రకటించింది. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్ష రాసిన విద్యార్థులకు కేవలం ఒకే ఒక్క క్లిక్‌తో www.sakshieducation.com వెబ్సైట్లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.ఇదిలా ఉంటే.. ఇంటర్లో ఈ ఏడాది 10 లక్షలకుపైగా విద్యార్థులు పరీక్షలు రాశారు. మార్చి - 19 వరకు ఫస్టియర్ పరీక్షలు జరగగా, మార్చి 3- 20 వరకు సెకండియర్ పరీక్షలను నిర్వహించారు. జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ పూర్తి కావడంతో ఇవాళ ఫలితాలను వెల్లడించనున్నారు. AP Inter Results 2025.. ఎలా చెక్ చేసుకోవాలి.. ?➤ ముందుగా https://results.sakshieducation.com ను క్లిక్ చేయండి.➤ "AP Inter 1st Year / 2nd Year Results 2025" అనే లింక్‌పై క్లిక్ చేయండి.➤ మీ హాల్‌టికెట్ నెంబర్‌ను ఎంటర్ చేయండి.➤ వివరాలు ఎంటర్ చేసి సబ్మిట్ బటన్‌ను క్లిక్ చేయండి. ➤ తర్వాతి స్క్రీన్‌లో ఫలితాలు డిస్ప్లే అవుతాయి.➤ భవిష్యత్ అవసరాల కోసం డౌన్లోడ్/ప్రింట్ అవుట్ తీసుకోండి.

Vanajeevi Ramaiah: ట్రీ మ్యాన్ ఆఫ్ ఇండియా ఇక లేరు
సాక్షి, ఖమ్మం: ప్రముఖ సామాజిక కార్యకర్త, జీవితమంతా మొక్కలు నాటేందుకే గడిపిన ప్రకృతి ప్రేమికుడు ‘వనజీవి’ రామయ్య(85) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం వేకువజామున గుండెపోటుతో కన్నుమూశారు. కోటికి పైగా మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో రామయ్య చేసిన కృషికిగానూ కేంద్ర ప్రభుత్వం ఆయన్ని పద్మశ్రీ పురస్కారం ఇచ్చి సత్కరించింది.దరిపల్లి రామయ్య(Daripalli Ramaiah) స్వగ్రామం ఖమ్మం రూరల్ మండలంలోని ముత్తగూడెం. ఇక్కడే ఐదో తరగతి దాకా చదువుకున్నారు కూడా. ఆ సమయంలో మల్లేశం సర్ చెప్పిన మొక్కల పెంపకం పాఠాలు రామయ్యను బాగా ప్రభావితం చేశాయి. ఆపై పంటపొలాల కోసం చిన్నతనంలోనే రెడ్డిపల్లికి రామయ్య కుటుంబం మకాం మార్చింది. మల్లేశం సర్ పాఠాల స్ఫూర్తితో తన ఇంటిలోని 40 కుంటల స్థలంలో ఇల్లు పోను మిగతా జాగలో చెట్లు నాటి వాటిని ప్రాణప్రదంగా పెంచారు. అక్కడి నుంచి.. దశాబ్దాలపాటు రోడ్ల పక్కన ఖాళీ స్థలం, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ స్థలాలు, దేవాలయాలు.. ఇలా ఒకటేమిటి ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడ మొక్కలు నాటడం రామయ్యకు నిత్యకృత్యమైంది. వృత్తిరీత్యా కుండలు చేస్తూ, పాలు అమ్ముతూ ప్రవృత్తి రీత్యా వనపెంపకానికి అవిశ్రాంతంగా కృషి చేశారాయన. మనవళ్లకు మొక్కల పేర్లు!వనజీవి రామయ్య((Vanajeevi Ramaiah)కు భార్య జానకమ్మ, నలుగురు సంతానం. ఓవైపు కుటుంబ భారాన్ని మోస్తూనే.. దశాబ్దాలకు పైగా మొక్కలు నాటుతూ వచ్చారు. విశేషం ఏంటంటే.. మనుమళ్లు, మనుమరాళ్లకు కూడా ఆయన చెట్ల పేర్లే పెట్టాడు. ఒకామె పేరు చందనపుష్ప. ఇంకో మనుమరాలు హరిత లావణ్య. కబంధపుష్ప అని ఇంకో పాపకు పెట్టాడు. మరో మనవరాలికి వనశ్రీ అని నామకరణం చేశారు వనజీవి రామయ్య.అలసిపోని వనజీవిఆయన యువతరం నుంచి నాటిన మొక్కలు నేడు మహావృక్షాలుగా దర్శనమిస్తున్నాయి. ఎండకాలం వచ్చిందంటే రామయ్య అడవుల్లోనే ఎక్కువ సమయం గడుపుతుంటారు. వయసు మీదపడుతున్నా కూడా అడవుల వెంట తిరుగుతూ వివిధ రకాల విత్తనాలను సేకరించేవారు. వాటన్నింటిని బస్తాల్లో నింపి ఇంటి దగ్గర నిల్వచేసేవారు. అందులో ఎవరికీ తెలియని చెట్ల విత్తనాలే ఎక్కువగా ఉండేవి. తొలకరి చినుకులు పడగానే మొక్కలు నాటే కార్యక్రమంలో మునిగిపోయేవారు. తాను మొక్కలను పెంచడం మాత్రమే కాదు.. పదిమందికి విత్తనాలు పంచి పెంచమని సూచించారు. బంధువుల ఇళ్ళలో పెళ్ళిళ్ళకు వెళ్ళినా సరే మొక్కలను, విత్తనాలను బహుమతులుగా ఇచ్చి పెంచమని ప్రోత్సహించే వారు. ఆ మధ్య ఆయనకు ఓ యాక్సిడెంట్ అయ్యింది. ఆ వాహనదారుడిని శిక్షించే బదులు అతనితో వంద మొక్కలు నాటించాలని పోలీసులను ఆయన కోరారు. అలాగే.. రైతు బంధు, దళిత బంధులాగా హరిత బంధు కూడా ఇప్పించాలంటూ బీఆర్ఎస్ హయాంలో ఆయన ఓ విజ్ఞప్తి కూడా చేశారు.సీఎం రేవంత్ సహా ప్రముఖుల సంతాపంపద్మశ్రీ వనజీవి రామయ్య మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ‘‘ప్రకృతి పర్యావరణం లేనిదే మానవ మనుగడ లేదనే సిద్ధాంతాన్ని బలంగా నమ్మిన వ్యక్తి వనజీవిగా పేరుగాంచిన దరిపల్లి రామయ్య గారు. ఒక వ్యక్తిగా మొక్కలు నాటడం ప్రారంభించి మొత్తం సమాజాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి పద్మశ్రీ రామయ్య గారు. వారి మరణం సమాజానికి తీరని లోటు, కుటుంబ సభ్యులకు తీవ్ర సంతాపం తెలియజేసిన సీఎం రేవంత్ రెడ్డి.పర్యావరణ రక్షణకు పాటుపడుతూ తన జీవితాన్ని అంకితం చేసిన రామయ్య గారి ఆత్మకు నివాళి. వారు సూచించిన మార్గం నేటి యువతకు ఆదర్శం అని ఒక ప్రకటన విడుదల చేశారు.ప్రచార సాధనాలుప్లాస్టిక్ డబ్బాలు, విరిగిపోయిన కుర్చీలు, ప్లాస్టిక్ కుండలు, రింగులు.. ఇలా ఆయన తన హరితహారం ప్రచారానికి సాధనాలుగా ఉపయోగించుకోనంటూ వస్తువు లేదు. వాటికి తన సొంత డబ్బులతో రంగులు అద్ది.. అక్షరాలు రాసి తలకు ధరించేవారు. అలా.. తను ఎక్కడికి వెళ్లనా మొక్కల పెంపకంపై అవగాహన కలిగించడం ఆయనకంటూ దేశవ్యాప్తంగా ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చి పెట్టింది. ఎక్కడ ఏ కార్యక్రమాలు జరిగినా ‘‘వృక్షోరక్షతి రక్షిత’’ అని రాసివున్న ప్లకార్డులను తగిలించుకుని ప్రచారం చేసేవారాయన. అడిగిందే ఆలస్యం.. 120 రకాల మొక్కల చరిత్రను అలవోకగా వివరించేవారాయన.అవార్డులు, పాఠంగా రామయ్య జీవితంకోటికి పైగా మొక్కలను నాటి ట్రీ మ్యాన్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందిన రామయ్య సేవలకుగాను పలు సంస్థలు అవార్డులతో సత్కరించాయి. 2005 సంవత్సరానికి సెంటర్‌ఫర్ మీడియా సర్వీసెస్ సంస్థ నుంచి వనమిత్ర అవార్డు ఇచ్చింది. యూనివర్సల్ గ్లోబల్ పీస్ అనే అంతర్జాతీయ సంస్థ ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేసింది. 1995లో భారత ప్రభుత్వం నుంచి వనసేవా అవార్డు దక్కింది. సాక్షి మీడియా సంస్థ సైతం ఆయన సేవలకుగానూ ఎక్సలెన్స్(Sakshi Excellence Award) అవార్డుతో సత్కరించింది. ఇక.. మహారాష్ట్ర ప్రభుత్వం వనజీవి రామయ్య జీవితాన్ని పాఠ్యాంశంగా ప్రవేశపెట్టింది. అక్కడి తెలుగు విద్యార్థుల కోసం 9వ తరగతి తెలుగు పుస్తకంలో రామయ్య జీవితం పాఠ్యాంశంగా బోధిస్తున్నారు. మరోవైపు.. తెలంగాణ 6వ తరగతి సాంఘిక శాస్త్రంలో వనజీవి కృషిని పాఠ్యాంశంగా పిల్లలకు బోధిస్తున్నారు. 2017 సంవత్సరంలో నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మశ్రీ (సామాజిక సేవ) పురస్కారం అందుకుంటూ..

జుకర్‌బర్గ్‌పై సంచలన ఆరోపణలు
మెటా అధినేత మార్క జుకర్‌బర్గ్‌పై ఆ సంస్థ మాజీ ఎగ్జిక్యూటివ్ విజిల్‌బ్లోయర్(వేగు) సారా విన్ విలియమ్స్ సంచలన ఆరోపణలకు దిగారు. జుకర్‌బర్గ్‌కు అమెరికా ప్రయోజనాల కన్నా డబ్బే ముఖ్యమని, ఈ క్రమంలోనే చైనాతో చేతులు కలిపి తన సొంత దేశం జాతీయ భద్రతా విషయంలో రాజీ పడ్డారని వెల్లడించారామె. సెనేటర్ జోష్ హవ్యూలే నేతృత్వంలోని కౌంటర్‌టెర్రరిజం సబ్ కమిటీ ఎదుట హాజరైన ఆమె.. తన వాంగ్మూలంలో ఆసక్తికరమైన వివరాలను వెల్లడించారు. సీబీఎస్ కథనం ప్రకారం సారా విన్ వాంగ్మూలంలో.. చైనాలో వ్యాపార ఉనికిని పెంచుకోవడానికే మెటా కంపెనీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని అన్నారు. చైనాతో మార్క్ జుకర్‌బర్గ్ చేతులు కలిపారు. అందుకే.. పదే పదే అమెరికా జాతీయ భద్రతా విషయంలో మెటా రాజీ పడుతోంది. ఈ క్రమంలోనే అమెరికన్లతో సహా మెటా వినియోగదారుల డేటా చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ చేతుల్లోకి వెళ్తోందని ఆరోపించారామె. మెటా కంపెనీ చైనా ప్రభుత్వం కోసం కస్టమ్ సెన్సార్షిప్ను టూల్స్‌ను రూపొందించింది. తద్వారా కంటెంట్ విషయంలో నియంత్రణ వాళ్ల చేతుల్లోకి వెళ్తోంది. తాను స్వేచ్ఛావాదినని, దేశ భక్తుడినని అమెరికా జెండా కప్పేసుకుని ప్రకటించుకునే జుకర్‌బర్గ్.. గత దశాబ్దకాలంగా 18 బిలియన్ డాలర్ల వ్యాపార సామ్రాజ్యం అక్కడ ఎలా స్థాపించుకోగలిగారు?. ఇది అమెరికన్లను మోసం చేయడమే అని ఆమె అన్నారు. సారా విన్ విలియమ్స్ గతంలో ఫేస్బుక్లో గ్లోబల్ పబ్లిక్ పాలసీ డైరెక్టర్‌గా పని చేశారు. ఏడేళ్లపాటు సంస్థలో పని చేసిన ఆమె.. ఈ ఏడాది మార్చిలో కేర్లెస్ పీపుల్ పేరిట ఒక నివేదికను పుస్తకాన్ని విడుదల చేసి తీవ్ర చర్చనీయాంశంగా మారారు. అయితే ఈ పుస్తంపై మెటా కోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం ఆ పుస్తకాన్ని తాత్కాలికంగా నిషేధించింది. అయితే బుధవారంనాటి విచారణ సందర్భంగా.. ‘‘ఫేస్బుక్ ఆ పుస్త విషయంలో ఆమెను ఎందుకు నిలువరించాలని అనుకుంటోంది?.. అమెరికన్లకు వాస్తవం తెలియాల్సి ఉంది’’ అని సెనేటర్ జోష్ హవ్యూలే అభిప్రాయపడ్డారు. ఈ మేరకు తమ ఎదట హాజరై వివరణ ఇవ్వాలంటూ గురువారం జుకర్‌బర్గ్‌కు ఆయన ఓ లేఖ రాశారు. వాస్తవాలు బయటపెడితే తనను కోర్టుకు ఈడుస్తామంటూ మెటా బెదిరిస్తోందని సారా విన్ విలియమ్స్ చెబుతుండగా.. ఆమె ఆరోపణలన్నీ అవాస్తవమేనని, చైనాలో తమ కార్యకలాపాలు నడవడం లేదని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

ఢిల్లీలో దుమ్ము తుపాను, వర్ష బీభత్సం.. 205 విమాన సర్వీసులు ఆలస్యం
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులు వీస్తూ.. దుమ్ము తుపానుతో పాటు మోస్తారు వర్షం కురిసింది. ఈ క్రమంలో దుమ్ము, ధూళితో కూడిన గాలులు వీయడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు.. ఢిల్లీ క్రికెట్ స్టేడియంలో ముంబై టీమ్ ప్లేయర్స్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఈ తుపాన్ రావడంతో దీనికి సంబంధించిన వీడియోను టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ట్విట్టర్లో షేర్ చేశారు.వివరాల ప్రకారం.. దేశ రాజధానిలోని కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం ఈదురుగాలులు వీస్తూ మోస్తరు వర్షం కురిసింది. అంతకుముందు.. దుమ్ము తుపాను బీభత్సం సృష్టించింది. బలమైన గాలుల కారణంగా పలుచోట్ల కొన్నిచోట్ల చెట్టు కొమ్మలు విరిగిపడ్డాయి. ఈదురుగాలుల ఎఫెక్ట్‌తో ప్రతికూల వాతావరణం కారణంగా దాదాపు 205 విమాన సర్వీసులు ఆలస్యంగా నడిచాయి. దాదాపు 50 విమాన సర్వీసులను దారి మళ్లించినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు.Crazy wx! Gale and dust-storms at Dwarka, New Delhi.Heard from a friend at IGI airport, his aircraft was moving and guess what, he’s still on ground. You can imagine the wind speed then. #delhirain #delhiweather pic.twitter.com/BIOdq0bOq7— Anirban 👨💻✈️ (@blur_pixel) April 11, 2025ఈ నేపథ్యంలోనే ఎయిరిండియా, ఇండిగో విమానయాన సంస్థలు తమ ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేశాయి. విమానాల రాకపోకల ఆలస్యం కారణంగా ఎయిర్‌పోర్టులోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాదాపు 12 గంటలుగా విమానాశ్రయంలోనే వేచి చూసినట్లు ఒక మహిళ పేర్కొన్నారు. ఈ సందర్బంగా ప్రయాణికులు ట్విట్టర్ వేదికగా తమ ఆవేదన వ్యక్తం చేశారు. ముంబైకి వెళ్లేందుకు ఢిల్లీ విమానాశ్రయానికి వచ్చాం. ఉదయం 12 గంటలకు బుక్ చేసుకున్న విమానం కాకుండా మరొకటి ఎక్కాలని అధికారులు సూచించారు. అదికాస్త ఎక్కాక అందులోనే 4 గంటల పాటు కూర్చోబెట్టి తర్వాత దింపేశారు అని ఒక ప్రయాణికుడు తెలిపారు.Delhi NCR is under a heavy dust storm! Visuals from Gurgaon — very intense dust storm hits Gurugram. Stay safe everyone! pic.twitter.com/IqGVen4kLb— The Curious Quill (@PleasingRj) April 11, 2025ఇక, శ్రీనగర్ నుండి ఢిల్లీకి ముంబైకి సాయంత్రం 4 గంటలకు కనెక్టింగ్ విమానం ఉంది. మా విమానం సాయంత్రం 6 గంటలకు ఢిల్లీలో ల్యాండ్ కావాల్సి ఉంది, కానీ దుమ్ము తుఫాను కారణంగా చండీగఢ్‌కు మళ్లించబడింది. ఆ తర్వాత రాత్రి 11 గంటలకు తిరిగి ఢిల్లీకి వెళ్లింది అని ఎయిర్ ఇండియా విమానంలో ఉన్న మరో ప్రయాణీకుడు తెలిపారు. అంతర్జాతీయ విమానాశ్రయం అయి ఉండి సరైన సమాచారం ఇవ్వకపోవడంపై ఒక ప్రయాణికుడు ఆగ్రహం వ్యక్తంచేశారు.Flight Indigo 6E2397 jammu To delhi experiencing a dust storm, affecting takeoffs and landings and potentially causing air traffic congestion at delhi airport we are diverted to jaipur after long 4 hrs waiting to land at delhi now waiting in aircraft at jaipur airport for… pic.twitter.com/2GDeO19UK1— Dr. Safeer Choudhary (@aapkasafeer) April 11, 2025 Very strong #DustStorm Hit Delhi ncr#DelhiWeather pic.twitter.com/REZY7o8v5y— Raviiiiii (@Ravinepz) April 11, 2025आज दिल्ली में बवंडर 🌪️ आ गया …सभी अपने घर में सुरक्षित रहें 🙏🏻#delhiweather #sandstorm #DelhiRains #delhi pic.twitter.com/OCf4ZE7BfS— Shivam Rajput (@SHIVAMespeare) April 11, 2025 మరోవైపు.. ఢిల్లీలోని కక్రికెట్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ కోసం ముంబై ఇండియన్స్ ప్లేయర్స్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఈదురుగాలులు వీచాయి. ఈ క్రమంలో ప్లేయర్స్‌ను గ్రౌండ్ నుంచి లోపలికి వెళ్లాలని రోహిత్ శర్మ హెచ్చరించారు. దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ROHIT SHARMA, WHAT A CHARACTER 😀👌 pic.twitter.com/Ifz1YlNHX4— Johns. (@CricCrazyJohns) April 11, 2025 कल रात आए आंधी–तूफान का भयानक मंजर देखिए, गुरुग्राम का हैं वीडियो#Gurugram #Thunderstorm #WeatherUpdate #DelhiWeather pic.twitter.com/EMu90l1Bjf— Vistaar News (@VistaarNews) April 12, 2025

అతడిని ఎనిమిదో ఓవర్లో పంపిస్తారా? అసలు మెదడు పనిచేస్తోందా?!
చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఐపీఎల్-2025 (IPL 2025)లో తమ ఆరంభ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై గెలుపొందిన ఈ ఫైవ్ టైమ్ చాంపియన్.. ఆ తర్వాత పరాజయ పరంపర కొనసాగిస్తోంది. తాజాగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) చేతిలో ఘోర ఓటమిని చవిచూసింది.తద్వారా ఈ సీజన్లో వరుసగా ఐదు పరాజయాలు నమోదు చేసింది. సీఎస్కే చరిత్రలో ఇలాంటి పరాభవం ఇదే తొలిసారి. అది కూడా చెన్నైకి ఐదుసార్లు ట్రోఫీ అందించిన మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) సారథ్యంలో ఈ చేదు అనుభవం ఎదుర్కోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో సీఎస్కే ఆట తీరు, ధోని కెప్టెన్సీ తీరును భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారి తీవ్రంగా విమర్శించాడు.ప్రత్యర్థి తెలివిగా ఆడితే.. వీరు మాత్రందిగ్గజ ఆటగాడు, కెప్టెన్ అయిన ధోని నుంచి ఇలాంటి ఫలితాన్ని ఊహించలేదని.. అసలు వాళ్లకు మెదడు పనిచేయడం మానేసిందా అన్నట్లుగా మ్యాచ్ సాగిందని మనోజ్ తివారి ఘాటు వ్యాఖ్యలు చేశాడు. స్పిన్నర్లకు అనుకూలిస్తున్న పిచ్‌పై ప్రత్యర్థి తెలివిగా ఆడి గెలుపొందితే.. చెన్నై జట్టు మాత్రం తెల్లముఖం వేసిందని ఎద్దేవా చేశాడు.‘‘సీఎస్కే పరిస్థితి రోజురోజుకీ దిగజారిపోతోంది. ముఖ్యంగా గత మూడు- నాలుగు మ్యాచ్‌లలో వారి ప్రదర్శన మరీ నాసిరకంగా ఉంది. ఆటగాళ్ల షాట్ల ఎంపిక చెత్తగా ఉంటోంది. గత 20- 25 ఏళ్లుగా క్రికెట్ ఆడుతున్న వాళ్లకు కూడా ఏమైంది?అతడిని ఎనిమిదో ఓవర్లో పంపిస్తారా?అసలు వారి ప్రణాళికలు ఏమిటో నాకైతే అర్థం కావడం లేదు. మీ జట్టులో ప్రస్తుత పర్పుల్ క్యాప్ విజేత నూర్ అహ్మద్ ఉన్నాడు. కానీ అతడిని మీరు ఎప్పుడు బౌలింగ్‌కు పంపించారో గుర్తుందా? ఎనిమిదో ఓవర్.. అవును ఎనిమిదో ఓవర్..ప్రత్యర్థి జట్టులోని సునిల్ నరైన్ తన తొలి బంతికే వికెట్ తీసిన విషయం మీకు తెలియదా? దీనిని బట్టి పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తుందనే అంచనా రాలేదా? అలాంటపుడు మీ పర్పుల్ క్యాప్ విజేతను ముందుగానే ఎందుకు బౌలింగ్‌కు పంపలేదు?సాధారణంగా ధోని ఇలాంటి పొరపాట్లు చేయడు. చాలా ఏళ్లుగా అతడిని గమనిస్తూనే ఉన్నాం. ఇలాంటి తప్పు అయితే ఎన్నడూ చేయలేదు. కానీ ఈరోజు ఏమైంది? ఓటమి తర్వాతనైనా మీరు పొరపాట్లను గ్రహిస్తారనే అనుకుంటున్నా.అసలు మెదడు పనిచేస్తోందా?!మామూలుగా అయితే, అశ్విన్ లెఫ్టాండర్లకు రౌండ్ ది స్టంప్స్ బౌల్ చేస్తాడు. కానీ ఈరోజు అతడు కూడా ఓవర్ ది స్టంప్స్ వేశాడు. ధోని వంటి అనుభవజ్ఞుడైన, దిగ్గజ వికెట్ కీపర్ బ్యాటర్ ఉన్న జట్టులో ఇదేం పరిస్థితి? వాళ్లు మెదళ్లు పనిచేయడం ఆగిపోయాయా?’’ అంటూ మనోజ్ తివారి క్రిక్‌బజ్ షోలో సీఎస్కే, ధోనిపై విమర్శల వర్షం కురిపించాడు.కాగా చెపాక్‌లో కేకేఆర్‌తో టాస్ ఓడిన చెన్నై తొలుత బ్యాటింగ్ చేసింది. కోల్‌కతా బౌలర్ల ధాటికి 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి కేవలం 103 పరుగులే చేసింది. స్పిన్నర్లు సునిల్ నరైన్ మూడు, వరుణ్ చక్రవర్తి రెండు, మొయిన్ అలీ ఒక వికెట్ తీయగా.. పేసర్లు వైభవ్ అరోరా ఒకటి, హర్షిత్ రాణా రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.ధనాధన్.. 10.1 ఓవర్లలోనే ఇక సీఎస్కే బౌలింగ్ అటాక్‌ను పేసర్ ఖలీల్ అహ్మద్ ఆరంభించగా.. స్పిన్నర్ నూర్ అహ్మద్‌ను ఎనిమిదో ఓవర్లో రంగంలోకి దింపారు. అయితే, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నూర్ తన ఓవర్లో కేవలం రెండు పరుగులే ఇచ్చినా.. మరో రెండు ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ గెలుపు ఖరారైంది.సీఎస్కే విధించిన 104 పరుగుల లక్ష్యాన్ని 10.1 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు నష్టపోయి కేకేఆర్ పూర్తి చేసింది. ఓపెనర్లలో క్వింటన్ డికాక్ (23) రాణించగా.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ సునిల్ నరైన్ మెరుపు ఇన్నింగ్స్ (18 బంతుల్లో 44) ఆడాడు. కెప్టెన్ అజింక్య రహానే (17 బంతుల్లో 20).. రింకూ సింగ్ (12 బంతుల్లో 15)తో కలిసి కేకేఆర్‌ను గెలుపుతీరాలకు చేర్చాడు.చదవండి: వాళ్లలా మేము ఆడలేం.. మాకు అది చేతకాదు కూడా.. అయితే: ధోని Game set and done in a thumping style ✅@KKRiders with a 𝙆𝙣𝙞𝙜𝙝𝙩 to remember as they secure a comprehensive 8️⃣-wicket victory 💜Scorecard ▶ https://t.co/gPLIYGiUFV#TATAIPL | #CSKvKKR pic.twitter.com/dADGcgITPW— IndianPremierLeague (@IPL) April 11, 2025

గంట ప్రయాణం నిమిషంలో.. ప్రపంచంలోనే ఎత్తైన వంతెన
ఇప్పటికే అద్భుతాలకు నెలవైన చైనా త్వరలో ప్రపంచానికి మరో అద్భుతాన్ని చూపించబోతోంది. అదేమిటో తెలిసినవారంతా ఇప్పుటికే చైనా ప్రతిభకు కితాబిస్తున్నారు. చైనానోలోని గుయిజౌ ప్రావిన్స్‌లో నిర్మించిన హువాజియాంగ్ గ్రాండ్ కాన్యన్ బ్రిడ్జి(Huajiang Grand Canyon Bridge) జూన్ 25న ఆవిష్కృతం కానుంది. ఇదే ప్రపంచాన్ని అబ్బురపరిచే మరో వండర్. ఈ వంతెన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెనగా సరికొత్త రికార్డు సృష్టించనుంది.చైనా ఈ నూతన వంతెనను.. రెండు మైళ్ల దూరం మేరకు విస్తరించి ఉన్న ఒక భారీ లోయను దాటడానికి నిర్మించింది. ఈ నిర్మాణానికి చైనా సుమారు 216 మిలియన్ పౌండ్లు (₹2200 కోట్లు) వెచ్చించింది. ఇప్పటివరకూ ఈ లోయను వాహనాల్లో దాటేందుకు ఒక గంట సమయం పడుతుండగా, ఈ వంతెన నిర్మాణంతో కేవలం ఒక్క నిముషం(One minute)లో ఈ వెంతెనను దాటేయవచ్చని చైనా చెబుతోంది. ఈ వంతెన ఎత్తు పారిస్‌లోని ఈఫిల్ టవర్‌కు రెట్టింపు ఎత్తును కలిగి ఉంటుంది. China's Huajiang Grand Canyon Bridge is set to open this year, becoming the world's tallest bridge at 2050 feet high. Recent footage of the bridge has been released, showing crews putting on the finishing touches. One of the most insane facts about the bridge is that… pic.twitter.com/DLWuEV2sXQ— Collin Rugg (@CollinRugg) April 8, 2025ఈ వంతెన మీద ఒక గాజు నడక మార్గం ఏర్పాటవుతోంది. ఫలితంగా సందర్శకులు లోయలోని అద్భుత దృశ్యాలను చూడగలుగుతారు. ఈ వంతెన నుంచి అత్యంత ఎత్తైన బంజీ జంప్‌ను ఏర్పాటు చేయాలని చైనా యోచిస్తోంది. ఇది సాహస ప్రియులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. వంతెన సమీపంలో నివాస ప్రాంతాలను కూడా చైనా అభివృద్ధి చేయనుంది. ఇది పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేస్తుంది.ఈ వంతెన చైనాకున్న ఇంజనీరింగ్ సామర్థ్యాన్ని(Engineering ability) ప్రపంచానికి చాటిచెప్పే గొప్ప నిర్మాణంగా నిలుస్తుంది. అగాథంలాంటి లోయ మీద, ఇంత పొడవైన వంతెనను నిర్మించడం అనేది సాంకేతికంగా సవాలుతో కూడుకున్న పని. ఈ వంతెన స్థానికుల జీవన విధానాన్ని మరింత మెరుగుపరుస్తుంది. వాణిజ్య కార్యకలాపాలను సులభతరం చేస్తుంది. ఈ వంతెన ప్రపంచంలోని అత్యంత పొడవైన స్పాన్ వంతెనగా కూడా రికార్డు సృష్టించనుంది. చైనా గతంలోనూ పలు అద్భుత వంతెనలను నిర్మించింది. అయితే ఈ కొత్త వంతెన ఈ జాబితాలో మరో మైలురాయిగా నిలిచిపోనుంది.ఇది కూడా చదవండి: హనుమజ్జయంతి ఏటా రెండుసార్లు.. ఎందుకంటే..

తత్కాల్ బుకింగ్ టైమింగ్స్‌లో మార్పు లేదు: ఐఆర్సీటీసీ క్లారిటీ
ఆంగ్ల మీడియా కథనాలు ఐఆర్సీటీసీ (IRCTC) తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలో మార్పులు చేసినట్లు వెల్లడించాయి. వీటిని ఆధారంగా చేసుకుని మేము కూడా కథనం అందించాము. అయితే తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలో ఎలాంటి మార్పు లేదని ఐఆర్సీటీసీ స్పష్టం చేస్తూ అధికారికంగా వెల్లడించింది.ఏప్రిల్ 15 నుంచి కూడా తత్కాల్ టికెట్స్ బుకింగ్స్ సమయంలో ఎలాంటి మార్పు ఉండదు. కాబట్టి టైమింగ్ యథావిధిగానే ఉంటాయి. టికెట్స్ బుక్ చేసుకోవాలనుకునే వారు ఇప్పటి వరకు ఉన్న సమయాన్నే పాటించాలి. ఆ సమయాల్లోని టికెట్స్ అందుబాటులో ఉంటాయి.Some posts are circulating on Social Media channels mentioning about different timings for Tatkal and Premium Tatkal tickets. No such change in timings is currently proposed in the Tatkal or Premium Tatkal booking timings for AC or Non-AC classes. The permitted booking… pic.twitter.com/bTsgpMVFEZ— IRCTC (@IRCTCofficial) April 11, 2025

ఇంట్లో గొడవలు.. చనిపోదామనుకున్నా.. ఏడ్చేసిన గీతూ రాయల్
బిగ్‌బాస్ కంటెస్టెంట్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గీతూ రాయల్ (Geetu Royal) చెప్పినట్లు జనాలకు సింపతీ ఎక్కువే! ఎవరైనా బాధపడుతుంటే అస్సలు చూడలేరు. అన్నా, నేను రైతుబిడ్డనన్నా అని అమాయకంగా ముఖం పెట్టి ఓట్లు అడుక్కున్న పల్లవి ప్రశాంత్‌ను గెలిపించారు. అందరూ తనను ఒంటరి చేసి టార్గెట్ చేస్తున్నారన్న కౌశల్‌కూ విజయాన్ని అందించారు. బాలాదిత్య కన్నీళ్లతో సిగరెట్ల కోసం అర్థించినా వాటిని ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెట్టిందని గీతూ రాయల్‌ను బిగ్‌బాస్ షో నుంచి ఎలిమినేట్ చేశారు.ఏడ్చేసిన గీతూ..ఎలాగో ట్రోఫీ మనదే అని డిసైడ్ అయిన గీతూ రాయల్‌కు ఎలిమినేషన్ పెద్ద షాకే ఇచ్చింది. బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్ (Bigg Boss 6 Telugu) అయిపోయి మూడేళ్లు కావస్తున్నా ఇప్పటికీ ఆ బాధ నుంచి బయటకు రాలేకపోతోంది. బుల్లితెరపై ప్రసారమయ్యే షోలలోనూ పెద్దగా కనిపించడం లేదు. అలాంటిది గీతూ రాయల్ తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ కన్నీళ్లు పెట్టుకుంది. అందులో ఆమె మాట్లాడుతూ.. నేను బిగ్‌బాస్ బజ్ చేసేటప్పుడు మా ఇంట్లో చాలా గొడవలు జరిగాయి. చనిపోదామనుకున్నాతల గోడకేసి కొట్టుకోవాలనిపించింది. ఎందుకీ లైఫ్.. చనిపోదాం అనుకున్న సమయంలో కూడా టీవీ షోలో పాల్గొని నాపై జోకులేస్తే నవ్వుకున్నాను. ఎందుకంటే నేను ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉన్నాను. నేను చనిపోతుంటే కూడా కచ్చితంగా ఓ వీడియో తీసే పోతాను (కన్నీళ్లు పెట్టుకుంటూ). నేను గట్టిగా మాట్లాడతాను కానీ నేను చాలా వీక్, చాలా ఎమోషనల్. బిగ్‌బాస్ షోకి వెళ్లినప్పుడు అందరూ మెచ్చుకుంటుంటే నేనే విన్నర్ అనుకున్నాను. కట్ చేస్తే ఆరు వారాలకే ఎలిమినేట్ అయ్యాను. అందుకే వెళ్లలేదుబయట జనాల్ని చూశాక నేను విన్నర్ అవను అని అర్థమైంది. అందుకే రీఎంట్రీ ఆఫర్ చేసినా వెళ్లలేదు. పైగా అప్పటికే డిప్రెషన్లో ఉన్నాను. మనిషి ఆరోగ్యానికి హానికరమైన సిగరెట్లు దాచినందుకు నేను షో నుంచి బయటకు వచ్చేశాను అని తెలిసి నా బుర్ర పాడైపోయింది. ఒక డెలివరీ బాయ్ నా షూస్ దొంగతనం చేశాడని వీడియో చేస్తే కూడా నన్నే తిట్టారు. జనాలు నన్ను నెగెటివ్‌గానే చూస్తున్నారు.నాకు, నా భర్తకు గొడవఎక్కువగా షోలలో ఎందుకు కనిపించడం లేదంటే.. ఒకానొక సమయంలో చాలా పెద్ద మొత్తంలో డబ్బిచ్చేవారు. కానీ, ఇప్పుడు సగానికి సగం తగ్గించేశారు. అందుకే వాటిని ఒప్పుకోవడం లేదు. ఇకపోతే నా భర్త వికాస్, నేను కలిసే ఉన్నాం. కాకపోతే ఇస్మార్ట్ జోడీ సమయంలో నాకు, నా భర్తకు గొడవ జరిగింది. గొడవయినప్పుడు తనతో మాట్లాడను. అలాంటిది ఆ షోకు వెళ్లి అంతా బాగున్నట్లు ఎలా నటించగలం? అందుకే ఆ షో రిజెక్ట్ చేశాను. మా మధ్య చిన్నచిన్న గొడవలు జరుగుతూనే ఉంటాయి. తర్వాత మళ్లీ కలిసిపోతాం అని గీతూ రాయల్ చెప్పుకొచ్చింది.చదవండి: సర్కస్ చూస్తున్నట్లే ఉంది.. ధోని తీరుపై హీరో అసహనం

అయోధ్య గెస్ట్‌హౌస్‌లో దారుణం.. మహిళలు స్నానం చేస్తున్న వీడియో తీసి..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో దారుణ ఘటన వెలుగుచూసింది. అయోధ్యలోని ఒక గెస్ట్ హౌస్‌లో బాత్రూమ్లో మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీస్తున్న వ్యక్తిని ఉత్తరప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో అతడి ఫోన్లో వందల వరకు వీడియోలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.వివరాల ప్రకారం.. అయోధ్యలోని రామాలయం గేట్ నంబర్-3 దగ్గరలో రాజా గెస్ట్ హౌస్ ఉంది. రామాలయం దర్శనం కోసం అయోధ్యకు వచ్చిన వారు ఈ గెస్ట్‌హౌస్‌లో ఎక్కువ సంఖ్యలో ఉంటారు. అయితే, తాజాగా వారణాసికి చెందిన ఓ మహిళ తన కుటుంబ సభ్యులతో కలిసి అయోధ్యకు వచ్చారు. శుక్రవారం సదరు రాజా గెస్ట్‌హౌస్‌లో ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. ఈ క్రమంలో సాయంత్రం 6:00 గంటల ప్రాంతంలో సదరు మహిళ.. బాత్రూమ్లో స్నానం చేస్తుండగా.. గెస్ట్‌హౌస్‌లో పనిచేసే సౌరభ్ తివారీ అనే యువకుడు ఆమెను వీడియో తీశాడు. అది గమనించిన ఆమె.. ఒక్కసారిగా కేకలు వేసింది. దీంతో, ఆమె కుటుంబ సభ్యులు, అక్కడ పనిచేస్తున్న వారు అతడిని పట్టుకున్నారు.అనంతరం, ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్నారు. నిందితుడు సౌరభ్ తివారీని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద ఉన్న ఫోన్ తీసుకుని పరిశీలించగా.. మహిళలు స్నానం చేస్తున్న పది వీడియోలను, అనేక అశ్లీల ఫోటోలు, వీడియోలు ఉన్నట్టు గుర్తించారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.🚨 Ayodhya | A 30-year-old female devotee was secretly filmed while bathing at Raja Guest House near Gate No. 3 of the #Ayodhya Ram Temple.Another disturbing breach of women's privacy in UP.#Ayodhya #WomenSafety #PrivacyViolation #UPNews #indtoday pic.twitter.com/uWRtfpouvV— indtoday (@ind2day) April 11, 2025ఈ క్రమంలో బాధితురాలు మాట్లాడుతూ.. నేనుస్నానం చేసేందుకు బాత్రూమ్లోకి వెళ్లాను. బాత్రూమ్లో పైన ఒక టిన్ షెడ్ ఉంది. నేను స్నానం చేస్తుండగా, అకస్మాత్తుగా పైన ఒక నీడ కనిపించింది. అప్పుడు ఎవరో మొబైల్ ఫోన్‌తో రికార్డ్ చేయడం చూశాను. నేను భయపడి, అరిచి, నా బట్టలు వేసుకుని బయటకు పరిగెత్తాను. గెస్ట్ హౌస్‌లో బస చేసిన ఇతర అతిథులు కూడా బయటకు వెళ్లి ఆ వ్యక్తిని పట్టుకున్నారు అని తెలిపారు.

రోజులో 7 గంటలు దానికే : శాపమా, వరమా?!
ఆధునిక సాంకేతికత కారణంగా నగర జీవనశైలి పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా ఉద్యోగాలు, వ్యాపారాలు తదితర నిత్య క్రియలతో పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకూ టెక్నికల్ లైఫ్‌గా మారిపోయింది. ప్రధానంగా నగరవాసులు తమ జీవితంలో గ్యాడ్జెట్లను ఒక భాగంగా మార్చుకున్నారని.. ఉదయాన్నే నిద్ర లేపే అలారమ్ మొదలు రాత్రి నిద్రించే ముందు గంటల తరబడి మొబైల్ స్క్రీన్ చూడటం వరకూ ప్రతి క్షణం గ్యాడ్జెట్ల మధ్యనే గడుస్తోందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇవి మనిషి ఆరోగ్యం, ఫిట్నెస్, కమ్యూనికేషన్, విజ్ఞానం, వినోదం మొదలైన అనేక అంశాల్లో ప్రభావం చూపుతున్నాయి. – సాక్షి, సిటీబ్యూరో దైనందిన జీవితంలో విచ్చలవిడి వినియోగం విజ్ఞానం, వినియోగమూ ఎక్కువే..! గ్యాడ్జెట్స్ మన సౌలభ్యం కోసం ఆహ్వానించినవే ఐనప్పటికీ.. వీటి వినియోగంలో మంచి- చెడూ ప్రయోజనా లున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ గ్యాడ్జెట్స్‌పై ఎంత వరకూ ఆధారపడాలి, ఎంత వరకూ వినియోగించుకోవాలి, ఇవి చేస్తున్న మేలేంటి, కలిగిస్తున్న ముప్పు ఎంత అనేది విశ్లేíÙంచుకోవడం అవసరం. ముఖ్యంగా చిన్నారులు, యువతపై ఈ గ్యాడ్జెట్ల ప్రభావాన్ని నియంత్రించాల్సిన అవసరముందని ఎన్సీఈఆర్టీ వంటి సంస్థల అధ్యయనాలు చెబుతున్నాయి. స్మార్ట్ లైఫ్.. బ్యాడ్ రిజల్ట్.. ఆరోగ్య పరంగా ప్రస్తుతం స్మార్ట్ వాచ్‌లు, ఫిట్నెస్ బ్యాండ్లు వాడకం బాగా పెరిగింది. ముఖ్యంగా యాపిల్ వాచ్, ఫిట్‌బిట్, శామ్సంగ్ గెలాక్సీ వాచ్ వంటి డివైజ్‌లు మన హార్ట్ రేట్, నిద్ర, వాకింగ్ స్టెప్స్, క్యాలరీ బర్న్ వంటి వివరాలు మానిటర్ చేస్తాయి. ఇవి ఆరోగ్యంపై అవగాహన పెంచడంలో ఎంతో దోహదపడుతున్నా. అదే సమయంలో మితిమీరిన స్క్రీన్ టైం వల్ల మానసిక ఒత్తిడి, నిద్రలేమి, కళ్ల సమస్యలు వంటి దుష్పరిణామాలూ ఎదురవుతున్నాయి. ఫిట్నెస్ఫిట్నెస్ పరంగా షాఓమీ, ఎమ్ఐ బ్రాండ్, హానర్ బ్యాండ్‌లాంటివి మన వర్కౌట్ యాక్టివిటీలను ట్రాక్ చేస్తాయి. యూట్యూబ్, ఫిట్నెస్ యాప్‌ల ద్వారా ఇంట్లోనే వ్యాయామం చేయవచ్చు. దీని కోసం ఆన్లైన్ వేదికగా లెక్కకు మించిన వీడియోలు, సమాచారం అందుబాటులో ఉంది. కానీ ఈ గ్యాడ్జెట్లపై ఆధారపడుతూ నిజమైన ఫిజికల్ యాక్టివిటీకి, వ్యాయామానికి సమయం కేటాయించలేకపోతే ఫలితం కనబడదని కొందరు ఫిట్నెస్ ట్రైనర్ల సూచన. గ్యాడ్జెట్లతో 7 గంటలు.. స్మార్ట్ ఫోన్ సహాయంతో ఫేస్బుక్, ఇన్‌స్టా, వాట్సాప్, ఎక్స్ వంటి సామాజిక మాధ్యమాల్లో రోజంతా మునిగిపోయే స్థితికి చేరుకున్నారు. ఇది ఒంటరితనాన్ని, ఆత్మవిమర్శను పెంచే పెను ప్రమాదంగా మారింది. సోషల్ యాప్స్ సమాజానికీ, మనుషులకూ మధ్య సంధానకర్తగా మారాయి. ప్రపంచంలో ఎక్కడేం జరిగినా క్షణాల్లో చేరిపోతుండటం సాంకేతికత మాయాజాలమే. సామాజిక అభివృద్ధిలో ఇదొక కీలక మలుపు. కానీ ఈ వేదికగా లభ్యమయ్యే సమాచారంలో వాస్తవికత, నిజాలను తేల్చిచెప్పే అవకాశం అంతగా లేకపోవడంతో మంచి-చెడూ రెండు అంశాలు విస్తృతంగా ప్రచారమవుతున్నాయి. 2023లో ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎమ్ఏఐ), నిల్సెన్ సంయుక్తంగా నిర్వహించిన రిపోర్ట్ ప్రకారం.. భారతదేశంలో సగటు పౌరుడు రోజుకు సుమారు 7 గంటల పాటు డిజిటల్ గ్యాడ్జెట్లపై గడుపుతున్నాడు. ఇందులో 2.5 గంటలు సోషల్ మీడియా కోసం మాత్రమే వినియోగిస్తున్నాడని వెల్లడించారు. డిజిటల్ డిపెండెన్సీ.. వినోదం, గేమింగ్ రంగాల్లో ఈ గ్యాడ్జెట్లు మరో కొత్త యుగానికి నాంది పలికాయి. ఆక్యులస్ క్వెస్ట్, ప్లే స్టేషన్, వీఆర్ వంటి హెడ్సెట్లు వాస్తవిక అనుభూతిని అందిస్తూ, వినోదాన్ని సహజ అనుభూతిని పంచుతున్నాయి. ప్రస్తుత 5డీ టెక్నాలజీ గేమ్స్ అద్భుత వినోదంతో.. పాటు సమయాన్ని వృథా చేస్తోంది. భారతీయ పరిశోధన సంస్థ ఎయిమ్స్, ఐసీఎమ్ఆర్ నిర్వహించిన అధ్యయనంలో సుమారు 3000 మంది అత్యధిక స్క్రీన్ టైం వల్ల నిద్ర, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని తేల్చింది. మరీ ముఖ్యంగా యువతలో డిజిటల్ డిపెండెన్సీ పెరుగుతోందని పరిశోధకులు వెల్లడించాయి. ఆనందం.. ఆధిపత్యం కాకూడదు.. మొత్తానికి గ్యాడ్జెట్లు మన జీవితంలో అసాధారణ సౌలభ్యాలను, అనుకూలతలను తీసుచ్చినా, అవి మనిషిపై ఆధిపత్యం చెలాయించకుండా ఉండేందుకు మనమే జాగ్రత్తగా ఉండాలి. వాటిని సంతులితంగా వాడితే అవి వరంగా మారతాయి. లేకపోతే అవే మన స్వేచ్ఛను హరిస్తాయనడంతో ఎలాంటి సందేహం లేదు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్స్ చేపట్టిన పరిశోధనలో ఎక్కువగా మొబైల్ వాడకం వల్ల యువతలో ఆందోళన, ఒత్తిడి, ఒంటరితనం పెరిగినట్లు తేలింది. ఈ అధ్యయనంలో ‘నోమోఫోబియా’ (నో మొబైల్ ఫోబియా) అనే పరిస్థితి గురించి కూడా ప్రస్తావించారు.
ఢిల్లీలో దుమ్ము తుపాను, వర్ష బీభత్సం.. 205 విమాన సర్వీసులు ఆలస్యం
ఒత్తిడి లేకుండా ఆడటమే లక్ష్యం
రోజులో 7 గంటలు దానికే : శాపమా, వరమా?!
రాష్ట్ర ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు: వైఎస్ జగన్
ఇక బంగారం కొనడం కష్టమే!.. ఎందుకంటే?
అతడిని ఎనిమిదో ఓవర్లో పంపిస్తారా? అసలు మెదడు పనిచేస్తోందా?!
Menopause Awareness: ఇల్లు అండగా ఉండాలి!
ఇంట్లో గొడవలు.. చనిపోదామనుకున్నా.. ఏడ్చేసిన గీతూ రాయల్
సార్ నాకు పెళ్లి చూపులు .. మా అన్నను వదిలేయండి..!
జుకర్‌బర్గ్‌పై సంచలన ఆరోపణలు
'పుష్ప 2'తో ఫేమ్.. ఇప్పుడు కొత్త కారు
మారిన తత్కాల్ టికెట్ బుకింగ్ రూల్స్: ఏప్రిల్ 15 నుంచే అమలు
తెలుగు కథతో తీసిన హిందీ సినిమా.. Day 1 కలెక్షన్స్ ఎంత?
ఈ రాశి వారికి ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.. ఆత్మీయులు దగ్గరవుతారు.
ఏఐ బేబీ కృత్రిమ మేధ ఐవీఎఫ్ విధానంలో తొలి శిశువు జననం
పృథ్వీ షాకు బంపరాఫర్.. ధోని టీమ్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ!?
మెట్రోస్టేషన్లో ప్రేమికుల రొమాన్స్
వివాదంలో యాంకర్ రవి, సుడిగాలి సుధీర్.. మరి చిరంజీవిది తప్పు కాదా?
ఐపీఎల్‌కు పోటీగా పాకిస్తాన్ సూపర్ లీగ్.. స్టార్ క్రికెటర్లు వీరే
కాసేపట్లో ఏపీ ఇంటర్ ఫలితాలు, ఒక్క క్లిక్‌తో క్షణాల్లో చెక్ చేసుకోండిలా..
సగం కంటే తక్కువ ధరకే ఐఫోన్ 15..
కిరాణ కొట్టు కుర్రాడు.. ఒక్క రాత్రిలో కోటీశ్వరుడయ్యాడు!
భారత విద్యార్థులపై ట్రంప్ సంచలన నిర్ణయం.. కేంద్రం అలర్ట్
ఇన్‌స్టా లవర్‌తో వివాహిత పెళ్లి
CSK Vs KKR: ‘ద్రోహి వచ్చేశాడు చూడండి... జీవితం చాలా చిత్రమైనది’
ఇంత కాలం పని చేయకున్నా వైదొలగమనలేదు.. ఇప్పుడే ఎందుకంటున్నారని అడుగుతున్నారు సార్!
ఫ్యాన్స్ కోసమే తీసిన సినిమా.. Day 1 కలెక్షన్స్ ఎంత?
Love Marriage: 15 రోజులకే ప్రేమపెళ్లి పెటాకులు
వరంగల్ మెగా జాబ్ మేళాలో తొక్కిసలాట
వీడియో: అరేయ్ బులుగు చొక్కా.. ఏం పనులు రా అవి?
చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని.. ఐపీఎల్ హిస్టరీలోనే
అంతుచిక్కని ఆచూకీ.. ఎస్ఎల్బీసీ టన్నెల్లో అసలేం జరుగుతోంది?
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 21 సినిమాలు
వచ్చేవారం స్టాక్‌మార్కెట్ ట్రేడింగ్ 3 రోజులే..
'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' రివ్యూ.. నవ్వులతో మెప్పించారా?
నల్లకోటు లేదు.. గుండీలు పెట్టుకోలేదు
సారీ చెప్పినా సరే!.. ముంబై ఇండియన్స్ స్టార్‌పై ఏడాది నిషేధం
వరుస షాక్‌లు.. పీఎస్ఎల్ నుంచి తప్పుకున్న మరో స్టార్ ప్లేయర్
RCB Vs DC: ఇదేం కెప్టెన్సీ?.. పాటిదార్‌పై కోహ్లి ఫైర్?!.. అతడు కెప్టెన్‌తో మాట్లాడాల్సింది!
వివాహమైనా కుమార్తె అర్హురాలే..
నేడు ఓటీటీలోకి వచ్చేసిన హిట్ సినిమాలు.. ఎందులో స్ట్రీమింగ్
Vanajeevi Ramaiah: ట్రీ మ్యాన్ ఆఫ్ ఇండియా ఇక లేరు
ఏపీకి చల్లని కబురు.. వారం రోజుల పాటు వర్షాలు
నీకు 21, నాకు 43.. ఓ ఆడిటర్ ప్రేమ వివాహం
సమ్మర్లో సులభంగా తిరుమల పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోండి ఇలా..!
సర్కస్ చూస్తున్నట్లే ఉంది.. ధోని తీరుపై హీరో అసహనం
IPL 2025: ధోనిది ఔటా? నాటౌటా? అంపైర్‌పై ఫ్యాన్స్ ఫైర్
టీడీపీ తోడేళ్లు.. జనసేన గుంటనక్కలపై కేసులేవీ?: శ్యామల
విదేశీ విద్యార్థులపై... ఎందుకీ కత్తి?
ఖజానాకు భూమ్
JEE Mains: విద్యార్థుల్ని పరీక్షకు దూరం చేసిన డిప్యూటీ సీఎం పవన్
అమ్మా.. కాసేపు పడుకుంటా! అని శాశ్వత నిద్రలోకి..
ఓలా ఎలక్ట్రిక్ తొలి ‘రోడ్‌స్టర్ ఎక్స్’ బైక్ విడుదల
డీఎంకే మంత్రి అసభ్యకర వ్యాఖ్యలు.. పార్టీ పదవి నుంచి తొలగింపు
సూర్యాపేట కోర్టు సంచలన తీర్పు.. కూతురిని చంపిన తల్లికి ఉరిశిక్ష
ప్రపంచంలోని టాప్ 20 ఎయిర్‌పోర్ట్‌లు
పిరికిపందల్లారా.. ఒళ్లంతా విషం నింపుకుని ఎలా బతుకుతున్నార్రా?: త్రిష
అన్నీ ఒకేలా చేయలేం.. మీకు చెప్పడం ఈజీనే.. ఏడ్చేసిన శేఖర్ మాస్టర్
మరో కొత్త పథకం.. రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
మందు బాబులకు షాక్.. ఎల్లుండి వైన్ షాపులు బంద్
అప్పు చేసి ఫీజులు
గూగుల్‌లో ఆగని లేఆఫ్‌లు.. మళ్లీ వందలాది తొలగింపులు
తేడాకొట్టిన 'జాక్'.. తొలిరోజు కలెక్షన్ ఇంత తక్కువా?
‘అన్నీ చేయాలనే ఉంది తమ్ముళ్లూ.. కానీ గల్లా పెట్టె ఖాళీ’
ఈ రాశి వారికి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.. అదనపు రాబడి
వాట్ ఏ వెడ్డింగ్ మెనూ..ఆరోగ్య స్పృహకి అసలైన అర్థం..!
నరసింగాపురం పరువు హత్య కేసు.. వాట్సాప్ చాట్‌లో సంచలన విషయాలు
బట్టతల పర్లేదు..! ఎయిర్‌పోర్ట్‌లో నటి సోనాలికి ఎదురైన ఆ ఘటన
రోడ్డుపై టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి.. సామాన్యుడిలా నడుస్తూ..!
తమిళనాడు రాజకీయాల్లో కీలక మలుపు
2035 కల్లా భారత్‌కు సొంత అంతరిక్ష కేంద్రం
భారతీయులకు అలా జరగాల్సిందే.. హెడ్లీతో రాణా
తండ్రి వైద్యం కోసం ఇళ్ల పనికి వెళ్తున్న కుమార్తె..
పెళ్లీడుకొచ్చిన పిల్లలను వదిలేసి.. ఇదేం పాడు పని నారాయణ
శివదర్శిని ఫ్యాన్స్ ఇక్కడ : ఒక్క డ్యాన్స్‌కు 10 కోట్లా, వీడియో వైరల్
గత ఏడాది కంటే కటాఫ్ తగ్గే చాన్స్
జీతాల పెంపు ఇప్పుడు కాదు..
నరైన్ ఆల్ రౌండ్ షో.. సీఎస్కేపై కేకేఆర్ గ్రాండ్ విక్టరీ
పెళ్లింట విషాదం.. పెళ్లైన 22 రోజులకే నవ వధువు..
గిల్, సూర్య కాదు!.. టీమిండియా కెప్టెన్, రోహిత్ వారసుడిగా ఊహించని పేరు
korameenu కొరమీను.. కేరాఫ్ కరీంనగర్
ఆస్తి కోసం సవతి తల్లి ఘాతుకం.. వెలుగులోకి షాకింగ్ నిజాలు
ప్లాట్‌ఫామ్స్ మూత.. రైళ్లు మళ్లింపు
గంట ప్రయాణం నిమిషంలో.. ప్రపంచంలోనే ఎత్తైన వంతెన
ఇక చంద్రుడే కనిపిస్తాడు!
వాళ్లలా మేము ఆడలేం.. మాకు అది చేతకాదు కూడా.. అయితే: ధోని
ధోనిని కెప్టెన్ చేసినంత మాత్రాన చెన్నై రాత మారిపోదు!
క్రెడిట్ కార్డ్ బిల్లుల భారం.. ఉందిగా ఉపాయం!
‘రింగు’ పొడవునా సర్వీసు రోడ్లు!
పృథ్వీ షాను చూడు.. మనకూ అదే గతి పట్టవచ్చు.. జాగ్రత్త!
వొడాఫోన్ ఐడియా రుణాలు అప్
చెపాక్‌లో చెన్నై చిత్తుగా...
రాణా గుప్పిట కీలక రహస్యాలు!
తెలంగాణ పంటల విధానం మారాలి!
రాణా అప్పగింతపై స్పందించిన అమెరికా
పొదుపు సీక్రెట్ రివీల్ చేసిన నితిన్ కామత్
AP: రియల్.. ఢమాల్
పెట్రోల్ పంపులో ఉచిత సదుపాయాలివే..
ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం
ఓటీటీలో 'టైమ్ లూప్ హారర్' సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
టార్గెట్ చైనా ఎందుకంటే..!
నా రెండో పెళ్లిపై అంత ఆసక్తి ఎందుకు?.. రేణు దేశాయ్ ఆగ్రహం
కిలో మీటర్‌కు రూ.64.01 కోట్లు
సీనియర్ సిటిజన్లకు రూ. 990కే బీమా పాలసీ
డేవిడ్ వార్నర్ టాలీవుడ్ ఎంట్రీ.. ఆస్ట్రేలియా ప్రతినిధులతో దిల్ రాజు భేటీ!
చైనాకు చేయందించిన బంగ్లా.. షిప్మెంట్ రద్దుతో భారత్ ప్రతీకారం?
ద్రౌపది చేసిన వంటకమే పానీపూరి.. నేడు లక్షలకోట్ల బిజినెస్..
ఎవరైనా అతడికి కాస్త మర్యాద నేర్పండి: సెహ్వాగ్‌పై ఫ్యాన్స్ ఫైర్
ఈ ఫోటోలోని టాలీవుడ్ స్టార్ హీరో భార్య ఎవరో తెలుసా.. గుర్తు పట్టగలరా?
SRH vs PBKS: సన్‌రైజర్స్‌కో విజయం కావాలి!
ఢిల్లీలో దుమ్ము తుపాను, వర్ష బీభత్సం.. 205 విమాన సర్వీసులు ఆలస్యం
ఒత్తిడి లేకుండా ఆడటమే లక్ష్యం
రోజులో 7 గంటలు దానికే : శాపమా, వరమా?!
రాష్ట్ర ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు: వైఎస్ జగన్
ఇక బంగారం కొనడం కష్టమే!.. ఎందుకంటే?
అతడిని ఎనిమిదో ఓవర్లో పంపిస్తారా? అసలు మెదడు పనిచేస్తోందా?!
Menopause Awareness: ఇల్లు అండగా ఉండాలి!
ఇంట్లో గొడవలు.. చనిపోదామనుకున్నా.. ఏడ్చేసిన గీతూ రాయల్
సార్ నాకు పెళ్లి చూపులు .. మా అన్నను వదిలేయండి..!
జుకర్‌బర్గ్‌పై సంచలన ఆరోపణలు
'పుష్ప 2'తో ఫేమ్.. ఇప్పుడు కొత్త కారు
మారిన తత్కాల్ టికెట్ బుకింగ్ రూల్స్: ఏప్రిల్ 15 నుంచే అమలు
తెలుగు కథతో తీసిన హిందీ సినిమా.. Day 1 కలెక్షన్స్ ఎంత?
ఈ రాశి వారికి ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.. ఆత్మీయులు దగ్గరవుతారు.
ఏఐ బేబీ కృత్రిమ మేధ ఐవీఎఫ్ విధానంలో తొలి శిశువు జననం
పృథ్వీ షాకు బంపరాఫర్.. ధోని టీమ్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ!?
మెట్రోస్టేషన్లో ప్రేమికుల రొమాన్స్
వివాదంలో యాంకర్ రవి, సుడిగాలి సుధీర్.. మరి చిరంజీవిది తప్పు కాదా?
ఐపీఎల్‌కు పోటీగా పాకిస్తాన్ సూపర్ లీగ్.. స్టార్ క్రికెటర్లు వీరే
కాసేపట్లో ఏపీ ఇంటర్ ఫలితాలు, ఒక్క క్లిక్‌తో క్షణాల్లో చెక్ చేసుకోండిలా..
సగం కంటే తక్కువ ధరకే ఐఫోన్ 15..
కిరాణ కొట్టు కుర్రాడు.. ఒక్క రాత్రిలో కోటీశ్వరుడయ్యాడు!
భారత విద్యార్థులపై ట్రంప్ సంచలన నిర్ణయం.. కేంద్రం అలర్ట్
ఇన్‌స్టా లవర్‌తో వివాహిత పెళ్లి
CSK Vs KKR: ‘ద్రోహి వచ్చేశాడు చూడండి... జీవితం చాలా చిత్రమైనది’
ఇంత కాలం పని చేయకున్నా వైదొలగమనలేదు.. ఇప్పుడే ఎందుకంటున్నారని అడుగుతున్నారు సార్!
ఫ్యాన్స్ కోసమే తీసిన సినిమా.. Day 1 కలెక్షన్స్ ఎంత?
Love Marriage: 15 రోజులకే ప్రేమపెళ్లి పెటాకులు
వరంగల్ మెగా జాబ్ మేళాలో తొక్కిసలాట
వీడియో: అరేయ్ బులుగు చొక్కా.. ఏం పనులు రా అవి?
చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని.. ఐపీఎల్ హిస్టరీలోనే
అంతుచిక్కని ఆచూకీ.. ఎస్ఎల్బీసీ టన్నెల్లో అసలేం జరుగుతోంది?
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 21 సినిమాలు
వచ్చేవారం స్టాక్‌మార్కెట్ ట్రేడింగ్ 3 రోజులే..
'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' రివ్యూ.. నవ్వులతో మెప్పించారా?
నల్లకోటు లేదు.. గుండీలు పెట్టుకోలేదు
సారీ చెప్పినా సరే!.. ముంబై ఇండియన్స్ స్టార్‌పై ఏడాది నిషేధం
వరుస షాక్‌లు.. పీఎస్ఎల్ నుంచి తప్పుకున్న మరో స్టార్ ప్లేయర్
RCB Vs DC: ఇదేం కెప్టెన్సీ?.. పాటిదార్‌పై కోహ్లి ఫైర్?!.. అతడు కెప్టెన్‌తో మాట్లాడాల్సింది!
వివాహమైనా కుమార్తె అర్హురాలే..
నేడు ఓటీటీలోకి వచ్చేసిన హిట్ సినిమాలు.. ఎందులో స్ట్రీమింగ్
Vanajeevi Ramaiah: ట్రీ మ్యాన్ ఆఫ్ ఇండియా ఇక లేరు
ఏపీకి చల్లని కబురు.. వారం రోజుల పాటు వర్షాలు
నీకు 21, నాకు 43.. ఓ ఆడిటర్ ప్రేమ వివాహం
సమ్మర్లో సులభంగా తిరుమల పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోండి ఇలా..!
సర్కస్ చూస్తున్నట్లే ఉంది.. ధోని తీరుపై హీరో అసహనం
IPL 2025: ధోనిది ఔటా? నాటౌటా? అంపైర్‌పై ఫ్యాన్స్ ఫైర్
టీడీపీ తోడేళ్లు.. జనసేన గుంటనక్కలపై కేసులేవీ?: శ్యామల
విదేశీ విద్యార్థులపై... ఎందుకీ కత్తి?
ఖజానాకు భూమ్
JEE Mains: విద్యార్థుల్ని పరీక్షకు దూరం చేసిన డిప్యూటీ సీఎం పవన్
అమ్మా.. కాసేపు పడుకుంటా! అని శాశ్వత నిద్రలోకి..
ఓలా ఎలక్ట్రిక్ తొలి ‘రోడ్‌స్టర్ ఎక్స్’ బైక్ విడుదల
డీఎంకే మంత్రి అసభ్యకర వ్యాఖ్యలు.. పార్టీ పదవి నుంచి తొలగింపు
సూర్యాపేట కోర్టు సంచలన తీర్పు.. కూతురిని చంపిన తల్లికి ఉరిశిక్ష
ప్రపంచంలోని టాప్ 20 ఎయిర్‌పోర్ట్‌లు
పిరికిపందల్లారా.. ఒళ్లంతా విషం నింపుకుని ఎలా బతుకుతున్నార్రా?: త్రిష
అన్నీ ఒకేలా చేయలేం.. మీకు చెప్పడం ఈజీనే.. ఏడ్చేసిన శేఖర్ మాస్టర్
మరో కొత్త పథకం.. రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
మందు బాబులకు షాక్.. ఎల్లుండి వైన్ షాపులు బంద్
అప్పు చేసి ఫీజులు
గూగుల్‌లో ఆగని లేఆఫ్‌లు.. మళ్లీ వందలాది తొలగింపులు
తేడాకొట్టిన 'జాక్'.. తొలిరోజు కలెక్షన్ ఇంత తక్కువా?
‘అన్నీ చేయాలనే ఉంది తమ్ముళ్లూ.. కానీ గల్లా పెట్టె ఖాళీ’
ఈ రాశి వారికి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.. అదనపు రాబడి
వాట్ ఏ వెడ్డింగ్ మెనూ..ఆరోగ్య స్పృహకి అసలైన అర్థం..!
నరసింగాపురం పరువు హత్య కేసు.. వాట్సాప్ చాట్‌లో సంచలన విషయాలు
బట్టతల పర్లేదు..! ఎయిర్‌పోర్ట్‌లో నటి సోనాలికి ఎదురైన ఆ ఘటన
రోడ్డుపై టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి.. సామాన్యుడిలా నడుస్తూ..!
తమిళనాడు రాజకీయాల్లో కీలక మలుపు
2035 కల్లా భారత్‌కు సొంత అంతరిక్ష కేంద్రం
భారతీయులకు అలా జరగాల్సిందే.. హెడ్లీతో రాణా
తండ్రి వైద్యం కోసం ఇళ్ల పనికి వెళ్తున్న కుమార్తె..
పెళ్లీడుకొచ్చిన పిల్లలను వదిలేసి.. ఇదేం పాడు పని నారాయణ
శివదర్శిని ఫ్యాన్స్ ఇక్కడ : ఒక్క డ్యాన్స్‌కు 10 కోట్లా, వీడియో వైరల్
గత ఏడాది కంటే కటాఫ్ తగ్గే చాన్స్
జీతాల పెంపు ఇప్పుడు కాదు..
నరైన్ ఆల్ రౌండ్ షో.. సీఎస్కేపై కేకేఆర్ గ్రాండ్ విక్టరీ
పెళ్లింట విషాదం.. పెళ్లైన 22 రోజులకే నవ వధువు..
గిల్, సూర్య కాదు!.. టీమిండియా కెప్టెన్, రోహిత్ వారసుడిగా ఊహించని పేరు
korameenu కొరమీను.. కేరాఫ్ కరీంనగర్
ఆస్తి కోసం సవతి తల్లి ఘాతుకం.. వెలుగులోకి షాకింగ్ నిజాలు
ప్లాట్‌ఫామ్స్ మూత.. రైళ్లు మళ్లింపు
గంట ప్రయాణం నిమిషంలో.. ప్రపంచంలోనే ఎత్తైన వంతెన
ఇక చంద్రుడే కనిపిస్తాడు!
వాళ్లలా మేము ఆడలేం.. మాకు అది చేతకాదు కూడా.. అయితే: ధోని
ధోనిని కెప్టెన్ చేసినంత మాత్రాన చెన్నై రాత మారిపోదు!
క్రెడిట్ కార్డ్ బిల్లుల భారం.. ఉందిగా ఉపాయం!
‘రింగు’ పొడవునా సర్వీసు రోడ్లు!
పృథ్వీ షాను చూడు.. మనకూ అదే గతి పట్టవచ్చు.. జాగ్రత్త!
వొడాఫోన్ ఐడియా రుణాలు అప్
చెపాక్‌లో చెన్నై చిత్తుగా...
రాణా గుప్పిట కీలక రహస్యాలు!
తెలంగాణ పంటల విధానం మారాలి!
రాణా అప్పగింతపై స్పందించిన అమెరికా
పొదుపు సీక్రెట్ రివీల్ చేసిన నితిన్ కామత్
AP: రియల్.. ఢమాల్
పెట్రోల్ పంపులో ఉచిత సదుపాయాలివే..
ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం
ఓటీటీలో 'టైమ్ లూప్ హారర్' సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
టార్గెట్ చైనా ఎందుకంటే..!
నా రెండో పెళ్లిపై అంత ఆసక్తి ఎందుకు?.. రేణు దేశాయ్ ఆగ్రహం
కిలో మీటర్‌కు రూ.64.01 కోట్లు
సీనియర్ సిటిజన్లకు రూ. 990కే బీమా పాలసీ
డేవిడ్ వార్నర్ టాలీవుడ్ ఎంట్రీ.. ఆస్ట్రేలియా ప్రతినిధులతో దిల్ రాజు భేటీ!
చైనాకు చేయందించిన బంగ్లా.. షిప్మెంట్ రద్దుతో భారత్ ప్రతీకారం?
ద్రౌపది చేసిన వంటకమే పానీపూరి.. నేడు లక్షలకోట్ల బిజినెస్..
ఎవరైనా అతడికి కాస్త మర్యాద నేర్పండి: సెహ్వాగ్‌పై ఫ్యాన్స్ ఫైర్
ఈ ఫోటోలోని టాలీవుడ్ స్టార్ హీరో భార్య ఎవరో తెలుసా.. గుర్తు పట్టగలరా?
SRH vs PBKS: సన్‌రైజర్స్‌కో విజయం కావాలి!
సినిమా

ఆస్కార్ అవార్డ్స్‌లో కొత్త విభాగం
‘‘సినిమాల్లో మేజిక్ చేసేవాటిలో స్టంట్స్ది కీలక భాగం. ఇప్పుడు ఆస్కార్స్‌లో కూడా భాగం అయ్యాయి. కొత్తగా స్టంట్ విభాగాన్ని చేర్చి, ఇక ప్రతి ఏడాదీ అవార్డు ఇవ్వనున్నాం. 2027లో విడుదలైన సినిమాలకు 2028లో జరిగే నూరవ ఆస్కార్ అవార్డ్స్ వేడుకలో ఈ విభాగంలో అవార్డు అందించనున్నాం’’ అని ఆస్కార్ అవార్డు కమిటీ సోషల్ మీడియా ద్వారా పేర్కొంది. ‘‘సినిమా తొలి నాళ్ల నుంచి స్టంట్ డిజైన్(Stunt Design) అనేది ఫిల్మ్ మేకింగ్‌లో అంతర్భాగంగా ఉంది. సాంకేతిక, సృజనాత్మకత కలిగిన కళాకారుల పనిని గౌరవించడం మాకు గర్వకారణం’’ అని అకాడమీ కమిటీ సీఈవో బిల్ క్రామెర్, అకాడమీ అధ్యక్షురాలు జానెట్ యాంగ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా కొత్తగా చేర్చిన ఈ స్టంట్ విభాగాన్ని ప్రకటించి, ఓ పోస్టర్ని విడుదల చేశారు. ఈ పోస్టర్లో హాలీవుడ్ చిత్రాలు ‘ఎవ్రీథింగ్ ఎవ్రీ వేర్, ఆల్ ఎట్ వన్స్, మిషన్ ఇంపాజిబుల్’ పోస్టర్స్‌తో పాటు తెలుగు చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ పోస్టర్ కూడా ఉండటం భారతీయ సినిమాకి గర్వకారణం అనే చెప్పాలి. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా నటించిన ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు పాటు...’ పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు దక్కిన విషయం తెలిసిందే. ఇక ఆస్కార్ అవార్డ్స్‌లో కొత్త విభాగం ‘స్టంట్ డిజైన్’ని చేర్చడం పట్ల రాజమౌళి ‘ఎక్స్’ వేదికగా ఈ విధంగా స్పందించారు. వందేళ్ల నిరీక్షణ ఫలించింది – రాజమౌళి ‘‘వందేళ్ల నిరీక్షణ ఫలించింది. 2027లో విడుదలయ్యే చిత్రాలకు కొత్తగా ఆస్కార్ స్టంట్ డిజైన్ విభాగం చేర్చడం ఆనందంగా ఉంది. ఈ విభాగంలో గుర్తింపును సాధ్యం చేసినందుకు డేవిడ్ లీన్, క్రిస్ ఓ’హారా మరియు స్టంట్ కమ్యూనిటీకి, స్టంట్ వర్క్ శక్తిని గౌరవించనున్నందుకు బిల్ క్రామెర్, జానెట్ యాంగ్‌లకు ధన్యవాదాలు. ఈ కొత్త విభాగం ప్రకటించిన సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో ‘ఆర్ఆర్ఆర్’ మూవీ యాక్షన్ విజువల్ మెరవడం చాలా సంతోషంగా ఉంది’’ అని రాజమౌళి ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం మహేశ్‌బాబు హీరోగా అంతర్జాతీయ స్థాయిలో భారీ బడ్జెట్‌తో ఓ చిత్రం తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. ఈ చిత్రం 2027 మార్చి 25న రిలీజ్ కానుందనే వార్త ప్రచారంలోకి వచ్చింది. ఈ విషయం పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. దశాబ్దాల కల నెరవేరెగా... స్టంట్ విభాగంలో ఆస్కార్ అవార్డును ప్రదానం చేయాలనే విషయంపై దశాబ్దాలుగా కొందరు ఆస్కార్ అవార్డు నిర్వాహకులతో సమావేశమయ్యారు కానీ ప్రయోజనం లేకుండాపోయింది. అయితే స్టంట్ మేన్‌గా కెరీర్ ఆరంభించి, స్టంట్ కో–ఆర్డినేటర్‌గానూ చేసి, ఆ తర్వాత ‘జాన్ విక్ (ఓ దర్శకుడిగా), డెడ్ పూల్ 2, బుల్లెట్ ట్రైన్, ది ఫాల్ గై’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన డేవిడ్ లీచ్ ఈ మధ్య కొందరితో కలిసి ‘స్టంట్ డిజైన్’ విభాగాన్ని చేర్చాలని కోరుతూ, గట్టిగా నినాదాలు చేశారు. దానికి తగ్గ ఫలితం దక్కింది.ఆ విధంగా స్టంట్ విభాగానికి ఆస్కార్ అవార్డ్స్‌లో గుర్తింపుని కోరిన కొందరి దశాబ్దాల కల నెరవేరినట్లు అయింది. ఇక గతంలో స్టంట్ విభాగంలో అవార్డు లేని సమయంలో 1967లో స్టంట్ డైరెక్టర్ యాకిమా కానట్ట్ గౌరవ ఆస్కార్ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత 2013లో స్టంట్ డైరెక్టర్ హాల్ నీధమ్కి కూడా ప్రత్యేక ఆస్కార్ ప్రదానం చేసి, గౌరవించింది ఆస్కార్ అవార్డు కమిటీ. ఇక 2028లో జరగనున్న నూరవ ఆస్కార్ అవార్డుతో ఆరంభించి, ప్రతి ఏటా ‘స్టంట్ డిజైన్’ విభాగంలో అవార్డుని ప్రదానం చేయనున్నారు.

అల్లు అర్జున్‌తో సమంత వన్స్‌మోర్!
అల్లు అర్జున్, సమంత మరోసారి సిల్వర్ స్క్రీన్‌పై జంటగా కనిపించే అవకాశాలు ఉన్నాయనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో తెరపైకి వచ్చింది. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాలో అల్లు అర్జున్, సమంత తొలిసారిగా జోడీ కట్టారు. ఆ తర్వాత అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప: ది రైజ్’ చిత్రంలోని ప్రత్యేక గీతం ‘ఊ అంటావా...’లో అల్లు అర్జున్, సమంత కలిసి కొన్ని డ్యాన్స్ స్టెప్పులేశారు. తాజాగా ఈ జోడీ మరోసారి రిపీట్ కానుందట.అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మించనుంది. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ సినిమా చిత్రీకరణను మొదలు పెట్టాలనుకుంటున్నారట. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ చిత్రంలో ఇద్దరు మెయిన్ హీరోయిన్స్, మరో ముగ్గురు అమ్మాయిలు కీలక పాత్రల్లో నటించనున్నారట. ఈ మెయిన్ హీరోయిన్స్లోని ఒక రోల్ కోసం సమంతను తీసుకోవాలని చిత్రయూనిట్ ప్లాన్ చేస్తోందని సమాచారం. మరి... అల్లు అర్జున్, సమంతల జోడీ మరోసారి స్క్రీన్‌పై రిపీట్ అవుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఈ సంగతి ఇలా ఉంచితే... అట్లీ దర్శకత్వంలో వచ్చిన ‘తేరీ’ (తెలుగులో ‘పోలీసోడు’), ‘మెర్సెల్’ (అదిరింది) చిత్రాల్లో సమంత ఓ హీరోయిన్గా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది.

'పుష్ప 2'తో ఫేమ్.. ఇప్పుడు కొత్త కారు
సాధారణంగా కొరియోగ్రాఫర్స్ పెద్దగా ఫేమస్ అవ్వరు. కానీ కొన్నిరోజుల క్రితం జానీ మాస్టర్(Jani Master)పై పోలీస్ కేసు పెట్టి వార్తల్లో నిలిచింది శ్రష్ఠి వర్మ(Shrasti Verma) అనే కొరియోగ్రాఫర్. ఇప్పుడు ఈమె కొత్త కారు కొనుగోలు చేసింది.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 21 సినిమాలు) ఢీ షోతో గుర్తింపు తెచ్చుకున్న శ్రష్ఠి వర్మది మధ్యప్రదేశ్. షోలో పాల్గొన్న తర్వాత కొన్నాళ్లకు జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా చేరింది. మరి ఏమైందో ఏమో గానీ కొన్నాళ్ల క్రితం ఒకరిపై ఒకరు పోలీసు కేసులు పెట్టడం వరకు వెళ్లింది.మరోవైపు పుష్ప 2(Pushpa 2 Movie)మూవీలోనూ కొన్ని పాటలకు ఈమె కొరియోగ్రాఫీ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోలని తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. అలా బన్నీ సినిమాతో ఫేమ్ సంపాదించిన శ్రష్ఠి.. ఇప్పుడు హుండాయ్ కారు కొనుకున్నానని తెగ సంతోషపడిపోతుంది. ఈ ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: ఎట్టకేలకు క్షమాపణలు చెప్పిన యాంకర్ రవి)

వాట్ నెక్ట్స్?
చిత్ర పరిశ్రమలో విజయాలను బట్టి కొత్త అవకాశాలు వరిస్తుంటాయి. ఈ విషయంలో నటీనటులకు కొంత మినహాయింపు ఉంటుందని చెప్పాచ్చు. కానీ దర్శకుల పరిస్థితి అలా కాదు. హిట్స్ అనేవి వారి కెరీర్‌ని నిర్ణయిస్తుంటాయన్నది ఇండస్ట్రీ టాక్. ఒక్క హిట్టు పడితే వరుస ఆఫర్లు క్యూ కడతాయి. అదే ఫ్లాపులొస్తే మాత్రం వాట్ నెక్ట్స్? మనకు అవకాశం ఇచ్చే హీరో ఎవరు? నిర్మాత ఎవరు? వంటి ప్రశ్నలు వారిలో మెదులుతుంటాయి. మరికొందరు దర్శకులు హిట్ ఇచ్చినా నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం ఎదురు చూపులు తప్పడం లేదు. ఈ నిరీక్షణ సమయం కొందరికి ఆరేళ్లు, నాలుగేళ్లు, మరికొందరికి మూడేళ్లు, ఇంకొందరికి రెండేళ్లు, ఏడాదిన్నర ఉంటోంది. మరి... ‘వాట్ నెక్ట్స్’ అంటే... ప్రస్తుతానికి ‘నో ఆన్సర్’. రెండేళ్లు దాటినా... కృష్ణవంశీ పేరు చెప్పగానే కుటుంబ కథా చిత్రాలు గుర్తొస్తాయి. బంధాలు, బంధుత్వాలు, అనురాగం, ఆప్యాయతలు, భావోద్వేగాలను తనదైన శైలిలో అందంగా తెరకెక్కించే క్రియేటివ్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. అయితే ‘చందమామ’ (2007) సినిమా తర్వాత కృష్ణవంశీకి చెప్పుకోదగ్గ హిట్ పడలేదు. 2017లో వచ్చిన ‘నక్షత్రం’ సినిమా తర్వాత దాదాపు ఆరేళ్లు గ్యాప్ తీసుకున్న అనంతరం ఆయన తెరకెక్కించిన చిత్రం ‘రంగ మార్తాండ’. ప్రకాశ్‌రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం కీలక పాత్రల్లో నటించారు. 2023 మార్చి 22న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించి, కన్నీరు పెట్టించింది. ఈ సినిమా విడుదలై రెండేళ్లు దాటినా కృష్ణవంశీ తర్వాతిప్రాజెక్టుపై ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. నాలుగు సంవత్సరాలు దాటినా... తెలుగు చిత్ర పరిశ్రమలో వైవిధ్యమైన చిత్రాలకు కేరాఫ్‌గా పేరు సొంతం చేసుకున్నారు చంద్రశేఖర్ ఏలేటి. ‘ఐతే’ (2003) మూవీ ద్వారా డైరెక్టర్‌గా పరిచయయ్యారాయన. ఇండస్ట్రీలో రెండు దశాబ్దాలకుపైగా కెరీర్ పూర్తి చేసుకున్న చంద్రశేఖర్ తీసింది కేవలం ఏడు సినిమాలు (ఐతే, అనుకోకుండా ఒకరోజు, ఒక్కడున్నాడు, ప్రయాణం, సాహసం, మనమంతా, చెక్) మాత్రమే. వీటిలో ‘ఐతే, అనుకోకుండా ఒకరోజు, సాహసం’ సినిమాలు విజయాలు అందుకున్నాయి. ‘ఒక్కడున్నాడు, ప్రయాణం, మనమంతా’ వంటివి మంచి చిత్రాలుగా నిలిచాయి. ఇక నితిన్ హీరోగా చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వం వహించిన ‘చెక్’ సినిమా 2021 ఫిబ్రవరి 26న విడుదలై ప్రేక్షకులను నిరాశపరచింది. ఈ చిత్రం విడుదలై నాలుగు సంవత్సరాలు దాటినా ఆయన తర్వాతి సినిమాపై ఇప్పటికీ ఎలాంటి స్పష్టత లేదు. ఆరేళ్లు అవుతున్నా.... తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా పద్దెనిమిదేళ్ల ప్రయాణం వంశీ పైడిపల్లిది. ప్రభాస్ హీరోగా నటించిన ‘మున్నా’ (2007) మూవీతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చారాయన. ఇన్నేళ్ల కెరీర్లో తెలుగులో ఇప్పటివరకూ ఆయన తీసింది ఐదు చిత్రాలే (మున్నా, బృందావనం, ఎవడు, ఊపిరి, మహర్షి) అయినా అన్నీ విజయాలు అందుకున్నాయి. తమిళ స్టార్ హీరోల్లో ఒకరైన విజయ్‌తో తమిళంలో ‘వారిసు’ (తెలుగులో వారసుడు) సినిమా చేశారు. ఈ చిత్రం 2023 సంక్రాంతి కానుకగా జనవరి 11న రిలీజై తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచింది. మహేశ్‌బాబు హీరోగా నటించిన ‘మహర్షి’ (2019) వంటి హిట్ సినిమా తర్వాత వంశీ పైడిపల్లి మరో తెలుగు సినిమా చేయలేదు. అలాగే తమిళంలోనూ ‘వారిసు’ తర్వాత అక్కడ కూడా ఏ మూవీ కమిట్ కాలేదు. తెలుగులో ఆయన సినిమా విడుదలై దాదాపు ఆరేళ్లు కావస్తున్నా తర్వాతిప్రాజెక్టుపై ఇప్పటివరకూ క్లారిటీ లేదు. ఆ మధ్య మహేశ్‌బాబుతో మరో సినిమా చేయనున్నారనే వార్తలు వచ్చినా ఎలాంటి ప్రకటన లేదు. అదే విధంగా షాహిద్ కపూర్ హీరోగా హిందీలో వంశీ పైడిపల్లి ఓ మూవీ తెరకెక్కించనున్నారని బాలీవుడ్లో వినిపించినా ఈప్రాజెక్టు గురించి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. మరి... వంశీ పైడిపల్లి తర్వాతి చిత్రం తెలుగులోనా? తమిళంలోనా? బాలీవుడ్లోనా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజలు వేచి చూడకతప్పదు. మూడేళ్లయినా... మాస్ సినిమాలు తీయడంలో, హీరోలకు మాస్ ఎలివేషన్స్ ఇవ్వడంలోనూ సురేందర్ రెడ్డి శైలి ప్రత్యేకమనే చె΄్పాలి. కల్యాణ్‌రామ్ హీరోగా రూ΄÷ందిన ‘అతనొక్కడే’ (2005) సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు సురేందర్ రెడ్డి. ‘అతనొక్కడే, కిక్, రేసుగుర్రం, ధృవ, సైరా నరసింహారెడ్డి’ వంటి విజయవంతమైన సినిమాలను తన ఖాతాలో వేసుకుని ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న ఆయన తర్వాతిప్రాజెక్ట్ ఏంటి? అనేదానిపై స్పష్టత లేదు.అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ‘ఏజెంట్’ సినిమా 2023 ఏప్రిల్ 28న రిలీజైంది. భారీ ఓపెనింగ్స్‌తో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అంచనాలు అందుకోలేకపోయింది. ప్రస్తుతం ‘లెనిన్’ అనే సినిమా చేస్తున్నారు అఖిల్. అయితే ‘ఏజెంట్’ తర్వాత సురేందర్ రెడ్డి తెరకెక్కించనున్న మూవీపై ఇప్పటివరకూ ఒక్క ప్రకటన కూడా రాలేదు. ఫలానా హీరోతో ఆయన తర్వాతి సినిమా ఉంటుందనే టాక్ కూడా ఇప్పటివరకూ రాలేదు.ఏడాది దాటినా.... టాలీవుడ్లో దాదాపు పదిహేనేళ్ల ప్రయాణం పరశురామ్‌ది. నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా వచ్చిన ‘యువత’ (2008) సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమయ్యారాయన. ఆ తర్వాత ‘ఆంజనేయులు, సోలో, సారొచ్చారు, శ్రీరస్తు శుభమస్తు, గీత గోవిందం, సర్కారువారి పాట, ఫ్యామిలీ స్టార్’ వంటి సినిమాలు తీశారు పరశురామ్. విజయ్ దేవరకొండ హీరోగా ఆయన తెరకెక్కించిన ‘గీతగోవిందం’ (2018) సినిమా బ్లాక్‌బస్టర్ అందుకోవడంతో పాటు వంద కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. ఆ సినిమా హిట్ అయినా నాలుగేళ్లు వేచి చూశారాయన. ఆ తర్వాత మహేశ్ బాబుతో ‘సర్కారువారి పాట’ (2022) సినిమా తీసి, హిట్ అందుకున్నారు.‘గీత గోవిందం’ వంటి హిట్ మూవీ తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా ‘ఫ్యామిలీ స్టార్’ అనే చక్కని కుటుంబ కథా చిత్రం తీశారు పరశురామ్. 2024 ఏప్రిల్ 5న విడుదలైన ఈ సినిమా మంచి విజయం అందుకుంది. అయితే ఈ సినిమా రిలీజై ఏడాది దాటినా ఆయన తర్వాతి సినిమాపై ఇప్పటికీ స్పష్టత లేదు. ‘ఫ్యామిలీ స్టార్’ నిర్మించిన నిర్మాత ‘దిల్’ రాజు బ్యానర్లోనే పర శురామ్ మరో సినిమా చేసే అవకాశం ఉందని వార్తలొచ్చినా ఎలాంటి ప్రకటన లేదు. అదే విధంగా కార్తీ హీరోగా పరశురామ్ ఓ సినిమా చేయనున్నారనే వార్తలు కూడా గతంలో వచ్చాయి. కానీ, ఈప్రాజెక్ట్పైనా ఎలాంటి అప్డేట్ లేదు. మూడేళ్లు పూర్తయినా.... అందమైన కుటుంబ కథా చిత్రాలతో పాటు సున్నితమైన ప్రేమకథలను తెరకెక్కించడంలో కిశోర్ తిరుమల శైలే వేరు. రామ్ హీరోగా ఆయన తెరకెక్కించిన ‘నేను శైలజ’ (2016) మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ సినిమా తర్వాత కిశోర్ తిరుమలని మరో హిట్ వరించలేదు. శర్వానంద్, రష్మికా మందన్నా జోడీగా ఆయన దర్శకత్వం వహించిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్రం 2022 మార్చి 4న రిలీజైంది. మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులను నిరాశపరిచింది. ఈ సినిమా విడుదలై మూడేళ్లు పూర్తయినా ఆయన నెక్ట్స్ప్రాజెక్ట్పై ఎలాంటి ప్రకటన లేదు. హీరో రవితేజతో ఓ సినిమా చేయనున్నారనే వార్తలు వినిపించినప్పటికీ ఇప్పటికీ స్పష్టత లేదు. ఒకటిన్నర సంవత్సరమైనా... అందమైన ప్రేమకథలే కాదు... చక్కని కుటుంబ కథా చిత్రాలు తీయడంలో దిట్ట శ్రీకాంత్ అడ్డాల. ‘కొత్తబంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ముకుంద, బ్రహ్మోత్సవం’ వంటి చిత్రాల తర్వాత తన పంథా మార్చి ‘నారప్ప, పెదకాపు 1’ వంటి మాస్ సినిమాలు తీశారాయన. ఆ చిత్రాలు అనుకున్నంత విజయాలు సాధించలేదు. ‘పెదకాపు 1’ చిత్రం 2023 సెప్టెంబర్ 29న రిలీజైంది. ఈ మూవీకి సీక్వెల్‌గా ‘పెదకాపు 2’ ఉంటుందని చిత్రయూనిట్ గతంలో ప్రకటించింది. అయితే రెండో భాగంపై ఇప్పటి వరకూ ఎలాంటి అప్డేట్ లేదు. మరి శ్రీకాంత్ అడ్డాల తర్వాతి చిత్రంగా ‘పెదకాపు 2’ ఉంటుందా? లేకుంటే మరోప్రాజెక్ట్ని ప్రకటిస్తారా? అనేది వేచి చూడాలి. ఏడాదిన్నర దాటినా... ‘నిన్ను కోరి, మజిలీ’ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నారు శివ నిర్వాణ. ఆ తర్వాత ‘టక్ జగదీష్, ఖుషి’ సినిమాలు తీశారాయన. విజయ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ‘ఖుషి’ సినిమా 2023 సెప్టెంబరు 1న విడుదలై విజయం అందుకుంది. ఆ చిత్రం రిలీజై ఏడాదిన్నర దాటిపోయినా శివ నిర్వాణ నెక్ట్స్‌ప్రాజెక్ట్ గురించి ఎలాంటి అప్డేట్ లేదు. తొలి చిత్రం ‘ఆర్ఎక్స్ 100’ (2018) సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకున్నారు డైరెక్టర్ అజయ్ భూపతి. ఆ తర్వాత ‘మహాసముద్రం’ (2021) సినిమాతో ప్రేక్షకులను నిరాశపరిచన ఆయన ‘మంగళవారం’ (2023) సినిమాతో మరో హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నారు. ఆ సినిమా విడుదలై ఏడాదిన్నర కావస్తున్నా ఆయన తర్వాతి చిత్రంపై ఎలాంటి అప్డేట్ లేదు. అయితే ‘మంగళవారం’ సినిమాకి సీక్వెల్ ఉంటుందని, ఈ మూవీ ప్రీప్రోడక్షన్ పనుల్లో ఆయన బిజీగా ఉన్నారని ఫిల్మ్‌నగర్ టాక్. వీరే కాదు... మరికొందరు దర్శకుల తర్వాతి సినిమాలపైనా ఎలాంటి ప్రకటన లేదు. ఏడాదిన్నరగా...‘ఆంధ్రావాలా’ (వీర కన్నడిగ), ‘ఒక్కడు’ (అజయ్) వంటి తెలుగు సినిమాల కన్నడ రీమేక్‌తో శాండిల్‌వుడ్‌కి దర్శకుడిగా పరిచయమయ్యారు మెహర్ రమేశ్. ఎన్టీఆర్ హీరోగా రూపొందిన ‘కంత్రీ’ (2008) చిత్రం ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారాయన. ఆ తర్వాత ప్రభాస్ హీరోగా ‘బిల్లా’ (2009) చిత్రాన్ని తెరకెక్కించారు మెహర్ రమేశ్. తెలుగులో ‘శక్తి, షాడో, భోళా శంకర్’ వంటి సినిమాలు, కన్నడలో ‘వీర రణచండి’ (2017) మూవీ తెరకెక్కించారు. వెంకటేశ్ హీరోగా ఆయన తీసిన ‘షాడో’ (2013) సినిమా డిజాస్టర్ కావడంతో దాదాపు పదేళ్లు ఒక్క సినిమా కూడా చేయలేదు. అయితే లాంగ్ గ్యాప్ తర్వాత తెలుగు స్టార్ హీరోల్లో ఒకరైన చిరంజీవితో ‘భోళా శంకర్’ సినిమా చేసే అవకాశం అందుకున్నారు మెహర్ రమేశ్. 2023 ఆగస్టు 11న భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. ఈ సినిమా రిలీజై ఏడాదిన్నరకుపైగా అయినా ఇప్పటికీ తన తర్వాతి సినిమా గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు మెహర్ రమేశ్.
న్యూస్ పాడ్‌కాస్ట్

అమెరికా ఉత్పత్తులపై సుంకాలు 125 శాతానికి పెంపు... డొనాల్డ్ ట్రంప్ విధించిన 145 శాతానికి ప్రతీకారంగా చైనా నిర్ణయం

చర్యకు ప్రతి చర్య తప్పదు.. అధికార దురహంకారంతో ప్రవర్తిస్తే ప్రజలు, దేవుడు కచ్చితంగా మొట్టికాయ వేస్తారు... ఏపీ సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి హెచ్చరిక

చైనా మినహా మిగతా దేశాలపై ప్రతీకార సుంకాల అమలు 90 రోజుల పాటు వాయిదా... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన... చైనా ఉత్పత్తులపై 125 శాతం సుంకాలు విధిస్తున్నట్లు స్పష్టీకరణ

మీ కుటుంబానికి అండగా ఉంటాం... పాపిరెడ్డిపల్లిలో లింగమయ్య కుటుంబాన్ని ఓదార్చిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌లో ఆగిన ‘ఆరోగ్యశ్రీ’!. సమ్మెలో నెట్వర్క్ ఆస్పత్రులు

ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్... 3 వేల 500 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించని ప్రభుత్వం... సమ్మె బాటలో ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులు

ఏపీలో ఊరూ వాడా ఏరులై పారుతున్న వైనం. కూటమి నేతల సిండికేట్ కబంధ హస్తాల్లో మద్యం షాపులు.

వక్ఫ్ సవరణ బిల్లుపై ముస్లింలను దగా చేసిన ఏపీ సీఎం చంద్రబాబు... మూడు సవరణలు ప్రతిపాదించామంటూ తెలుగుదేశం పార్టీ గొప్పలు... అవి పసలేని సవరణలేనని మైనార్టీల ఆగ్రహం

తక్షణమే పనులు నిలిపివేయండి కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు

వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం... అనుకూలంగా 288, వ్యతిరేకంగా 232 ఓట్లు... నేడు రాజ్యసభ ముందుకు బిల్లు
క్రీడలు

హేలీ మాథ్యూస్ ఆల్‌రౌండ్ షో
లాహోర్: హేలీ మాథ్యూస్ మరోసారి ఆల్‌రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టడంతో... అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల వన్డే వరల్డ్‌కప్ క్వాలిఫయింగ్ టోర్నీలో వెస్టిండీస్ తొలి విజయం నమోదు చేసుకుంది. మొదటి మ్యాచ్‌లో స్కాట్లాండ్ చేతిలో ఓడిన వెస్టిండీస్ జట్టు... రెండో మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై విజయం సాధించింది. శుక్రవారం జరిగిన పోరులో విండీస్ 6 వికెట్ల తేడాతో ఐర్లాండ్‌ను చిత్తు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 33 ఓవర్లకు కుదించగా... మొదట బ్యాటింగ్ చేసిన కరీబియన్ జట్టు 6 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హేలీ మాథ్యూస్ (18 బంతుల్లో 23; 5 ఫోర్లు) జట్టుకు మెరుపు ఆరంభాన్నివ్వగా... చినెల్లి హెన్రీ (36 బంతుల్లో 46; 2 ఫోర్లు, 1 సిక్స్), స్టెఫానీ టేలర్ (56 బంతుల్లో 46; 5 ఫోర్లు), జైదా జేమ్స్ (36) రాణించారు. ఐర్లాండ్ బౌలర్లలో జేన్ మాగుర్ 3 వికెట్లు పడగొట్టింది. అనంతరం లక్ష్యఛేదనలో ఐర్లాండ్ మహిళల జట్టు 32.2 ఓవర్లలో 175 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ అమీ హంటర్ (46 బంతుల్లో 48; 8 ఫోర్లు) ధాటిగా ఆడగా... మిగిలిన వాళ్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. గత మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో వీరోచిత శతకంతో పాటు... బౌలింగ్‌లో 4 వికెట్లతో విజృంభించినా... జట్టును గెలిపించుకోలేకపోయిన హేలీ మాథ్యూస్... తాజా పోరులోనూ 4 వికెట్లతో సత్తా చాటింది. మైదానంలో పాదరసంలా కదులుతూ మూడు క్యాచ్‌లు సైతం అందుకుంది. ఇతర విండీస్ బౌలర్లలో ఆలియా, కరిష్మా చెరో 2 వికెట్లు తీశారు. తదుపరి మ్యాచ్‌లో సోమవారం ఆతిథ్య పాకిస్తాన్‌తో వెస్టిండీస్ తలపడుతుంది.

‘సర్’ అండర్సన్
లండన్: ఇంగ్లండ్ క్రికెట్ దిగ్గజం జేమ్స్ అండర్సన్‌కు ప్రతిష్టాత్మక ‘నైట్‌హుడ్’ అవార్డు లభించింది. ఈ పురస్కార గ్రహీతల పేర్లకు ముందు ‘సర్’ జోడిస్తారు. టెస్టు క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన పేసర్‌గా రికార్డుల్లోకి ఎక్కిన అండర్సన్‌కు... బ్రిటన్ మాజీ ప్రధాని రిషీ సునాక్ రాజీనామా గౌరవ జాబితాలో ‘నైట్‌హుడ్’ గౌరవం లభించింది. 2002లో ఆ్రస్టేలియాపై అంతర్జాతీయ అరంగేట్రం చేసిన అండర్సన్... రెండు దశాబ్దాలకు పైగా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించి గతేడాది రిటైర్మెంట్ ప్రకటించాడు. జిమ్మీ 188 టెస్టుల్లో 704... 194 వన్డేల్లో 269... 19 టి20ల్లో 18 వికెట్లు పడగొట్టాడు. సుదీర్ఘ ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ముత్తయ్య మురళీధరన్ (800; శ్రీలంక), షేన్ వార్న్ (708; ఆ్రస్టేలియా) తర్వాత అండర్సన్ (704) మూడో స్థానంలో నిలిచాడు. బ్రిటిష్ ప్రభుత్వం ప్రకారం ఆటకు చేసిన సేవలకు గానూ అండర్సన్‌కు ‘నైట్‌హుడ్’ పురస్కారం లభించింది. కన్జర్వేటివ్ పార్టీ నాయకుడైన రిషీ సునాక్ క్రికెట్‌కు వీరాభిమాని. గతేడాది అండర్సన్‌తో పాటు ఇంగ్లండ్ ఆటగాళ్లతో అతడు నెట్స్ సెషన్లో సైతం పాల్గొని ప్రాక్టీస్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను మాజీ ప్రధాని సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన జిమ్మీ ప్రస్తుతం కౌంటీల్లో లాంకషైర్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. సంవత్సర కాలం పాటు ఆడనున్నట్లు ఈ ఏడాది జనవరిలో లాంకషైర్‌తో అండర్సన్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇది అతడికి 25వ ఫస్ట్ క్లాస్ సీజన్ కావడం గమనార్హం.

చెపాక్‌లో చెన్నై చిత్తుగా...
ఐపీఎల్ చరిత్రలో తొలిసారి వరుసగా ఐదో పరాజయం... మొదటిసారి సొంతగడ్డ చెపాక్ మైదానంలో వరుసగా మూడో ఓటమి... ధోని కెపె్టన్సీ పునరాగమనంలో సీఎస్కే మరింత పేలవ ప్రదర్శన కనబర్చింది. కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) పదునైన బౌలింగ్ ముందు చేతులెత్తేసిన సీఎస్కే భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఫటాఫట్‌గా 61 బంతుల్లోనే లక్ష్యాన్ని అందుకున్న కోల్‌కతా రన్‌రేట్‌ను ఒక్కసారిగా పెంచుకొని దూసుకుపోయింది. చెన్నై: ఐపీఎల్ 18వ సీజన్లో ఐదుసార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ వరుస వైఫల్యాలు కొనసాగుతున్నాయి. సొంత మైదానంలో బ్యాటింగ్ వైఫల్యంతో జట్టు మరో ఓటమిని మూటగట్టుకుంది. శుక్రవారం జరిగిన ఈ పోరులో కోల్‌కతా నైట్‌రైడర్స్ 8 వికెట్ల తేడాతో చెన్నైపై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 103 పరుగులే చేయగలిగింది. శివమ్ దూబే (29 బంతుల్లో 31 నాటౌట్; 3 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా, విజయ్‌శంకర్ (21 బంతుల్లో 29; 2 ఫోర్లు, 1 సిక్స్) కొన్ని పరుగులు జోడించాడు. అనంతరం కోల్‌కతా 10.1 ఓవర్లలో 2 వికెట్లకు 107 పరుగులు సాధించి గెలిచింది. సునీల్ నరైన్ (18 బంతుల్లో 44; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) శుభారంభంతో మరో 59 బంతులు మిగిలి ఉండగానే విజయం జట్టు సొంతమైంది. పేలవ బ్యాటింగ్... ఓపెనర్లు కాన్వే (12), రచిన్ (4) ఒకే స్కోరు వద్ద వెనుదిరగ్గా... రెండు సార్లు అదృష్టం కలిసొచ్చిన విజయ్ శంకర్ కొన్ని పరుగులు రాబట్టాడు. 0, 20 పరుగుల వద్ద అతను ఇచ్చిన సునాయాస క్యాచ్‌లను నరైన్, వెంకటేశ్ అయ్యర్ వదిలేశారు. రాహుల్ త్రిపాఠి (16) కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. ఆ తర్వాత చెన్నై 9 పరుగుల తేడాతో అశ్విన్ (1), జడేజా (0), దీపక్ హుడా (0), ధోని (1) వికెట్లను కోల్పోయింది. 71/6 వద్ద బ్యాటింగ్ కుప్పకూలే పరిస్థితి ఉండటంతో చెన్నై ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా బ్యాటర్ హుడాను తీసుకు రాగా, అతనూ డకౌటయ్యాడు. వరుసగా 63 బంతుల పాటు జట్టు ఫోర్ కొట్టలేకపోయింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా...మరో ఎండ్‌లో నిలబడిన దూబే తన 20వ బంతికి గానీ తొలి ఫోర్ కొట్టలేకపోయాడు. చివరి ఓవర్లో అతను మరో రెండు ఫోర్లు కొట్టడంతో ఎట్టకేలకు స్కోరు 100 పరుగులు దాటింది. చకచకా లక్ష్యం వైపు... ఛేదనలో కోల్‌కతాకు ఎలాంటి ఇబ్బందీ ఎదురు కాలేదు. క్వింటన్ డికాక్ (16 బంతుల్లో 23; 3 సిక్స్‌లు), నరైన్ ధాటిగా ఆడుతూ 26 బంతుల్లోనే 46 పరుగులు జోడించారు. ఖలీల్ ఓవర్లో డికాక్ 2 సిక్స్‌లు బాదగా, అశ్విన్ ఓవర్లో నరైన్ ఫోర్, సిక్స్ కొట్టాడు. ఖలీల్ తర్వాత ఓవర్లో కేకేఆర్ 2 సిక్స్‌లు, ఫోర్‌తో 18 పరుగులు రాబట్టడంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 71 పరుగులకు చేరింది. ఆపై అశ్విన్ ఓవర్లో నరైన్ మరో 2 సిక్స్‌లు బాదాడు. విజయానికి 19 పరుగుల దూరంలో నూర్ అహ్మద్ అతడిని అవుట్ చేసినా... అజింక్య రహానే (17 బంతుల్లో 20 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్), రింకూ సింగ్ (12 బంతుల్లో 15 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) కలిసి పని పూర్తి చేశారు. ధోని అవుటా...నాటౌటా! ఎప్పటిలాగే అభిమానులు ఎదురు చూసేలా చేసీ చేసీ చివరకు 9వ స్థానంలో ధోని బ్యాటింగ్‌కు దిగాడు. నాలుగు బంతులు మాత్రమే ఎదుర్కొన్న అతను నరైన్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. అంపైర్ అవుట్‌గా ప్రకటించగా ఈ నిర్ణయంపై ధోని ‘రివ్యూ’ కోరాడు. బంతి బ్యాట్‌ను దాటుతున్న సమయంలో ‘స్నికో’లో కాస్త కదలిక కనిపించినా... టీవీ అంపైర్ వినోద్ శేషన్ దీనిని లెక్కలోకి తీసుకోకుండా అవుట్‌గా ఖాయం చేశాడు. దీనిపై ఫోర్త్ అంపైర్ తన్మయ్ శ్రీవాత్సవను కలిసి చెన్నై కోచ్ ఫ్లెమింగ్ తన అసంతృప్తిని ప్రదర్శించడం కనిపించింది. స్కోరు వివరాలు చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రచిన్ (సి) రహానే (బి) హర్షిత్ 4; కాన్వే (ఎల్బీ) (బి) అలీ 12; త్రిపాఠి (బి) నరైన్ 16; విజయ్ శంకర్ (సి) అలీ (బి) వరుణ్ 29; శివమ్ దూబే (నాటౌట్) 31; అశ్విన్ (సి) అరోరా (బి) హర్షిత్ 1; జడేజా (సి) డికాక్ (బి) నరైన్ 0; హుడా (సి) అరోరా (బి) వరుణ్ 0; ధోని (ఎల్బీ) (బి) నరైన్ 1; నూర్ (సి) వరుణ్ (బి) అరోరా 1; అన్షుల్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 103. వికెట్ల పతనం: 1–16, 2–16, 3–59, 4–65, 5–70, 6–71, 7–72, 8–75, 9–79. బౌలింగ్: వైభవ్ అరోరా 4–0–31–1, మొయిన్ అలీ 4–1–20–1, హర్షిత్ రాణా 4–0–16–2, వరుణ్ చక్రవర్తి 4–0–22–2, సునీల్ నరైన్ 4–0–13–3. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: డికాక్ (బి) అన్షుల్ 23; నరైన్ (బి) నూర్ 44; రహానే (నాటౌట్) 20; రింకూ సింగ్ (నాటౌట్) 15; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (10.1 ఓవర్లలో 2 వికెట్లకు) 107. వికెట్ల పతనం: 1–46, 2–85. బౌలింగ్: ఖలీల్ 3–0–40–0, అన్షుల్ 2–0–19–1, అశ్విన్ 3–0–30–0, నూర్ 2–0–8–1, జడేజా 0.1–0–9–0. ఐపీఎల్లో నేడులక్నో x గుజరాత్ వేదిక: లక్నోమధ్యాహ్నం 3: 30 గంటల నుంచి హైదరాబాద్ x పంజాబ్ వేదిక: హైదరాబాద్‌రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

IPL 2025: ధోనిది ఔటా? నాటౌటా? అంపైర్‌పై ఫ్యాన్స్ ఫైర్
ఐపీఎల్-2025లో చెన్నై సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఈ మెగా టోర్నీలో సీఎస్కే వరుసగా ఐదో ఓటమి చవిచూసింది. శుక్రవారం చెపాక్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో సీఎస్కే పరాజయం పాలైంది. మరోసారి సీఎస్కే బ్యాటర్లు తేలిపోయారు. కేకేఆర్ బౌలర్ల దాటికి చెన్నై బ్యాటర్లు వరుస క్రమంలో పెవిలియన్‌కు చేరారు. ఏ ఒక్క బ్యాటర్ కూడా కేకేఆర్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కోలేకపోయారు. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ మూడు వికెట్లు పడగొట్టగా.. హర్షిత్ రానా, వరుణ్ చక్రవర్తి తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు వైభవ్ ఆరోరా, మోయిన్ అలీ తలా వికెట్ సాధించారు. సీఎస్కే బ్యాటర్లలో శివమ్ దూబే(31 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం 104 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేకేఆర్ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి కేవలం 10.1 ఓవర్లలోనే చేధించింది. కేకేఆర్ బ్యాటర్లలో సునీల్ నరైన్(18 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 44) టాప్ స్కోరర్‌గా నిలవగా.. డికాక్(23 ), రహానే(20 నాటౌట్), రింకూ సింగ్(15 నాటౌట్) తమ వంతు పాత్ర పోషించారు. అయితే ఈ మ్యాచ్‌లో ధోని ఔట్ చర్చనీయాశంగా మారింది. ధోని ఔట్‌గా ప్రకటిస్తూ థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయంపై సర్వాత్ర విమర్శల వర్షం కురుస్తోంది.ధోనిది ఔటా? నాటౌటా?సీఎస్కే ఇన్నింగ్స్ 16 ఓవర్ వేసిన సునీల్ నరైన్ బౌలింగ్‌లో మూడో బంతిని ధోని ఢిపెన్స్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బంతి మాత్రం బ్యాట్‌కు దగ్గరగా వెళ్తూ ధోని ప్యాడ్‌కు తాకింది. వెంటనే బౌలర్‌తో పాటు వికెట్ కీపర్ ఎల్బీకి అప్పీల్ చేశారు.దీంతో ఫీల్డ్ అంపైర్ క్రిస్ గాఫ్నీ ఔట్ అని వేలు పైకెత్తాడు. ఈ క్రమంలో ధోని అంపైర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రివ్యూ తీసుకున్నాడు. థర్డ్ అంపైర్ తొలుత అల్ట్రా ఎడ్జ్‌ను చెక్ చేశాడు. అయితే బంతి బ్యాట్‌ను దాటినప్పుడు కాస్త కదలిక కన్పించింది. దీంతో అంపైర్ నాటౌట్‌గా ప్రకటిస్తాడని అంతాభావించారు. కానీ థర్డ్ అంపైర్ మాత్రం క్లియర్‌గా బ్యాట్, బాల్‌కు మధ్య గ్యాప్ ఉందని థర్డ్ అంపైర్ పేర్కొన్నాడు. ఆ తర్వాత బాల్ ట్రాకింగ్‌లో బంతి స్టంప్‌లను తాకుతోందని స్ఫష్టం కావడంతో అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. దీంతో చెపాక్ మైదానం మొత్తం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. కామెంటేటర్లు కూడా థర్డ్ అంపైర్ నిర్ణయంతో షాక్ అయిపోయారు. అంపైర్ నిర్ణయాన్ని చాలా మంది తప్పు బడతున్నారు. అది క్లియర్‌గా నాటౌట్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో ధోని కేవలం ఒక్క మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు.చదవండి: IPL 2025: నరైన్ ఆల్ రౌండ్ షో.. సీఎస్కేపై కేకేఆర్ గ్రాండ్ విక్టరీ
బిజినెస్

జోరుగా గ్యాస్ వినియోగం
న్యూఢిల్లీ: వాహనాలు, గృహాలు, పరిశ్రమల అవసరాల కోసం సహజ వాయువును విరివిగా ఉపయోగిస్తున్న నేపథ్యంలో 2030 నాటికి గ్యాస్ వినియోగం 60 శాతం పెరగనుంది. 2023–24లో రోజుకు 188 మిలియన్ ఘనపు మీటర్లుగా (ఎంసీఎండీ) ఉన్న వినియోగం, 2030 నాటికి 297 ఎంసీఎండీకి చేరనుంది. వివిధ పరిస్థితుల్లో గ్యాస్ వినియోగ ధోరణులను విశ్లేషిస్తూ చమురు నియంత్రణ సంస్థ పీఎన్జీఆర్బీ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం ఒక మోస్తరు వృద్ధి, సానుకూల పరిణామాలతో కూడుకున్న ’గుడ్ టు గో’ పరిస్థితుల్లో గ్యాస్ వినియోగం 2030 నాటికి 297 ఎంసీఎండీకీ, 2040 నాటికి 496 ఎంసీఎండీకి కూడా పెరిగే అవకాశం ఉంది. ఇక వృద్ధి వేగవంతమై, పాలసీలు సానుకూలంగా అమలవుతూ, భారీగా పెట్టుబడులు వచ్చే ’గుడ్ టు బెస్ట్’ పరిస్థితుల్లో 2030 నాటికి 365 ఎంసీఎండీకి, 2040 నాటికి 630 ఎంసీఎండీకి వినియోగం పెరగవచ్చు. ఈ రెండు సందర్భాల్లోనూ కొత్తగా ఏర్పడే డిమాండ్‌లో సిటీ గ్యాస్ డిస్టిబ్యూషన్ (సీజీడీ) సంస్థల వాటా గణనీయంగా ఉండనుంది. ‘గ్యాస్ వినియోగ వృద్ధికి సీజీడీ రంగం కీలక చోదకంగా నిలుస్తుంది. 2024 ఆర్థిక సంవత్సరంలో 37 ఎంసీఎండీ స్థాయి నుంచి 2030 నాటికి 2.5–3.5 రెట్లు, 2040 నాటికి 6–7 రెట్ల వరకు ఇది పెరిగే అవకాశం ఉంది‘ అని నివేదిక పేర్కొంది. పీఎన్జీఆర్బీ ఇటీవల 307 భౌగోళిక ప్రాంతాల్లో సిటీ గ్యాస్ లైసెన్సులు ఇచ్చింది. నివేదికలోని మరిన్ని విశేషాలు.. → రిఫైనరీ, పెట్రోకెమికల్స్ కార్యకలాపాలు జోరందుకోవడం కూడా సహజ వాయువు వినియోగానికి దోహదపడనుంది. 2030 నాటికి పెరిగే అదనపు వినియోగంలో ఈ విభాగం వాటా 21 ఎంసీఎండీగా, 2040 నాటికి మరో 10 ఎంసీఎండీగా ఉండనుంది. → విద్యుదుత్పత్తి, ఎరువుల రంగంలో గ్యాస్ వినియోగం ఒక మోస్తరుగా పెరగనుంది. → డిమాండ్ పెరిగే కొద్దీ ద్రవీకృత సహజ వాయువు దిగుమతులు కూడా పెరగనున్నాయి. సుదూర ప్రాంతాలకు రవాణాకు సంబంధించి డీజిల్ స్థానాన్ని ఎల్ఎన్జీ భర్తీ చేసే అవకాశం ఉంది. 2030 తర్వాత, చైనా తరహాలో డీజిల్‌పై ఆధారపడటం తగ్గి ఎల్ఎన్జీ వినియోగం పెరగవచ్చు. డిమాండ్ దన్ను, దేశీయంగా ఉత్పత్తి నెమ్మదించే పరిస్థితుల కారణంగా అప్పటికి ఎల్ఎన్జీ దిగుమతులు రెట్టింపు కావచ్చు. 2030–2040 నాటికి గ్యాస్ వినియోగం అనేక రెట్లు పెరగనుండటంతో, డిమాండ్–సరఫరా మధ్య వ్యత్యాసాన్ని భర్తీ చేసేందుకు ఎల్ఎన్జీపై ఆధారపడటమూ భారీగా పెరగనుంది. అంతర్జాతీయంగా ఎల్ఎన్జీ లభ్యత మెరుగ్గా ఉండటం వల్ల ధరలు తగ్గే అవకాశం ఉంది. → 2030, 2040 నాటికి భారత్ నిర్దేశించుకున్న సహజ వాయువు లక్ష్యాలను సాధించాలంటే మౌలిక సదుపాయాల విస్తరణ, ఎల్ఎన్జీ ధరలు.. విధానాలు సానుకూలంగా ఉండాలి. అయితే, భౌగోళిక–రాజకీయ పరిస్థితులు, పాలసీపరంగా అనిశ్చితి మొదలైన అంశాల కారణంగా గ్యాస్ ధరలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశాలూ ఉన్నాయి. 2015–16 నుంచి 2023–24 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో సహజ వాయువు వినియోగం 45 శాతం వృద్ధి చెంది 131 ఎంసీఎండీ నుంచి 188 ఎంసీఎండీకి పెరిగింది.

వొడాఫోన్ ఐడియా రుణాలు అప్
న్యూఢిల్లీ: మొబైల్ టెలికం రంగ దిగ్గజం వొడాఫోన్ఐడియా రుణ భారం 2024 డిసెంబర్‌కల్లా 7 శాతం పెరిగి రూ. 2.17 లక్షల కోట్లకు చేరింది. చట్టబద్ధ లయబిలిటీల కారణంగా గత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికాని(అక్టోబర్–డిసెంబర్)కల్లా రుణ భారం పెరిగినట్లు కంపెనీ వెల్లడించింది. 2023 డిసెంబర్ త్రైమాసికంలో రూ. 2,03,400 కోట్లుగా నమోదైనట్లు ఇన్వెస్టర్లకు తెలి యజేసింది. తాజా రుణ భారంలో ప్రధానంగా రూ. 2,14,700 కోట్లు ప్రభుత్వానికి చెల్లించవలసిన బకాయిలుకాగా.. రూ. 2,300 కోట్లు బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థల రుణాలుగా పేర్కొంది. గత రెండేళ్లలో బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థల రుణాలు రూ. 10,700 కోట్లమేర తగ్గినట్లు వెల్లడించింది. కాగా.. ఇటీవల ప్రభుత్వం గత టెలికం ప్యాకేజీలో భాగంగా రూ. 36,950 కోట్ల బకాయిలను ఈక్విటీగా మార్పు చేసుకునేందుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో వొడాఫోన్‌ఐడియాలో ప్రభుత్వ వాటా 22.6 శాతం నుంచి 48.99 శాతానికి బలపడనుంది. ఇవి 2025–26, 2027 –28లో చెల్లించవలసిన స్పెక్ట్రమ్ బకాయిలుకాగా.. ప్రభుత్వ నిర్ణయానికంటే ముందున్న రుణ భార పరిస్థితిని వొడాఫోన్ఐడియా వాటాదారులకు వెల్లడించింది. తాజాగా వాటా పెంపు మంగళవారం(8న) కంపెనీ ప్రభుత్వానికి ఈక్విటీ షేర్ల కేటాయింపును పూర్తి చేయడంతో రుణ భారం తగ్గడంతోపాటు.. వొడాఫోన్‌ఐడియాలో ప్రభుత్వ వాటా 48.99 శాతాన్ని తాకింది. కంపెనీలో ప్రస్తు తం ప్రమోటర్లుగా వొడాఫోన్ గ్రూప్ 16.07 శాతం, ఆదిత్య బిర్లా గ్రూప్ 9.5 శాతం చొప్పున వాటాలు కలిగి ఉన్నాయి. గతంలో ప్రభుత్వం రూ. 16,130 కోట్ల రుణాలను ఈక్విటీగా మార్పిడి చేసుకోవడంతో వొడాఫోన్‌ఐడియాలో 22 శాతానికిపైగా వాటా పొందిన విషయం విదితమే.

ఓలా ఎలక్ట్రిక్ తొలి ‘రోడ్‌స్టర్ ఎక్స్’ బైక్ విడుదల
న్యూఢిల్లీ: ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ క్రిష్ణగిరి ‘ఫ్యూచర్‌ఫ్యాక్టరీ’లో తయారుచేసిన తొలి ‘రోడ్‌స్టర్ ఎక్స్ మోటార్‌సైకిల్’ను శుక్రవారం విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ బైక్ ఈ ఏప్రిల్‌లో కస్టమర్లకు అందుబాటులోకి రానుంది. ‘‘విద్యుత్ వాహన విప్లవాన్ని మరో స్థాయికి తీసుకెళ్లే నిబద్దతకు ప్రతిరూపమే ‘రోడ్‌స్టర్ ఎక్స్ సిరీస్’. మా కొత్త ఉత్పత్తి ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలో కొత్త శకానికి నాందిగా నిలిస్తుంది.’’ అని కంపెనీ చైర్మన్ ఎండీ భవీశ్ అగర్వాల్ తెలిపారు. ఓలా ఈ బైక్‌ను కొత్తగా అభివృద్ధి చేసిన మిడ్–డ్రైవ్ మోటార్‌తో రూపొందించింది. ఇందులో ఎంసీయూ ఇంటిగ్రేషన్ వంటి ఆధునిక టెక్నాలజీ కూడా ఉంది. ఐపీ67 సరి్టఫైడ్ బ్యాటరీలు ఉన్నాయి. ఓలా రోడ్‌స్టర్ ఎక్స్ సిరీస్ 2.5 కిలోవాట్ హవర్(కేడబ్ల్యూహెచ్) 3.5 కేడబ్ల్యూహెచ్, 4.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఆప్షన్లో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ.84,999, రూ.94,999, రూ.1,04,999గా ఉన్నాయి. కాగా, ఎక్స్‌ప్లస్ సిరిస్‌లో 4.5కేడబ్ల్యూహెచ్ బైక్ ధర రూ.1,14,999 లక్షలు ఉండగా, 9.1కేడబ్ల్యూహెచ్ బైక్ ధర రూ.1,84,999గా ఉంది.

ఈ ఏడాది వృద్ధి 6.1 శాతమే
న్యూఢిల్లీ: అమెరికా ప్రతీకార సుంకాల నేపథ్యంలో భారత జీడీపీ వృద్ధి అంచనాలను ప్రముఖ అంతర్జాతీయ సంస్థ మూడీస్ అనలైటిక్స్ 0.3 శాతం తగ్గించింది. 2025లో జీడీపీ 6.4 శాతం వృద్ధి చెందుతుందంటూ ఈ ఏడాది మార్చిలో వేసిన అంచనాను 6.1 శాతానికి తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. అమెరికా ప్రతీకార సుంకాల వల్ల పడే ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుని అంచనాలను సవరించింది. భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వాముల్లో అమెరికాను ఒకటిగా పేర్కొంటూ.. భారత ఉత్పత్తులపై 26 శాతం టారిఫ్‌లు వాణిజ్యానికి అవరోధాలు కల్పిస్తాయని తెలిపింది. రత్నాభరణాలు, వైద్య పరికరాలు, టెక్స్టైల్స్ పరిశ్రమలపై ఎక్కువ ప్రభావం ఉంటుందని అంచనా వేసింది. ఎగుమతులు భారత జీడీపీలో అతి స్వల్ప వాటాను కలిగి ఉన్నందున.. మొత్తం మీద భారత వృద్ధి రేటు వెలుపలి రిస్‌్కలకు పెద్దగా ప్రభావితం కాబోదని. స్పష్టం చేసింది. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతున్నందున ఆర్బీఐ రెపో రేటును మరో పావు శాతం మేర తగ్గించొచ్చని.. ఈ ఏడాది చివరికి ఇది 5.75 శాతానికి చేరుకుంటుందని తెలిపింది. దీనికితోడు బడ్జెట్లో ప్రకటించిన పన్ను మినహాయింపులు దేశీ ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా నిలుస్తాయని.. దీంతో మొత్తం మీద వృద్ధిపై సుంకాల ప్రతికూల ప్రభావం తక్కువకు పరిమితం అవుతుందని మూడీస్ అనలైటిక్స్ అంచనా వేసింది. అనిశ్చితులు కొనసాగుతాయి.. చైనా మినహా భారత్ సహా ఇతర దేశాలపై ప్రతీకార సుంకాల అమలును 90 రోజుల పాటు అమెరికా వాయిదా వేయడం గమనార్హం. అయినప్పటికీ అనిశ్చితి కొనసాగుతుందని, ఈక్విటీల్లో ఆటుపోట్లు కొనసాగొచ్చని మూడీస్ అనలైటిక్స్ తెలిపింది. ‘‘పెరుగుతున్న అనిశి్చతిని తక్కువగా అంచనా వేయరాదు. గృహ, వ్యాపార సెంటిమెంట్ తగ్గిపోతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే మానిటరీ పాలసీ సులభతరం వల్ల ఒనగూరే ప్రయోజనాల ఫలితం తగ్గొచ్చు. అనిశి్చతుల్లో మరింత ఖర్చుకు గృహస్థులు వెనుకాడొచ్చు. వ్యాపార సంస్థలు సైతం అదనపు పెట్టుబడుల విషయంలో వెనక్కి తగ్గొచ్చు’’అని మూడీస్ అనలైటిక్స్ తన నివేదికలో వివరించింది. టారిఫ్‌లతో వాణిజ్య వ్యయాలు పెరిగిపోతాయని, అది అంతర్జాతీయ వృద్ధిని బలహీనపరుస్తుందని అంచనా వేసింది.
ఫ్యామిలీ

సమ్మర్లో కాటన్ డ్రెస్‌లతో స్టైలిష్‌గా ఉండొచ్చు ఇలా..!
సంప్రదాయ రూపమైనా ఇండో వెస్ట్రన్ కాంబినేషన్ అయినా కాటన్‌తో డ్రెస్సింగ్ స్టైల్స్ ఏమీ ఉండవు అనుకునేవారికీ ప్రతి వేసవి కొత్త మోడల్స్‌ని పరిచయం చేస్తూనే ఉంది. ఉన్న మోడల్స్‌ని మరింత వినూత్నంగా కళ్లకు కడుతోంది. ఫ్యాషన్ వేదికలపైనా స్టైలిష్‌గా వెలిగిపోతోంది... ఇంటింటికీ వచ్చి కాటన్ షో చేస్తోంది.ఇంటికి వచ్చిన.. కాటన్ షోశరీరానికి పట్టిన చెమటను పీల్చుకొని, కంఫర్ట్‌గా ఉంచే కాటన్ ఫ్యాబ్రిక్‌ను స్టైలిష్ వేర్‌కు జతచేసేటప్పుడు ఆ మెటీరియల్ బరువు, నేత, రంగును కూడా చూడాలి.సల్వార్ సూట్రోజువారీ ధరించేదే కదా ఏముంది స్పెషల్... అనుకోవడానికి వీలు లేని కంఫర్ట్బుల్ డ్రెస్‌గా మన్ననలు అందుకుంది సల్వార్ సూట్. స్ట్రెయిట్ కట్, ఎ లైన్, ఫ్రాక్ స్టైల్, పలాజో, టులిప్, ధోతీ ప్యాట్స్.. అంటూ సోషల్ మీడియా ట్రెండ్‌గా ఉన్న సల్వార్స్ కాటన్స్లో కంఫర్ట్‌గా లభిస్తున్నాయి.బ్రైట్ వైట్కాటన్ పాప్లిన్ క్లాత్ వేడి వాతావరణానికి అనువైనదిగా పేరొందింది. మస్లిన్, వాయిల్, సీర్ సకర్.. వంటివి ఈ కాలం తేలికగా అనిపించే మెటీరియల్. సాధారణంగా కాటన్స్లో వైట్, లైట్ షేడ్స్ మెటీరియల్ లభిస్తుంది. డల్‌గా ఉండే కలర్ ఫ్యాబ్రిక్ అంటూ పక్కన పెట్టేసే రోజులు కావివి. ఫ్లోరల్ మోటిఫ్స్, ప్యాచ్‌వర్క్, టై అండ్ డై తో షార్ట్ అండ్ లాంగ్ ఫ్రాక్స్, వెస్ట్రన్స్టైల్లో ఆకట్టుకునే ట్యునిక్స్.. ఈ సమ్మర్లో వెలిగిపోనున్నాయి.ఫెదర్ లైట్జమదాని, ఫెదర్ లైట్ మల్ మల్ కాటన్స్, చందేరీ, ఇక్కత్ కాటన్స్తో చేసే ప్రయోగాలు స్టైలిష్వేర్ని వినూత్నంగా చూపుతున్నాయి. ఎంపిక చేసుకునేటప్పుడు స్టైలిష్‌గానే కాదు మన్నిక ఎంత ఉన్నాయో చూసుకోవాలి.రెడీమేడ్ అయితే ఆ డ్రెస్‌పై ఉండే లేబుల్‌ను చెక్ చేయాలి. ఉతకడం, ఆరబెట్టడం వంటి సూచనలపై లేబుల్ తగిన సమాచారాన్ని ఇస్తుంది. కొన్ని రకాల కాటన్ డ్రెస్సులు నీళ్లలో పెట్టినప్పుడు రంగు పోతుంటాయి. ఒకదాని కలర్ మరో డ్రెస్‌కు పట్టే అవకాశం ఉంటుంది. ముదురు, లేత రంగులు, ఒకే రంగు కలవి విడివిడిగా ఉతకడం మేలు. నీళ్లలో పెట్టినప్పుడు కాటన్ ఫ్యాబ్రిక్ ష్రింక్ అవడం, స్టార్చ్ పోవడం జరుగుతుంది. శుభ్రపరచడానికి చల్లటి నీటిని ఉపయోగించడం, డ్రైయర్‌ను ఉపయోగించకుండా ఆరవేయడం వల్ల కాటన్ క్లాత్ ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది. (చదవండి: ఎండల్లో... కొబ్బరి నీళ్లతో గేమ్స్ వద్దు!)

ఎండల్లో... కొబ్బరి నీళ్లతో గేమ్స్ వద్దు!
ఎండ వేడిని తట్టుకోవడానికి, ఎండా కాలంలో సత్తువతో ఉండడానికి కొబ్బరి నీళ్లు ఎంత ఎక్కువగా తాగితే అంతమంచిది అనుకుంటారు చాలామంది. అయితే ఇది సరిౖయెనది కాదు అంటున్నారు పోషకాహార నిపుణులు. ఎందుకంటే...కొబ్బరి నీళ్లలో ΄పొటాషియం ఎక్కువగా ఉంటుంది. కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల రక్తంలో పొటాషియం స్థాయులు పెరుగుతాయి. శరీరంలో లవణాల సమతూకం దెబ్బతింటుంది. కిడ్నీల పనితీరుపై ప్రభావం చూపుతుంది.కొబ్బరినీళ్లలో అధిక పొటాషియం వల్ల జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. కొబ్బరి నీళ్లలో అధిక చక్కెర కంటెంట్ వల్ల బరువు పెరగడానికి దారి తీయవచ్చు. డయాబెటిస్, గుండె జబ్బులు, దంత క్షయ ప్రమాదం పెరగవచ్చు.కొబ్బరితో అలర్జీలు అసాధారణమేమీ కాదు. కొంతమందికి కొబ్బరి నీటి వల్ల అలెర్జీలు రావచ్చు. దద్దుర్లు, వాపుతోబాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురు కావచ్చు.హైబీపి ఉన్న వారు, మధుమేహ వ్యాధిగ్రస్తులు, పేగు పూత వ్యాధి ఉన్న వాళ్లు కొబ్బరినీళ్లకు దూరంగా ఉండటమే మంచిది. (చదవండి: వేగాన్ వర్సెస్ నాన్‌వెజ్ డైట్: ఈ కవల సోదరుల ప్రయోగంలో వేటిలో విటమిన్లు ఎక్కువంటే..?)

అమిత ప్రతిభ
అడ్వర్టైజింగ్, సినిమా ఫీల్డ్‌ల గురించి అమ్మాయిలకు ఆసక్తి ఉంటే...‘అడ్వర్టైజింగ్ ఫీల్డ్‌కు వెళతావా! సినిమా ఫీల్డ్‌కు వెళతావా!!’ అని ఆశ్యర్యపోయే కాలం అది. అలాంటి కాలంలో అడ్వర్టైజింగ్ ఆ తరువాత ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ముంబైకి చెందిన అమిత మద్వాని.‘ఏం తెలుసు అని ఇక్కడికి వచ్చావు!’ అని ఒకరు వెటకారం చేశారు. ‘తెలుసుకుందామనే ఇక్కడికి వచ్చాను’ అని సమాధానం ఇచ్చింది అమిత.అవును... ఎన్నో దశాబ్దాలుగా ఆమె నేర్చుకుంటూనే ఉంది. ఆ నిరంతర ఉత్సాహమే అమితను అడ్వర్టైజింగ్, ఫిల్మ్ ఇండస్ట్రీలో విజయ కేతనం ఎగరేసేలా చేసింది.తన కమ్యూనిటీలోని సాంస్కృతిక వేడుకలు, మారాఠీ నాటకరంగ ప్రభావం కళల పట్ల అమితలో ఆసక్తిని పెంచింది. 1980 దశకంలో అడ్వర్టైజింగ్ ఇండస్ట్రీలో పురుషాధిక్యత ఉన్న కాలంలో ఆమె తన కెరీర్‌ను మొదలు పెట్టింది. ‘ఇది నువ్వు ఎంచుకోవాల్సిన రంగం కాదు’ అంటూ కొద్దిమంది ఆమెను వెనక్కిలాగే ప్రయత్నం చేశారు. అయితే ఆమె ఉత్సాహంలో ఎలాంటి మార్పూ లేదు.‘ఎన్ని సమస్యలు ఎదురైనా ఎదుర్కొంటాను’ అంటూ ముందుకు కదిలింది. నేర్చుకోవాలనే కుతూహలం ఆమె వేగంగా నడిచేలా చేసింది. ప్రారంభ రోజులు... కష్టపడడంలో ఉన్నప్రాముఖ్యత గురించి చెప్పాయి. ‘నేను ఎంచుకున్న ప్రయాణం అడుగడుగునా సవాలుతో కూడుకున్నదనే విషయం తెలిసినా రాజీ పడలేదు. సినిమా సెట్లో బ్యాగులు ΄్యాకింగ్ చేయడం దగ్గర్నుంచి 35 ఎం.ఎం. సినిమా ఎడిటింగ్ మెళకువలను అర్థం చేసుకోవడం వరకు ఎన్నో నేర్చుకున్నాను’ అంటుంది అమిత.ఒగిల్వి, లియో బర్నెట్లాంటి అడ్వర్టైజింగ్ దిగ్గజ సంస్థలలో పనిచేయడం ఆమె అనుభవ జ్ఞానాన్ని విస్తృతం చేసింది. సినీ పరిశ్రమను అడ్వెర్టైజింగ్ ఏజెన్సీల కోణం నుంచి చూడడానికి ఆమెకు ఉపకరించాయి. క్యాంపెయిన్ బిల్డింగ్, క్లయింట్ సర్వీసింగ్, క్రియేటివ్, ప్రొడక్షన్ బృందాల మధ్య సమన్వయం.... ఇలా ఎన్నో విషయాలలో నైపుణ్యాన్ని సాధించింది.ఈ అనుభవ, నైపుణ్యజ్ఞానంతో ‘ఈక్వినాక్స్ ఫిలిమ్స్’లో కో–వోనర్, నిర్మాతగా ప్రయాణం ప్రారంభించింది. మంచి పేరు తెచ్చుకుంది. కోవిడ్ మహమ్మారి సమయంలో వచ్చిన విరామంలో...‘ఏం చేస్తున్నాం? ఏం చేయకూడదు’ అనే కోణంలో ఆలోచించి సరికొత్త నిర్ణయాలు తీసుకుంది. అందులో ఒకటి... స్టోరీ టెల్లింగ్, డిజిటల్–ఫస్ట్ స్ట్రాటజీలను ఒకే వరుసలోకి తీసుకురావడం. భారీ బడ్జెట్‌తో కూడిన టెలివిజన్ వాణిజ్య ప్రకటనల నుంచి రీల్స్, డిజిటల్ ప్రకటనల ప్రస్తుత యుగం వరకు మన ప్రకటనల రంగంలో నాటకీయ మార్పులను అమిత ప్రత్యక్షంగా చూసింది.‘విజయపథంలో ప్రయాణించాలంటే కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి. మరింత నేర్చుకోవాలి అనే ఆసక్తి ఉండాలి. వర్తమానం గురించే కాదు భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని కూడా ఆలోచనలు చేయాలి. నేను ఎంచుకున్న పని నన్ను ఎక్కడికి తీసుకువెళుతుందో తెలియదు. అయితే ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండేదాన్ని. మారుతున్న కాలానికి అనుగుణంగా నాలోని నైపుణ్యాలకు పదును పెట్టాను’ అంటుంది అమిత మద్వాని.ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా...మనం ఎంచుకున్న మార్గం కఠినం, సవాళ్లతో కూడుకున్నది అయినప్పటికీ... నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అనే తపన ఉంటే విజయం సాధించవచ్చు. నేను అడ్వర్టైజింగ్, ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పుడు ఏమీ తెలియదు. చాలా ఓపికగా నేర్చుకున్నాను. పది సెకన్ల డిజిటల్ స్పాట్ అయినా, మూడు గంటల ఫీచర్ ఫిల్మ్ అయినా ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా చూడడమే ప్రధానం. సోషల్ మీడియా ఫ్రెండ్లీ ఫార్మట్లను ఏకీకృతం చేయడం ద్వారా, ప్రేక్షకులకు ఎండ్–టు–ఎండ్ పరిష్కారాలను అందించడం ద్వారా ఈక్వినాక్స్ ఫిల్మ్స్ ముందంజలో ఉంది. టీమ్ అంకితభావం మా విజయానికి కారణం.– అమిత మద్వాని

వేగాన్ వర్సెస్ నాన్‌వెజ్ డైట్: ఈ ట్విన్స్ ప్రయోగంలో ఏ డైట్ మంచిదంటే..?
ఇటీవల కాలంలో ఆరోగ్య స్పృహ ఎక్కువైంది. సోషల్‌మీడియా పుణ్యామా..? అని రకరకాల డైట్లు కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్నాయి. ఏది మంచిది అని డిసైడ్ చేసుకోలేని కన్ఫూజన్లో పడేసేలా ఊదరగొడుతున్నాయి. అయితే ఆ సమస్యకు చెక్‌పెట్టేలా ఈ ఇద్దరు కవలలు ఓ ప్రయోగానికి పూనుకున్నారు. అచ్చుగుద్దినట్లు ఒకేలా ఉండే ఈ కవల సోదరులు వేగాన్ వర్సెస్ నాన్‌వెజ్ డైట్లో ఏది బెటర్ అనే దాని గురించి తమ శరీరాలపై తామే ప్రయోగాలు చేసుకున్నారు. అంతేగాదు ఇద్దరూ ఏ డైట్ ఆరోగ్యకరమైనదో వైద్యపరంగా నిర్థారించి మరీ చెప్పారు.యూకేలోని డెవాన్లోని ఓ గ్రామానికి చెందిన రాస్, హ్యూగో టర్నోర్ అనే కవలలు ఇద్దరూ చూడటానికి ఒకేలా ఉంటారు. ఈ ఇద్దరు ఆహారం, ఫిట్నెస్కి సంబంధించి పలు ప్రయోగాలు చేస్తుంటారు. ఆ క్రమంలోనే ఈసారి మొక్కల ఆధారిత వర్సెస్ జంతువుల ఆధారిత డైట్లలో ఏది ఆరోగ్యానికి మంచి ఫలితాలనిస్తుంది దాని గురించి తమపైనే ప్రయోగాలు చేసుకుని మరీ నిర్థారించి చెప్పారు. అందుకోసం ఆరు నెలలపాటు ఈ 36 ఏళ్ల కవలలు దాదాపు ఒకేలాంటి జీవనశైలిని అనుసరించారు. అయితే తీసుకునే ఆహారంలోనే వ్యత్యాసం ఉంటుంది. హ్యూగో సముద్రపు ఆల్గే , మొక్కల ఆధారిత ఒమేగా 3 నూనెలు, మొక్కల ఆధారిత సప్లిమెంట్లు తదితరాలు తీసుకున్నాడు. రాస్ సాంప్రదాయ జంతు ఆధారిత విటమిన్లు తీసుకున్నాడు. అయితే ఆరు నెలల తదనంతరం ఇరువురిలో అద్భుతమైన మార్పులు, ఫలితాలు కనిపించాయి. ఇక్కడ హ్యూగో రక్తం పోషకాలతో కనిపించింది. కీలకమైన విటమిన్లు డీ3, కొవ్వు ఆమ్లాలు సమస్థాయిలో ఉన్నాయి. ఇక రాస్ తీసుకున్న నాన్ వెజ్ ప్రోటీన్లకు మించి హ్యగో శరీరంలో మెరుగైన స్థాయిలో విటమిన్లు ఉన్నాయి. వారిద్దరూ కూడా ఈ డైట్లలో ఇంత తేడా ఉంటుందని అనుకోలేదట. రక్తపరీక్షల్లో హ్యూగో ఫలితాలు మెరుగ్గా ఉన్నట్లు తేలింది. ముఖ్యంగా ఒమేగా-3, విటమిన్ D3 పుష్కలంగా ఉన్నాయి హ్యూగో బాడీలో. కేవలం రక్తపరీక్షలే గాక, కొవ్వులు, ఆమ్లలాల స్థాయిలతో సహా ప్రతీది ట్రాక్ చేశారు. అయితే ఈ డైట్లలో మొక్కల ఆధారిత వెర్షన్ మెరుగైన ఫలితాలనిచ్చింది. రాస్ తిన్న సాల్మన్ చేపల కంటే సముద్రపు పాచి సప్లిమెంట్లోనే విటమిన్ డీస్థాయిలు, మంచిరోగ నిరోధక శక్తిని హ్యూగోకి అందించాయి. అంతేగాదు శాకాహారం శరీరంలో కొవ్వుని తగ్గించి మెరుగైన శక్తి స్థాయిలను ప్రోత్సహించదని తేలింది. ఇలాంటి ప్రయోగాలు ఆ కవలలకు తొలిసారి కాదు. గతంలో అధిక కార్బ్ వర్సెస్ అధిక కొవ్వు ఆహారాలలో ఏది మంచిదో తెలుసుకోవాలని ప్రయోగాలు చేశారు కూడా. దానిలో రాస్ పాస్తా, బియ్యం వంటి కార్బొహైడ్రేట్లు తీసుకోగా, హ్యూగో గుడ్లు, వెన్న వంటి వాటిని తీసుకున్నారు. అయితే రాస్ కొలస్ట్రాల్‌ని కోల్పోగా, హ్యూగో మిశ్రమ ఫలితాలు అందుకున్నారు. పైగా అందులో ప్రమాదకరమైన చెడెకొలెస్ట్రాల్ స్థాయిలు కూడా ఉన్నాయి. చివరగా ఈ కవల ఫిట్నెస్ ప్రయోగాల వల్ల మొక్కల ఆధారిత సప్లిమెంట్స్ ప్రయోజనాలు హైలెట్ చేయడమే గాక సాంప్రదాయ పోషకాహారం గురించి చాలకాలం నుంచి ఉన్న అపోహలు కూడా తుడిచిపెట్టుకుపోయాయి. అంతేగాదు మన ఆరోగ్యంలో ఆహారం ఎంత కీలకపాత్ర పోషిస్తుందని అనేది తేటతెల్లమైంది కూడా. View this post on Instagram A post shared by 𝗧𝗛𝗘 𝗧𝗨𝗥𝗡𝗘𝗥 𝗧𝗪𝗜𝗡𝗦 (@theturnertwiins) (చదవండి: పీరియడ్స్ వచ్చి వెయ్యి రోజులు.. అయినా తగ్గలేదు.. వైద్యులకే అంతుచిక్కని మిస్టరీ..!)
ఫొటోలు


తెలంగాణ అమరనాథ్‌గా ప్రసిద్ధిగాంచిన సలేశ్వరం బ్రహ్మోత్సవాలు ప్రారంభం (ఫొటోలు)


హరిత యాత్రలో అలసిన వనజీవి.. రామయ్య అరుదైన చిత్రాలు


హైదరాబాద్ : ఘనంగా ఉస్మానియా మెడికల్ కళాశాల స్నాతకోత్సవం (ఫొటోలు)


ఉప్పల్‌లో ప్రాక్టీస్ అదరగొట్టిన SRH, పంజాబ్ ప్లేయర్స్ (ఫొటోలు)


నల్లగండ్లలో సందడి చేసిన నితీష్, స్టోయినిష్ (ఫోటోలు)


రామ్ చరణ్ ఆరెంజ్ మూవీ.. చెర్రీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్‌ను ఇప్పుడు చూస్తే..! (ఫొటోలు)


వైట్ గౌన్ లో అందాలు ఆరబోస్తున్న నేహా శెట్టి (ఫోటోలు)


సంపూర్ణేష్ బాబు ‘సోదరా’ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)


‘కృష్ణ లీల’ మోషన్‌పోస్టర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)


ఒంటిమిట్ట సీతారాముల కల్యాణానికి సర్వం సిద్ధం (ఫొటోలు)
అంతర్జాతీయం

విదేశీ విద్యార్థులపై... ఎందుకీ కత్తి?
విదేశీ విద్యార్థుల వీసాలను ట్రంప్ సర్కారు ఎడాపెడా రద్దు చేస్తుండటాన్ని అమెరికన్లు కూడా హర్షించడం లేదు. ఈ ధోరణి అంతిమంగా అమెరికాకే తీవ్ర నష్టం చేకూరుస్తుందన్న ఆందోళన నానాటికీ తీవ్రతరమవుతున్నాయి. ఈ విషయమై అక్కడి విద్యా సంస్థలే గళమెత్తుతున్నాయి. అమెరికన్ కౌన్సిల్ ఆన్ ఎడ్యుకేషన్ (ఏసీఈ)తో పాటు మరో 15 సంస్థలు బాధిత విదేశీ విద్యార్థుల తరఫున రంగంలోకి దిగాయి. ఏ కారణాలూ చూపకుండా వారి వీసాలను రద్దు చేయడం, సంబంధిత యూనివర్సిటీలకు కనీసం సమాచారం కూడా ఇవ్వకుండానే వారి స్టూడెంట్ ఎక్స్చేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సి స్టం (సెవిస్) రికార్డులను గల్లంతు చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టాయి. దీనిపై తక్షణం వివరణ ఇవ్వాలంటూ హోంల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) వి భాగానికి సంయుక్తంగా ఓ లేఖ రాశాయి. డీహెచ్ఎస్ మంత్రి క్రిస్టీ నోయెమ్‌తో పాటు విదేశాంగ మంత్రి మార్కో రూబియోకు కూడా లేఖ ప్రతిని పంపాయి. విద్యార్థి వీసాల రద్దుకు సంబంధించి పూర్తి వివరాలు బయట పెట్టాల్సిందేనని ఏసీఈ అధ్యక్షుడు టెడ్ మిషెల్ డిమాండ్ చేశారు. ‘‘స్వీయ డీపో ర్టేషన్ ద్వారా దేశం వీడండంటూ విద్యార్థులకు వస్తున్న ఈ మెయిళ్లు, మెసేజీల ద్వా రా మాత్రమే విషయం తెలుస్తోంది. అందుకు కారణాలైనా చెప్పకపోవడం మరీ దారుణం. ఇది చాలా ఆందోళనకరమైన విషయం. అభ్యంతరకర సోషల్ మీడియా కార్యకలాపాలకు, డాక్యుమెంటేషన్ తప్పిదాలకు, చివరికి ట్రాఫిక్ ఉల్లంఘనలకు కూడా వీసాలు రద్దు చేస్తున్న ఉదంతాలు పెరిగిపోతున్నాయి. చిన్న చిన్న తప్పిదాలకు కూడా ఇంతటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవడం దారుణం’’అంటూ ఆయన ఆక్షేపించారు. ‘‘మీ తీరుతో అమెరికావ్యాప్తంగా పలు విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న విదేశీ విద్యార్థుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఇది మన దేశానికి కూడా మంచిది కాదు’’అని ఆవేదన వెలిబుచ్చారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ జాతీయ భద్రత పేరిట విదేశీ విద్యార్థుల విషయంలో అమెరికా అత్యంత కఠినంగా వ్యవహరిస్తుండటం తెలిసిందే. ఇప్పటిదాకా కనీసం 300 మందికి పైగా పాలస్తీనా సానుభూతిపరులైన విద్యార్థుల వీసాలను రద్దు చేసినట్టు రూబి యో ఇటీవల వెల్లడించారు. గతంలో ఏ కారణంతోనైనా విద్యార్థి వీసాలను రద్దు చేసినా విద్యాభ్యాసం పూర్తయ్యేదాకా అమెరికాలో ఉండేందుకు వీలుండేది. ఇప్పుడు మాత్రం వీసా రద్దుతో పాటు సెవిస్ రికార్డులను కూడా శాశ్వతంగా తుడిచిపెడుతుండటంతో బాధిత విద్యార్థులు తక్షణం అమెరికాను వీడటం తప్ప మరో మార్గం లేకుండా పోతోంది. వర్సిటీల్లోనూ ఆందోళన విద్యార్థి వీసాల రద్దు అమెరికా యూనివర్సిటీలను కూడా ఆందోళనకు గురి చేస్తోంది. చాలాసార్లు ఈ ఉదంతాలు తమ దృష్టికి కూడా రావడం లేదని ప్రఖ్యాత హార్వర్డ్ వర్సిటీ పేర్కొంది. ‘‘మేం స్వయంగా పూనుకుని మా విద్యార్థుల రికార్డులను పరిశీలించాల్సి వస్తోంది. మా వర్సిటీకీ చెందిన ముగ్గురు విద్యార్థులతో పాటు ఇటీవలే విద్యాభ్యాసం ముగించుకున్న మరో ఇద్దరి వీసాలను రద్దు చేసినట్టు తెలియగానే వారికి న్యాయ సాయాన్ని సిఫార్సు చేశాం’’అని వెల్లడించింది. అరిజోనా స్టేట్ వర్సిటీలో 50 మంది విదేశీ విద్యార్థులకు ఇదే పరిస్థితి ఎదరైంది. వారి వీసాల రద్దుకు కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు వర్సిటీ వర్గాలు వెల్లడించాయి. నార్త్ ఈస్టర్న్ వర్సిటీలోనూ 40, కాలిఫోర్నియా వర్సిటీలో 35 మంది విద్యార్థుల వీసాలు కూడా రద్దయ్యాయి. ఇలాంటి పరిస్థితులను గతంలో ఎన్నడూ చూడలేదని మసాచుసెట్స్ వర్సిటీ చాన్స్‌లర్ వాపోయారు. విదేశీ విద్యార్థులే కీలకం అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో విదేశీ విద్యార్థులు కీలక పాత్ర పోషిస్తున్నారు. 2024లో వారినుంచి అమెరికాకు ఏకంగా 4,380 కోట్ల డాలర్ల మేరకు ఆదాయం సమకూరినట్టు ‘ఓపెన్ డోర్స్’నివేదిక పేర్కొంది. అమెరికా వర్సిటీల్లో ఉన్నతవిద్య పూర్తి చేసుకుంటున్న విదేశీ విద్యార్థులను, ముఖ్యంగా భారతీయులను అమెరికా ఐటీ సంస్థలు కళ్లు చెదిరే వేతనాలిచ్చి మరీ తీసుకుంటున్నాయి. కొన్నేళ్లలోనే ఆ సంస్థలకు వాళ్లు వెలకట్టలేని ఆస్తిగా మారుతున్నారు. ‘అమెరికా ఫస్ట్’పేరిట విదేశీ విద్యార్థులపై వేధింపులు ఇలాగే కొనసాగితే ప్రపంచ దేశాల నుంచి అగ్ర రాజ్యానికి దశాబ్దాలుగా కొనసాగుతున్న మేధో వలసకు అడ్డుకట్ట పడుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇది అంతిమంగా అమెరికాకే తీవ్ర నష్టమని అక్కడి విద్యా సంస్థలు, నిపుణులు హెచ్చరిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్

ట్రంప్ పన్నులపై చైనా జిన్‌పింగ్ ఫస్ట్ రియాక్షన్.. ఏమన్నారంటే..
బీజింగ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 145 శాతం సుంకాలను ఏకపక్ష బెదిరింపు అని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అభివర్ణించారు. ట్రంప్ బెదిరింపులను ప్రతిఘటించడానికి యూరోపియన్ యూనియన్ తమతో కలిసి రావాలని జిన్‌పింగ్ పిలుపునిచ్చారు. అలాగే, అమెరికా ఉత్పత్తులపై సుంకాలను చైనా 125 శాతానికి పెంచినట్టు చెప్పుకొచ్చారు. చైనాపై అమెరికా భారీగా పన్నులను పెంచిన నేపథ్యలో అధ్యక్షుడు జిన్‌పింగ్ స్పందించారు. ఈ సందర్బంగా జిన్‌పింగ్ మాట్లాడుతూ..‘ట్రంప్ విధించిన 145 శాతం సుంకాలు బెదిరింపులతో కూడినవి. ఏకపక్షంగా అమెరికా నిర్ణయాలు తీసుకుంది. ఇది సమంజసం కాదు. ట్రంప్ పన్నులను ప్రతిఘటించడానికి యూరోపియన్ యూనియన్ మాతో కలిసి రావాలని కోరుతున్నాను. యూరప్ తమ అంతర్జాతీయ బాధ్యతలను నెరవేర్చాల్సి ఉంది. అందరూ కలిసి ఐకమత్యంగా అమెరికాపై పోరాటం చేయాల్సి ఉంది’ అని చెప్పుకొచ్చారు.మరోవైపు.. చైనాపై అమెరికా 145 శాతం సుంకాలు విధించిన నేపథ్యంలో జిన్‌పింగ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మూడు ఆగ్నేయాసియా దేశాల పర్యటనకు అధ్యక్షుడు జిన్‌పింగ్ బయలుదేరి వెళ్లారు. ఏప్రిల్ 14 నుంచి వియత్నాం, మలేసియా, కంబోడియాలో జిన్‌పింగ్ పర్యటించనున్నారు. ఇక, డొనాల్డ్ ట్రంప్.. వియత్నాం, కంబోడియా దేశాలపై కూడా భారీగానే పన్నులు విధించారు. వియత్నాంపై 46 శాతం, కంబోడియాపై 49 శాతం సుంకాలు విధించారు. ఈ నేపథ్యంలో ఆయా దేశాలతో జిన్‌పింగ్ చర్చలు జరపనున్నారు.Latest UY | WorldXi Jinping’s Southeast Asia Tour: A Move Amidst U.S. Trade Storm?Chinese President Xi Jinping embarks on a pivotal journey to Vietnam, Malaysia, and Cambodia starting April 14, aiming to fortify bonds with key allies as U.S. tariffs tighten their grip. With… pic.twitter.com/IfsHmtQ4c1— UnreadWhy (@TheUnreadWhy) April 11, 2025జిన్‌పింగ్ చాలా స్మార్ట్: ట్రంప్అంతకుముందు.. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘జిన్‌పింగ్‌కు ఎప్పుడు ఏం చేయాలో బాగా తెలుసు. దేశం అంటే ఆయనకు ఎంతో ప్రేమ. ఆ విషయం నాకు బాగా తెలుసు. జిన్‌పింగ్ గురించీ తెలుసు. ఆయన సుంకాలపై ఒక ఒప్పందం కుదుర్చుకుంటారని నేను అనుకుంటున్నా. త్వరలోనే దీనిపై చర్చించేందుకు అక్కడి (చైనా) నుంచి మాకు ఫోన్ కాల్ వస్తోందని భావిస్తున్నా. దానికి మేం సిద్ధంగా ఉన్నాం’ అని పేర్కొన్నారు.

రాణా అప్పగింతపై స్పందించిన అమెరికా
26/11 ముంబై ఉగ్రదాడుల కీలక సూత్రధారి తహవూర్ హుసేన్ రాణా.. సుమారు దశాబ్దంన్నర తర్వాత విచారణ ఎదుర్కొనబోతున్నాడు. పాక్ మూలాలు ఉన్న లష్కరే ఉగ్రవాది అయిన రాణాను అమెరికా మార్షల్స్ బుధవారం ప్రత్యేక విమానంలో భారత్‌కు తీసుకొచ్చారు. గురువారం సాయంత్రం ఢిల్లీ పాలెం ఎయిర్‌పోర్టులో జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) అధికారులకు అప్పగించడంతో అధికారిక ప్రక్రియ ముగిసింది. అయితే ఈ పరిణామంపై అమెరికా స్పందించింది. భారత్‌కు అతన్ని అప్పగించడం గర్వకారణంగా ఉందంటూ ప్రకటించింది.‘‘2008 ముంబై ఉగ్రదాడులకు రూపకర్తగా తహవూర్ రాణా(tahawwur rana)పై అభియోగాలు ఉన్నాయి. ఇందుకుగానూ న్యాయస్థానాల్లో విచారణ ఎదుర్కొనేందుకు అతన్ని అమెరికా నుంచి భారత్‌కు తరలించాం’’ అని విదేశాంగ ప్రతినిధి టామీ బ్రూస్ మీడియాకు వెల్లడించారు.. ముంబైలో నాడు జరిగిన ఉగ్రదాడి యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి చేసింది. కొంతమందికి గుర్తు లేకపోవచ్చు. కానీ, ఒకసారి పరిశీలిస్తే అది ఎంత భయంకరమైందో.. ఈనాటికి ఎంత ప్రాముఖ్యత సంతరించుకుందో తెలుస్తుంది. ఈ దాడులకు బాధ్యులను చట్టం ముందు నిలబెట్టడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలకు అమెరికా చాలా కాలంగా మద్దతు ఇస్తోంది. ఉగ్రవాదం అనే ప్రపంచ మహమ్మారిని ఎదుర్కొనడానికి భారత్, అమెరికా కలిసి కట్టుగా పని చేస్తుంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మొదటి నుంచి చెబుతున్నారు. ఈ విషయంలో ఆయన తన నిబద్ధతను కనబరిచారు. అందుకు మేం గర్వపడుతున్నాం’’ అని టామీ బ్రూస్ ప్రకటించారు.2009 అక్టోబర్‌లో ముంబై ఉగ్రదాడులు సహా పలు కేసులు ఉన్న డేవిడ్ కోల్మన్ హెడ్లీని అమెరికాలో అరెస్ట్ చేశారు. హెడ్లీ ఇచ్చిన సమాచారంతో ఇల్లినాయిస్ చికాగోలో ఇమ్మిగ్రేషన్ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్న తహవూర్ రాణాను అక్టోబర్ 18వ తేదీన ఎఫ్‌బీఐ అరెస్ట్ చేసింది. ఆపై అభియోగాలు రుజువు కావడంతో 14 ఏళ్ల జైలు శిక్ష పడింది. అయితే ముంబై ఉగ్రదాడి కేసులో విచారణ ఎదుర్కొనేందుకు తనను భారత్‌కు అప్పగించకుండా నిలువరించాలంటూ ఇన్నేళ్లపాటు దాదాపు అక్కడి అన్ని కోర్టులను ఆశ్రయిస్తూ వచ్చాడు రాణా. అయితే ఊరట మాత్రం దక్కలేదు.ఈలోపు.. ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించారు. ఆ సమయంలో రాణాను భారత్‌కు అప్పగించే విషయంపై ట్రంప్ స్పష్టమైన ప్రకటన చేశారు. ‘‘26/11 ముంబయి ఉగ్ర దాడిలో నిందితుడైన అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిని భారత్ (India)కు అప్పగిస్తాం. అలాగే త్వరలో మరింతమంది నేరగాళ్ల విషయంలోనూ అదే నిర్ణయం తీసుకుంటాం’’ అని ఆయన ప్రకటించారు. అందుకు తగ్గట్లే పరిణామాలు చకచకా జరిగి రాణాను భారత్‌కు అమెరికా అప్పగించింది.ఇదిలా ఉంటే.. ఏప్రిల్ 10వ తేదీన భారత్‌లో దిగగానే తహవూర్ రాణాను జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) అరెస్ట్ చేసింది. ఆపై కోర్టులో ప్రవేశపెట్టగా 18 రోజుల ఎన్ఐఏ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలిచ్చింది. ఈ క్రమంలో అతన్ని తీహార్ జైలుకు తరలించారు. 2008 ముంబై ఉగ్రదాడుల కేసుకు సంబంధించి మొత్తం 10 క్రిమినల్ అభియోగాలను రాణా ఎదుర్కోవాల్సి ఉంటుంది.

‘గుడ్లు’ తేలేసేలా.. అమెరికాలో డజను కోడిగుడ్లు రూ.536
వాషింగ్టన్: అమెరికాలో కోడి గుడ్లు ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. నెల నెలా రేటు పెరుగుతూ కొనుగోలు దారులకు చుక్కలు చూపిస్తున్నాయి. అమెరికా బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ గణాంకాల ప్రకారం.. ఫిబ్రవరిలో డజను కోడి గుడ్లు ధర 5.90 డాలర్లు (భారత కరెన్సీలో రూ.508.76) ఉండగా మార్చి నెలలో 6.23 డాలర్లకు (రూ.536) చేరింది. అయితే, అమెరికాలో కోడి గుడ్లు ధరలు ఆకాశాన్ని తాకడం వెనుక బర్డ్ ఫ్లూ ఓ కారణం. బర్డ్ ఫ్లూని అరికట్టేందుకు అమెరికా గుడ్లు పెట్టే కోళ్లను నిర్మూలించింది. ఆ ప్రభావం రిటైల్ మార్కెట్లోని గుడ్ల ధరలపై పడింది. ట్రంప్ వరుస ప్రకటనలు ఫలితంగా గుడ్లు తేలేసేలా.. కొండెక్కిన కోడిగుడ్ల ధరలతో అమెరికన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ ఆందోళనలపై.. గత కొన్ని వారాలుగా తన పాలనలో గుడ్లు ధరల్ని తగ్గించామంటూ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. తాను రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత హోల్‌సేల్ గుడ్ల ధరలు 59శాతం నుంచి చివరికి 79 శాతానికి తగ్గాయని చెప్పారు’ అని న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. బర్డ్ ఫ్లూ నియంత్రణకు బయోసెక్యూరిటీఇదే విషయంపై వైట్ హౌస్ ప్రతినిధి అన్నా కెల్లి సైతం ప్రస్తావించారు. బర్డ్ ఫ్లూ నియంత్రణకు బయోసెక్యూరిటీని బలోపేతం చేసినట్లు, కొత్త నిబంధనలను సడలించి కోడి గుడ్ల సరఫరా పెంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. బర్డ్ ఫ్లూపై మేం తీసుకున్న చర్యలు ఫలితాల్ని ఇస్తున్నాయి’ అని పేర్కొన్నారు. గుడ్ల ధరలపై భిన్నాభిప్రాయాలు అమెరికాలో అమాంతం పెరిగిపోతున్న గుడ్ల ధరలపై ఆర్థిక నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మిచిగన్ స్టేట్ యూనివర్సిటీ ఆహార ఆర్థిక నిపుణుడు డేవిడ్ ఓర్టెగా మాట్లాడుతూ.. హోల్‌సేల్ ధరలు తగ్గినా, ఆ ప్రభావం రిటైల్ ధరలపై పడేందుకు కొన్ని వారాలు సమయం పడుతుందన్నారు. పాల్ట్రీ ఫారాల్లో బర్డ్ ఫ్లూ తగ్గడం, సరఫరా పెరగడం వల్ల హోల్‌సేల్ ధరలు తగ్గినప్పటికీ.. రిటైల్ ధరలు ఎంత తగ్గుతాయో అంచనా వేయడం కష్టం’ అని కార్నెల్ యూనివర్శిటీకి ఆర్థిక నిపుణుడు క్రిస్టఫర్ బి. బారెట్ చెప్పారు.
జాతీయం

భారీ అగ్ని ప్రమాదం.. బాల్కనీ నుంచి సేఫ్టీ నెట్లోకి..!
అహ్మదాబాద్: నగరంలో ఓ అపార్ట్మెంట్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం స్థానికంగా పెద్ద అలజడి రేపింది. అహ్మదాబాద్‌లోని కోక్రా సర్రిల్లోని పరిస్కార్ 1 అప్టార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ అపార్ట్మెంట్ ఆరో అంతస్తులోని ఒక ఫ్లాట్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్రి ప్రమాదం జరిగి అది తీవ్ర రూపం దాల్చింది. మొత్తం బిల్డింగ్ అంతా దావానంలా వ్యాపించింది.అయితే దీనిపై సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది హుటాహుటీనా అక్కడకు వచ్చి మంటల్ని అదుపు చేశారు. వారు తీవ్రంగా శ్రమించిన తర్వాత ఎట్టకేలకు మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. వీరితో పాటు పోలీసులు అక్కడకు వచ్చి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. మంటల్ని అదుపు చేసే క్రమంలో పలువురు బాల్కనీ నుంని కింద ఉంచిన సేప్టీ నెట్లోకి దూకేశారు. అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత ఫైర్ సిబ్బంది, పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో ఎటువంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. ప్రధానంగా అపార్ట్మెంట్ పై నుంచి మహిళలు, పిల్లలు దూకిన దృశ్యాలు వైరల్‌గా మారాయి.A major fire has erupted in a building in Ahmedabad’s Khokhra area. Sending strength to those affected and hoping for a timely rescue operation.#FireIncident #ViralVideo #Ahmedabad pic.twitter.com/67NkYOKhJj— Parimal Nathwani (@mpparimal) April 11, 2025

వీడియో: అరేయ్ బులుగు చొక్కా.. ఏం పనులు రా అవి?
విధి నిర్వహణలో ఉన్న ఓ మహిళా కానిస్టేబుల్. ఏదో ధర్నా జరుగుతుంటే.. నిరసనకారుల్లో కొందరిని అరెస్ట్ చేయడంలో తన సిబ్బందికి సాయం చేస్తుంటుంది. ఇంతలో వెనకాల పోలీసుల చేతిలో ఉన్న బులుగు చొక్కావోడు.. ఆమె నడుంను పట్టుకుని తెగ ఊగిపోతుంటాడు. చాలామంది ఇదేదో జోక్ అనుకుని.. మెన్ విల్ బి మెన్ అనుకుంటూ వీడియోను ఇతరులకు ఫార్వర్డ్ చేస్తున్నారు. నవ్వుకుంటున్నారు. కానీ..ఆ టైంకి ఆ కామాంధుడి చెర నుంచి తనను తాను విడిపించుకున్న ఆమె.. సిబ్బంది సాయంతో పక్కకు తీసుకెళ్లింది. ఈ ఘటన ఎక్కడ? ఎప్పుడు? జరిగిందో స్పష్టత లేదు. కేసు నమోదైన దానిపైనా స్పష్టత లేదు. పలు జాతీయ మీడియా చానెల్స్ కథనాలు ఇచ్చాయికానీ.. ఎక్కడ జరిగిందన్నది ప్రస్తావించలేదు. గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. చాలామంది ఆ బులుగు చొక్కావోడిని తిట్టి పారేస్తున్నారు. అలాంటి వాళ్లను వదలకూడదంటూ పోస్టులు పెడుతున్నారు. పట్టపగలు.. అదీ ఓ మహిళా పోలీస్ పట్ల అలా ప్రవర్తించడం ఏంటని? కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఓ మహిళా పోలీస్తో ఓ వ్యక్తి బహిరంగంగా.. అసభ్యంగా ప్రవర్తించిన తీరును హాస్య కోణంలో కాకుండా తీవ్రంగా పరిగణించాలని పలువురు కోరుతున్నారు.Just look at that blue shirt guy.He is trying to harass a lady Police officer.Such anti social people deserve Jail. pic.twitter.com/nj5MGAEKJU— Sunanda Roy 👑 (@SaffronSunanda) April 9, 2025ఇదిలా ఉంటే.. మహిళా పోలీసులతో ఇలాంటి అసభ్య ప్రవర్తనల ఘటనలు ఈ మధ్యకాలంలోనే చూశాం. మహారాష్ట్రలో నాగ్‌పుర్ (Nagpur)లో మార్చి మూడో వారంలో.. రెండు గ్రూప్‌ల మధ్య చెలరేగిన హింసతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ ఘర్షణల్లో ఒక అల్లరిమూక డ్యూటీలో ఉన్న మహిళా పోలీసు అధికారితో అసభ్యకరంగా ప్రవర్తించింది. అలాగే.. గణేష్‌పేట ప్రాంతంలో ర్యాపిడ్ కంట్రోల్ పోలీస్ దళంలో విధులు నిర్వహించిన ఓ అధికారిణి సైతం తాను ఎదుర్కొన్న ఇబ్బందులపై సీనియర్ అధికారులకు ఫిర్యాదు చేసింది. అదే ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తోన్న మరో అధికారిణి కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొన్నారట.

అత్యాచార కేసులో పురోగతి ఎంతవరకూ వచ్చింది?: ప్రధాని ఆరా
వారణాసి: పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా తన పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసిలో శుక్రవారం పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ.. రాష్ట్రంలో సంచలన సృష్టించిన అత్యాచార ఘటనపై ఆరా తీశారు. కొన్ని రోజుల క్రితం వారణాసిలో 19 ఏళ్ల యువతి సామూహిక అత్యాచారానికి గురైన సంగతి తెలిసిందే. దీనిపై ప్రధానంగా ప్రధాని మోదీ ఆరా తీశారు.ఆ దారుణ ఘటనకు సంబంధించిన నిందితుల్ని అందరన్నీ అదుపులోకి తీసుకున్నారా లేదా అనే విషయాన్ని పోలీస్ కమిషనర్ ని ప్రధాని అడిగి తెలుసుకున్నారు. ప్రధాని వారణాసి పర్యటనలో భాగంగా ఆయనకు మర్యాద పూర్వకంగా కలవడానికి వెళ్లిన సిటీ పోలీస్ కమిషనర్, డివిజనల్ కమిషనర్, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ లను ప్రధాని మోదీ ప్రశ్నించారు. అత్యాచార ఘటన కేసులో పురోగతి ఎంతవరకూ వచ్చిందని మోదీ అడిగి తెలుసుకున్నారు.ఈ క్రమంలోనే నిందితులకు ఏమైతే శిక్షలు ఉంటాయో అవి అమలయ్యేలా చూడాలన్న మోదీ.. భవిష్యత్ లో ఈ తరహా ఘటనలు జరగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీనిపై సమాధానమిచ్చిన పోలీస్ కమిషనర్.. కేసులో పురోగతి ఉందని స్పష్టం చేశారు. పలువుర్ని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామన్నారు. కాగా, ఓ యువతిని కిడ్నాప్ చేసి, వారం రోజుల వ్యవధిలో 22 గ్యాంగ్ రేప్‌నకు పాల్పడినట్లు యువతి ఫిర్యాదు చేసింది.. వీరిలో ఆరుగురిని అరెస్ట్ చేశామని, మిగతా వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. నగరంలోని లాల్పూర్కు చెందిన 19 ఏళ్ల యువతి మార్చి 29వ తేదీన ఫ్రెండ్‌ను కలిసేందుకని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. అయితే కొన్నిరోజుల పాటు తిరిగి రాలేదు. దీనిపై ఏప్రిల్ 4వ తేదీన ఆమె కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.అదే రోజు, పోలీసులు పాండేపూర్ వద్ద డ్రగ్స్ మత్తులో ఉన్న ఆమెను కిడ్నాపర్ల చెర నుంచి విడిపించారు పోలీసులు. అనంతరం ఆమెసొంతింటికి చేరుకుని తనపై లైంగిక దాడి జరిగిన విషయాన్ని తండ్రికి తెలిపింది. ఈ నెల 6న తండ్రితో వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్థానిక హుక్కా సెంటర్, ఒక హోటల్, ఒక లాడ్జి, ఒక గెస్ట్ హౌస్‌లో తనపై మొత్తం 22 మంది అత్యాచారానికి ఒడిగట్టినట్లు అందులో ఆరోపించింది.కేసు నమోదు చేసిన పోలీసులు హుకూల్ గంజ్, లాల్పూర్ ఏరియాలకు చెందిన కొందరు నిందితులను అదే రోజు రాత్రి అదుపులోకి తీసుకున్నారు.

కిరాణ కొట్టు కుర్రాడు.. ఒక్క రాత్రిలో కోటీశ్వరుడయ్యాడు!
అదృష్టం ఎప్పుడు, ఎవరి తలుపు తడుతుందో ఎవరూ చెప్పలేరు. తాజాగా జార్ఖండ్‌లోని పాలమూ డివిజన్‌కు చెందిన రవి కుమార్ జీవితం ఒక్కసారిగా ఊహించని మలుపు తిరిగింది. కిరాణ కొట్టు నడిపిస్తూ జీవనం సాగించే కుర్రాడు.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు! అది కూడా లాటరీతోనో, జూదంతోనో కాదు. డ్రీమ్ 11 అనే ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఆ అదృష్టం వరించింది. ఊహించని ఈ గెలుపుతో రవి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు.పాలమూ హెడ్‌క్వార్టర్స్‌కి 7 కిలోమీటర్ల దూరంలో.. చియాంకి రైల్వే స్టేషన్ సమీపంలోని తెలియాబండ్ ప్రాంతం ఉంది. మహేంద్ర మెహతా కొడుకు రవి కుమార్ మెహతా ఎప్పుడు చూసినా కిరాణా షాపులో ఫోన్ పట్టుకుని ఇంట్లోవాళ్లతో తిట్లు తింటూ కనిపిస్తుంటాడు. 2018 నుంచి డ్రీమ్11 ఆడుతున్న రవి మొన్నటిదాకా రూ.5 లక్షలు పొగొట్టాడు. ఈ విషయంపై ఇంట్లో రోజూ గొడవే. అయినప్పటికీ రవి తన ప్రయత్నం మాత్రం వీడలేదు. చివరగా.. ఆరోజు రానే వచ్చింది.ఏప్రిల్ 9వ తేదీ అతని జీవితంలో మరుపురానిరోజు. గుజరాత్ టైటానస్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌లో సాయి సుదర్శన్‌ను కెప్టెన్‌గా, రషీద్ ఖాన్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంచుకుని టీం ఏర్పాటు చేశాడు. ఆ నిర్ణయం వర్కవుట్ అయ్యింది. డ్రీమ్11తో ఒక్క రాత్రిలోనే రూ.3 కోట్లు సంపాదించాడతను. అంతే.. అతని కళ్లలో ఒక్కసారిగా నీళ్లు తిరిగాయి. భావోద్వేగంతో తల్లిని గట్టిగా హత్తుకున్నాడు. తప్పుడు పనులు డబ్బులు పొగొట్టావ్ అని తిట్టావ్ కదా అమ్మా.. ఇప్పుడు చూడు ఎంత సంపాదించానో అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రైజ్‌మనీలో 30 శాతం జీఎస్టీ కిందకు పోయింది.మిగిలిన డబ్బును తన తల్లి ఖాతాలోకి మళ్లించాడు. వచ్చిన డబ్బుతో సగంలో ఆగిపోయిన ఇంటిని కట్టుకోవడంతో పాటు కాస్త పొలం కొనుక్కోవాలని.. ఇలా ప్లానులు గీసుకుంటున్నాడు.లోకల్ 18కు ఇచ్చిన ఇంటరర్వ్యూలో మాట్లాడుతూ.. రూ.49 పెట్టుబడితో లక్ష వస్తే చాలానుకున్నాడట. విజయం కోసం ఓపికగా ఎదురు చూడాలని చెబుతున్నాడతను . ఇక వచ్చిన ప్రైజ్‌మనీతో తమ కుటుంబ ఆర్థిక స్థితిని మార్చుకోవాలని అనుకుంటున్నాడతను. 2018 నుంచి డ్రీమ్11 ఆడుతున్న రవి.. ఇప్పటిదాకా రెండు ఐడీలతో 621 టీంలను సృష్టించాడు. ఈ క్రమంలోనే కిరాణం షాపు ద్వారా వచ్చిన ఆదాయంలో రూ.5 లక్షలు పొగొట్టాడు. చివరకు.. పడిన చోటే నిలబడి ఆ కుటుంబంతో పాటు చుట్టుపక్కలవాళ్ల నుంచి గ్రేట్ అనిపించుకున్నాడు.Disclaimer: ఈ ఆర్టికల్ కేవలం జరిగిన ఘటన తెలియజేయడం కోసం మాత్రమే. బెట్టింగ్, ఫాంటసీ గేమింగ్‌లను ప్రోత్సహించడం మా ఉద్దేశం ఎంతమాత్రం కాదు
ఎన్ఆర్ఐ

తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో ఉగాది కవి సమ్మేళనం
డాలస్, టెక్సస్, అమెరికా: తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట ప్రతి నెల ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా శ్రీ విశ్వావసు నామ ఉగాది పర్వదిన సందర్భంగా - “రైతన్నా! మానవజాతి మనుగడకు మూలాధారం నీవేనన్నా” అనే అంశంపై జరిపిన 78 వ అంతర్జాల అంతర్జాతీయ ఉగాది కవిసమ్మేళనం 30 మందికి పైగా పాల్గొన్న కవుల స్వీయ కవితా పఠనంతో ఎంతో ఉత్సాహభరితంగా జరిగింది.ముఖ్యఅతిథిగా పాల్గొన్న ‘పద్మశ్రీ పురస్కార గ్రహీత’ యడ్లపల్లి వెంకటేశ్వరరావు బ్రిటష్ కాలంనాటి ఆధునిక సేంద్రీయపద్దతుల వరకు వ్యవసాయపద్దతులలో వచ్చిన మార్పులను సోదాహరణంగా వివరించారు. రైతులకు వ్యవసాయసంబంధ విజ్ఞానాన్ని అందించేందుకు ‘రైతునేస్తం’ మాస పత్రిక, పశుఆరోగ్యం, సంరక్షణ కోసం ‘పశునేస్తం’ మాసపత్రిక, సేంద్రీయ పద్ధతులకోసం ‘ప్రకృతి నేస్తం’ మాసపత్రికలను, ‘రైతునేస్తం యూట్యూబ్’ చానెల్ ద్వారా సమగ్ర సమాచారం అందిస్తూ నిరంతరం రైతుసేవలో నిమగ్నమై ఉన్నామని తెలియజేశారు. రైతుకు ప్రాధ్యాన్యం ఇస్తూ తానా ప్రపంచసాహిత్యవేదిక ఇంత పెద్ద ఎత్తున కవిసమ్మేళనం నిర్వహించడం ముదాహవమని, ఈ కవి సమ్మేళనంలో పాల్గొన్న కవులందరూ వ్రాసిన కవితలను పుస్తకరూపంలో తీసుకురావడం ఆనందంగా ఉందంటూ అందరి హర్షధ్వానాలమధ్య ఆ పుస్తకాన్ని ఆవిష్కరించారు. తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు పాల్గొన్న ముఖ్యఅతిథి, కవి సమ్మేళనంలో పాల్గొన్న కవు లందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, రైతు కుటుంబ నేపధ్యంనుండి వచ్చిన తనకు వ్యవసాయంలోఉన్న అన్ని కష్టాలు తెలుసునని, ప్రభుత్వాలు రైతులకు అన్ని విధాలా సహాయపడాలని, ‘రైతు క్షేమమే సమాజ క్షేమం’ అన్నారు.తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ - వివిధ రకాల పంటల ఉత్పత్తులలో, ఎగుమతులలో భారతదేశం ముందువరుసలోఉన్నా రైతు మాత్రం తరతరాలగా వెనుకబడిపోతూనే ఉన్నాడన్నారు. మహాకవి పోతన, కవిసార్వభౌమ శ్రీనాధుడులాంటి ప్రాచీన కవులు స్వయంగా వ్యసాయం చేసిన కవి కర్షకులని, గుర్రం జాషువా, ఇనగంటి పున్నయ్య చౌదరి, దువ్వూరి రామిరెడ్డి, తుమ్మల సీతారామమూర్తి లాంటి ఆధునిక కవులు రైతులపై వ్రాసిన కవితలను చదివి వారికి ఘన నివాళులర్పించారు. అలాగే రైతు నేపధ్యంలో వచ్చిన ‘పేద రైతు’, ‘కత్తిపట్టిన రైతు’, ‘రైతు కుటుంబం’, ‘రైతు బిడ్డ’, ‘పాడి పంటలు’, ‘రోజులు మారాయి’, ‘తోడి కోడళ్ళు’ లాంటి సినిమాలు, వాటిల్లోని పాటలు, అవి ఆనాటి సమాజంపై చూపిన ప్రభావం ఎంతైనా ఉందని, ఈ రోజుల్లో అలాంటి సినిమాలు కరువయ్యాయి అన్నారు. మన విద్యావిధానంలో సమూలమైన మార్పులు రావాలని, పసిప్రాయంనుండే పిల్లలకు అవగాహన కల్పించడానికి రైతు జీవన విధానాన్ని పాఠ్యాంశాలలో చేర్చాలని, చట్టాలుచేసే నాయకులు కనీసం నెలకు నాల్గురోజులు విధిగా రైతులను పంటపొలాల్లో కలసి వారి కష్టనష్టాలు తెలుసుకుంటే, పరిస్థితులు చాలావరకు చక్కబడతాయని అభిప్రాయపడ్డారు.ఈ కవి సమ్మేళనంలో వివిధ ప్రాంతాలనుండి పాల్గొన్న 30 మందికి పైగా కవులు రైతు జీవితాన్ని బహు కోణాలలో కవితల రూపంలో అద్భుతంగా ఆవిష్కరించారు.పాల్గొన్న కవులు: దుగ్గినపల్లి ఎజ్రాశాస్త్రి, ప్రకాశం జిల్లా; మంత్రి కృష్ణమోహన్, మార్కాపురం; పాయల మురళీకృష్ణ, విజయనగరం జిల్లా; నన్నపనేని రవి, ప్రకాశం జిల్లా; డా. తలారి డాకన్న, వికారాబాద్ జిల్లా; చొక్కర తాతారావు, విశాఖపట్నం; రామ్ డొక్కా, ఆస్టిన్, అమెరికా; దొండపాటి నాగజ్యోతి శేఖర్, కోనసీమ జిల్లా; ర్యాలి ప్రసాద్, కాకినాడ; సాలిపల్లి మంగామణి (శ్రీమణి), విశాఖపట్నం; సిరికి స్వామినాయుడు, మన్యం జిల్లా; తన్నీరు శశికళ, నెల్లూరు; చేబ్రోలు శశిబాల, హైదరాబాద్; లలిత రామ్, ఆరెగాన్, అమెరికా; బాలసుధాకర్ మౌళి, విజయనగరం; గంటేడ గౌరునాయుడు, విజయనగరం జిల్లా; కోసూరి రవికుమార్, పల్నాడు జిల్లా; మార్ని జానకిరామ చౌదరి, కాకినాడ; కె.ఎ. మునిసురేష్ పిళ్లె, శ్రీకాళహస్తి; డా. బీరం సుందరరావు, చీరాల; డా. వేంకట నక్త రాజు, డాలస్, అమెరికా; బండ్ల మాధవరావు, విజయవాడ; డా. కొండపల్లి నీహారిణి, హైదరాబాద్; నారదభట్ల అరుణ, హైదరాబాద్; పి. అమరజ్యోతి, అనకాపల్లి; యార్లగడ్డ రాఘవేంద్రరావు, హైదరాబాద్; చిటిప్రోలు సుబ్బారావు, హైదరాబాద్; డా. శ్రీరమ్య రావు, న్యూజెర్సీ, అమెరికా, డా. శ్రీదేవి శ్రీకాంత్, బోట్స్వానా, దక్షిణాఫ్రికా; డా. భాస్కర్ కొంపెల్ల, పెన్సిల్వేనియా, అమెరికా; ఆది మోపిదేవి, కాలిఫోర్నియా, అమెరికా; డా. కె. గీత, కాలిఫోర్నియా, అమెరికా; శ్రీ శ్రీధర్ రెడ్డి బిల్లా, కాలిఫోర్నియా, అమెరికా నుండి పాల్గొన్నారు.తానా ప్రపంచసాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ రైతు శ్రమైక జీవన విధానం, తీరు తెన్నులపై తరచూ చర్చ జరపవలసిన అవసరం ఎంతైనా ఉందని, మన అందరికీ ఆహరం పంచే రైతన్న జీవితం విషాదగాధగా మిగలడం ఎవ్వరికీ శ్రేయస్కరంగాదన్నారు. పూర్తి కార్యక్రమాన్ని ఈ క్రింది లంకె ద్వార వీక్షించవచ్చును.https://youtube.com/live/qVbhijoUiX8అలాగే రైతు నేస్తం ఫౌండేషన్ సహకారంతో తానా ప్రపంచసాహిత్యవేదిక వెలువరించిన రైతు కవితల పుస్తకాన్ని కూడా ఇక్కడ పొందు పరుస్తున్నాము.

డా.గుడారు జగదీష్‌కు “విశ్వ వైద్య దివ్యాంగ బంధు” అవార్డు
మారిషస్ తెలుగు మహా సభ ఆధ్వర్యంలో శ్రీ విశ్వావసు నామ తెలుగు ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. ఫీనిక్స్‌లోని ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ ఇండియన్ కల్చర్‌లో తెలుగు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని, శ్రీ విశ్వావసు నామ తెలుగు ఉగాదిని మారిషస్‌లోని తెలుగు వారు ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. ప్రముఖ సామాజిక-సాంస్కృతిక సంస్థ మారిషస్ తెలుగు మహా సభ నిర్వహించిన ఈ కార్యక్రమం, తెలుగు ప్రజల వారసత్వం మరియు సంప్రదాయాలను పరిరక్షించడానికి మరియు ప్రోత్సహించడానికి ఒక వేదికగా నిలచింది. కార్యక్రమం సాంప్రదాయ తెలుగు నూతన సంవత్సర ఆచారాలతో ప్రారంభమైంది, వీటిలో భాగంగా మా తెలుగు తల్లి, దీప ప్రజ్వలనం మరియు గణపతి వందనంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో భాగంగా ప్రపంచ ప్రఖ్యాత వైద్య నిపుణుడు డాక్టర్ గుడారు జగదీష్ వైద్య రంగంలో చేసిన అసాధారణ కృషికి, ముఖ్యంగా వికలాంగుల శ్రేయస్సు కోసం వారి యొక్క అచంచలమైన అంకితభావానికి గుర్తింపుగా మారిషస్ ప్రధాన మంత్రి సత్కరించారు.నాలుగు దశాబ్దాలుగా వికలాంగుల పునరావాసం మరియు సమాజ సేవకు అంకితమైన డాక్టర్ జగదీష్ దేశ విదేశాలలో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆయన అవిశ్రాంత సేవ ఎంతో మంది అభాగ్యుల జీవితాలను ప్రభావితం చేసింది. ఈ సేవలను గుర్తించిన మారిషస్ ప్రధాన మంత్రి డాక్టర్ నవీన్‌చంద్ర రామ్ గూలమ్ డాక్టర్ గుడారు జగదీష్ ను “విశ్వ వైద్య దివ్యాంగ బంధు” అవార్డుతో సత్కరించారు. డాక్టర్ జగదీష్ అసాధారణ మానవతా స్ఫూర్తిని మరియు అంకితభావాన్ని మారిషస్ ప్రధాని ప్రశంసించారు. డాక్టర్ జగదీష్ మాట్లాడుతూ తనను ఈ గౌరవ పురస్కారానికి ఎంపిక చేసినందుకు మారిషస్ తెలుగు మహా సభ సభ్యులకు, మారిషస్ ప్రధాన మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సంధర్భంగా మారిషస్ ప్రధాన మంత్రి డాక్టర్ నవీన్‌చంద్ర రామ్ గూలమ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లోని ఒక సాధారణ వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన డాక్టర్ జగదీష్ కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీ మరియు మంగళూరులోని మణిపాల్ విశ్వవిద్యాలయం వంటి ప్రఖ్యాత వైద్య సంస్థలలో వైద్య విద్యను అభ్యసించి ఆర్థోపెడిక్స్ విభాగంలో నైపుణ్యం పొంది, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధ సంస్థల నుండి అత్యాధునిక పద్ధతులలో అధునాతన శిక్షణ సైతం తీసుకున్నారని తెలిపారు. అమెరికా, జర్మనీ, ఇంగ్లాండు, ఇటలీ, ఫ్రాన్స్, నైజీరియా, కెన్యా, ఒమన్, స్విట్జర్లాండ్ మరియు మారిషస్‌లలో కూడా ఉచిత క్యాంపులు నిర్వహించి తన సేవలను విస్తరించి, అనేక జాతీయ మరియు అంతర్జాతీయ జర్నల్స్‌లో తన పరిశోధనలు ప్రచురించారని తెలిపారు. రాబోయే రోజుల్లో మారిషస్‌కు కూడా డాక్టర్ జగదీష్ తన సేవలను అందించాలని ప్రధాని కోరారు.ప్రధానమంత్రి తన ప్రసంగంలో, తెలుగు సంస్కృతిని కాపాడటానికి, ప్రోత్సహించడానికి మరియు సమాజంపై సానుకూల ప్రభావాన్ని చూపే వ్యక్తులను గుర్తించడంలో మారిషస్ తెలుగు మహాసభ యొక్క నిబద్ధతను ప్రశంసించారు. డాక్టర్ జగదీష్ అంకితభావం మరియు సమాజం పట్ల సేవానిరతిని ఆయన ప్రశంసించారు. ఆయన సేవ అందరికీ ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు."ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ గుర్తింపు నాకే కాదు, సమాజానికి సేవ చేయడానికి తమ జీవితాలను అంకితం చేసే ప్రతి వైద్యునికి ఈ గౌరవం దక్కుతుంది. ప్రతి ఒక్కరికీ అవసరమైన ఆరోగ్య సంరక్షణ అందుబాటులో ఉండేలా నా సేవలను కొనసాగించడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను" అని డాక్టర్ జగదీష్ అన్నారు.మారిషస్ తెలుగు మహా సభ ప్రతినిధులు మాట్లాడుతూ టి.టి.డి. బర్డ్ ట్రస్ట్ హాస్పిటల్ డైరెక్టర్‌గా & గ్రీన్మెడ్ హాస్పిటల్ ఆర్థోపెడిక్ అధిపతి . డాక్టర్ జగదీష్ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దేశవ్యాప్తంగా ఉచిత పోలియో సర్జికల్ మరియు స్క్రీనింగ్ శిబిరాలకు నాయకత్వం వహించారని, నలభై మూడు సంవత్సరాల తన సేవలో భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలలో వికలాంగుల జీవితాలను మెరుగుపరచడానికి అనేక క్యాంపులను నిర్వహించి, 1,83,000 కు పైగా శస్త్ర చికిత్సలు చేయడం ద్వారా ఎంతో మందిని అంగ వైకల్యం పై విజయం సాధించేలా చేశారని తెలిపారు. ఈ విజయం ప్రపంచవ్యాప్తంగా అసమానమైనదని గుర్తు చేశారు.రాబోయే సంవత్సరాన్ని శ్రీ విశ్వావసు నామ సంవత్సరము అంటారు. దీని అర్థం ఇది విశ్వానికి సంబంధించినది. అదేవిధంగా, ప్రపంచ వ్యాప్తంగా పర్యటించి తన సేవలను అందించిన డాక్టర్ గుడారు జగదీష్ కూడా మొత్తం విశ్వానికి సంబంధించిన వైద్యుడు కాబట్టి విశ్వావసు పేరిట “విశ్వ వైద్య దివ్యాంగ బంధు” అవార్డుతో ఆయనను సత్కరిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలుగు వారి యొక్క కళాత్మక వారసత్వాన్ని ప్రతిబింబించే శాస్త్రీయ నృత్యాలు, జానపద పాటలు మరియు సాంప్రదాయ సంగీతంతో సాంస్కృతిక ప్రదర్శనలు జరిగాయి. ఈ అవార్డు ప్రదానోత్సవంలో మారిషస్ ప్రధాన మంత్రి డాక్టర్ నవీన్‌చంద్ర రామ్ గూలమ్ తో పాటు ఉప ప్రధాన మంత్రి శ్రీ పాల్ రేమండ్ బెరెంజర్, ప్రజాసేవలు మరియు పరిపాలనా సంస్కరణల మంత్రి శ్రీ లుచ్మన్ రాజ్ పెంటియా, విద్య, కళలు మరియు సాంస్కృతిక శాఖా మంత్రి శ్రీ మహేంద్ర గోండీయా, మారిషస్‌లో భారత హైకమిషనర్ అనురాగ్ శ్రీవాస్తవ, ఇందిరా గాంధీ భారత సంస్కృతి డైరెక్టర్ డాక్టర్ కాదంబినీ ఆచార్య, మారిషస్ తెలుగు మహా సభ అధ్యక్ష, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

సింగపూర్‌లో విశ్వావసు నామ ఉగాది వేడుకలు, పంచాంగ శ్రవణం
తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు ఇక్కడి పోటోన్గ్ పాసిర్ లోని శ్రీ శివ దుర్గ ఆలయంలో మార్చి 30న ఘనంగా జరిగాయి. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో అందరికి మంచి జరగాలని ఉగాది పర్వదినాన సొసైటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. వేడుకల్లో బాగంగా శ్రీ పేరి కృష్ణ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. గంటల పంచాంగాన్ని ప్రముఖ పంచాంగ కర్తలు పండిత బుట్టే వీరభద్ర దైవజ్ఞ (శ్ర శ్రీశైల దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి)సిద్ధం చేయడం జరిగింది. ఈ వేడుకల్లో 300పైగా ప్రవాస తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాసులు పాల్గొన్నారు. వేడుకల్లో పాల్గొన్న వారందరికి సాంప్రదాయ ఉగాది పచ్చడి తదితర ప్రసాదాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా ప్రాంతీయ కార్యదర్శులు సంతోష్ వర్మ మాదారపు, భాస్కర్ నడికట్ల, శశిధర్ ఎర్రమ రెడ్డి, ఉపాధ్యక్షులు నల్ల భాస్కర్, దుర్గాప్రసాద్ , సంతోష్ కుమార్ జూలూరి , ప్రశాంత్ బసిక, ఉపాధ్యక్షురాలు సునీత రెడ్డి మిర్యాల, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము,కార్యవర్గ సభ్యులు పెరుకు శివ రామ్ ప్రసాద్ పాల్గొన్నారు. తెలంగాణ కల్చరల్ సొసైటీ వారు చేస్తున్న కార్యక్రమాలను భక్తులు కొనియాడారు.ఉగాది వేడుకల నిర్వహణ, దాతలకు, స్పాన్సర్లతోపాటు, సంబరాల్లో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి TCSS ధన్యవాదాలు తెలిపింది. ఈ వేడుకలలో పాల్గొన్న వై.ఎస్.వి.ఎస్.ఆర్.కృష్ణ (పాస్స్పోర్ట్ అటాచ్, ఇండియన్ హై కమిషన్, సింగపూర్) గారికి అధ్యక్షులు గడప రమేష్ బాబు, కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు. అలాగే మై హోమ్ బిల్డర్స్, సంపంగి రియాలిటీ & ఇన్ఫ్రాస్ట్రక్చర్, ASBL కన్స్ట్రక్షన్ కంపెనీ, గారాంటో అకాడమీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, వజ్రా రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ, ఏపీజే అభిరామి, ఏపీజే జువెల్లర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎవోల్వ్, సౌజన్య డెకార్స్‌కు సొసైటీ కృతజ్ఞతలు తెలిపింది.మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

అట్టహాసంగా ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ మహాసభలు
ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA) మొదటి జాతీయ మహాసభలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియ (Philadelphia) ఎక్స్ పో సెంటర్లో మార్చి 28న మొదటి రోజు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, వివిధ రంగాల ప్రముఖులతో మొదటిరోజు వేడుక ఎన్నారైలను ఆకట్టుకుంది. కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు ఘనమైన స్వాగతసత్కారాన్ని నిర్వాహకులు అందించారు.కన్వెన్షన్ కన్వీనర్ సత్య విజ్జు, రవి చిక్కాల స్వాగతోపన్యాసం చేశారు. ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (andhra pradesh american association) ఫౌండర్ హరి మోటుపల్లి AAA ముఖ్య నాయకులను వేదిక మీదకు ఆహ్వానించి, అభినందించారు. అనంతరం ఫౌండర్ హరి మోటుపల్లి AAA ఏర్పాటు, తదితర విషయాలపై క్లుప్తంగా వివరించారు. AAA అధ్యక్షులు బాలాజీ వీర్నాల సభికులను ఉద్దేశించి ప్రసంగించారు. ఊహించిన దానికన్నా కన్వెన్షన్ విజయవంతం కావడం పట్ల ప్రెసిడెంట్ ఎలక్ట్ హరిబాబు తూబాటి హర్షం వ్యక్తం చేశారు. సహకరించిన వారందరికీ ధన్యవాదాలు చెప్పారు. దాతలు, వాలంటీర్లను ప్రత్యేకంగా అభినందించారు.కన్వెన్షన్‌ను పురస్కరించుకుని AAA నిర్వహించిన పోటీల్లో విజేతలకు హీరో, హీరోయిన్లు బహమతులు ప్రదానం చేశారు. హీరోలు సందీప్ కిషన్, ఆది, సుశాంత్, తరుణ్, విరాజ్.. హీరోయిన్స్ దక్ష, రుహాని శర్మ, అంకిత, కుషిత, ఆనంది ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రముఖ దర్శకులు సందీప్ వంగా, శ్రీనువైట్ల, వీరభద్రం, వెంకీ అట్లూరి మొదటిరోజు వేడుకల్లో మెరిశారు. డైరక్టర్ సందీప్ వంగాను స్టేజిమీదకు పిలిచినప్పుడు హాలంతా చప్పట్లతో దద్దరిల్లిపోయింది. టాలీవుడ్ (Tollywood) హీరోయిన్ రుహాని శర్మ, సినీ దర్శకులు వెంకీ అట్లూరి మ్యూజిక్ అవార్డ్స్ విజేతలను ప్రకటించారు. తరుణ్ నటించిన సినిమాల పాటలతో చేసిన ట్రిబ్యూట్ డాన్స్ ఆకట్టుకుంది. తానా, నాట్స్ వంటి ఇతర సంస్థల నాయకులను కూడా వేదికపైకి ఆహ్వానించి సన్మానించారు. మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన నిరవల్ బ్యాండ్ మ్యూజికల్ నైట్ అందరినీ అలరించింది. మహిళలు, పిల్లలు నిరవల్ బ్యాండ్ సింగర్స్ పాటలకు డాన్సులు చేసి ఆనందించారు. ఆంధ్ర వంటకాలతో వడ్డించిన బాంక్వెట్ డిన్నర్ అందరికీ ఎంతో నచ్చింది. బాంక్వెట్ డిన్నర్ నైట్‌కి సుప్రీమ్, ఎలైట్, ప్రీమియం అంటూ 3 రకాల సీటింగ్ ఏర్పాట్లు చేసి అందరి ప్రశంసలను నిర్వాహకులు అందుకున్నారు. సెలెబ్రిటీలు, స్టార్స్ అందరికీ అందుబాటులో ఉండేలా ఈ సీటింగ్ ఏర్పాట్లు చేయడం బాగుంది. ఆటపాటలతో ఆనందోత్సాహాలతో మొదటి రోజు కార్యక్రమం ముగిసింది.చదవండి: గల్ఫ్ భరోసా డాక్యుమెంటరీని విడుదల చేసిన సీఎం రేవంత్‌రెడ్డి
క్రైమ్

పెళ్లీడుకొచ్చిన పిల్లలను వదిలేసి.. ఇదేం పాడు పని నారాయణ
బాపట్ల టౌన్ : అతడికి 64 ఏళ్లు. ఆమెకు 54. ఇద్దరికీ వేర్వేరు కుటుంబాలున్నాయి. పెళ్లీడుకొచ్చిన సంతానం ఉన్నారు. ఆర్థికంగా స్థిరపడినవారే. పిల్లలు ఉన్నత విద్యావంతులు. అయినా వారి వల్లమాలిన వివాహేతర సంబంధం ప్రాణాల మీదకు తెచ్చింది. ఆ పెద్దాయన తన మాట వినలేదనే ఆవేశంలో ఆమె అఘాయిత్యానికి ఒడిగట్టింది. ఈ ఘటన బాపట్లలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు...రిటైర్డ్ రైల్వే ఉద్యోగి తులాబందుల లక్ష్మీనారాయణ బాపట్ల రైల్వేస్టేషన్ ఎదుట ఐఆర్సీటీసీ సెంటర్ నిర్వహిస్తున్నారు. పట్టణానికి చెందిన నల్లమోతు మాధవితో కొన్నేళ్ళుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. ఇదిలాఉండగా లక్ష్మీనారాయణ భార్య అరుణాదేవి కళ్ళకు ఆపరేషన్ చేయించే నిమిత్తం హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చింది. విషయం తెలుసుకున్న మాధవి లక్ష్మీనారాయణను వెళ్ళటానికి వీల్లేదంటూ అడ్డగించింది. కుటుంబ సభ్యులతో కలిసి అరుణాదేవిని పంపించాలంటూ హెచ్చరించింది. దీనికి ఆయన అంగీకరించకపోవడంతో శుక్రవారం ఉదయం తన వెంట తెచ్చుకున్న పెట్రోలును ముందు తనపై పోసుకొని ఆ తర్వాత లక్ష్మీనారాయణపై పోసి నిప్పంటించింది. రైల్వే స్టేషన్ ఎదురుగా ఐఆర్సీటీసీ బుకింగ్ కౌంటర్ నుంచి పొగలు రావడంతో స్థానికులు మంటలు ఆర్పివేసే ప్రయత్నం చేశారు. అప్పటికే మాధవి 80 శాతం, లక్ష్మీనారాయణ 60 శాతం కాలిపోయారు. వెంటనే స్థానికులు ఇద్దరినీ చికిత్స నిమిత్తం బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతున్న క్షతగాత్రులను బాపట్ల సీనియర్ సివిల్‌జడ్జి పరామర్శించి వాంగ్మూలం తీసుకున్నారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం ఇరువురినీ గుంటూరు తరలించారు. ఘటనపై పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

స్నేహంతో ‘వల’.. ఆపై వేధింపుల ‘సెగ’..!
విశాఖ సిటీ: ‘నేను చేస్తున్నట్లే... నాకూ న్యూడ్ కాల్ చెయ్యాలంటే ఎంత కావాలో చెప్పు.. నమ్మకం లేకపోతే అకౌంట్ నంబర్ పెట్టు.. వెంటనే డబ్బులు పంపిస్తా’.. అంటూ ఓ గృహిణిని వేధింపులకు గురి చేసిన అనంతపురం కీచక జైలర్ సుబ్బారెడ్డి వ్యవహారం సంచలనంగా మారింది. అరెస్టుకు ప్రయత్నిస్తే, అప్పటికే నిందితుడు ముందస్తు బెయిల్ పొందాడు. ఈ ఉదంతంపై పోలీసుల వివరాల ప్రకారం, పార్వతీపురం మన్యం జిల్లాలో నివాసముంటున్న గృహిణి ఫేస్బుక్ అకౌంట్‌కు కొన్నాళ్ల క్రితం జైలర్ సుబ్బారెడ్డి నుంచి ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. తాను జైలర్‌గా పనిచేస్తున్నట్లు పరిచయం చేసుకున్నాడు. ఫ్రెండ్ రిక్వెస్ట్‌కు అంగీకరించడంతో, స్నేహం పేరుతో చాటింగ్ ప్రారంభించాడు. కొద్ది రోజులకు అసలు రంగును బయటపెట్టాడు. న్యూడ్ కాల్స్, అసభ్య మెసేజ్‌లతో వేధించసాగాడు. మొదట ‘సారీ’.. ఆ తరువాత ‘కుక్క’ బుద్ధి..!మహిళ భర్త, మరో బంధువు పోలీస్ శాఖలోనే విధులు నిర్వర్తిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మెసేజ్‌లు, వేధింపుల వ్యవహారాన్ని మహిళ బంధువైన ఏసీపీకి, ఎస్ఐగా పనిచేస్తున్న భర్తకు చెప్పింది. దీంతో వారు జైలర్‌కు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చారు. దీనిపై సదరు వ్యక్తి కేవలం ఫ్రెండ్షిప్ కోసమే మెస్సేజ్‌లు పంపించానని, సారీ చెప్పాడు. కొన్నాళ్లు మెస్సేజ్‌లు పంపించడం మానేశాడు. మళ్లీ గత నెల 25వ తేదీ నుంచి మెస్సేజ్‌లు, కాల్స్ చేయడం ప్రారంభించాడు. వేధింపులను భరించలేక సదరు మహిళ విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి కి ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. సీపీ వెంటనే కేసును సైబర్ క్రైమ్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి, జైలర్‌ను అరెస్టు చేయడానికి అనంతపురం వెళ్లగా.. అప్పటికే పరారయ్యాడు. విశాఖకు వచ్చి 5వ ఏడీజే (ఫ్యామిలీ) కోర్టులో ముందస్తు బెయిల్ తీసుకున్నాడు. రెండు రోజుల క్రితం విశాఖ పోలీసులను కలిసి ఆ ముందస్తు బెయిల్ పత్రాలను అందజేశాడు. శాఖాపరమైన చర్యలు..కాగా, జైలర్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని జైళ్ల శాఖ డీజీకి నగర పోలీస్ కమిషనర్ బాగ్చి లేఖ రాశారు. అలాగే ముందస్తు బెయిల్ రద్దుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.

‘భెల్’ ప్రశ్నాపత్రం లీక్
పెందుర్తి: విశాఖలోని పెందుర్తి సమీపంలోని జియోన్ టెక్నాలజీస్ కేంద్రంలో డబ్బులు తీసుకుని పరీక్ష జవాబు పత్రాలను లీక్ చేస్తోన్న బాగోతం శుక్రవారం వెలుగుచూసింది. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (భెల్)లో సూపర్వైజర్ ట్రైనీ ఇంజినీర్ పోస్టుల కోసం శుక్రవారం చినముషిడివాడలోని జియోన్ టెక్నాలజీస్ ఆన్లైన్ పరీక్ష నిర్వహించింది. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 వరకు జరిగిన ఈ పరీక్షకు ఉత్తరాంధ్ర జిల్లాలతోపాటు ఉభయ గోదావరి జిల్లాల నుంచి 500 మంది హాజరయ్యారు. పరీక్ష కేంద్రంలో ప్రశ్నాపత్రంతోపాటు జవాబుపత్రాన్ని ముందే కొంత మంది అభ్యర్థులకు లీక్ చేశారు. ముగ్గురు (ప్రాథమికంగా తెలిసింది) అభ్యర్థులు 2 గంటలపాటు ఆన్లైన్లో రాయాల్సిన పరీక్షను 20 నిమిషాల్లో ముగించడంపై అనుమానం వచ్చిన తోటి అభ్యర్థులు వారిని నిలదీశారు. దీంతో వారి వద్ద అడ్మిట్ కార్డు వెనుక మైక్రో జెరాక్స్ ద్వారా తీసిన జవాబులు కనిపించడంతో మిగిలిన అభ్యర్థుల్లో ఆగ్రహం పెల్లుబికింది. పరీక్ష జరుగుతుండగానే నిర్వాహకులను నిలదీశారు. కాపీకి పాల్పడిన అభ్యర్థుల వద్ద జవాబు పత్రాన్ని లాక్కుని వారిని ప్రశ్నించారు. అనంతరం కేంద్రం ఎదుట నిరసనకు దిగారు. పరీక్షను తక్షణమే రద్దు చేయాలని నినాదాలు చేశారు. కాగా, ఈ కేంద్రంలో జరుగుతోన్న వ్యవహారాలపై ఇది వరకే పోలీసులకు పలు ఫిర్యాదులు అందాయి. మార్చి 25న ఇదే కేంద్రంలో జరిగిన ఏపీపీసీబీ ఏఈఈ పరీక్షలో నిర్వాహకులు అవినీతికి పాల్పడి కొందరు అభ్యర్థులకు పూర్తి సహకారం అందించారని రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్‌కు కొందరు ఫిర్యాదు చేశారు. తాజాగా మరోసారి అలాంటి ఘటనే పునరావృతం అయ్యింది. ఈ వ్యవహారంపై రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు. విద్యార్థులకు బెదిరింపులు.. కాపీ వ్యవహారం బయటపడడంతో పరీక్ష నిర్వాహకులు నష్ట నివారణ చర్యలకు దిగారు. సాయంత్రం పరీక్ష ముగించుకుని బయటకు వస్తున్న అభ్యర్థులను 40 నిమిషాలు కేంద్రంలోనే నిర్బంధించారు. లోపల ఏమీ జరగలేదని చెప్పాలని బెదిరించారు. బాధిత అభ్యర్థుల నుంచి ప్రతిఘటన ఎదురవడంతో తప్పనిసరి పరిస్థితిలో బయటకు పంపారు. లోపల జరిగిన విషయం బయటకు చెబితే పోలీసులతో కేసులు నమోదు చేయించి ఉద్యోగాలు రాకుండా చేస్తామని వారు బెదిరించినట్లు బాధిత అభ్యర్థులు చెబుతున్నారు.

సూర్యాపేట కోర్టు సంచలన తీర్పు.. కూతురిని చంపిన తల్లికి ఉరిశిక్ష
సాక్షి, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కూతుర్ని చంపిన కేసులో తల్లికి జిల్లా కోర్టు ఉరిశిక్ష విధించింది. మానసిక స్థితి సరిగ్గాలేదని కన్న కూతుర్నే తల్లి చంపేసింది. మోతె మండలం మేకపాటి తండాలో 2021, ఏప్రిల్‌లో జరిగిన ఘటనలో ఇవాళ జిల్లా న్యాయస్థానం తీర్పు చెప్పింది.నాంపల్లి పోక్సో కోర్టు సంచలన తీర్పు..నాంపల్లి పోక్సో కోర్టు కూడా ఇవాళ సంచలన తీర్పునిచ్చింది. బాలికపై లైంగికదాడి యత్నం చేసిన నిందితుడికి 25 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. 2023లో రాజ్ భవన్ మక్త ప్రాంతంలో బాలికపై అత్యాచారయత్నం జరిగింది. సెల్‌ఫోన్ ఇస్తానని చెప్పి బాలికను ఇంట్లోకి తీసుకెళ్లి శ్రీనివాస్ అనే వ్యక్తి లైంగికదాడి యత్నం చేశాడు. బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు శ్రీనివాస్‌పై పోలీసులపై కేసు నమోదు చేశారు. శ్రీనివాస్‌కు 25 జైలు శిక్షతో పాటు కోర్టు జరిమానా విధించారు.
వీడియోలు


పాస్టర్ ప్రవీణ్ ఘటనపై ఐజీ సంచలన ప్రెస్ మీట్


KSR Live Show: సన్న బియ్యం.. HCU భూములు.. ఇరకాటంలో రేవంత్ సర్కార్


ఫ్లోరిడాలో రహదారిపై కుప్పకూలిన విమానం


చెన్నైపై కోల్ కతా భారీ విజయం


సంచలన సర్వే.. బయట పడ్డ టీడీపీ, జనసేన ఎమ్మెల్యేల బండారం


మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు రిమాండ్


పద్మశ్రీ వనజీవి రామయ్య కన్నుమూత


పిల్లల చదువులకు అప్పులు చేసి ఫీజులు కడుతున్న తల్లిదండ్రులు


చెప్పుతీసి కొడతా అన్న పిఠాపురం పీఠాధిపతి పవన్ పై ఎన్ని కేసులు పెట్టారు?


గోవుల మృతి విషయాన్ని కూటమి ప్రభుత్వం దాచిపెట్టింది